DCCB Chairman janga raghavareddy
-
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం
పాలకుర్తిటౌన్ : సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ప్రజ లకు ఇచ్చిన హామీలను విస్మరించాడని డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేందుకే కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రంలో వచ్చేనెలలో జరుగనున్న బస్సుయాత్ర, బహిరంగ సభ స్థలాన్ని గురువారం జంగా రాఘవరెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంత రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడి న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్, దళితులకు మూడెకరాలు, రైతులకు గిట్టుబాటు ధరలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, సాగు, తాగునీరు హామీలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 లక్షలు రుణాలు మాఫీ చేసి తిరిగి రూ. 2 లక్షలు కొత్త రుణాలిస్తామన్నారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని రూ. 2 లక్షలకు పెంచుతామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసమే కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్ర చేపట్టిందన్నారు. బహిరంగ సభకు 40 వేల మందిని తరలించనున్నట్లు తెలిపారు. సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కోతి ఉప్పలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్తింటి వెంకటేశ్వర్లు, టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ గుండాల నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, ఉప్పల సురేష్‌బాబు, హమ్యానాయక్, రవీంద్రాచారి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనపర్తి ఉపేంద్ర, సరస్వతి, కల్పనాదేవి, రాపాక సత్యనారాయణ, కుమార్ పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
డీసీసీబీ చైర్మన్‌కు పీఏసీఎస్ ఉద్యోగుల వినతి హన్మకొండ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్‌రెడ్డి కోరారు. హన్మకొండలోని డీసీసీబీ కార్యాలయంలో చైర్మన్ జంగా రాఘవరెడ్డికి ఈమేరకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెరిగిన నిత్యావసరాల ధరల ప్రకారం తమ వేతనాలు పెంచాలన్నారు. 2012 సంవత్సరం నుంచి వేతన సవరణ జరిపించాలన్నారు. గ్రాట్యుటీ సీఈఓలకు రూ.5 లక్షలు, స్టాఫ్ అసిస్టెంట్లకు రూ.3 లక్షలు, అటెండర్లకు రూ.2 లక్షలు ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు ఇంటీరియం రిలీఫ్ 30 శాతం ఇవ్వాలన్నారు. పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, హెచ్ఆర్ఏ 30 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై డీసీసీబీ చైర్మన్ రాఘవరెడ్డి స్పందిస్తూ తన పరిధిలో ఉన్నంత మేరకు సహాయం చేస్తానన్నారు. పీఏసీఎస్ ఉద్యోగుల డిమాండ్లు ప్రభుత్వానికి, టీఎస్ కాబ్‌కు పంపుతానని ఆయన అన్నారు. -
మేనిఫెస్టో అమలులో నిర్లక్ష్యం
డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి రాయపర్తి : మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని డీసీసీబీ చైర్మన్, కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త జంగా రాఘవరెడ్డి విమర్శించారు. మండలంలోని పెర్కవేడు పీఏసీఎస్‌లో హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఏసీఎస్ భవనం, ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన లక్ష రూపాయల మాఫీ ఒకేసారి చేయకపోవడంతో వారికి లబ్ధి చేకూరడం లేదన్నారు. అన్నదాతలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పీఏసీఎస్ ద్వారా గేదెలు, గొర్రెలు, ట్రాక్టర్ల కొనుగోలుతో పాటు పిల్లల చదువులకు రుణాలు ఇస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బిల్లా సుధీర్‌రెడ్డి, గ్రామసర్పంచ్ గారె అనిత, డీసీసీ జీఎం సురేందర్, యాదగిరి, సుధాకరాచారి, మేనేజర్ నరేందర్, యాకూబ్, సీఈఓ ఏడాకుల సోమిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హామ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.