ikp
-
చెక్కుల చిక్కులు
ధాన్యం కొనుగోళ్లలో కొత్త నిబంధనలు పంట చేతికొచ్చినా అమ్ముకోలేని దుస్థితిలో రైతులు కొనుగోలుదారులకు ఆన్లైన్ వే బిల్లుల తంటా ఐకేపీ కేంద్రాలను వీడని బకాయిల సమస్య తాడేపల్లిగూడెం : సాగునీటి కష్టాలకు ఎదురీది వరి పండించిన రైతులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. నగదు లావాదేవీలకు ప్రభుత్వం చెక్ పెట్టడంతో.. ధాన్యం అమ్మిన రైతులకు చెక్కుల రూపంలో సొమ్ము చెల్లించాలంటూ బ్యాంకులు మెలిక పెడుతున్నాయి. రైతుల పేరిట ఖాతాలు రాసి.. మిల్లర్ల పేరిట ధాన్యం కమీషన్ వ్యాపారుల ఖాతాల్లో సొమ్ములు చెల్లించే విధానానికీ మంగళం పలికాయి. మరోవైపు ధాన్యం రవాణాకు సంబంధించిన వే బిల్లులను ఆన్లైన్ విధానంలో జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నిబంధనలన్నీ రైతుల పాలిట శాపంగా పరిణమించాయి. ఇకపై ధాన్యం విక్రయించే రైతులు ముందుగా ఐకేపీ కేంద్రాలకు వెళ్లి ఫొటో తీయించుకోవాలి. వేలిముద్ర వేయాలి. అప్పుడే «రైతు తీసుకెళ్లిన ధాన్యం రికార్డుల్లో నమోదవుతుంది. ధాన్యం అమ్మిన సొమ్ము సదరు రైతు పేరిట బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఈ తతంగమంతా రైతులను అయోమయంలోకి నెడుతోంది. కొనుగోళ్లకు దూరంగా మిల్లర్లు సార్వా సీజన్‌కు సంబంధించి జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబం«ధించి బకాయిలు ఇంకా చెల్లించలేదు. ఈ క్రమంలో దాళ్వాలో రైతులు పండించిన ధాన్యం ఐకేపీ కేంద్రాల్లో విక్రయించాలంటే కొత్త నిబంధనలు రూపొందించారు. ధాన్యం అమ్మడానికి ముందే రైతులు విధిగా ఐకేపీ కేంద్రాలకు వెళ్లాలి. అక్కడ ఫొటో తీయించుకుని వేలిముద్రలు వేయాలి. ధాన్యం కొనుగోలులో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టినా క్షేత్రస్థాయిలో ఆచరణ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో దాళ్వా ధాన్యం కొనుగోళ్లలో అయోమయం నెలకొంది. మిల్లర్లు గత సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి బకాయిల చిక్కుముడి విడకపోవడంతో పట్టు బిగించారు. అప్రకటితంగా ధాన్యం కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. ఈ చర్యలు రైతులకు కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. మిల్లర్ల ఖాతాలు అనుసంధానం ఐకేపీ కేంద్రాలకు రైస్ మిల్లర్ల బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసే ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జిల్లాలో 234 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాచరణ రూపొందించింది. దీనిపై అవగాహన కల్పించడం కోసం బాధ్యత తీసుకోవాలని దిగువ స్థాయి అధికారులకు అదేశాలు ఇచ్చింది. 17 శాతం తేమ, ఒక శాతం మట్టి, తాలుతప్ప ఉన్న« ధాన్యాన్ని గ్రేడ్ఏ ధాన్యాన్ని క్వింటాల్ రూ.1,510కు, కామన్ రకం క్వింటాల్ రూ.1,470కు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు ధాన్యం తూర్పార బట్టి, తేమ శాతం నిబంధనల మేరకు ఉండేలా చూసుకుని ఐకేపీ కేంద్రాలకు తీసుకురావాలని సూచించిది. ధాన్యం కొనుగోలులో గత నిబంధనలే ఉంటాయని జిల్లా పౌర సరఫరాల అధికారి పి.వెంకటకొండయ్య చెబుతున్నారు. సార్వాలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి బకాయిలకు ఇబ్బంది లేకుండా చెల్లింపులు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఖాతాల్లో సొమ్ములున్నా చేతికందక.. రైతుల ఖాతాల్లో సొమ్ములున్నా.. ఆ మొత్తాలను ఉపసంహరించుకునే విషయంలో బ్యాంకులు నిబంధనలు విధించాయి. వరి కోతలు, ధాన్యం మాసూళ్ల కోసం వచ్చిన కూలీలకు సొమ్ములు చెల్లించాలంటే రైతులు చెక్కు రూపంలోనే చెల్లింపులు చేయాలి. బంటాకు సొమ్ములు ఇవ్వాలన్నా ఇదే పద్ధతి. దీంతో రైతుల ఖాతాల్లో సొమ్ములున్నా కూలీలకు చెల్లించలేని పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కన్నెత్తి చూడని కమీషన్ వ్యాపారులు ప్రభుత్వం మాన్యువల్ వే బిల్లులకు చెక్ పెట్టింది. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆన్లైన్ వే బిల్లులు జారీ చేయాలని నిబంధనలు విధించారు. తద్వారా చెక్ పోస్టుల కళ్లుగప్పి ధాన్యాన్ని తరలించడాన్ని నిరోధించవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. ఆన్లైన్ వే బిల్లుల ద్వారా వ్యవహారాలు నిర్వహిస్తే ఆదాయ పన్నుశాఖ కళ్లల్లో పడతామనే భయం ధాన్యం కమీషన్ ఏజెంట్లకు పట్టుకుంది. దీంతో వారు ధాన్యం కొనేందుకు వెనుకాడుతున్నారు. ఇదిలావుంటే.. రైతులు ఐకేపీ కేంద్రాలకు ధాన్యం తోలినా, మిల్లర్లకు విక్రయించినా, కమీషన్‌దారులకు అమ్మినా సొమ్ములు నగదు రూపంలో పొందలేకపోతున్నారు. ఆర్టీజీఎస్ లేదా ఆన్లైన్లో నగదు మళ్లించే ప్రక్రియ సాగుతోంది. ఇలా ధాన్యం కొనుగోలు విషయంలో కొత్త నిబంధనలు పెట్టడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంటీయూ1156 రకం పండించిన రైతులకు కష్టాలు జిల్లాలో కొత్తగా సాగులోకి వచ్చిన సంకర రకం ఎంటీయూ1156 ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మిల్లర్లు, ఎఫ్‌సీఐ ఆసక్తి చూపించడం లేదు. వాస్తవానికి ఈ రకాన్ని సూపర్ ఫైన్‌గా కొనుగోలు చేయాలి. ఈ «రకంలో పిండి శాతం ఎక్కువగా ఉండటంతోపాటు బ్లాక్ స్పాట్ (గింజ తలపై నల్లటి మచ్చ) వస్తోందంటూ ఎఫ్‌సీఐ నిరాకరిస్తోంది. దీంతో మిల్లర్లు సైతం ఈ ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదు. జిల్లాలోని మొత్తం వరి సాగు విస్తీర్ణంలో 18.2 శాతం (31 వేల హెక్టార్లు) రైతులు ఎంటీయూ1156 రకం ధాన్యాన్ని రైతులు సాగుచేస్తున్నారు. సుమారు మూడు లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో కొన్నిచోట్ల పిండి గింజలు మాదిరిగా, కొన్ని ప్రాంతాల్లో అవి లేకుండా ఈ రకం ధాన్యం ఉంది. పూర్తిస్థాయి మాసూళ్లు జరిగితే కాని ఎలాంటి నిర్ధారణకు రాలేమని సివిల్ సప్లైస్ వర్గాలు చెబుతున్నాయి. -
నకిలీ ట్రక్ షీట్ల మాయాజాలం
చింతలపూడి(ప.గో) : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలతో రైతులకు మద్దతు ధర అందకుండా పోతోంది. మిల్లర్లు, ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, కమీషన్ ఏజెంట్లు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం రవాణా చేసే ట్రక్షీట్ల ముసుగులో దళారులకు ప్రభుత్వ సబ్సిడీని దోచిపెడుతున్నారు. తాజాగా చింతలపూడిలో ఇటువంటి సంఘటన బయటపడిం ది. ఫాతిమాపురం ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం రవాణా అవుతున్న ఏపీ 05వై 9478 నంబర్ లారీని తనిఖీ చేయగా నకిలీ ట్రక్‌షీట్ బయటపడింది. ప్రగడవరం పంచాయతీ కార్యదర్శి మానుకొండ బ్లెస్సింగ్ మోజెస్ పేరు తో 170 క్వింటాళ్ల ధాన్యం లోడు పట్టుబడింది. వాస్తవానికి మోజెస్ రైతు కాదు ప్రభుత్వ ఉద్యో గి. విషయం తెలుసుకున్న మోజెస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐకేపీ అధికారుల ఫిర్యాదుతో ధాన్యం లోడును చింతలపూడి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై సైదానాయక్ చెప్పారు. నిర్వాహకుల చేతివాటం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం లోడు చేసే సమయంలో ఐకేపీ, రెవెన్యూ, పౌరసరఫరాల సిబ్బంది ట్రక్ షీట్ రాసి ఏ మిల్లుకు సరఫరా చేయాలో తెలియజేస్తారు. మిల్లు యజ మాని ట్రక్ షీట్ చూసి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలి. ఇక్కడే కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారు. వ్యాపారులు రైతుల వద్ద కొన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నట్టు చూపుతూ మిల్లులకు తరలిస్తున్నారు. ఇందుకు కొనుగోలు కేంద్రం ని ర్వాహకులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషన్ వ్యాపారులు లారీకి ఇంతని కమీషన్ ముట్టచెబుతున్నారనే విమర్శ లు ఉన్నాయి. దీంతో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మిల్లర్ల జేబుల్లోకి చేరుతోంది. నకిలీ ట్రక్ షీట్లు వాస్తవమే ఫాతిమాపురం ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి నకిలీ ట్రక్‌షీట్లతో ధాన్యం రవాణా చేస్తున్న విషయం నిజమే. చెక్‌పోస్ట్ సిబ్బంది సమాచారంతో లారీని పట్టుకుని పోలీసులకు అప్పగించాం. గ్రామ సంఘంతో ఫిర్యాదు చేయించాం. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని డీఆర్డీఏ పీడీ చెప్పారు. – పి.భానుమతి, ఐకేపీ ఏపీఎం -
మంత్రి తీరు.. మహిళలు బేజారు!
ఆలూరు రూరల్: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీరుతో పొదుపు మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంద్రన్న పెట్టుబడి నిధి చెక్కుల కోసం ఆలూరుతో పాటు ఆయా గ్రామాలకు చెందిన పొదుపుగ్రూపు మహిళలు బుధవారం ఉదయం 10 గంటలకే స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలోని ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ కళామందిరానికి వచ్చారు. మహిళలకు 10:30 గంటలకు చెక్కులు అందించాల్సి ఉంది. అయితే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని..మంత్రి మధ్యాహ్నం ఒంటిగంటకు చెక్కుల పంపిణీకి వచ్చారు. మంత్రి వచ్చే వరకు మహిళలు ఉండాల్సిందే అంటూ.. ఐకేపీ సిబ్బంది వారిని బయటకు వెళ్లకుండా తలుపులు వేశారు. ఎవరూ బయటకు వెళ్లకుండా కుర్చీలో కూర్చోబెట్టి మంత్రి సమావేశం ముగిసేదాకా ఐకేపీ సిబ్బంది తగు చర్యలు తీసుకున్నారు. -
తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలి
నాగర్‌కర్నూల్: మహిళా సంఘాల బలోపేతం కోసం ఆయా సంఘాలు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని డ్వామా పీడీ మధుసూదన్‌నాయక్ అన్నారు. శనివారం పట్టణంలోని సమీకృతభవనంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. మహిళా సంఘాల అభ్యున్నతికి ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని, రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లిస్తే మరోసారి రుణాలు తీసుకునే అవకాశం లభిస్తుందన్నారు. అనంతరం ఆయా గ్రామాల మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఐకేపీ అధికారి శ్రీనువాసులు,సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
విభజన ఫీవర్!
ఏ శాఖలో చూసినా ఉద్యోగులు బిజీబిజీ జిల్లాల వారీగా ఊపందుకున్న ఫైళ్ల విభజన ఇందూరు: ప్రభుత్వ శాఖలకు ‘విభజన’ ఫీవర్ పట్టుకుంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఫైళ్లు, రికార్డులను వేరు చేసే పనుల్లో ఉద్యోగులు బిజీబిజీగా మారారు. నాలుగైదు రోజులుగా అన్ని శాఖల్లో సెక్షన్ల వారీగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వారీగా ఫైళ్లను వేరు చేస్తున్నారు. గడువు దగ్గర పడుతుండడంతో ఇతర పనులకు ఫుల్స్టాప్ పెట్టి కేవలం ‘విభజన’ పనుల్లోనే నిమగ్నమయ్యారు. ఏదైనా పని కోసం వచ్చిన వారిని వారం రోజుల తరువాత కలువండి అని చెప్పి పంపించేస్తున్నారు. ఫైళ్ల విభజన, వాటి స్కానింగ్‌కు ఈ నెల 7 వరకు మాత్రమే గడువు ఉండడంతో ఆయా శాఖల ఉద్యోగులు విభజన ఫైళ్లను వేరే చేసే పనిలో స్పీడు పెంచారు. బీరువాలు, రికార్డుల గదుల్లో ఉన్న ఫైళ్లకు పట్టిన దుమ్ము దులుపుతున్నారు. వందల సంవత్సరాలకు చెందిన ఫైళ్లు సైతం తీయాల్సి రావడంతో ఉద్యోగులకు పని భారం, తీవ్రమైన ఒత్తిడి తప్పడం లేదు. కామన్ ఫైళ్లు మాత్రం జాగ్రత్త పరిచి వాటిని స్కానింగ్‌తో పాటు జిరాక్స్‌లు చేసి ఒరిజినల్ నిజామాబాద్ జిల్లాలో, జిరాక్స్ కాపీలు కామారెడ్డి జిల్లాకు పంపడానికి సిద్ధం చేస్తున్నారు. స్కానింగ్ చేసే సమయంలో శాఖ పేరు, ఫైలు నంబరు, దేనికి సంబంధించిందో రిఫరెన్స్‌ను ప్రత్యేకంగా రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. ఫైళ్లు, రికార్డులు అందజేసిన సమయంలో సంబంధిత అధికారితో ముట్టినట్లుగా సంతకం ఉన్న రసీదును తీసుకుంటున్నారు. అయితే కలెక్టరేట్ పరిపాలన విభాగంలో స్కానింగ్ సెంటర్ ఉండగా, కలెక్టరేట్లోని మిగతా శాఖలకు చెందిన ఫైళ్లను స్కానింగ్ చేయించడానికి అక్షర ప్రణాళిక భవన్ వద్ద గల రెవెన్యూ గెస్ట్ హౌస్‌లో రెండు కంప్యూటర్లు, స్కానర్లు ఏర్పాటు చేయించారు. ఇవి కూడా సరిపోకపోవడంతో ఆయా శాఖల ఉద్యోగులు ఫైళ్లను స్కానింగ్ చేయించడానికి క్యూ కడుతున్నారు. ఇటు కలెక్టరేట్ పరిపాలన విభాగంలో అత్యధికంగా ఫైళ్లు ఉండడంతో సెక్షన్ల వారీగా ఫైళ్లను వేరు చేసే పనిని వేగవంతం చేశారు. ఎక్కడ చూసినా నేలపైన, టేబుళ్లపైన పెట్టిన ఫైళ్లే దర్శనమిస్తున్నాయి. డీఆర్వో పద్మాకర్, ఏగో గంగాధర్‌లతో పాటు సెక్షన్ల సూపరింటెండెంట్లు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియనే కాకుండా ఫైళ్ల విభజన, స్కానింగ్ అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎవరినీ పలుకరించినా విభజన అంశమే వారి నోటి నుంచి వస్తోంది. బిజీగా ఉన్నాం.. మళ్లీ కలుస్తామని వెళ్లిపోతున్నారు. సిబ్బంది కొరత ఉన్నా... పలు శాఖల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో పాటు అటెండర్లు కూడా విభజన పనిలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఐకేపీ, డీఆర్డీఏ, డ్వామా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంక్షేమ శాఖలతో పాటు కార్పొరేషన్లు, ఇరిగేషన్, జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీ, ఐసీడీఎస్, విద్య, వైద్య, వ్యవసాయ, దీని అనుబంధ తదితర శాఖల్లో ఉన్న సిబ్బంది మొత్తం ఫైళ్లను వేరే చేసే పనిలోనే ఉన్నారు. కలెక్టర్ ఇచ్చిన సమయం దగ్గర పడుతుండడంతో తిండి తిప్పలు మాని విభజన ప్రక్రియలో పడ్డారు. ఉద్యోగులకు సెలవులు కూడా లభించట్లేదు. అయితే ఫైళ్లన్నింటినీ తీస్తున్న తరుణంలో గతంలో దొరకని కొన్ని పాత ఫైళ్లు కూడా వెలుగు చూస్తున్నాయి. ఖాళీల జాబితా సిద్ధం.. జిల్లా పునర్విభజన నేపథ్యంలో జిల్లా, డివిజన్, మండల, శాఖల్లో పని చేసే ఇతర స్థాయి ఉద్యోగుల ఖాళీల వివరాలను అందజేయాలని ప్రభుత్వం కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే శాఖల వారీగా ఖాళీల పోస్టుల వివరాలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న నిజామాబాద్ జిల్లాలోనే చాలా శాఖలకు జిల్లా స్థాయి అధికారులు లేరు. ప్రధానంగా వీటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉండడంతో ఆయా పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలోనే చర్యలు చేపట్టనుంది. కామారెడ్డి జిల్లాకు నిజామాబాద్ జిల్లా నుంచి ఎంత మంది ఉద్యోగులను పంపించాలి, శాఖల విలీనం అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
నిరుద్యోగులకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు
ఐకేపీ, మెప్మా ఏఎండీ నందకుమార్ నిర్మల్‌టౌన్ : నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం త్వరలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఐకేపీ, మెప్మా ఏఎండీ నందకుమార్ అన్నారు. పట్టణంలోని మయూరి హోటల్లో శనివారం ఆదిలాబాద్, నిర్మల్, భైంసా మున్సిపల్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత నిరుత్సాహ పడకుండా స్వయం ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఇందులో 26 కోర్సులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఐకేపీ, మెప్మా సిబ్బంది దీనిపై నిరుద్యోగులకు అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. మొక్కలను సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, కమిషనర్లు త్రియంబకేశ్వర్‌రావు, అలివేలుమంగతాయారు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘బంగారు తల్లి’ ఎక్కడ!
ఇంతవరకూ లబ్ధిదారులకు బాండ్లు అందని వైనం ప్రభుత్వ శాఖల వద్ద అందుబాటులో లేని సమాచారం రాయవరం/అంబాజీపేట : పుట్టుక నుంచి పట్టా పుచ్చుకునే వర కూ అండగా ఉంటామం టూ ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకం దిశానిర్దేశం లేకుండా ఉంది. తెలుపు రేషన్‌కార్డు కలిగిన బడుగు, బలహీనవర్గాల కుటుంబాల్లో పుట్టిన ఆడబిడ్డకు ఆసరాగా ఉండేం దుకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు బాండ్లు అందలేదు. పథకం ప్రవేశపెట్టిన తీరు ఈ పథకాన్ని 2013 మే ఒకటిన ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పుట్టిన చిన్నారులను గుర్తించేందుకు సర్వే చేపట్టి, వివరాలను ఆన్లైన్ చేశారు. బిడ్డకు తొలిదశలో రూ.2,500 ఇవ్వాలని నిర్దేశించారు. తొలి పుట్టిన రోజు మొదలు.. డిగ్రీ పూర్తి చేసే వరకు దశలవారీగా నగదును వారి ఖాతాలో జమచేస్తారు. డిగ్రీ చేతికి రాగానే ప్రభుత్వం లక్ష రూపాయలను జమ చేస్తుంది. పథకాన్ని ఆధార్‌కు అనుసంధానం చేశారు. తొలి కాన్పులో అమ్మాయి పుట్టి, రెండో కాన్పులో ఇద్దరు అమ్మాయిలు జన్మించినా పథకాన్ని వర్తింపజేయాలి. శాఖ మార్పుతో సందిగ్ధం ఐకేపీ ద్వారా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. గతేడాది ్రఏపిల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు పథకం బాధ్యతలు అప్పగిస్తూ జీఓ జారీ అయింది. దీంతో లబ్ధిదారులు దరఖాస్తులతో రెండు శాఖల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారుల వద్ద ఎలాంటి సమాచారం లేదు. తమకు సంబంధం లేదని ఐకేపీ అధికారులు అంటుండగా, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. అందని బాండ్లు జిల్లాలో ఈ పథకానికి సంబంధించి బాండ్లు ఇప్పటివరకు అందలేదు. రాయవరం మండలంలో 2013 మే నుంచి 2015 ఏప్రిల్ వరకు 469 మంది రిజిస్ట్రేషన్ చేయించారు. 24 మంది ధ్రువీకరణ పత్రాలను ఇవ్వలేకపోయారు. దీంతో 445 మందిలో కేవలం 33 మందికి మాత్రమే బాండ్లు వచ్చాయి. పి.గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకూ మొత్తం 1,800 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. దీనిపై ఏపీఎం రవిరాజాను వివరణ కోరగా, రాయవరం మండలంలో లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయాల్సి ఉందన్నారు. త్వరలో జమ కాగలవని పేర్కొన్నారు. -
బీభత్సం
ఆదివారం అర్ధరాత్రి వర్షానికి 2వేలకు పైగా హెక్టార్లలో వరికి నష్టం ఈ నెలలోనే 4,247 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు నష్టంపై ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక రూ.6కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా, ఇతర పంటలకూ నష్టమే ఎక్కడికక్కడ తడిసి ముద్దవుతున్న ధాన్యపురాశులు తడిసిన ధాన్యంపై రైతాంగంలో ఆందోళన వ్యవసాయ మంత్రితో మాట్లాడిన సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలుకు ఆదేశాలివ్వాలని డిమాండ్ సాక్షి నెట్వర్క్ వరుసగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతను అరిగోస పెట్టిస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చిందనుకుంటున్న వేళ వరుణుడు చూపుతున్న ప్రభావంతో రైతాంగంలో తీవ్ర ఆందోళనలు నెలకుంటున్నాయి. ముఖ్యంగా రబీసీజన్‌లో వరి పంట సాగుచేసిన రైతులు మొన్నటివరకు నీళ్లు లేక ఇబ్బందులు పడగా, ఇప్పుడు పంట చేతికొస్తున్న సమయంలో కురుస్తున్న వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్క ఆదివారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షం కారణంగానే దాదాపు 2వేలకు పైగా హెక్టార్లలో వరిపంటకు నష్టంవాటిల్లింది. దీనిని వ్యవసాయ శాఖ అధికారులు కూడా ధ్రువీకరించారు. ఈ మేరకు జరిగిన నష్టంపై ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు. మొత్తంమీద ఈనెల ఆరో తేదీ నుంచి వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా 4,247 హెక్టార్లలో వరి పంట దె బ్బతిందని, రూ.6కోట్ల మేర నష్టం జరిగిందని ఈ నివేదికలో పేర్కొన్నారు. మిర్యాలగూడ మండలం తడకమళ్ల ఐకేపీ కేంద్రంలో నిలిచిన నీటిని తీసేందుకు ఆయిల్ఇంజన్ను సైతం వినియోగించాల్సి వచ్చింది. నకి రేకల్ నియోజకవర్గంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు కన్నీరుపెట్టుకున్నారు. అయితే, తడిసిన ధాన్యాన్ని నిబంధనల పేరుతో తిరస్కరించకుండా ఐకేపీ కేంద్రాల్లో మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు, రైతుసంఘాలు డిమాండ్ చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు సీఎల్పీ ఉపనేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో సోమవారం ఫోన్లో మాట్లాడి రైతుల ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రకటన చేయాలన్న ఆయన విజ్ఞప్తి పట్ల మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. వరిపంటతో పాటు జిల్లాలో మామిడి, నిమ్మ, కూరగాయల పంటలు కూడా దె బ్బతినడం గమనార్హం. అకాలవర్షం మిగిల్చిన నష్టం నియోజకవర్గాల వారీగా.. భువనగిరి: ఆకాల వర్షాలతో భువనగిరి నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. భువనగిరి పట్టణం, మండలం, పోచంపల్లి, వలిగొండ మండలాల్లో 11,12,13 తేదీల్లో కురిసిన వర్షాలతో వరిపంట నెలవాలింది. భువనగిరిలో 9, బీబీనగర్‌లో 13,పోచంపల్లిలో 16 గ్రామాల్లో కోతకు వచ్చిన పంట వర్షానికి దెబ్బతిందని అధికారులు తేల్చారు. ఆదివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి 1300 హెక్టార్లలో వరిపంటకు నష్టం వాటిల్లింది. పొలాల్లో ధాన్యం రంగుమారింది. మునుగోడు: అకాల వ ర్షానికి వరి చేలకు, మామిడి తోటలకు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నష్టం వాటిల్లింది. చౌటుప్పల్ మండలంలో 200 ఎకరాల్లో వరిపంటకు పాక్షికంగా నష్టం వాటిల్లింది. మల్కాపురంలో ఓ ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. మల్కాపురం, పంతంగి, ఎస్.లింగోటం గ్రామాల్లో దాదాపు 50ఎకరాల్లో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. మునుగోడు మండలంలో 200ఎకరాల్లో వరిచేలు నేలకొరిగాయి. మర్రిగూడ మండలంలో 20ఎకరాల్లో మామిడితోటల్లో కాయలు నేలరాలాయి. వరిచేను నేలకొరిగింది. చండూరు మండలం పుల్లెంల, అంగడిపేట గ్రామాల్లో 15ఎకరాల మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. మిర్యాలగూడ: మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఐకేపీ కేంద్రాలలోని ధాన్యం తడిసి మద్దయింది. సాధారణ వర్షం కురిసినప్పటికీ ఈదులు గాలుల వల్ల ధాన్యంరాశులపై రైతులు కప్పుకున్న పట్టాలు లేచిపోయి ధాన్యం తడిసింది. మిర్యాలగూడ మండలంలోని తడకమళ్ల ఐకేపీ కేంద్రంలో వర్షం నీళ్లు భారీగా నిలవడంతో ధాన్యం కుప్పలు నీటిలో తేలాయి. ఐకేపీ కేం ద్రంలో నిలిచిన నీటిని తొలగించడానికి రైతు లు ఆయిల్ ఇంజన్ ఉపయోగించారు. తడకమళ్ల, తక్కెళ్లపాడు, గోగువారిగూడెం ఐకేపీ కేం ద్రాలలో సుమారుగా 10 వేల బస్తాల ధాన్యం తడిసింది. వేములపల్లి మండలంలోని ఆగామోత్కూర్, రావులపెంట, శెట్టిపాలెం గ్రామాలలోని ఐకేపీ కేంద్రాలలో వర్షం నీళ్లు నిలిచి సుమారు నాలుగు వేల బస్తాల ధాన్యం తడిసింది. రావులపెంట గ్రామంలో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రాస్తారోకో చేశారు. తుంగతుర్తి: తుంగతుర్తి నియోజకవర్గంలో సో మవారం తెల్లవారు జాము నుంచి కురిసిన వర్షానికి పెద్దగా పంట నష్టం వాటిల్లలేదు. సుమారు 1200 ఎకరాల్లో చేతికి వచ్చిన వరి పొలాలు నేలకొరిగాయి. మోత్కూరు, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాలల్లో సుమారు 150 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బ తిన్నా యి. తిరుమలగిరి మండలం మాలిపురంలో ఆరు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మోత్కూర్ మండలంలోని ఐకేపీ కేంద్రాల్లో 500 బస్తాల ధాన్యం తడిసిపోయింది. నకిరేకల్: రెండవ రోజు కురిసిన అకాల వర్షంతో రైతుల ధాన్యం మళ్లీ తడిసి ముద్దయింది. నియోజకవర్గంలోని నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి, రామన్నపేట మండలాలలో ఐకేపీ కేంద్రాలలో ధాన్యం తడిసిపోయింది. నకిరేకల్ వ్యవ సాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశుల కిందికి వర్షపు నీరు చేరి కొంత కొట్టుకుపోయింది. రామన్నపేట మండలంలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు రామన్నపేట వ్యవసాయమార్కెట్తోపాటు కక్కిరేణి, మునిపంపుల, లక్ష్మాపురం, శోభనాద్రిపురం గ్రామాల్లోని కొనుగోలుకేంద్రాలలో పోసిన ధాన్యపురాశులు తడిసిపోయాయి. రామన్నపేట మార్కెట్లో సిందం మల్లయ్య అనేరైతుకు చెందిన 30బస్తాలధాన్యం వరదకు కొట్టుకుపోవడంతో ఆయన భార్య పద్మ కంటతడిపెట్టడం కనిపించింది. సూర్యాపేట: సూర్యాపేట నియోజకవర్గంలో సోమవారం తెల్లవారుజాము నుంచి కురిసిన అకాల వర్షానికి పెద్దగా ఎక్కడా పంట నష్టం వాటిల్లలేదు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తీసుకొచ్చిన ధాన్యం కొద్ది మొత్తంలో తడిసిపోయింది. అకాల వర్షం కురవడంతో రైతులు మార్కెట్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సూర్యాపేట, పెన్‌పహాడ్, చివ్వెంల, ఆత్మకూర్.ఎస్ మండలాల్లో బోరుబావుల కింద సాగుచేసిన వరి పొలాలు కొన్నిచోట్ల నేలకొరిగిన ఘటనలు కన్పించాయి. కందగట్ల ఐకేపీ కేంద్రంలో ధాన్యం రాశుల మధ్య నీళ్లు నిలిచి ధాన్యం తడిసిముద్దయింది. నల్లగొండ: నియోజకవర్గంలో కురిసిన వర్షానికి నల్లగొండ మండలం, తిప్పర్తి, కనగల్ మండలాల్లో ప లు చోట్ల చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి. ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డ్‌ల్లో నిల్వ ఉ ంచిన ధాన్యం తడిసిపోయింది. నల్లగొండ మండలంలో 15 వందల ఎకరాల్లో వరి చేలు నేలకొరిగాయి. 62 ఎకరాల్లో మామిడికాయలు రాలిపోయాయి. ఎకరానికి పదిహేను కిలోల చొప్పున కాయలు రాలినట్లు రైతులు చె బుతున్నారు. ముషంపల్లి, జీకే అన్నారం ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. తిప్పర్తి మార్కెట్ యార్డ్‌లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపో యింది. కాగా తిప్పర్తి, కనగల్ మండలా ల్లో పలు చోట్ల ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం పాక్షికంగానే తడిసిపోయింది. ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక నల్లగొండ అగ్రికల్చర్: జిల్లాలో 6వ తేదీ నుంచి ఆదివారం వరకు కురిసిన అకాల వర్షం కారణంగా 4,247 హెక్టార్లలో వరిపంటలు దెబ్బతిని సుమారు రూ.6.5 కోట్ల మేర పంట నష్టం జరిగిందని జిల్లా యంత్రాంగం ప్రాథమిక అంచనాలు వేసింది. ముఖ్యంగా భువనగిరి, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట, నారాయణపురం, నకిరేకల్, కేతెపల్లి, కట్టంగూరు, శాలిగౌరారం మండలాలో వర్షం కారణంగా వరిపొలాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అంచనాలు వేసింది. అదే విధంగా జిల్లాలో మామిడి తోటలకు కూడా నష్టం జరిగినప్పటికీ కాయలు, పిందెలు రాలిపోతే రైతులకు నష్టపరిహారం అందించే నిబంధనలు లేకపోవడం వల్ల నష్టం జరిగిన మామిడి తోటల నివేదికను రూపొందించలేదని ఉద్యానవన శాఖ అధికారి ఒకరు తెలిపారు. చెట్లు ధ్వంసమైతేనే పరిహారం అందించే నిబంధనలు ఉన్నాయని తెలిపారు. కానీ ఇటీవలన కురిసిన గాలులతో కూడిన వర్షాల కారణంగా వందల ఎకరాలలో మామిడి తోటలకు నష్టం జరిగింది. -
అమ్మో బొమ్మ..!
పార్వతీపురం:ఐటీడీఏ పరిధిలో గల ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆరోగ్య పౌష్టికాహార కేంద్రాల కోసం కొనుగోలు చేసిన బొమ్మలకు సంబంధించిన ఫైల్స్ వెదుకు లాటలో అధికారులకు చెమటలు పడుతున్నట్లు సమాచారం. మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘వినండి బొమ్మల గోల...కనండి ఐకేపీ లీల’ అంటూ ప్రచురితమైన కథనం పట్ల స్థానిక ఐకేపీ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతూ బొమ్మల కొనుగోలు ఫైల్ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిసింది. రూ.36లక్షలకు సంబంధించి బొమ్మల కొనుగోలులో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది మధ్య పంపకాల ఒప్పందాలు కుదరక పోవడంతో, అందులో ఓ అధికారి బొమ్మల కొనుగోలులో ఆరోపణలను జత చేస్తూ...గత పీఓ ద్వారా సెర్ఫ్‌కు లెటర్ రాయించినట్లు సమాచారం. ఆ లెటర్‌కు స్పందించిన సెర్ఫ్ నుంచి పూర్తి డాక్యుమెంట్లు సమర్పించాలని గత ఏడాది జనవరి 27వ తేదీన ఆదేశాలు వచ్చాయి. అయితే పంపకాల ఒప్పందం కుదుర్చుకున్న అధికారులు, సెర్ఫ్ నుంచి వచ్చిన లెటర్‌ను ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకెళ్లలేదని సమాచారం. జనవరి నుంచి ఇప్పటి వరకు కనీసం సెర్ఫ్ ఆదేశాల పట్ల స్పందించకపోగా, అప్పటి పీఓ రజత్ కుమార్ సైనీ, ప్రస్తుత శ్రీకేశ్ బి లఠ్కర్ల దృష్టికి తీసుకెళ్లకపోవడమే అధికారుల అవినీతి ఆరోపణలకు ఊతమిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన పీఓ శ్రీకేశ్ బి లఠ్కర్‌ను ఈ బొమ్మల కొనుగోలు విషయమై ఒప్పించేందుకు అధికారులు నానా తంటా లు పడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఐకేపీలో జరుగుతున్న పలు రకాల అవినీతికి గత కొన్ని సంవత్సరాలుగా ఆ శాఖలో ఫైనాన్స్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కేంద్ర బిందువనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పీఓ శ్రీకేశ్ బి లఠ్కర్ దీనిపై దృష్టి సారిస్తారని గిరిజనులు, గిరిజన సంఘ నాయకులు ఆశిస్తున్నారు. ‘విదుర నీతులు’ పుస్తకావిష్కరణ విజయనగరం మున్సిపాలిటీ : రామాయణ, మహాభారతాలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలు అని ప్రముఖ అధ్యాత్మిక వేత్త, విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన శివబాబా అన్నారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన భారతదేశంలో జన్మించడమే పూర్వజన్మ సుకృత మన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని, పెద్దల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సాగి సీతారామరాజు స్మారక కళాపీఠం ప్రచురిం చిన విదుర నీతులు పుస్తకాన్ని ఆవిష్కరించా రు. కళాపీఠం అధ్యక్షుడు రాజు, తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు గురుప్రసాద్, శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు. -
అతివకు అభయం
మహిళల ప్రగతి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అతివల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఆపద్భాంధవుడిలా చేయూతనందిస్తోంది. ఆడవాళ్ల కోసం ఐకేపీ ఆధ్వర్యంలో అనేక పథకాలు అమలు చేస్తూ అతివకు అభయమిస్తోంది. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు వర్తించే పథకాల ప్రయోజనాలు.. వాటి దరఖాస్తు విధానంపై సాక్షి కథనం. * ఐకేపీ ఆధ్వర్యంలో అనేక పథకాలు * లబ్ధి పొందితేనే ఆర్థిక ప్రగతి జిల్లాలో మొత్తం 29,919 స్వయం సహాయ సంఘాలు ఉన్నాయి. ఇందులో 2,99,190 మంది సభ్యులుగా ఉన్నారు. ఐకేపీ అర్బన్‌లోని 7 మున్సిపాలిటీలో 7,019 స్వయం సహాయక సంఘాలు ఉండగా ఇందులో 70,190 మంది, ఐకేపీ రూరల్ పరిధిలో 22,919 సంఘాలు ఉండగా ఇందులో 2,29,000 మంది సభ్యులు ఉన్నారు. వీరికి వర్తించే పథకాలు ఇలా ఉన్నాయి. బంగారుతల్లి పథకం నానాటికి తగ్గిపోతున్న ఆడపిల్లల శాతం పెరగాలనే ఉద్దేశంతో 2013 జూలై 2 నుంచి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం బంగారుతల్లి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రస్తుతం అమలులోనే ఉంది. 2013 మే 1 తర్వాత పుట్టిన ఆడబిడ్డలకు ఇది వర్తిస్తుంది. ఇద్దరు ఆడపిల్లల వరకే లబ్ధి చేకూరుతుంది. రెండో కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా అర్హులే. తల్లి బిడ్డ ఫొటో, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్‌కార్డు, యూఐడీ, తల్లి, తండ్రి రేషన్‌కార్డు పత్రాలతో సంబంధిత మండల సమాఖ్య కార్యాయాల్లోని ఏపీఎంకు దరఖాస్తు చేసుకోవాలి. ధ్రువీకరణ పత్రాలన్ని వాస్తమని నిర్ధారించిన తర్వాత వెబ్సైట్లో వివరాల్ని నమోదు చేస్తారు. తర్వాత బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఆపన్నహస్తం వికలాంగ మహిళలకు కూడా ఐకేపీ చేయూతనిస్తుంది. కాళ్లు చేతులు చచ్చుబడి ఎటూ కదల్లేని నిర్జీవ స్థితిలో ఉన్నవారికి మూడు చక్రాల సైకిళ్లు, దృష్టి వినికిడి లోపాలు ఉన్నవారికి వైకల్యానికి సంబంధించిన యంత్రాలు అందజేస్తారు. వైకల్యానికి అవసరమైన శస్త్ర చికిత్సలు నిర్వహించి ఇతరులతో పోటీపడేలా చూస్తున్నారు. వికలాంగులకు క్రీడలు నిర్వహించటం, వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపడుతున్నారు. వికలాంగులతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయించి వారికి తక్కువ వడ్డీతో రుణ సదుపాయం క ల్పిస్తున్నారు. స్త్రీ నిధి..కొండంత అండ స్త్రీ నిధి పథకం అవసరాలకు పెన్నిధి లాంటిది. స్వయం సహాయ సంఘాల్లోని మహిళలకు కొండంత అండగా నిలుస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ నిధి ద్వారా తక్షణ సహాయం పొందవచ్చు. బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా సంఘం పని చేసే కార్యాలయం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్యం, వివాహం, పిల్లల చదువులు తదితర అవసరాలకు రూ. 20 వేల వరకు రుణం అందజేస్తారు. సంఘంలో ఎంతమంది సభ్యులున్నా ఆరుగురు సభ్యులకు మాత్రమే రుణం అందుతుంది. ఈ రుణానికి పావలా వడ్డీ వర్తిస్తుంది. బీమాతో పేదలకు ధీమా ఐకేపీ ద్వారా నిరుపేదలు అధికంగా లబ్ధిపొందే పథకాల్లో బీమా పథకం ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు వేలకు వేలు కిస్తులు చెల్లించి ప్రత్యేకంగా బీమా చేయించుకోలేని పరిస్థితి. ఐకేపీలోని అభయహస్తం, ఆమ్ఆద్మీ యోజన, జనశ్రీబీమా పథకాలు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తున్నాయి. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ఈ పథకం కిందరూ.75 వేల వరకు బీమా చెల్లిస్తున్నారు. ఇందుకు రూ.15 నుంచి రూ..100 వరకు ప్రీమియం చెల్లిస్తే వారు బీమాకు అర్హులవుతారు. సహజ మరణం అయినా, ప్రమాదంలో మృతి చెందినా ఈ బీమా వర్తిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏపీఎంల ద్వారా సంఘ అధ్యక్షుల ద్వారా ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అభయహస్తం స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన వారు అభయహస్తంతో సభ్యత్వం ఉన్నవారు 60 ఏళ్లు నిండితే నెలకు రూ.500 చొప్పున పింఛన్ పొందవచ్చు. ఏటా ఒక్కో సభ్యురాలు వాటా ధనంగా రూ. 365 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం మరో రూ. 365 చెల్లిస్తుంది. ఇలా పదేళ్ల పాటు వాటాధనం చెల్లిస్తే సభ్యురాలికి 60 ఏళ్లు దాటాకా నెలకు రూ. 500 చొప్పున గరిష్టంగా రూ. 2,200 వరకు పింఛన్ పొందవచ్చు. వరుసగా రెండేళ్లపాటు వాటాధనం చెల్లించకుంటే సభ్యత్వం రద్దవుతుంది. సభ్యురాలు మరణిస్తే సహజ మరణానికి రూ.35వేలు, ప్రమాద మరణానికి రూ.75 వేలు, పాక్షిక ప్రమాదమైతే రూ.37,500 చొప్పున అందిస్తారు. సభ్యురాలు మృతి చెందితే దహన సంస్కారాల కింద రూ. 5 వేలు తక్షణ ఆర్థిక సహాయంగా అందజేస్తారు. ఉపకార వేతనాలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండి బీమా ప్రీమియం చెల్లించిన సభ్యుల పిల్లలు చదువుతుంటే వారికి ఉపకార వేతనాల్ని అందజేస్తారు. తొమ్మిది, పది తరగతులతోపాటు ఇంటర్, ఐటీఐ చదువుకునే పిల్లలకు ఏడాదికి రూ.1200 చొప్పున ఉపకార వేతనాన్ని అందిస్తారు. ఒక్కో సభ్యురాలి ఇంట్లో ఇద్దరు పిల్లలకు మాత్రమే ఉపకార వేతనం ఇస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివినా చాలు ఈ ఉపకార వేతనం అందుతుంది. వీటికోసం పిల్లలు చదువుతున్నట్లుగా పాఠశాల, కళాశాలలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో మండల, అర్బన్ ఏపీఎం ద్వారా ఐకేపీ కార్యాలయం లేదా జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయాల్లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. యువతుల కోసం.. నిరుద్యోగ యువతులు స్వయం సమృద్ధి సాధించేందుకు వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఎంప్లాయిమెంట్ జనరేషన్ మార్కెటింగ మిషన్ (ఈజీఎంఎం) పేరిట యువతకు కంప్యూటర్ సంబంధిత రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం పదో తరగతి ఉత్తీర్ణులైన యవ తులు జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో లేదా సంబంధిత మండల ఏపీఎంలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత భోజనం, వసతితో కూడిన శిక్షణ ఇస్తారు. యువతీ యువకులు ఆర్థికంగా స్థిరపడేందుకు ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. వ్యవసాయంలోనూ.. రసాయనిక ఎరువుల వాడకంతో పెట్టుబడులు పెరిగి దిగుబడులు ఆశించిన మేరకు రాకపోవడం, గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యకు పాల్పడుతున్న నేపథ్యంలో వాటిని తగ్గించే దిశగా ప్రోత్సహిస్తుంది. సేంద్రియ పద్ధతులపై మహిళా రైతులకు శిక్షణ, కూరగాయలు, ఇతరత్రా పంటల సాగుకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తారు. ఇందుకోసం ప్రతీ గ్రామానికి వీవోఏలను నియమించారు. వీరు సేంద్రియ ఎరువుల వాడకాన్ని తెలియజేయడంతో పాటు వాటి తయారీ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. -
ఉద్రిక్తం.. అరెస్టుల పర్వం
శ్రీకాకుళం పాతబస్టాండ్: అక్రమ అరెస్టులపై వెల్లువెత్తిన నిరసన.. అయినా వెనక్కు తగ్గని పోలీసులు.. ర్యాలీలు, ధర్నాలతో పోలీస్స్టేషన్ల వద్ద నిరసన గళం వినిపించేందుకు వచ్చిన మహిళా ఉద్యోగులను చెదరగొట్టేందుకు ఖాకీ బలం ప్రదర్శించడంతో తోపులాటలు, వాగ్వాదాలు వంటి ఘటనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా ఉద్యోగులను విచక్షణారహితంగా ఈడ్చుకెళ్లిన తీరు పోలీసుల దమనకాండకు, ప్రభుత్వం నియంతృత్వ ధోరణికి మరోమారు దర్పణం పట్టింది. జీతాల కోసం గత రెండు నెలలుగా సమ్మె చేస్తున్న ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ) వీవోఏలు హైదరాబాద్‌లో తలపెట్టిన నిరసన కార్యక్రమాలను భగ్నం చేసేందుకు ఆదివారం అరెస్టుల పర్వానికి ప్రభుత్వం తెరతీసిన విషయం తెలిసిందే. అక్రమ అరెస్టులకు నిరసనగా సోమవారం జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల వద్ద వీవోఏలు, సీఐటీయు, ఇతర ప్రజాసంఘాలు ధర్నాలు చేపట్టాయి. ఈ సందర్భంగా కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. ఒక్క శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోనే 27 మందిని అరెస్టు చేశారు. ఆదివారంనాటి అరెస్టులను నిరసిస్తూ జిల్లావ్యాప్త కార్యక్రమంలో భాగంగా వీవోఏలతోపాటు సీఐటీయూ దాని అనుబంధ సంస్థల ప్రతినిధులు ర్యాలీగా వచ్చి రెండో పోలీసుస్టేషన్ వద్ద బైఠాయించారు. అనంతరం ధర్నా నిర్వహించారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి ధర్నాను భగ్నం చేశారు. సీఐటీయూ నాయకులు కె.నాగమణి, డి.గణేష్, వై.చలపతిరావులతో సహా 27 మందిని అరెస్టు చేశారు. ఈ అరెస్టులను ఆందోళనకారులు ప్రతిఘటించడంతో ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగింది. దాంతో పోలీసులు పలువురిని బలవంతంగా ఈడ్చుకుపోయారు. ఈ తోపులాటలో సీఐటీయూ పట్టణ కార్యదర్శి గణేష్ కుడిచేయికి గాయమైంది. ఇది అరాచకపాలన ధర్నా వద్ద పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం లేదని, ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. పోలీసులు టీడీపీ పాలకులకు తొత్తులుగా మారిపోయారని విమర్శించారు. ఐకేపీ సీఎఫ్‌లు తమ జీతాల కోసం శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే అరెస్టులు చేసి, స్టేషన్లలో నిర్బంధించడమే కాకుండా బెదిరింపులతో భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. వీవోఏలు 100 రోజులుగా సమ్మె చేస్తుంటే సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా పోలీసులతో బలప్రయోగం ద్వారా ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తూ ప్రజల నుంచి, మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. గతంలో ఇదే రీతిలో వ్యవహరించడం వల్లే ప్రజలు చంద్రబాబును పదేళ్లు అధికారానికి దూరంగా ఉంచిన విషయాన్ని విస్మరిస్తే.. మళ్లీ అదే గతి పడుతుందని స్పష్టం చేశారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు ఎన్వీ రమణ, పి.ప్రభావతి, సూరమ్మ, చిన్నమ్మ, కాలేమ్మ, నర్సమ్మ, లత, సత్యనారాయణ, కాన్‌కాస్ట్ యూనియన్ నాయకులు పి.రామచంద్రరావు, బి.మోహనరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఐకేపీ వీవోఏల జీతాలు చెల్లించడంతో ప్రభుత్వ అలక్ష్యం, పోలీసుల అక్రమ అరెస్టులకు నిరసనగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. గోవిందరావును ఆదివారం ఉదయం ఐదుగంటలకు అరెస్టు చేసి తెల్లవారేదాకా ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. సోమవారం ఉదయం రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్టు టుటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడే ఆయన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లోని వీవోఏల ధర్నాను భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్ని అక్రమ అరెస్టులు చేరుుంచిందని ధ్వజమెత్తారు. ఇది ప్రజావ్యతిరేకమని పేర్కొన్నారు. వీవోఏల వ్యవస్థను తనే ప్రవేశపెట్టినట్టు చెప్పుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు వ్యవస్థను నాశనం చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని హెచ్చరించారు. ప్రజలు మద్దతుతో ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. జిల్లాలో అరెస్టు చేసిన వీవోఏలు, సీఐటీయూ నాయకులు, ప్రతినిధులందరినీ విడిచిపెట్టిన తర్వాత ఆయన దీక్షను విరమించారు. -
ఐకేపీ యానిమేటర్ల అరెస్టు
-
ఐకేపీ ఛలో హైదరాబాద్ కార్యక్రమం భగ్నం
అనంతపురం: ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) ఉద్యోగుల ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో ఐకేపీ యానిమేటర్లను పోలీసులు ముందుగా అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా కృష్ణా జిల్లా నుంచి సోమవారం తలపెట్టిన ఐకేపీ ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో భాగంగా ముందుగా సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఐకేపీ వర్కర్లను ముందస్తుగా అరెస్ట్ చేశారు. -
లెవీ పేచీ
లెవీ రూపంలో బియ్యూన్ని సేకరించే కార్యక్రమం ముందుకు సాగడం లేదు. మిల్లర్లు సేకరించే ధాన్యాన్ని ఆడించగా వచ్చే బియ్యంలో 75 శాతాన్ని లెవీగా తీసుకోడానికి బదులు.. 25 శాతం బియ్యూ న్ని మాత్రమే తీసుకునేందుకు ఎఫ్‌సీఐ నిర్ణయిం చింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలనూ జారీ చేసింది. రాష్ట్రంలో 20 లక్షల టన్నుల బియ్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ధారించుకుంది. జిల్లానుంచి సుమారు 6 లక్షల టన్నుల బియ్యం లెవీగా సేకరించాల్సి ఉంది. అయితే, లెవీ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన విధానం ఏమిటనేది ఇంకా ప్రకటించలేదు. దీంతో ఏం చేయూలో తెలియక మిల్లర్లు సందిగ్ధంలో ఉన్నారు. కస్టమ్ మిల్లింగ్ (ప్రభుత్వమే ధాన్యాన్ని సేకరించి మజూరీకి బియ్యంగా ఆడించడం) ప్రాతిపదికన ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ) సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయించాలని నిర్ణయించింది. అయితే, ఇందుకు సంబంధించి విధాన ప్రకటన మాత్రం చేయలేదు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన మిల్లర్లు పాత లెవీ విధానాన్ని అమలు చేయకపోతే వచ్చే సమస్యలు ఏమిటనేది వివరించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామని కేంద్ర మంత్రి ఆ సందర్భంలో పేర్కొన్నారు. అయినా ఈ వ్యవహారం కొలిక్కి రాలేదు. మాసూళ్లు మొదలైనా... మెట్టలో ఇప్పటికే వరి కోతలు పూర్తయ్యూరుు. డెల్టాలోనూ ముమ్మరంగా సాగుతున్నాయి. ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్పటికీ మిల్లులకు తీసుకెళ్లినంత వేగంగా రైతులు ఆ కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకెళ్లడం లేదు. అక్కడి నిబంధనలు రైతులకు ప్రతిబంధకాలుగా మారాయంటున్నారు. తేమ శాతం, సొమ్ము చెల్లింపు వంటి విషయాల్లో ఇబ్బందులు ఉండటంతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపు పెద్దగా మొగ్గు చూపడం లేదు. బ్యాంకులతో ఆర్థిక లావాదేవీలున్న మిల్లర్లు తప్ప ఇతర మిల్లర్లు ధాన్యాన్ని భారీగా కొనుగోలు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లెవీ విధానం ప్రకటించకపోవడంతో భవిష్యత్ కార్యాచరణ కోసం ఇటీవల రాజమండ్రిలో ఉభయగోదావరి జిల్లాల రైస్‌మిల్లర్లు సమావేశమయ్యారు. పాత లెవీ విధానం అమలు చేయించేలా చూడాలని.. ఇందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని.. ఇందుకోసం ముఖ్యమంత్రిని కలవాలని ఆ సమావేశంలో తీర్మానించారు. లేదంటే లక్ష్యాలు, తేమ శాతాలతో సంబం ధం లేకుండా మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యం ఆడిం చగా వచ్చిన మొత్తం బియ్యూన్ని కొనుగోలు చేయించాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు. మరోపక్క విదేశాల్లో స్వర్ణ బియ్యానికి డిమాండ్ లేకపోవడం.. తమిళనాడుకు ఎగుమతులు సన్నగిల్లడంతో కొత్త ధాన్యానికి పెద్దగా ధర పలకడం లేదు. -
ఫ్రెండ్లీ పోలీస్ : ధర్నాకి వచ్చిన వారికిలా..!
-
రైతన్నకు శుభవార్త..
ఆన్లైన్ ద్వారా కొనుగోలు డబ్బుల చెల్లింపు - అక్టోబర్ నుంచి అమలు - పెరిగిన ధాన్యం మద్దతు ధర రాయికల్ : జిల్లా రైతులకు శుభవార్త. అన్నదాతలు తాము పండించిన పంట ఐకేపీ, సహకార సంఘాల్లో అమ్మిన తర్వాత డబ్బులకోసం 15 నుంచి నెల వరకు వేచిచూసేవారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు నేరుగా డబ్బులు ఆన్లైన్ ద్వారా తమ ఖాతాలో జమయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ఆన్లైన్ ద్వారా చెల్లింపుకు అక్టోబర్‌లో శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబర్ నుంచి జిల్లాలో 301 ఐకేపీ కొనుగోలు సెంటర్లు, 320 సహకార సంఘాల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సెంటర్లలో అమ్మిన రైతులకు కేవలం 48 గంటల్లోనే తమ అకౌంట్లోకి డబ్బులు జమయ్యేలా చర్యలు చేపడుతున్నారు. గతంలో ఐకేపీ, సహకార కొనుగోలు సెంటర్లో అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు రాకపోవడం, బ్యాంకుల్లో గంటల తరబడి నిలబడటం, బ్యాంకులో సిబ్బంది సరిగా లేకపోతే ఆ డబ్బుల కోసం రోజుల తరబడి వేచిచూడడం వంటి సంఘటనలు జరిగాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు మొదటిసారిగా ఆన్లైన్ పేమెంట్‌ను ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా రైతులు తమ బ్యాంక్ అకౌంట్, ఆధార్‌కార్డులను సంబంధిత మండల ఐకేపీ కార్యాలయంలో సమర్పించాలని, తద్వారా కంప్యూటరీకరణ చేసి ఆన్లైన్ అకౌంటింగ్ ద్వారా త్వరితగతిన రైతులకు తమ అకౌంట్లలో డబ్బులు పడే అవకాశం ఉంది. పెరిగిన వరి మద్దతు ధర అక్టోబర్ నుంచి ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు, సహకార కొనుగోలు కేంద్రాల ఆధ్వర్యంలో వరికొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. గతంలో ఏ గ్రేడ్ వరికి రూ.1345 ఉండగా.. ప్రస్తుతం రూ.1400లకు కామన్ గ్రేడ్ రూ.1310 ఉండగా.. రూ.1360కి పెంచిందని ఐకేపీ అధికారులు తెలిపారు. -
జోరువానలో ఆగ్రహ జ్వాల
- టీడీపీ నేతల తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన - వాళ్ల మనుషులను పెట్టుకోవడానికి మమ్మల్ని తొలగిస్తున్నారు - తెలుగుదేశానికి ఓటేయలేదనే వేధిస్తున్నారు - అంగన్వాడీ, మధ్యాహ్న భోజన, ఆశ,ఐకేపీ వర్కర్ల నిరసన - కలెక్టరేట్ దిగ్బంధం - వర్షంలోనూ కొనసాగిన ధర్నా, రాస్తారోకో - మహిళలు, పోలీసుల మధ్య తోపులాట, స్వల్ప ఉద్రిక్తత విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. మహిళలమని చూడకుండా టీడీపీ నేతలు తమను నానా దుర్భాషలాడుతూ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నారని అంగన్వాడీ, ఆశ, ఐకేపీ, మధ్యాహ్న భోజన వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వారిని పెట్టుకునేందుకు కారణాల్లేకుండా, తమ పట్ల నీచంగా ప్రవరిస్తూ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం కదం తొక్కారు. రెండు గేట్లనూ మూసేసి మహా ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‌ను దిగ్బంధిం చి ఉద్యోగులు, సందర్శకుల రాకపోకలను అడ్డుకున్నారు. జోరున వర్షం పడుతున్నా లెక్క చేయకుండా రాస్తారోకో చేశారు. శుక్రవారం ఉదయం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అంగన్వాడీ, ఐకేపీ, మధ్యాహ్న భోజన, ఆశ వర్కర్లు కలెక్టరేట్‌కు చేరుకుని తమకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకులు సుధారాణి, తమ్మినేని సూర్యనారాయణల ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నా మధ్యాహ్నం మూడు గంటల వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా సుధారాణి తదితరులు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చాక జిల్లాలో మహిళా ఉద్యోగులపై కారణాల్లేకుండా వేటు వేస్తున్నారన్నారు. ఓటు వేయలేదనే అక్కసుతోనే ఇదం తా చేస్తున్నారని ఆరోపించారు. తమవారిని నియమిం చుకునేందుకు కక్ష సాధింపులకు దిగుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 30 మంది మధ్యాహ్న భోజన వర్కర్లను జిల్లా వ్యాప్తంగా తొల గించారన్నారు. ఆశ వర్కర్లకు ప్రభుత్వం పెంచిన రూ.300 మొత్తాన్ని వేతనాలకు కలపకుండా వదిలేశారన్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా నిర్వహించినపుడు అందరినీ వినియోగించుకోవడమే తప్ప ఎటువంటి ప్రయోజనాలనూ కల్పించడం లేదన్నారు. ఐకేపీలో 15 నెలలుగా వీబీకేలకు (విలేజ్ బుక్ కీపర్లు) వేతనాలు ఇవ్వడం లేదన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ మహిళలే చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ వారికి వ్వాల్సిన వేతనాలు, గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. మహిళల పట్ల నీచంగా ప్రవర్తిసూ, విధుల నుంచి అన్యాయంగా తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించిన మధ్యాహ్న భోజన వర్కర్లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఓ వైపు వర్షం.. మరో వైపు ఆందోళన ఓ వైపు జోరుగా వర్షం పడుతున్నా మహిళా ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు. తడుస్తూనే ధర్నా కొనసాగించారు. మరోవైపు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఆ ప్రాంతమంతా ఆందోళనకారుల నినాదాలతో దద్దరిల్లింది. కలెక్టరేట్ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. మహిళల జుత్తు పట్టుకుని, మెడపై చేతులేసి.... ఆందోళనకారులంతా కలెక్టర్‌ను కలవాలని ప్రయత్నించారు. వర్షం పడుతుండడంతో తమ డిమాండ్లు నెరవేర్చేందుకు గడువు విధించి విరమించాలని, వినతిపత్రాన్ని కలెక్టర్, జేసీ తదితరులకు ఇవ్వాలని మహిళలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వారంతా ఒక్కసారిగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కొంతమంది పోలీసులు మహిళల జుత్తు పట్టుకుని లాగేశారు. మరికొంతమంది మెడపై చేతులేసి నెట్టేశారు. ఈ సమయంలో మహిళలు పెద్దపెట్టున కేకలు వేశారు. బిగ్గరగా నినాదాలు చేశారు. రాజకీయ కక్షలు ఆపాలంటూ నినాదాలు చేస్తూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కలెక్టరేట్ దిగ్బంధం మధ్యాహ్నం 3 గంటల వరకూ కొనసాగింది. అనంతరం జాయింట్ కలెక్టర్ బి.రామారావు, డీఆర్వో బి.హేమసుందర్‌లకు ఆందోళనకారులు వినతిపత్రం అందించారు. తొలగించిన మధ్యాహ్న భోజన నిర్వాహకులను 15 రోజుల్లో తిరిగి చేర్చుకోవాలని, ఆశ, వీబీకేలకు వేతనాలు ఇవ్వాలనీ ఈ సందర్భంగా గడువు విధించారు. లేకుంటే 16వ రోజున తిరిగి కలెక్టరేట్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. సీఐటీయూ నాయకులు తమ్మినేని సూర్యనారాయణతో పాటు ఉమామహేశ్వరి, సుధారాణి, విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి, ఆర్ జయప్రద, అంగన్వాడీ, ఐకేపీ, ఆశ, మధ్యాహ్న భోజన నిర్వహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
కొనుగోళ్లు... సవాళ్లు
- ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో సమస్యలు అనేకం - మౌలిక వసతులలేమితో సతమతం - సంఘాల మీద భారం మోపేందుకు చర్యలు నీలగిరి: ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ఎదురయ్యే సమస్యలు పెనుసవాళ్లనే విసురుతున్నాయి. ప్రభుత్వం మిల్లర్ల లెవీ శాతం తగ్గించడంతో ఆ భారం మొత్తాన్ని కూడా ఇందిరా క్రాంతి పథం, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు మోయాల్సి వస్తోంది. ఈ సీజన్ నుంచే ఉత్పత్తి అయ్యే మొత్తం ధాన్యంలో అధిక భాగం ఐకేపీ, పీఏసీఎస్‌లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే అందుకు తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలకు అన్ని వైపుల నుంచి తోడ్పాటు లభిస్తే తప్ప ధాన్యం కొనుగోలు చేసేందుకు సంఘాలు ముందుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రెండేళ్ల నుంచి సివిల్ సప్లై, ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోళ్లు బంద్ చేయడంతో ఆ భారం మొత్తాన్ని కూడా ఐకేపీ, పీఏసీఎస్‌లు భరించాల్సి వస్తోంది. కష్టనష్టాల కోర్చి ధాన్యం కొనుగోలు చేస్తున్న సంఘాలకు మాత్రం కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సీజన్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు రెట్టింపు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. కాబట్టి ఖరీఫ్ ధాన్యం మార్కెట్లోకి రాకముందే కనీస మౌలిక వసతులు సమకూర్చాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కమీషన్లో కోత విధించే యత్నం... ధాన్యం కొనుగోళ్లకు అసరమయ్యే గన్నీ బ్యాగులను జిల్లా పౌరసరఫరాలసంస్థ సరఫరా చేస్తుంది. టార్పాలిన్లు, తేమ యంత్రాలు, పోకర్లు, చిన్న త్రాసులు వంటివన్నీ కూడా మహిళా సంఘాలే కొంటున్నాయి. ధాన్యం కమీషన్ నుంచి కొంత మొత్తాన్ని మౌలిక వసతులకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇవిగాక గన్నీ బ్యాగుల విషయంలో పౌరసరఫరాల సంస్థ లేనిపోని పేచీలు పెట్టి కమీషన్ల్లోంచి కోత పెడుతోంది. ధాన్యం తరలించే వాహనాలకు వెయిటింగ్ చార్జీలు, డ్రైవర్లకు బోజనాలు తదితర ఖర్చులన్నీ కూడా మహిళా సంఘాలు భరిస్తున్నాయి. ఇదిగాక మిల్లర్లు ఇచ్చే ట్రక్‌షీట్లలో ధాన్యం తేడా ఉందన్న కారణంతో మరింత కోత విధిస్తున్నారు. ఈ ఖర్చులన్నీ మినహాయిస్తే సంఘాలకు వచ్చే కమీషన్ నామమాత్రం. సంఘాలకు తప్పని భారం.. ఈ సీజన్లో ధాన్యం కొనుగోలుకు అవసరమయ్యే సామగ్రి అంతా కూడా సంఘాలు కమీషన్ నుంచే కొనుగోలు చేయాలని జిల్లా అధికారులు మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారు. కానీ రైస్‌మిల్లుల లెవీ శాతం తగ్గింది కాబట్టి ధాన్యం కొనుగోలు చేయాల్సిన పూర్తి బాధ్యత సంఘాల మీద పడింది. కావున మౌలిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలనేది సంఘాల వాదన. ఈ సీజన్లో ఐకేపీ 80 కేంద్రాలు, పీఏసీఎస్‌లు 43 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. అందుకోసం ధాన్యం ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, తేమ యంత్రాలు, పోకర్లు, ఇతర అవసరాలను తెలియజేస్తూ ఓ నివేదిక రూపొందించారు. కొనుగోళ్లు ప్రారంభంకాక ముందే వీటిన్నింటిని సమకూరిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదు. లేకుంటే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. -
ధాన్యం సేకరణ ఇక సమష్టి బాధ్యత
ఏలూరు : నూతన లెవీ విధానం అమలుకు యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోం ది. ధాన్యం సేకరణ విషయంలో అధికారులు, మిల్లర్లు, ఐకేపీ సభ్యులు సమష్టి బాధ్యత వహించాలని కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన జిల్లా సమన్వయక కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా పౌర సరఫరాలు, రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులు, మిల్లర్లు, ఇందిరా క్రాంతిపథం (ఐకేపీ) సభ్యులను ఉద్దేశించి కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోగా సొమ్ము చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. రైతులు ఎలాంటి ఇబ్బం దులు పడకుండా పటిష్ట ప్రణాళిక అమ లు చేయూలని, ధాన్యం సేకరణ విధానంపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఇందిరా క్రాంతిపథం సభ్యులు, పౌర సరఫరాలు, మార్కెటింగ్, రెవెన్యూ శాఖల అధికారులు ఏఏ గ్రామాల్లో ఎంతమంది రైతులు ఉన్నారు, గ్రామాలవారీగా ఎంత ధాన్యం దిగుబడి వస్తుంది, ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే అంశాలపై సమగ్ర సమాచారాన్ని ముందుగానే సిద్ధం చేయూలన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు అధికారుల బృందం ధాన్యం సేకరణ, రైతులకు సకాలంలో చెల్లింపుల తీరును పరిశీలించేందుకు పౌర సరఫరాలు, డీఆర్డీఏ, రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారుల బృందాన్ని ఛత్తీస్‌గఢ్ పంపిస్తామని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. జిల్లాలో 2.50 లక్షల హెక్టార్లల్లో ఖరీఫ్ సాగవుతోందని, సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఐకేపీ సెంటర్లతోపాటు సహకార సంఘాల ద్వారా కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. గోనె సంచుల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ ప్రభుత్వం రైస్‌మిల్లర్లకు కేటాయించిన మేరకు లెవీ సేకరణ చేపడతామన్నారు. పౌర సరఫరాల సంస్థ, రైస్‌మిల్లర్ల సమన్వయంతో జిల్లాలో ధాన్యం కొనుగోలుకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఎఫ్‌సీఐ ఏరియా మేనేజర్ కేవీఆర్ రాజు, డీఎస్వో డి.శివశంకరరెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ సుబ్బారావు, వ్యవసాయ శాఖ జేడీ వి.సత్యనారాయణ, డీఆర్డీఏ పీడీ పులి శ్రీరాములు పాల్గొన్నారు. -
‘ఐకేపీ’కి టోకరా
►తక్కువ ధాన్యం తెచ్చి ఎక్కువ నమోదు చేసుకున్న బినామీలు ► హమాలీల రిజిస్టర్‌తో వెల్లడైన అక్రమాలు ►రూ.14 లక్షలకు పైగా జేబులోకి.. ► కమీషన్‌కు ఎసరు ► డబ్బులు తిరిగి ఇవ్వమంటే దబాయిస్తున్న దళారులు మహదేవపూర్ : ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం మహదేవపూర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, బొమ్మాపూర్, సూరారం, అన్నారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. కేంద్రాల నిర్వహణ బాధ్యలను ఆయా గ్రామాల్లోని మహిళా సంఘాలకు అప్పగించింది. సూరారం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు 284 మంది రైతుల నుంచి 20,887.60 క్వింటాళ్ల ధాన్యం కొన్నారు. ఇందులో కేవలం సూరారం గ్రామానికి చెందిన నలుగురు రైతులే 11,900 క్వింటాళ్లు విక్రయించారు. వీరితోపాటు రైతులందరికీ కలిపి రూ.2,80,09,248 చెల్లించారు. తక్కువ విక్రయించి.. ఎక్కువ చూపించి.. సూరారం గ్రామానికి చెందిన రైతు నల్లమాసు నగేశ్ 6,414.80 క్వింటాళ్లు, నల్లమాసు సదాశివుడు 2,393.60 క్వింటాళ్లు, నల్లమాసు నాగేందర్ 618 క్వింటాళ్లు, పొడేటి లక్ష్మారెడ్డి 2,473,60 క్వింటాళ్లు విక్రయించినట్లు మహిళా సంఘాలను నమ్మించారు. ఐకేపీ నుంచి రూ.1,60,07,048 తీసుకున్నారు. నిజానికి నగేశ్ విక్రయించింది కేవలం 6158.72 క్వింటాళ్లు. కానీ ఇతడు 256.08 క్వింటాళ్లు అదనంగా చూపి మహిళా సంఘాలను తప్పుదోవ పట్టించాడు. అలాగే నల్లమాసు సదాశివుడు విక్రయించింది 2352.08 క్వింటాళ్లయినా.. 40.80 క్వింటాళ్లు అదనంగా చూపాడు. పొడేటి లక్ష్మారెడ్డి విక్రయించింది 1786 క్వింటాళ్లయినా.. 686.80 క్వింటాళ్లు అదనంగా చూపాడు. హమాలీ రిజిస్టర్ల పరిశీలనతో వెలుగులోకి.. సూరారం ఐకేపీ కేంద్రానికి డీఆర్డీఏ నుంచి రైతులకు చెల్లించేందుకు మొత్తం రూ.3,10, 87,911 మంజూరయ్యాయి. ఇందులో రైతులకు చెల్లించిన రూ.2,80,09,248, హమాలీలకు రూ.2,29,757 పోను తమ వద్ద ఇంకా రూ.13,70,060 మాత్రమే నిల్వ ఉన్నాయని పేర్కొంటూ మహిళా సంఘాలు డీఆర్డీఏకు పంపించారు. మిల్లులకు చేర్చిన ధాన్యం.. చెల్లించిన మొత్తాన్ని పరిశీలించిన అధికారులు.. మహిళా సంఘాల వద్దే ఇంకా రూ.14,78,846 ఉన్నాయనుకుని కమీషన్ పంపలేదు. ఈ విషయం తెలియని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తమకు కమీషన్ (సుమారు రూ.ఆరు లక్షలు క్వింటాల్‌కు రూ.34 ప్రభుత్వం కమీషన్ ఇస్తుంది) ఇవ్వాలంటూ బుధవారం ఐకేపీ కార్యాలయానికి చేరుకున్నారు. రికార్డులు పరిశీలించిన అధికారులు.. మహిళా సంఘం నుంచే రూ.14,78,846 రావాల్సి ఉందని చెప్పడంతో అవాక్కయ్యారు. కొనుగోలు రిజిస్టర్‌తోపాటు హమాలీల రిజిస్టర్‌ను పరిశీలించగా తేడా కనిపించింది. ముగ్గురు దళారులు కలిసి ఏకంగా 983.68 క్వింటాళ్లు అదనంగా చూపి రూ.14లక్షలకు పైగా తమ జేబుల్లో నింపుకున్నారు. ఈ విషయమై సదరు రైతులు (దళారులను) అడిగితే తాము విక్రయించిన ధాన్యానికే డబ్బులు చెల్లించారంటూ దబాయిస్తున్నారని మహిళలు పేర్కొంటున్నారు. విషయాన్ని మహిళలు ఏపీఓ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన పీడీకి నివేదిస్తానని తెలిపారు. రైతులు (దళారులు) డబ్బులు చెల్లించకుంటే పోలీసులను ఆశ్రయించేందుకు మహిళా సంఘాల సభ్యులు సిద్ధమవుతున్నారు. -
ఏసీబీ వలలో సర్వేయర్లు
ఎడపల్లి: అవినీతి నిరోధక శాఖ అధికారులు(ఏసీబీ) పంజా విసురుతూనే ఉన్నా.. లంచావతారులు మారడం లేదు. జిల్లాలో ఏసీబీ దాడుల్లో చిక్కుతున్న ప్రభుత్వ సిబ్బంది జాబితా పెరుగుతూనే ఉంది. ఉన్నతాధికారులు మొదలు చిరు ఉద్యోగి దాకా అవినీతి అధికారుల వలలో పడుతున్నారు. చిన్న పనులకు సైతం రేట్లు కడుతూ.. ప్రభుత్వ వ్యవస్థపైనే అసహ్యం కలిగిస్తున్నారు. ఎడపల్లి మండలంలో మంగళవారం తొలిసారి ఏసీబీ దాడులు చేపట్టింది. మండలానికి చెందిన ఇద్దరు ఐకేపీ, రెవెన్యూశాఖల సర్వేయర్లు రూ. ఐదువేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన మండలంలో సంచలనం రేకెత్తించింది. మండలంలోని జంలం గ్రామానికి చెందిన రైతు ఎం.ఎస్ అబ్ధుల్లా సర్వేనంబర్ 79/1 లో గల ఒక ఎకరం ఎనిమిది గుంటల తన వ్యవసాయ భూమిని సర్వే చేయమని చెప్పి.. 2013లో ఐకేపీ, రెవెన్యూ సర్వేయర్లు మోహన్, సంజీవ్రాథోడ్లకు విన్నవించారు. ఇందుకు వారు భూమి సర్వే కోసం చలాన్ కట్టమన్నారు. దాని ప్రకారం అబ్ధుల్లా చలాన్ కట్టారు. అయినా దాదాపు పదినెలలుగా ఆయనను రేపుమాపు అంటూ తమ చుట్టూ తిప్పుకున్నారు. చివరకు వారి అంతరంగాన్ని పసిగట్టిన అబ్దుల్లా ఏమైనా డబ్బులు కావాలంటే ఇస్తానని చెప్పడంతో.. ఆశపడ్డ సర్వేయర్లు రూ. పదివేలు ఇస్తే భూమిని సర్వే చేస్తామని తేల్చిచెప్పారు. ఇందుకు అంగీకరించిన అబ్దుల్లా డబ్బులు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. మంగళవారం రూ. ఐదువేలు ఇస్తానని, భూమి సర్వే చేసిన అనంతరం మిగిలిన రూ. ఐదువేలు ఇస్తానన్నారు. అనంతరం ఆయన ఏసీబీ అధికారులను సంప్రదించారు. జరిగిన విషయాన్ని వారికి వివరించారు. అనంతరం ఏసీబీ అధికారులు అబ్దుల్లాకు కొన్ని సూచనలు ఇచ్చి పకడ్బందీ పథకంతో ముందుకు సాగారు. దీని ప్రకారం అబ్దుల్లా మంగళవారం జాన్కంపేట్ రెవెన్యూ అధికారి కార్యాలయంలో సర్వేయర్ మోహన్‌కు రూ. మూడువేలు, అసిస్టెంట్ సంజీవ్ రాథోడ్‌కు రూ. రెండువేలు అందించారు. డబ్బులు వారి చేతికి అందిన వెంటనే ఏసీబీ డీఎస్పీ సంజీవరావు తన సిబ్బందితో దాడి చేసి సర్వేయర్లను పట్టుకున్నారు. అబ్ధుల్లా నుంచి వారు ఐదువేలు లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో వారిద్దరిని అరెస్టు చేసి, హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలించారు. అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు ప్రభుత్వ అధికారులు ఎవరైనా ప్రజల నుంచి లంచాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ డీఎస్పీ సంజీవరావు హెచ్చరించారు. లంచం తీసుకోవడంతో పాటు ఇవ్వడం కూడా నేరమేనని ఆయన స్పష్టంచేశారు. ఏ అధికారి లంచం అడిగినా ఏసీబీని సంప్రదించాలన్నారు. సెల్‌నంబర్ 94404 46155కు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు. -
కేంద్ర ప్రభుత్వ పథకాలపై సర్వే
భోగాపురం : కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయూ లేదా అన్న అంశంపై కేంద్ర మానిటరింగ్ కమిటీ (జాతీయ పర్యవేక్షణ కమిటీ సభ్యులు) సభ్యులు శనివారం ముంజేరు గ్రామంలో సర్వే నిర్వహించారు. గ్రామానికి సమీపంలో ఉన్న ఉపాధి పనులను పరిశీలించి, వేతనదారులకు రో జుకు ఎంత వేతనం వస్తున్నది అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పూర్తిస్థాయిలో పనులు కల్పిస్తున్నారా లేదా అన్న విషయూన్ని కూడా ఆరా తీశా రు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్యం, ఐఎస్ఎల్ మరుగుదొడ్లు వినియోగంపై పరిశీలించి, పంచాయతీ కార్యాల యంలో హౌసింగ్, ఉపాధి, ఐకేపీ అధికారులతో సమావేశమయ్యారు. గ్రామంలో వృద్ధాప్య, వికలాంగ, విం తంతు పింఛన్లు అందుకుంటున్న వారితో మాట్లాడారు. వారు ఎన్ని ఏళ్ల నుంచి పింఛన్లు అందుకుంటున్నారో అడిగి రికార్డులు పరిశీలించారు. అయితే చాలామంది వారికి ఇస్తున్న రూ. 200 పింఛన్ చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కమిటీ సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ... జిల్లాలో అన్ని మండలాల్లో నాలుగు పంచాయతీల చొప్పున పరిశీలన చేస్తున్నామన్నారు. భోగాపురం మండలంలో ద ల్లిపేట, కవులవా డ, లింగాలవలసతో పాటు ముంజేరులో నాలుగు రోజు లుగా సర్వే నిర్వహించినట్టు తెలిపారు.మండలంలో ప్ర జలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, వారికి అదనంగా అందించాల్సిన సంక్షేమ పథకాలు వంటి వాటిపై నివేదిక అందజేయనున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమం లో అడిషనల్ ప్రాజెక్టు అధికారి ఎస్. అప్పలనాయుడు, డీఆర్డీఏ ఏపీడీ వి.డి.ఆర్ ప్రసాద్, భోగాపురం క్లస్టర్ ఏపీడీ సత్యనారాయణ, డిప్యూటీ ఎస్ఓ కె.వి రామారా వు, ఇన్చార్జి ఎంఈఓ ఎన్.సుజాత, ఉపాధి ఏపీఓ కనకరాజు, తదితరులు పాల్గొన్నారు. -
మిగులు ధాన్యం దళారుల పాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ధాన్యం రైతులకు కనీస మద్దతు ధర చెల్లించేం దుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు నేటితో మూతపడనున్నాయి. ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు ఆదివారం వరకే పని చేయనున్నాయి. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈసారి ధా న్యం కొనుగోళ్లను ఎన్నికల కారణంగా కొంత ఆలస్యం గా గత నెల 2న ప్రారంభించారు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య నెల రోజుల వ్యవధిలోనే కొనుగోలు ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పటివరకు అధికారులు నిర్దేశించిన లక్ష్యం చేరుకోవడంతో ఇక తలకు మించిన భారం వద్ద ని చేతులెత్తేశారు. దీనికితోడు నైరుతి రుతుపవనాలు ప్ర వేశించడంతో వర్షాల గుబులుతో కొనుగోళ్ల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 617 కేంద్రాల ద్వారా 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 599 కేంద్రాల ద్వారా 5,49,348 టన్నుల ధాన్యాన్ని సేకరించడంతో కొనుగోళ్లపై చేతులెత్తేశారు. ఇందులో 301 ఐకేపీ సంఘాల ద్వారా 3,19,226 టన్నులు, 297 పీఏసీఎస్ కేంద్రాల ద్వారా 2,48,389 టన్నులు, రెండు జీసీల ద్వారా 2,81.440 టన్నుల ధాన్యం సేకరించారు. మొ త్తంగా సేకరించిన ధాన్యంలో 5,49,348 టన్నుల ధా న్యం రైస్‌మిల్లర్లకు రవాణా చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.763.69 కోట్లలో ఇప్పటివరకు రూ.694 కోట్ల రైతులకు విడుదల చేసినట్లు డీఎస్వో చంద్రప్రకాష్ వెల్లడించారు. ఆదివారం ఉదయం లోగా మరో 25 వేల టన్నుల ధాన్యం సేకరించే అవకాశముంది. ఆరు బయట లక్ష క్వింటాళ్లు అధికారుల ప్రణాళిక లోపం, పర్యవేక్షణ లేకపోవడం వ ల్ల ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో నత్తనడకన కొనసాగింది. ఈ క్రమంలో నెల రోజుల వ్యవధిలో ఆరుసా ర్లు వర్షం కురవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రైతుకు మరింత సమయం పట్టింది. ధాన్యం కొనుగోళ్ల నుంచి మిల్లులకు తరలించే వరకు రైతుకే బాధ్యత అప్పజెప్పడంతో రైతులు వారం నుంచి ఇరవై రోజుల వరకు పడిగాపులు కాయాల్సి వచ్చింది. తూకం వేసిన ధాన్యం తరలింపులో జాప్యం, మిల్లర్లు సహకరించకపోవడం, గన్నీ సంచులు, హమాలీలు, లారీల కొరత వెరసి కొనుగోళ్ల లో జాప్యం జరిగింది. దీంతో జిల్లావ్యాప్తంగా మరో లక్ష క్వింటాళ్ల ధాన్యం విక్రాయనికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అరవై వేల క్వింటాళ్లు కల్లాల్లో, మరో నలభై వేల క్వింటాళ్లు కేంద్రాల్లో నిల్వ ఉన్నట్లు సమాచారం. కేంద్రా ల్లో పోసి ఉంచిన కుప్పలను కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఇప్పటికే కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో సుమారు ఇరవై రోజులుగా కుప్ప ల వద్ద కాపలా కాస్తున్న రైతులు అధికారుల నిర్ణయం తో ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల్లో ఉన్న ధాన్యా న్ని తిరిగి మార్కెట్ యార్డులకు తరలించడం అదనపు భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్తగా వచ్చిన ధాన్యాన్ని అనుమతించడం లేదు. కొనుగోలు నిలిపివేస్తున్న క్రమంలో ఇకనుంచి మార్కెట్ యార్డుల్లో ధాన్యం విక్రయించుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. ఇదే అదునుగా యార్డుల్లో దళారులు చెప్పి న ధరకే విక్రయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. మరికొంత కాలం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
ఐకేపీ ఏపీఎం తొలగింపు
సీతంపేట, న్యూస్‌లైన్: నిధుల దుర్వినియోగం ఆరోపణలు రుజువు కావడంతో ఇందిర క్రాంతి పథం(ఐకేపీ) ఏపీఎంను ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐటీడీ ఏ పరిధిలో మందస మండల ఏపీఎంగా పని చేస్తున్న తురక పార్వతిని విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో బి.రాజశేఖర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కొత్తూరు మండలం దిమిలిలో పనిచేసిన పార్వతి అక్కడ సుమారు రూ.2 లక్షల మేరకు ఆరోగ్య పోషకాహర నిధులు దుర్వినియోగం చేసినట్టు విచారణలో తేలడంతో ఆమెపై వేటు వేశారు. ఈ విషయాన్ని సీతంపేట టీపీఎంయూ విభాగం ఇన్చార్జి ఏరియా కోఆర్డినేటర్ జమాన శ్రీనివాసరావు ధ్రువీకరించారు. దిమిలిలో పని చేస్తున్నప్పుడు పార్వతి అక్కడి మండల మహిళా సమాఖ్యకు చెందిన రూ.2.50 లక్షల వర కు ఆరోగ్య పోషకాహార నిధులు స్వాహాకు పా ల్పడినట్లు ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై అప్పటి ఐటీడీఏ పీవో సునీల్‌రాజ్‌కుమార్ విచారణకు ఆదేశిస్తూ, ఆమెను సస్పెండ్ చేశా రు. విచారణ అనంతరం సస్పెన్షన్‌ను ఎత్తివేశా రు. అప్పట్లోనే ఆమెను కొత్తూరు నుంచి మందసకు, మందసలో పనిచేస్తున్న జగదీష్‌ను కొత్తూరుకు బదిలీ చేశారు. అనంతరం స్వాహా చేసిన నిధుల్లో సు మారు రూ.50 వేల వరకు ఎం ఎంఎస్‌కు జమచేసిన పార్వతి, మిగతా రూ.2 లక్షల నిధులు మాత్రం కట్టలేదు. కాగా నిబంధనల ప్రకారం ఏపీఎంలపై చర్యలు తీసుకునే అధికారం సెర్ప్ సీఈవోకు మాత్రమే ఉంది. అయితే ఐటీడీఏ పీవో నేరుగా జోక్యం చేసుకోవడంతో ఏమీ చే యలేక సెర్ప్ అధికారులు మిన్నకుండిపోయా రు. కొద్ది రోజుల తర్వాత సెర్ప్ అధికారులే రం గంలోకి దిగి విచారణ చేయించి, నిధు లు స్వా హా నిజమేనని తేలడంతో పార్వతిని విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ఆమెకు ఉత్తర్వులు పంపించినట్టు ఇన్చార్జి ఏసీ తెలిపారు. -
డబ్బులు రాలె..
నల్లగొండ, న్యూస్‌లైన్ :ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి కేంద్రాలకు ధాన్యం అమ్మిన రైతుల పరిస్థితి దైన్యంగా మారింది. ఓ వైపు ఖరీఫ్ కాలం ముంచుకొస్తున్నా, రబీధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులు చెల్లించకపోవడంతో రైతాంగంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మద్దతు ధర కల్పించాలనే సదు ద్దేశంతో అనేకచోట్ల ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వ ర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది. వీటిద్వా రా ఈ సీజన్లో లక్ష్యానికిమించి వరిధాన్యం కొనుగోలు చేసి రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచారు. కొనుగోలు చేసిన కేంద్రాలకు సకాలంలో డబ్బులు చెల్లించడం లేదు. ఈ విషయంలో పౌరసరఫరాల శాఖను సమన్వయం చేయడంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పీఏసీఎస్‌లు వైఫ్యలం చెందినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రైతు సహనానికి పరీక్ష పెడుతున్నాయి. జిల్లాలో ఈ సీజన్లో ఇప్పటివరకు ఐకేపీ, పీఏసీఎస్, సివిల్ సప్లయీస్ కలిసి మొత్తం 3 లక్షల 44 వేల 782 టన్నులు ధాన్యం కొనుగోలు చేసింది. వాటి విలువ సుమారు రూ.463 కోట్లు ఉంటుంది. దీంట్లో రైతులకు రూ.354 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.109 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉంది. ధాన్య కొనుగోలు చేసి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ మొత్తాన్ని విడుదల చేయడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. పెట్టుబడుల కోసం రైతుల అగచాట్లు... రబీ ధాన్యం అమ్మకంతో వచ్చే మొత్తాలతోనే రైతులు తమ అవసరా లు తీర్చుకోవడంతో పాటు, ఖరీఫ్ సీజన్‌కు కావాల్సిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తారు. ఈ మొత్తాల కోసం ఐకేపీ కేంద్రాల చుట్టూ రైతులు నిత్యం ప్రదక్షిణలు చేస్తుండగా, నిర్వాహకులు సైతం చెల్లింపులు ఎప్పుడు చేస్తారన్న అంశాన్ని చెప్పలేకపోతున్నారు. చెల్లింపులకు మరింత సమయం... ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం నిల్వలను ఎప్పటికప్పుడు తరలించి, మిల్లర్ల ద్వారా మిల్లింగ్ చేయించి, ఎఫ్‌సీఐకి లెవీ ద్వారా ఈ మొత్తాలు త్వరితగతిన చెల్లించేలా చూడాల్సిన బాధ్యత పౌరసరఫరాల సంస్థది. కానీ ఈ శాఖ చోద్యం చూస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఐకేపీ కేంద్రాల్లో ఇంకా 30వేల టన్నుల ధాన్యం నిల్వలుండగా, వాటిని సకాలంలో మిల్లులకు తరలించని కారణంగా ఐకేపీ కేంద్రాల్లోనే మొలకెత్తుతున్నాయి. మహిళా సంఘాలనుంచి ధాన్యం తీసుకున్న మిల్లర్లు ట్రక్షీట్లు వెంటనే ఇవ్వకపోవడం వల్ల డబ్బులు సకాలంలో విడుదల చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. ట్రక్షీట్లు ఇవ్వకుండా సంఘాలకు ముందుగా డబ్బులు చెల్లిస్తే ఆ తర్వాత లేనిపోని సమస్యలు వచ్చిపడతాయని.. ఆ కారణంగానే ధాన్యం డబ్బులు విడుదల చేయడం లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో రైతుల డబ్బులు పూర్తిగా చెల్లిస్తామని వారు అంటున్నారు. ఇదిలాఉంటే కేంద్రాలకు వచ్చే ధాన్యం తగ్గుముఖం పడుతుండడంతో కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నారు. ఇప్పటికే పీఏసీఎస్ కేంద్రాలు మూతపడగా...ఐకేపీ 130 కేంద్రాలను మూసివేశారు. -
3.20లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 3 లక్షల 20 వేల 176 మెట్రిక్ టన్నుల ధా న్యం కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ తెలిపారు. సోమవారం తన చాంబర్లో పౌర సరఫరాల అధికారులు, మిల్లర్ల సంఘం ప్రతినిధులు, ఐకేపీ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 3 లక్షల 5 వేల 69 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామని ఇంకా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లో నిల్వ ఉందన్నారు. ఈ ధాన్యాన్ని తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పాక్షికంగా తడిసిందని, ఈ తడిసిన ధాన్యాన్ని మానవతా దృక్పథంతో మిల్లుల యజమానులు అన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరారు. అందుకు మిల్లర్ల సంఘం ప్రతినిధులు అంగీకరించారు. ఈ సమావేశంలో డీఎస్ఓ నాగేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ సుధాకర్, పౌర సరఫరాల శాఖ డీఎం, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ఐకేపీ సిబ్బందికి బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్..
దశలవారీగా ఉద్యోగాల రెగ్యులరైజ్ మేనిఫెస్టోలో స్పష్టం చేసిన అధినేత మహానేత హామీకి జగనన్న భరోసా వెట్టిచాకిరీ చేయించిన గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాం కదా అని ఐకేపీ ఉద్యోగులతో గత పాలకు లు వెట్టిచాకిరీ చేయించుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఇదే నిర్వాకాన్ని కొనసాగించాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ సభలకు మహిళలను సమీకరించి తరలించడమే పనిగా ఐకేపీ ఉద్యోగులను వాడుకున్నాయి. ఇపుడు పనిభారంతో, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రతకు నోచుకోని ఐకేపీ ఉద్యోగులకు తాము అండగా ఉంటామంటూ వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మోర్తాడ ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ఆంశాన్ని వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ప్రస్తావించడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఐకేపీ ఉద్యోగుల విష యం స్పష్టంగా ఉంది. తమ డిమాండ్లను పరిష్కరించడానికి ఏ పార్టీ హామీ ఇస్తుందో, ఆ పార్టీకి తాము మద్దతు ఇస్తామంటూ ఐకేపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రకటించడం విశేషం. ఎన్నో కుటుంబాలకు మేలు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అమలైతే జిల్లాలో ఎన్నో కుటుంబాలు బాగుపడనున్నాయి. జిల్లాలో ఐకేపీలో మానవ వనరుల పరిధిలో బీపీఎం, ఏపీఎం, సీపీ ఎం, ఇతర ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు 306 మంది ఉన్నారు. పట్టణ, మండల కేంద్రాలలోని కార్యాలయాలలో అకౌంట్స్, కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారు 72 మంది ఉన్నారు. క్షేత్రస్థాయిలో వీఓఏలుగా 900 మంది పనిచేస్తున్నారు. వీరి ఉద్యోగాలను దశలవారీగా రెగ్యులరైజ్ చేస్తామని జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చా రు. అంతేకాకుండా కొత్తగా ప్రవేశపెట్టనున్న ‘అమ్మఒడి’ పథకాన్ని ఐకేపీ ద్వారానే అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దీనిద్వారా ఐకేపీ కార్యాలయాలు శాశ్వ తంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడింది. ‘వెలుగు’ నుంచి ఐకేపీగా 2001లో అధికారంలో ఉన్న టీడీపీ ‘వెలుగు’ పేరుతో మండలానికి ఒక కార్యాలయాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాలన్నింటిని ఏకం చేసింది. మహిళలకు రుణాలు ఇవ్వడం, పొదుపు చర్యలను చేపట్టారు. అయితే, టీడీపీ ప్రభుత్వం ‘వెలుగు’ పరిధిలోని మహిళలకు రుణాల పేరుతో అరచేతిలో వైకుంఠాన్ని చూపింది. రుణాలు ఇప్పించి వారిని తమ రాజకీయ సభలకు జేజేలు పలికేందుకు వినియోగించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన దివంగత సీఎం వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ‘వెలుగు’ సంస్థను ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)గా మార్చారు. మహిళలు ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వారికి పావలా వడ్డీకి రుణాలను ఇప్పించారు. ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ఆంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన మరణంతో ఐకేపీ ఉద్యోగుల ఆశలు నెరవేరలేదు. రాజశేఖర్‌రెడ్డి తర్వాత సీఎం లుగా పనిచేసిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఐకేపీ ఉద్యోగులను తమ సభలకు మహిళలను సమీకరించేవారిగానే పరిగణించారు. అనేక మార్లు ఐకేపీ ఉద్యోగులు ఆం దోళనలు చేసినా వారి సమస్యలను పెడచెవిన పెట్టారు. వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో రూపొందించకముందే పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఐకేపీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వేణుగోపాల్‌రెడ్డి, గురురాజ్ కలిశారు. తమ సమస్యలను ఆయనకు వివరించారు. స్పందించిన ఆయన ఐకేపీ ఉద్యోగులకు పూర్తి భరోసా ఇస్తూ మేనిఫెస్టో లో రెగ్యులరైజ్ ఆంశాన్ని చేర్చారు. వైఎస్ఆర్సీపీ ఒక్కటే తమ బాధను అర్థం చేసుకుని మేనిఫెస్టోలో పెట్టిందని ఐకేపీ ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
మహిళా సంఘాల సమావేశ వేళలపై ఆంక్షలు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో మహిళా స్వయంశక్తి సంఘాల సమావేశాలు, చర్చలు, సమీక్షలను సాయంత్రం నాలుగున్నర గంటల తర్వాత నిర్విహించరాదని, టీటీడీసీల్లో సాయంత్రం 5 గంటల తర్వాత పురుష ఉద్యోగులు ఉండరాదని రాష్ట్ర పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్) సీఈవో డాక్టర్ బి.రాజశేఖర్ ఆదేశించారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జెండర్ విభాగం అధికారిణి జమున మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ‘నిర్భయ’ పేరిట ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ప్రతి సంఘ సభ్యురాలు నెలకు ఒక రూపాయి చొప్పున విరాళం అందజేస్తే నెలకు కోటి రూపాయలు సమకూరతాయని చెప్పారు. ఈ నిధిని మహిళల భద్రత కోసం వినియోగిస్తామని, ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ తనూజారాణి తదితరులు పాల్గొన్నారు. సెర్ప్‌కి ఎన్నికల కోడ్ వర్తించదా? ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో డీఆర్డీఏ అధికారులతో సెర్ప్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల విధులకు సంబంధించిన అంశాలపై తప్ప శాఖల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఎలాంటి సమావేశాలు నిర్వహించేందుకు అవకాశం లేదు. అయితే దీనిని సెర్ప్, ఐకేపీ, డీఆర్డీఏ అధికారులు పట్టించుకోవటం లేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక.. స్త్రీనిధి రుణాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే బీమా ప్లస్, అభయ హస్తం ప్లస్ అనే కొత్త పథకాలను అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. -
కదంతొక్కిన ‘మధ్యాహ్న’ కార్మికులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మధ్యాహ్న భోజన కార్మికులను తొలగిం చాలని ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) పీడీ ఇచ్చి న ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూ నియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ.. ఐదేళ్లకు పైబడి పనిచేస్తున్న కార్మికులను తొలగించాలని ఐకేపీ పీడీ ఉత్తర్వులు జారీ చేశారని, డిసెంబర్‌లోగా కొత్త వారిని నియమించాలని పేర్కొన్నారని తె లిపారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా జిల్లాలో ఉత్తర్వులు ప్రవేశపెట్టి 12 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించడం సమంజసం కాదన్నారు. జిల్లాలో 6,750 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని, వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన వారిని వెంటనే పనిలోకి తీసుకోవాలని, కోడిగుడ్లకు, అరటిపండ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలన్నారు. ప్రతినెలా మొదటి వారంలోపే బిల్లులు అందేలా చూడాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, వంటషెడ్లు, మంచినీరు, గంజులు, గ్యాస్‌పొయ్యి అందించాలని డిమాం డ్ చేశారు. వంట సరుకులను ప్రభుత్వమే సరఫ రా చేయాలని, ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టర్ అహ్మద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మోనవ్వ, జిల్లా అధ్యక్షురాలు భారతీబాయి, ఉపాధ్యక్షురాలు రూప, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ముంజం శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు. పలువురి మద్దతు.. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న మధ్యాహ్న భో జన కార్మికులకు పలువురు నాయకులు మ ద్ద తు తెలిపారు. టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షు డు లోకా భూమారెడ్డి, టీడీపీ నాయకులు యూ నిస్ అక్బానీ, మున్సిపల్ మాజీ చైర్మన్ యాసం నర్సింగ్‌రావు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు నారాయణ, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘బంగారుతల్లి’పై నిర్లక్ష్యం వీడాలి
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : బంగారు తల్లి పథకం అమలులో ఐకేపీ సిబ్బంది నిర్లక్ష్యం వీడాలని, లేనిపక్షంలో బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. మంచిర్యాల, చెన్నూరు క్లస్టర్ పరిధిలోని మండలాలకు చెందిన ఐకేపీ ఏపీఎంలు, సీసీలతో శనివారం మంచిర్యాల ఏరియా కో ఆర్డినేటర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ బంగారుతల్లి పథకం అమలై ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పుట్టిన ఆడపిల్లల వివరాలు సగం కూడా నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లల వివరాలు, లబ్ధిదారుల బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డులు సేకరించడం లేదన్నారు. వీరి వైఖరితో లబ్ధిదారులు నష్టపోయే ప్రమాదముందని చెప్పారు. ఇకపై నిర్లక్ష్యం వీడి ఆడపిల్లల వివరాల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయూలని ఆదేశించారు. బ్యాంకు ఖాతా తెరవడంలో ఇబ్బందులుంటే అన్ని వివరాలు ఆదిలాబాద్‌కు పంపిస్తే ఒక్కరోజులో ఖాతా తీరుుస్తామని చెప్పారు. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, అభయహస్తం పథకాల అమలుపై పర్యవేక్షణ కొరవడిందన్నారు. చెన్నూరులో స్త్రీనిధి పథకం కింద మహిళా సమాఖ్య సభ్యురాలి పేరుతో వేరొకరు రూ.4 లక్షలు రుణం తీసుకుని కేవలం రూ.లక్ష మాత్రమే చెల్లించారని, ఈ నెలాఖరులోగా మిగిలిన డబ్బు బ్యాంకులో జమ చేయూలని ఆదేశించారు. లేనిపక్షంలో ఏపీఎం, సీసీలపై చర్యలు తీసుకుంటామన్నారు. పథకాలు మహిళా సమాఖ్యలకు చేరువయ్యేలా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని పేర్కొన్నారు. డీఆర్డీఏ డీపీఎం ఎస్. వేణుగోపాల్, ఏపీఎం జాబ్స్ భూపతి బ్రహ్మయ్య, ఏరియా కో ఆర్డినేటర్లు చంద్రకళ, రాజుబాయ్, ఏపీఎం రాంచందర్ పాల్గొన్నారు. -
ఐకేపీ ఉద్యోగుల సంక్షేమానికి కృషి
నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్ : ఇందిర క్రాంతి పథం (ఐకేపీ) ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. ఆదివారం స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో ఐకేపీ ఉద్యోగుల భవిష్యత్‌పై సీమాంధ్ర జిల్లాల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే ఐకేపీ ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండాలని, సమస్యలను పరిష్కరించుకునేందుకు ఐదుగురు సభ్యులతో అడ్‌హక్ కమిటీని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పర్యటించే కేంద్ర బృందానికి తమ సమస్యలను వివరిస్తామన్నారు. రాష్ట్ర గవర్నర్ రెండు రోజుల్లో ఢిల్లీ వెళుతున్నారని, ఆయన్ని కలిసి ఐకేపీ ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం అందజేస్తామన్నారు. ఐకేపీ ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అధిక శాతం ఐకేపీ ఉద్యోగుల ద్వారా ప్రజల దరి చేరుతున్నాయన్నారు. ఉద్యోగుల సమస్యలను అనేక పర్యాయాలు ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిషత్ కార్యాచరణ ప్రణాళికపై వారం రోజుల్లోగా తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే నెల 3న విజయవాడలో సీమాంధ్ర ఐకేపీ ఉద్యోగుల సభ భారీ స్థాయిలో నిర్వహించనున్నామని వెల్లడించారు. సమైక్యాంధ్ర సాధన కోసం ఏపీ ఎన్జీఓలు చేపట్టే ఉద్యమాల్లో పాల్గొంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు ఆదినారాయణ, చిన్నయ్య, కృష్ణ య్య, వెంకట్రావు, సతీష్, శ్రీధర్, సీమాంధ్ర జిల్లాల నాయకలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ఐకేపీ ఉద్యోగుల అడ్‌హక్ కమిటీని ఎంపిక చేశారు. రత్నకర్ (వైజాగ్), మురళి (శ్రీకాకుళం), రామకృష్ణ(విజయవాడ), వెంకట్రావు(నెల్లూరు), కుమార్(నెల్లూరు) అడ్‌హక్ కమిటీ సభ్యులుగా ఉంటారన్నారు. -
గిరిజనాభివృద్ధికి కృషి
గిరిజనుల జీవన విధానాలు మరింత మెరుగుపరచేందుకు, వారి ఆర్థికాభివృద్ధికి వివిధ శాఖల నిధులతో ప్రత్యేక కార్యక్రమాలను విస్తరింపజేస్తామని కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. రంపచోడవరం ఏజెన్సీ డివిజన్లోని గంగవరం, రంపచోడవరం మండలాలల్లో గురువారం ఐటీడీఏ, వివిధ శాఖల అధికారులతో కలసి కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా గంగవరం ఆశ్రమ పాఠశాలలో ఆమె విలేకరులతో మాట్లాడారు. గ్రామీణాభివృద్ధి, ఐటీడీఏ, ఐకేపీ, పశుసంవర్ధకశాఖ, వ్యవసాయశాఖల సమన్వయంతో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి గిరిజనుల ఆదాయాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రంపచోడవరం, వై. రామవరం మండలాల్లో భారీ మంచినీటి పథకాల ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు ఆమె తెలియజేశారు. ఈ ఏడాది ఏజెన్సీలోని ఏడు మండలాల్లో సుమారు మూడువేల డ్వాక్రా సంఘాలకు రూ. 27కోట్ల మేర బ్యాంక్ లింకేజి రుణాలు అందజేయనున్నామన్నారు. గిరిజనుల గృహ నిర్మాణ వ్యయం రూ. ఒక లక్షా ఐదువేలకు పెంచినట్టు కలెక్టర్ తెలియజేశారు. ఏజెన్సీలో వయోజన విద్యా కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసే బాధ్యతను కలెక్టర్ రంపచోడవరం ఐటీడీఏ పీఓ, సబ్‌కలెక్టర్లపై ఉంచారు. తొలుత పిడతమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది వివరాలపై వైద్యాధికారిణి ఇందుశ్రీని ఆరా తీశారు. అనంతరం గొరగొమ్మి గ్రామాన్ని సందర్శించి డ్వాక్రా మహిళలతో సమావేశైమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఐకేపీ ఉద్యానవన, ఉపాధి పధకం, ఆరోగ్య కార్యక్రమాల అమలుపై అధికారులతో ఆమె సమీక్షించారు. లక్కొండ, గంగవరం గ్రామాలలో ఉపాధి హామీ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ పర్యటనలో ఐటీడీఏ పీఓ సి.నాగరాణి, రంపచోడవరం సబ్ కలెక్టర్ గంధం చంద్రుడు, గిరిజన సంక్షేమశాఖ ఈఈ నాగేశ్వరరావు, ఐకేపీ ఏపీడీ జిలానీ, ఉపాధి ఏపీడీలు తాతారావు, ఉమామహేశ్వరరావు, ఏడీఎంఅండ్‌హెచ్‌ఓ రాజు, సహాయ గిరిజన సంక్షేమాధికారి సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొండి రంపచోడవరం : గిరిజనులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ పిలుపునిచ్చారు. కలెక్టర్ గురువారం సాయంత్రం రంపచోడవరం మండలం తాటివాడలో తాటిపీచు తీసే యంత్రాలను గిరిజనులకు అందజేశారు. సీటీఆర్ ఐ డెరైక్టర్ టీజీకే మూర్తి మాట్లాడుతూ సీటీఆర్ఐ, కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) రాజానగరం సంయుక్తగా తాటి పీచు తీసే యంత్రాలను అభివృద్ధి చేసినట్టు తెలియజేశారు. రెండు మిషన్లను ఆత్మ ఆర్థిక సహకారంతో తాటివాడలో గిరిజనులకు అందజేసినట్టు ఆయన వెల్లడిం చారు. ఒక్కో యంత్రం ఖరీదు రూ. 65 వేలు ఉంటుందని ఆయన తెలిపారు. ఐటీడీఏ పీఓ సి. నాగరాణి, సబ్ కలెక్టర్ గంధం చంద్రుడు, పీహెచ్ఓ సీహెచ్ శ్రీనివాస్, ఎస్ఓ చిన్నబాబు, కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ జీఆర్ నాయుడు, రంపచోడవరం కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఐకేపీ ఏపీటీ జిలానీ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థికాభివృద్ధి సాధించాలి
ఉట్నూర్‌రూరల్, న్యూస్‌లైన్ : సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని సెర్ప్ సీఈవో బి.రాజశేఖర్ అన్నారు. బుధవారం మండలంలోని ఘన్పూర్ గ్రామంలో గ్రామ సమైక్య సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభయహస్తం, ఆమ్ ఆద్మీ బీమా పథకం, దీపం, బంగారుతల్లి తదితర పథకాలు అర్హులకు అందేలా చూడాలని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం పెంపొందించేందుకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని, బంగారుతల్లి పథకంపై ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు. రుణాల రికవరీపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లురెడ్డి, ఐకేపీ ఏపీడీ నూరొద్దీన్, ఏడీఎం అండ్ హెచ్‌వో ప్రభాకర్‌రెడ్డి, ఏఎంవో వెంకటేశ్వర్లు, జిల్లా సమైక్య అధ్యక్షురాలు భాగ్య, ఏసీ కల్యాణ్, ఏపీఎం గంగాధర్ పాల్గొన్నారు. -
డ్వాక్రా సంఘాల స్కాలర్షిప్లు స్వాహా
ఖమ్మం: డ్వాక్రా సంఘాల స్కాలర్షిప్లను స్వాహా చేసిన ఘటన జిల్లాలోని మణుగురు, పినపాక మండలాల్లో ఆలస్యంగా వెలుగుచూసింది. తమకు రావాల్సిన స్కాలర్షిప్లను కాజేసారని కొందరు మహిళలు ఆధారాలతో సహా బయట పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ) సిబ్బంది చేతివాటం ప్రదర్శించి స్కాలర్షిప్లను స్వాహా చేసారని మహిళలు ఆరోపిస్తున్నారు. మణుగూరు, పినపాక మండలాల్లో డ్వాక్రా పథకం కింద మహిళలు రావాల్సిన స్కాలర్షిప్లు రాకపోవడంతో ఆరాతీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన సిబ్బందే కాజేసినట్లు ఆధారాలు లభించడంతో మహిళలు ఆందోళన చేపట్టారు. .