
నాలుగు రోజులుగా ఫ్రీజర్‌లోనే తండ్రి మృతదేహం
భూమి కోసం కొడుకు పట్టు.. ససేమిరా అన్న సవతి తల్లి.. గ్రామ పెద్దల జోక్యంతో గురువారం రాత్రి భూమి రిజిస్ట్రేషన్
ఆ తరువాతే అంత్యక్రియలు పూర్తి
జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతులలో ఘటన
కొడకండ్ల: ఆస్తుల ముందు పేగుబంధం చిన్నబోయింది. సవతి తల్లి పేరున ఉన్న భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేస్తేనే తండ్రి అంత్యక్రియలు నిర్వహిస్తానని కుమారుడు పట్టుబట్టడంతో 4 రోజులపాటు మృతదేహాన్ని ఫ్రీజర్‌లోనే ఉంచిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడు నూతుల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎలికట్టె యాదగిరికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య రేణుక కుమారుడు రమేశ్. రెండో భార్య పద్మకు కుమారుడు ఉపేందర్, కుమార్తె ఉన్నారు.
యాదగిరికి గ్రామంలో 15 ఎకరాల భూమి ఉండగా.. 5 ఎకరాలు మొదటి భార్య కుమారుడైన రమేశ్‌కు, 5 ఎకరాలు రెండో భార్య కుమారుడైన ఉపేందర్ కు పంచి, మిగిలిన ఐదు ఎకరాలు తనవద్దే ఉంచుకున్నాడు. భూమి రిజిస్ట్రేషన్ సమయంలో ఉపేందర్ మైనర్ కావడంతో తల్లి పద్మ పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు. యాదగిరి తన పేరుపై ఉన్న ఐదెకరాల భూమిలో మూడెకరాలు అమ్మి కూ తురు వివాహం చేసి, రెండెకరాలు కట్నం కింద కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు. మూడేళ్ల క్రితం కుమారుడు ఉపేందర్ మృతి చెందడంతో అతడి వాటాకు వచ్చిన ఐదెక రాల భూమిలో తల్లి పద్మ మూడు ఎకరాలు అమ్మి కూతు రుకు హైదరాబాద్‌లో ఇల్లు కొనిచ్చింది.
యాదగిరి అనారోగ్యంతో ఈ నెల 10న మృతి చెందాడు. ఈ క్రమంలో మొదటి భార్య కుమారుడైన రమేశ్.. పద్మ పేరుపై ఉన్న రెండెకరాల భూమిని తనకు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేయడంతో అంత్యక్రియలు ఆగిపోయాయి. దీంతో గ్రామంలోని పెద్ద మనుషులు కల్పించుకొని పద్మ పేరుపై ఉన్న భూమిని రమేశ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించేందుకు గురువారం ఆమెను తహసీల్దార్ కార్యాలయానికి తీసు కొచ్చారు. తనను బలవంతంగా తీసుకొచ్చారని పద్మ ఆరో పిస్తూ తల తిరిగి పడిపోవడంతో రిజిస్ట్రేషన్ ఆగిపోయింది.
దీంతో ఇరువురు గ్రామానికి వెళ్లిపోయారు. అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు ఒత్తిడి తేవటంతో రమేశ్ కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. చివరకు రాత్రి 7.30 గంటల సమయంలో ఇరువురి మధ్య అంగీకారం కుదిరి తిరిగి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. పద్మ ఎకరన్నర భూమిని రమేశ్ పేరుమీద రిజిస్ట్రేషన్ చేయటంతో యాదగిరి అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment