
సాయి పరిస్థితిపై స్పందించిన సీఎంఓ
జనగామ: జనగామ పట్టణం 21వ వార్డు కుర్మవాడకు చెందిన పర్శ మల్లయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు సాయికి మెరుగైన వైద్య పరీక్షలతో పాటు కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) భరోసా కల్పించింది. ‘నా కొడుకును సంపేయండి’ అంటూ ఈనెల 29న సాక్షిలో ప్రచురితమైన కథనం మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
సీఎంఓ ఆదేశాల మేరకు కలెక్టర్ రిజ్వాన్ బాషా ఉత్తర్వులను అనుసరించి జనగామ ఆర్డీఓ గోపీరామ్, మున్సిపల్ కమిషనర్ సాయి తల్లిదండ్రులు ఉంటున్న నివాసం, ఆర్థిక పరిస్థితులపై కలెక్టర్‌కు రిపోర్టు చేశారు. మానసిక, శారీరక వైకల్యంతో బాధపడుతున్న సాయిని నిమ్స్‌కు తరలించి, మెరుగైన వైద్య పరీక్షలు అందించే విధంగా చూడాలని కలెక్టర్‌కు సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బాధితుడికి ఉన్న స్థలంలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా నివేదిక తయారు చేసి అందించాలని ఆదేశించారు.
చదవండి: నా కొడుకును సంపేయండి
రాజీవ్ యువవికాసం పథకం ద్వారా బాధిత కుటుంబానికి జీవనోపాధి కల్పించే విధంగా చూస్తామన్నారు. ‘సాక్షి’ చొరవతో బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుండటంతో కాలనీ వాసులు అభినందించారు. కాగా, సాయి తల్లిదండ్రులకు అండగా ఉంటామని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి హామీఇచ్చారు. అలాగే సాయి ఆరోగ్య పరిస్థితులపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరాతీశారు. సాయి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. జీరో కరెంటు, సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు.
జనగామలోని కుర్మవాడకు చెందిన
పర్శ సాయి దీన పరిస్థితి
నా దృష్టికి వచ్చింది.
ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి,
తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితి పై
వివరాలు తెలుసుకుని…
ప్రభుత్వం వైపు నుండి చేయగలిగిన
సహాయ సహకారాలను అందించాలని
అధికారులను ఆదేశించాను.
నా ఆదేశాల మేరకు…
రెవెన్యూ,… pic.twitter.com/R0vw7EIto8— Revanth Reddy (@revanth_anumula) April 29, 2025