
కోల్‌కతాలో జరిగే దుర్గా పూజలలో భక్తుల సృజనాత్మకత కనిపిస్తుంటుంది. ఈసారి నగర దక్షిణ శివారు బెహలాలోని ఒక దుర్గామండపం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ మండపం అందంలో మాత్రమే కాదు రుచిలో కూడా పోటీ పడుతోంది.
బెహలా నోటున్ దాల్ క్లబ్ ఏర్పాటు చేసిన ఈప్రత్యేక దుర్గా మండపం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మండపాన్ని పానీపూరీలతో అలకంరించారు. దీనిని గోల్‌గప్ప అని కూడా అంటారు. చాలామందికి ఇష్టమైన ఈ స్ట్రీట్ ఫుడ్‌తో దుర్గాపూజను ముడిపెట్టడాన్ని పలువురు ఎంజాయ్ చేస్తున్నారు. వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా ఈ దుర్గామండపం క్లిప్‌ను షేర్ చేశారు.
ఇది కూడా చదవండి: కశ్మీర్ శక్తిపీఠంలో నవరాత్రులు
Kolkata's Durga Puja pandals: where phuchka (panipuri) meets divine architecture, a truly heavenly combination! 🙌🏛️ pic.twitter.com/Ytz6a0Aafy
— Harsh Goenka (@hvgoenka) October 16, 2023