jangaon district
-
దడ పుట్టిస్తున్న కోతుల గ్యాంగ్
-
ఆస్తి కోసం ఆగిన అంత్యక్రియలు
కొడకండ్ల: ఆస్తుల ముందు పేగుబంధం చిన్నబోయింది. సవతి తల్లి పేరున ఉన్న భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేస్తేనే తండ్రి అంత్యక్రియలు నిర్వహిస్తానని కుమారుడు పట్టుబట్టడంతో 4 రోజులపాటు మృతదేహాన్ని ఫ్రీజర్‌లోనే ఉంచిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడు నూతుల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎలికట్టె యాదగిరికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య రేణుక కుమారుడు రమేశ్. రెండో భార్య పద్మకు కుమారుడు ఉపేందర్, కుమార్తె ఉన్నారు.యాదగిరికి గ్రామంలో 15 ఎకరాల భూమి ఉండగా.. 5 ఎకరాలు మొదటి భార్య కుమారుడైన రమేశ్‌కు, 5 ఎకరాలు రెండో భార్య కుమారుడైన ఉపేందర్ కు పంచి, మిగిలిన ఐదు ఎకరాలు తనవద్దే ఉంచుకున్నాడు. భూమి రిజిస్ట్రేషన్ సమయంలో ఉపేందర్ మైనర్ కావడంతో తల్లి పద్మ పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు. యాదగిరి తన పేరుపై ఉన్న ఐదెకరాల భూమిలో మూడెకరాలు అమ్మి కూ తురు వివాహం చేసి, రెండెకరాలు కట్నం కింద కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు. మూడేళ్ల క్రితం కుమారుడు ఉపేందర్ మృతి చెందడంతో అతడి వాటాకు వచ్చిన ఐదెక రాల భూమిలో తల్లి పద్మ మూడు ఎకరాలు అమ్మి కూతు రుకు హైదరాబాద్‌లో ఇల్లు కొనిచ్చింది.యాదగిరి అనారోగ్యంతో ఈ నెల 10న మృతి చెందాడు. ఈ క్రమంలో మొదటి భార్య కుమారుడైన రమేశ్.. పద్మ పేరుపై ఉన్న రెండెకరాల భూమిని తనకు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేయడంతో అంత్యక్రియలు ఆగిపోయాయి. దీంతో గ్రామంలోని పెద్ద మనుషులు కల్పించుకొని పద్మ పేరుపై ఉన్న భూమిని రమేశ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించేందుకు గురువారం ఆమెను తహసీల్దార్ కార్యాలయానికి తీసు కొచ్చారు. తనను బలవంతంగా తీసుకొచ్చారని పద్మ ఆరో పిస్తూ తల తిరిగి పడిపోవడంతో రిజిస్ట్రేషన్ ఆగిపోయింది.దీంతో ఇరువురు గ్రామానికి వెళ్లిపోయారు. అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు ఒత్తిడి తేవటంతో రమేశ్ కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. చివరకు రాత్రి 7.30 గంటల సమయంలో ఇరువురి మధ్య అంగీకారం కుదిరి తిరిగి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. పద్మ ఎకరన్నర భూమిని రమేశ్ పేరుమీద రిజిస్ట్రేషన్ చేయటంతో యాదగిరి అంత్యక్రియలు నిర్వహించారు. -
డిప్యూటీ సీఎం కాన్వాయ్కి తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, వరంగల్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. వరంగల్ వెళ్తున్న క్రమంలో జనగామలోని కళాతోరణం వద్ద భట్టి కాన్వాయ్‌లోని ఒక పోలీస్ వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థుల ఆరోగ్యంగా ఉండాలని.. పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిందన్నారు.ఇదీ చదవండి: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు -
సీఐ ఔదార్యం.. పోలీసుల చేయూత..
వరంగల్: కొడకండ్ల మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన కోక సోమయ్య ఇల్లు భారీ వర్షాలకు కూలిపోగా.. అతడికి పోలీసులు చేయూత అందించారు. సీఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో సోమయ్యకు కొడకండ్ల, పాలకుర్తి ఎస్సైలు శ్రవణ్, తాళ్ల శ్రీకాంత్, రమేష్‌నాయక్ శుక్రవారం రూ.5 వేలు విలువైన నగదు, బియ్యం, సామగ్రి సాయం అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతం
-
కోతి చేసిన పనికి 20 గ్రామాలకు పవర్ సప్లై కట్!
సాక్షి, వరంగల్: కోతి తన చేష్టలతో కరెంటోళ్ళకే షాక్ ఇచ్చింది. 20 గ్రామాలకు కరెంటు సప్లై లేకుండా చేసింది. కోతి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. విద్యుత్ అధికారులను ముప్పుతిప్పలు పెట్టి, లక్షా రూపాయల వరకు నష్టం కలుగజేసింది. జనగామ జిల్లా వడ్లకొండ 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లో విద్యుత్ స్తంభాలపై ఎగిరిన కోతి, ట్రాన్స్ ఫార్మర్ను పట్టుకుంది. దీంతో ట్రాన్స్ ఫార్మర్ పేలిపోవడంతో పాటు కోతికి తీవ్ర గాయాలయ్యాయి. వడ్లకొండ 220 కేవీ సబ్ స్టేషన్ నుంచి లింగాలఘనపురం, జనగామ, అడవికేశ్వాపూర్, గానుగుపహాడ్, పసరమడ్ల 33/11 కేవీ ఫీడర్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. విద్యుత్ సంబంధించి ఎప్పటికప్పుడు రీడింగ్ నమోదు చేసేలా అక్కడే ప్రొటెన్షల్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రొటెన్షల్ ట్రాన్స్ ఫార్మర్ను కోతి పట్టుకోవడంతో పేలిపోవడంతో పాటు జంపర్లు పూర్తిగా తెగిపడ్డాయి. ఫలితంగా 20 గ్రామాలకు మూడుగంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది ట్రాన్స్ ఫార్మర్లో చిక్కుకున్న కోతిని కిందికి దింపి, మరమ్మతులు నిర్వహించి కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. కోతి కారణంగా సంస్థకు లక్ష రూపాయల నష్టం వాటిల్లింది. -
మంత్రి ఎర్రబెల్లికి వింత అనుభూతి.. అసలేం జరిగిందంటే?
సాక్షి, వరంగల్: వెరైటీ కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వింత అనుభూతి ఎదురైంది. దేవుడి పెళ్లికి పోతే మొబైల్ ఫోన్ మాయమయ్యింది. కొద్దిసేపు అందరూ కంగారు పడ్డారు. కాసేపటికి భగవంతుడి మహిమతో దొరికిందని సంతోషపడ్డారు. జనగామ జిల్లా చిల్పూర్ గుట్ట శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయ చైర్మన్ శ్రీధర్ రావుతో పాటు జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవుడి కల్యాణంలో పాల్గొని తిరిగి వెళ్తున్న క్రమంలో మంత్రి మొబైల్ ఫోన్ పోయింది. ఫోన్ కనిపించకపోయేసరికి అందరూ కంగారు పడ్డారు. ఎమ్మెల్యే రాజయ్య ఏకంగా మైక్ అందుకొని మంత్రి గారి ఫోన్ పోయింది.. ఎవరికైనా దొరికితే ఆలయ చైర్మన్ శ్రీధర్‌రావుకు అప్పగించాలని కోరారు. ఆ నోటా ఈనోట అందరూ మంత్రి గారు ఫోన్ పోయిందట... ఏమైందో ఏమో అంటూ గుసగుసలు పెట్టారు. మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటికి ఆలయ అర్చకుడు రంగాచార్యులు మంత్రిగారి సెల్ ఫోన్ దొరికిందని సెలవిచ్చారు. మంత్రి సెల్ ఫోన్‌ను కారులోనే మరిచిపోయి వచ్చారట. అసలు విషయం తెలుసుకొని అందరూ నవ్వుకున్నారు. చదవండి: చేతిలో నుంచి జారి సల సల మరిగే నూనెలో పడ్డ ఫోన్.. తర్వాత ఏమైందంటే? -
మా అక్కది హత్యే.. నాగార్జునరెడ్డిని సస్పెండ్ చేయాలి
కొడకండ్ల: తన సోదరి ధరావత్ ప్రీతి మృతిపై పారదర్శకంగా విచారణ జరిపి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రీతి సోదరుడు ధరావత్ వంశీ(పృథ్వీ) డిమాండ్ చేశారు. ప్రీతి మృతిపై జరుగుతున్న విచారణ పట్ల అనుమానాలు వ్యక్తం చేశాడు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో గురువారం ఆయన మాట్లాడుతూ మా అక్కది హత్య అనడానికి తమ వద్ద ఆధారాలున్నాయని, గూగుల్‌లో డ్రగ్స్ గురించి సెర్చ్ చేసిందనడానికి ఏం ఆధారాలున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ముగ్గురు డాక్లర్లను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చామని చెబుతున్నారని ఇది అవాస్తవమని, కౌన్సెలింగ్ చేసినట్లయితే మా అక్క తమతో చెప్పేదని, ఫోన్ ఆధారాలున్నాయని చెప్పారు సైఫ్ మా అక్కకు రెస్ట్‌లెస్ డ్యూటీలు వేయాలని తోటి డాక్టర్లకు చెప్పాడని పేర్కొన్నారు. నాగార్జునరెడ్డిని సస్పెండ్ చేసి ప్రీతి ఘటనపై పారదర్శకంగా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
భార్య సమాధి పక్కనే భర్త బలవన్మరణం
స్టేషన్‌ఘన్‌పూర్: ఆరునెలల క్రితం భార్య చనిపోగా కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు రెండో వివాహం చేసుకున్నాడు కానీ మొదటి భార్య జ్ఞాపకాలను మరిచిపోలేక ఆమెను సమాధి చేసిన వద్దనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం రాత్రి జరగగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. రైల్వేకాలనీకి చెందిన తాటి రాజు(40) భార్య జ్యోతి అనారోగ్యంతో 6 నెలల క్రితం చనిపోయింది. వీరికి 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇరవై ఏళ్ల కాపురంలో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. భార్య మృతిని తట్టుకోలేక తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అతని పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు తోడు కావాలని నచ్చజెప్పి రెండు నెలల క్రితం గుంటూరుపల్లికి చెందిన యశోదతో వివాహం చేశారు. ఈ మధ్య తరచూ మొదటి భార్య గుర్తుకు వస్తోందంటూ తల్లి రాజ్యలక్ష్మికి చెప్పుకుని బాధ పడ్డాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఘన్‌పూర్‌లోని శ్మశానవాటికలో భార్యను ఖననం చేసిన వద్దకు చేరుకుని క్రిమిసంహార మందు తాగి బర్నింగ్ ప్లాట్‌ఫారంపై పడిపోయాడు. సోమవారం బయటకు వెళ్లిన రాజు మంగళవారం ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికారు. అనుమానంతో శ్మశానవాటిక వద్దకు వెళ్లి చూసేసరికి అక్కడ నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవేందర్ తెలిపారు. -
మెడికో ప్రీతికి కన్నీటి వీడ్కోలు
-
జనగామ జిల్లా గిర్ని తండాలో ప్రీతి అంత్యక్రియలు
-
అప్పులు, దోపిడీలో తెలంగాణ ఫస్ట్
లింగాలఘణపురం: అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పే సీఎం కేసీఆర్ మాటలన్నీ బూటకమని, అప్పులు చేయడం, దోపిడీకి పాల్పడటంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ఆదివారం జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో, విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మద్యంతో రూ.10,700 కో ట్ల ఆదాయం వస్తే.. నేడు ఏడాదికి రూ.45 వేల కో ట్ల ఆదాయం వస్తోందన్నారు. అందులో పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతు బంధుకు రూ.25 వేల కోట్లు మాత్రమే ఇస్తున్నారని, మిగిలిందంతా కల్వకుంట్ల కుటుంబమే దోచుకుంటోందన్నారు. తాగుడులో తెలంగాణ ముందుందని, ప్రతీ కుటుంబంలో తాగు డు వ్యసనంగా మారి అనారోగ్యం పాలవుతున్నారని, 6.70 లక్షల మంది మద్యం కారణంగా చనిపోయారని, దీంతో ఆ కుటుంబాలు వీధినపడ్డా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే.. వర్షాలు, వరదలకు కన్నెపల్లి, అన్నారం పంపుసెట్లు ధ్వంసమయ్యాయన్నారు. నష్టాన్ని అంచనా వేసేందుకు సైతం అక్కడికి ఎవరినీ వెళ్లనీయడం లేదన్నారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది కేసీఆర్‌ను బొందపెడతారని అన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకొనే అవకాశాలు ఉన్నాయా అని విలేకరులు ప్రశ్నించగా.. ఏ పార్టీ ఎక్కడైనా పోటీచేసే అవకాశం ఉంటుందని, పొత్తుపై ఆ పార్టీ నాయకులనే అడగాలని ఈటల విలేకరులకు సూచించారు. -
అనాథ ఆడపిల్లలం.. ఆదుకోండి ..‘దళితబంధు’ ఇస్తే చెల్లి పెళ్లి చేస్తా!
స్టేషన్‌ఘన్‌పూర్: ‘నిరుపేద కుటుంబానికి చెందిన అనాథలం.. ‘దళిత బంధు పథకం మంజూరు చేసి ఆదుకుంటే చెల్లి వివాహం చేస్తాను’.. అంటూ లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి చెందిన తిప్పారపు అనూష అనే యువతి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కాళ్లు మొక్కి వేడుకుంది. సోమవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. తిప్పారపు అనూష, అశ్విని అక్కా చెల్లెళ్లు. పదేళ్ల క్రితం తల్లిదండ్రులు పరశురాములు, పుష్ప అనారోగ్యంతో మృతి చెందాక.. నానమ్మ వద్దే ఉంటున్నారు. పదో తరగతి వరకు చదివిన అనూష కూలి పనిచేస్తూ నానమ్మకు తోడుగా ఉండేది. మూడేళ్ల క్రితం అనూషకు జనగామకు చెందిన కార్తీక్‌తో వివాహమైంది. ఆరునెలల తర్వాత విభేదాలతో వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి అనూష నానమ్మ వద్దే ఉంటోంది. డిగ్రీ ఫస్టియర్ వరకు చదివిన అశ్విని ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువు ఆపేసింది. ‘కూలి పనులు చేస్తే వచ్చే డబ్బులతో కుటుంబం గడుస్తోంది.. చెల్లికి వివాహం చేయాలి.. ప్రభుత్వం అందిస్తున్న దళితబంధు పథకం మంజూరు చేసి ఆదుకోవాలి’.. అంటూ అనూష.. ఘన్‌పూర్‌లో ఒక కార్యక్రమానికి వచ్చి వెళ్తున్న ఎమ్మెల్యే కాళ్లపై పడి వేడుకుంది. -
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెం బాలసాయిబాబా ట్రస్ట్ భూములను రక్షించే క్రమంలో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ప్రజా గాయకుడు గద్దర్ కోరారు. ఈ మేరకు శనివారం వెస్ట్‌జోన్ డీసీపీ సీతారాంను జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రెండు షిఫ్టులు పని చేసేలా నలుగురు గన్మెన్లను రక్షణగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ బాలసాయిబాబా ట్రస్ట్ భూములను ప్రభుత్వానికి అప్పగించాలని కొంతకాలంగా పోరాటం చేస్తున్నానని చెప్పారు. భూముల పరిరక్షణకు తరుచూ ఈ ప్రాంతానికి వస్తున్నానని, పలువురు ప్రజాప్రతినిధులు, రియల్టర్లతో తనకు ప్రాణహాని ఉన్నట్లు తెలిసిందన్నారు. మండలగూడెం రియల్టర్ల చేతిలో ఉన్న 59 ఎకరాల బాలసాయిబాబా ట్రస్ట్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న పేరుతో అక్కడే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని గద్దర్ డిమాండ్ చేశారు. బాలసాయిబాబా కుటుంబ సభ్యులు ఆ భూములను హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి విక్రయించినట్లు సమాచారం ఉందని, భూముల వివరాలు కావాలని మూడు రోజుల కిందట సమాచార హక్కు చట్టం కింద రఘునాథపల్లి రెవెన్యూ అధికారులను కోరినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఓసారి తనపై హత్యాయత్నం జరిగిందని, బాలసాయిబాబా భూములను కాపాడేందుకు చేస్తున్న పోరాటంలో రక్షణ కల్పించాలని కలెక్టర్ శివలింగయ్య, డీసీపీ సీతారాంకు గద్దర్ విన్నవించారు. -
ఆకుపట్టి.. కల్లు తాగిన మంత్రి.. టేస్ట్ సూపరుంది!
సాక్షి, పాలకుర్తి(జనగాం జిల్లా): రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కల్లు తాగారు. కుండతో కల్లు వంచుతుంటే.. మంత్రి ఆకుపట్టి కల్లు సేవించి సురాపానకం టేస్ట్ సూపరుందని గౌడ్‌ను అభినందించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి, అయ్యంగార్‌పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. సమస్యలు అడిగి తెలుసుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. దారిలో తాటివనం వద్ద గౌడ్ కులస్తులను చూసి కారు ఆపి చెట్ల కిందకు చేరారు మంత్రి. ఈత చెట్టు కింద కూర్చొని నీరాకల్లు సేవించారు. ప్రకృతి సిద్ధమైన ఔషధం నీరా కల్లు అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గౌడ సంక్షేమానికి నీరాకల్లును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే నీరా కల్లు ఇచ్చే ఈత చెట్లను అన్ని గ్రామాల్లో పెట్టిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో కొందరు చీడపురుగులు ఉంటారని, చేసింది చెప్పకుండా చేయంది ఏగేసి చెప్పడంతో ప్రజలు అదే నిజమని నమ్ముతారని తెలిపారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్కరి బతుకులు బాగుపడ్డాయని, రైతుల కోసం 20 వేల కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌ను ఎవరైనా విమర్శిస్తే రైతులే సరైన సమాధానం చెప్పాలని కోరారు. చదవండి: మునుగోడు ఫలితాలు.. లెక్క తప్పిందెక్కడ? -
సర్కారు బడుల్లో వన్ క్లాస్–వన్ టీవీ
జనగామ: దేశంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో కేంద్రం త్వరలోనే ‘వన్ క్లాస్–వన్ టీవీ’ కార్య క్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా డిజిటల్ బ్యాంకు యూని ట్ సేవలను ఆదివారం ప్రారంభించారు. జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డీబీయూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద గిరిరెడ్డితోపాటు కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అన్ని రకాల బ్యాంకు సేవలు డిజిటల్లో సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టార న్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించిన రూ.25లక్షల కోట్ల నగదును జన్‌ధన్ ఖాతాల ద్వారా అందించిందన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ముద్ర రుణాల కింద రూ.2,750కోట్ల రుణాలను డిజిటల్ ద్వారా చెల్లించామని వెల్లడించారు. నిధులు పక్కదారి పట్టకుండా ఉత్తరాది రాష్ట్రాలకు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో చెల్లింపు ప్రక్రియ జరుగుతోందని, దీనిని దేశవ్యాప్తంగా అమలు చేసే ఆలోచన ప్రధాని చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డిజిటల్ పద్ధతిలో రూ.300కోట్ల స్కాలర్షిప్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించిన ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కోరారు. -
దావత్ కోసం వెళ్లి.. పిడుగుకు బలై..
జఫర్‌గఢ్/ఖమ్మం/గార్ల: దసరా పండుగ సందర్భంగా పార్టీ చేసుకునేందుకు గ్రామ శివార్లకు వెళ్లిన స్నేహితులపై పిడుగు పడింది. దీనితో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం సాగరం గ్రామ శివారులో బుధవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌవుతాపురం గ్రామానికి చెందిన నేరెళ్లి శివకృష్ణ (22), మరుపట్ల సాంబరాజు (22), నేరెళ్లి వంశీకృష్ణ, వొజ్జల సందీప్, పాలకుర్తి మండలం బొమ్మెరకు జిట్టబోయిన సాయికుమార్ (23) స్నేహితులు. అంతా కలిసి దసరా పార్టీ కోసం బుధవారం సాయంత్రం సాగరం గ్రామ శివారుకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఉరుములు, మెరుపులతో వాన మొదలవడంతో అంతా కలిసి పక్కనే ఉన్న మర్రిచెట్టు కిందకు వెళ్లి నిల్చుకున్నారు. కాసేపటికే ఆ చెట్టుపై పెద్ద శబ్దంతో పిడుగుపడింది. దీనితో నేరెళ్ళి శివకృష్ణ, జిట్టబోయిన సాయికుమార్ అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు మిగతా ముగ్గురిని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. మరుపట్ల సాంబరాజు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగతా ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వీరిలో నేరెళ్లి వంశీకృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. చెరువు మత్తడి చూడటానికని వెళ్లి.. మహబూబాబాద్ జిల్లా గార్లలో వానకు నిండి మత్తడి పోస్తున్న చెరువును చూసేందుకు అక్కడి వడ్డెర బజారుకు చెందిన వేముల సంపత్ (27), ఆలకుంట శేఖర్, రూపన్ రమేశ్, విజయ్ వెళ్లారు. కాõదÜపటికే జోరువాన మొదలవడంతో చెరువు కట్టపైనే ఉన్న చెట్టు కిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగుపడటంతో వేముల సంపత్ అక్కడికక్కడే మృతి చెందగా.. శేఖర్, విజయ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. కాస్త దూరంగా ఉన్న రూపన్ రమేశ్ పిడుగుపాటు నుంచి తప్పించుకున్నాడు. స్థానికులు శేఖర్, విజయ్‌లకు గార్ల ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతుడు సంపత్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. ►ఇక ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అజయ్‌తండాలో బుధవారం సాయంత్రం కోళ్లను కప్పేందుకు ఇంటి బయటికి వచ్చిన మూడు జమ్మ (68) అనే వృద్ధురాలు.. కొద్దిదూరంలో పిడుగుపడటంతో శబ్దానికి గుండె ఆగి కన్నుమూసింది. ►నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్‌పై గురువారం వేకువజామున పిడుగు పడటంతో కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ►కడెం మండలంలోని లక్ష్మీసాగర్ గ్రామంలో ఇంటిపై పిడుగుపడటంతో భుక్యా రాజేశ్ అనే వ్యక్తి ఇంట్లోని టీవి, ఫ్రిజ్, విద్యుత్ వైరింగ్ కాలిపోయాయి. ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. రాజేశ్ భార్య స్వరూపకు గాయాలయ్యాయి. -
ఇంటర్ విద్యార్థినిపై ఉపాధ్యాయుడి కన్ను.. హాస్టల్ నుంచి తీసుకెళ్లి..
స్టేషన్‌ఘన్‌పూర్: పాలకుర్తి మండలంలోని ఓతండాకు చెందిన విద్యార్థిని మండలంలోని నమిలిగొండ శివారు మోడల్ స్కూల్లో ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మోడల్ స్కూల్లో హాస్టల్ సౌకర్యం లేకపోవడంతో శివునిపల్లిలోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ విద్యనభ్యసిస్తోంది. అయితే మోడల్ స్కూల్లో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసే రేణుకుంట్ల శ్యామ్ కన్ను ఆవిద్యార్థినిపై పడింది. ఈక్రమంలో ఈనెల 17న జాతీయ జెండావిష్కరణలో సదరు అధ్యాపకుడు పాల్గొన్నాడు. అనంతరం హాస్టల్‌కు వెళ్లిన విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఆమెను తీసుకుని బయటకు వెళ్లాడు. సాయంత్రం అయినా.. విద్యార్థిని హాస్టల్‌కు రాకపోవడంతో వార్డెన్ విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో హాస్టల్ వద్దకు ఆమె తల్లిదండ్రులు చేరుకున్నారు. 17న రాత్రి విద్యార్థిని హాస్టల్‌కు రాగా.. తల్లిదండ్రులు నిలదీశారు. మాయమాటలు చెప్పి అధ్యాపకుడు శ్యామ్ బయటకు తీసుకెళ్లాడని బాలిక చెప్పింది. దీంతో ఈనెల18న బాలిక తల్లి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సదరు అధ్యాపకుడిని అరెస్టు చేశారు. అనంతరం జనగామ సబ్‌జైల్‌కు తరలించినట్లు ఏసీపీ రఘుచందర్ తెలిపారు. సదరు అధ్యాపకుడి ప్రవర్తనపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. బాలికను గర్భవతిని చేసిన యువకుడు నడికూడ: మండల కేంద్రానికి చెందిన బాలికను అదే ప్రాంతానికి చెందిన యువకుడు మాయమాటలు చెప్పి లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. కొద్ది నెలల నుంచి జరుగుతున్న ఈవ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గర్భం దాల్చిన విషయాన్ని సదరు బాలిక కుటుంబ సభ్యులకు చెప్పలేదు. నెలలు నిండక ముందే నొప్పులు రావడంతో కుటుంబీకులు బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కడుపులోనే శిశువు మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో ఏసీపీ శివరామయ్య గ్రామంలో వివరాలు సేకరించారు. -
సాయుధ పోరు స్ఫూర్తితో నూతన భారత్‌ను నిర్మిద్దాం
మిర్యాలగూడ/అర్వపల్లి/జనగామ: రాజ్యాంగ విలువలను కాలరాస్తూ పెట్టుబడిదారులకు సహకరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. బీజేపీని నిలువరించేందుకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరు స్ఫూర్తితో నూతన భారతదేశాన్ని సృష్టించేందుకు ప్రజలు సన్నద్ధం కావాలన్నారు. హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ సాయుధ పోరు ప్రారంభమయ్యేనాటికి బీజేపీ, సంఘ్‌పరివార్ ఉనికిలో లేవ న్నారు. గాంధీజీ హత్య అనంతరం 1948లో అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించారని చెప్పారు. తెలంగాణ పోరాట ఉత్సవాలను విమోచనంగా చెప్పుకుంటూ తమ ఘనకార్యంగా బీజేపీ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. ఏచూరి సూర్యాపేట జిల్లా అర్వపల్లి లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం స్మారక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో, జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ సాయు ద పోరాట వారోత్సవాల ముగింపు సభలో మాట్లాడారు. బీజేపీని నిలువరించే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న అనేక అంశాలను కేంద్రం తమ చేతుల్లోకి తీసుకొని రాష్ట్రాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోందని ఏచూరి ధ్వజమెత్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు లాంటి అనేక రాష్ట్రాల్లో జీఎస్టీ వాటాను విడుదల చేయకుండా ఇబ్బందులు సృష్టిస్తోందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్న బీజేపీని తరిమికొట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోమాలో నుంచి కోలుకున్నానని వెరై‘టీ’ విందు
సాక్షి, చిల్పూరు: కోమలోనుంచి కోలుకున్న ఓ వ్యక్తి గ్రామస్తులకు వెరై‘టీ’ విందు ఇచ్చారు. 12 రోజులపాటు రోజుకు వంద మందికి ఇస్తానని ప్రకటించాడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం ఫత్తేపూర్ గ్రామానికి చెందిన గుగులోతు భిక్షపతి ఉప్పరి పని మేస్త్రీ. జూలై 13న ఇంట్లో సజ్జపైనున్న వస్తువును తీస్తూ జారిపడ్డాడు. తలకు దెబ్బతగిలి కోమాలోకి వెళ్లాడు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన ఆరు రోజుల తరువాత కోమానుంచి తేరుకున్నాడు. 51 రోజుల చికిత్స అనంతరం గురువారం డిశ్చార్జ్ అయి అతను స్వగ్రామం చేరుకున్నాడు. ఇది తనకు పునర్జన్మని, దాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు 12 రోజుల పాటు రోజుకు వందమందికి చాయ్ అందిస్తానని ప్రకటించాడు. గ్రామంలోని రవి హోటల్ వద్ద ఈ ‘టీ’ విందును సర్పంచ్ రూప్లానాయక్ చేతుల మీదుగా ప్రారంభించాడు. (క్లిక్: వాట్సాప్ గ్రూపునకు అడ్మిన్ చేస్తే.. బయటకు తోసేశారు, న్యాయం చేయండి) -
360 మందిని ఎన్కౌంటర్ చేయించాడు.. కడియంపై కస్సుమన్న రాజయ్య
చిల్పూరు: కడియం శ్రీహరి టీడీపీ హయాం నుంచి అతనికి గిట్టని వారిని ఎన్కౌంటర్లు చేయించాడని, ఒక్క నియోజకవర్గంలోనే 360 మంది అమాయకులను చంపించాడని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన ఆరోపణలు చేశారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలో కొత్త పింఛన్‌దారులకు సోమవారం ఆయన కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు రాజకీయ గురువు వైఎస్సార్ అయితే ప్రస్తుత సీఎం కేసీఆర్ దేవుడని, నియోజకవర్గానికి తాను పూజారినని, ఆ దేవుడిచ్చే వరాలతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ఎప్పటికీ స్టేషన్‌ఘన్‌పూర్ తన అడ్డా అని.. ఎవరినీ కాలు పెట్టనీయనని శపథం చేశారు. -
కంటి పాపను వదిలించుకుని..
రఘునాథపల్లి: తలపై పెద్ద కణితితో పుట్టిన శిశువును నడిరోడ్డుపై వదిలేశారు. ఈ అమానవీయ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఉదయం జరిగింది. కంచనపల్లి రోడ్డులోని ఫాతిమా చికెన్ సెంటర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున మూడు రోజుల ఆడశిశువు ఏడుస్తుండటాన్ని స్థానికులు పలువురు గుర్తించారు. పాప తలపై పెద్ద కణితి ఉండటంతో వదిలేసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అంగన్వాడీ టీచర్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె ఐసీపీఎస్, చైల్డ్‌లైన్ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించారు. వారి ఆదేశాలతో ఆశ వర్కర్లు కవిత, శ్రీలత అంగన్వాడీ టీచర్లతో కలిసి పసికందును స్థానిక పీహెచ్‌సీకి.. అక్కడి నుంచి జనగామ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం ఐసీడీఎస్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్‌లైన్ 1098 అధికారులు బాలరక్ష వాహనంలో పాపను హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. పోషించలేకుంటే సమాచారం ఇవ్వండి.. తల్లిదండ్రులు పసి పిల్లలను పోషించలేని స్థితిలో ఉంటే చెత్త కుప్పలు, రోడ్లపై వదిలేయకుండా.. బాలల పరిరక్షణ విభాగం లేదా 1098కు సమాచారం అందిస్తే సంరక్షిస్తామని బాలల పరిరక్షణ అధికారిణి జయంతి తెలిపారు. స్వయంగా బాలల పరిరక్షణ అధికారులకు అందజేస్తే ఆ పాపను మరొకరికి దత్తత ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుందని, అలా ఇచ్చి న వారి వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేశారు. -
జనగామలో హైటెన్షన్
-
విషాదంగా ముగిసిన లవ్‌స్టోరీ.. వాట్సాప్ చాటింగ్ చేసుకుని..
పాలకుర్తి(జనగామ జిల్లా): తమ ప్రేమకు పెద్దలు అడ్డు చెబుతారని భావించిన ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామశివారు భీక్యా నాయక్ గ్రామ పంచాయతీలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. భీక్యా నాయక్ గ్రామ పంచాయతీకి చెందిన బాలిక (16), అదే తండాకు చెందిన గుగులోతు పాపా, టీక్యా దంపతుల కుమారుడు రాజు(22) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. రాజు కారు డ్రైవర్‌గా పని చేస్తుండగా, దీపిక ఇంటర్ చదువుతోంది. చదవండి: ఏమైందో ఏమో.. అన్నయ్య విదేశాలకు వెళ్లిపోవడంతో.. వీరి ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళనకు గురయ్యారు. తమ పెళ్లి జరగదని భావించిన ఇరువురూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం రాత్రి తండా శివారులోని పల్లె ప్రకృతి వనంలో ముందుగానే సిద్ధం చేసుకున్న పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో తండాలోని ఓ అమ్మాయిని ప్రేమించి ఆమె ఆత్మహత్యకు రాజు కారకుడయ్యాడని తండావాసులు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి రాజు, ఆ బాలిక వాట్సాప్ మెసేజ్‌లు చేసుకున్నారని, ఉద్దేశపూర్వకంగానే బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కూతురికి రాజు బలవంతంగా పురుగుమందు తాగించాడని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టానికి తీసుకెళ్లకుండా తండా వాసులు అడ్డుతగిలారు. పోలీసులు వారికి సర్దిచెప్పి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. -
జనావాసాల్లోకి ఎలుగుబంటి
పాలకుర్తి టౌన్: జనగామ జిల్లా పాలకుర్తి మండలకేంద్రంలో ఎలుగుబంటి సంచారం అలజడి రేపింది. బుధవారం రాత్రి ఎలుగబంటి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ నుంచి డివైడర్ దాటుతుండగా మారం శ్రీనివాస్ తన కారులో వెళ్తూ వీడియో తీశాడు. గురువారం ఉదయం రాజీవ్ చౌరస్తా నుంచి లక్ష్మీనారాయణపురం గ్రామంలోని పంట పొలాల్లో సంచరించింది. దీంతో స్థానికులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. అచూకీ కోసం పోలీసులు వెదకడం మొదలుపెట్టారు. పాలకుర్తి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అఖిలేశ్ ఎలుగుబంటి పాదముద్రలను సేకరించారు. -
ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన
-
రోడ్డుపై ఎమ్మెల్యే రాజయ్య వైద్యం
రఘునాథపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడికి సత్వర వైద్య సేవలు అందించి మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి పంపించారు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన సత్తు మహేందర్ ఆదివారం తన ద్విచక్ర వాహనంపై మేకలగట్టులో దుర్గామాత ఉత్సవాల సందర్భంగా బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి పయనమయ్యాడు. ఖిలాషాపూర్ సమీపంలోకి రాగానే కుక్క రోడ్డుకు అడ్డురావడంతో మహేందర్ సడన్ బ్రేకు వేయగా బైకు అదుపుతప్పి కిందపడి గాయాలయ్యాయి. అదే సమయంలో దుర్గామాత ఉత్సవాలకు వెళ్లి కారులో వస్తున్న ఎమ్మెల్యే దీనిని గమనించి, కారు నిలిపారు. వెంట నే మహేందర్ వద్దకు వెళ్లి వైద్యుడైన రాజయ్య తన వెంట ఉన్న స్టెతస్కోప్‌తో పరీక్షించారు. అప్పటికే మహేందర్ స్పృహ కోల్పోవడంతో...108 వాహనం చేరుకోవడానికి ఆలస్యమవుతుందని గ్రహించి వెంటనే పోలీస్ వాహనంలో జనగామ ఆస్పత్రికి తరలించారు. జనగామ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి మహేందర్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా సూచించారు. -
నంబర్ వన్ సీఎంకు పీకే, ప్రకాష్‌రాజ్ ఎందుకు?
రఘునాథపల్లి: ‘ప్రపంచం అబ్బురపడే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినం.. ఇంటింటికీ నీళ్లిచ్చే మిషన్ భగీరథ చేపట్టినం.. అన్ని రంగాల్లో నంబర్ వన్ తెలంగాణ’అని చెప్పుకొనే సీఎం కేసీఆర్‌కు పీకే ఎందుకు? ప్రకాష్‌రాజ్ ఎందుకు? అని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. బీఎస్పీ ఏనుగులాగ ఘీంకరించగానే కాం ట్రాక్టర్ల వద్ద కమీషన్ల రూపంలో తీసుకున్న రూ.600కోట్లతో పీకేను తెచ్చుకున్నారని ఆయన ఆరోపించారు. బహుజన రాజ్యాధికార యాత్ర సందర్భంగా ఆదివారం రాత్రి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో బహిరంగ సభ జరిగింది. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన సభలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ... ఇది ప్రవీణ్‌కుమార్ యాత్ర కాదు, తెలంగాణలో మూడు కోట్ల మంది బహుజనులు చేస్తోన్న దండయాత్ర అన్నారు. కేసీఆర్ కుయుక్తులు పసిగట్టి జనం ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపు నిచ్చారు. సభలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, రాష్ట్ర కోఆర్డినేటర్లు దేవోళ్ల గంగాధర్, మల్లేశం, బాలస్వామి చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మహతి రమేష్, గంధం శివ, శేఖర్, వెంకన్న, రాష్ట్ర కార్యర్శులు అనితారెడ్డి, వెంకటేష్, నాయకులు సమ్మయ్య, కందికంటి విజయ్‌కుమార్, శివరాజ్, రంగు రాజశేఖర్‌గౌడ్, ప్రేమ్‌సాగర్ పాల్గొన్నారు. -
ఖిలాషాపూర్ నుంచి బహుజన రాజ్యాధికార యాత్ర
సాక్షి, హైదరాబాద్: బహుజనులకు ఏళ్ల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని చాటి చెప్పేందుకు బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ విభాగం బహుజన రాజ్యాధికార యాత్రకు శ్రీకా రం చుట్టింది. ఈ క్రమంలో 300 రోజుల పాటు సుదీర్ఘంగా బహుజన రాజ్యాధికార యాత్ర చేపడుతున్నట్టు బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ చీఫ్ కో–ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బడుగుల రాజకీయ అధికారం కోసం మూడు శతాబ్దాల క్రితం మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాడిన బహుజన యోధుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 4గంటలకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ నుంచి యాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. ముందుగా అక్కడే ప్రారంభ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. -
కేసీఆర్, కడియం దళితద్రోహులు: మందకృష్ణ
స్టేషన్‌ఘన్‌పూర్: దళిత ద్రోహులైన సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి రాజకీయ సమాధి తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. రాజ్యాంగానికి కేసీఆర్ రూపంలో వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కోవాలన్న నినాదంతో ఏప్రిల్ 4న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి బహిరంగ సభకు సన్నాహకంగా జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ దురహంకారంతో రాజ్యాంగంపై వ్యాఖ్య లు చేశారన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు శ్రీహరి వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉద్యమాలు చేసి కేసీఆర్ సీఎం అయ్యారని, ఇప్పుడు ఆ రాజ్యాంగాన్నే మార్చాలనడం సమంజసం కాదని ప్రొ. హరగోపాల్ అన్నారు. రైతులు, నిరుద్యోగులు, కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్‌కు పట్టదని ప్రొ.కోదండరాం అన్నారు. కార్యక్రమంలో ప్రొ.ఖాసీం, బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్, దళిత హక్కుల నేత జేబీ రాజు, ఎల్‌హెచ్‌పీఎస్ నేత బెల్లయ్యనాయక్ పాల్గొన్నారు. -
పోక్సో కోర్టులతో సత్వర న్యాయం
మహబూబాబాద్ రూరల్/జనగామ: జిల్లాల్లో పోక్సో కోర్టుల ఏర్పాటు ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ అన్నారు. మహబూబాబాద్, జనగామలో ఏర్పాటు చేసిన పోక్సో కోర్టులను సోమవారం ఆయన వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. వర్చువల్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తి నవీన్‌రావు, వరంగల్ నుంచి ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు పాల్గొన్నారు. మహబూబాబాద్ గిరిజన జిల్లాలో ఇలాంటి కోర్టు అత్యవసరమన్నారు. పునర్విభజనలో ఏర్పడిన కొత్త జిల్లాల వారీగా పూర్తిస్థాయి కోర్టు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె.శశాంక, జడ్జి అనిల్ కిరణ్‌కుమార్, ఎస్పీ శరత్చంద్ర పవార్ తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ కోట బద్దలు కొడతాం
సాక్షిప్రతినిధి, వరంగల్: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ మొదట్నుంచీ తెలంగాణపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని.. తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వకున్నా ఉన్నంతలో అభివృద్ధి చేసుకుంటుంటే ఓర్వలేకపోతున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి వస్తే.. కచ్చితంగా జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ శుక్రవారం జనగామ జిల్లాలో పర్యటించారు. తొలుత సమీకృత జిల్లా కార్యాలయాల (కలెక్టరేట్) సముదాయాన్ని ప్రారంభించి.. అధికారులు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. తర్వాత జనగామ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. హైదరాబాద్–వరంగల్ హైవే పక్కన యశ్వంతపూర్ శివారులో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి, బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. ‘ఢిల్లీ కోటలు బద్దలు కొడదామా.. జాతీయ రాజకీయాల్లో పాల్గొందామా..’అంటూ కేసీఆర్ సభలో కోరగా.. టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ‘పోదాం.. పోరాడుదాం’అంటూ మద్దతు తెలిపారు. సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. సచ్చినా మోటార్లకు మీటర్లు పెట్టం.. ‘‘తెలంగాణపై కేంద్రం, మోదీ మొదటి నుంచీ అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారు. ఏడేళ్లయినా కాళేశ్వరానికి జాతీయ హోదా, కాజీపేట రైల్వే డివిజన్, కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ.. ఇలా ఒక్కటీ ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారు. దేశాన్ని దోచుకున్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటివారిని పిక్నిక్ టూర్లా విదేశాలకు పంపించిన మోదీ.. ఇక్కడ రైతులు, పేదల వెంట పడ్డారు. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తానని చెప్పి.. డీజిల్, పెట్రోల్, గ్యాస్, ఎరువుల ధరలు పెంచి రైతుల పెట్టుబడి ఖర్చును రెట్టింపు చేశారు. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం.. సమైక్య పాలనలో నష్టపోయిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మనం పెట్టుకున్న పాలసీలతో మెరుగుపడుతోంది. రైతుబంధు ఇస్తున్నాం. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 8 రోజులలోపు రూ.5లక్షలు బీమా సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నాం. రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లు అయింది. ఎప్పుడైనా కేంద్రంతో పంచాయితీ పెట్టుకున్నమా? కేంద్రం సాయం చేయకున్నా.. కడుపు కట్టుకుని అభివృద్ధి చేసుకున్నాం. 30– 40 ఏళ్లు కరెంటు లేక, నీళ్లు రాక ఇబ్బందిపడ్డాం. ఇప్పుడు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపుకొంటున్నాం. సాగునీటి వసతుల కల్పనతో పంటల సాగు ఘననీయంగా పెరిగింది. హైదరాబాద్‌కు, ఇతర పట్టణాలకు వలస వెళ్లినవారు తిరిగి గ్రామాలకు వస్తున్నారు. వ్యవసాయ భూముల ధరలు పెరిగాయి. ఎంతో ఆలోచించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలనే ఆకాంక్ష నెరవేరాలి. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తా. అప్పుడు పార్టీపరంగా, ఇతర సమస్యలను పరిష్కరించుకుందాం. ఉద్యోగులు ఆందోళన చేయడం అసంతృప్తిగా ఉంది జనగామలో సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన తర్వాత నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ ఉద్యోగుల గురించి మాట్లాడారు. ‘‘ఇటీవల ఉద్యోగులు ఆందోళనలు చేయడం అసంతృప్తిగా ఉంది. పాలనాపరంగా పారదర్శకంగా ఉండేందుకు జోనల్, స్థానికత బదిలీలు చేపట్టామే తప్ప మరో ఆలోచన లేదు. తెలంగాణ పురోగతి కోసం పాటుపడుతున్న ఉద్యోగులందరికీ దేశంలో ఎక్కడా లేని ఆత్మగౌరవం, వేతనం ఉండటమేగాక.. ఎలాంటి పైరవీలకు తావులేకుండా పదోన్నతులు కల్పిస్తున్నాం. ఉద్యోగ విరమణ చేసే నాటికి తగిన పారితోషికం ఇచ్చి ఇంటికి సగౌరవంగా పంపించేలా చర్యలు చేపడుతున్నాం. ఉద్యోగులు తమ కృషిని మరింత కాలం కొనసాగిస్తూ.. బంగారు తెలంగాణ సాకారం కోసం తోడ్పడాలి’’ అని కేసీఆర్ కోరారు. భూముల ధరలు.. ధనిక రాష్ట్రానికి ప్రతీక మౌలిక వసతులు, రాయితీల కల్పనతో పంటల సాగు పెరిగి రాష్ట్రంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయని.. ఇది ధనిక రాష్ట్రానికి ప్రతీక అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి వరంగల్ వరకు అభివృద్ధి కారిడార్‌గా మారిందని, ఎనిమిదేళ్ల కింద ఎకరానికి రెండు లక్షల ధర ఉంటే.. ఇప్పుడు కోటి రూపాయల వరకు చేరడం ధనిక రాష్ట్రానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాలు అభివృద్ధి కేంద్రాలవుతాయని పేర్కొన్నారు. జనగామకు మెడికల్ కాలేజీ తెలంగాణ అమరులు కన్న కలల సాకారం కోసం జనగామ ప్రాంతంలో తాగు, సాగునీటి కల్పన చర్యలతో కరువును పారదోలామని సీఎం కేసీఆర్ చెప్పారు. గోదావరి నదిపై సమ్మక్క బ్యారేజీ నిర్మాణంతో ఉమ్మడి వరంగల్ రైతన్నల కన్నీళ్లు కడిగేందుకు కార్యాచరణ రూపుదాల్చుతోందన్నారు. మల్లన్నసాగర్ ద్వారా తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీళ్లు తరలిస్తామని, ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి పోసేలా చేస్తానని ప్రకటించారు. స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రాల్లో డిగ్రీ కాలేజీలతోపాటు జనగామకు మెడికల్ కళాశాల మంజూరుపై మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాగా బహిరంగ సభ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి బాగా చేశారని అభినందించారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పసునూరి దయాకర్, కవిత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాడికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న దత్తాత్రేయ సీఎం బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుంచి భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావడంతో అటు సూర్యాపేట–జనగామ జాతీయ రహదారి, ఇటు హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. సభ ప్రారంభం, ముగింపు సమయంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ రఘునాథపల్లి మండలం మిడిగొండ వద్ద ట్రాఫిక్‌లో అరగంటపాటు ఇరుక్కుపోయారు. – జనగామ నుంచి హనుమకొండకు వెళ్తున్న అంబులెన్స్ యశ్వంతపూర్ వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు.. అంబులెన్సును కాస్త ఎత్తి, డివైడర్ మీదుగా పక్కన రోడ్డువైపు దిగేందుకు సాయం చేశారు. సీఎం పర్యటనలో నిరసనలు జనగామ రూరల్/బచ్చన్నపేట: సీఎం కేసీఆర్ జనగామ జిల్లా పర్యటన సందర్భంగా ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్, ఏబీవీపీ, టీడీపీ నాయకులు జనగామలో రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. కాగా జనగామ పట్టణంలోని 16వ వార్డు టీఆర్ఎస్ ఇన్చార్జి దుబ్బాక వీరాస్వామి బహిరంగ సభకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని, స్టేషన్‌కు తరలించారు. తాను టీఆర్ఎస్ నాయకుడినని చెప్పినా వినకుండా లాక్కెళ్లారంటూ.. వీరాస్వామి పోలీస్‌స్టేషన్ ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సర్వహంగులతో జనగామ కలెక్టరేట్ జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను అత్యాధునికంగా, సర్వహంగులతో నిర్మించారు. ఏకంగా 25 ఎకరాల విశాల స్థలంలో, మూడు అంతస్తుల్లో లక్షా 45వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాలు ఉండటం గమనార్హం. రూ.65.75 కోట్లతో కట్టిన సముదాయంలో కలెక్టరేట్, అధికారుల క్వార్టర్లతోపాటు మంత్రికోసం ప్రత్యేక చాంబర్‌ను నిర్మించారు. కలెక్టరేట్‌కు నలుదిక్కులా ద్వారాలు, వెళ్లడానికి నాలుగు లేన్ల రహదారి, చుట్టూ పూర్తి పచ్చదనాన్ని ఏర్పాటు చేశారు. – 300 సీటింగ్ సామర్థ్యంతో ప్రత్యేక సమావేశ మందిరం, నాలుగు లిఫ్టులు, కాన్ఫరెన్స్ హాళ్లు, ఆడియోవీడియో వ్యవస్థతో కూడిన ఎల్ఈడీ స్క్రీన్లు ఉన్నాయి. – కలెక్టర్, అదనపు కలెక్టర్ల చాంబర్లలో సెంట్రలైజ్డ్ ఏసీ అమర్చారు. ప్రత్యేక సబ్‌స్టేషన్, జనరేటర్ ఏర్పాటు చేశారు. – గ్రౌండ్ ఫ్లోర్లో దుకాణం, ఏటీఎం, ఇన్ఫర్మేషన్ సెంటర్, టెక్నికల్ సపోర్టింగ్ గది, చంటిబిడ్డ తల్లులకు విశ్రాంతి గది, వికలాంగులకు ర్యాంప్స్, టాయిలెట్లు నిర్మించారు. మోదీ జాగ్రత్త.. ఇది తెలంగాణ ఊ తెలంగాణ ప్రజల మనోభావాలను, అమరుల త్యాగాలను కించపరిచే విధంగా వ్యవహరిస్తే సహించబోం. మోదీ జాగ్రత్త.. ఇది తెలంగాణ. అవసరమైతే ఢిల్లీకోటను బద్దలు కొడతాం. దేశం నుంచి తరిమేసి తెలంగాణకు మేలు చేసే వారిని తెచ్చుకుంటాం. మోటార్లకు మీటర్లు పెట్టం ఊ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ విద్యుత్ సంస్కరణలంటూ ఓ అందమైన పేరుపెట్టి తెలంగాణలో కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్నరు. నేను చెప్పిన. నన్ను చంపినా, çసచ్చినా మోటార్లకు మీటర్లు పెట్టం. గతంలో చంద్రబాబు వ్యవసాయ బావులకు మీటర్లు పెడతామంటే.. ఇంకేం తెలంగాణలో మనిషికో మీటరు పెట్టండి అని మండిపడ్డాం. చివరకు ఆయనకే మీటరు పెట్టినం. పత్తా లేకుండా పోయిండు. -
‘అంతిమ’ ప్రయాణం
చందానగర్/లింగాలఘణపురం: బంధువుల ఇంట్లో అంత్యక్రియల కోసం తల్లి, తండ్రి, కుమారడు బయల్దేరారు. కుమారుడు కారు నడుపుతున్నాడు. మార్గమధ్యలో కారు టైరు అకస్మాత్తుగా పేలింది. అంతే.. కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొంది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం సూర్యాపేట ప్రధాన రహదారిపై శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. వెనుక టైరు పేలడంతో.. శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీలో ఉంటున్న జెన్న శేఖర్‌రెడ్డి (67), ధనలక్ష్మమ్మ (60) దంపతుల కుమారుడు రఘుమారెడ్డి (27). గచ్చిబౌలిలోని ఓ హోటల్లో హెచ్ఆర్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ధనలక్ష్మమ్మ ఇంట్లో కుట్టు మిషన్‌పై బట్టలు కుడుతుంటుంది. శేఖర్‌రెడ్డి అనారోగ్య కారణాల వల్ల ఇంట్లోనే ఉంటున్నాడు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో శేఖర్‌రెడ్డి మేనమామ సంకపల్లి నర్సింహారెడ్డి మృతి చెందడంతో అంత్యక్రియలకు వెళ్లేందుకు శుక్రవారం ఉదయం 8.30 గంటలకు శేఖర్‌రెడ్డి, ధనలక్ష్మమ్మ, రఘుమారెడ్డి కారులో బయలుదేరారు. కుమారుడు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జనగామ దాటి సూర్యాపేట రోడ్డులోని వనపర్తి స్టేజీ సమీపంలోకి రాగానే కారు వెనుక టైరు పే లడంతో తిరుమలగిరి తు మ్మలగూడెం నుంచి పశువుల లోడుతో వస్తు న్న బొలేరో గూడ్స్ వాహనాన్ని ఢీకొట్టింది. రెండు వాహనాలు అతివేగంగా ఢీకొనడంతో బొలేరో బోల్తా పడింది. కారు నుజ్జునుజ్జయింది. శేఖర్‌రెడ్డి, ధనలక్ష్మమ్మ, రఘుమారెడ్డి మృతి చెం దాడు. ముగ్గురి మృతదేహాలు కారులోనే ఇరుక్కు పోయాయి. బొలేరో డ్రైవర్‌కు చేతులు విరిగాయి. మరో ఇద్దరు వెళ్దామనుకున్నారు.. కానీ.. శేఖర్‌రెడ్డి సోదరుడు లక్ష్మారెడ్డి చందానగర్‌లోని శివాజీనగర్‌లో నివాసం ఉంటు న్నాడు. అంత్యక్రియల నిమిత్తం తిరుమలగిరికి వెళ్తున్నట్లు చెప్పి ఉంటే లక్ష్మారెడ్డి కూడా శేఖర్‌రెడ్డి కారులోనే వెళ్లేవారని, ఆయన కూడా ప్రమాదానికి గురయ్యే వారని కుటుంబీకులు అంటున్నారు. శేఖర్‌రెడ్డి రెండో భార్య మాణెమ్మ కూడా తిరుమలగిరిలో జరిగే అంత్యక్రియలకు వెళ్లేందుకు సిద్ధమయింది. అయితే అప్పటికే శేఖర్‌రెడ్డి కుటుంబం బయల్దేరడంతో ఇక్కడే ఆగిపోయింది. రఘుమారెడ్డికి గతేడాది నవంబర్ 18న మహబూబాబాద్ జిల్లా, నర్సింçహాపేట మండలం, వంతడుపుల గ్రామానికి చెందిన దివ్యతో వివాహం జరిగింది. శేఖర్‌రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని న్యా యం చేయాలని బంధువులు కోరుతున్నారు. -
వ్యాక్సిన్ వేస్తే.. ఉరేసుకుంటా.. చుక్కలు చూపించిన బామ్మ..
సాక్షి, జనగామ: కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోమంటే.. ఓ వృద్ధురాలు వైద్య సిబ్బందికి చుక్కలు చూపించింది. వ్యాక్సిన్ వేస్తే.. ఉరి వేసుకుంటానంటూ హడావుడి సృష్టించింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్రమంలో 80 ఏళ్ల వృద్ధురాలిని వ్యాక్సిన్ వేసుకోమని అడగగా వ్యాక్సిన్ వేస్తే ఉరి వేసుకుంటానంటూ మొండిగా వ్యవహరించింది. చదవండి: జొన్నలకు పులి కాపలా! వైద్య సిబ్బందిని మీరు వెళ్లిపోండి.. మీ కాళ్లు మొక్కుతా అంటూ ఆ వృద్ధురాలు తల బాదుకుంది. ఎంతగా నచ్చజెప్పినా ఏమాత్రం వినలేదు. సూది మందంటే చిన్న పిల్లల్లా మారాం చేయడంతో కాస్త ఫన్నీగా అనిపించింది. కొందరు కరోనా టీకా వేయించుకోవటానికి భయపడుతున్నారు. దాన్నో భూతంలా చూస్తున్నారు. మరికొందరు లేనిపోని అపోహలతో వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఆసక్తి చూపడంలేదు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఏమాత్రం వారి తీరులో మార్పు రావడం లేదు. చదవండి: విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు! -
లబోదిబోమంటున్న అన్నదాతలు
-
షార్ట్ సర్క్యూట్‌తో ట్రావెల్స్ బస్సు దగ్ధం
లింగాలఘణపురం: వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల బైపాస్ రోడ్డుపై బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో బస్సులోని 26 మంది ప్రయాణికులు డ్రైవర్ అఫ్జల్ అహ్మద్ షేక్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగ్దల్పూర్ నుంచి ఆదివారం రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్ బయలుదేరిన ఏసీ కోచ్ బస్సు మర్నాడు తెల్లవారు జామున 5.30 గంటలకు నెల్లుట్ల బైపాస్ సమీపానికి చేరుకుంది. అదే సమయంలో ఇంజన్‌లోనుంచి పొగతోపాటు వాసన రావడంతో డ్రైవర్‌కు అనుమానం వచ్చి రోడ్డు పక్కన ఆపి దిగి చూశాడు. పొగలు ఎక్కువ కావడంతో నీళ్లు పోసినా ఫలితం లేకపోవడంతో ప్రయాణికులను వెంటనే అప్రమత్తం చేసి కిందికి దింపాడు. కొద్ది నిమిషాల్లోనే బస్సు మొత్తానికి మంటలు వ్యాపించాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. కొంతమంది లగేజీ కూడా కాలిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ రఘుచందర్, ఎస్సై దేవేందర్ ఆధ్వర్యంలో ప్రయాణికులను మరో బస్సులో హైదరాబాద్‌కు తరలించారు. -
బాబోయ్ ఎలుగుబంటి.. భయపెట్టేసింది
జఫర్‌గఢ్/న్యూశాయంపేట: జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం హిమ్మత్‌నగర్ గ్రామంలో శుక్రవారం ఎలుగుబంటి కనిపించింది. గ్రామంలో అకుల నర్సయ్య ఇంటి వద్ద ఉన్న చిం త చెట్టు పైకి ఎక్కి అరుస్తోంది. దీనిని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమా చారం ఇచ్చారు. రెస్క్యూ టీం సభ్యులు దూరం నుంచి మత్తు ఇంజక్షన్ వదలగా.. ఎలుగు బంటి చెట్టుపైనే స్పృహ తప్పింది. వెంటనే వల సాయంతో కిందకు దించి.. వాహనంలో హన్మకొండలోని జూ పార్కుకు తరలించారు. చదవండి: ధరల మంట.. బతుకు తంటా! -
తాళాలు పగులగొట్టి గృహప్రవేశం
సాక్షి, జనగామ: జనగామ జిల్లా కేంద్రం బాణాపురంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల తాళాలను పగులగొట్టి ఏసీరెడ్డి నగర్ వాసులు కుటుంబ సభ్యులతో కలసి బుధవారం గృహప్రవేశం చేశారు. నాలుగేళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటున్నామని, డబుల్ ఇళ్ల కేటాయింపులో ఆలస్యం చేస్తున్నారని నిరసిస్తూ ఈ ఆందోళనకు దిగారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి ఆధ్వర్యంలో 200 కుపైగా కుటుంబాలు ఇళ్ల ఎదుట బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీఓ మధు మోహన్, తహసీల్దార్ రవీందర్, ఆర్ఐ కృష్ణప్రసాద్, సీఐ మల్లేష్ వారికి ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో రాత్రి వరకు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ ఏసీరెడ్డినగర్‌లో ఇరవై ఏళ్లకు పైగా నివాసముంటున్న గుడిసెవాసులను 2017లో ఖాళీ చేయించి కలెక్టరేట్ నిర్మాణానికి స్థలాన్ని తీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించినా కేటాయించకపోవడంతో బాధితులు అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా, ఇళ్లలోకి వచ్చిన బాధిత కుటుంబాలు భోజనం చేసి ఇక్కడే ఉండిపోయారు. ఈ విషయమై ఆర్డీఓ మధుమోహన్ మాట్లాడుతూ.. అర్హుల జాబితా ప్రకారం ఇళ్లను కేటాయిస్తామని, మిగతా వారి విషయంలో విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
ప్రాణాలకు తెగించి.. పేసర్ బిగించి..
స్టేషన్‌ఘన్‌పూర్: ఈ ఫొటో చూస్తే ఎలాంటి ఆధారం లేని నిచ్చెనను కింద ముగ్గురు పట్టుకోగా.. పైకి వెళ్లిన ఓ వ్యక్తి విద్యుత్ లైన్‌పై పనిచేస్తుండటం సర్కస్ ఫీట్లా అనిపిస్తోంది కదా! కానీ ఇలాంటి ప్రాణాంతక విన్యాసాలు తమ విధి నిర్వహణలో మామూలేనని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని బస్టాండ్ వెనుక వైపు ప్రాంతంలో ఎస్ఎస్ 86 (100 కేవీ) విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద లైన్లో సోమవారం పేసర్లు బిగించాల్సి వచ్చింది. అయితే, లైన్ వద్దకు వెళ్లి నిలబడి పనిచేసేందుకు ఎలాంటి ఆధారం లేకపోవడంతో 12 ఫీట్ల నిచ్చెనను నిటారుగా నిలబెట్టి కింద ముగ్గురు సిబ్బంది పట్టుకున్నారు. ఆ తర్వాత కుమార్ అనే విద్యుత్ కార్మికుడు పైకి ఎక్కి పేసర్లు బిగించాడు. -
రైతు రాజ్యమే లక్ష్యం
సాక్షి, వరంగల్: ‘కొడకండ్లలో రైతువేదికను ప్రారంభిస్తే రాజ్యం తెచ్చినంత సంతోషంగా ఉంది. తెలం గాణలో రైతురాజ్యం సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యం’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. చైతన్యదీపికలుగా రైతు వేదికలు పనిచేస్తాయని, ఇవి రైతు విప్లవానికి నాంది అవు తాయని చెప్పారు. దేశంలో ఎక్కడా రైతులకు సంఘాలు, వేదికలు లేవని, కేవలం రైతులను సంఘటితం చేయడం, వారి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రూ.600 కోట్లతో 2,601 రైతు వేదికల్ని నిర్మించామని తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్లలో క్లస్టర్ స్థాయిలో నిర్మించిన రైతువేదికను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఐదువేల మందితో ఏర్పాటుచేసిన ‘ఆత్మీయ రైతు సమ్మేళనం’ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘రైతు వేదిక నా గొప్ప కల. రైతాంగం ఒకచోట కూర్చొని మాట్లాడు కోవాలి. నియంత్రిత సాగుపై మాట్లాడినట్లే చర్చ చేయాలి. రైతు వేదిక ఒక ఆటంబాంబు. ఒక శక్తి’ అని సీఎం పేర్కొన్నారు. ‘ధరణి పోర్టల్, రైతు వేదికలు, రైతుబంధు, రైతుబీమా వట్టిగా పెట్ట లేదు. రైతులందరూ సంఘటితం కావాలనే ఉద్దేశం తోనే వీటన్నింటినీ చేపట్టాం. రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలి. కూరగాయలు, ధాన్యం ధరలు దళారుల చేతుల్లోకి పోవద్దు. వీటన్నింటిలో కీలకపాత్ర పోషించే రైతు వేదికలు దేశానికి ఆదర్శంగా నిలవబోతున్నాయి. తెలంగాణలో రైతురాజ్యం వచ్చి తీరుతది. తెలంగాణ రైతాంగమంతా కొన్ని విషయాలను సీరియస్‌గా తీసుకోవాలి. నేను సీఎం అయ్యేనాటికి వ్యవసాయ శాఖను చంపేశారు. కానీ ఇప్పుడు అన్ని పోస్టులు భర్తీ చేశాం. వ్యవసాయ శాఖ అద్భుతంగా పనిచేస్తోంది’ అని సీఎం అన్నారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. చిత్రంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రులు నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే రాజయ్య తదితరులు రైతువేదికలు రైతు ప్రగతి కేంద్రాలు రైతులంతా సంఘటితమై సాగులోని లాభనష్టాలు, వాడే పురుగుమందులు, మార్కెట్లో డిమాండ్, పంటను క్రమపద్ధతిలో మార్కెట్‌కు తరలించడం వంటివి రైతువేదికలో చర్చించుకోవాలని సీఎం సూచించారు. వీటిలో రైతుబంధు సమితి సభ్యులు కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. ప్రపంచం మొత్తమ్మీద ప్రభుత్వం రైతులకు వేదికలు నిర్మించడం తెలంగాణలోనే జరిగిందన్నారు. రైతువేదికల్లో టీవీలు ఏర్పాటుచేసి సీఎం, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తల సూచనలు నేరుగా రైతులకు అందిస్తామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయిపూర్ రైతులు స్వచ్ఛందంగా సంఘం ఏర్పాటుచేసుకోవడంతో తక్కువ ధరకు ఎరువులు, పంట విక్రయ సమయంలోనూ మంచి ధర సాధిస్తున్నారన్నారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ ‘దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలను రైతుల కోసం అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతుల నుంచి ఎటువంటి దరఖాస్తు రాకుండానే వారి సంక్షేమంపై ఆలోచించి రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలను ప్రవేశపెట్టాం’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘రైతుబంధు ద్వారా ఇప్పటివరకు రైతుల ఖాతాలో నేరుగా సుమారు రూ.28 వేల కోట్లు జమ చేశాం. కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు ఆగదు. ఏటా రూ.1,200 కోట్లు ఖర్చుచేసి రైతుకు భద్రత కల్పించేందుకు రైతుబీమా అమలు చేస్తున్నాం. దేశంలో పూర్తిస్థాయిలో మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం మనదే. దేశవ్యాప్తంగా కొనుగోలు చేసిన ధాన్యంలో 55% వాటాతో తెలంగాణ రికార్డు సృష్టించింది అని కేసీఆర్ వివరించారు. భూమి కౌలు, ఇల్లు కిరాయి ఒకటే.. రైతుల భూహక్కులను సంపూర్ణంగా రక్షించేందుకు, వారి సమస్యలు తొలగించేందుకు వీలుగా ధరణి పోర్టల్ రూపొందించామని సీఎం తెలిపారు. ‘పట్టాదారు రైతుల సంరక్షణ మా అజెండా. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఎట్టి పరిస్థితుల్లో పట్టాదారు పాస్ పుస్తకాల్లో అనుభవదారుడు కాలమ్ రాయబోము. అనుభవదారుడిగా ఒక వ్యక్తి మూడేళ్లుంటే అతడికి భూమిపై హక్కు వస్తుంది. కోర్టులో కేసులువేసి అసలుదారుడిని ఇబ్బంది పెడుతున్నారు. పట్టణాల్లో ఇల్లు కిరాయికి ఇచ్చే సమయంలోనూ కిరాయిదారు అనే ప్రస్తావన పత్రాల్లోనూ, మరెక్కడా ఉండదు. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాల్లో సైతం అవసరం లేదు. భూమి కౌలుకివ్వడం ఇంటిని కిరాయికివ్వడం వంటిదే’ అని సీఎం వివరించారు. పల్లె ప్రగతి ద్వారా 12,751 గ్రామ పంచాయతీలకు ప్రతీనెలా సకాలంలో నిధులు విడుదల చేస్తుండడం, సర్పంచ్‌లు, పంచాయతీ సిబ్బంది తీసుకుంటున్న చర్యలతో ప్రజారోగ్యం మెరుగుపడుతోందన్నారు. రైతు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి కేంద్ర ప్రభుత్వం పూర్తి రైతు వ్యతిరేక వైఖరి అవలంభిస్తుందని, రైతులంతా దీనిపై సమష్టిగా ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతులపై కేంద్రానికి ప్రేమ లేదన్నారు. ప్రపంచంలోని దేశాలు రైతులకు సబ్సిడీలు ఇస్తుంటే మన కేంద్ర ప్రభుత్వం మాత్రమే అందించవద్దని చెబుతోందన్నారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్‌సీఐ భయంకరమైన ఆంక్షలు విధించిందని, ధాన్యం కేవలం రూ.1,888కే కొనుగోలు చేయాలని, అధిక ధరకు కొంటే తాము సేకరించబోమంటూ దుర్మార్గ వైఖరి అవలంభిస్తుందన్నారు. ఎఫ్‌సీఐ నిబంధనతో సన్న వడ్లకు వెంటనే అధిక ధర ప్రకటించలేకపోతున్నామని, తప్పనిసరిగా మరోమార్గంలో ఆయా రైతులకు అధిక లాభం కలిగేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టం సైతం పూర్తి రైతు వ్యతిరేకంగా ఉందన్నారు. నూతన వ్యవసాయ చట్టాన్ని టీఆర్ఎస్, తెలంగాణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. సదరు దుర్మార్గపు చట్టం నుంచి రక్షించుకోవడానికి రైతు వేదికలు అవసరమైన సమయంలో తమ పాత్ర పోషించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. యాసంగిలోనూ సహకరించండి వానాకాలంలో నియంత్రిత సాగుకు సహకరించిన రైతులు యాసంగిలోనూ సంపూర్ణంగా సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కేంద్ర రైతు వ్యతిరేక విధానాలతో మక్క పంటకు మద్దతు ధర లభించడం లేదని, అయినా కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మక్కలపై సుంకం 50% నుంచి 15% తగ్గించిందని సీఎం మండిపడ్డారు. వానాకాలంలో మక్కల సాగు బాగా తగ్గినా సాగు చేసిన కొందరు నష్టపోవద్దని రూ.600 కోట్లు నష్టం వస్తున్నా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. యాసంగిలో మాత్రం మక్క కాకుండా, కంది, శనగలు, పామాయిల్ వంటివి సాగు చేస్తే ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని భరోసానిచ్చారు. త్వరలోనే తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీరందిస్తామని తెలిపారు. దళితులు, గిరిజనుల అభివృద్ధికి సైతం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి అమలుచేస్తామని, ఇప్పటికే రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించి మంచి విద్య అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమం, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, ప్రభుత్వ విప్ బి.వెంకటేశ్వర్లు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, జనగామ జిల్లా కలెక్టర్ కె.నిఖిల, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది కిరికిరిగాళ్ల ముచ్చట ‘నియంత్రిత సాగు విధానంతో రైతులకు లాభం చేకూర్చాలని మేం పనిచేస్తుంటే కొంతమంది దుర్మార్గంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ దొంగ ముచ్చట్లు చెబుతున్నాడు. కిరికిరిగాళ్ల ముచ్చట్లు ఎట్ల ఉంటయో షబ్బీర్ అలీ కథ చూస్తే అర్థమైతది. షబ్బీర్ అలీ అనే కాంగ్రెస్ నాయకుడికి మెదక్ జిల్లా నార్సింగి మండలం జాప్తి శివనూరులోని సర్వే నంబర్ 408 నుంచి 413 వరకు భూములు ఉన్నాయి. అందులో వరి పంట కోసి గడ్డి కాలపెట్టిండు. సీఎం సన్నరకం పెట్టమంటే పెట్టిన.. నష్టపోయానని ఆయన ఫాంహౌస్‌లో పనిచేసే ఎలక్ట్రీషియన్ గణేశ్‌తో చెప్పించిండు. ఇదీ షబ్బీర్ అలీ కథ. ఇంత దొంగ ముచ్చట్లా? సోషల్ మీడియా కాదు.. యాంటీ సోషల్ మీడియా అయిపోయింది. ప్రతిపక్షాలకు దొంగ మాటలు మాట్లాడటం అలవాటైనా గుండెల నిండా నిజాయితీ ఉన్న సీఎంను ఎవరూ ఏం చేయలేరు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పింఛన్లపై బీజేపీవి అబద్ధాలు ‘బీజేపీ నాయకులు పింఛన్ల విష యంలో పచ్చి అబద్ధాలు మాట్లాడు తున్నారు. పెన్షన్లకు కేంద్రం అధిక మొత్తంలో డబ్బు చెల్లిస్తున్నట్లు ఎవడైనా మొగోడు రుజువుచేస్తే ఒక్కటే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతా. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ వాళ్లు గెలిచేది లేదు.. పీకేది లేదు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయకులు ఘోరాతి ఘోరమైన అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో 38.65 లక్షల మందికి అన్ని రకాల పెన్షన్లు ఇస్తున్నాం. ఈ పెన్షన్లలో కేంద్రం గుండుగుత్తగా 7 లక్షల మందికి మాత్రమే ఇస్తుంది. అదీ రూ.200 మాత్రమే. సంవత్సరానికి కలిపి కేంద్రం ఇచ్చేది రూ.105 కోట్లు అయితే రాష్ట్రం రూ.10 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్లు ఇస్తోంది. ఈ లెక్కలన్నీ ‘కాగ్’ అధికారికంగా విడుదల చేసింది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
భూ మాయ!
సాక్షి, జనగామ: రూ.కోట్లు విలువైన భూమికి ఎసరు పెట్టారు. ఇతర రైతులకు చెందిన భూముల సర్వే నంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తు చేయడంతో 12 ఏళ్ల క్రి తం జరిగిన ఈ భూ బాగోతం వెలుగులోకి వచ్చింది. గతంలో జరిగిన భూ మాయపై రెవెన్యూ అధికారులు కూపీ లాగుతుండగా బాధిత రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్, లక్ష్మీతండా శివారు రామచంద్రగూడెంలో పలువురు రైతులకు చెందిన సర్వే నంబర్లతో ఓ వ్యక్తి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని నడిపినట్లుగా తెలుస్తోంది. 2008 ఫిబ్రవరి 5వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన కె.లక్ష్మారెడ్డి బూన్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పేరు మీద ఇతర రైతుల సర్వే నంబర్ల పేరుతో జనగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇతర రైతుల సర్వే నంబర్లను వినియోగించడమే కాకుండా కొందరిని రైతులుగా చూపించి రెండు గ్రామాలకు చెందిన 30 మంది రైతుల సర్వే నంబర్లతో 118 ఎకరాల వరకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అప్పట్లో సులువుగా డబ్బు సంపాదించడం కోసం ఈ పన్నాగానికి పాల్పడినట్లు సమాచారం. దరఖాస్తు చేయడంతో వెలుగులోకి.. భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న కె.లక్ష్మారెడ్డి మృతి చెందాడు. దీంతో లక్ష్మారెడ్డి కుమారు డు ఇటీవల పట్టాదారు పాసుపుస్తకాల కో సం రఘునాథపల్లి తహసీల్దార్ కార్యాలయం లో దరఖాస్తు చేసుకున్నాడు. పాసుపుస్తకాల కోసం పొందుపర్చిన సర్వే నంబర్లను పరిశీలించిన వీఆర్ఏ సంబంధిత రైతులకు సమాచారం ఇచ్చారు. దీంతో తమ భూములు గతంలోనే రిజిస్ట్రేషన్ అయినట్లు నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. రెవె న్యూ రికార్డుల్లోని సర్వే నంబర్లలో ఇతర రైతు ల పేర్లు కనిపిస్తున్నాయి. ఈసీలో మాత్రం కొనుగోలు చేసిన లక్ష్మారెడ్డి పేరు మీద భూమి ఉన్నట్లు వస్తోంది. ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారనే విషయంపై ఆరా తీయడంతో రైతుల సర్వే నంబర్లతో ఓ బ్రోక ర్ మృతి చెందిన కె.లక్ష్మారెడ్డికి అమ్మకం చేసినట్లుగా తె లుస్తోంది. ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని గుర్తి ంచడం కోసం రెవెన్యూ అధికారు లు రంగం లోకి దిగి విచారణ చేస్తున్నారు. ఇంకా ఎంతమంది రైతుల సర్వే నంబర్లు వినియోగించా రు అనే కోణంలో వివరాలను సేకరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఉన్న ఫొటోలు, సంతకాల ఆధారంగా ఆరా తీస్తున్నారు. గుర్తించిన భూమి విలువ రూ.23.60 కోట్లు పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తులో పొందుపర్చిన భూమి విలువ రూ.23.60 కోట్లుగా ఉంటుంది. కె.లక్ష్మారెడ్డి కుమారులు సమర్పించిన పత్రాల్లో ఏడు డాక్యుమెంట్లను గుర్తించారు. వీటిలో 118 ఎకరాలుగా భూమి ఉంది. ఫతేషాపూర్, రామచంద్రాపూర్ గ్రామాల్లో ప్రస్తుతం ఆ భూములు ఎకరానికి రూ.20 లక్షలపైనే ఉంది. ఇంకా బాధిత రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమ భూముల సర్వే నంబర్లతో దళారులు వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడంపై బాధిత రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈసీలో తమ పేర్లు గల్లంతు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. భూమినే నమ్ముకున్న రైతులకు అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దరఖాస్తు తీసుకోకుండా పంపించా.. పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తు పట్టుకుని లక్ష్మారెడ్డి కుమారుడు వచ్చారు. కొత్త రెవెన్యూ చట్టం వచ్చే వరకు ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని చెప్పా. 25వ తేదీ వరకు ఎలాంటి దరఖాస్తులు తీసుకోవడం లేదు. రిజిస్ట్రేషన్లను మార్చే అధికారం మాకు లేదు. – భన్సీలాల్, తహసీల్దార్, రఘునాథపల్లి -
అడవి పందులను చంపాలి.. తినాలి
సాక్షి, జనగామ: గ్రామాల్లో పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను చంపడంతో పాటు తినే హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డిమాండ్ చేశారు. జనగామలో శనివారం ఆయన మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలను తెలంగాణలో కూడా అమలు చేయాలన్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలను సాగు చేస్తున్న రైతులు.. అడవి పందులతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. -
చెప్పుతో కొట్టిన సర్పంచ్.. యువకుడి ఆత్మహత్య
సాక్షి, రఘునాథపల్లి: వీధి లైటు వేయాలని ప్రశ్నించిన యువకుడిని సర్పంచ్ చెప్పుతో కొట్టాడు. దీంతో అవమాన భారం భరించలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుసుంబాయి తండాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సర్పంచ్ ధరావత్ రమేష్ ఆదివారం తండాలో వీధి లైట్లు వేయిస్తున్నాడు. ఈ క్రమంలో తన ఇంటి ముందు కూడా వీధిలైటు వేయాలని తండాకు చెందిన గుగులోతు ఎల్లేష్ (28) సర్పంచ్‌ను అడిగాడు. నన్ను అడిగేందుకు నువ్వేవరివి అని సర్పంచ్ పేర్కొనడంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగింది. కోపోద్రిక్తుడైన సర్పంచ్.. ఎల్లేష్‌ను చెప్పుతో కొట్టాడు. ఇంటికి వెళ్లిన ఎల్లేష్.. జరిగిన విషయాన్ని భార్యతో రోదిస్తూ తెలిపాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. కాగా, తండావాసులు సోమవారం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. సర్పంచ్‌పై కేసు నమోదు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని తండావాసులు డిమాండ్ చేశారు. చివరకు మృతుడి కుటుంబానికి 10 గుంటల భూమి, రూ.30 వేల నగదు ఇచ్చేలా తండా పెద్దలు నచ్చచెప్పారు. (కరోనాతో మరో టీఆర్ఎస్ నేత మృతి) -
మీ పేర్లేంటి.. అంతు చూస్తా..
సాక్షి, వరంగల్ రూరల్: జనగామ జిల్లా రఘునాథపల్లిలో అంగడి స్థల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సర్పంచ్, దేవాదాయశాఖ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి పంచాయితీ పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో సర్పంచ్ పోకల శివకుమార్‌పై దేవాదాయశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో విద్యుత్ శాఖ ఏఈ ఇచ్చిన ఫిర్యాదుతో సర్పంచ్‌పై కేసు నమోదవగా, తాజాగా మరో ఫిర్యాదు అందింది. దేవాదాయ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కందుల అశోక్‌కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని బస్టాండ్ వెనక ఉన్న దేవాదాయ శాఖ భూమిలో(2.11 ఎకరాలు) 2008 నుంచి అంగడి జరుగుతోంది. ప్రతి ఏటా టెండర్ ద్వారా నిర్వహణ బాధ్యతను అప్పగిస్తున్నారు. మార్చిలోనే టెండర్ ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నా.. లాక్‌డౌన్‌తో జాప్యం జరిగింది. ఈ నెల 1న టెండర్ నిర్వహించగా స్పందన రాకపోవడంతో శుక్రవారం మరోసారి బిడ్లు స్వీకరించాలని నిర్ణయించారు. కమ్యూనిటీ హాల్లో సర్పంచ్ శివకుమార్ ఆధ్వర్యంలో ఎంపీఈఓ వేణుగోపాల్, జెడ్పీటీసీ మణికంఠ, ఎంపీటీసీ రవి, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, ఉప సర్పంచ్ వాసుల సమక్షంలో టెండర్ ప్రక్రియను ప్రారంభించారు. కమ్యూనిటీ హాల్‌కు చేరుకున్న దేవాదాయశాఖ ఈఓ శేషుభారతి, ఇతర అధికారులు 12 ఏళ్లుగా అంగడి నిర్వహిస్తూ దేవాదాయ శాఖకు పైసా ఇవ్వడం లేదని లీజు ప్రకారం రూ.21 లక్షల బకాయి చెల్లించాలని కోరారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతి తీసుకున్న తర్వాతే టెండర్ నిర్వహించాలన్నారు. ఎస్సైకి ఫిర్యాదు చేస్తున్న ఈఓ శేషుభారతి దీంతో తీవ్రంగా స్పందించిన సర్పంచ్ సమావేశం జరుగుతుంటే కార్యాలయానికి వస్తారా..? ఇక్కడకు రావడానికి మీరెవరూ .. ఎందుకు వచ్చారు.. మీ అంతు చూస్తా ..? అని విరుచుకు పడ్డారు. ఈ క్రమంలో దేవాదాయశాఖ అధికారులు, సర్పంచ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న ఎస్సై, ఇతర ప్రజాప్రతినిధులు ఇరువురికి నచ్చచెప్పారు. అనంతరం దేవాదాయశాఖ ఈఓ శేషుభారతి సర్పంచ్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళా అధికారినని చూడకుండా బెదిరింపులకు దిగాడని, కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్య తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. 12 ఏళ్ల క్రితం.. 12 ఏళ్ల క్రితం అంగడి నిర్వహణ కోసం దేవాదాయశాఖకు చెందిన భూమిని జీపీ లీజుకు తీసుకుని ఏటా రూ.25 వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి సర్పంచ్‌లు ఆ ప్రకారం చెల్లింపులు చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. రూ.21 లక్షల బకాయి ఉందని, అవి చెల్లించాకే టెండర్ నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులు పలుమార్లు పంచాయతీకి నోటీసులు పంపారు. దీంతో రూ.3.20 లక్షలు చెల్లిస్తానని సర్పంచ్ చెబుతూ వస్తున్నారు. కాగా, రూ.3.20 లక్షలు తీసుకునేందుకు దేవాదాయ శాఖ అధికారులు అంగీకరించలేదు. మొత్తం బకాయి చెల్లించాలని, లేని పక్షంలో దేవాదాయశాఖ కమిషనర్ అనుమతి తీసుకోవాలని సూచించారు. -
మా ఊరుకి తీసుకెళ్లండి..
చిల్పూరు: అమెరికాలో ఉంటున్న కుమారుడి వద్ద సంతోషంగా గడిపి తిరిగొస్తున్న తమను ముంబైలో నిలిపివేయడంతో 15 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జనగామ జిల్లా చిల్పూరు మండలం వెంకటాద్రిపేట గ్రామానికి చెందిన మ్యాదరబోయిన రవీందర్, ఝాన్నీ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఈ దంపతులు గతేడాది సెప్టెంబర్ 22న అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఉంటున్న కుమారుడు ఉదయ్‌కుమార్ వద్దకు వెళ్లి ఈ ఏడాది మార్చి 19న తిరుగు ప్రయాణమయ్యారు. ఆరు నెలల తరువాత స్వగ్రామానికి వెళ్తున్నామనే ఆనందం వారిలో ఎంతో సేపు నిలవలేదు. మార్చి 20 మధ్యాహ్నం ముంబైలో విమానం దిగగానే అక్కడి సిబ్బంది వారి పాస్ పోర్టులు తీసుకుని ప్రత్యేక బస్సులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించాక ఆస్పత్రిలో 22వ తేదీ వరకు ఉంచారు. మళ్లీ మార్చి 31న పరీక్షలు చేసి ఎలాంటి అనారోగ్యం లేదని నిర్ధారించాక ఓ గెస్ట్ హౌస్‌కు తరలించారు. అక్కడి నుంచి ఈనెల 2వ తేదీన ఓ ఫంక్షన్ హాల్‌కు మార్చారు. ఇక్కడ ఉండడంతో ఇబ్బందిగా రవీందర్, ఝాన్సీ దంపతులు ఫోన్ ద్వారా శనివారం ‘సాక్షి’దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు స్పందించి తమను స్వగ్రామానికి చేర్చాలని వేడుకున్నారు. -
బొమ్మల టీచరమ్మ
గోడలపై పాఠ్యాంశాలను చిత్రిస్తూ పిల్లలకు చక్కగా అర్థమయ్యేలా సిలబస్‌ను బోధిస్తున్న తిరునగరి పద్మ.. పుస్తకాల్లోని విషయాలను నేరుగా చెప్పడం కంటే బొమ్మలు, గుర్తుల రూపంలో చూపిస్తే అవి ఎప్పటికీ పిల్లలకు గుర్తుంటాయని అంటున్నారు. బడి పరిసరాలను కూడా తన చిత్రాలతో అందంగా మార్చేస్తున్న ఈ ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయురాలు తెలంగాణలోని జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. పద్మ ఉపాధ్యాయురాలే అయినప్పటికీ.. పిల్లలకు బొమ్మల ద్వారా పాఠాలను అర్థం చేయించడంతో పాటు సమాజంలో వివక్షకు గురి అవుతున్న మహిళల సమస్యలపైన కూడా తన కుంచెను ఎక్కుపెట్టారు. ఈమె స్వస్థలం హన్మకొండ. 2008 డీఎస్సీలో తెలుగు పండిట్‌గా ఎంపికై, దేవరుప్పుల మండలం రామరాజుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలో పని చేశారు. తర్వాత సోలిపూర్ పాఠశాలకు వచ్చారు. రైలు బోగీగా తరగతి గది తనకూ టీచరే స్పూర్తి ములుగు జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో డ్రాయింగ్ టీచర్ గీసే చిత్రాలను పద్మను ఆకర్షించాయి. అప్పటి నుంచి పై చదువుల్లో నిమగ్నం అయినప్పటికీ తనకు ఇష్టమైన చిత్రకళను సాధన చేస్తూ వచ్చారు. తనే టీచర్ అయ్యాక.. పాఠాలకు బొమ్మల రూపం ఇచ్చి పిల్లలకు ఆసక్తి కలిగేలా విద్యాబోధన చేస్తున్నారు. అందుకోసం సొంత డబ్బులను పెట్టి రంగులు కొంటున్నారు. స్కూల్ టైమ్ పూర్తయ్యాక, ఆదివారాలు.. గోడలపై చిత్రాలు వేయడానికి తన సమయాన్ని కేటాయించుకున్నారు. పాఠశాల గదులు, ప్రహరీ గోడలపై పద్మ వేస్తున్న పెయింటింగ్స్ పిల్లల్లే కాదు, పెద్దల్నీ ఆకర్షిస్తున్నాయి. ఆలోచింపజేస్తున్నాయి. బోధించడానికి, పిల్లలు అర్ధం చేసుకోవడానికి కష్టంగా ఉండే అంశాలను చిత్రాల రూపంలో గీయడానికి ఆమె చాలానే కష్టపడతారు. తెలుగు వ్యాకరణం, ప్రపంచపటం, సూర్య కుటుంబం, రైలుబండి, హరితహారం, పల్లె అందాలు.. ప్రతి చిత్రం వెనుక పద్మ కష్టం, సృజనాత్మకత ఉంటాయి. మొత్తానికి ఈ చిత్రాలతో ఇప్పుడు ఆ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. సామాజిక స్పృహ మరోవైపు తన కలం ద్వారా సమాజంలోని రుగ్మతలపైన కూడా తన గళం వినిపిస్తున్నారు పద్మ. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్షపై తరచు కవితలు రాస్తుంటారు. బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందిస్తారు. ప్రత్యక్షంగా సామాజిక సేవ కూడా చేస్తుంటారు. స్టీల్ పాత్రలను, పాత బట్టలను సేకరించి వాటిని పాఠశాలలోని నిరుపేద, అనాథ పిల్లలకు అందిస్తుంటారు. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందిన పద్మ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు, సావిత్రి భాయి పూలే రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు.– ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామఫొటోలు: బైరి శ్రీకాంత్ -
బడికి పోయినా బతికెటోళ్లు
-
బడికి పోయినా బతికెటోళ్లు
సాక్షి, బచ్చన్నపేట : బడికి వెళ్లి ఉంటే ఆ ఇద్దరు బాలురు బతికి ఉండేవారు.. ఒకే పాఠశాలలో చదువుతున్న రెండో తరగతి బాలురు ఆడుకోవడానికి సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగిన సంఘటన జనగామ జిల్లా మండలం పోచన్నపేట గ్రామంలో చోటుసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. పోచన్నపేటకు చెందిన బేడ బుడిగ జంగాల కాలనీకి చెందిన నూనె ఎల్లమ్మ–మదార్ పెద్దకుమారుడు జక్కరయ్య(7)తో పాటు అదే కాలనీకి చెందిన కడకంచి లక్ష్మీ–సారయ్య దంపతుల పెద్ద కుమారుడు పాలయ్య(7) స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నారు. ఇద్దరు మంచి స్నేహితులు. శనివారం పాఠశాలకు వెళ్లకుండా కాలనీ పక్కనే ఉన్న చెరువు వద్దకు ఆడుకోవడానికి వెళ్లారు. చెరువులో మిషన్‌భగీరథ పనుల్లో భాగంగా జేసీబీతో పెద్ద గుంతలను తీశారు. సమీపంలో ఆడుకుంటున్న పిల్లలిద్దరూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. నీట మునుగుతున్న క్రమంలో పిల్లలను కేకలు వేయడంతో సిద్ధులు అనే స్థానిక వ్యక్తి గమనించి అక్కడకి చేరుకుని పిల్లలను బయటకు తీసేసరికే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. మృతి చెందిన బాలుడు పాలయ్య తల్లిదండ్రులు మృతి చెందడంతో అమ్మమ్మ గువ్వల ఎల్లమ్మ పోషిస్తోంది. ‘అమ్మ నాయిన లేకపోయినా కంటికి రెప్పలా కాపాడుకుంటాన.. బడికి పోయి ఉంటే నా మనవడు బతికెటోడు’.. అంటై ఎల్లమ్మ గుండెలు పగిలేలా రోదిస్తున్న దీరు ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది. రెండో శనివారం పాఠశాలలకు సెలవు.. అయితే ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రకటించిన సెలవుల నేపథ్యంలో రెండో శనివారాలు ప్రభుత్వ పాఠశాలలకు పనిదినాలుగా సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు శనివారం స్కూల్ తెరిచే ఉంది. అయితే ఇద్దరు చిన్నారులు వెళ్లలేదు. -
కేజీతండా వాసికి అరుదైన అవకాశం
జఫర్‌గఢ్: జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం రేగడి తండా శివారు ఖాజనగండి (కేజీ తండా)కు చెందిన లకావత్ బాలాజీకి లండన్‌లోని మాన్చెస్టర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే అరుదైన అవకాశం లభించింది. మిట్యనాయక్, సత్తమ్మ దంపతుల నాలుగో కుమారుడు బాలాజి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నతనం నుంచే చదువుపై ఆసక్తి పెంచుకున్నాడు. ప్రాథమిక విద్యను జఫర్‌గఢ్‌లో, అలాగే 8, 9, 10వ తరగతులను ఆలేరులోని ఎస్టీ హాస్టల్ ఉండి పూర్తి చేశాడు. పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ సాధించి హైదరాబాద్‌లోని అరబిందో జూనియర్ కళాశాలలో ఉచిత ప్రవేశం పొందాడు. ఇంటర్ అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఐదేళ్ల పాటు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పూర్తి చేశాడు. తర్వాత లండన్‌లోని కార్డి యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తయిన తర్వాత మాన్చెస్టర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించాడు. మారుమూల ప్రాంతానికి చెందిన బాలాజీ లండన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించడంపై కుటుంబ సభ్యులతో పాటు తండావాసులు హర్షం వ్యక్తం చేశారు. -
యూ ట్యూబ్ చూసి.. నేరాలకు దిగి
సాక్షి, జనగామ: శాస్త్ర సాంకేతిక రంగాల విస్తృత అభివృద్ధి కారణంగా ప్రపంచమే ఓ కుగ్రామంగా మారింది. కంప్యూటర్, సెల్‌ఫోన్, ఇంటర్నెట్ కారణంగా విశ్వవ్యాప్తంగా ఉన్న విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అరచేతిలోనే సమస్త సమాచారం దర్శనమిస్తోంది. అనేక విషయాలను కళ్ల ముందరనే నిలుపుతున్నాయి. తెలియని విషయాలను తెలుసుకోవడానికి నిత్యసాధనంగా మారాయి. సకల సమస్త సమాచార గని మారిన మాట వాస్తవమే అయినప్పటికీ కొందరిలో మాత్రం నేర ప్రవృత్తికి బీజం వేస్తున్నాయి. తమకు కావాలి్సన సమాచారాన్ని అందిస్తుండడంతో నేరస్తులుగా మారిపోతున్నారు. యూట్యూబ్‌లో లభ్యమయ్యే సమాచారాన్ని సాధనంగా ఎంచుకొని తప్పుడు పనులకు వినియోగిస్తున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో నేరాలకు పాల్పడుతూ పోలీసులకు దొరికిపోయి నిందితులుగా మారుతున్నారు. ఈ ఏడాది జవరిలో ఒక ఘటన జరగగా తాజాగా మరో ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారుతోంది. నాటు తుపాకీతో దారి దోపిడీ.. ఈ ఏడాది ప్రారంభంలో నాటు తుపాకీతో కొందరు దారిదోపిడీకి పాల్పడడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. జనవరి 15వ తేదీ సంక్రాంతి పండుగ రోజున రాత్రి జిల్లాలోని కొడకండ్ల మండలంలో దారి దోపిడి ఘటన చోటు చేసుకుంది. కొడకండ్ల మండలంలోని మొండ్రాయి గ్రామంలో వైన్స్ షాపు నిర్వహకులు రాత్రి బైక్‌పై ఇంటికి పోతుండగా కొడకండ్ల క్రాస్ రోడ్డు సమీపంలోని రామన్నగూడెం సమీపంలో దారి కాచిన వ్యక్తులు గాలిలోకి కాల్పులు జరిపారు. వారి వద్ద నుంచి రూ.6.70 లక్షల నగదును ఎత్తుకుపోయారు. ఈ ఘటనకు పాల్పడిన ఇస్లావత్ శంకర్, నారబోయిన మల్లేశ్, గంగాపురం స్వామి, పిట్టల శ్రీనివాస్‌లు యూట్యూబ్‌లో చూసి నాటు తుపాకులను తయారు చేశారు. అంతేకాకుండా తూటాలను సైతం తయారు చేసి దోపిడీకి పాల్పడి పోలీసులకు చిక్కారు. మావోయిస్టులుగా అవతారం ఎత్తి.. యూట్యూబ్‌లో వచ్చే మాజీ మావోయిస్టుల ఇంటర్వూ్యలను చూసి జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మావోయిస్టులుగా అవతారమెత్తి పోలీసులకు చిక్కారు. జనగామకు చెందిన మోరె భాస్కర్, నిమ్మల ప్రభాకర్ తరచూ ఓ యూట్యూబ్ చానెల్లో ప్రసారమయ్యే మాజీ మావోయిస్టు నేతల ఇంటర్వూ్యలను చూస్తూ పలువురు వ్యాపారులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. చండ్ర పుల్లారెడ్డి గ్రూపు పేరుతో డబ్బుల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. డబ్బులు కావాలని బెదిరింపులకు పాల్పడడంతో ఈ నెల 14వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. యూట్యూబ్ ప్రభావంతో నేరాలు.. యూట్యూబ్ ప్రభావంతో కొందరు నేరాలకు దిగుతున్నారు. జిల్లాలో జరిగిన రెండు ఘటనలను పరిశీలిస్తే యూట్యూబ్‌లో లభించిన సమాచారం ఆధారంగానే దారి దోపిడీ, బెదిరింపులకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. యూట్యూబ్‌లోని సమాచారాన్ని నిందితులు తప్పుడు పనులకు వినియోగిస్తున్నట్లు ఈ రెండు ఘటనలను బట్టి తెలుస్తోంది. నేర ప్రవృత్తిపై యూట్యూబ్, ఇంటర్నెట్ ప్రభావం చూపుతుంది. విస్తరిస్తున్న నకిలీ నక్సల్స్ కార్యకలాపాలు.. పెరిగిన నిఘా వ్యవస్థ కారణంగా కొంతకాలం నుంచి ప్రశాంత వాతావరణ నెలకొన్నది. సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో కొందరు తప్పుడు పద్ధతులను అనుసరిస్తున్నారు. దొరికిపోతామనే భయం ఏమాత్రం లేకుండా యథేచ్ఛగా దందాలకు పాల్పడుతున్నారు. ఈ సంవత్సరంలోనే నకిలీ నక్సల్స్ ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో మళ్లీ నకిలీ నక్సలైట్ల కార్యకలాపాలు మొదలైనట్లుగా భావిస్తున్నారు. నకిలీల కారణంగా ఇంకా ఇబ్బందులు వస్తాయోననే భయం వెంటాడుతోంది. -
సాయుధ పోరాట యోధురాలు కొన్నె పుల్లమ్మ మృతి
పాలకుర్తి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొ న్న కొన్నె పుల్లమ్మ (95) ఆదివారం మృతి చెందారు. జన గామ జిల్లా పాలకుర్తి మండలం ఎల్లరాయని తొర్రూరుకు చెందిన పుల్లమ్మ భర్త రామయ్య అజ్ఞాత దళ నాయకుడిగా తుపాకీ పట్టి నిజాం సైన్యం, రజాకార్ల ఆగడాలను ఎదిరించారు. పోరాటంలో భర్తతోపాటు పుల్లమ్మ కూడా పాల్గొన్నారు. రెండుసార్లు నిజాం సైన్యం పుల్లమ్మను పట్టుకోవడానికి వెంటపడితే బావిలో దూకి ప్రాణాలు రక్షించుకుని పోరాటాన్ని కొనసాగించారు. చివరి వరకు భారత ప్రభుత్వం సమరయోధులకు అందిస్తున్న పింఛన్ కోసం ఎదు రు చూసినా మంజూరు కాలేదు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పుల్లమ్మ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
విద్యార్థినుల ఆత్మగౌరవ సమస్య
సాక్షి, కాటారం: ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొస్తున్న ప్రభుత్వ పెద్దలు, అధికారుల మాటలు నీటిమూటలుగా మారిపోతున్నాయి. కేజీ టు పీజీ విద్య అమలులో భాగంగా ప్రభుత్వం నూతన భవన నిర్మాణాలకు కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నప్పటికీ గత విద్యా సంస్థల భవనాల్లో నెలకొన్న సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో లక్షల రూపాయలు వెచ్చించి భవనాలు నిర్మించినప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లో మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు, సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. ఆది నుంచి అంతే.. కాటారం మండలంలో 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేసింది. సరైన భవన నిర్మాణం లేకపోవడంతో తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన భవనంలో తరగతుల నిర్వహణ కొనసాగించారు. గత కొన్నాళ్ల పాటు కళాశాల అదే భవనంలో కొనసాగగా పాఠశాలకు తరగతుల కొరత ఏర్పడడంతో భవనం పాఠశాలకు అనివార్యమైంది. దీంతో అదే పాఠశాల భవన సముదాయం ఆవరణలో అప్పటి కాంగ్రెస్ హయాంలో రూ.40లక్షల నక్సల్స్ ప్రభావిత ప్రాంత అభివృద్ది నిధుల(ఐఏపీ) ద్వారా నిర్మించిన భవనంలోకి కళాశాలను మార్చి తరగతులు చేపడుతున్నారు. సివిల్, కోపా, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ లాంటి ట్రేడ్స్ అందుబాటులో ఉండటంతో కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. మారుమూల గ్రామాలకు కళాశాల అందుబాటులో ఉండడంతో విద్యార్థినులు అధిక సంఖ్యలో ప్రవేశం పొందారు. కానీ కళాశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థినులు, మహిళా అధ్యాపకుల ఆగచాట్లు వర్ణనాతీతంగా మారాయి. కళాశాలకు సరైన భవనం నిర్మాణం చేపట్టినప్పటికీ మరుగుదొడ్ల నిర్మాణం మాత్రం లేకపోవడంతో విద్యార్థినులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని పాఠశాలకు సంబంధించిన మరుగుదొడ్లు వినియోగిస్తున్నా కొన్ని సార్లు పాఠశాల తరఫున అభ్యంతరాలు ఎదురవుతున్నట్లు విద్యార్థినులు తెలిపారు. అంతేకాకుండా సెలవు దినాల్లో ఈ పరిస్థితి మరింత అయోమయంగా ఉంటున్నట్లు వారు పేర్కొన్నారు. సెలవు రోజుల్లో పాఠశాల మరుగుదొడ్లకు తాళం వేసి ఉంటుండడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయమైన దుస్థితి ఉంటుందని వాపోయారు. లక్షలు వెచ్చించి భవనాలు నిర్మించినప్పటికీ మరుగుదొడ్లు మాత్రం నిర్మించకపోవడం దారుమని వాపోతున్నారు. ఇంత పెద్ద కళాశాలలో సౌకర్యాలు సరిగా లేకపోవడం శోచనీయం అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్డి నిర్మాణం మహిళల ఆత్మగౌరవ సమస్యగా చెప్పుకొస్తూ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు ప్రభుత్వం సంస్థల్లోనే మరుగుదొడ్ల నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఐటీఐలో మరుగుదొడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు, మహిళా సిబ్బంది కోరుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇదే దుస్థితి.. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సైతం సమస్యలకు నిలయంగా మారింది. పక్కా భవనం ఉన్నప్పటికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి నూతన భవనం నిర్మించారు. మరుగుదొడ్లు వినియోగంలో లేకపోవడంతో విద్యార్థుల సమస్య వర్ణానాతీతంగా మారిపోయింది. ఒంటికి రెంటికి కిలో మీటరు దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటుందని విద్యార్థులు తెలుపుతున్నారు. భవనం నిర్మించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ మరుగుదొడ్ల వాడకంలో రాకపోవడంతో తిప్పలు తప్పడం లేదు. పురాతన షెడ్డు ఆవరణలో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ అవి శిథిలావస్థకు చేరడంతో వినియోగించలేని పరిస్థితి ఉంది. నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లు నీటి సౌకర్యం లేక ఉపయోగంలోకి రావడం లేదు. ఇటీవల పలు విద్యార్థి సంఘాల నాయకులు ఐటీఐ, ప్రభుత్వ కళాశాలలోని అసౌకర్యాలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన స్థానిక ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ప్రజాప్రతినిధులు విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. పరిష్కారానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్తామని హామీ ఇచ్చారు. ఏదేమైనా జిల్లా స్థాయి కళాశాలలు ఈ ప్రాంతంలో ఉన్నప్పటీకీ సౌకర్యాల లేమి వెంటాడుతుండటంతో విద్యా ర్థులు కళాశాలలకు రావడానికి ఆసక్తి చూపడం లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరుగుదొడ్లు లేక ఇబ్బందులు కళాశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాలలో ఉంటాం. అత్యవసర సమయాల్లో మరుగుదొడ్ల అవసరం ఎంతగానో ఉంటుంది. కళాశాలకు వచ్చిందంటే వెళ్లే వరకు మా పరిస్థితి అయోమయంగా నెలకొంటుంది. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. – రమ్య, ఐటీఐ, ప్రథమ సంవత్సరం విద్యార్థిని పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి కళాశాలలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి. ఇంత పెద్ద కళాశాల అయినప్పటికీ తగిన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. మలమూత్ర విసర్జన కోసం మైలు దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మా సమస్యను పట్టించుకునే వారే లేరు. – రాజేశ్, విద్యార్థి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కాటారం -
వికటించిన ఐరన్ మాత్రలు
సాక్షి, జనగామ: జనగామ మండలం చౌడారం మోడల్ పాఠశాల విద్యార్థినులు గురువారం మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఐరన్ మాత్రలు మింగిన విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడగా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. మళ్లీ ఐరన్ మాత్రలు తీసుకున్న విద్యార్థినుల్లో సుమారు 20 మందికి పైగా కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వసతిగృహ నిర్వాహకులు తెల్లవారుజామున ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి ట్యాబెట్లు ఇచ్చి పంపించారు. -
కారుతో ఢీకొట్టి కిడ్నాప్ చేసిన కేసులో వీడిన మిస్టరీ!
సాక్షి, బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట శివారులో ఈనెల 5న దంపతులు బైక్‌పై వెళ్తుండగా కారుతో ఢీకొట్టి భార్యను కిడ్నాప్ చేసిన సంఘటనలో నలుగురు నిందితులను పట్టుకున్నట్లు జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్, నర్మెట సీఐ సంతోష్‌కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పారుపెల్లికి చెందిన బండ తిరుపతి– భాగ్యలక్ష్మి దంపతులకు 20 ఏళ్ల క్రితం వివాహమైనది. భాగ్యలక్ష్మికి అన్నదమ్ములు లేక పోవడంతో తిరుపతి ఇళ్లరికం వెళ్లాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న వీరికి ఒక పాప ఉంది. భాగ్యలక్ష్మి తండ్రి ఆర్ఎంపీగా సేవలందిస్తున్నాడు. ఆయన వద్దకు పక్క గ్రామమైన బొందుగులకు చెందిన మరో ఆర్ఎంపీ పుట్ట బాల్‌నర్సయ్య వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో కొంతకాలం నుంచి తిరుపతి భార్యపై అనుమానంతో వేధించసాగాడు. ఈ విషయాన్ని భాగ్యలక్ష్మి బాల్‌నర్సయ్యకు చెప్పడంతో తిరుపతిని ఎలాగైనా అంతమొందించాలని పథకం వేశారు. పక్కా పథకం ప్రకారం.. భాగ్యలక్ష్మి ప్రియుడు బాల్‌నర్సయ్య మిత్రుడు అమరాజు సిద్ధులు హైదరాబాద్‌లో బీడీఎల్‌లో డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ పథకం గురించి నర్సయ్య సిద్దులుకు మూడు నెలల క్రితం తెలుపగా మహబూబాద్ జిల్లా బయ్యా రం మండలం గంధంపల్లికి చెందిన మల్సూర్, కేసముద్రం మండలానికి చెందిన లక్ష్మీనారాయణతో కలిసి హత్య చేయడానికి ఒప్పుకుంటారు. ఇందుకుగాను రూ.5 లక్షలు సుపారీ మాట్లాడుకోగా బాల్న్సయ్య అడ్వాన్స్‌గా రూ. లక్ష ఇవ్వగా ఆ ముగ్గురు పంచుకున్నారు. ఈ డబ్బుతో హత్యకు అవసరమైన కా>రును సిద్ధులు ఆలేరు పట్టణంలో రూ.17వేలతో కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ఈనెల 5న తిరుపతి, భాగ్యలక్ష్మి జనగామ ఆస్పత్రికి వెళ్లి తిరిగి బైక్‌పై వస్తుండగా పోచన్నపేట శివారులో కారులో వచ్చి ఢీకొట్టా రు. ఈ ఘటనలో గాయపడిన తిరుపతిని పొల్లోకి లాక్కెళ్లి జే వైరుతో ఉరిపెట్టారు. ఆ సమయంలో గొర్లకాపర్లు రావడంతో గాయపడిన భాగ్యలక్ష్మిని కారులో తీసుకుని పోచన్నపేటకు వెళ్లారు. అక్కడి నుంచి బాల్‌నర్సయ్య భాగ్యలక్ష్మి జనగామకు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. అయితే సంఘటన స్థలంలో అపస్మారకస్థితిలోకి వెళ్లిన తిరుపతిని అటుగా వచ్చిన వారు గమనించి 108లో జనగామ ఆస్పత్రికి తరలించారు. ఏసీపీ వినోద్‌కుమార్, సీఐ మల్లేష్, ఎస్సై రంజిత్‌రావు వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నలుగురు అరెస్టు స్వాధీనం చేసుకున్న వాహనం వద్ద డీసీపీ, ఏసీపీ పోలీసులు; మాట్లాడుతున్న జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి దర్యాప్తులో భాగంగా నర్మెట సీఐ సంతోష్‌కుమార్ ఆదేశాలతో ఎస్సై రంజిత్‌రావు, ప్రొహిబిషన్ ఎస్సై ప్రశాంత్ బొందుగుల గ్రామంలోని ఇంట్లో బాల్నర్సయ్యతో సహా అతడికి సహకరించిన సిద్ధులు, లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశా రు. విచారణ చేపట్టగా హత్యాయత్నం ఘటనలో భాగ్యలక్ష్మి పాత్ర ఉందని తేలడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి మ న్సూర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి కారు, రూ.30,430 నగదు, బైక్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. హత్యాయత్నం కేసులు రెండు రోజుల్లోనే ఛేదించిన ఎస్సైలు రంజిత్‌రావు, ప్రశాంత్‌లను డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్, సీఐ సంతోష్‌కుమార్ అభినందించారు. -
భర్త గొంతు నులిమి భార్యను కిడ్నాప్ చేశారు..
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండ లం పోచన్నపేట శివారులో శనివారం భార్యాభర్తలు బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి భార్యను కిడ్నాప్ చేశారు. భర్త బండ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా పారుపెల్లి గ్రామానికి చెందిన బండ తిరుపతి భార్య భాగ్యలక్షి్మకి ఇటీవల ఆరోగ్యం బాగోలేకపోవడంతో జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయిం చుకుంది. ఇలా భాగ్యలక్ష్మి వారం రోజులుగా ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో శనివారం ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా జనగామ జిల్లా పెద్దరామన్‌చర్ల శివారులో వెనక నుంచి వచి్చన కారు వాళ్ల బైక్‌ను ఢీకొట్టింది. వారిద్దరికీ గాయాలు కాగా.. ఢీకొట్టిన కారులోని వ్యక్తులు వారిని కారులో ఎక్కించుకున్నారు. ఈ క్రమంలో తిరుపతి గొంతును నులమడంతో స్పృహ కోల్పో గా చనిపోయాడని నిర్ధారించుకున్న దుండగులు బచ్చన్నపేట మండలం పోచన్నపేట శివారులో తిరుపతిని కారు నుంచి తోసేసి భాగ్యలక్షి్మని కిడ్నా‹ ప్ చేసి తీసుకెళ్లారు. గమనించిన చుట్టు పక్క ల రైతులు గాయపడిన తిరుపతిని 108 వాహనంలో జనగామ ఏరియా ఆçస్పత్రికి తరలించారు. బాధి తుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్‌రావు తెలిపారు. దుండగులు కారు నుంచి తిరుపతిని తోసేయగా.. ఏమి జరుగుతుందో అని పలువురు ఆ కారు ఫొటోలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. కారు రాజపేట మండలం బొందుగుల గ్రామానికి చెందినదని, కిడ్నాప్‌కు గురైన భాగ్యలక్ష్మి రాత్రి వేళ ఇంటికి చేరుకున్నట్లు సమాచారం. -
రోడ్డు ప్రమాదం.. పాపం చిన్నారి..
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ములుగు జిల్లా ములుగు మండలం మహమ్మద్ గౌస్ పల్లి సమీపంలో కారు-అంబులెన్స్ ఢీకొన్న దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా వచ్చిన కారు(ఏపీ 20ఏయూ 2198) అదుపుతప్పి ముందున్న మరో కారును ఢీకొట్టి ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ను గుద్దుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఎనిమిది నెలల పసికందు ఉంది. సీటు మధ్యలో ఇర్కుపోయి చిన్నారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కంటతడి పెట్టించింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో వాజేడు వెంకటపూర్‌కు చెందిన బానోతు సోనాల్, అతని భార్య రజిత, వీరి చిన్న పాప, మరో వ్యక్తి మృతి చెందారు. వీరు కారులో వెంకటపూర్ నుండి హైదరాబాద్‌కు వెళుతున్న క్రమంలో మొదట వరంగల్ నుండి ములుగు వెళుతున్న తిరుపతి రెడ్డి కారును ఢీకొట్టి తర్వాత ఎదురుగా వస్తున్న పోలీస్ అంబులెన్స్ వ్యాన్‌ను గుద్దుకుంది. ప్రమాద సమయంలో చిన్నారితో సహా కారులో ఏడుగురు ఉన్నారు. వీరిలో పాపతో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి వద్ద రెండు కార్లు ఢీకొన్న మరో ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు వెల్లడి కావాల్సివుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు, క్షతగాత్రులు జనగామ ప్రాంత వాసులుగా గుర్తించారు. పెద్దామడుర్ వాసి కృష్ణ, జనగామకు చెందిన మందిప్, సోమా నర్సయ్య ప్రాణాలు కోల్పోయారు. పెద్దమడుర్ గ్రామానికి చెందిన వారు పండుగ షాపింగ్ కోసం జనగామకు వెళ్తుండగా, మరో కారులోని వారు బర్త్ డే పార్టీ కోసం దేవురుప్పుల వైపు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. -
బీజేపీకి చెక్ పెట్టేందుకే టీఆర్ఎస్కు మద్దతు
సాక్షి, జనగామ: తెలంగాణలోపాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీకి చెక్‌పెట్టేందుకే హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావు అన్నారు. బుధవారం పట్టణంలోని గబ్బెట్ట గోపాల్‌రెడ్డి భవన్లో నిర్వహించిన విలేకరుల సమాశంలో ఆయన స్పష్టం చేశారు. బీజేపీని ఎదురుకునే శక్తి కాంగ్రెస్‌కు లేదని ఆయన అన్నారు. ఈ ఒక్క ఎన్నికల్లోనే టీఆర్ఎస్కు మద్దతు ఇస్తామని, ప్రజా సమస్యల విషయంలో టీఆర్ఎస్తో ఎలాంటి రాజీ లేదని, ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఆర్టీసీ సమ్మెను విరమించేందుకు ముఖ్యమత్రి చొరవ చూపాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. సీపీఐ సంస్తాగత నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు డిసెంబర్ 21, 22 తేదీల్లో మంచిర్యాలలో మహాసభలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, బర్ల శ్రీరాములు, పాతూరి సుగుణమ్మ, ఆది సాయన్న, వెంకన్న,నిర్మల తదతరులు పాల్గొన్నారు. -
ఎవరిదో దత్తత అదృష్టం
సాక్షి, జనగామ: ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో సమస్త గ్రామాలు..సకల జనులు ఒక ఉద్యమంలాగా స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. తమ ఇంటి నుంచే కాకుండా గ్రామస్తులకు ఉపయోగపడే పనుల్లో పాలు పంచుకున్నారు. ప్రజాప్రతినిధులు.. ప్రత్యేక అధికారులు.. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామంలో ఉండే ప్రతిఒక్కరూ తమకు తాముగా ముందుకొచ్చి గ్రామ అభివృద్ధి యజ్ఞంలో పా ల్గొని స్ఫూర్తి నింపారు. ఏ పల్లెకు ఆ పల్లె పనులు చేపట్టి భేష్ అనిపించుకున్నారు. కానీ జిల్లాలో దత్తత అదృష్టం ఏ గ్రామం తలుపు తట్టనుందో. ప్రభుత్వ దత్తత అవకాశం ఏ గ్రామానికి దక్కుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ప్రభుత్వం గ్రామాల్లో మార్పు తీసుకురావడం కోసం 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ పనులను చేపడుతోంది. 30 రోజుల ప్రత్యేక పనులను సక్రమంగా నిర్వహించే గ్రామాలను ప్రభుత్వం దత్తత తీసుకుంటుంది. నిధులను ఇచ్చి అభివృద్ధి చేస్తుంది’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సెప్టెంబర్ నాలుగో తేదీన జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజాప్రతినిధులు, అధికారుల అవగాహన సదస్సులో స్పష్టంచేశారు. పనులు ముగింపు దశకు చేరుకోవడంతో ప్రభుత్వ దత్తతకు ఎంపికయ్యే ఏ గ్రామ పంచాయతీ అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తనిఖీ అధికారుల టీం ఇదే.. జిల్లాలో కొనసాగుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ పనులను పరిశీలించడానికి 12 మంది అధికారులతో కూడిన తనిఖీ టీంను నియమించారు. ఒక్కొక్క మండలానికి జిల్లా స్థాయి అధికారిని ఒక్కరి చొప్పున నియమించారు. జనగామ మండలానికి విశ్వ ప్రసాద్ (కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్), బచ్చన్నపేట మండలానికి టీవీఆర్ మూర్తి (కలెక్టరేట్ సూపరింటెండెంట్), లింగాలఘనపురం మండలానికి మన్సూరీ(కలెక్టరేట్ సూపరింటెండెంట్), దేవరుప్పుల మండలానికి వీరస్వామి (కలెక్టరేట్ సూపరింటెండెంట్), తరిగొప్పుల మండలానికి రవికిరణ్ (డిప్యూటీ తహసీల్దార్), రఘునాథపల్లి మండలానికి అబ్దుల్ (డీఏఓ ఆర్డీఓ కార్యాలయం), స్టేషన్ ఘన్పూర్ మండలానికి సలీమ్ (తహసీల్దార్), చిల్పూర్ మండలానికి శంకర్ (డిప్యూటీ తహసీల్దార్), పాలకుర్తి మండలానికి వంశీ (కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్), జఫర్‌గఢ్ మండలానికి షకీర్ (ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్), కొడకండ్ల మండలానికి రాజు (ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్)లను నియమించారు. ఈ టీం అధికారులు ఇప్పటి వరకు గ్రామాల్లో జరిగిన 30 రోజుల పనుల వివరాలను సేకరిస్తారు. నేరుగా గ్రామానికి వెళ్లి గ్రామస్తులతోనే మాట్లాడి పనుల అమలుపై ఆరా తీస్తారు. జిల్లాలోని ప్రతీ గ్రామాన్ని సందర్శించి పనుల, ఆయా పంచాయతీల్లో తయారు చేసిన నివేదికలను పరిశీలిస్తారు. మరో 4 రోజులే.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ పనులు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నాయి. సెప్టెంబర్ ఆరో తేదీన ప్రారంభమైన పనులు ఈ నెల ఆరో తేదీతో ముగియనున్నాయి. జిల్లాలోని 12 మండలాల్లోని 281 గ్రామ పంచాయతీల్లో పనులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, శ్రమదానాలు, కరెంటు స్తంభాల ఏర్పాటు, దోమల నివారణ చర్యలు, శిధిలావస్థకు చేరిన భవనాల కూల్చివేత, నిరుపయోగంగా ఉన్న బావులు, బోరు బావుల పూడ్చివేత వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంటికి ఆరు మొక్కల చొప్పున నాటడంతో పాటుగా శ్రమదానాలు నిర్వహిస్తున్నారు. స్పెషలాఫీసర్లు గ్రామాల్లో పల్లె నిద్ర సైతం చేశారు. ప్రత్యేక పనులు ముగింపు దశకు చేరడంతో మిగిలిపోయిన పనులు పూర్తిస్థాయిలో చేపట్టడానికి అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. -
మొబైల్ యాప్‌తో 'జనగణన'
సాక్షి, జనగామ: కేంద్ర ప్రభుత్వం పేపర్ పద్ధతికి స్వస్తిచెప్పి ఈ సారి మొబైల్ యాప్ తో జనాభా లెక్కలు చేపట్టనుంది. ప్రయోగాత్మకంగా మూడు రాష్ట్రాలను ఎంపిక చేయగా జనగామ జిల్లా ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. ఇందుకోసం అవసరమైన సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్)ల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో మీ సేవా, ఈ సేవా కేంద్రాల మాదిరిగానే ఈ కేంద్రాలు పని చేయనున్నాయి. జిల్లాకు ఒక డీసీ (జిల్లా కోఆర్డినేటర్)ని అదే విధంగా ప్రతి గ్రామానికి ఒక వీఎల్ఈ (విలేజ్ లెవల్ ఎన్యుమరేటర్స్)లను కూడా ఇప్పటికే ఎంపిక చేసింది. ఎంపిక చేసిన వారందరికీ గత వారం జిల్లా కేంద్రంలో శిక్షణ కూడా ఇచ్చారు. పదేళ్లకొకసారి దేశంలో జనగణన చేస్తారు. 2001లో జనాభా సర్వే చేశాక మళ్లీ చేయలేదు. కాగితాలను ఉపయోగించి సర్వేను గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల చేత చేయించేవారు. ఈ సారి పేపర్ పద్ధతికి స్వస్తి పలికి ప్రత్యేక యాప్ సాయంతో ఈ సర్వే చేయనున్నారు. ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సర్వే ప్రయోగాత్మకంగా ప్రారంభించగా కొనసాగుతుంది. తెలం గాణలో ఈ సర్వేను ఇప్పటికే ప్రారంభించా ల్సి ఉండగా ఈ డిజిటల్ పద్ధతిలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వాటిని సవరించి చర్యలు చేపట్టవచ్చునని భావించి పూర్తిగా అధ్యయనం చేశాకే వచ్చే నెల నుండి దీన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ఎలా చేస్తారు.. సర్వే కోసం జిల్లా స్థాయిలో ఒక కోఆర్డినేటర్‌ను,క్షేత్ర స్థాయిలో డోర్ టు డోర్ వెళ్లి వివరాలు సేకరించేందుకు 281 మంది వీఎల్‌ఈలను నియమించారు. వీఎల్‌ఈలందరికీ ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. జనగామ జిల్లాను పైలెట్ జిల్లాగా ఎంపిక చేశారు. జిల్లాలో మొత్తం 1,20 లక్షల కుటుంబాలు శిక్షణ పొందిన ఎన్యుమరేటర్లు గ్రామాలకు వెళ్లి ట్యాబ్‌ల ద్వారా కుటుంబాల వారీగా వివరాలు సేకరించి ప్రత్యేక యాప్‌లోభద్రపరుస్తారు. ఒక్కో గృహ సర్వేకు రూ.మూడు , వాణిజ్య సర్వేకు రూ.4.50 చొప్పున రెమ్యునరేషన్ చెల్లిస్తారు. -
కుమారుడిని లండన్ పంపించి వస్తూ...
దేవరుప్పుల : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం సమీపాన జనగామ–సూర్యాపేట రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును డీసీఎం ఢీకొట్టిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా కొత్తబజార్‌కు చెందిన పెనుగొండ సదాశివుడు కుమారుడు సాయిశంకర్ ఎంబీఏ చదివేందుకు లండన్ వెళ్తున్నాడు. సదాశివుడు, ఆయన భార్య మంజూష, ఆయన తమ్ము డు, మరదలు గణేశ్ (52), సుకన్య (42), ఇంకో తమ్ముడైన పూర్ణచందర్ భార్య శ్రీలత (35)లతో పాటు సాయిశంకర్, మిగతా తమ్ముళ్ల పిల్లలు హైదరాబాద్ వెళ్లారు. గురువారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సాయిశంకర్‌ను విమానం ఎక్కించారు. ఆ తర్వాత కొందరు హైదరాబాద్‌లోనే ఆగిపోయారు. కొందరు వరంగల్.. ఇంకొకరు మానుకోట శంషాబాద్‌లో సాయిశంకర్‌ను విమానం ఎక్కించాక సదాశివుడు తన తమ్ముడు గణేశ్ కూతురు గాయత్రి, మరో తమ్ముడు పూర్ణచందర్ కూతురు ప్రవీణను వరంగల్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో దింపేందుకు కారులో బయలుదేరారు. సదాశివు డు భార్య మంజూష, గణేష్, ఆయన భార్య సుకన్య, పూర్ణచందర్ భార్య శ్రీలత ఇంకో కారులో దేవరుప్పుల మండల కేంద్రం మీదుగా మహబూబాబాద్ బయలుదేరారు. సూర్యాపేట వైపు నుంచి వస్తున్న డీసీఎం (ఏపీ 05 టీఎల్ 1369) డ్రైవర్ అతివేగంగా లారీని ఓవర్టేక్ చేసి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో గణేష్, సుకన్య, కారు డ్రైవర్ నజీర్ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీలత, మంజూష గాయపడ్డారు. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శ్రీలత మృత్యువాతపడ్డారు. మంజూషను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమా దం అనంతరం డీసీఎం డ్రైవర్ లొంగిపోయినట్లు సమాచారం. ఈ వార్త తెలియడంతో సాయిశంకర్ అబుదాబినుంచి స్వస్థలానికి బయలుదేరాడు. సాయిశంకర్ స్వగ్రామానికి చేరుకున్నాక అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, జనగామ : జిల్లాలోని దేవరుప్పుల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వేగంగా వెళుతున్న డీసీఎం వ్యాను, కారు ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు మహబూబాబాద్‌కు చెందిన వ్యాపారి పెనుగొండ గణేష్, సుకన్య ,మహమ్మద్ నజీర్(కారు డ్రైవర్)గా గుర్తించారు. మంజుల, శ్రీలతకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. -
పట్టా.. పరేషాన్
సాక్షి, జనగామ: రైతులను పట్టాదారు పాస్‌బుక్కులు పరేషాన్ చేస్తున్నాయి. చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని రైతుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి అవినీతి అధికారులు ప్రయత్నిస్తుండడంతో ఇక్కట్లు తప్పడం లేదు. అర్హత ఉన్నప్పటికీ పట్టాలు మాత్రం అందించడం లేదు. పట్టాదారు పాస్ బుక్కులు రాక పోవడంతో నిత్యం కార్యాలయాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. పట్టాలు చేతికి రాకపోవడంతో ప్రభుత్వపరంగా రైతులకు అందాల్సిన సౌకర్యాలు రాక పోవడంతో అరిగోస పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 12మండల్లాల్లో 5,62,573 ఎకరాల భూ విస్తీర్ణం ఉంది. అందులో 3,42,635 ఎకరాల సాగు భూమి ఉంది. 193 రెవెన్యూ గ్రామాల్లో 1,50,847 సర్వే నంబర్లలో భూమి విస్తీర్ణం విస్తరించి ఉంది. బచ్చన్నపేట: పై ఫొటోలో కనిపిస్తున్న మహిళా రైతు బచ్చన్నపేట మండలం ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన కాకల్ల పద్మ. 2011 సంవత్సరంలో తన భర్త (బాలయ్య) చనిపోగా పద్మ మామ అయిన కాకల్ల సాయిలు పేరు మీద ఉన్న నాలుగు ఎకరాల భూమిని తన ముగ్గురు కుమారుల పేరున 2017 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయించాడు. ఒక్కొక్కరికి 1.14 ఎకరాల చొప్పున పట్టేదార్ పాస్ పుస్తకాలు కూడా వచ్చాయి. కానీ ఇంత వరకు రైతుబంధు, ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు రావడం లేదు. ఇదేమిటని వ్యవసాయ అధికారులను అడిగితే రికార్డులు సరిగా చేయలేదని, అందుకే డబ్బులు రావడం లేదని అంటున్నారు. వ్యవసాయ కార్యాలయానికి వెళితే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లమని, అక్కడకు వెళితే ఇక్కడకు వెళ్లమని తిప్పించుకుంటున్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఈ సమస్య ఒక్క పద్మదే కాదు జిల్లాలోని పలువురి రైతుల పరిస్థితి ఇలానే ఉంది. తప్పని తిప్పలు.. పట్టాదారు పాసుబుక్కుల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. 2017, సెప్టెంబర్ 17వ తేదీ జిల్లాలో భూ ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా 1,50,847 సర్వే నంబర్లను పరిశీలన చేశారు. ఇప్పటి వరకు 1,45,993 పట్టాదారు పాసు పుస్తకాలను అందించారు. 4,854 పట్టాదారు పాసు పుస్తకాలను పార్ట్–బీలో పెట్టారు. పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాల కోసం రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వసూళ్ల దందా.. పట్టాదారు పాసుబుక్కులను రైతులకు ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు బహిరంగంగానే డబ్బులను డిమాండ్ చేస్తున్నారు. పట్టాదారు పాసుబుక్కులను తీసుకోవడానికి సాదాబైమానా పత్రాలను అనుమతి ఇచ్చింది. దీంతో క్షేత్రస్థాయిలోని వీఆర్ఓలు చేతివాటానికి తెరతీశారు. పట్టాదారు పాసుబుక్కుల కోసం మీ సేవలో మ్యూటేషన్ చేసిన రైతులకు కేవలం 45 రోజుల్లో పట్టాను అందించాల్సి ఉంది. కాని విచారణ పేరుతో రెవెన్యూ అధికారులు తమకు డబ్బులు కావాలని కాలయాపన చేస్తున్నారు. ఎకరానికి రూ.10 నుంచి రూ. 20వేల వరకు తీసుకుంటున్నారు. వ్యవసాయ భూములకు ధరలు పెరగడంతో అధికారులు సైతం ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు. ఎక్కువ ధర ఉన్న భూమలకు మరింత ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అధికారులు అడిగినంత ముట్టచెప్పినప్పటికీ పట్టాలు మాత్రం చేతికి అంతక ఇక్కట్లు పడుతున్నారు. పథకాలకు దూరం... పట్టాదారు పాసుబుక్కులు రాకపోవడంతో రైతులు ప్రభుత్వ పథకాలను అందుకోలేక పోతున్నారు. రైతుబంధు, రైతుబీమా, కిసాన్ యోజన వంటి పథకాలకు అర్హులు కాలేక పోతున్నారు. ప్రభుత్వ పథకాలకు నోచుకోక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు భూములు ఉన్నప్పటికీ పట్టాదారు పాసుబుక్కులు లేని కారణంగా ప్రభుత్వ పథకాలకు అర్హులు కాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. రెండేళ్లుగా తిరుగుతున్నా.. మా అమ్మ లచ్చవ్వ పేరు మీద ఉన్న బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామ శివారులో ఏడు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని నా కుమారుడి పేరుమీద పట్టా చేయాలని వీఆర్ఓను సంప్రదించాను. దీనికి ఆయన కొంత డబ్బులు అవసరమని తెలపడంతో అడిగిన డబ్బులు ఇచ్చా. నా పనిని గత రెండేళ్లుగా పెండింగ్‌లో పెట్టాడు. రైతుబంధు, కిసాన్ యోజన డబ్బులు ఇంత వరకు రాలేదు. రైతు బీమా బాండ్లు కూడా రాలేదు. ఏ అధికారికి చెప్పినా సమస్యను పట్టించుకోవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.– గొడుగు సిద్ధిరాములు, రైతు తిప్పుకుంటున్నారు.. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండ గ్రామ శివారులో దాదాపు 40 ఏళ్ల క్రితం రెండు ఎకరాల భూమి కొనుగోలు చేశాం. అప్పటి నుంచి సదరు భూమిలో మేమే కాస్తులో ఉన్నాం. పట్టాదారు పాసుపుస్తకం కోసం తిరుగుతున్నా.. ఇంతవరకు అధికారులు స్పందించడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, బ్యాంకులో అందించే క్రాప్లోన్లు రావడం లేదు. రెవెన్యూ రికార్డులో తప్పుగా మరొకరి పేరు ఉండటంతో రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడం లేదు. దీంతో ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. అధికారులు స్పందించి విచారణ చేపట్టి పట్టాదారు పుస్తకం అందించి ఆదుకోవాలి.– నీల ఇంద్రమ్మ, శివునిపల్లి వీఆర్వోలు మారిన పట్టా రాలేదు.. పట్టాదారు పాసుబుక్ కోసం తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. 1బీ పహణీలో వస్తున్నది. ఫొటో తప్పుగా వచ్చింది. తప్పుగా వచ్చిన ఫొటోను సరిగా చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. ఇప్పటికీ ఇద్దరు వీఆర్వోలు మారిన కొత్త పట్టా పాస్‌బుక్ రాలేదు.– అనపర్తి చంద్రయ్య, వావిలాల రైతు -
సెల్‌ఫోన్ కొనివ్వలేదని..
సాక్షి, జనగాం: సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. నర్మెట్ట మండలం హన్మంతపూర్ గ్రామానికి చెందిన పోతాని ప్రశాంత్ డిగ్రి పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉండి వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో సెల్‌ఫోన్ కొనివ్వాల్సిందిగా తండ్రిని కోరాడు. అందుకు తండ్రి అంగీకరించకపోవడంతో మనస్థాపానికి గురైన ప్రశాంత్ శుక్రవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రశాంత్‌ను గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతన్ని స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రశాంత్ మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త, తండ్రి అందరి పేరు తెలంగాణే..!
సాక్షి, జనగామ: జనగామ మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫొటో ఓటరు జాబితాలో అనేక తప్పులు చోటు చేసుకుంటున్నాయి. కులాల గుర్తింపులో పొరపాట్లు చేసిన అధికారులు.. తండ్రి, భర్తల పేర్లు మార్చేసి మరో అడుగు ముందుకు వేశారు. ఓటరు జాబితాల్లో చోటుచేసుకున్న తప్పిదాలు.. సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి. ఈ నెల 16న తుది ఓటరు జాబితా ప్రకటించగా.. ఒక్కొక్కటిగా తప్పులు వెలుగు చూస్తున్నాయి. 10వ వార్డుకు చెందిన రేఖ పేరు పక్కన తండ్రికి బదులుగా భర్త అని ముద్రించి.. తెలంగాణగా నమోదు చేశారు. ఆమె తల్లి మీరాబాయి.. భర్త పేరుకు బదులుగా తెలంగాణ, ఆమె భర్త సోనాబీర్ తండ్రికి బదులుగా తెలంగాణ అని ముద్రించారు. ఇంటిల్లిపాదికి ‘తెలంగాణ’పదాన్ని ఇచ్చేశారు. వార్డుల వారీగా ఓటరు సర్వేతో పాటు ఫొటో ఐడెంటిఫికేషన్ సమయంలో.. క్షేత్రస్థాయిలో పనిచేయక పోవడంతోనే తప్పిదాలకు ఆస్కారం కలిగిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కులాల మార్పిడి దుమారం రేపుతోంది. ఓసీలను బీసీగా.. బీసీలను ఎస్సీలుగా అక్కడక్కడా మార్చడంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. 3వ వార్డుకు చెందిన ఓసీ కులానికి చెందిన దొంతుల భిక్షపతి కుటుంబాన్ని బీసీగా, బీసీ కులానికి చెందిన వారిని ఓసీగా మార్చడంతో గురువారం పురపాలక సంఘ కార్యాలయానికి వెళ్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓసీ నుంచి బీసీకి మార్చడంతో.. తమకు అదే సర్టిఫికెట్ ఇవ్వాలని భిక్షపతి కుటుంబ సభ్యులు అధికారులను డిమాండ్ చేశారు. ఏ ప్రాతిపదికన కులం పేరు మార్చారు.. వాటి వివరాలను చూపించాలని ప్రశ్నించారు. -
‘ఓటు’ కోసం కోటి ప్రయత్నాలు
సాక్షి, జనగామ: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటి నుంచి ప్రచార పర్వం ముగిసే వరకు అంతా సప్పగా సాగిపోయింది. ఒకటి రెండు సార్లు ర్యాలీ లు... తూతూ మంత్రంగా ఇంటింటి ప్రచారాలతో మమ అనిపించేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో.. జనగామ నియోజకవర్గంలో అంతా గప్‌చుప్‌గా మారిపోయింది. గుట్టుగా ఇంటింటికి వెళ్తూ.. ఓటు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అసెంబ్లీ...పంచాయతీ ఎన్నికల్లో ఏరులై పారిన మద్యం.. నగదుతో హుషారెత్తిన గ్రామాలు.. ఎంపీ ఎలక్షన్లు వచ్చే సరికి సైలెంట్‌గా మారిపోయింది. ఆయా రాజకీయ పార్టీలు బూత్‌ల వారీగా కష్టపడే వారికి రోజు వారి ఖర్చులు మినహా... ఓటర్లకు ఎలాంటి నజరాన లేకపోవడంతో ప్రచారంలో మజా లేకుండా పోయింది. దీంతో గ్రామ స్థాయిలో పలుకుబడిన నాయకులు.. సొంత ఖర్చులతో ఖుషీచేసే ప్రయత్నాలు చేశారు. భయ్యా.. గెలిచిన తర్వాత.. మస్తు దావత్ ఉంటది.. ఏమనుకోకు.. అంటూ బుజ్జగించారు. మందు తక్కువైతేనేమీ.. డబ్బులు ఇవ్వండి.. అంటూ మెలికి పెట్టడంతో... ఒక్కపైసా రావడం లేదు.. సొంత ఖర్చులతో దావత్ ఇచ్చాను అంటూ బతిమిలాడుకునే పరిస్థితి ఎదురవుతోంది. తమ్మి... (కార్యకర్త) ఓటర్లను బాగా చూసుకోండి.. పల్లెత్తు మాట అనొద్దు.. నేడు ఓట్ల పండగ పూర్తయి.. గెలుపొందగానే మస్తు పార్టీ చేసుకోండి... పైసలు నేనిస్తా అంటూ అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చినా... నమ్మడం లేదనే ప్రచారం జరుగుతుంది. డబ్బు పంచకున్నా... లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నగదు.. మద్యం పంపిణీ పెద్దగా లేకున్నా.. ఈసీ మాత్రం గట్టి నిఘా వేసింది. జిల్లా వ్యాప్తంగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో మూడో కన్నుతో పర్యవేక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.45.28లక్షలు పట్టుబడగా..రూ.8.50లక్షల విలువ చేసే 1378.430 లీటర్ల మద్యం, 2017.50 లీటర్ల గుడుంబాను స్వాదీనం చేసుకున్నారు. -
రెండు నియోజకవర్గాలే టార్గెట్
సాక్షి, జనగామ: భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్.. మరోవైపు కాంగ్రెస్ పకడ్బందీగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా మెజారిటీ ఓట్లు రాబట్టుకుంటే విజయం సాధించవచ్చనే ఆలోచనతో ముందుకు సాగుతున్నాయి. 2009, 2014 ఎన్నికలతో పోల్చుతూ 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలతో లెక్కలు వేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. భువనగిరి లోక్‌సభ పరిధిలో ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగామ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏడు నియోజకవర్గాల్లో జనగామ, ఆలేరు నియోజకవర్గాలపైనే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి జనగామ, ఆలేరు నియోజకవర్గాల నుంచి మంచి మెజారిటీ లభించింది. దీంతో అప్పుడు బూర నర్సయ్య గౌడ్ గెలుపు సులువుగా మారింది. 2014 ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థికి 29,084 ఓట్ల మెజారిటీ.. ఆలేరు నుంచి 19,632 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఎక్కువగా ఓట్లు రావడంతో టీఆర్ఎస్ విజయం ఖాయమైపోయింది. ఇప్పుడు మరోమారు జనగామ, ఆలేరు నియోజకవర్గాల నుంచి ఎక్కువ ఓట్లు వస్తే విజయం సాధించాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. 2018 డిసెంబర్లో జరిగిన శాసన ఎన్నికల్లో జనగామ నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 29,538 ఓట్ల మెజారిటీ.. ఆలేరు నుంచి గొంగడి సునీతకు 33,289 ఓట్ల మెజారిటీ వచ్చింది. శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి మంచి ఊపుమీద ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో మరోమారు ఎక్కువగా మెజారిటీ వచ్చేలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. భువనగిరి తమ ఖాతాలోనే అన్నట్లుగా ప్రచారం నిర్వహిస్తోంది. నాడు తమ్ముడు.. నేడు అన్న.. భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నాడు తమ్ముడు బరిలో దిగగా.. నేడు అన్న ఎన్నికల బరిలో ఉన్నాడు. 2009లో భువనగిరి స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన సమీప సీపీఎం అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 1,39,888 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి రాజగోపాల్‌రెడ్డి ఆధిక్యత లభించింది. 2014 ఎన్నికల్లో రెండోసారి పోటీచేసిన రాజగోపాల్‌రెడ్డి ఓటమి చెందారు. ప్రస్తుత ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ సైతం జనగామ, ఆలేరు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. జనగామ నుంచి లీడ్ లభిస్తే విజయం సాధించవచ్చనే ఆలోచనతో క్యాడర్‌ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జనగామ నుంచి టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఉండడం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశం. నియోజకవర్గ ప్రజలకు కోమటిరెడ్డి సోదరులు సుపరిచితులు కావడంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆలేరు, జనగామ నియోజకవర్గాలపైనే ఫోకస్ చేయడం ఆసక్తిగా మారుతోంది. రెండు పార్టీలకు రెం డు నియోజకవర్గాలు ప్రతిష్టగా మారాయి. -
మహిళా ఓటర్లే ‘కీ’లకం
సాక్షి, జనగామ: జిల్లాలో మహిళా ఓటర్లు కీలకంగా మారునున్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఓటరు జాబితాలో పురుషుల కంటే మహిళలు పైచేయిని సాధించడంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆకర్షిస్తున్నారు. మహిళా ఓటర్ల మద్దతు కోసం ప్రధాన పార్టీల నాయకులు రంగంలోకి దిగారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ నాయకులు మహిళా ఓటర్ల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల్లో మహిళలు పురుషులతో సమానంగా ఓటు హక్కును కలిగి ఉన్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 6,98,571 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,48,924 మంది ఉండగా మహిళలు 3,49,635 మంది ఉన్నారు. ఇతరులు 12 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 711 మంది ఎక్కువగా ఉన్నారు. రెండు నియోజకవర్గాల్లో పైచేయి.. జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో రెండు సెగ్మెంట్లలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జనగామ నియోజకవర్గంలో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉండగా పాలకుర్తి నియోజకవర్గంలో తక్కువగా ఉన్నారు. జనగామ నియోజకవర్గంలో ఓటర్లుగా పురుషులు 1,11,911 మంది ఉండగా.. మహిళలు 1,12,974 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1063 మంది ఎక్కువగా ఉన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పురుషులు 1,18,335 మంది ఉండగా మహిళలు 1,18,818 మంది ఉన్నారు. 483 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళలు తక్కువగా సంఖ్యలో ఉన్నారు. పురుషులు 1,18,678 మంది ఉండగా మహిళలు 1,17,843 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 835 మంది తక్కువగా ఉన్నారు. ప్రధాన పార్టీల గురి... జిల్లాలో మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో గ్రామాల వారీగా వారిని ప్రభావితం చేసే అంశాలపై ఫోకస్ చేస్తున్నారు. గ్రామ, మండలస్థాయి మహిళా సంఘాల నాయకురాళ్లను రంగంలోకి దింపుతున్నారు. ఏ గ్రామంలో ఎక్కువగా మహిళా ఓటర్లు ఉన్నారనే విషయాలను ఆరా తీస్తున్నారు. మహిళా ఓటర్ల మద్దతు దక్కితే విజయం సులువు అవుతుందనే ఆలోచనలో మహిళా ఓటర్ల మద్దతు కోసం పార్టీల నాయకులు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. జిల్లాలో ఉన్న ఓటర్లు వివరాలు... నియోజకవర్గం పురుషులు మహిళలు జనగామ 111911 112974 స్టేషన్ ఘన్పూర్ 118335 118818 పాలకుర్తి 118678 117843 మొత్తం 348924 349635 -
నీటి ఎద్దడికి పొన్నాలే కారణం
వరంగల్ / నర్మెట: ‘తెలంగాణలో నీటి ఎద్దడికి పొన్నాలే కారణం.. ఆనాడు భారీ నీటి పారుదల శాఖామంత్రిగా ఉండి ఆంధ్రా నాయకులతో కుమ్మక్కై తెలంగాణ రైతులకు తీరని ద్రోహం చేశాడు’ అని తాజా మాజీ ఎమ్మల్యే, టీఆర్ఎస్ జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి «అన్నారు. మండలంలోని అమ్మాపూర్‌లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం సాగించిన పొన్నాల దేవాదుల నిర్మాణంలో తక్కువ వ్యాసం కలిగిన పైపులైన్ల వినియోగంతో తెలంగాణకు తీరని అన్యాయం చేశాడని దీంతో నీటిపంపింగ్ సామర్థ్యం తగ్గడంతో చెరువులు, కుంటలు నింపడం ఆలస్యమవుతోందన్నారు. వెచ్చించిన వేలకోట్ల ప్రజాధనం వృథాచేసి కరువుకు కారణమైన లక్ష్మయ్యను గ్రామాల్లోకి రాకుం డా అడ్డుకుని ఓటు ఆయుధంతో గుణపాఠం చెప్పాలన్నారు. సాగు,తాగునీటికి అలమటిస్తున్న తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వనన్న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డికి ప్రజల ఉసురు తాకి పత్తాలేకుండా పోయాడని, పొన్నాల ఓటమి పాలయ్యాడన్నారు. మహిళలు బోనాలు, బతుకమ్మలతో ముత్తిరెడ్డికి స్వాగతం పలకగా ఆయన వారితో కలిసి బతుకమ్మ ఆడారు. గుండెపోటుతో ఇటీవల మృతిచెందిన పార్టీ నాయకుడు పెద్ద చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని ఓదార్చారు. అనంతరం టీడీపీకి చెందిన వంద మంది నాయకులు, కార్యకర్తలు పిట్టల రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరగా వారికి ముత్తిరెడ్డి కండువా కప్పి స్వాగతించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది రాజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఎండీ గౌస్, టీఆర్ఎస్వీ జిల్లా కన్వీనర్ వంగ ప్రణీత్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు దేవరాయ కనకయ్య, కుంటి లక్ష్మయ్య, మాజీ ఎంపిటీసి చెక్కిల్ల నర్సమ్మ, చెక్కిల్ల రవీందర్ దంపతులు, బండి నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, ఇర్రి గాల్‌రెడ్డి, బుచ్చాల గాలయ్య, మండల యూత్ నాయకులు పార్నంది సతీష్ శర్మ, శశిరథ్, రవి పాల్గొన్నారు. -
జనగామలో వివాహిత ఆత్మహత్య
జనగామ అర్బన్: జిల్లా కేంద్రానికి చెందిన ఓ వివాహిత బుధవారం రాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, మృతురాలి బాబాయి కొత్తకొండ భాస్కర్, మేనమామ శ్రీనివాస్, బంధువుల కథనం ప్రకారం... జనగామకు చెందిన తాళ్ల భానుచందర్‌కు హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన సుధారాణి(33)తో 2009 సంవత్సరంలో వివాహమైంది. జనగామ గుండ్లగడ్డ ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరికి నాలుగేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఆరు నెలలుగా అత్తామామ, భర్త వేధింపులు పెరి గాయి. దీంతో భరించలేక సుధారాణి ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఈక్రమంలో పెద్ద మనుషులు సర్టి చెప్పి ఆమెను పంపగా తీసుకువచ్చా డు. అయినా వారిలో మార్పు లేకపోయింది. దీంతో సుధారాణి మనస్తాపం చెంది బుధవారం రాత్రి పురుగులమందు తాగింది. దీంతో స్థానిక జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. జనగామ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత సుధారాణి మృతదేహం ఉన్న అంబులెన్స్‌తో బంధువులు జనగామ పోలీస్‌స్టేషన్ వద్ద గురువారం రాత్రి ధర్నా చేపట్టారు. ఆమె మృతికి భర్త, అత్త, మామ వేధింపులే కారణమంటూ, ఈ విషయమై పోలీసులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులకు, మృతురాలి బంధువులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పట్టణ సీఐ శ్రీనివాస్ బాధితులకు న్యాయం చేస్తానని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. జనగామ ఎస్సై మహ్మద్ హమీద్ కేసును దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో వ్యాగన్ పాయింట్ లైన్‌పై గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. శనివారం వేకువజామున 2 గంటల సమయంలో 17 బోగీలు పట్టాలు తప్పడంతో హుటాహుటిన సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులు జనగామకు చేరుకున్నారు. జనగామలో బియ్యం లోడ్ చేసుకుని సికింద్రాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పిన బోగీలను వదిలేసి మిగతా బోగీలను సికింద్రాబాద్‌కు పంపించేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
జనగాం జిల్లా టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు
-
వెఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి,హైదరాబాద్ : వైఎస్సార్సీపీలో పలు పదవులకు నియామకాలు జరిగాయి. జనగాం జిల్లా కార్యదర్శిగా నోముల జైపాల్ రెడ్డి, జిల్లా కార్యవర్గసభ్యుడిగా గుగ్గిళ్ల శ్రీధర్, జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షుడిగా దండేంపల్లి కార్తీక్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా మానేగల్ల మంజులను నియమించినట్లు పార్టీ వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నర్మెట మండల అధ్యక్షుడిగా దామెర శ్రీనివాస్, చిల్పుర్ మండల అధ్యక్షుడిగా పొదేలా రత్నాకర్, స్టేషన్ ఘన్పూర్ మండల అధ్యక్షుడిగా పీయాల రాజి రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా అప్పం కిషన్, గోవింద నాయక్ భుక్యాలను నియమించారు. -
అనైతిక బంధం.. వరుడు మృతి
సాక్షి, వరంగల్ : పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు పాడె ఎక్కాడు. వరుసకు సోదరుడైన వ్యక్తితో అనైతిక బంధం కొనసాగిస్తున్న వధువే వరుడిపై పెట్రోల్ దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటనలో చివరకు వరుడు ప్రాణాలు కోల్పోయాడు. 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వరుడు యాకయ్య శనివారం మృతి చెందాడు. గత ఆరు రోజుల క్రితం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన యాకయ్యపై పెట్రోల్ దాడి జరిగిన విషయం తెలిసిందే. అనైతిక బంధంతో వధువే వరుడిపై హత్యాయత్నం జరపడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే వధువు అరుణ, ఆమె సోదరుడు బాలస్వామిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అసలేం జరిగిందంటే.. కంచనపల్లి గ్రామానికి చెందిన గొంగోళ్ల సామ్యేల్- యాదమ్మల కుమారుడు యాకయ్యకు మాదరం గ్రామానికి చెందిన అరుణతో ఈనెల 21న పెళ్లి చేయాలని ఇరువర్గాల కుటుంబసభ్యులు నిర్ణయించారు. వధువుకు మాత్రం ఈ వివాహం ఇష్టం లేదు. కారణం ఆమె గత మూడేళ్లుగా బాలస్వామితో ప్రేమలో ఉంది. కానీ, బాలస్వామి మరెవరో కాదు.. వధువుకు స్వయాన పెద్దమ్మ కొడుకు. పెళ్లిని ఆపేందుకు బాలస్వామితో కలిసి వధువు పథకం పన్నింది. మరోవైపు ఆదివారం 18వ తేది నాడు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన వరుడు కుటుంబం రాత్రి బంధువులతో హడావిడిలో ఉండగా వధువు అరుణ నుంచి యాకయ్యకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ సిగ్నల్ సరిగా లేదని బయటకు వచ్చి మాట్లాడమని అరుణ చెప్పడంతో వరుడు యాకయ్య బయటకు వచ్చాడు. అప్పటికే మాటువేసిన బాలస్వామి ఒక్కసారిగా యాకయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఉన్న యాకయ్యను చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
పెళ్లి కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పు!
సాక్షి, జనగాం : మరో రెండు రోజుల్లో ఆ యువకుడి వివాహం.. శుభముహుర్తం కావడంతో ఆదివారం అతడి కుటుంబ సభ్యులు గృహ ప్రవేశం కూడా చేశారు. నుదుట బొట్టు, పట్టు వస్త్రాలు ధరించి పెళ్లి పీటలెక్కాల్సిన అతడు ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కలల స్వగృహంలో సంతోషంగా పెళ్లి చేసుకోవాలనుకున్న అతడి ఆశలు అడియాసలయ్యాయి. కాబోయే భార్యతో అర్ధరాత్రి బయట ఫోన్లో మాట్లాడుతున్న అతడిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో దాదాపు 50 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అనుమానాలు రేకిత్తిస్తున్న ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో ఆదివారం అర్థరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన గొంగళ్ల సామ్యేల్ ఏకైక కుమారుడు యాకయ్య (24)కు మాదారం గ్రామానికి చెందిన ఓ యువతితో 20 రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 21న పెళ్లి ముహుర్తంగా నిర్ణయించారు. శుభలేఖలు అచ్చు వేయించి బంధువులకూ పంచారు. పెళ్లిని దృష్టిలో పెట్టుకొని కొత్తగా నిర్మించిన ఇంట్లోకి వరుడి కుటుంబం ఆదివారం గృహ ప్రవేశం కూడా చేసింది. గృహ ప్రవేశానికి వధువు తరఫు బంధువులు హాజరయ్యారు. ఫంక్షన్ ముగిసిన తర్వాత అలసట చెందిన వారంతా నిద్రిస్తున్నారు. ఈ క్రమంలోనే వధువు నుంచి యాకయ్యకు ఫోన్ రావడంతో ఆమెతో మాట్లాడుతుండగా తనకు సరిగ్గా వినిపించడం లేదని, బయటికి వచ్చి మాట్లాడాలని ఆమె కోరింది. దీంతో యాకయ్య బయటికి వచ్చి ఫోన్లో మాట్లాడుతుండగా అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న నలుగురు యువకులు మాస్కులు ధరించి అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు భరించలేక యాకయ్య కేకలు వేయడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తల్లి యాదమ్మ అతడిని పట్టుకోవడంతో ఆమె చాతి, చేతులకు గాయాలయ్యాయి. యాకయ్య భూమిపైనే బొర్లుతూ మంటలను చల్లార్చుకోగలిగాడు. అప్పటికే చాతి, వీపు 50 శాతం కాలడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అనుమానాలు.. వరుడిపై జరిగిన హత్యాయత్నం పలు అనుమానాలకు తావిస్తోంది. పెట్రోల్ పోసి అంటించింది ఎవరు..? ఎవరి ప్రోద్బలమైన ఉందా.. ? ఎందుకు హత్యాయత్నం చేశారు..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఫోన్ మాట్లాడుతుండగా సిగ్నల్ రావడం లేదని బయటకు రావాలని పదేపదే వధువు తనకు చెప్పిందని, అందుకే ఇంటి ముందుకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్నానని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాకయ్య పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. వారం రోజుల క్రితం యాకయ్య తండ్రి సామ్యేల్ గేదెలకు మేత వేసేందుకు ఇంటి బయటటికి రాగా వరుడిగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. అయితే దొంగలుగా భావించిన కుటుంబ సభ్యులు పెళ్లి పనులు ఉండడంతో ఈ ఘటనను పెద్దగా పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా డీసీపీ మల్లారెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ తిరుపతి, ఎస్సై రంజిత్‌రావు కంచనపల్లిలో ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వధువు గ్రామంలో కూడా విచారణ చేపట్టారు. కాగా తమ కుమారుడిపై దాడికి వధువే కారణమని సామ్యేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కళ..విశ్వవ్యాప్తం
పెంబర్తి హస్తకళకు.. ‘సృష్టికి ప్రతిసృష్టి’ అనే పేరుంది.. ఈ ప్రాచీన కళకు కొత్త సొబగులు అద్ది విశ్వవ్యాప్తం చేస్తున్నాడు ఓ యువతేజం. వారసత్వ కళకు ఆధునిక హంగులు జోడించి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు..మహేశ్వరం శ్రీనివాసచారిది జనగామ జిల్లా పెంబర్తి. ఎంబీఏ చేశాడు. చదువుకునే రోజుల్లోనే తండ్రి మధునాచారి నుంచి కులవృత్తి స్వీకరించాడు. నగిషీల తయారీలో నేర్పు సాధించాడు.ఎంత అద్భుతంగా నగిషీలు చేసినప్పటికీ దానికి సరైన మార్కెటింగ్ లేకపోతే ఇబ్బందులు ఏర్పడుతాయి. చేసిన కళాఖండాన్ని నలుగురికి చూపించే ఓ వేదిక కావాలని శ్రీనివాసచారి ఆలోచన చేశాడు. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో అమ్మకాల ఐడియా వచ్చింది. దాన్నే అమలుచేసి సక్సెస్ అయ్యాడు. జనగామ నుంచి ఇల్లందుల వెంకటేశ్వర్లు : కాకతీయులు, నిజాం నవాబులకు అలంకరణ వస్తువులను అందించిన చరిత్ర కలిగిన ‘పెంబర్తి’ కళాకారులు ఇప్పటికీ వారసత్వంగా అద్భుత నగిషీలను తయారుచేసి అందిస్తున్నారు. కళాకారులు తయారు చేసిన వాటికి మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం, పాలకుల ప్రోత్సాహం లేకపో వడంతో వారి జీవనం దినదిన గండంగా మారింది. కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారడమే కాకుండా తమ పిల్లలకు మంచి చదువులను చెప్పించలేని దుస్థితి. ఇలాంటి తరుణంలో పెంబర్తి గ్రామానికే చెందిన మహేశ్వరం శ్రీనివాసచారి నగిషీలను తయారు చేయడమే కాకుండా మార్కెటింగ్‌కు కొత్త ఆలోచన చేశాడు. కళకు ఆధునికత అనుసంధానం.. చిన్నప్పటి నుంచి కంప్యూటర్ వినియోగంపై కొంత అవగాహన ఉన్నచారి.. తయారు చేసిన వస్తువులను ఆన్లైన్లో పెట్టి అమ్ముతున్నాడు.ఇందుకోసం 2013లో www.metalartisan.in వెబ్సైట్ ప్రారం భించాడు. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారు నచ్చిన కళా రూపాలను కొనుగోలు చేస్తున్నారు. కొందరు తమకు నచ్చిన రీతిలో కళా రూపాలను తయారు చేయించుకుంటున్నారు. 2014 నుంచి ఈ వెబ్సైట్ బాగా ప్రాచూర్యంలోకి వచ్చింది. విదేశాల నుంచి విçస్తృతంగా ఆర్డర్లు వస్తు న్నాయి. ముఖ్యంగా అమెరికా, సింగపూర్, యూకే, ఆస్ట్రేలియా, మలేషి యా దేశాల నుంచి హస్తకళల కొనుగోలు కోసం ఆసక్తి చూపుతున్నారు. మన దేశంలోని తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొత్తదారి దొరకడంపై శ్రీనివాసచారి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. రోజూ 14 గంటలు ఆన్లైన్లోనే.. ప్రాచీక కళకు ఆధునికతను జోడిం చిన శ్రీనివాసచారి ఆన్లైన్ మార్కెటింగ్‌లో బిజీ అయిపోయాడు. కస్టమర్లకు నిత్యం అందుబాటులో ఉంటున్నాడు. ఉదయం 8 గంటలకే కంప్యూటర్ ముందు కూర్చొని తన వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఆర్డర్లకు అనుగుణంగా ఆయనతోపాటు తండ్రి మధునాచారి నగిషీలను తయారు చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు వచ్చినప్పుడు తోటి కళాకారులకు పనులు అప్పగిస్తున్నారు. తనతోపాటు మరో పది మందికి కూడా ఉపాధి చూపుతున్నాడు. తన 72073 66856 సెల్‌నంబర్‌కు రోజూ 10 నుంచి 15 ఆర్డర్లు వస్తున్నాయి. మూడు భాషల్లో ప్రావీణ్యం.. గ్రామీణ నేపథ్యం ఉన్న చారి.. మూడు భాషలు మాట్లాడగలడు. తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లో వచ్చిన కాల్స్‌కు సమాధానం చెబుతాడు. దీంతో తనకు ఆన్లైన్ బిజినెస్ ఈజీ అయిపోయింది. ప్రపంచ గుర్తింపు తీసుకొస్తా.. పెంబర్తి హస్తకళకు ప్రపంచ గుర్తింపు తీసుకురావడమే నా లక్ష్యం. పెంబర్తి కలను కనుమరుగు కానివ్వొద్దు. నా చిన్నతనంలో మా కులవృత్తిలో 150 కుటుంబాలుండేవి. ఇప్పుడేవి?. కొంత ఇన్నో వేటివ్గా ఆలోచించే ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించా. కాస్త పర్వాలేదు. మంత్రి కేటీఆర్‌కు పెంబర్తిపై ట్విట్ చేస్తే ఆయన తిరిగి ట్విట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. – మహేశ్వరం శ్రీనివాసచారి -
ఇంటింటికీ ఇంటర్నెట్
జనగామ నుంచి ఇల్లందుల వెంకటేశ్వర్లు : పల్లెలను ఇంటర్నెట్తో అనుసంధానం చేసే ప్రక్రియ వేగంగా సాగుతోంది. మున్ముందు పల్లెల్లోనే ప్రతి సేవను అందుబాటులోకి తెస్తున్న నేపథ్యంలో ఇంటర్ నెట్ తప్పనిసరి. ప్రస్తుతం గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. ఇదేక్రమంలో భగీరథ పైపులైన్‌తో పాటు ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఆప్టిక్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ)లైన్‌ను వేస్తున్నారు. తాగునీటి పైపులైన్ వేసిన తర్వాత ప్రత్యేకంగా ఆప్టిక్ ఫైబర్ లైన్ వేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అందుకే భగీరథ పనులతోపాటే ఫైబర్ లైన్‌ను వేస్తున్నారు. డక్ట్‌తో గ్రామాల అనుసంధానం.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలను అనుసంధానం చేయడానికి 22,536.532 కి.మీ మేర పైపులైన్ అవసరం ఉన్నట్లు గుర్తించారు. దీనిలో ఇప్పటి వరకు 20,520.506 కి.మీలకు నిర్మాణపరమైన అనుమతులు ఇవ్వగా 17,750.5428 కి.మీ డక్ట్ నిర్మాణం పూర్తి చేశారు. గ్రామాలను కలుపుతూ ఫ్రీ లాబ్రికేటేడ్ హైడెన్సీపాలిథిన్ (పీఎల్బీ హెచ్డీపీఈ)పైపులైన్ వేస్తున్నారు. గ్రామాల్లో అంతర్గతంగా ఆప్టిక్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ) పైపులైన్ వేస్తున్నారు. ప్రతి 500 మీటర్లకు ఒక చాంబర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పైపులైన్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్రత్యేక కేబుల్‌ను అమర్చుతారు. కి.మీకి రూ.60వేల చొప్పున చెల్లింపు.. డక్ట్ నిర్మాణ పనులకు ప్రభుత్వం కిలోమీటర్‌కు రూ.60వేల చొప్పున చెల్లిస్తోంది. మిషన్ భగీరథ పనులను పర్యవేక్షిస్తున్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులకే ఈ బాధ్యతలను అప్పగించారు. పనుల పురోగతి ఆధారంగా ఏజెన్సీలకు డబ్బులను చెల్లిస్తున్నారు. పల్లెకు ఐటీ వెలుగులు.. ప్రభుత్వం చేపట్టిన డక్ట్ నిర్మాణంతో 2018 వరకు పల్లెలకు ఐటీ వెలుగులు తలుపుతట్టే అవ కాశం ఉంది. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయ తీలు, ఆస్పత్రులు, బ్యాంకులు, ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయా లకు ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వను న్నారు. ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ఇంటికి కూడా కనెక్షన్ తీసుకో వచ్చు. వీరి నుంచి నెలనెలా కొంత మొత్తం వసూలు చేస్తారు. అయితే ఇది నామమాత్రంగా ఉండే అవకాశం ఉంది. ప్రత్యేక పాస్ వర్డ్‌తో ఉచితంగా వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫోన్ల వాడకం పెరిగిన నేపథ్యంలో ఇది మరింత ఉపయోగపడనుంది. ఆన్లైన్ సేవలను మరింత జవాబుదారీతనంగా చేయడానికి వీలు కలుగుతుంది. -
నాడు జేసీ.. నేడు కలెక్టర్
బతుకమ్మ కుంట వివాదం చిలిచిలికి గాలివానలా మారుతోంది. గతంలో ఈ కుంట వ్యవహారంలో అప్పటి ఉమ్మడి జిల్లా జేసీ, ప్రస్తుతం వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో వివాదంలో చిక్కిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. తాజాగా మరోమారు కలెక్టర్ శ్రీదేవసేన చేసిన వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. అయితే కలెక్టర్ చేసిన ఆరోపణలపై ముత్తిరెడ్డి సీఎస్‌కు ఫిర్యాదు చేయడం, కలెక్టర్‌కు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలపడం వంటి ఘటనలతో ఈ వివాదం కొత్త మలుపులు తిరుగుతుంది. సాక్షి, జనగామ : కలెక్టర్ శ్రీదేసేన, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య తలెత్తిన బతుకమ్మ కుంట బేధాభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కుంటలోని శిఖం భూమిని స్వయంగా ఎమ్మెల్యే కబ్జా చేశారని కలెక్టర్‌గా ప్రకటించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇదిలా ఉంటే కలెక్టర్‌పై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రభుత్వ ఛీప్ విప్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అంతే కాకుండా అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కలెక్టర్ వ్యవహరించారని వివరించినట్లు సమాచారం. ఈ వరుస ఘటనలతో బతుకమ్మ కుంట వివాదం మరింత జఠిలం మారుతోంది. అయితే కలెక్టర్‌కు మాత్రం సీపీఐ, సీపీఎం, టీడీపీ, బీజేపీ, ప్రజాఫ్రంట్ నాయకులు అండగా నిలిచారు. నాడు పనులకు అడ్డు చెప్పిన జేసీ.. జనగామ ఎమ్మెల్యే, కలెక్టర్ మధ్య వివాదానికి కారణమైన బతుకమ్మ కుంట మరోసారి వార్తలెక్కింది. గతంలో బతుకమ్మ కుంట వివాదంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పరువు పోయింది. సూర్యాపేట రోడ్డులో ఉన్న ధర్మోనికుంట ప్రస్తుత బతుకమ్మ కుంటను 2015లో మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు రెడీ చేసి ప్రభుత్వానికి పంపించారు. దీంతో అప్పటి ఉమ్మడి జాయింట్ కలెక్టర్, ప్రస్తుత వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ జీవన్ పాటిల్ బతుకమ్మ కుంటను సందర్శించారు. బతుకమ్మ కుంటను అభివృద్ధి పేరుతో హద్దులు చేరిపేయడం, కుంట ప్రాంతాన్ని మట్టితో పూడ్చి వేయడం సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పారు. రెండు సార్లు ప్రతిపాదనలను పంపినప్పటికీ అప్పటి జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ తిరస్కరించారు. దీంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నేరుగా హన్మకొండకు వెళ్లి జేసీతో వాగ్వివాదానికి దిగారు. అప్పట్లో జేసీ పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు వివాదమైంది. అంతలోనే జేసీ బదిలీ కావడంతో ఇష్టారాజ్యంగా బతుకమ్మ కుంట పనులను చేపట్టారు. నిబంధనలు పాటించకుండా ఐదు ఎకరాల స్థలంలో దేవాదుల కాల్వల నుంచి మట్టిని తీసుకువచ్చి పూడ్చి వేశారు. ఇప్పుడు బతుకమ్మ కుంట పనులపై కలెక్టర్ దేవసేన అభ్యం తరం వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ కుంట స్థలాన్ని ఆక్రమించినట్లు బహిరంగంగానే ఆరోపించారు. ట్రస్టీ పేరుతో దుర్గమ్మగుడిని ఎమ్మెల్యే పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, దానిని రద్దు చేయించానని చెప్పడం మరోమారు ముత్తిరెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. కలెక్టర్‌పై సీఎస్‌కు ఫిర్యాదు... బతుకమ్మ కుంట విషయంలో కలెక్టర్ దేవసేన చేసిన వ్యాఖ్యలపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బుధవారం సాయంత్రం సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ఛీప్ సెక్రటరీ వీకే సింగ్‌ను కలిసి పరిస్థితి వివరించినట్లు తెలిసింది. తాను భూకబ్జాకు పాల్పడలేదని వివరించారు. అదేవిధంగా అసెంబ్లీ కార్యదర్శిని కలెక్టర్ తన పట్ల వ్యవరించిన తీరును వివరించారు. సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ముదురుతున్న వివాదం... కలెక్టర్‌పై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫిర్యాదు చేయడం, కలెక్టర్‌కు రాజకీయ పార్టీల నాయకులు మద్దతుగా నిలవడం ఇద్దరి మధ్య వివాదం ముదురుతోంది. కలెక్టర్, ఎమ్మెల్యే మధ్య అంతర్గతంగా ఉన్న బేదాభిప్రాయాలు బతుకమ్మ కుంట సాక్షి బయట పడ్డాయి. విభేదాలు తారస్థాయికి చేరడంతో ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారి తీస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
జనగాం కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే
-
జనగాం కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే
సాక్షి, జనగాం : గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు మధ్య నెలకొంటున్న వివాదాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పాలనాపరంగా వారికి అడ్డుతగులుతున్నారని, అవసరమైతే బదిలీ వేటు వేస్తున్నారని ఎమ్మెల్యేలపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనగాం జిల్లా కలెక్టర్ దేవసేనకు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మధ్య కొనసాగుతున్న వివాదం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్రమాలను ఇంత కాలం ఓపిక పట్టానని, ఇకపై ఏమాత్రం సహించేది లేదన్న రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారు. తాజాగా బతుకమ్మ కుంట వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి మీడియా సాక్షిగా ఎమ్మెల్యే అవినీతిని బయటపెట్టే ప్రయత్నం చేశారు. దాదాపు ఐదెకరాల కుంటను పూడ్చినట్లు ఎమ్మెల్యే వర్గంపై కలెక్టర్ దేవసేన ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు, అభివృద్ది పేరు చెప్పి డబ్బులు ఎలా వసూలు చేసిందీ? ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాన్ని మీడియాకు పూసగుచ్చినట్లు ఆమె వివరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరును దేవసేన చెప్పుకొచ్చారు. అప్పట్లో ఎమ్మెల్యే ఓ గుడిని కూడా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, దాన్ని తానే రద్దు చేశానని చెప్పుకొచ్చారు. బతుకమ్మ కుంట ప్రదేశం వివాదాస్పద స్థలంగా ఉండటంతోనే అక్కడ వేడుకలు నిర్వహించట్లేదని కలెక్టర్ దేవసేన తెలిపారు. కాగా, ఈ స్థల వివాదాలకు సంబంధించి ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై కలెక్టర్ గతంలోనే డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారంట. అయినా సరే! పెద్దగా చర్యలేవీ లేకపోవడంతో.. తానే స్వయంగా ఆయన అక్రమాల గురించి మీడియాకు వెల్లడించినట్లు అర్థమౌతోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా కొన్నిరోజుల క్రితం జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కలెక్టర్ దేవసేనను నిలదీయగా, ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఎంపీ బూరనర్సయ్య గౌడ్ జోక్యం చేసుకోవటంతో ఇరువురు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
భగీరథ జ(ఫ)లాలు
వచ్చేస్తున్నాయ్.. ఇంటింటికీ నీళ్లు.. ♦ మిషన్ భగీరథ పనుల్లో జనగామ జిల్లా ఫస్ట్ ♦ వందశాతం పురోగతితో రాష్ట్రంలో తొలిస్థానం ♦ తరువాతి స్థానాల్లో మేడ్చల్, వనపర్తి, సిద్దిపేట ♦ చివరి స్థానంలో నిలిచిన కొమురంభీం జిల్లా ♦ తొలి విడతలో మరో 12 జిల్లాలపై ఫోకస్ ♦ డిసెంబర్ చివరి నాటికి పనుల పూర్తే లక్ష్యం జనగామ నుంచి ఇల్లందుల వెంకటేశ్వర్లు : ప్రతి జనావాసానికి స్వచ్ఛమైన తాగునీటిని అందిం చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ‘మిషన్ భగీరథ’ ఫలాలు ప్రజలకు అంద బోతున్నాయి. మిషన్ భగీరథ పనుల పురోగతిలో జనగామ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. హైద రాబాద్ మినహా మిగతా 30 జిల్లాల్లో భగీరథ పను లను చేపట్టారు. ఇందులో జనగామ ప్రజలకు తొలి ఫలితాలు అందుతుండగా తరువాత సిద్దిపేట జిల్లాకు చేరుతున్నాయి. పైపులైన్ నిర్మాణంతోపాటు ట్యాంకు ల నిర్మాణం, ఇంటింటికీ నల్లా కనెక్షన్ల పనుల తదితర అంశాల్లో జనగామ మొదటి స్థానంలో ఉంది. 12 జిల్లాలపై ఫోకస్.. భగీరథ పనులను త్వరితగతిన పూర్తి చేయడం కోసం తొలి విడతలో 12 జిల్లాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు తొలి విడతలో జనగామ, సంగారెడ్డి, జగిత్యాల, నిర్మల్, మెదక్, జోగులాంబ గద్వాల, ఖమ్మం, కామారెడ్డి, వనపర్తి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలను ఎంచుకున్నారు. ఈ జిల్లాల్లో 60 శాతం వరకు పనులు కావడంతో మిగిలిన పనులను డిసెంబర్ వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడువు కంటే ముందే నీళ్లు.. గడువు కంటే ముందే భగీరథ జలాలు ఇంటింటికీ వస్తున్నాయి. మూడు నెలల ముందుగానే జనగామలో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. జనగామ, సిద్దిపేట, మేడ్చల్, వనపర్తి జిల్లాల్లో ట్రయల్ రన్ పూర్తి చేసి నీటిని అందిస్తున్నారు. జనగామలో 704 ఆవాసాలకు తాగునీరు అందించాల్సి ఉండగా ఇప్పటివరకు 704 గ్రామాల్లో ట్రయల్ రన్ పనులను నిర్వహించారు. ఇందులో 684 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తు న్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో జరుగుతున్న నేషనల్ హైవే నిర్మాణ పనుల కారణంగా 20 గ్రామాలకు నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. రోజుకు మూడు గంటల పాటు నీటి సరఫరా.. మిషన్ భగీరథ ద్వారా ట్రయల్‌రన్ చేస్తున్న గ్రామాల్లో రోజుకు మూడు గంటల చొప్పున నీటిని పంపింగ్ చేస్తున్నారు. పంప్ హౌస్‌ల నుంచి నేరుగా గ్రామాలకు నీటిని తరలిస్తు న్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విడతల వారీగా నీటిని వదులుతున్నారు. కరెంటుతో సంబంధం లేకుండా పంప్‌హౌస్‌ల నుంచి నీటిని వదులుతున్నారు. గతంలో కరెంటు ఉంటేనే మోటార్ల ద్వారా ట్యాంకులకు నీటిని వదిలి పెట్టేవారు. కానీ ఇప్పుడు పంప్‌హౌస్‌ల నుంచే నీటిని గ్రామాలకు అందిస్తున్నారు. ట్రయల్ రన్ చేస్తున్న గ్రామాల్లో గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల బాధ తప్పినట్టయింది. విద్యుత్ బిల్లులు ఆదా.. జనగామ మున్సిపాలిటీకి తాగునీటిని అందించడం కోసం నెలకు రూ.8 లక్షల మేర కరెంటు చార్జీల రూపంలో బిల్లు వస్తుండేది. కానీ రెండు నెలల నుంచి ఎలాంటి బిల్లులు లేకుండానే భగీరథ ద్వారా జిల్లా కేంద్రంలోని ప్రజలకు తాగునీటిని అందిస్తుండడం విశేషం. మిషన్ భగీరథ పథక వ్యయం రూ.45,000 కోట్లు ఇప్పటికి వరకు పథకం పూర్తి అయినది 65% . తాగునీరు అందనున్న ఆవాసాలు 24,215 రూ.35,000 కోట్లు మెయిన్ గ్రిడ్ వ్యయం 39,509 కి.మీ ఇంట్రా విలేజ్ పైపులైన్ 95,000 కి.మీ మెయిన్ గ్రిడ్ పైపులైన్ ఇంట్రా విలేజ్ వ్యయం రూ.10,000 కోట్లు -
మూడు మండలాల్లో 144 సెక్షన్
జనగామ: జనగామ జిల్లాలోని మూడు మండలాలను వరంగల్ జిల్లాలో కలపాలని ఆందోళనలు జరగుతున్న నేపథ్యంలో మూడు మండలాల పరిధిలో 144 సెక్షన్‌ను విధించారు. కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్, జఫర్గడ్, చిల్పుర్ మండలాలను తిరిగి వరంగల్ జిల్లాలో కలపాలని గత కొన్ని రోజులుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో నేటి నుంచి 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు ఖాజీపేట ఏసీపీ ఓ ప్రకటనలో తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున నిరసనలు, ధర్నాలు, సమావేశాలు, రోడ్ల మీద వంటా వార్పు వంటి కార్యక్రమాలు నిషేదమని అధిగమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
'ప్రజల ఆకాంక్షను కేసీఆర్ అర్థం చేసుకోవాలి'
జనగామ : జనగామ ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధం చేసుకోవాలని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటి సభ్యురాలు మల్లు స్వరాజ్యం అన్నారు.జనగామ ప్రత్యేక జిల్లా కోసం చేపడుతున్న రిలే దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు ఆదివారం ఆమె ఇక్కడికి వచ్చారు. జనగామకు విచ్చేసిన మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ... వీర తెలంగాణను వేరు తెలంగాణ చేసిన కేసీఆర్ జనగామను జిల్లా చేస్తే తప్పేముంది ప్రశ్నించారు. విస్నూరు దొరను తరిమికొట్టిన జనగామ వంటి పోరాటాల గడ్డను జిల్లాగా ప్రకటించాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ను మల్లు స్వరాజ్యం డిమాండ్ చేశారు.