మిగులు ధాన్యం దళారుల పాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ధాన్యం రైతులకు కనీస మద్దతు ధర చెల్లించేం దుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు నేటితో మూతపడనున్నాయి. ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు ఆదివారం వరకే పని చేయనున్నాయి. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈసారి ధా న్యం కొనుగోళ్లను ఎన్నికల కారణంగా కొంత ఆలస్యం గా గత నెల 2న ప్రారంభించారు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య నెల రోజుల వ్యవధిలోనే కొనుగోలు ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పటివరకు అధికారులు నిర్దేశించిన లక్ష్యం చేరుకోవడంతో ఇక తలకు మించిన భారం వద్ద ని చేతులెత్తేశారు. దీనికితోడు నైరుతి రుతుపవనాలు ప్ర వేశించడంతో వర్షాల గుబులుతో కొనుగోళ్ల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నారు.
జిల్లావ్యాప్తంగా 617 కేంద్రాల ద్వారా 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 599 కేంద్రాల ద్వారా 5,49,348 టన్నుల ధాన్యాన్ని సేకరించడంతో కొనుగోళ్లపై చేతులెత్తేశారు. ఇందులో 301 ఐకేపీ సంఘాల ద్వారా 3,19,226 టన్నులు, 297 పీఏసీఎస్ కేంద్రాల ద్వారా 2,48,389 టన్నులు, రెండు జీసీల ద్వారా 2,81.440 టన్నుల ధాన్యం సేకరించారు. మొ త్తంగా సేకరించిన ధాన్యంలో 5,49,348 టన్నుల ధా న్యం రైస్‌మిల్లర్లకు రవాణా చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.763.69 కోట్లలో ఇప్పటివరకు రూ.694 కోట్ల రైతులకు విడుదల చేసినట్లు డీఎస్‌వో చంద్రప్రకాష్ వెల్లడించారు. ఆదివారం ఉదయం లోగా మరో 25 వేల టన్నుల ధాన్యం సేకరించే అవకాశముంది.
ఆరు బయట లక్ష క్వింటాళ్లు
అధికారుల ప్రణాళిక లోపం, పర్యవేక్షణ లేకపోవడం వ ల్ల ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో నత్తనడకన కొనసాగింది. ఈ క్రమంలో నెల రోజుల వ్యవధిలో ఆరుసా ర్లు వర్షం కురవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రైతుకు మరింత సమయం పట్టింది. ధాన్యం కొనుగోళ్ల నుంచి మిల్లులకు తరలించే వరకు రైతుకే బాధ్యత అప్పజెప్పడంతో రైతులు వారం నుంచి ఇరవై రోజుల వరకు పడిగాపులు కాయాల్సి వచ్చింది.
తూకం వేసిన ధాన్యం తరలింపులో జాప్యం, మిల్లర్లు సహకరించకపోవడం, గన్నీ సంచులు, హమాలీలు, లారీల కొరత వెరసి కొనుగోళ్ల లో జాప్యం జరిగింది. దీంతో జిల్లావ్యాప్తంగా మరో లక్ష క్వింటాళ్ల ధాన్యం విక్రాయనికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అరవై వేల క్వింటాళ్లు కల్లాల్లో, మరో నలభై వేల క్వింటాళ్లు కేంద్రాల్లో నిల్వ ఉన్నట్లు సమాచారం. కేంద్రా ల్లో పోసి ఉంచిన కుప్పలను కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఇప్పటికే కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో సుమారు ఇరవై రోజులుగా కుప్ప ల వద్ద కాపలా కాస్తున్న రైతులు అధికారుల నిర్ణయం తో ఆందోళన చెందుతున్నారు.
కేంద్రాల్లో ఉన్న ధాన్యా న్ని తిరిగి మార్కెట్ యార్డులకు తరలించడం అదనపు భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్తగా వచ్చిన ధాన్యాన్ని అనుమతించడం లేదు. కొనుగోలు నిలిపివేస్తున్న క్రమంలో ఇకనుంచి మార్కెట్ యార్డుల్లో ధాన్యం విక్రయించుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. ఇదే అదునుగా యార్డుల్లో దళారులు చెప్పి న ధరకే విక్రయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. మరికొంత కాలం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.