Palakurthi
-
మా జోలికి రావొద్దు.. మేం ఖాళీచేయం
జనగామ, సాక్షి: పాలకుర్తి మండలం తొర్రూరు(జే) గ్రామంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అక్రమంగా చొరబడి ఉంటున్న కొన్ని కుటుంబాలను ఖాళీ చేయించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. వాళ్లు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తమను ఖాళీ చేయించొద్దని పాలకుర్తి రెవెన్యూ సిబ్బందిని వాళ్లు వేడుకున్నారు. అయినా అధికారులు బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీంతో.. పెట్రోల్ బాటిల్‌తో ఆత్మహత్యాయత్నం చేస్తామని బెదిరింపులకు దిగారు. తమలోనూ అర్హులైన వాళ్లం ఉన్నామని, తక్షణమే గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని కొందరు మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అయినా అధికారులు పోలీసుల సాయంతో వాళ్లను అడ్డుకుని ఖాళీ చేయించాలని యత్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ 20 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించినట్లు తెలుస్తోంది. -
పొత్తుల కామెడీ..
-
మీరు తిడితే.. మేము పడుతుంటామా?: రేవంత్‌పై కడియం ఫైర్
సాక్షి, జనగామ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికి హద్దు, అదుపు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, సీనియర్ నేత కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సీఎంకు ఉండవలసిన హుందాతనం రేవంత్‌రెడ్డిలో లోపిస్తుందని ఎద్దేవా చేశారు. మీరు తిడుతుంటే.. మేము పడుతూ ఉంటామా? అని మండిపడ్డారు. తమకు కూడా చీము, నెత్తురు ఉన్నది.. తాము కూడా ఎదో ఒక భాషలో తిట్టేలాగా? చేస్తున్నారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను చార్లెస్ శోభరాజ్, కేటీఆర్, హరీష్ రావులను బిల్లా-రంగా అని విమర్శించడం విడ్డూరమని అన్నారు. చార్లెస్ శోభరాజ్, బిల్లా- రంగా కంటే పెద్ద చరిత్ర రేవంత్ రెడ్డిది అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి చరిత్ర తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. బీఆర్ఎస్ను బోందపెట్టేవాడు.. ముక్కలు చేసేవాడు ఇంకా పుట్టలేదని అన్నారు. బీఆర్ఎస్ను పాతిపెట్టడం ఎవరితో కాదు.. నీ అయ్యతో కూడా కాదని తీవ్రంగా విమర్శించారు. చదవండి: సీఎం రేవంత్‌తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ.. ఏం జరుగుతోంది? -
అత్త వ్యూహం.. కోడలు విజయం
పాలకుర్తి: ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందునుంచి ఊహించినట్లే పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లిపై కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో పాలకుర్తి సీటు ఎంపికలో ఆ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న హనుమాండ్ల ఝాన్సీరెడ్డి .. చివరి నిమిషంలో ఆమె కోడలు యశస్వినిని బరిలోకి దింపారు. అత్త వ్యూహం.. కోడలు విజయం పాలకుర్తి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బరిలో దిగుతారని అందరూ ఆశించారు. అయితే. చివరి నిమిషంలో ఝాన్సీ భారత పౌరసత్వంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఝాన్సీరెడ్డి కుటుంబ సభ్యురాలైన యశస్వినినికే కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. దీనిపై సర్వత్రా చర్చ కూడా జరిగింది. పాలకుర్తి నియోజకవర్గంలో తిరుగులేని ఎమ్మెల్యేగా రాణిస్తూ మంత్రిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చెక్‌పెట్టేలా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ఎన్ఆర్ఐ ఝాన్సీలక్ష్మీరెడ్డిని రంగంలోకి దింపారు. ఇలాంటి తరుణంలోనే ఝాన్సీలక్ష్మీరెడ్డి భారత దేశ పౌరసత్వంపై వివాదం తలెత్తింది. వారం రోజుల వరకూ తనకు పౌరసత్వం వస్తుందనీ, ఏలాంటి అపోహాలకు గురికావద్దన్న ఝాన్సీరెడ్డి ప్రత్యామ్నయంగా తన కోడలును ఎన్నికల సమరంలో దింపేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వాస్తవానికి హనుమాంఢ్ల ఝాన్సీరెడ్డి పౌరసత్వం అడ్డోస్తే దేవరుప్పుల మండలం మాధాపురంకు చెందిన ప్రముఖవైద్యులు, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణనాయక్ రావడం అనివార్యంగా బావించారు. కానీ పాలకుర్తి నుంచి కాంగ్రెస్ జెండా ఎగురవేసే లక్ష్యంగా ఇక్కడి ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన తన కుటుంబం తగ్గేదీలేదని ఎట్టకేలకు తన కోడలు యశస్వినికి రెండో విడతలో కాంగ్రెస్ టికెటు సాధించడంలో సఫలీకృతమయ్యారు ఝాన్సీరెడ్డి, అప్పటివరకూ తానొక్కతే ప్రచారంలో దూసుకపోతున్న క్రమంలో తోడుగా కోడలు రావడంతో కొంత పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొన్నప్పటీకీ డబుల్ ప్రచారంతో ప్రభుత్వ వ్యతిరేకతను కలిగిన ప్రజల్ని కూడగట్టుకొని చారిత్రాత్మక విజయం సాధించి ఝూన్సీరెడ్డి తనమార్కు నిలుపుకున్నారు. ఫలితంగా తొలిసారి పోటీ చేసి గెలుపును సొంతం చేసుకోవడంతో యశస్విని అరుదైన ఘనతసు సొంతం చేసుకున్నారు. ఆది నుంచి ఎర్రబెల్లే టార్గెట్.. ఎర్రబెల్లిని కచ్చితంగా ఓడించాలనే వ్యూహంతో ఆది నుంచి పావులు కదిపిన కాంగ్రెస్ తన వ్యూహాన్ని కచ్చితంగా అమలు చేసింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది కాంగ్రెస్. యశస్విని కూడా తన ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లిపై పదునైన విమర్శలు చేసి ఓటర్లను ఆకర్షించింది. దానికి తోడు కాంగ్రెస్ జోష్ కూడా తోడవడంతో ఆమె గెలుపు సునాయాసమైంది. ఇక పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. .ఎర్రబెల్లికి ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. కానీ అది ఈసారి కలిసి రాలేదు. కాంగ్రెస్ జోరు ముందు ఎర్రబెల్లి పరాజయం చెందారు. మరొకవైపు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రామ్మోహన్రెడ్డ పెద్దగా ప్రభావం చూపలేదు. తొలి జాబితాలోనే సీటు దక్కించుకని ప్రచారాన్ని ఆదిలోనే ప్రారంభించినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం కాంగ్రెస్‌కే షిప్ట్ అయ్యింది. -
పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా హనుమాండ్ల యశశ్విని రెడ్డి
-
బండి సంజయ్ కు వైద్య పరీక్షలు..!
-
పాలకుర్తిలో ‘పవర్’ ఎవరికి?.. మంత్రి ఎర్రబెల్లి గెలుస్తారా?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలకమైన నియోజకవర్గం పాలకుర్తి. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. ఓటమి ఎరుగని నేత, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాలకుర్తి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతానికి ఎర్రబెల్లిని ఓడించగల నేత పాలకుర్తిలో లేరనే ప్రచారం సాగుతోంది. అందుకే ఆయన్ను ఓడించే వారి కోసం అటు కాంగ్రెస్, ఇటు కమలం పార్టీ భూతద్దాలు పెట్టుకుని వెతుకుతున్నాయి. మరి ఎర్రబెల్లి విజయానికి ఎవరైనా బ్రేకులు వేయగలుగుతారా? పోరాటాల పురిటిగడ్డ పోరాటాల పురిటిగడ్డ పాలకుర్తి నియోజకవర్గం వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించింది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎర్రబెల్లికి కంచుకోటగా మారింది పాలకుర్తి. నియోజకవర్గాల పునర్విభజనతో 2009 నుంచి రెండు సార్లు టిడిపి తరపున, ఒకసారి టిఆర్ఎస్ తరపున గెలిచారు. విపక్ష అభ్యర్థుల బలహీనతల్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఎర్రబెల్లి విజయం సాధిస్తారు. ఇప్పటికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపిగా గెలిచి ఓటమి ఎరుగని నేతగా రికార్డు సృష్టించారు. తెలంగాణాలో సీఎం కేసిఆర్ తర్వాత వరుస విజయాలు నమోదు చేసుకున్న వ్యక్తిగా ఎర్రబెల్లి ఉన్నారు. ఓటమి ఎరుగని నేతకు రాబోయే ఎన్నికల్లో చుక్కలు చూపేందుకు కాంగ్రెస్, బిజేపి కసరత్తు చేస్తున్నాయి. ఎర్రబెల్లిని ఎదుర్కునే బలమైన నేత కోసం వెతికే పనిలో ఆ రెండు పార్టీలు నిమగ్నమయ్యాయి. స్థానిక నాయకులను కాదని ఎన్ఆర్ఐలపై దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే పలువురితో సంప్రదింపులు జరిపారు. అయితే ఎర్రబెల్లిపై పోటీకి ఎన్ఆర్ఐలు ఎవరూ ఆసక్తి చూపడం లేదని సమాచారం. స్థానిక నేతలు మాత్రం చాలా మంది పోటీకి సై అంటున్నారు. ఎర్రబెల్లి వర్సెస్ కొండా ఎర్రబెల్లి దయాకరరావు మీద కాంగ్రెస్ నుంచి కొండా మురళీ పోటీ చేస్తారనే టాక్ నడుస్తోంది. మురళి.. ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య ఏనాటి నుండో రాజకీయంగా వైరం కొనసాగుతోంది. ఎర్రబెల్లిని ఓడించాలన్న పట్టుదలతో కొండా మురళి వున్నారు. అయితే మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కొడుకు రఘురాంరెడ్డిపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన పొంగులేటి శ్రీనివాస రెడ్డి వియ్యంకుడు. స్థానిక నాయకులు ముత్తినేని సోమేశ్వర్ రావు సైతం టిక్కెట్ ఆశిస్తున్నారు. ఎవ్వరనేది క్లారిటీ లేకపోయినప్పటికి ఎవరికి వారే పాలకుర్తి టిక్కెట్ తనదే అని ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ నుండి గత ఎన్నికల్లో పెదగోని సోమయ్య