మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : బంగారు తల్లి పథకం అమలులో ఐకేపీ సిబ్బంది నిర్లక్ష్యం వీడాలని, లేనిపక్షంలో బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. మంచిర్యాల, చెన్నూరు క్లస్టర్ పరిధిలోని మండలాలకు చెందిన ఐకేపీ ఏపీఎంలు, సీసీలతో శనివారం మంచిర్యాల ఏరియా కో ఆర్డినేటర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ బంగారుతల్లి పథకం అమలై ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పుట్టిన ఆడపిల్లల వివరాలు సగం కూడా నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లల వివరాలు, లబ్ధిదారుల బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డులు సేకరించడం లేదన్నారు. వీరి వైఖరితో లబ్ధిదారులు నష్టపోయే ప్రమాదముందని చెప్పారు. ఇకపై నిర్లక్ష్యం వీడి ఆడపిల్లల వివరాల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయూలని ఆదేశించారు. బ్యాంకు ఖాతా తెరవడంలో ఇబ్బందులుంటే అన్ని వివరాలు ఆదిలాబాద్‌కు పంపిస్తే ఒక్కరోజులో ఖాతా తీరుుస్తామని చెప్పారు.
బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, అభయహస్తం పథకాల అమలుపై పర్యవేక్షణ కొరవడిందన్నారు. చెన్నూరులో స్త్రీనిధి పథకం కింద మహిళా సమాఖ్య సభ్యురాలి పేరుతో వేరొకరు రూ.4 లక్షలు రుణం తీసుకుని కేవలం రూ.లక్ష మాత్రమే చెల్లించారని, ఈ నెలాఖరులోగా మిగిలిన డబ్బు బ్యాంకులో జమ చేయూలని ఆదేశించారు. లేనిపక్షంలో ఏపీఎం, సీసీలపై చర్యలు తీసుకుంటామన్నారు. పథకాలు మహిళా సమాఖ్యలకు చేరువయ్యేలా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని పేర్కొన్నారు. డీఆర్డీఏ డీపీఎం ఎస్. వేణుగోపాల్, ఏపీఎం జాబ్స్ భూపతి బ్రహ్మయ్య, ఏరియా కో ఆర్డినేటర్లు చంద్రకళ, రాజుబాయ్, ఏపీఎం రాంచందర్ పాల్గొన్నారు.
‘బంగారుతల్లి’పై నిర్లక్ష్యం వీడాలి
Published Sun, Oct 27 2013 3:46 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement