pullamma
-
సాయుధ పోరాట యోధురాలు కొన్నె పుల్లమ్మ మృతి
పాలకుర్తి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొ న్న కొన్నె పుల్లమ్మ (95) ఆదివారం మృతి చెందారు. జన గామ జిల్లా పాలకుర్తి మండలం ఎల్లరాయని తొర్రూరుకు చెందిన పుల్లమ్మ భర్త రామయ్య అజ్ఞాత దళ నాయకుడిగా తుపాకీ పట్టి నిజాం సైన్యం, రజాకార్ల ఆగడాలను ఎదిరించారు. పోరాటంలో భర్తతోపాటు పుల్లమ్మ కూడా పాల్గొన్నారు. రెండుసార్లు నిజాం సైన్యం పుల్లమ్మను పట్టుకోవడానికి వెంటపడితే బావిలో దూకి ప్రాణాలు రక్షించుకుని పోరాటాన్ని కొనసాగించారు. చివరి వరకు భారత ప్రభుత్వం సమరయోధులకు అందిస్తున్న పింఛన్ కోసం ఎదు రు చూసినా మంజూరు కాలేదు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పుల్లమ్మ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
దుర్మార్గం
ఆమె ఇంట్లో కూర్చుని టీవీ చూస్తోంది. ఇంట్లో ఉన్నాను కదా తనకేం భయం లేదనుకుంది. కానీ బరితెగించిన ఓ దొంగ నేరుగా ఆమె ఇంట్లోకి జొరబడ్డాడు. గొంతుపై కాలుపెట్టి ఒంటిపై ఉన్న నగలు ఇస్తావా.. చస్తావా.. అంటూ బెదిరించి బలవంతంగా పది తులాల బంగారు నగలు లాక్కెళ్లాడు. శనివారం సాయంత్రం జమ్మలమడుగులో ఈ సంఘటన చోటుచేసుకుంది. జమ్మలమడుగు : జమ్మలమడుగు పట్టణం నాగులకట్టవీధికి చెందిన గంజికుంట పుల్లమ్మ అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా కూర్చుని టీవీ చూస్తున్న సమయంలో ఓ 40 ఏళ్ల వ్యక్తి ఇంట్లోకి దూరాడు. ఆమె అరవకుండా గొంతుపై కాలు పెట్టాడు. ఒంటిపై ఉన్న 5 తులాల బంగారు గాజులు, 4తులాల గొలుసు, ము క్కుపుడకతోపాటు చెవి కమ్మలను లాక్కునే ప్రయత్నం చేశాడు. కమ్మలు రాకపోవడంతో గట్టిగా లాగాడు. దీంతో వృద్ధురాలి చెవి తెగింది. దీనికితోడు నిస్సహా యంగా ఉన్న ఆ వృద్ధురాలిపై దుండగుడు కర్కశంగా దాడిచేయడంతో నోట్లో నుంచి రక్తం కారింది. స్థానికుల సహకారంతో ఆమె పోలీసు స్టేషన్ లో ఫిర్యా దు చేసింది. వృద్ధురాలి కుటుంబ సభ్యులు ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉంటుండటంతో ఆమె ఒంట రిగా నాగులకట్ట వీధిలో నివాసముంటోంది. జమ్మలమడుగులో పెరుగుతున్న చోరీలు జమ్మలమడుగులో ఇటీవల దొంగతనాలు ఎక్కువయ్యాయి. బ్యాంక్ కాలనీలో ఓ గర్భిణి గుడి నుంచి ఇం టికి వెళుతుండగా ఓ దుండగుడు బైకుపై వచ్చి ఆమె మెడలోని తాళిబొట్టును లాక్కెళ్లాడు. అలాగే ఆర్టీసి బస్టాండ్ వద్ద నుంచి తన భర్తకు భోజనం క్యారీ తీసుకొని వస్తున్న మహిళపై కూడా ఇలాగే దాడిచేసి బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఇలాంటి సంఘటనలు పట్టణంలో పట్టపగలే జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.