పోటీ చేసి ఓడిపోయారు. ఎర్రబెల్లి సుధాకర్ రావు, యతి రాజారావు కుటుంబాల నుండి ఎవరో ఒకరు పోటీ చేయాలని భావిస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి బిజేపిలో చేరితే ఆయన వియ్యంకుడు రఘురాంరెడ్డిని కూడా చేర్చుకుని బరిలో నిలిపేందుకు కమలనాథులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రఘురాంరెడ్డి పాలకుర్తిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. మంత్రిగారికి మార్కెలెన్ని? పాలకుర్తి నియోజకవర్గం.. అభివృద్ది విషయంలో ఉమ్మడి జిల్లాలోనే ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఎన్నికల ముందు మంత్రి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. పాలకుర్తి మండల కేంద్రాన్ని, సోమేశ్వరాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పాలకుర్తి, బమ్మెర, వల్మిడి కారిడార్‌ను 62కోట్లతో అభివృద్ది చేస్తున్నారు. 150 కోట్లతో పాలకుర్తి చుట్టూ డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్దికి పెద్దపీట వేసి పాలకుర్తి రూపురేఖలే మార్చేశారు. నియోజకవర్గ కేంద్రంలో అనుకున్నదాని కంటే ఎక్కువగానే అభివృద్ది జరిగినప్పటికి.. ఇతర ప్రాంతాల్లో కొన్ని పనులు ఇంకా పెండింగ్ లో ఉండగా.. మరికొన్ని మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కి అన్నచందంగా సాగుతున్నాయి. పాలకుర్తిలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తామన్న హామీ అలానే మిగిలిపోయింది. కనీసం పోస్ట్ మార్టమ్ గది లేక జనగామకు వెళ్ళాల్సి వస్తోందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. పోస్ట్ మార్టమ్ గది ఏర్పాటుకు 2009లో ఇచ్చిన హామీ...హామీగానే మిగిలిపోయిందంటున్నారు స్థానికులు. నీళ్ల చుట్టూ రాజకీయాలు పాలకుర్తి ఏరియా మొత్తం మెట్టప్రాతం కావడంతో చాలా ప్రాంతాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా చెన్నూరు రిజర్వాయర్‌ను పాలకుర్తి రిజర్వాయర్ గా మార్చి నియోజకవర్గం రైతులకు సాగునీరు అందిస్తానని ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరక అసంతృప్తిలో పాలకుర్తి ప్రజలు ఉన్నారు. అయితే మంత్రి ఇటీవలనే మూడు జిల్లాల అధికారులతో సమావేశమై పనులపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే వేసవిలోపు రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండల కేంద్రాలకు సంబంధించి బాలికల జూనియర్ కళాశాల తెప్పిస్తానని.. అదేవిధంగా డిగ్రీ కళాశాల తెస్తానని 2009 నుండి ప్రజలకు హామీ ఇస్తున్నారు. అది కూడా పాలకుర్తి ప్రజలకు కలగానే మిగిలిపోయింది. డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ళ కోసం లబ్డిదారులు ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్నా, ఫలితం కనిపించడంలేదు. ఎన్నికల్లో అభివృద్ధి పాత్ర ఎంత? నియోజకవర్గంలో ఏకైక మున్సిపాలిటి తొర్రూర్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేయడంతో పాటు..పట్టణాన్ని 66కోట్లతో సర్వాంగసుందరంగా అభివృద్ది చేశారు. ఇచ్చిన హామీలే కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేస్తూ ప్రజల మనిషిగా పేరుతెచ్చుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రత్యర్థులు ఎవ్వరైనా సరే.. ప్రజలు తన వెంటే ఉంటారనే నమ్మకంతో ఉన్నారాయన. చదవండి: దుబ్బాకలో దుమ్ము రేపేదెవరు? నాడు వర్థన్నపేట అయినా.. ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గం అయినా.. ఏదైనా సొంత ఊరిలా భావిస్తూ అభివృద్ధి చేస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు. అందుకే ప్రజలు నుంచి దయాకర్ రావుకు పెద్దగా వ్యతిరేకత లేకపోయినప్పటికి మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపద్యంలో ఇంకాస్త కష్టపడక తప్పదనే భావన కలుగుతోంది. రాబోయే ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థులు బలమైనవారైతే...ప్రజల మూడ్ మారితే ఎర్రబెల్లి దయాకరరావుకు చుక్కలు కనిపిస్తాయనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
క్రీడాకారులతో కబడ్డీ ఆడిన మంత్రి ఎర్రబెల్లి
సాక్షి, పాలకుర్తి: నిత్యం రాజకీయాల్లో బీజీగా ఉండే ఎర్రబెల్లి దయాకర్‌రావు కబడ్డీ, కబడ్డీ అంటూ కూతబెట్టి ఆట ఆడారు. పాలకుర్తి నియోజకవర్గం వావిలాల గ్రారమంలో మూడు రోజులపాటు జరిగే జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ పోటీల్లో పాల్గొనే 40 టీముల క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్ ఆటలలో కెప్టెన్‌గా ఉన్నానని.. ఆటలంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అందుకే ఆరోగ్యంగా ఉన్నానని, మీరు కూడా ఆటలను ఆడి.. ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రానికి పేరు తేవాలని వారిలో స్ఫూర్తిని రగిలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు నవీన్, సర్పంచ్ గంట పద్మ, భాస్కర్ తదితరులు ఉన్నారు. చదవండి: (పవన్‌లో స్పష్టంగా కనిపించిన అభద్రతా భావం.. సభ ఆద్యంతం ఆరు తిట్లు–మూడు విమర్శలు) -
ఆస్తి వివాదం.. తండ్రి ప్రాణం తీసిన కుమారుడు
పాలకుర్తి టౌన్: ఆస్తి వివాదంలో ఓ తనయుడు తండ్రిని కొట్టి చంపాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్నులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈరవెన్ను గ్రామానికి చెందిన చిడిమిండ్ల నర్సిరెడ్డి (57)కి రాజు, రమేశ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అతనికి ఏడున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా గత ఏడాది ఇద్దరు కుమారులకు మూడు ఎకరాల చొప్పున పంపకాలు చేశాడు. ఎకరం 20 గుంటల భూమిని తన భాగంగా తీసుకున్నాడు. కాగా, తరచూ అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నర్సిరెడ్డి భార్య చనిపోవడంతో అతను చిన్న కుమారుడు రమేశ్ వద్ద ఉంటున్నాడు. ఇదిలా ఉండగా పెద్ద కుమారుడు రాజు తనకు అప్పులు పెరిగాయని, ఇంటిని అమ్మాలంటూ గొడవ పడుతుండేవాడు. పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఇంటి పంపకం విషయంలో తనకు అన్యాయం జరిగిందని, తండ్రిని, తమ్ముడిని చంపుతానని బెదిరించేవాడు. ఈ క్రమంలో గురువారం నర్సిరెడ్డి పొలం పనులు చేసేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా రాజు వెళ్లి గొడవ పడ్డాడు. తండ్రిని బురదలో పడేసి తలపై కొట్టి చంపాడు. నర్సిరెడ్డి ఎంతకూ ఇంటికి రాకపోవడంతో అతనికోసం కుటుంబ సభ్యులు వెతకగా రాత్రి సమయంలో పొలంలో మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ఘటనపై శుక్రవారం రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాస్‌రావు, సీఐ విశ్వేశ్వర్, ఎస్సైశ్రీకాంత్ సందర్శించి దర్యాప్తు చేపట్టారు. చదవండి: బాత్రూం కిటికీ నుంచి దూరి చోరీ.. భర్తతో కలిసి రూ.47 లక్షలు.. -
పండుగపూట విషాదం.. ప్రేమించి పెళ్లి.. చిన్నచిన్న గొడవలకే
సాక్షి, రామగుండం(కరీంనగర్): పండుగపూట ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం పాలకుర్తి మండలం కుక్కలగూడుర్ గ్రామంలో విషాదం నింపింది. బసంత్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కందుల శంకరయ్య– కళావతి దంపతుల కూతురు అనూష (24), అదే గ్రామానికి చెందిన మేడం బాపు కుమారుడు మేడం రాకేశ్ ప్రేమించుకుని ఎనిమిది నెలల క్రితం పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో తన తల్లిగారింట్లో ఉన్న అనూషను శనివారం రాత్రి రాకేశ్ వారి ఇంటికి తీసుకెళ్లాడు. రాత్రి సమయంలో ఎప్పుడో పురుగుల మందు తాగిన అనూష ఆదివారం వేకువజామున బాత్రూంకు వెళ్లి కిందపడిపోయింది. నోటివెంట నురుగులు రావడాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ధర్మారంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. బసంత్‌నగర్ ఎస్సై మహేందర్‌యాదవ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: బతుకమ్మ పండగ వేళ విషాదం.. మరొకరితో సహజీవనం చేస్తోందని.. గ్రామంలో విషాదం ఎంగిలిపూల బతుకమ్మ పండుగ రోజున జరిగిన ఈ ఘటనతో కుక్కలగూడుర్ గ్రామంలో విషాదం నెలకొంది. మృతురాలు అనూష తండ్రి కందుల శంకరయ్య ఏడాదిక్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. ప్రస్తుతం అనూష ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. -
జనావాసాల్లోకి ఎలుగుబంటి
పాలకుర్తి టౌన్: జనగామ జిల్లా పాలకుర్తి మండలకేంద్రంలో ఎలుగుబంటి సంచారం అలజడి రేపింది. బుధవారం రాత్రి ఎలుగబంటి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ నుంచి డివైడర్ దాటుతుండగా మారం శ్రీనివాస్ తన కారులో వెళ్తూ వీడియో తీశాడు. గురువారం ఉదయం రాజీవ్ చౌరస్తా నుంచి లక్ష్మీనారాయణపురం గ్రామంలోని పంట పొలాల్లో సంచరించింది. దీంతో స్థానికులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. అచూకీ కోసం పోలీసులు వెదకడం మొదలుపెట్టారు. పాలకుర్తి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అఖిలేశ్ ఎలుగుబంటి పాదముద్రలను సేకరించారు. -
ఆస్తి మొత్తం మూడో కూతురికేనా.. మాకేదీ!
సాక్షి,పాలకుర్తి: ఆస్తి పంపకాల్లో వచ్చిన విభేదాల కారణంగా కన్నతండ్రి అంత్యక్రియలను సొంత కూతుళ్లే అడ్డుకున్నారు. ఆస్తిని సమానంగా పంచాల్సిందేనంటూ పట్టుబట్టారు. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన దీకొండ చంద్రయ్య(74)కు నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుమారులు లేరు. చంద్రయ్య అనారోగ్యానికి గురైనప్పటి నుంచి మూడో కుమార్తె ఆయన బాగోగులు చూస్తోంది. ఈ క్రమంలో చంద్రయ్య అనారోగ్యంతో మంగళవారం ఉదయం మృతి చెందారు. తండ్రి ఆస్తి మొత్తం మూడో కుమార్తె తీసుకుందని ఆరోపిస్తూ మిగతా కూతుళ్లు దహన సంస్కారాలను అడ్డుకున్నారు. ఆస్తిని సమానంగా పంచాలన్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్ఐ గండ్రాతి , పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంతరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దహన సంస్కారాలు పూర్తయ్యాక మాట్లాడుదామని నచ్చజెప్పడంతో కూతుళ్లు అంగీకరించారు. తల్లిదండ్రుల ఆస్తి కోసం కుమార్తెలు గొడవకు దిగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
ఫోన్ కొనివ్వలేదని.. విద్యార్థిని ఆత్మహత్య
పాలకుర్తి: ఆన్లైన్ పాఠాలు వినడానికి సెల్‌ఫోన్ కావాలని అడగగా, తల్లిదండ్రులు కొనివ్వలేదనే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్పై గండ్రాతి సతీష్ కథనం ప్రకారం.. శీల వెంకన్న, మంజుల దంపతుల కుమార్తె సింధూజ 9వ తరగతి చదువుతోంది. స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో పాఠాలకు దూరమైంది. ఈ క్రమంలో సెల్‌ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతూ వస్తోంది. అయితే వారు ఫోన్ కొనివ్వకపోవడంతో మనస్తాపం చెంది ఆదివారం ఇంటి పరిసరాల్లో గల చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
సాయుధ పోరాట యోధురాలు కొన్నె పుల్లమ్మ మృతి
పాలకుర్తి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొ న్న కొన్నె పుల్లమ్మ (95) ఆదివారం మృతి చెందారు. జన గామ జిల్లా పాలకుర్తి మండలం ఎల్లరాయని తొర్రూరుకు చెందిన పుల్లమ్మ భర్త రామయ్య అజ్ఞాత దళ నాయకుడిగా తుపాకీ పట్టి నిజాం సైన్యం, రజాకార్ల ఆగడాలను ఎదిరించారు. పోరాటంలో భర్తతోపాటు పుల్లమ్మ కూడా పాల్గొన్నారు. రెండుసార్లు నిజాం సైన్యం పుల్లమ్మను పట్టుకోవడానికి వెంటపడితే బావిలో దూకి ప్రాణాలు రక్షించుకుని పోరాటాన్ని కొనసాగించారు. చివరి వరకు భారత ప్రభుత్వం సమరయోధులకు అందిస్తున్న పింఛన్ కోసం ఎదు రు చూసినా మంజూరు కాలేదు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పుల్లమ్మ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
‘నేనే సీనియర్ రౌడీని నాకే టికెట్ ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్ : ‘నేను సీనియర్ రౌడీషీటర్.. నాకే టికెట్ ఇవ్వాలి’అని ఓ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఈ విషయాన్ని ఓ అభిమాని ట్విటర్లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకురాగా.. మన కర్మరా! బాబు అనే ఎమోజీతో ఆయన రిట్వీట్ చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. వరంగల్ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి, ఇదే టికెట్ ఆశిస్తున్న వారి పార్టీకే చెందిన మరో నేత రాఘవ రెడ్డిని ఉద్దేశించి విలేకరులతో మాట్లాడారు. ‘నేను నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినా. కాంగ్రెస్ పార్టీ కోసమే రౌడీ షీటర్‌గా ఉన్నా. కాబట్టి నాకే టికెట్ ఇవ్వాలి. సీనియర్ రౌడీ షీటర్‌ను నేనే. నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది నేనే. రాఘవ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఎన్నడు సేవ చేయలేదు.’ అని సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ప్రెస్‌మీట్ ఎప్పుడు ఎక్కడ జరిగింది మాత్రం స్పష్టత లేదు. కానీ ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక నెటిజన్లు మాత్రం అతని నిజాయితీకి అన్నా కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 😅 https://t.co/ANAXGuwibJ — KTR (@KTRTRS) 29 October 2018 Telangana- Fight over Congress Palakurthy ticket in Warangal. According to a few Congress leaders- the seniot ‘rowdy’ in the party should get the ticket. Nenu nee kanna senior rowdy nenu- says Sudhir Reddy to his opponent Raghav Reddy. #Congress #Telangana #TelanganaElections pic.twitter.com/CF5M8vSLIv — Rishika Sadam (@RishikaSadam) 27 October 2018 -
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం
పాలకుర్తిటౌన్ : సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ప్రజ లకు ఇచ్చిన హామీలను విస్మరించాడని డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేందుకే కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రంలో వచ్చేనెలలో జరుగనున్న బస్సుయాత్ర, బహిరంగ సభ స్థలాన్ని గురువారం జంగా రాఘవరెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంత రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడి న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్, దళితులకు మూడెకరాలు, రైతులకు గిట్టుబాటు ధరలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, సాగు, తాగునీరు హామీలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 లక్షలు రుణాలు మాఫీ చేసి తిరిగి రూ. 2 లక్షలు కొత్త రుణాలిస్తామన్నారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని రూ. 2 లక్షలకు పెంచుతామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసమే కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్ర చేపట్టిందన్నారు. బహిరంగ సభకు 40 వేల మందిని తరలించనున్నట్లు తెలిపారు. సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కోతి ఉప్పలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్తింటి వెంకటేశ్వర్లు, టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ గుండాల నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, ఉప్పల సురేష్‌బాబు, హమ్యానాయక్, రవీంద్రాచారి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనపర్తి ఉపేంద్ర, సరస్వతి, కల్పనాదేవి, రాపాక సత్యనారాయణ, కుమార్ పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో ఐలమ్మ విగ్రహం పెట్టిస్తా
జయంతి సభలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి పాలకుర్తి : తనకోసం కాకుండా పదిమంది బాగు కోసం చాకలి ఐలమ్మ పోరాడిన గడ్డకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలో చాకలి అయిలమ్మ 121వ జయంతి వేడుక సభ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. హై దరాబాద్‌లో ఐలమ్మ కాంస్య విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ఐలమ్మ పేరును ఏదైనా ప్రాంతానికి లేదా ప్రభుత్వ సంస్థకు పెట్టేలా సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని అన్నారు. ఐలమ్మ చేసిన పోరాటం అణగారిన వర్గాలకు స్ఫూర్తిదాయకమని నివాళులర్పిం చారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ అమర వీరుల చరిత్రను భావి తరాలకు తెలిపేలా శౌర్యయాత్ర నిర్వహించాలని కోరారు. ఐలమ్మ పోరాటం నిజాంపై మాత్రమే కాదని, బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడిందని అన్నారు. తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినసోమనాధుడువంటి మహావీరులు జన్మిం చిన పాలకుర్తి గడ్డ చరిత్ర ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. ఐలమ్మ వారసులను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. రజక సంఘ రాష్ట్ర నాయకులు మల్లేశం మాట్లాడుతూ ఐలమ్మ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. తెలం గాణ తల్లి విగ్రహం దొరసానిలా కాకుండా ఐలమ్మలా ఉండేలా చూడాలన్నారు. ఐలమ్మ మనవడు చిట్యాల రాంచంద్రం ఆధ్వర్యంలో జరి గిన సభలో రజక సంఘం జిల్లా నాయకులు ఉప్పలయ్య, సాంబరాజు యాదగిరి, ఎంపీపీ భూక్య దల్జీత్ కౌర్, జడ్పీటీసీ సభ్యుడు బన్నెపాక గణేష్, వైస్ ఎంపీపీ గూడ దామోదర్, టీఆర్ఎస్ నాయకులు ముస్కు రాంబాబు, నల్ల నాగిరెడ్డి, గంగు కృష్ణమూర్తి, సీపీఎం నాయకులు సోమ సత్యం, చిట్యాల సోమన్న, అయిలమ్మ వారసులు పాల్గొన్నారు. -
ఫేస్ బుక్ పరిచయంతో మోసపోయాను
► సేవా కార్యక్రమాలకు రూ.50 లక్షలు విరాళం ఇస్తానంటే నమ్మి రూ.7 లక్షలు ఖాతాలో వేశాను ► ప్రభుత్వం, దాతలు ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యం ► బాధితురాలి ఆవేదన పాలకుర్తి: అమెరికాకు చెందిన వ్యక్తి చేతిలో తాను మోసపోయానని పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన అనంతోజు రజిత ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ఫేస్బుక్లో పోస్టు చేయగా.. ఆ ఫొటోలు, వివరాలు చూసిన అమెరికాకు చెందిన టోని మార్క్ అనే వ్యక్తి స్పందించి సేవా కార్యక్రమాలు బాగున్నాయంటూ పరిచయం చేసుకున్నాడని చెప్పింది. తాను ఏర్పాటు చేయదలుచుకున్న అనాథ శరణాలయం కోసం విరాళం ఇస్తామని చెబితే నమ్మానని తెలిపింది. ముందుగా తనకు అత్యవసరంగా రూ.7 లక్షలు అవసరం ఉన్నాయని టోని మార్కు చెబితే నమ్మి అతను ఇచ్చిన అకౌంట్లో వేసి.. అతడి మోసానికి బలయ్యానని చెప్పింది. స్నేహితులు, బంధువుల దగ్గర అప్పులు తెచ్చి ఇచ్చానని రజిత తెలిపింది. తన పరిస్థితి అర్ధం చేసుకుని దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలని, లేకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని పేర్కొంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని చెప్పింది. -
భారీ వర్షం.. ఆరుగురిని రక్షించిన పోలీసులు
వరంగల్: వరంగల్ జిల్లా పాలకుర్తిలో గురువారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం అర్ధరాత్రి దాటాక ఇస్నూరు కాజ్వే వద్ద ఓ వ్యాను వరదల్లో చిక్కుకు పోయింది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎస్సై వెంకటేశ్వర్లు తన బృందంతో వెళ్లి.. వ్యానులోని ఆరుగురు వ్యక్తులను రక్షించారు. అలాగే భారీ వర్షంతోపాటు ఈదురు గాలుల కారణంగా మొండ్రాయి - స్టేషన్‌ఘన్‌పూర్ రహదారిలో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
కేసీఆర్ పాలనకు ప్రజల ఆమోదం
పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయూకర్‌రావు పాలకుర్తి : సీఎం కేసీఆర్ రెండేళ్ల పాలనకు అన్నివర్గాల ప్రజలఆమోదం ఉందని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మె ల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం నియోజకవర్గ కేం ద్రంలో తెలంగాణ రాష్ర్ట ద్వితీయ అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పాల కుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహానికి, సాయుధ పోరాట యోధు రాలు చాకలి అయిలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేశారు. అనంతరం మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. మరో మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మలి విడత ఉద్యమంలో ప్రాణాలర్పించిన తొలి అమరుడు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి, ఎంపీపీ భూక్య దల్జీత్ కౌర్, జెడ్పీటీసీ సభ్యుడు బన్నెపాక గణేష్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నల్ల నాగిరెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు రాంబాబు, తొర్రూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, పాలకుర్తి సర్పంచ్ అంజమ్మ, ఎంపీటీసీ విజయ, కొడకండ్ల మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, నాయకులు పసునూరి నవీన్, గంగు కృష్ణమూర్తి, ఎస్ఐ ఎన్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
వరంగల్ : వరంగల్ జిల్లా పాలకుర్తిలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ... సీజ్ చేశారు. అందుకు సంబంధించి.. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రుణభారంతో రైతు బలవన్మరణం
పాలకుర్తి (వరంగల్) : అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం ఇరవెన్ను గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పొన్నాల పెద్ద రాంచంద్రం(55) తనకున్న నాలుగెకరాల్లో పత్తి సాగు చేశాడు. పంటల సాగుకు రూ. 3 లక్షలు అప్పు చేశాడు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో పంట దిగుబడి తగ్గడంతో అప్పు ఎలా తీర్చాలోననే మనోవేదనతో సోమవారం సాయంత్రం ఇంట్లో పురుగు మందు తాగాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎస్ఐ నాగభూషణం కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పాలకుర్తి కోసం ఫైటింగ్
పీసీసీ నేతల ముందే బాహాబాహీ జంగా, దుగ్యాల వర్గీయుల కొట్లాట వర ంగల్ : వరంగల్ ఉప ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు ఎవరు నిర్వర్తించాలన్న విషయంపై పీసీసీలో సం దిగ్ధత నెలకొంది. ఈ విషయం సోమవారం పీసీసీ నేతలు హన్మకొండలోని డీసీసీ భవన్లో నిర్వహించిన ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో బహిర్గతమైంది. మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు పాలకుర్తి నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జిగా వ్యవహరిస్తు న్నా జెడ్పీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో మొదలైన విబేధాల కారణంగా ఆయన పార్టీ కార్యక్రమాలు, నియోజకవర్గ కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. అప్పటి నుంచి అక్కడి నేతలు, కార్యకర్తలు డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి నేతృత్వంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ఏడాదిన్నరగా పాలకుర్తిలో పార్టీ రెండుగా చీలింది. హన్మకొండలోని డీసీసీ భవన్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో దుగ్యాల వర్గీయులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని తెలిసింది. ఈ విషయాన్ని సదరు నేతలు దుగ్యాలకు చేరవేయడంతో ఆయన డీసీసీ భవన్‌కు వచ్చారు. దుగ్యాల వచ్చిన విషయం తెలుసుకున్న ఆయన వర్గీయులు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో జం గా రాఘవరెడ్డి వర్గీయులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాలను పీసీసీ నేతలు ఇరువురిని వేర్వేరు చాంబర్లలోకి రావాలని కోరారు. వీరితో మాట్లాడుతున్న సమయంలోనే అదే చాంబర్ల ముందు మాటమాట పెరగడంతో అగ్రనేతల సాక్షిగా ఇరువర్గాల కు చెందిన నేతలు, కార్యకర్తలు పరస్పర దూషణలతో పాటు భౌతి క దాడులకు దిగారు. అరుుతే, నేతల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత కూడా యూత్ కాంగ్రెస్‌లోని రెండు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు రోడ్లపై ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలకు దిగగా పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వెళ్లిపోయూరు. ఈవిషయమై ఇరు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీసీసీబీ చైర్మన్ జంగా రా ఘవరెడ్డి అనుచరులు బిల్లా సుధీర్‌రెడ్డి, బేరిపెల్లి విజయకుమార్, జల్లం కుమార్, కోతి ఉప్పలయ్య, కాసరపు ధ ర్మారెడ్డి తదితరులు తనపై దాడి చేశారని కడవెండికి చెందిన కౌడగాని సోమయ్య సో మవారం రాత్రి ఫిర్యాదు చేశారు. అయితే, జంగా రాఘవరెడ్డి వర్గీయులు కూడా తమపై దుగ్యాల ప్రోద్బలంతో ఆయన అనుచరులు దాడి చేశారని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇన్చార్జితోనే భవిష్యత్తు వరంగల్ ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తే భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుందని భావించి నందునే ఇద్దరు నేతలు పట్టుపడుతున్నట్లు తెలిసింది. దుగ్యాల శ్రీనివాసరావు పార్టీకి పూర్తిగా దూరం ఉండడంతో పార్టీ శ్రేణులన్నీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డికి దగ్గరయ్యాయి. పార్టీ కార్యక్ర మాలను విజయవంతం చేస్తుండడంతో ఆయనకు మద్దతు పెరుగుతోంది. ఈ విషయం దుగ్యాల వర్గీయులకు రుచించకపోవడం తో గలాటా సృష్టించినట్లు వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. కాగా, పాలకుర్తి ఇన్చార్జ్ వ్యవహారంపై మంగళవారం జిల్లా పార్టీ నేతలు సమావేశమై నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. -
టీడీపీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ బేరమాడారు
ఆ రికార్డులు మా దగ్గరున్నాయి : ఎర్రబెల్లి పాలకుర్తి: రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సిం హారెడ్డి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఎమ్మెల్యేలకు ఫోన్‌చేసి మాట్లాడినట్లుగా ఆధారాలున్నాయని చెప్పడం వెనుకున్న కుట్ర అర్థమౌతోందన్నారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ నేరుగా ఫోన్ చేసి రూ. 20 కోట్ల వరకు ఆఫర్ చేసిన రికార్డులు తమ దగ్గరున్నాయన్నారు. వాటిని నేరుగా కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామన్నారు. టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తనకు కేసీఆర్ డబ్బులిస్తే వెళ్లానని.. చెప్పారన్నారు. 63 మంది ఎమ్మెల్యేలున్న టీఆర్ఎస్ పార్టీ ఐదుగురు ఎమ్మెల్సీలను ఎలా గెలువగలిగిందన్నారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి ఓట్లేయించుకున్నారన్నారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్తున్నామన్నారు. -
'టిక్కెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా'
హైదరాబాద్: తెలంగాణ అమరవీరుడు కె.శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ టీఆర్ఎస్ కేసీఆర్‌ను కలిశారు. వరంగల్ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ టికెట్ కేటాయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శ్రీకాంతాచారి తల్లి విజ్ఞప్తిని కేసీఆర్ తిరస్కరించారు. దీంతో కేసీఆర్ ఇంటి ఎదుట శ్రీకాంతాచారి తల్లి నిరసనకు దిగారు. తనకు టికెట్ ఇవ్వకుంటే ఎల్బీనగర్ చౌరస్తాలో తన కుమారుడిలానే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించారు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేశాడు. 2009, నవంబర్ 30న ఎల్బీనగర్ చౌరస్తాలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడురోజుల తర్వాత ప్రాణాలు విడిచాడు. తన కొడుకు తెలంగాణకోసం ప్రాణాలు అర్పించినా తమను రాజకీయ నేతలు పట్టించుకోవడం లేదని శ్రీకాంతాచారి తల్లి వాపోయారు.