పాకిస్తాన్ భారతదేశానికి పొరుగు దేశం. అయితే పాక్- భారత్ సంబంధాలు ఎప్పుడూ స్నేహపూర్వకంగా లేవు. దీని వెనుక ఉన్న ముఖ్య కారణం ఏమిటంటే.. పాకిస్తాన్‌కు ఏనాడూ బలమైన ప్రధాని లేకపోవడమేనని విశ్లేషకులు చెబుతుంటారు. అయితే ఇప్పుడు మనం ఈ రెండు దేశాల మధ్య సంబంధాల గురించి కాకుండా పాక్ ప్రధాని జీతం, అతనికి కల్పించే సౌకర్యాల గురించి తెలుసుకుందాం.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సమర్పించిన డేటా ఆధారంగా ది న్యూస్ ఇంటర్నేషనల్ ఇటీవల పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఎంపీలు, మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జీతభత్యాల సమాచారాన్ని బహిరంగపరిచింది. దీనిలోని వివరాల ప్రకారం పాకిస్తాన్ ప్రధానికి 2,01,574 పాకిస్తానీ రూపాయల జీతం లభిస్తున్నది. (1 పీకేఆర్ = రూ. 0.287429)
ఇక ప్రధానికి కల్పించే సౌకర్యాల విషయానిక వస్తే ఒక విలాసవంతమైన ఇంటితో పాటు, భద్రత, సేవకులు లాంటి సౌకర్యాలను కల్పిస్తారు. అయితే పాక్‌లో పీఎంకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి పర్యవేక్షణ బాధ్యత అక్కడి సైన్యం చేతిలో ఉంటుంది.
పాకిస్తాన్ ఎంపీల జీతం విషయానికి వస్తే వారికి 1,88,000 పీకేఆర్ జీతం లభిస్తుంది. అయితే భారత ఎంపీలకు లభించినన్ని ప్రత్యేక సదుపాయాలు పాక్ ఎంపీలకు లభించడం లేదు. అక్కడి సీనియర్ ఆఫీసర్ల విషయానికివస్తే వారికి కూడా ఎంపీలకు లభించినంత జీతం లభిస్తుంది. పాక్ ప్రధాన న్యాయమూర్తికి 15,27,399 పాకిస్తానీ రూపాయల జీతం అందుతుంది.
మంత్రులు 3,38,125 పాకిస్తానీ రూపాయల జీతం అందుకుంటారు. అయితే గ్రేడ్-2 అధికారులు 5,91,475 పాకిస్తానీ రూపాయల జీతం పొందుతారు. పాకిస్తానీ రూపాయలను భారతీయ రూపాయలతో పోల్చిచూస్తే, వారి జీతం చాలా తక్కువని చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి: XL, XXLలను వినే ఉంటారు.. X ఏమి సూచిస్తుంది?
Comments
Please login to add a commentAdd a comment