
జనగామ: జనగామ జిల్లా కేంద్రం చంపక్‌హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం డెలివరీల్లో రికార్డు సొంతం చేసుకుంది. 24 గంటల్లో 17 సాధారణ ప్రసవాలతో సర్కారు ఆస్పత్రిని ఆదర్శంగా నిలిపారు. ఈ నెల 19వ తేదీ ఉదయం 9 నుంచి 20వ తేదీ ఉదయం 9 గంటల వరకు 17 సాధారణ ప్రసవాలు చేశారు. 22 మంది గర్భిణులకు డెలివరీ చేయగా.. ఇందులో రెండో, మూడో కాన్పు కోసం వచ్చిన ఐదుగురికి ఆపరేషన్ చేసి.. మొదటి కాన్పు కోసం వచ్చిన 17 మందికి నార్మల్ డెలివరీ చేసి రికార్డు సృష్టించారు. డాక్టర్ ప్రణతి ఆధ్వర్యంలో ఎనిమిది మంది సహాయకుల పర్యవేక్షణలో ఈ కాన్పులు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment