దుర్మార్గం | Durmārgaṁ Depravity | Sakshi
Sakshi News home page

దుర్మార్గం

Published Sun, Jun 28 2015 1:56 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

దుర్మార్గం - Sakshi

దుర్మార్గం

ఆమె ఇంట్లో కూర్చుని టీవీ చూస్తోంది. ఇంట్లో ఉన్నాను కదా తనకేం భయం లేదనుకుంది. కానీ బరితెగించిన  ఓ దొంగ నేరుగా ఆమె ఇంట్లోకి జొరబడ్డాడు. గొంతుపై కాలుపెట్టి ఒంటిపై ఉన్న నగలు ఇస్తావా.. చస్తావా.. అంటూ బెదిరించి బలవంతంగా పది తులాల బంగారు నగలు లాక్కెళ్లాడు. శనివారం సాయంత్రం జమ్మలమడుగులో ఈ సంఘటన చోటుచేసుకుంది.
 
 జమ్మలమడుగు : జమ్మలమడుగు పట్టణం నాగులకట్టవీధికి చెందిన గంజికుంట పుల్లమ్మ అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా కూర్చుని టీవీ చూస్తున్న సమయంలో ఓ 40 ఏళ్ల వ్యక్తి ఇంట్లోకి దూరాడు. ఆమె అరవకుండా గొంతుపై కాలు పెట్టాడు. ఒంటిపై ఉన్న 5 తులాల బంగారు గాజులు, 4తులాల గొలుసు, ము క్కుపుడకతోపాటు చెవి కమ్మలను లాక్కునే ప్రయత్నం చేశాడు. కమ్మలు రాకపోవడంతో గట్టిగా లాగాడు. దీంతో వృద్ధురాలి చెవి తెగింది. దీనికితోడు నిస్సహా యంగా ఉన్న ఆ వృద్ధురాలిపై దుండగుడు కర్కశంగా దాడిచేయడంతో నోట్లో నుంచి రక్తం కారింది. స్థానికుల సహకారంతో ఆమె పోలీసు స్టేషన్ లో ఫిర్యా దు చేసింది. వృద్ధురాలి కుటుంబ సభ్యులు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటుండటంతో ఆమె ఒంట రిగా నాగులకట్ట వీధిలో నివాసముంటోంది.

 జమ్మలమడుగులో పెరుగుతున్న చోరీలు
 జమ్మలమడుగులో ఇటీవల దొంగతనాలు ఎక్కువయ్యాయి. బ్యాంక్ కాలనీలో ఓ గర్భిణి గుడి నుంచి ఇం టికి వెళుతుండగా ఓ దుండగుడు బైకుపై వచ్చి ఆమె మెడలోని తాళిబొట్టును లాక్కెళ్లాడు. అలాగే ఆర్టీసి బస్టాండ్ వద్ద నుంచి తన భర్తకు భోజనం క్యారీ తీసుకొని వస్తున్న మహిళపై కూడా ఇలాగే దాడిచేసి బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఇలాంటి సంఘటనలు పట్టణంలో పట్టపగలే జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement