విలేకరులతో మాట్లాడుతున్న జంగా రాఘవరెడ్డి
పాలకుర్తిటౌన్ : సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ప్రజ లకు ఇచ్చిన హామీలను విస్మరించాడని డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేందుకే కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రంలో వచ్చేనెలలో జరుగనున్న బస్సుయాత్ర, బహిరంగ సభ స్థలాన్ని గురువారం జంగా రాఘవరెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంత రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడి న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. డబుల్ బెడ్‌రూమ్, దళితులకు మూడెకరాలు, రైతులకు గిట్టుబాటు ధరలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, సాగు, తాగునీరు హామీలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 లక్షలు రుణాలు మాఫీ చేసి తిరిగి రూ. 2 లక్షలు కొత్త రుణాలిస్తామన్నారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని రూ. 2 లక్షలకు పెంచుతామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసమే కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్ర చేపట్టిందన్నారు. బహిరంగ సభకు 40 వేల మందిని తరలించనున్నట్లు తెలిపారు. సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కోతి ఉప్పలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్తింటి వెంకటేశ్వర్లు, టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ గుండాల నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, ఉప్పల సురేష్‌బాబు, హమ్యానాయక్, రవీంద్రాచారి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనపర్తి ఉపేంద్ర, సరస్వతి, కల్పనాదేవి, రాపాక సత్యనారాయణ, కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment