deliver baby
-
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తిరువనంతపురం: కేరళలో రెండు రోజుల క్రితం ఒక మహిళ అపార్ట్మెంట్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన ఘటన మరువక ముందే అలాంటి ఘటన మరొకటి జరిగింది. కేరళ కొల్లంలోని ఓ హాస్ట్‌ల్‌లో ఉంటున్న యువతి తాను గర్భవతి అన్న విషయాన్ని స్నేహితురాళ్ల వద్ద దాచింది. ఆదివారం(మే5) హాస్టల్లోని తన గది తలుపు పెట్టుకుని బాత్రూమ్కు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. చాలా సేపటివరకు తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితురాళ్లు బలవంతంగా తలుపు తీశారు. దీంతో యువతి బిడ్డకు జన్మనిచ్చిందన్న విషయం బయటపడింది. ఈ విషయాన్నివారు అధికారులకు సమాచారమివ్వగా తల్లిబిడ్డను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. -
విమానంలో ప్రయాణిస్తుండగా ప్రయాణికురాలికి సడెన్‌గా పురిటి నొప్పులు..
విమానం ప్రయాణిస్తుండగా ఓ గర్భిణికి అకస్మాత్తుగా నొప్పులు మొదలయ్యాయి. అప్రమత్తమైన విమాన సిబ్బంది విమానాన్ని టేకాఫ్ చేసేందుకు సన్నద్ధమయ్యేలోపే ఆ మహిళ ప్రసవించింది. ఈ అరుదైన షాకింగ్ ఘటన ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఓ అంతర్జాతీయ విమానంలో జరిగింది. వివరాల్లోకెళ్తే..టర్కీ నుంచి ఫ్రాన్స్‌కి బయలుదేరిన పెగాసస్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ అనుహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ అంతర్జాతీయ విమానంలో ప్రయాణిస్తుండగా ఓ మహిళ ప్రయాణికురాలు సడెన్‌గా ప్రసవ వేదను గురైంది. దీంతో సిబ్బంది వేగంగా స్పందించి ఆమెను మరొక చోటుకి తరలించారు. అక్కడ పారామెడిక్స్ బృందం ఆమెకు డెలివరీ చేయడంలో సహయం చేసింది. ఈ ఎమర్జెన్సీని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌లైన్స్ సిబ్బంది విమానాన్నిటేకాఫ్ చేయాలనకున్నారు. కానీ అంతలోనే విమానంలోనే ఆ మహిళ ఓ శిశువుకి జన్మనిచ్చింది. అయితే ఆ శిశువు నెలలు నిండకుండానే పుట్టడమేగాక వెంటనే ఏడవకపోవడంతో పారామెడిక్స్ సంబంధిత ఎయిర్పోర్ట్ఇక చెందిన అత్యవసర సేవలకు సమాచారం అందించారు. విమానం ప్రాన్స్‌లోని మారంసెయిల్లో టేకాఫ్ అవ్వగానే ఓ పారామెడిక్ మహిళ ఆ నవజాత శిశువును గుడ్డలో చుట్టి విమానం ముందు భాగంలోకి హుటాహుటినా తీసుకు రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా షాక్‌కి గురయ్యారు. ఆ నవజాత శిశువుని, ఆ మహిళను అంబులెన్స్ సాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి గర్భిణిలు నెలలు సమీపిస్తున్న తరుణంలో చాలా వరకు ఫ్లైట్ జర్నీ చేయరు. అందువల్ల విమానంలో ప్రసవం జరగడం అనేది అత్యంత అసాధారణం. అయితే ఇలాంటి ఘటనలు విమానంలో కొత్తేమి కూడా కాదు. ఎందుకంటే ఇలాంటి ఘటనే ఈక్వెడార్‌లోని గుయాకిల్ నుంచి ఆమ్స్టర్డామ్కు కేఎల్ఎం రాయల్ డచ్ విమానంలో కూడా చోటు చేసుకుంది. తాను గర్భవతి అని తెలియని ఓ మహిళా ప్రయాణికురాలు బాత్రూంకని వెళ్లి అనుకోకుండా ఓ బిడ్డకు ప్రసవించి అందర్నీ షాక్‌కి గురి చేసింది. అదీగాక ఏవియేషన్, స్పేస్, అండ్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ జర్నల్‌లో వైద్యులు ఇలాంటి అకస్మాకి ప్రసవాలు ప్రతి 32 వేల మందిలో ఒకళ్లకు జరుగుతాయని అన్నారు. ఆ టైంలో మహిళలు ఫ్లైట్ జర్నీ చేస్తే నెలలు నిండకుండానే పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఇది మీకు, బిడ్డకు కూడా ప్రమాదమని చెప్పుకొచ్చారు. ఆకాశంలో పయనించేటప్పుడూ ఆక్సిజన్ తక్కువగా ఉండటంతో ఇలాంటి అనుకోని ఘటనలు జరుతుంటాయని అన్నారు వైద్యులు. (చదవండి: మగబిడ్డకు జన్మనిచ్చిన స్వలింగ జంట!ఒకే బిడ్డను ఇద్దరు గర్భంలో..) -
తల్లిదండ్రులైన రామ్ చరణ్- ఉపాసన దంపతులు
ప్రముఖ నటుడు రామ్‌చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో నేడు వారి ఆనందం రెట్టింపు అయింది. ఈ విషాయాన్ని అధికారికంగా ప్రకటించారు. మంగళవారం (జూన్ 20)న మెగా ఇంట్లోకి స్టార్ బుజ్జాయి అడుగు పెట్టింది. మెగా కుటుంబంలో బుడి బుడి అడుగులకు అపోలో హాస్పిటల్ వేదిక అయింది. ఉపాసన, పుట్టిన పాపాయి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఇప్పటికే రామ్ చరణ్, సురేఖ హాస్పిటల్‌కు చేరుకున్నారు. డెలీవరీ అయ్యేంత వరకు ఉపాసనతోనే చరణ్ ఉన్నారని తెలుస్తోంది . మొత్తంగా అయితే మెగా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన చరణ్-ఉపాసనలకు వారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగా ప్రిన్సెస్ పేరిట పూజలు, అర్చనలు చేయాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షలు రవణం స్వామినాయుడు ఇప్పటికే పిలుపునిచ్చారు. (చదవండి: మనవరాలి జాతకం అద్భుతం.. చిరంజీవి) -
పాపకు సీపీఆర్ చేసి ప్రాణాలను నిలబెట్టిన గోపి,బ్రహ్మనాయుడు
-
బస్సులోనే ప్రసవం.. అటు నుంచి నేరుగా..
బులంద్‌షహర్: ఉత్తర ప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భర్తతో కలిసి సొంతూరుకు వెళుతున్న ఓ మహిళ బస్సులోనే ప్రసవించింది. ఆ వెంటనే డ్రైవర్ ఆ బస్సును ప్రభుత్వ ఆస్పత్రికి వద్దకు తీసుకెళ్లి తల్లిని, నవజాత శిశువును వైద్యులకు అప్పగించారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి యూపీలోని కన్నౌజ్ జిల్లా ఛిబ్రమౌకు వెళ్తుండగా ఆదివారం చోటుచేసుకుందని ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ బస్సు డ్రైవర్ అలోక్ కుమార్ చెప్పారు. ఢిల్లీ నుంచి యూపీలోని ఈటా జిల్లా లోని సొంతూరుకు తాము వెళ్తున్నట్లు మహిళ భర్త సోమేశ్ కుమార్ చెప్పారు. ఆ సమయంలో బస్సులోనే పురిటి నొప్పులు వచ్చాయని అతను వివరించాడు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారన్నారు. -
ప్రసవానికి వస్తే మృత శిశువును చేతిలో పెట్టారు.. న్యాయం చేయండి!
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తే, మృత శిశువును చేతిలో పెట్టారంటూ బుధవారం బాధితురాలి బంధువులు పాత ప్రభుత్వాస్పత్రి మాతా శిశు విభాగం ఎదుట ఆందోళనకు దిగారు. సేకరించిన వివరాల ప్రకారం నందిగామకు చెందిన జి.మమతకు పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం ఈ నెల 13వ తేదీ సాయంత్రం విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. ఆమె నార్మల్ డెలివరీ అవుతుందని భావించిన వైద్యులు అబ్జర్వేషన్ రూమ్‌లో ఉంచారు. ఆమె బుధవారం ఉదయం నార్మల్ డెలివరీ అయింది. అయితే పుట్టిన శిశువు మృతి చెంది ఉండటంతో విషయాన్ని బంధువులకు తెలిపారు. ఇప్పటివరకూ ఆరోగ్యంగా ఉన్న శిశువు పుట్టగానే ఎలా మృతి చెందుతుందని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందంటూ మృతశిశువును పెట్టుకుని ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. విచారణకు ఐదుగురు సభ్యుల కమిటీ పాత ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగంలో మృతశిశువు ప్రసవంపై విచారణకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యేకుల కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ కమిటీలో గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పి.హిమబిందు, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ టి.సూర్యశ్రీ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వి.సుధీర్‌బాబు, సివిల్‌సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ ఎ.హనుమంతరావు, ఏఆర్ఎం డాక్టర్ ఎస్.మాధవీలతతో కూడిన కమిటీ అన్ని అంశాలపై విచారణ జరపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని డాక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. వైద్యుల తప్పులేదు శిశువు మృతి విషయంలో వైద్యుల తప్పిదం లేదు. శిశువు మెడకు మూడుసార్లు పేగు చుట్టుకుని ఉండటంతో ఊపిరి ఆడక మృతి చెంది ఉండవచ్చు. సాధారణంగా కొందరికి ఒక మెలిక పేగు మెడకు చుట్టుకుని ఉంటుంది. కానీ ఈ శిశువుకు మూడు మెలికలు చుట్టుకుంది. బాధితులు ఫిర్యాదు చేస్తే, విచారణ చేస్తాం. –డాక్టర్ నాగేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్, పాత ఆస్పత్రి చదవండి: భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్ రికార్డు చేయడం నేరం: హైకోర్టు -
గర్భవతిగా ఉన్నప్పుడు కోవిడ్ బారిన పడింది!.... ఏడు వారాలుగా కోమా ఐతే...!!
కొన్ని అత్యంత అరుదైన వ్యాధులు బారినపడి మృత్యు కుహరం నుంచి బయటపడ్డ వాళ్లను చూస్తే చాలా ఆశ్చర్యంగానూ, భయంగానూ ఉంటుంది. అలాంటిది గర్భంతో ఉండగా కోవిడ్ భారినపడితే ఎంత నరకంగా ఉంటుంది చెప్పండి. పైగా వారాలుగా కోమాలోనే ఉండిపోయింది. (చదవండి: 77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్! అయినా ఐస్ స్కేటింగ్ చేశాడు!!) అసలు విషయంలోకెళ్లితే...యూకేలోని ప్రైమరీ స్కూల్ టీచింగ్ అసిస్టెంట్ అయిన లారా వార్డ్ గర్భవతిగా ఉన్నప్పుడు కోవిడ్ బారిన పడటంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆమెకు ఇచ్చిన డెలివరీ తేదికి రెండు వారాల ముందే ఆమెకు డెలివరీ చేసేశారు. అయితే ఆమెకు పుట్టిన పాప చాల తక్కువ బరువుతో ఉంది. వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఆ బిడ్డ ఆరోగ్యంగానే ఉంది. అయితే ఆ చిన్నారి తల్లికి మాత్రం తనకు ఆడపిల్ల పుట్టిందన్న విషయం కూడా తెలియదు. ఈ మేరకు ఆమె ఏడు వారాలు అనంతరం కోమా నుండి బయటపడిని తర్వాత తనకు ఆడపిల్ల పుట్టిందని తెలుసుకుంది. అయితే యూకేలో లారాకి కోవిడ్ సోకిన సమయంలో ఇంకా అప్పటికి గర్భవతులకు వ్యాక్సిన్లు వేసే ప్రక్రియ ప్రారంభం కాలేదు (చదవండి: జాక్వెలిన్‌కి ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడంలో సుకేశ్ భార్యదే కీలక పాత్ర) -
అప్పుడే పుట్టిన నవజాత శిశువు పేరు ‘బోర్డర్’..ఎందుకో తెలుసా?
ఇస్లామాబాద్: ఇటీవలకాలంలో తమ పిల్లల పేర్లు విభిన్నంగా ఉండాలని, పైగా ఆ పేరు ఎవ్వరికి ఉండకూడదని విన్నూతనంగా పెడుతుండటం చూశాం. కానీ ఇక్కడొక జంట తాము భారత్ పాక్ సరిహద్దుల్లో చిక్కుకుపోవడంతో అప్పుడే పుట్టిన తమ బిడ్డకు సరిహద్దు(బోర్డర్) అని పేరుపెట్టుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. (చదవండి: రెండు వేల ఏళ్లనాటి సమాధుల్లో... బంగారపు నాలుక!!) అసలు విషయంలోకెళ్లితే....ఓ పాకిస్తానీ దంపతులు తమకు పుట్టిన మగబిడ్డకు ‘బోర్డర్’ అని పేరు పెట్టారు. అయితే ఆ జంట 97 మంది పాకిస్తానీ పౌరులతో సహా 71 రోజులుగా అట్టారీ సరిహద్దులో చిక్కుకుపోయారు. ఈ మేరకు ఆ పాకిస్తానీ జంట పంజాబ్ ప్రావిన్స్‌లోని రాజన్‌పూర్ జిల్లాకు చెందిన నింబు బాయి, బాలం రామ్‌లు. ఈ క్రమంలో బాలం రామ్ మాట్లాడుతూ...ఇండో-పాక్ సరిహద్దులో పుట్టినందున మా బాబుకి ఆ పేరు పెట్టాం. నా భార్య నింబు బాయి ఈ నెల డిసెంబర్ 2 న ప్రసవం అయ్యిందని, అంతేకాక తన భార్యకు సాయం చేయడానికి పొరుగున ఉన్న పంజాబ్ గ్రామాల నుండి కొంతమంది మహిళలు రావడమే కాక వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే నేను లాక్‌డౌన్‌కు ముందు తమ బంధువులను కలవడమే కాకుండా తీర్థయాత్ర కోసం భారత్‌కు వచ్చాను. అయితే నా వద్ద తిరిగి వెళ్లేందకు అవసరమ్యే పత్రాలు లేకపోవడంతో ఇతర పాకిస్తానీ పౌరులతో కలిపి సుమారు 98 మందితో సహా ఈ సరిహద్దులో చిక్కుకుపోయాం" అని చెప్పాడు. దీంతో ఈ కుటుంబాలు అట్టారి అంతర్జాతీయ చెక్‌పోస్టు సమీపంలోని పార్కింగ్ స్థలంలో ఉండిపోయారు. అయితే వారికి స్థానికులు మూడు పూటల భోజనం, మందులు, దుస్తులు అందిస్తున్నారు. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) -
విమానంలోనే అఫ్గన్ మహిళ ప్రసవం
కాబూల్: అమెరికా మిలటరీ విమానంలో అఫ్గన్ మహిళ ప్రసవించింది. కాబూల్ నుంచి జర్మనీ వెళుతుండగా విమానంలోనే మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. జర్మనీలోని రామ్‌స్టెయిన్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం కాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా.. ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు అమెరికన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. విమానం రన్‌వేపై దిగిన వెంటనే తల్లీ బిడ్డను కార్గో 17లో మిలటరీ ఆసుపత్రికి తరలించారు. అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశమైనప్పట్నుంచి ప్రతిరోజు హృదయవిదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కాబూల్ విమానాశ్రయంలో దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రతీ ఒక్కరి గుండెల్ని పిండేస్తున్నాయి. తాలిబన్ల అరాచక పాలనకి భయపడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవడానికి కాబూల్ విమానాశ్రయానికి వేలాదిగా తరలివస్తూ ఉండడంతో వారిని అడ్డగించడానికి తాలిబాన్లు ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఈ కంచెకి ఒకవైపు అమెరికా, బ్రిటన్ సైనిక దళాలు, మరోవైపు మూటా ముల్లె, పిల్లాపాపల్ని చేతపట్టుకున్న అఫ్గాన్ ప్రజలు.. ఇక వారిని అడ్డగిస్తూ గాల్లోకి కాల్పులు జరుపుతున్న తాలిబన్లు.. ఇవే దృశ్యాలు, దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. చదవండి: కంచెకి ఇరువైపులా.. గుండెల్ని పిండేస్తున్న దృశ్యాలు తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు -
ఈ వైద్యురాలు తన శ్వాసతో పసి ప్రాణాన్ని కాపాడింది
సాక్షి, చెన్నై: కరోనా వైరస్‌తో బాధపడుతున్న ఓ రోగి జన్మనిచ్చిన బిడ్డను రక్షించడంలో మహిళా వైద్యురాలు మానవత్వం చాటారు. ఊపిరాడక ఆ బిడ్డపడుతున్న వేదనను చూసి, తక్షణం నోటిలో నోరు పెట్టి తన శ్వాసను అందించి ప్రాణం పోశారు. మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ మానత్వం గురించి వివరాల్లోకి వెళితే...కరోనా కాలంలో గర్భిణిలకు వైద్య పరీక్షలు, ప్రసవాల నిమిత్తం అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే, కరోనాబారిన పడ్డ గర్భిణుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. వీరికి చికిత్స అందించడంలో కొన్ని చోట్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం చెన్నై పెరంబూరు రైల్వే ఆస్పత్రికి ప్రసవం నిమిత్తం ఓ గర్భిణిని చేర్చారు. పరిశోధనలో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో వచ్చిన ఫోన్‌కాల్‌తో డాక్టర్ ప్రియాంక ఆస్పత్రికి పరుగులు తీశారు. ఊపిరి ఆడక సతమతం.... పెరంబూరు రైల్వే ఆస్పత్రిలో ఆ గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతో, అందుకు చికిత్సలు సాగాయి. కొన్ని గంటల అనంతరం పండంటి మగబిడ్డకు ఆమె జన్మనించింది. అయితే, ఆమె కరోనా రోగి కావడంతో తల్లి బిడ్డను విడదీయాల్సిన పరిస్థితి. ఈ సమయంలో ఆ బిడ్డకు శ్వాస సమస్య తలెత్తింది. దీన్ని గుర్తించిన డాక్టర్ ప్రియాంక తక్షణం స్పందించారు. ఆ బిడ్డను రక్షించేందుకు ఆ బిడ్డ నోటిలో నోరు పెట్టి శ్వాస అందించారు. శ్వాస సమస్య సరి చేయడమే కాకుండా, ఆ బిడ్డను రెండు వారాల పాటు అతి జాగ్రత్తగా పరీక్షిస్తూ, వైద్య సేవల్ని డాక్టరు అందించడం విశేషం. తానూ ఓ తల్లే. డాక్టర్ ప్రియాంక మానవత్వాన్ని చాటుతూ వ్యవహరించిన తీరు వెలుగులోకి రావడంతో సర్వత్రా ఆమెను అభినందిస్తున్నారు. ఆమె తల్లి కూడా డాక్టర్ కావడం విశేషం. అయితే, కరోనా రోగులు పడే వేదనను గత ఏడాది ప్రియాంక ప్రత్యక్షంగా చవి చూశారు. ఆమె కరోనా నుంచి కోలుకున్న డాక్టర్. అయితే, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు ఆమెకు సూచించినా, వైద్య వృత్తిని సేవాతత్వంగా భావిస్తూ విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఆ బిడ్డను రక్షించాలన్న కాంక్షతో తన శ్వాసను అందించడమే కాదు, ఆ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే వరకు దగ్గరుండి ప్రియాంక అందించిన సేవల్ని ఆస్పత్రి వర్గాలు కొనియాడాయి. ( చదవండి: ‘నేను చాలదా.. ఇంకొకడు కావాల్న’ అంటూ సజీవదహనం ) -
మరోసారి వార్తల్లో మిజోరం ఎమ్మెల్యే
ఐజ్వాల్ : మిజోరాం శాసనసభ్యుడు డాక్టర్ జెడ్ఆర్ థియామ్ సంగ (62) మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రజాప్రతినిధిగానే గాకుండా, ఒక వైద్యుడిగా కూడా మెడలో స్టెత్ తో ఎపుడూ సిద్ధంగా ఉండే ఆయన మరోసారి డాక్టర్ అవతారమెత్తారు. ఛాంపై జిల్లాలోని భూకంపం సంభవించిన ప్రాంతాల పర్యటన సందర్భంగా ఒక గర్భిణీ ప్రాణాలను కాపాడిన వైనం ప్రశంసలందుకుంటోంది. ఇటీవలి భూకంపాల నష్టాలను అంచనా వేయడంతోపాటు, కరోనా పరిస్థితిని తెలుసుకునేందుకు మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని తన నియోజకవర్గం, ఛాంపై నార్త్‌ను ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మారుమూల ఎన్‌గూర్ గ్రామానికి చెందిన లాల్‌మంగైహ్సంగి (38)కు పురిటి నొప్పులు ప్రారంభమైనాయి. మరోవైపు ఆరోగ్య సమస్యల కారణంగా చంపై ఆసుపత్రి వైద్య అధికారి సెలవులో ఉన్నారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో విషయం తెలుసుకున్న గైనకాలజీ స్పెషలిస్టు అయిన ఎమ్మెల్యే వెంటనే ఒక వైద్యుడిగా రంగంలో దిగారు. అత్యవసరంగా సిజేరియన్ చేసి తల్లీబిడ్డలను కాపాడారు. అవసరమైన వారికి సహాయం చేయడం, పేద ప్రజలకు సహాయం చేయడం తన ముఖ్యమైన కర్తవ్యంగా భావించానని థియామ్ సాంగ్ తెలిపారు. అందుకే తాను ఎమ్మెల్యేగా ఎన్నికైందని చెప్పారు. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐజాల్‌కు ప్రయాణించే స్థితిలో లేపోవడంతో తానే ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ బాగానే ఉన్నారని చెప్పారు. కాగా గతనెలలో భారతదేశం-మయన్మార్ సరిహద్దు కాపలా సిబ్బందికి వైద్యం సాయం అందించేందుకు వాగు దాటి 7 కిలోమీటర్లు నడిచి వార్తలో నిలిచారు. 2018 ఎన్నికలలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) టికెట్‌పై పోటీ చేసి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టిటి జోతన్‌సంగను ఓడించారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ బోర్డు వైస్ చైర్మన్ కూడా ఉన్నారు. -
24 గంటల్లో 17 ప్రసవాలు
జనగామ: జనగామ జిల్లా కేంద్రం చంపక్‌హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం డెలివరీల్లో రికార్డు సొంతం చేసుకుంది. 24 గంటల్లో 17 సాధారణ ప్రసవాలతో సర్కారు ఆస్పత్రిని ఆదర్శంగా నిలిపారు. ఈ నెల 19వ తేదీ ఉదయం 9 నుంచి 20వ తేదీ ఉదయం 9 గంటల వరకు 17 సాధారణ ప్రసవాలు చేశారు. 22 మంది గర్భిణులకు డెలివరీ చేయగా.. ఇందులో రెండో, మూడో కాన్పు కోసం వచ్చిన ఐదుగురికి ఆపరేషన్ చేసి.. మొదటి కాన్పు కోసం వచ్చిన 17 మందికి నార్మల్ డెలివరీ చేసి రికార్డు సృష్టించారు. డాక్టర్ ప్రణతి ఆధ్వర్యంలో ఎనిమిది మంది సహాయకుల పర్యవేక్షణలో ఈ కాన్పులు చేశారు. -
కన్నపేగును చూసుకోకుండానే కనుమూసింది
సర్కారు ఆస్పత్రిలో మెరుగైన ప్రసవాలు చేస్తున్నారని వస్తే... ఓ బాలింత ప్రాణం పోయింది. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన ఎస్.కే.జరీనాసుల్తానా(25)ఆరోగ్యం విషమించి మంగళవారం రాత్రి మృతిచెందింది. తొలుత కుటుంబ సభ్యులు, బం ధువుల ఆందోళనల మధ్య జరీనాసుల్తానాకు మెరుగైన వైద్యం అందించడానికి కరీంనగర్‌లోని ఎంసీహెచ్ కేంద్రంకు తరలించారు. చికిత్స ప్రారంభించేలోగా ఆమె మృతి చెందింది. మగబిడ్డకు జన్మనిచ్చి.. ఎన్టీపీసీలోని పీకే రామయ్యకాలనీకి చెందిన ఎస్కే ఫయాజ్, జరీనాసుల్తానా దంపతులు. వివాహమై 11 మాసాలవుతోంది. ఫయాజ్ సబ్ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలిసారి గర్భందాల్చిన ఎస్.కే.జరీనాసుల్తానాకు గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. ప్రసూతీ కోసం ఈనెల 17న అడ్మిట్ చేశారు. మంగళవారం ఉదయం పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత బాలింతల వార్డుకు తరలించారు. సాయంత్రం వరకు బాగానే ఉంది. తరువాత కడుపులో నొప్పిగా ఉందని తల్లడిల్లింది.ఆపరేషన్ చేసిన సమయంలో ఒక బ్యాగు రక్తం ఎక్కించిన వైద్యులు, వార్డుకు తరలించాక మళ్లీ రక్తం అవసరం ఉందని చెప్పడంతో ఆమె భర్త స్వయంగా రక్తదానం చేశారు. అయినా బాధితురాలి ఆరోగ్య కుదుటపడలేదు. హుటాహుటిన ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోయిన వైద్యులు, మళ్లీ రక్తం అవసరం ఉందని కోరడంతో, సింగరేణి ఏరియా ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్ నుంచి తెప్పించారు. బంధువుల ఆందోళన... వైద్యులు ప్రయత్రించినప్పటికీ బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. బాలింత రోగ్యం ఎందుకు విషమించిందో సరైన వైద్యులు సమాధానం చెప్పడం లేదని కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌కు రెఫర్ చేయాలంటున్న వైద్యులు, బాధితురాలికి ఏదైనా జరిగితే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే జరినాసుల్తానా ఆరోగ్యం విషమించిందని ఆరోపించారు. ఆపరేషన్ థియేటర్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. చనిపోయిన మృతదేహాన్ని మెరుగైన చికిత్స కోసమంటూ తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాబర్ సలీంపాషా, పోలీసులు జోక్యం చేసుకొసి బాధితురాలిని కరీంనగర్‌లోని ప్రభుత్వ ఎంసీహెచ్ కేంద్రంకు తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభించేలోగా మృతి చెందింది. ఆస్పత్రిలో గొడవలు చోటుచేసుకోకుండా వన్‌టౌన్ సీఐ పర్శ రమేష్, ఎస్సైలు పర్యవేక్షించారు. -
వైద్యులు లేకపోవడంతో ఆటోలోనే..
సాక్షి, రాయ్‌పూర్ : వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ మహిళ ఆటోలోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఛత్తీస్గర్ రాజధాని రాయ్‌పూర్‌కు 350 కిమీ దూరంలోని కొరియలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిండు గర్భిణిని కొరియ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఆటోలో తరలించగా, అక్కడ వైద్యులెవరూ అందుబాటులో లేరు. వైద్య సిబ్బంది కోసం కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎంతకూ వైద్యులు రాకపోవడంతో ఆటోలోనే ప్రసవించేలా కుటుంబ సభ్యులు సహకరించారు. దేశంలో వైద్య వ్యవస్థ తీరుతెన్నులు ఎంత దయనీయంగా ఉన్నాయో ఈ ఘటన మరోసారి అద్దంపట్టింది. కాగా, భారత్‌లో గంటకు ఐదుగురు మహిళలు ప్రసవించే సమయంలో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. ఏటా 45,000 వరకూ ఈ తరహా మరణాలు సంభవిస్తున్నాయని నివేదిక తెలిపింది. దేశరాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌లోనూ ఈ దుస్థితి నెలకొంది. పెద్దసంఖ్యలో రోగులు ఆస్పత్రికి పోటెత్తడం వల్లే వారికి తగిన వైద్య సేవలు అందించలేకపోతున్నామని ఎయిమ్స్ వర్గాలు అశక్తత వ్యక్తం చేస్తున్నాయి. -
నడిరోడ్డుపై ప్రసవం
అన్నవరం (ప్రత్తిపాడు): సోమవారం ఉదయం పది గంటలు. 35 డిగ్రీలకు మించిన ఎండ. ఆ సమయంలో అన్నవరం పాతబస్టాండ్‌లో ఒక ఆటో ఆగింది. దానిలో నుంచి నిండుగర్భిణి, ఆమె తల్లి కిందకు దిగారు. అప్పటికే ఆ మహిళ తీవ్రంగా నొప్పులు పడుతోంది. కిందకు దిగిన మరుక్షణం ఆమె కిందకు వాలిపోయింది. ఆ వెంటనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే ప్రసవం జరిగిపోయింది. ఆ మహిళ వెంట వచ్చిన ఆమె తల్లి ఆ శిశువును తన పొత్తిళ్లలోకి తీసుకోగా ఆ మహిళ కొంతసేపు అలానే నేలమీద కూర్చుండి పోయింది. అక్కడ ఉన్న వారు కొంతమంది 108కు ఫోన్ చేయగా వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆమె చెప్పిన వివరాల మేరకు ప్రాథమిక చికిత్స చేసి తొండంగి పీహెచ్సీ కి తరలించారు. వివరాలివీ.. 108 సిబ్బంది కథనం ప్రకారం.. తొండంగి మండలం సీతారాం పురం గ్రామానికి చెందిన మహిళపేరు మారుకొండ పెద్దాపురం అని తెలిపారు. తొండంగి వైద్యాధికారి డాక్టర్ నాగభూషణం ఆమె గర్భం దాల్చినప్పటి నుంచి రెగ్యులర్‌గా చెకప్ చేస్తున్నారని తెలిపారు. ఆమె కు ఈ నెల 29న డెలివరీ అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే కాకినాడలో కూడా పరీక్షలు చేయించుకోవాలని చెప్పడంతో కాకినాడ ఆసుపత్రికి వెళ్లేందుకు తొండంగి నుంచి అన్నవరం రాగా, అక్కడే డెలివరీ అయినట్టు తెలిపారు. తల్లి పిల్లలను తొండంగి ఆసుపత్రిలో చూపించిననంతరం వైద్యాధికారి సూచనల మేరకు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు తెలిపారు. తల్లీపిల్ల క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. -
మిరాకిల్... వైద్యశాస్త్రంలోనే అరుదైన ఘటన
వాషింగ్టన్: అమెరికా వైద్యులు అద్భుతం చేశారు. వైద్యశాస్త్రంలో ఎప్పుడు జరగని ఓ ఘటనకు సాక్షులుగా మిస్సోరి వైద్యులు నిలిచారు. చిన్నారి గర్భంలో ఉండగానే ప్రమాదవశాత్తూ తల్లి చనిపోయినా డాక్టర్లు ఆపరేషన్ చేసి కడుపులోని పసిపాపను సురక్షితంగా ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు. అయితే ఆ కుటుంబసభ్యులకు ఈ పరిస్థితికి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. ఓ వైపు చిన్నారి కన్నతల్లి చనిపోయిందని వారు దుఖంలో ఉండగా.. మరోవైపు తల్లి ఎలాగు చనిపోయిందని వైద్యులు చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. ఓ పసిపాపను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి వైద్యులు నిజంగానే సరికొత్త చరిత్ర సృష్టించారు. మాట్ రైడర్, సారా ఇల్లర్ దంపతులు. ఆగ్నేయ ముస్సోరి సమీపంలో వీరు నివాసం ఉండేవారు. అయితే గర్భంతో ఉన్న సారాను భర్త మాట్ రైడర్ హాస్పిటల్స్ కు తీసుకువస్తున్నాడు. మార్గం మధ్యలోనే ఓ ట్రాక్టర్ వీరి వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో మాట్ కు స్వల్పగాయాలు కాగా, ఇల్లర్ మాత్రం తీవ్రంగా గాయపడింది. ఘటనా స్థలానికి డాక్టర్లను రప్పించారు. అంబులెన్స్ లో వీరిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, కొన్ని నిమిషాల్లో గమ్యస్థానం చేరనుండగా ఇల్లర్ మృతిచెందింది. హాస్పిటల్ కు వెళ్లగానే కొన్ని నిమిషాల్లోనే డాక్టర్లు ఆపరేషన్ చేసి చనిపోయిన ఇల్లర్ నుంచి పాప మాడిసన్ ను బయటకుతీశారని ఆమె సోదరి కసాండ్రా ఇల్లర్ చెప్పింది. తల్లి చనిపోవడంతో చిన్నారికి ఆక్సిజన్ అందదని భావించిన వైద్యులు మొదట మాడిసన్ ను వెంటిలేటర్ లో ఉంచారు. నాలుగు రోజుల తరువాత కన్ను తెరిచిన చిన్నారి వెంటనే నర్స్ వేలిని పట్టుకుందని సోదరి మృతిచెందిన బాధలోనూ తన సంతోషాన్ని పంచుకుంది. మాట్ ఎముకలు కొన్ని విరిగాయని, సెయింట్ లూయిస్ ఆప్పత్రితో చికిత్స పొందుతున్నాడని చెప్పింది. ఏది ఏమైతేనేం ఇప్పుడు ఆ పాపకు అమ్మ లేదన్నది వాస్తవమని చనిపోయిన ఇల్లర్ కన్నతల్లి కన్నీటి పర్యంతమైంది. -
'తల్లికి పురుడు పోసిన 11ఏళ్ల బాలుడు'
వాషింగ్టన్: పదకొండేళ్ల బాలుడంటే ఆటలు, పాటలు, స్నేహితులతో కలిసి వీధుల్లో గెంతడాలు, స్కూలుకు వెళితే పాఠాలు వల్లేవేయడాలు వంటివే తెలుసు. కానీ, అలాంటి బాలుడే తన తల్లికి, ఆ తల్లి కడుపులో బిడ్డకు ప్రాణం పోస్తే.. జార్జియాలోనే మారియట్టాలో ఇదే జరిగింది. కెన్యార్డా అనే మహిళ నిండు చూలాలు. అంతకుముందే ఆమెకు జేమ్స్ డ్యూక్ అనే పదకొండేళ్ల బాలుడు ఉన్నాడు. కాగా, వైద్యులు ఇచ్చిన సమయానికంటే ముందుగానే ఆమెకు పురిటినొప్పులు వచ్చి ఇంట్లో పడిపోయింది. ఆ సమయంలో జేమ్స్ మాత్రమే ఇంట్లో ఉన్నాడు. తల్లి ప్రసవ వేదన చూసి దగ్గరికి వచ్చిన అతడు తన తల్లి సుఖంగా ప్రసవించడంలో సహాయపడి, అటు తల్లి ప్రాణాన్ని, కొత్తగా లోకం చూసిన తన సోదరి ప్రాణాలను రక్షించుకుని ఒక్కసారిగా అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సంఘటన అనంతరం తన కుమారుడు సూపర్ హీరో, సూపర్ డాక్టర్ అంటూ పలు రకాలు పొగడ్తల్లో ముంచెత్తుతూ మురిసిపోయింది. -
మానవత్వాన్ని చాటుకున్న హిజ్రాలు