జనగామలో భారీ అగ్ని ప్రమాదం | Huge Fire Broke Out In A Shopping Mall In Jangaon | Sakshi
Sakshi News home page

జనగామలో భారీ అగ్ని ప్రమాదం

Published Sun, Oct 27 2024 11:09 AM | Last Updated on Sun, Oct 27 2024 11:25 AM

Huge Fire Broke Out In A Shopping Mall In Jangaon

సాక్షి, జనగామ: జనగామలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున విజయ షాపింగ్‌ మాల్‌లో మంటలు చెలరేగాయి. దీంతో పక్క షాపులకు కూడా విస్తరించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.  ఫైర్‌ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ ప్రమాదంలో రూ.10 కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో  ఫైర్ సిబ్బంది అదుపుచేయలేకపోతున్నారు. పక్కనే ఎస్‌బీఐ బ్యాంక్ ఉండటంతో బ్యాంక్‌ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆలేరు, కోదాడ, స్టేషన్ ఘన్‌పూర్, కోడకండ్లతో సహ 6 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలార్పుతున్నారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement