మేనిఫెస్టో అమలులో నిర్లక్ష్యం
-
డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
రాయపర్తి : మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని డీసీసీబీ చైర్మన్, కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త జంగా రాఘవరెడ్డి విమర్శించారు. మండలంలోని పెర్కవేడు పీఏసీఎస్‌లో హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఏసీఎస్ భవనం, ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన లక్ష రూపాయల మాఫీ ఒకేసారి చేయకపోవడంతో వారికి లబ్ధి చేకూరడం లేదన్నారు. అన్నదాతలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పీఏసీఎస్ ద్వారా గేదెలు, గొర్రెలు, ట్రాక్టర్ల కొనుగోలుతో పాటు పిల్లల చదువులకు రుణాలు ఇస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బిల్లా సుధీర్‌రెడ్డి, గ్రామసర్పంచ్ గారె అనిత, డీసీసీ జీఎం సురేందర్, యాదగిరి, సుధాకరాచారి, మేనేజర్ నరేందర్, యాకూబ్, సీఈఓ ఏడాకుల సోమిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హామ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.