
పాలకుర్తి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొ న్న కొన్నె పుల్లమ్మ (95) ఆదివారం మృతి చెందారు. జన గామ జిల్లా పాలకుర్తి మండలం ఎల్లరాయని తొర్రూరుకు చెందిన పుల్లమ్మ భర్త రామయ్య అజ్ఞాత దళ నాయకుడిగా తుపాకీ పట్టి నిజాం సైన్యం, రజాకార్ల ఆగడాలను ఎదిరించారు. పోరాటంలో భర్తతోపాటు పుల్లమ్మ కూడా పాల్గొన్నారు. రెండుసార్లు నిజాం సైన్యం పుల్లమ్మను పట్టుకోవడానికి వెంటపడితే బావిలో దూకి ప్రాణాలు రక్షించుకుని పోరాటాన్ని కొనసాగించారు. చివరి వరకు భారత ప్రభుత్వం సమరయోధులకు అందిస్తున్న పింఛన్ కోసం ఎదు రు చూసినా మంజూరు కాలేదు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పుల్లమ్మ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment