Ram Charan's Wife Upasana Tweet Goes Viral On Delivery Of Pregnancy - Sakshi
Sakshi News home page

Upasana: ‍అమెరికాలో ఉపాసన ప్రసవం.. క్లారిటీ ఇదే..!

Published Tue, Feb 28 2023 7:07 PM | Last Updated on Tue, Feb 28 2023 7:57 PM

Ram Charan Wife Upasana Tweet Goes Viral On Delivery Of Pregnency - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఉపాసన తల్లి కాబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించింది మెగా ఫ్యామిలీ. పెళ్లైన పదకొండేళ్ల తర్వాత ఉపాసన తల్లి కాబోతుండటంతో మెగా ఇంట సంతోషం నెలకొంది. ఇటీవలే స్నేహితులు ఆమెకు సీమంతం వేడుక కూడా నిర్వహించారు. ఆ ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియాతో పంచుకున్నారు. అయితే తాజాగా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. తమకు పుట్టబోయే బిడ్డ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది ఉపాసన. తన ప్రసవానికి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. 

అయితే ఇటీవల ఉపాసన డెలివరీ ఎక్కడనే విషయంపై నెటిజన్లు కొన్నిరోజులుగా ఉత్సాహం చూపిస్తున్నారు. విదేశాల్లో డెలివరీకి ప్లాన్‌ చేస్తున్నారంటూ రూమర్స్ సృష్టించారు.  తాజాగా ట్వీట్‌తో వాటన్నింటికీ చెక్ పెట్టారు ఉపాసన. ఇండియాలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు తెలిపారు.

ఇటీవలే ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోషియేషన్‌’ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు రామ్‌చరణ్‌ అమెరికా వెళ్లారు.  ప్రముఖ అమెరికన్‌ షో ‘గుడ్‌ మార్నింగ్‌ అమెరికా’లోనూ ఆయన సందడి చేశారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్‌ జెన్నిఫర్‌ ఆస్టన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌ వ్యక్తిగత విషయాల గురించి చర్చించారు.

ఆ సమయంలో రామ్ చరణ్ మాట‍్లాడుతూ.. ‘ఉపాసన కొద్ది రోజులపాటు అమెరికాలో ఉంటుంది. అప్పుడు మీరు అందుబాటులో ఉండాలి’  అని అన్నారు. దీనికి ఆస్టన్ స్పందిస్తూ.. మీ ఫస్ట్‌ బేబీని డెలివరీ చేయడమంటే తనకు అదో గౌరవమని.. ఎక్కడ అందుబాటులో ఉండమన్నా సిద్ధం’’ అని తెలిపారు. దాంతో, ఉపాసన డెలివరీ అమెరికాలో జరగుతుందనే ప్రచారం సాగింది.

తాజాగా ఉపాసన ట్విటర్‌లో రాస్తూ..' డాక్టర్ జెన్ ఆస్టన్ మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నా. దయచేసి ఇండియాలోని మా అపోలో ఆస్పత్రుల ఫ్యామిలీలో చేరండి. డాక్టర్ సుమనా మనోహర్, డాక్టర్ రూమా సిన్హాతో కలిసి మా బిడ్డ ప్రసవంలో  భాగం కావాలని కోరుకుంటున్నా.' అంటూ ఆ వీడియోను పోస్ట్ చేసింది. ఇది చూసిన రామ్ చరణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్లీజ్ టేక్ కేర్ సిస్టర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తున్నారు.  కాగా.. 2012లో ఉపాసన- రామ్ చరణ్‌ వివాహం జరిగింది. 

 ఉపాసన తాతయ్య, అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్‌ రెడ్డి కావడం విశేషం. అందుకే అపోలో ఆస్పత్రిలోనే బిడ్డను ప్రసవించనున్నట్లు ఉపాసన ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement