pacs
-
కోనసీమలో డ్రోన్ హబ్ ప్రారంభం
సాక్షి,అమలాపురం: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ హాబ్ను కలెక్టర్ శుక్లా మంగళవారం ప్రారంభించారు. అమలాపురం స్టేడియంలో 21 ఫ్లయింగ్ డ్రోన్లను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ..రూ.2 కోట్లతో దేవగుప్తం పీఏసీఎస్ 21 డ్రోన్లను కొనుగోలు చేసిందన్నారు. ఒక్కొక్క డ్రోన్ 6–8 నిమిషాల్లో ఒక ఎకరానికి స్ప్రేయింగ్ ప్రక్రియను పూర్తి చేస్తుందని తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్‌గా కొనుగోలు చేసిన ఈ డ్రోన్స్‌ను అద్దె ప్రాతిపదికన రైతులకు అందుబాటులో తెస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు స్పేయర్ ఎకరాకు రూ.వెయ్యి ఖర్చుతో పిచికారీ చేస్తున్నారని, డ్రోన్ టెక్నాలజీతో ఎకరాకు రూ.300 అవుతుందన్నారు. రైతులు బృందంగా ఏర్పడితే రూ.10 లక్షలు విలువైన వ్యవసాయ డ్రోన్‌ను కొనుగోలు చేయవచ్చన్నారు. దేవగుప్తం పీఏసీఎస్ చైర్మన్, రాష్ట్ర అగ్రి మిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబి) మాట్లాడుతూ ప్రతి మండలంలో ఒక డ్రోన్ ఉండేలా ప్రభుత్వం ఆలోచన చేసిందన్నారు. వైఎస్సార్ హార్టీకల్చర్ వర్సిటీ సభ్యుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినా««ద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కామన్ సర్వీస్ సెంటర్లుగా పీఏసీఎస్‌లు
సాక్షి, అమరావతి: ‘సహకర్ సే సమృద్ధి’ అనే నినాదంతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ను కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ)గా తీర్చిదిద్దేందుకు సీఎస్సీ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌తో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పీఏసీఎస్‌లను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టింది. దేశవ్యాప్తంగా 30 వేల పీఏసీఎస్‌లను సీఎస్‌సీలుగా మార్చనుండగా, ఏపీలో ఇప్పటికే 1,810 పీఏసీఎస్‌లు అంగీకారం తెలియజేశాయి. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రాష్ట్రస్థాయి నోడల్ ఆఫీసర్లను నియమించింది. గ్రామస్థాయిలో 300కు పైగా పౌరసేవలు యూనివర్సల్ టెక్నాలజీ ప్లాట్ ఫామ్ ద్వారా అన్ని రకాల ఈ–సేవలను గ్రామస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య పౌరులతో పాటు రైతులకు 300కు పైగా వివిధరకాల పౌరసేవలను ఈ సీఎస్సీల ద్వారా అందించనున్నారు. రాష్ట్ర పరిధిలో 500కు పైగా పీఏసీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన పీఏసీఎస్‌ల్లో కూడా దశల వారీగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీఎస్‌సీలుగా మారనున్న పీఏసీఎస్‌లను పౌరులకు బ్యాంకింగ్, బీమా, పాన్ కార్డులు, రైళ్లు బస్సులు, విమానాలకు సంబంధించిన ట్రావెల్ బుకింగ్స్, ఆధార్ అప్డేట్, న్యాయ సలహాల వరకు అనేక రకాల సేవలను వన్‌స్టాప్ షాపులుగా తీర్చిదిద్దనున్నారు. పౌర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ప్రజల ముంగిటకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న సీఎస్‌సీలలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) సాధనాలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ఎన్‌సీసీటీ ద్వారా శిక్షణ.. సీఎస్సీల్లో సేవలందించేందుకు వీలుగా పీఏసీఎస్‌ల సిబ్బందికి నేషనల్ కౌన్సిల్ ఫర్ కో ఆపరేటివ్ ట్రైనింగ్ (ఎన్‌సీసీటీ) ద్వారా ఫిబ్రవరి, మార్చి నెలల్లో విడతల వారీగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్‌సీసీటీ ద్వారా శిక్షణ పొందిన 80 మంది మాస్టర్ ట్రైనర్స్ దేశంలోని 28 రాష్ట్రాల్లోని 570 జిల్లాల్లో ఎంపిక చేసిన పీఏసీఎస్‌ల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. 13కోట్ల మంది రైతులకు లబ్ధి ïపీఏసీఎస్‌లను దశల వారీగా సీఎస్సీలు తీర్చిదిద్దాలని కేంద్రం సంకల్పించింది. ఇప్పటికే 30వేల పీఏసీఎస్‌లను గుర్తించింది. ఈ సిబ్బందికి అత్యాధునిక శిక్షణ ఇవ్వనుంది. సీఎస్సీల ద్వారా అందించే సేవలతో 13 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ మార్పుతో అదనపు ఆదాయాన్ని ఆర్జించడం ద్వారా పీఏసీఎస్‌లు స్వయం సమృద్ధి సాధించి ఆర్థికంగా బలోపేతం కానున్నాయి – డాక్టర్ ఎస్ఎల్ఎన్టీ శ్రీనివాస్ స్టేట్ కో–ఆర్డినేటర్, ఎన్‌సీసీటీ -
కామన్ సర్విస్ సెంటర్లుగా పీఏసీఎస్‌లు
సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్)ను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా లాభాల బాట పట్టించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రంలోని 1,995 పీఏసీఎస్‌లలో కంప్యూటరైజేషన్ చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మరోవైపు కామన్ సర్విస్ సెంటర్(సీఎస్సీ)లుగా తీర్చిదిద్దడం ద్వారా వాటికి ఆర్థిక పరిపుష్టి కల్పించాలని సంకలి్పంచింది. ఇందుకోసం ఎల్రక్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నాబార్డు సీఎస్సీ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (సీఎస్సీ–ఎస్పీవీ)తో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంది. సీఎస్సీ ప్రాజెక్టు అమలు కోసం రాష్ట్ర స్థాయిలో నోడల్ ఆఫీసర్‌ను కూడా నియమించారు. యూనివర్సల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ద్వారా అన్ని రకాల ఈ–సేవలను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం నుంచి పౌరులకు అందే సేవల నుంచి వ్యాపార, ఆర్థిక, విద్య, వ్యవసాయ, ఆరోగ్య తదితర సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ పౌరులకు, ముఖ్యంగా రైతులకు సీఎస్సీ డిజిటల్ సేవా పోర్టల్‌లో పేర్కొన్న 300 కంటే ఎక్కువ ఈ–సేవలను అందించేందుకు పీఏసీఎస్‌లకు అనుమతిస్తారు. వినియోగదారులకు అందించే సేవల ప్రాతిపదికన పీఏసీఎస్‌లకు కమిషన్ చెల్లిస్తారు. ఇది వారి సంప్రదాయ వ్యాపార కార్యకలాపాలకు అదనంగా ఆర్థిక ప్రయోజనం పొందేందుకు దోహదపడుతుంది. రాష్ట్రంలో 1,995 పీఏసీఎస్‌లు ఉండగా, వాటిలో 1,646 పీఏసీఎస్‌లు కామన్ సర్వీస్ సెంటర్ల కింద సేవలు అందించేందుకు ముందుకొచ్చాయి. వీటిలో ఇప్పటివరకు 1,497 పీఏసీఎస్‌లకు సీఎస్సీ ఐడీలను జారీ చేయగా.. 471 పీఏసీఎస్‌లలో సీఎస్సీ సేవలకు శ్రీకారం చుట్టారు. మిగిలిన వాటిలో దశలవారీగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందించే సేవలివే పాస్ పోర్ట్ సేవలు, పాన్ కార్డ్, ఈ–జిల్లా, వివిధ రకాల సర్టిఫికెట్లు, లైసెన్సులు, రేషన్ కార్డుల జారీ, పెన్షన్లు, ఆర్టీఐ ఫైలింగ్, ఎలక్ట్రానిక్ కమిషన్ సేవలు, ఐటీఆర్ ఫిల్లింగ్, పెన్షనర్ల కోసం జీవన్ ప్రమాణ్, విద్యుత్ బిల్లు సేకరణ, ఈ–స్టాంప్‌ల జారీ, డీటీహెచ్ రీచార్జ్, మొబైల్ రీచార్జ్, ఈ–వాలెట్ రీచార్జ్, బ్యాంకింగ్, బీమా, పెన్షన్ సేవలు, అన్నిరకాల డిజిటల్ పేమెంట్స్, పీఎంజీ డీఐఎస్‌హెచ్‌ఏ, స్కిల్ డెవలప్మెంట్, ఇతర విద్యాకోర్సులు (ఎన్ఐఈఎల్ఐటీ/సీఎస్సీ, బీసీసీ, ఎన్ఐఓఎస్,ఇంగ్లిష్/ట్యాలీ/జీఎస్టీ,/సర్కారి పరీక్ష), టెలీ హెల్త్ కన్సల్టేషన్స్, ఔషధాల విక్రయాలు, ఆయుష్మాన్ భారత్, పతంజలి, స్వదేశీ సమృద్ధి కార్డ్‌ల జారీ, రైలు బుకింగ్, విమాన ప్రయాణం, హోటల్ బుకింగ్‌తో పాటు కోవిడ్ వంటి విపత్తుల వేళల్లో సీఎస్సీ గ్రామీణ్ ఈ–స్టోర్ ద్వారా రోజువారీ నిత్యావసర వస్తువులను ఇంటింటికి డెలివరీ చేయడం వంటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పీఏసీఎస్‌ల బలోపేతమే లక్ష్యం పీఏసీఎస్‌లను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు గ్రామస్థాయిలో పౌరులకు నాణ్యమైన సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కామన్ సర్విస్ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నాం. గ్రామ స్థాయిలోనే దాదాపు 300కు పైగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. సీఎస్సీల ద్వారా అందించే సేవలను బట్టి ఆయా పీఏసీఎస్‌లకు కమిషన్ రూపంలో ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. – అహ్మద్‌బాబు, కమిషనర్, సహకార శాఖ -
ఇక సహకార జనరిక్ మెడికల్ షాపులు
సాక్షి, అమరావతి: సొసైటీల ఆధ్వర్యంలో సహకార జన ఔషధి కేంద్రాలు రాబోతున్నాయి. ప్రజలకు అత్యంత తక్కువ ధరకు మందులను అందుబాటులో ఉంచడంతోపాటు ఆదాయ వనరులు పెంపొందించుకోవడమే లక్ష్యంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌ల)కు అనుబంధంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వివిధ రకాల వ్యాపారాలతో పీఏసీఎస్‌లు లాభాల బాట పట్టాయి. ఇదే కోవలో నష్టాల్లో ఉన్న సంఘాలు తమ ఆర్థిక స్థితిని పెంచుకునే దిశగా అడుగులేస్తున్నాయి. బహుళ సేవా కేంద్రాలుగా పీఏసీఎస్‌లను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జనరిక్ మందుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో గ్రామ స్థాయిలో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వాల ఆర్థిక చేయూత తొలి దశలో జిల్లాకు ఐదు పీఏసీఎస్‌లను ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 132 పీఏసీఎస్‌లతోపాటు 13 డీసీఎంఎస్‌లలో కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల పేరిట వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక చేయూత ఇవ్వనున్నాయి. ఒక్కో జన ఔషధి కేంద్రం ఏర్పాటుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల చొప్పున వెచ్చించనున్నారు. వీటిద్వారా నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణుల్లో ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన పెంపొందిస్తారు. సొసైటీల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌లు స్థలాలు అందుబాటులో ఉన్న 106 పీఏసీఎస్‌లలో ఒక్కొక్క చోట రూ.25 లక్షల అంచనా వ్యయంతో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నారు. స్థలాలు చూపిస్తే చాలు ఫీజుబులిటీ రిపోర్టు ఆధారంగా పైసా ఖర్చు లేకుండా డీలర్‌షిప్‌లు మంజూరుకు ఆయిల్ కంపెనీలు ముందుకొచ్చాయి. బంక్ నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నాయి. 27 పీఏసీఎస్‌లలో పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు సంబంధిత శాఖలు ఇప్పటికే ఎన్వోసీలు ఇచ్చాయి. ఆరు చోట్ల పెట్రోల్ బంక్‌లు ప్రారంభించారు. మిగిలిన 83 పీఏసీఎస్‌ల ఆధ్వర్యం బంక్‌ల ఏర్పాటుకు అవసరమైన ఎన్వోసీలను సాధ్యమైనంత త్వరగా సాధించే దిశగా సహకార శాఖ చర్యలు చేపట్టింది. అదే బాటలో ఎంపిక చేసిన పీఏసీఎస్‌లలో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సొసైటీల బలోపేతమే లక్ష్యం నష్టాల్లో ఉన్న సొసైటీలను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. పెట్రోల్ బంక్‌లు ఏర్పాటుకు అవసరమైన ఎన్వోసీల జారీలో జాప్యాన్ని నివారించేందుకు సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్ల సమన్వయంతో ముందుకెళ్తున్నాం. పెట్రోల్ బంకులు, జన ఔషధి కేంద్రాలతో పాటు స్థానిక డిమాండ్ ఉన్న వ్యాపారాలు చేసుకునే వెసులుబాటును సొసైటీలకు కల్పిస్తున్నాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ, సహకార శాఖల మంత్రి -
ఆత్మకూరు PACS బ్యాంక్ డిపాజిట్స్ గోల్ మాల్ బాధితులకు చెక్కుల అందజేత
-
మొదటి సారి ఇంధన రంగంలోకి పీఏసీఎస్.. పెట్రోల్ బంకులు రాబోతున్నాయ్!
సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఆర్థిక పరిపుష్టిపై దృష్టి సారించాయి. ఇప్పటి వరకు రైతులకు వ్యవసాయ ఆర్థిక అవసరాలు తీర్చడంతో పాటు వివిధ రకాల వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. మొదటి సారి ఇంధన రంగంలోకి ప్రవేశించాయి. సహకార పెట్రోలు బంకులు ఏర్పాటు చేసి తమ ఆర్థిక పరపతిని పెంచుకునే దిశగా అడుగులేస్తున్నాయి. ఒక్కో బంకు రూ.25లక్షలతో ఏర్పాటు ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు అనుబంధంగా 1,992 పీఏసీఎస్‌లున్నాయి. వాటిలో 1,450 పీఏసీఎస్‌లు లాభాల్లో ఉన్నాయి. మిగిలిన వాటిని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ఆప్కాబ్ చేయూత నిస్తోంది. బహుళ సేవా కేంద్రాలు (ఎంఎస్సీ)గా వీటిని తీర్చిదిద్దేందుకు ఆప్కాబ్ చర్యలు చేపట్టింది. స్థలాలు అందుబాటులో ఉండి స్థానికంగా ఫీజుబులిటీ కల్గిన పీఏసీఎస్‌ల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఒక్కో బంకు రూ.25లక్షల అంచనాతో ఏర్పాటు చేస్తున్నారు. స్థలాలు చూపిస్తే చాలు ఫీజుబులిటీ రిపోర్టు ఆధారంగా పైసా ఖర్చు లేకుండా పీఏసీఎస్‌లకు డీలర్‌షిప్‌లు మంజూరు చేసేందుకు హెచ్‌పీసీఎల్ ముందు కొచ్చింది. బంకు నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ హెచ్‌పీసీఎల్ సమకూర్చనుంది. నిర్వహణ బాధ్యతలను పీఏసీఎస్‌లకు అప్పగిస్తారు. నిర్వహణ ఖర్చులు పోనూ నెలకు రూ.లక్షకు పైగా మిగులుతుందని అంచనా వేసు్తన్నారు. బంకుల ఏర్పాటుకు అనువుగా 96 పీఏసీఎస్‌లు తొలిదశలో బంకుల ఏర్పాటుకు అనువైన స్థలాలున్న 130 పీఏసీఎస్‌లను గుర్తించారు. వాటిలో 96 పీఏసీఎస్‌ల పరిధిలో బంకుల ఏర్పాటుకు ఫీజుబులిటీ ఉందని ఆయిల్ కంపెనీలు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చాయి. వాటిలో ఇప్పటికే 77 పీఏసీఎస్‌లకు ఆయిల్ కంపెనీలు లెటర్ ఆఫ్ ఇంటెంట్స్ జారీ చేశాయి. కాగా 18 పీఏసీఎస్‌ల పరిధిలో బంకుల ఏర్పాటుకు రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక తదితర శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)లు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో ఒకటి, ఏలూరు జిల్లా పరిధిలోని కె.జగ్గవరం, ముల్లకుంట పీఏసీఎస్‌ల్లో పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేయగా, మిగిలిన 15 పీఏసీఎస్‌ల్లో జనవరి నెలాఖరులోగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫీజుబులిటీ ఆధారంగా మిగిలిన పీఏసీఎస్‌ల పరిధిలో బంకుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. లాభాల బాట పట్టించడమే లక్ష్యం నష్టాల్లో ఉన్న పీఏసీఎస్‌లను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశాం. స్థలాలు అందుబాటులో ఉండి, ఫీజు బులిటీ ఉన్న పీఏసీఎస్ పరిధిలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనుమతినిస్తాం. బంకులే కాదు..వారు ఏ తరహా వ్యాపారం చేసేందుకు ముందుకొచ్చినా ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఆప్కాబ్ సిద్ధంగా ఉంది. –ఆర్.శ్రీనాథ్‌రెడ్డి, ఎండీ, ఆప్కాబ్ -
ఆర్బీకేలతో పీఏసీఏస్‌ల అనుసంధానం
సాక్షి, అమరావతి: రైతుల పరపతిని పెంచడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే)ను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)తో అనుసంధానిస్తోంది. ఇప్పటికే ఆర్బీకే స్థాయిలో పీఏసీఎస్‌ల ద్వారా రైతుక్షేత్రాల వద్దే పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ విషయంలో సర్కారు మరో అడుగు ముందుకేసి ఆర్బీకేలను–పీఏసీఎస్‌లతో అనుసంధానించడం ద్వారా కౌలు, సన్న, చిన్నకారు రైతులకు పరపతి సౌకర్యాన్ని కల్పించాలని సంకల్పించింది. చదవండి: అఖండ గోదావరి.. ప్రాజెక్టుల గేట్లు బార్లా! కౌలురైతుకు రుణం అందించడమే లక్ష్యంగా.. ఏపీలోని 10,778 ఆర్బీకేల ద్వారా విత్తనం నుంచి పంట కొనుగోళ్ల వరకు ఎక్కడికక్కడ రైతులకు సేవలందిస్తున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలూ అందిస్తున్నారు. మెజారిటీ కౌలు రైతులకు రుణాలు అందని పరిస్థితి. దీనికి చెక్‌పెడుతూ గ్రామస్థాయిలో అర్హతగల ప్రతీ కౌలుదారునికి రుణం అందించడమే లక్ష్యంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పరిధిలో ఉన్న 2,037 పీఏసీఎస్‌లను ఆర్బీకేలతో అనుసంధానిస్తున్నారు. ఇప్పటికే 18 జిల్లాల పరిధిలో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన జిల్లాల్లో కూడా ఈ నెల 20లోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 4.5లక్షల మంది కౌలురైతులకు సీసీఆర్సీ కార్డులు ఇక 2022–23 వ్యవసాయ సీజన్ కోసం 5.67 లక్షల కౌలుదారులకు గుర్తింపు కార్డులు జారీచేయాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటికే 4.5 లక్షల మందికి కార్డుల జారీ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన వారికి కూడా కార్డులను జారీచేయాలని నిర్ణయించారు. ఇలా సీసీఆర్సీ (క్రాప్ కలి్టవేటర్ రైట్స్ కార్డు– పంటసాగు హక్కు పత్రం) ఉన్న వారితో పాటు కార్డుల్లేని వారిలో రుణాలు పొందని అర్హులను గుర్తించే బాధ్యతను బ్యాంకింగ్ కరస్పాండెంట్లకు అప్పగించింది. అలాగే, కౌలుదారులను కనీసం 5 నుంచి పదిమందితో కలిపి జాయింట్ లయబిలిటీ గ్రూపులను (జేఎల్‌జీ) ఏర్పాటు చేసి వారికి సమీప పీఏసీఎస్‌ల ద్వారా రుణపరపతి కలి్పస్తారు. గ్రూపుల్లో ప్రతీ రైతుకు వ్యక్తిగతంగా కిసాన్ క్రెడిట్ కార్డులూ ఇస్తారు. ప్రస్తుత సీజన్లో రూ.4వేల కోట్ల రుణాలు ప్రస్తుత వ్యవసాయ సీజన్లో కనీసం రూ.4 వేల కోట్ల మేర రుణాలను అందించాలన్నది లక్ష్యం. కౌలుదారులకే కాదు.. సొంత భూమి కల్గిన సన్న, చిన్నకారు రైతులకు కూడా పీఏసీఎస్‌ల ద్వారా రుణాలు అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ని రూపొందించారు. తమ పరిధిలోని ఈ–పంట ఆధారంగా కౌలు రైతులు, సన్న, చిన్నకారు రైతులను గుర్తిస్తారు. వారు ఏ సీజన్లో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేశారు.. సాగు కోసం వారి ఆరి్థక అవసరాలను ఏమిటో తెలుసుకుంటారు. వ్యవసాయ అవసరాల కోసం వారిలో ఏ ఒక్కరూ ప్రైవేటు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా కౌన్సెలింగ్ ఇస్తారు. వీరికి పంట రుణాలు అందించేందుకు ప్రత్యేకంగా సాప్్టవేర్ను అభివృద్ధి చేశారు. రుణ దరఖాస్తుతో రైతుల నుంచి కేవైసీ, 1బీ, అడంగల్, ఇతర ధృవీకరణ పత్రాలను స్వీకరించి వాటిని ఈ సాఫ్ట్వేర్ ద్వారా పీఏసీఏస్‌లకు అప్లోడ్ చేస్తారు. ఇలా వచ్చిన దరఖాస్తులను పీఏసీఏస్‌లు నిశితంగా పరిశీలించి రుణం పొందేందుకు అర్హుడని నిర్ధారిస్తే దరఖాస్తు అందిన మూడ్రోజుల్లో పీఏసీఏస్‌ల ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. కొత్త గ్రూపులకు రుణాలు అందజేసే పీఏసీఎస్‌లకు రూ.4వేల వరకు ఇన్సెంటివ్ కూడా అందజేస్తారు. సాగుదారులందరికీ రుణ పరపతి సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతీ కౌలురైతుకు రుణపరపతి కల్పించడమే లక్ష్యంగా ఆర్బీకేలను పీఏసీఎస్‌లతో అనుసంధానిస్తున్నాం. ఇప్పటికే 80 శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన జిల్లాల్లో వారం పదిరోజుల్లో పూర్తిచేస్తాం. మ్యాపింగ్ పూర్తయిన జిల్లాల్లో రుణాలు పొందేందుకు అర్హులను గుర్తిస్తున్నాం. వారందరినీ గ్రూపులుగా ఏర్పాటుచేసి రుణపరపతి కల్పించాలని ఆదేశాలిచ్చాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఆర్బీకేలను పీఏసీఎస్‌లతో అనుసంధానించండి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)తో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ను అనుసంధానం చేసి గ్రామ స్థాయిలో రైతులకు అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆదేశించారు. విజయవాడలోని ఆప్కాబ్ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ చైర్పర్సన్లు, సీఈవోలతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పాతుకుపోయిన ప్రతి ఒక్కరినీ బదిలీ చేయాలని సూచించారు. 2021–22లో 40 శాతం వృద్ధి రేటుతో ఆప్కాబ్ మంచి ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. వ్యవసాయ రుణాల పంపిణీలో రాష్ట్రంలో సహకార బ్యాంకులు 4వ స్థానంలో ఉండటం సంతోషకరమన్నారు. ఇదే స్ఫూర్తితో వాణిజ్య బ్యాంకులకు ధీటుగా మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేయాలని సూచించారు. ఆప్కాబ్‌తో సహా డీసీసీబీలన్నీ లాభాల బాట పట్టాయంటే అందుకు ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలే కారణమన్నారు. అనంతరం పీఏసీఎస్ అడాప్షన్ పాలసీ, 59వ వార్షిక పరిపాలనా రిపోర్ట్, కార్పొరేట్ గవర్నెన్స్ పాలసీ, ఉద్యోగుల కోసం రూపొందించిన ‘కాబ్‌నెట్’ మొబైల్ యాప్‌ను మంత్రి ఆవిష్కరించారు. -
టీడీపీ నేత.. ఎరువుల మేత!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రైతులకు చెందాల్సిన ఎరువులు, పురుగు మందులను టీడీపీ నేతలు అప్పనంగా కాజేశారు. రైతులు సాగు చేసుకుంటున్న పంటలకు సరఫరా చేసిన ఎరువులు, పురుగు మందుల సొమ్మును టీడీపీకి చెందిన పీఏసీఎస్ చైర్మన్ స్వాహా చేశారు. ఒకటి, రెండు కాదు ఏకంగా రూ.38.79 లక్షలు నొక్కేశారు. పర్చూరు నియోజకవర్గంలోని కారంచేడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో ఈ బాగోతం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధికారం వెలగబెడుతున్న సమయంలో 2016 నుంచి 2018 మధ్యలో ఎరువులు, పురుగు మందుల విక్రయం ద్వారా వచ్చిన నిధులను మింగేశారు. అక్రమాలకు పాల్పడింది అప్పటి కారంచేడు పీఏసీఎస్ చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య కాగా అందుకు పూర్తిగా సహకారం అందించింది మాత్రం సీఈవో గంటా మల్లయ్య చౌదరి. ఆడిట్లో బయటపడ్డ బండారం జిల్లా సహకార శాఖ అధికారులు ఏటా పీఏసీఎస్ ఆడిట్ నిర్వహించాల్సి ఉంది. అయితే టీడీపీ జమానాలో సహకార శాఖ అధికారులు పీఏసీఎస్ ఆడిట్ చేయడానికి కూడా భయపడ్డారు. కారంచేడు పీఏసీఎస్ మీద తీవ్రమైన ఆరోపణలు రావడంతో చివరకు మూడేళ్లకు సంబంధించి 2018లో సహకార శాఖ అధికారులు ఆడిట్ నిర్వహించారు. అంటే 2015–16, 2016–17, 2017–18 సంవత్సరాలకు సంబంధించి ఏకకాలంలో ఆడిట్ నిర్వహించారు. దీంతో అప్పటి వరకు జరిగిన అక్రమాలు కొంతమేర బయటపడ్డాయి. ఆడిట్ రిపోర్టును అప్పటి అధికారులు జిల్లా సహకార శాఖ అధికారులకు సమర్పించారు. చర్యలు తీసుకోవడంలో అధికారుల మీనమేషాలు రైతులకు సరఫరా చేసేందుకు పీఏసీఎస్‌లకు ఎరువులు, పురుగు మందుల కొనుగోలు కోసం జిల్లా పీడీసీసీ బ్యాంకు రుణం రూపంలో నిధులు కేటాయిస్తుంది. అయితే కారంచేడు పీఏసీఎస్‌లో చైర్మన్‌తోపాటు సీఈవో కలిసి రూ.38,79,001.63 స్వాహా చేశారు. అప్పటి నుంచి పీఏసీఎస్ తీసుకున్న నిధులు బ్యాంకుకు తిరిగి జమ కాలేదు. బ్యాంకు సీఈఓ సొసైటీకి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే జిల్లా సహకార శాఖ అధికారులు మాత్రం కాజేసిన సొమ్మును తిరిగి వసూలు చేయడంలో మీనమేషాలు లెక్కించడం విమర్శలకు తావిస్తోంది. ఇంత వరకు వారిద్దరిపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అంతుపట్టని అంశంగా మారింది. విచారణతో వెలుగులోకి.. ఆడిట్ రిపోర్టు ఆధారంగా అప్పటి జిల్లా సహకార శాఖ అధికారి కారంచేడు పీఏసీఎస్‌లో నిధుల స్వాహా విషయమై డిప్యూటీ రిజిస్ట్రార్ ఎల్.సుధాకర్‌ను విచారణాధికారిగా నియమించారు. విచారణ 2019లో చేపట్టారు. అయితే ఆడిట్ రిపోర్టులో ఉన్న దానికంటే ఇంకా ఎక్కువగా ఎరువులు, పురుగు మందులు విక్రయించి తద్వారా వచ్చిన నిధులను కాజేశారని తేలింది. మందులు అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము రూ.28,35,957ను పీఏసీఎస్ చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య, సొసైటీ సీఈవో గంటా మల్లయ్య చౌదరి కలిసి కాజేశారని స్పష్టమైంది. దీంతోపాటు చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య ఒక్కడే రూ.10,43,044.63 కాజేశారని విచారణలో బయటపడింది. మొత్తం రూ.38,79,001.63 సొమ్మును కాజేశారని విచారణాధికారి జిల్లా సహకార శాఖ అధికారికి 2019 జనవరిలోనే నివేదిక అందించారు. రికవరీకి నోటీసులిచ్చాం కారంచేడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో నిధుల గోల్‌మాల్‌పై సొసైటీ అప్పటి చైర్మన్‌కు, సీఈవోకు నోటీసులిచ్చాం. సహకార చట్టం సెక్షన్ 52 కింద నోటీసులు జారీ చేశాం. 2020 మార్చి 7వ తేదీన నోటీసులు వారికి అందాయి. వారు కాజేసిన సొమ్మును 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నాం. అయితే ఆ తర్వాత కోవిడ్ నిబంధనలు వెలువడటంతో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఉన్నతాధికారులు ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి సారించారు. – ఎల్.సుధాకర్, డిప్యూటీ రిజిస్ట్రార్, సహకార శాఖ చదవండి: కదులుతున్న అవినీతి డొంక: ‘పచ్చ’నేతల గుండెల్లో రైళ్లు విషాదం: అమ్మకు తోడుగా వచ్చి.. -
ముగిసిన ‘సహకార’ నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 905 పీఏసీఎస్‌ల పరిధిలోని డైరెక్టర్ల పదవులకు చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 6న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, 3 రోజుల వ్యవధిలో మొత్తం 36,969 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు శనివారం అత్యధికంగా 22,684 నామినేషన్లు వచ్చినట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ప్రకటించింది. మొదటి రోజు 2,316, రెండో రోజు 11,959 నామినేషన్లు దాఖలయ్యాయి. వెయ్యికి పైగా డైరెక్టర్ స్థానాలకు ఒక్కో నామినేషన్ చొప్పున మాత్రమే దాఖలు కావడంతో ఈ స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఆదివారం నామినేషన్ల పరిశీలన, సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ఉండటంతో, ఈ నెల 10 సాయంత్రం ఏకగ్రీవ డైరెక్టర్ స్థానాలపై స్పష్టత రానుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ గెలుపునకు సహకరించిన నేతలు, కార్యకర్తలను పీఏసీఎస్‌లలో పోటీకి దించారు. పార్టీల గుర్తుతో ఎన్నికలు జరగకున్నా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ మంది బరిలోకి దిగారు. అత్యధికంగా నిజామాబాద్‌లో.. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 89 ప్యాక్స్‌ల పరిధిలో 2,988 మంది నామినేషన్లు వేశారు. ఖమ్మం జిల్లాలో 76 ప్యాక్స్లకు 2,546 నామినేషన్లు, నల్లగొండ జిల్లాలో 42 ప్యాక్స్లకు 2,272 నామినేషన్లు, సూర్యాపేట జిల్లాలో 47 ప్యాక్స్లకు 2,169 నామినేషన్లు వచ్చాయి. అత్యల్పంగా జోగుళాంబ–గద్వాల జిల్లాలో 11 ప్యాక్స్లకు 452 నామినేషన్లు దాఖలైనట్లు సహకార శాఖ ఎన్నికల అథారిటీ వెల్లడించింది. 10న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు చేయనున్నట్లు ఎన్నికల అథారిటీ అధికారులు వెల్లడించారు. -
‘ప్రాథమిక’ సహకారం!
సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పరిపుష్టం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఎన్నికల హామీ మేరకు సహకార రంగాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను లాభాల బాట పట్టించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 2,051 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్నెట్ సౌకర్యంతో సహా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణకు రూ.101.39 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనాలను రూపొందించారు. తెలంగాణలో 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కంప్యూటరీకరించారు. గ్రేడింగ్‌కు కసరత్తు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణను అత్యంత ప్రాధాన్య అంశంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిబ్బందికి శిక్షణ, జవాబుదారీతనం పెంచడంతో పాటు క్రమం తప్పకుండా ఆడిట్ చేయాలని నిర్ణయించారు. గ్రామ సచివాలయాల సహాయంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయనున్నారు. తరచూ తనిఖీలు నిర్వహించడం ద్వారా సహకార సంఘాల్లో క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంచనున్నారు. రుణ పరపతి, లాభ నష్టాలు, రికవరీ ఆధారంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, ప్రాథమిక సహకార సంఘాలను గ్రేడింగ్ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఆరు నెలల్లో సిఫారసులు.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సభ్యులైన రైతులకు పంట రుణాలను ఇవ్వడం, సమర్ధవంతంగా వసూలు చేయడమే కాకుండా ఇతర సేవలు అందించడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేలా వీటిని తీర్చిదిద్దేందుకు చర్యలను చేపట్టనున్నారు. దీనిపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేసేందుకు ప్రతిష్టాత్మక సంస్థను ఎంపిక చేసి బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలల్లోగాసిఫార్సులు తెప్పించుకుని అందుకు అనుగుణంగా చర్యలను చేపట్టనున్నారు. పంట రుణాలు ఇవ్వడంతో పాటు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా చేపట్టి నూటికి నూరు శాతం రికవరీ చేస్తే స్వయం ప్రతిపత్తి సాధించవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదు జిల్లాల్లో నిరర్థక ఆస్తులు రూ.116.52 కోట్లు నిరర్ధక ఆస్తుల కారణంగా విజయనగరం, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఆరి్థకంగా బలహీన పడ్డాయి. ఈ ఐదు జిల్లాల్లో కేంద్ర సహకార బ్యాంకుల నిరర్ధక ఆస్తులు రూ.116.52 కోట్లకు చేరుకున్నాయి. మొత్తం 2,051 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 1,240 సంఘాలు లాభాల్లో ఉండగా 811 సంఘాలు నష్టాల్లో ఎదురీదుతున్నాయి. -
రైతుల అభ్యున్నతికి పాటు పడాలి: జోగి రమేశ్
సాక్షి, గూడూరు: రైతుల అభ్యున్నతికి సహకార సంఘాలు పని చేయాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పిలుపునిచ్చారు. బుధవారం కృష్ణా జిల్లా గూడూరు పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. రైతును రాజును చేస్తే, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతును రారాజును చేయడానికి రైతు భరోసా పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. రైతులకు ఎరువులు పూర్తిస్థాయిలో అందించాలని అధికారులకు సుచించారు. రుణాలు సకాలంలో చెల్లించి వడ్డీ మాఫీ రుణాలు రైతులకు అందెలా చూడాలని కోరారు. పంటల బీమా సౌకర్యం ప్రతి రైతుకు అందేలా సహకార బ్యాంకులు పని చేయాలని కోరారు. -
‘సహకారం’ పొడిగింపు
సాక్షి, ఆదిలాబాద్‌అర్బన్ : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)కు నిర్వహించే ఈ దఫా ఎన్నికలకు బ్రేక్ పడింది. పీఏసీఎస్ పాలక వర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం (డీసీఎంఎస్)ల పదవీ కాలాన్ని కూడా మరో ఆరు నెలలు పాటు పొడిగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. హైదరాబాద్‌లో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వ కార్యదర్శి సి. పార్థసారథి జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకాల పరపతి సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు 2013లో ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 2018 జనవరి 30తో పాలక వర్గాల పదవీ కాలం పూర్తయింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై రెండు నెలలుగా సందిగ్దం నెలకొంది. అయితే తాజాగా పీఏసీఎస్, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల పాలక వర్గాల పదవీ కాలం పొడిగింపు చేస్తూ సర్కారు ఆదేశాలివ్వడంతో సందిగ్దానికి తెరపడింది. ఉన్నవే కొనసాగింపు.. జిల్లాల పునర్విభజనతో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఉన్నాయి. ఇవి ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన ఆయా జిల్లాల పరిధిలో ఉన్నాయి. కానీ వీటన్నింటికీ ఒకే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ఒకే మార్కెటింగ్ సంఘం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉంది. ఆయా జిల్లాల పరిధిలో ఉన్న పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించినట్లైతే వాటి పరిధిలోని డీసీసీబీలకు, డీసీఎంఎస్‌లకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. నాలుగు జిల్లాలకు ఒకే డీసీసీబీ, డీసీఎంఎస్ ఉంది. నూతనంగా ఏర్పాటైన జిల్లాలకు డీసీసీబీ, డీసీఎంఎస్‌లను ఏర్పాటు చేస్తే తప్పా.. ఎన్నికలు నిర్వహించడమనేది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో పాలక వర్గాల పదవీ కాలం పొడిగింపు తప్పా.. వేరే మార్గం లేకపోవడంతో ప్రభుత్వం ఈ రకంగా ముందడుగేసినట్లు తెలుస్తోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ప్రస్తుతం ఉన్న పాలకవర్గాల పదవీ కాలాన్నే మరో ఆరు నెలల పాటు పొడిగించింది. వీటితో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్ పాలక వర్గాల పదవీ కాలం కూడా పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో ప్రస్తుతం ఉన్న పాలక వర్గాలే మరో ఆరు నెలల పాటు కొనసాగనున్నాయి. అప్పుడు మేనేజ్మెంట్.. ఇప్పుడు పర్సన్ ఇన్చార్జి.. ఎన్నికల సమయంలో రైతులతో ఎన్నుకోబడిన పాలకవర్గాలను మేనేజ్మెంట్ కమిటీగా పిలుస్తారు. పదవీ కాలం ముగిసిపోయి ప్రభుత్వం పొడిగింపు చేస్తే ఆ కమిటీ అధ్యక్షుడిని పర్సన్ ఇన్‌చార్జీగా పిలవడం జరుగుతుందని సహకార శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అంటే పదవీలో ఉన్నప్పుడు మేనేజ్మెంట్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న వారే ఇప్పుడు పీఏసీఎస్‌కు పర్సన్ ఇన్చార్జి అన్నమాట. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 52 పాత మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మూడు సహకార శాఖ డివిజన్లు ఉన్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ డివిజన్లలో మొత్తం 77 ప్రాథమిక వ్యవసాయ సహకాల పరపతి సంఘాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో గెలుపొందిన డైరెక్టర్లు, సహకార శాఖ కార్యదర్శులు ఉన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న డైరెక్టర్ల పదవీ కాలం జనవరి 30తో పూర్తయింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం తప్పని చర్యగా ఇలా చేపట్టినట్లు తెలుస్తోంది. వివరాలు కోరిన ప్రభుత్వం.. పీఏసీఎస్ పాలక వర్గాల పనితీరుపై జిల్లా సహకార శాఖను ప్రభుత్వం వివరణ కోరింది. పీఏసీఎస్‌లకు ఉన్న పాలక వర్గాల వివరాలు, అందులోని సభ్యులు, సొసైటీ నుంచి పొందిన రుణాలు, తిరిగి రుణాలు చెల్లిస్తున్న సభ్యు ల వివరాలను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ఫారం–1, ఫా రం–2ను పూర్తి చేసి రెండు రోజుల్లో సమర్పించాలని సహకార శాఖ అధికారులను ఆదేశించింది. పాలకవర్గాల పనితీరును దృష్టిలో ఉంచుకొని ఎవరికి పర్సన్ ఇన్‌చార్జీలుగా నియమించాలనే దానిపై ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టత ఇవ్వనుంది. అయితే ఉమ్మడి జిల్లాలోని కొన్ని సంఘాల్లోని సభ్యులు సొసైటీ నుంచి పంట రుణాలు తీసుకొని ఇప్పటి వరకు కట్టలేదు. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రతి ఏడాది సొసైటీ నుంచి రుణాలు తీసుకుంటున్న, తిరిగి చెల్లిస్తున్న సభ్యుల వివరాలు తెలియజేయాలని జిల్లా అధికారులను ఆదేశించడంతో అధికారులు ఆ వివరాల సేకరణలో తలామునకలవుతున్నారు. పర్సన్ ఇన్చార్జీలను నియమిస్తాం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పాలక వర్గాల పదవీకాలం పూర్తి కావడంతో వాటికి పర్సన్ ఇన్చార్జీలను నియమించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడు నియమించే పర్సన్ ఇన్చార్జీలు ఫిబ్రవరి నుంచి 3 నుంచి కొనసాగుతారు. ఈ రెండు రోజుల వ్యవధిలో ప్రభుత్వం ఆదేశించిన కొన్ని వివరాలను సమర్పించాల్సి ఉంది. ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమయ్యాం. ఆదేశాల ప్రకారం పర్సన్ ఇన్చార్జీలను నియమిస్తాం. – మోహన్, జిల్లా సహకార శాఖ అధికారి, ఆదిలాబాద్ -
నిధులేవి?
నష్టాల్లో నడుస్తున్న పీఏసీఎస్‌లు కంప్యూటరీకరణ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు కంప్యూటర్ల కొనుగోలుకు నిధులివ్వని వైనం తిరువూరు : సహకార వ్యవస్థను కంప్యూటరీకరించాలని ఆదేశించిన రాష్ట్రప్రభుత్వం అందుకు అవసరమైన నిధులు మాత్రం కేటాయించలేదు. దీంతో ప్రాథమిక సహకార పరపతి సంఘాల పాలకవర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రెండేళ్లుగా రాష్ట్రప్రభుత్వం రుణమాఫీ ప్రకటించిన కారణంగా సహకార సంఘాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఫలితంగా రైతులకు రుణాల మంజూరులో సైతం వెనుకబడ్డాయి. పెద్దనోట్ల రద్దు సమయంలో కూడా సహకార బ్యాంకులు, సంఘాలను పక్కన పెట్టడంతో ఖాతాదారుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. జిల్లాలో 425 సహకార సంఘాలుండగా, గతంలోనే 300కు పైగా సంఘాలు సొంతగా కంప్యూటర్లు సమకూర్చుకున్నాయి. తాజాకంప్యూటరీకరణతో వాటిపైనా ఆర్థికభారం పడే పరిస్థితి ఉందని పాలకవర్గ సభ్యులు పేర్కొం టున్నారు. సహకార సంఘాల్లో మైక్రో ఏటీఎంల ఏర్పాటు విషయంలో ఆర్థికభారం మోపకుండా జిల్లా కేంద్రబ్యాంకు సహకరించాలని కోరుతున్నారు. ప్రభుత్వ సహకారం ఏది? : కంప్యూటరీకరణకు హడావుడిగా ఆదేశాలిచ్చిన ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా రైతులకు రూ.లక్ష లోపు రుణాలకు ఇచ్చిన వడ్డీ రాయితీని సహకార సంఘాలకు బదలాయించడంలో ఉదాసీనవైఖరి అవలంబిస్తోందని పీఏసీఎస్ అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు వడ్డీరాయితీ సొమ్ము చెల్లించకపోయినా రైతులకు ముందుగానే రశీదు ఇస్తుండటంతో సహకార సంఘాలు నష్టాల్లో కూరుకుపోతున్నాయని చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న పీఏసీఎస్‌లు మినహా మిగిలిన సొసైటీలు ఉద్యోగుల జీతాలు చెల్లించే పరిస్థితి కూడా లేక అల్లాడుతున్నందున కంప్యూటరీకరణకు అవసరమైన లక్షలాది రూపాయలు ఎలా కేటాయించాలని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఆప్కాబ్ అధ్యక్షుడు పిన్నమనేని వెంకటేశ్వరరావు రాష్ట్రప్రభుత్వంతో సహకార సంఘాల కంప్యూటరీకరణ విషయమై సంప్రదించినా పురోగతి లేదని పలువురు పీఏసీఎస్ అధ్యక్షులు చెబుతున్నారు. -
సొసైటీలో కుంభకోణంపై విచారణకు ఆదేశం
ఏలూరు (మెట్రో) : ఆచంట మండలం వల్లూరు సహకార సొసైటీలో అవినీతి కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేసి రెండు రోజుల్లో నివేదిక అందించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ జిల్లా సహకార అధికారి లూథర్‌ను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫోన్ ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వల్లూరుకు చెందిన రాములు కలెక్టర్‌కు ఫోన్ చేసి సొసైటీలో నిధులు దుర్వినియోగమయ్యాయని, బాధ్యులపై చర్యలు తీసుకుని సొసైటీని రక్షించాలని కోరాడు. కలెక్టరేట్లో విధులు నిర్వహించి రిటైర్ అయిన సాంబశివరావు అనే ఉద్యోగి తనకు పెన్షన్ బెనిఫిట్స్ ఇంకా అందలేదని ఫిర్యాదు చేయగా జిల్లా రెవెన్యూ అధికారిని కలవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘నకిలీ’ రుణ గ్రహీతలపై చర్యలేవీ?
ఫోర్జరీ సంతకాలతో పాస్ పుస్తకాలు చూపి రుణాల రెన్యూవల్ విచారణ చేపట్టినా చర్యలు తీసుకోని అధికారులు చెన్నారావుపేట : మండల కేంద్రంలోని సహకార సంఘంలో నకిలీ పట్టా పాస్ పుస్తకాలపై పలువురు రుణాలు తీసుకొని ఏడాది కావస్తున్నా.. నిందితులపై నేటికీ చర్యలు చేపట్టలేదు. పైగా పలువురికి కొత్త రుణాలను రెన్యువల్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. దీనిపై గొంతు విప్పిన ఓ రైతుపై సాక్షా త్తూ సొసైటీæకార్యాలయ ఆవరణలో సోమవారం దాడికి పాల్పడటం గమనార్హం. రైతుల కథనం ప్రకారం.. గూడూరు మండలంలోని గుండెంగ, గాజులగట్టు గ్రామాలకు చెందిన పలువురు 2015 డిసెంబర్లో నకిలీ పట్టా పాస్ పుస్తకాలతో రబీ రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతర కాలంలో సొసైటీ చైర్మన్ రాదారపు సాంబరెడ్డి నకిలీ పాస్ పుస్తకాలను గుర్తించారు. వాటిపై గూడూరు తహసీల్దార్, మహబూబాబాద్ ఆర్డీఓల ఫోర్జరీ సంతకాలు ఉండటంతో ఆయన ఈ విషయాన్ని గుర్తించగలిగారు. దీనిపై విచారణ చేసిన అధికారులు పాస్ పుస్తకాలు తీసుకొని వెళ్లిపోయారు. కానీ ఇప్పటిదాకా చర్య లు మాత్రం తీసుకోలేదు. అంతేకాకుండా సొసైటీ నుంచి పొందిన రుణాలను రికవరీ కూడా చేయలేదు. ఇదిలా ఉండగా లావుడ్యా ఈర్య సోమవారం సొసైటీ కార్యాలయానికి వచ్చి 11 మందికి రుణాలు ఇలా ఇచ్చారు, నాకు కూడా అలాగే ఇవ్వండి అంటూ నిలదీ శారు. దీంతో బోడ భాస్కర్, రాజు, రవిలు అతడిపై దాడికి పాల్పడ్డారు. దీని గురించి ఈర్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పొనుగోడు,గుండెంగ మీ సేవా కేంద్రాలకు చెందిన కొంతమంది వ్యక్తులు రైతుల నుంచి అధిక మెుత్తంలో డబ్బులు తీసుకొని నకిలీ పాస్ పుస్తకాలను అందించారనే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. రుణం అడిగితే డబ్బులు డిమాండ్ చేశాడు గత సంవత్సరం నకిలీ పాస్ పుస్తకాలపై ఓ పైస్థాయి వ్యక్తి డబ్బులు తీసుకొని రుణాలు ఇప్పించాడు. అలాగే ఈ సంవత్సరం కూడా రుణాలు ఇవ్వమని అడిగితే డబ్బులు డిమాండ్ చేశాడు. నేను ఇవ్వకపోవటంతోనే నాకు రుణాలు ఇవ్వకుండా ఆపాడు. నిలదీసినందుకు నన్ను కొట్టించాడు. – బాధితుడు లావుడ్యా ఈర్య -
నకిలీ పాస్‌పుస్తకాలతో పీఏసీఎస్‌లో రుణాలు
ఓ రైతుకు రుణం రెన్యూవల్ చేయకపోవడంతో వెలుగులోకి 12 మంది రుణాలు పొందినట్లు వెల్లడించిన సదరు రైతు చెన్నారావుపేట : నకిలీ పాస్‌పుస్తకంతో పీఏసీఎస్‌లో రు ణం పొందిన ఓ రైతుకు రుణాన్ని ఈసారి రెన్యూవల్ చేయకపోవడంతో ఆగ్రహం చెందాడు. తనలాగే మరికొందరు రైతులకు నకిలీ పాస్‌పుస్తకాలపై రుణాలు ఇచ్చి, ఈసారి రెన్యూవల్ చేశారని తనకెందుకు చేయరని సంబంధిత అధికారులను నిలదీశాడు. దీంతో సదరు రైతును మిగతా ‘నకిలీ’ రైతులు చితకబాదారు. ఈ సంఘటన మండల కేంద్రంలోని సహకార సంఘంలో సోమవారం జరిగింది. బాధిత రైతు ఈర్యా కథనం ప్రకారం.. గూడురు మండ లం గుండెంగ గ్రామానికి చెందిన లావుడ్య ఈర్యా, బోడ భాస్కర్, రవి, రాజుతో సహా 12 మంది గత సంవత్సరం నకిలీ పట్టా పాస్ పుస్తకాలపై చెన్నారావుపేట సహకార సంఘంలో అక్రమంగా రుణాలు పొందారు. ఈ సంవత్స రం కూడా నకిలీ పాస్‌పుస్తకాలపై ఖరీఫ్ రుణాలు రెన్యూవల్ చేసి బోడ భాస్కర్, రవి, రాజుతోపాటు మరికొందరికి రుణాలు ఇచ్చారు. కానీ తన వద్ద రూ.35 వేలు తీసుకున్నప్పటికీ రుణం ఎందుకు రెన్యూవల్ చేయడం లేదని లావుడ్యా ఈర్య సొసైటీ కార్యాలయానికి వచ్చి సీఈఓ రవి, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీను, డైరెక్టర్ కామగోని శ్రీనుతో గొడవపడ్డాడు. మిగతా వారికి రుణాలను రెన్యూవల్ చేసి మళ్లీ ఇచ్చారని.. తనకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన భాస్కర్, రవి, రాజు నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు తీసుకున్నామని తమ పేర్లు ఎందుకు చెబుతున్నావంటూ కొట్టారని ఈర్య ఆవేదనతో చెప్పాడు. వారి దాడిలో ఈర్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. ఆరోపణలు అవాస్తవం నకిలీ పాస్ పుస్తకాలపై ఈ ఏడాది ఖరీఫ్ పంట రుణాలు ఇచ్చామనే ఆరోపణలు అవాస్తవం. గతంలో గుండెంగకు చెందిన 12 మంది రైతులు నకిలీ పాసుపుస్తకాలతో పంట రుణాల కోసం సంప్రదించారు. నకిలీ పాసు పుస్తకాలను గూడూరు తహసీల్దార్‌కు అప్పగించాం. వీటిపై గతేడాది పీఏసీఎస్‌లో తీసుకున్న పంట రుణాలను తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. – రాదారపు సాంబరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, చెన్నారావుపేట -
దోపిడీ డొంక కదిలేనా..?
రెండేళ్లుగా గుర్తించని ఆడిటర్లు తిమ్మాపూర్: తీగ లాగితే డొంక కదిలింది అన్న చందంగా మారింది పోరండ్ల సహకార బ్యాంకులో దోపిడీ వ్యవహారం. ఏడాదిలో చేసిన దోపిడీ లక్షల్లో బయటపడగా అంతకు ముందు కూడా డబ్బుల దుర్వినియోగం జరిగినట్లు చర్చ సంఘ పరిధిలో జోరుగా సాగుతోంది. ఇద్దరు ఉద్యోగులు చేసిన అంకెలగారడీని గతంలో సీనియర్ ఆడిటర్లు సైతం గుర్తించలేదని తెలుస్తోంది. ఒక సంవత్సరమే కాకుండా అంతకుముందు కూడా అవినీతి జరిగిందా అనే విషయాన్ని అప్పటి సీనియర్ ఆడిటర్లు మరోసారి పరిశీలిస్తున్నట్లు తెలిసింది. బ్యాంకు ఖాతా పుస్తకాలను ఒక గదిలో పెట్టుకుని తాళం వేసినట్లు సమాచారం. సుమారు 2500 మంది సేవింగ్స్ ఖాతాదారులు ఉండగా వారికి సంబంధించిన రికార్డులన్నీ ముగ్గురు ఆడిటర్ల పరిధిలోనే ఉన్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఇద్దరు ఉద్యోగులు చేసిన అవినీతి తంతు కేవలం ఆ ఒక్క సంవత్సరానికే పరిమితం కాలేదని సదరు ఆడిటర్ నిర్ధారణకు వచ్చారు. ఈ ఏడాది ఖాతా పుస్తకాలనే కాకుండా గతం పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆడిటర్ గుర్తించారు. ఇదే విషయాన్ని 2013 నుంచి 2015 వరకు బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలను ఆడిట్ చేసిన ఆడిటర్లకు తెలిపారు. ఆయా సంవత్సరాల్లో ఆడిట్ చేసిన సీనియర్ ఆడిటర్లు మరోసారి ఆడిట్‌ని చేపట్టారు. అందులోనూ అంకెలగారడీ జరిగినట్లు గుర్తించినా, ఎంత మేరకు జరిగిందనేది బయటకు పడలేదని స్థానికంగా గుసగుస మొదలైంది. ముగ్గురూ ఆడిటర్లు పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత ఎవరి నివేదికను వారు పాలకవర్గానికి అప్పగిస్తే ఎంత స్వాహా చేశారనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
నెగ్గిన అవిశ్వాసం
⇒ కందుకూరు పీఏసీఎస్ వైస్ చైర్మన్‌పై గెలిచిన అధికార పార్టీ ⇒ తాత్కాలిక చైర్మన్‌గా మల్లేష్, వైస్ చైర్మన్‌గా బాల్‌రెడ్డి ⇒ 4వ తేదీన పూర్తి స్థాయిలో ఎన్నిక ⇒ అవిశ్వాసం అనంతరం డైరెక్టర్లు నేరుగా శిబిరానికి కందుకూరు: కందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్) చైర్మన్ రాజీనామా చేయడంతో వైస్ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాసాన్ని ఎట్టకేలకు అధికార పార్టీ నెగ్గించుకుంది. జూలై 11న అధికార పార్టీ డైరెక్టర్ సరికొండ మల్లేష్ 10 మంది సభ్యుల సంతకాలతో చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చారు. సొసైటీ అధికారులు ఆగస్టు 2న అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి తేదీని ప్రకటించారు. జరిగిన పరిణామాలతో జూలై 30న చైర్మన్ వెదిరె నర్సింగంరెడ్డి రాజీనామా పత్రాన్ని డీఎల్సీఓకు అందించారు. దీంతో మంగళవారం ఉదయం 11 గంటలకు పీఏసీఎస్ కార్యాలయంలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానానికి శిబిరం నుంచి నేరుగా పది మంది డైరెక్టర్లు సరికొండ మల్లేష్, హరికిషన్‌రెడ్డి, బాల్‌రెడ్డి, రాములు, కొండారెడ్డి, యాదయ్య, జంగయ్య, బాల్‌రాజ్, లక్ష్మమ్మ, యాదమ్మతో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వచ్చారు. డిప్యూటీ రిజిస్ట్రార్, డివిజన్ కో ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్‌రావు, సబ్ డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి నర్సింహారెడ్డి ఉదయం 10.30 గంటలకు చైర్మన్ నర్సింగంరెడ్డి పంపిన రాజీనామ పత్రాన్ని ఆమోదించారు. అనంతరం హాజరైన సభ్యుల సమక్షంలో వైస్ చైర్మన్ ఎల్లారెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చర్చకు అనుమతించారు. 10 మంది డైరెక్టర్ల ఏకగ్రీవ ఆమోదంతో వైస్ చైర్మన్ పదవీచ్యుతుడు అయినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం తాత్కాలిక చైర్మన్‌గా మీర్ఖాన్పేట డైరెక్టర్ సరికొండ మల్లేష్, వైస్ చైర్మన్‌గా నేదునూరు డైరెక్టర్ సర్గారి బాల్‌రెడ్డిని సభ్యులందరి ఏకాభిప్రాయంతో నియమించినట్లు ప్రకటించారు. పూర్తి స్థాయి చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఈనెల 4న మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి సమావేశాన్ని నిర్వహించి ఎన్నిక నిర్వహిస్తామని డీఎల్సీఓ శ్రీనివాస్‌రావు ఈ సందర్భంగా విలేకరులకు తెలిపారు. ఆరోజు కోరం కింద 7 మంది డైరెక్టర్లు హాజరైతే పరిగణలోకి తీసుకుంటామని, చేతులు ఎత్తే పద్ధతిలో చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటామని చెప్పారు. సొసైటీ పదవీ కాలం ఫిబ్రవరి 2018 వరకు ఉంటుందన్నారు. ఒకసారి ఎన్నికైతే మళ్లీ మూడేళ్ల వరకు అవిశ్వాసానికి అవకాశం లేదన్నారు. పోలీసుల బందోబస్తు.. ఉదయం నుంచి సొసైటీ కార్యాలయంలో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఏలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో ఆదిబట్ల, మంచాల, మహేశ్వరం సీఐలు గోవిందరెడ్డి, గంగారం, మన్మోహన్, స్థానిక ఎస్ఐలు చెన్నకేశ్వర్, సుధాకర్, సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. అయితే, అవిశ్వాస సమావేశం పూర్తయిన తర్వాత డైరెక్టర్లను నేరుగా ఎమ్మెల్యే తీగల మినీ బస్సులో శిబిరానికి తరలించారు. -
పీఏసీఎస్ పనితీరు భేష్
ఇబ్రహీంపట్నం రూరల్: ఉప్పరిగూడ పీఏసీఎస్‌ను వాణిజ్య బ్యాంకులకు దీటుగా తీర్చిదిద్దడం బాగుందని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు కితాబిచ్చారు. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ పరిధిలోని శేరిగూడ వార్డులో ఉన్న ఉప్పరిగూడ పీఏసీఎస్‌ను మంగళవారం 9 జిల్లాల సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు స్టడీటూర్‌లో వచ్చి సందర్శించారు. ఉప్పరిగూడ పీఏసీఎస్ సీఈఓ గణేష్‌ని సంఘం పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా సంఘాన్ని తీర్చిదిద్దడం చాలా బాగుందన్నారు. ఎక్కడ లేనన్ని డిపాజిట్లు సేకరించి రైతుల శ్రేయస్సుకోసం పాటుపడటం అభినందనీయమని తెలిపారు. క్యాష్ కౌంటర్, ఎరువుల, విత్తనాల కేంద్రాలు, ఏర్పాటు చేసి వాణిజ్య బ్యాంకులకు దీటుగా సంఘాన్ని తీర్చిదిద్దడం రాష్ర్టానికే గర్వకారణమని కొనియాడారు. గోల్డ్ లోన్లు, దీర్ఘకాలిక రుణాలు ఇచ్చి రైతులను ఆపదలో అదుకొవడం శుభపరిణామమని అన్నారు. రోజుకు రూ.50 లక్షలు టర్నోవర్‌తో సంఘం పని చేయడం నచ్చిందని అభిప్రాయం వ్యక్తపరిచారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ , మహబూబ్‌నగర్‌తో పాటు పలు జిల్లాలో పని చేస్తున్న సంఘాలను ఉప్పరిగూడ పీఏసీఎస్‌లాగా తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ర్టంలోనే ఉప్పరిగూడ పీఏసీఎస్ సేవలు రైతులకు అందుబాటులో ఉన్నయని ఇదే తరహాలో ఆయా జిల్లాలో నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 9 జిల్లాల చైర్మన్లు, సీఈఓలు పాల్గొన్నారు. -
పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ టౌన్ : పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.నరసింహన్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2012లోనే వర్తింపజేయాల్సిన పే రివిజన్ నేటికీ అమలు చేయకపోవడం వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. పింఛన్ సౌకర్యం కల్పించి, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఐదవ కేటగిరీలోని ఖాళీలను యాబై శాతం పీఏసీఎస్ ఉద్యోగులతో భర్తీ చేయాలని కోరారు. అనంతరం సీఈఈ మదన్మోహన్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్యాంసుందర్, బి.అనంతరెడ్డి, జె.శ్యాంసుందర్‌రెడ్డి, వి.వెంకట్‌రెడ్డి, అంజనేయులు, రామస్వామి, గణేష్, జనార్ధన్‌రెడ్డి, కె.అనంతరెడ్డి, బిక్షమయ్య, సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్లు, వాసు, ఉపేందర్, కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, ఎస్.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం
త్రిపురారం : పెద్దదేవులపల్లి వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సభ్యులుగా ఉన్న పెద్దదేవులపల్లి, కామారెడ్డిగూడెం గ్రామాలకు చెందిన వద్ది సోమయ్య, ఠాకూర్ రాజకుమారీబాయి, బయ్య సైదులు, వనం కేశవులు అకాలంగా మృతి చెందారు. మృతుల దహన సంస్కారాల కోసం ఒక్కొక్క కుటుంబానికి తక్షణ సాయం కింద మంజూరైన రూ.10 వేలను ఆయా కుటుంబసభ్యులకు సోమవారం సొసైటీ చైర్మన్ బుసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, సీఈఓ దూళిపాల గోవర్ధన్, ఠాకూర్ రాజారాంసింగ్, యాదగిరి, వెంకన్న తదితరులు ఉన్నారు. -
రూ.50 తగ్గిన డీఏపీ ధరలు
పెద్దేముల్: డీఏపీ ఎరువుల ధరలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. నెలరోజుల క్రితం గోదావరి 50 కిలోల బస్తా రూ.1,303 ఉండగా, తరువాత రూ1,260కి విక్రయించారు. రెండు రోజుల క్రితం పెద్దేముల్ రైతు సేవా సహకార సంఘం అధికారులు రూ.1,155కి విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించి రైతులు ఎరువులు ఖరీదు చేసుకోవాలన్నారు. కాగా కొన్ని గ్రామాల్లోని ఎరువుల దుకాణాల్లో మాత్రం అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారని, రసీదులు అడగితే ఇవ్వడం లేదని పలు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. -
మేనిఫెస్టో అమలులో నిర్లక్ష్యం
డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి రాయపర్తి : మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని డీసీసీబీ చైర్మన్, కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త జంగా రాఘవరెడ్డి విమర్శించారు. మండలంలోని పెర్కవేడు పీఏసీఎస్‌లో హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఏసీఎస్ భవనం, ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన లక్ష రూపాయల మాఫీ ఒకేసారి చేయకపోవడంతో వారికి లబ్ధి చేకూరడం లేదన్నారు. అన్నదాతలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పీఏసీఎస్ ద్వారా గేదెలు, గొర్రెలు, ట్రాక్టర్ల కొనుగోలుతో పాటు పిల్లల చదువులకు రుణాలు ఇస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బిల్లా సుధీర్‌రెడ్డి, గ్రామసర్పంచ్ గారె అనిత, డీసీసీ జీఎం సురేందర్, యాదగిరి, సుధాకరాచారి, మేనేజర్ నరేందర్, యాకూబ్, సీఈఓ ఏడాకుల సోమిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హామ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పీఏసీఎస్ ‘చైర్మన్’ కోసం లాబీయింగ్
♦ అధికార పార్టీకి అండగా రంగంలోకి ఎమ్మెల్యే తీగల ♦ చైర్మన్ పీఠంపై తమ వారికే దక్కేలా ప్రయత్నాలు ♦ పదవి కాపాడుకునేందుకు ప్రస్తుత చైర్మన్ తంటాలు ♦ రసవత్తరంగా కందుకూరు రాజకీయం కందుకూరు: కందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్) చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసులు ఇవ్వడంతో మండలంలో రాజకీయం రసవత్తరంగా మారింది. దీంతో డైరెక్టర్లను కాపాడుకోవడానికి ఇరువైపులా క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. కందుకూరు పీఏసీఎస్ పరిధిలో మొత్తం 13 మంది డైరెక్టర్లు 2013 జనవరి 31న ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 2న రాచులూరు డైరెక్టర్ వెదిరె నర్సింగంరెడ్డి చైర్మన్(కాంగ్రెస్)గా, గూడూరు డైరెక్టర్ సురసాని ఎల్లారెడ్డి వైస్ చైర్మన్‌గా అప్పట్లో ఎన్నికయ్యారు. అయితే, 2015 ఫిబ్రవరిలో మొదటిసారిగా కందుకూరు డైరెక్టర్ సురసాని హరికిషన్‌రెడ్డి.. చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అప్పట్లో అది వీగిపోయింది. ప్రస్తుతం తిరిగి కందుకూరుకు చెందిన మీర్కాన్‌పేట డైరెక్టర్ సరికొండ మల్లేష్(టీఆర్ఎస్) పదిమంది డైరెక్టర్ల సంతకాలతో ఈ నెల 11న మరొకసారి చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి డీఎల్ఓకు నోటీసులు అందించారు. దీంతో ఆగస్టు 2న పదకొండు గంటలకు పీఏసీఎస్ కార్యాలయంలో నిర్వహించే అవిశ్వాస తీర్మానానికి హాజరు కావాలని డైరెక్టర్ల అందరికి సంబంధిత అధికారుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. అయితే, ప్రస్తుత చైర్మన్ తన పదవిని కాపాడుకోవడానికి తనతో కలిసి ఐదుగురు డైరెక్టర్లు అవసరం ఉంది. అవిశ్వాసం నెగ్గించుకోవాలంటే 9 మంది డైరెక్టర్లు అవసరం. దీంతో ఇరువర్గాలకు చెందిన వారు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. కాగా, గతంలో ఒకసారి అవిశ్వాసాన్ని నెగ్గించుకోలేకపోవడంతో ఈ దఫా సవాలుగా తీసుకున్న అధికార పార్టీ తమకు అనుకూలంగా ఉన్న డైరెక్టర్లతో విశాఖపట్నంలో శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంబంధిత డైరెక్టర్లతో గట్టి హామీ తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందరి అభిప్రాయాలు తీసుకుని చైర్మన్‌గా మల్లేష్‌ను ఎన్నుకోవాల్సిందిగా సూచించినట్లు సమాచారం. అవిశ్వాస పరీక్షను నెగ్గించుకుని చైర్మన్ పదవిని ఏవిధంగానైనా అధికార పార్టీ దక్కించుకోవడానికి పావులు కదుపుతుంది. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్యే సహకారంతో మల్లేష్ తమకు అవసరమైన 9 మంది డైరెక్టర్ల మద్దతు కూడగట్టుకుని ధీమాగా ఉన్నట్లు సమాచారం. అయితే, మరో పక్క అవిశ్వాసాన్ని వీగిపోయేలా చేయడానికి ప్రస్తుత చైర్మన్ నర్సింగంరెడ్డి తన ప్రయత్నాల్లో బిజిబిజీగా ఉన్నారు. తనతో కలిసి వచ్చే వారి కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. అవిశ్వాసాం వీగిపోతుందా? నెగ్గుతుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. అప్పటి వరకు ఉత్కంఠ కొనసాగనుంది.