
జనగామ, సాక్షి: పాలకుర్తి మండలం తొర్రూరు(జే) గ్రామంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అక్రమంగా చొరబడి ఉంటున్న కొన్ని కుటుంబాలను ఖాళీ చేయించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. వాళ్లు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
తమను ఖాళీ చేయించొద్దని పాలకుర్తి రెవెన్యూ సిబ్బందిని వాళ్లు వేడుకున్నారు. అయినా అధికారులు బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీంతో.. పెట్రోల్ బాటిల్‌తో ఆత్మహత్యాయత్నం చేస్తామని బెదిరింపులకు దిగారు. తమలోనూ అర్హులైన వాళ్లం ఉన్నామని, తక్షణమే గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని కొందరు మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
అయినా అధికారులు పోలీసుల సాయంతో వాళ్లను అడ్డుకుని ఖాళీ చేయించాలని యత్నిస్తున్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో ఇక్కడ 20 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment