Venkateshwar Reddy
-
నిజాయితీ అధికారికి బదిలీ బహుమానమా?
సాక్షి, వికారాబాద్: అధికారులు అవకాశవాదులుగా మారి.. ప్రజాప్రతినిధులు, బడా వ్యక్తుల అడుగులకు మడుగులొత్తుతున్న సమయంలో నిజాయితీగా ఉండటం సవాలే.. నిజాయితీగా వ్యవహరిస్తే అవార్డులు, రివార్డులు ఏమో గానీ బదిలీ.. లేక సస్పెన్షన్ వేటో తప్పదన్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం డీఎఫ్ఓ విషయంలో కూడా ఇదే రుజువయ్యింది. అయిన వచ్చీ రాగానే అక్రమార్కులకు సింహస్వప్నమయ్యారు. వారి గుండెల్లే రైళ్లు పరిగెత్తేలా చేశారు. కానీ వచ్చిన అనతికాలంలోనే అనేక మార్పులకు నాంది పలికిన ఆయన అక్రమార్కులకు కొరకరాని కొయ్యగా మారారు. ఎవరు చెప్పినా... హెచ్చరించిన లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. అలాంటి జిల్లా ఫారెస్టు అధికారి జిల్లా డీఎఫ్ఓగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్‌రెడ్డి ఐదు నెలల్లోనే బదిలీ కాకా తప్పలేదు. సంస్కరణలకు శ్రీకారం డీఎఫ్ఓ వెంకటేశ్వర్‌రెడ్డి అనేక మార్పులకు, సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఏళ్లుగా ఆక్రమణలకు నోచుకున్న వాటిని బయటకు తీసి రుజువులతో సహా కోర్టు ముందుంచారు. వికారాబాద్, తాండూరు సమీపంలో కాంట్రాక్టర్లు ఫారెస్టు భూముల్లో తవ్వకాలు జరిపి రూ. వందల కోట్ల విలువగల ఖనిజ సంపద తరలిస్తున్నారని గుర్తించి అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ఫారెస్టు భూములు కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేయించారు. వారు కోర్టులకు వెళ్తే కౌంటర్ ఫైల్ వేశారు. అనుమితి లేని సా మిల్లులపై ఉక్కుపాదం మోపారు. అక్రమ కలప రవాణాను అడ్డుకోవటం, అక్రమ కలప కొనుగోలు దారులకు రూ.లక్షల్లో ఫైన్లు వేయటం, అనుమతిలేకుండా ఫారెస్టు భూముల్లోంచి రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు ఫైన్లు వేయటం లాంటి అనేక విషయాల్లో ఆయన ఉక్కుపాదం మోపారు. ఇక వారి ఆటలు సాగవని భావించి కొందరు ప్రజా ప్రతినిధులపై వత్తిడి తెస్తూ వచ్చారు. ఎట్టకేలకు నిజాయితీగా వ్యవహరించిన అధికారిని సాగనంపారు. -
వరి ఏ గ్రేడ్‌కు మద్దతు ధర రూ.1,960
సాక్షి, హైదరాబాద్: నాణ్యతా ప్రమాణాలు పాటించి రైతులు పంటలకు మద్దతు ధర పొందాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. వివిధ రకాల పంటలకు మద్దతు ధరలు ప్రకటించారు. ఇవి తక్షణం అందుబాటులోకి వస్తాయన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్లో పంటల మద్దతు ధరలపై మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను మంత్రి విడుదల చేశారు. రైతులు పంట ఉత్పత్తులను శుభ్రపరచి, ఎండబెట్టి మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు. వారి సౌకర్యార్థం మార్కెట్ యార్డుల్లో క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాలు, ఎలక్ట్రానిక్ కాంటాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం మారిపోయిందని చెప్పారు. వ్యవసాయ వృద్ధిరేటులో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని, కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ ఇచ్చిన తాజా నివేదికనే దీనికి సాక్ష్యమన్నారు. పంటల ఉత్పత్తిలో ఏటా తెలంగాణ రికార్డులు తిరగరాస్తోందని, రైతు రెక్కల కష్టానికి తగిన ఫలితం రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. పత్తిలో తేమ 8 నుండి 12 శాతం ఉండాలని, తేమ 6–7 శాతం ఉంటే సీసీఐ ద్వారా బోనస్ కూడా ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు తదితరులు పాల్గొన్నారు. -
చేపల వేటలో సరదాగా ఎమ్మెల్యే
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నీటి కాలువలో చేపలు పట్టి సరదా తీర్చుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొని తిరుగుపయమైన ఎమ్మెల్యే బండర్ వల్లి బ్రిడ్జి దగ్గర ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీరు ప్రవహిస్తుండటాన్ని చూసిన అక్కడ కాసేపు ఆగారు. నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఇంతలో అక్కడ కొంత మంది గాలాలతో చేపలు పడుతుండటాన్ని గమనించి అక్కడికి వెళ్లారు. వారి వద్దనున్న చేపల గాలలను తీసుకుని తాను కూడా కాసేపు చేపలకు గాలం వేశారు. తాను చిన్నతనంలో సరదాకు గాలాలతో చేపలు పట్టే వాడినని, మళ్లీ ఇన్నేళ్లకు చేపలు పట్టడం ఆనందంగా ఉందన్నారు. కాగా, తన గాలానికి చేప పడటంతో ఎమ్మెల్యే మరింత ఆనందపడ్డారు. ఎమ్మెల్యే స్వయంగా చేపలు పట్టి సరదా తీర్చుకోవడంతో స్థానికులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: సెల్ఫీ ప్రమాదం: కళ్లముందే కూతురు జలసమాధి) -
మళ్లీ వెంకటేశ్వర్‌రెడ్డికే పగ్గాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్‌గా అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి కొనసాగనున్నారు. ఎల్బీ స్టేడియం లోని తన చాంబర్లో బుధవారం ఉదయం రెండోసారి చైర్మన్‌గా వెంకటేశ్వర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం శాట్స్ తొలి చైర్మన్‌గా పీఠమెక్కిన ఆయన ఇటీవలే తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే రెండో దఫా కూడా పగ్గాలు ఆయన చేతికే దక్కడం విశేషం. ఈ అవకాశాన్ని ఇచి్చన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శాట్స్ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు తన శాయశక్తులా కృషిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో శాట్స్ ఎండీ దినకర్ బాబు, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, అంతర్జాతీయ బాక్సర్ నిజాముద్దీన్, జిమ్నాస్ట్ అరుణా రెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబు దీక్ష.. బీజేపీ నేతల హౌజ్ అరెస్టులు
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లాలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అనంతపురంలో బుధవారం చేపట్టిన ధర్మపోరాట దీక్షకు ఆటంకం కల్గిస్తారనే అనుమానంతో పలువురు బీజేపీ నేతల్ని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. ‘నాలుగేళ్లుగా బీజేపీతో అధికారం పంచుకున్న టీడీపీ ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అనేలా వ్యవహరించింది. విభజన హామీల అమలు విషయమై ఏమాత్రం పనిచేయలేదు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా అభినందనలు తెలిపారు. సన్మానం కూడా చేశారు. ఇప్పుడు కేంద్రం అన్యాయం చేసిందంటూ ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు’ అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రత్యేక హోదా పోరాటం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని విమర్శించారు. -
రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కృషి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రాణించే విధంగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ‘శాట్స్’ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఎల్బీ స్టేడియంలో పరిశ్రమల శాఖ కార్పొరేషన్ చైర్మన్ బాలమల్లు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... ∙గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో క్రీడలు అభివృద్ధికి నోచుకోలేదు. నేను శాట్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రీడల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నాను. రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదవలేదు. అయితే వారికి సరైన సదుపాయాలు కల్పిస్తే వారు జాతీయస్థాయిలో మరింతగా రాణిస్తారు. క్రీడలకు నిధుల కొరత ఉన్నమాట వాస్తవమే. నిధులను సమకూర్చేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామకాలలో 2 శాతం స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ తీసుకువచ్చేందుకై రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపించాను. అదే విధంగా ప్రతి జిల్లాలో క్రీడా అకాడమీ ఏర్పాటు, నూతన కోచ్‌ల నియామకం వంటి ప్రతిపాదనలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాను. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) రీజినల్ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్‌కు వినతి పత్రం ఇచ్చాను. లక్ష్మీబాయ్ జాతీయ వ్యాయామ విద్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు... గచ్చిబౌలి స్టేడియంలోని సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ పునర్నిర్మాణం చేయుటకు కృషి చేస్తున్నాను. క్రీడల అభివృద్ధికై తమతో పాటు క్రీడాశాఖ అధికారులు సైతం కలిసి వస్తే రాష్ట్రంలో క్రీడాకారులకు మరింత మేలు చేకూరుతుంది. టోక్యో ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం విశిష్ట క్రీడాకారులకు అందజేసే టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో మన రాష్ట్రం నుంచి 15 మంది క్రీడాకారులకు చోటు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. -
కొలతల ప్రకారమే కూలీ
ఉపాధి పనులను పరిశీలించిన కలెక్టర్ కొందుర్గు: ఉపాధిహామీ కూలీలు కొలతల ప్రకారం పనిచేస్తే గిట్టుబాటు కూలీ లభిస్తుందని కలెక్టర్ శ్రీదేవి వివరించారు. బుధవారం మండలంలోని చేగిరెడ్డిఘనాపూర్ గ్రామశివారులో ఉపాధిహామీ పథకంలో చేపడుతున్న డంప్‌యార్డు పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీల నుంచి పనులు జరుగుతున్న విధానం, కూలీ అందుతున్న తీరు, పొదుపు తదితర విషయాలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాన్ని పరిశీలించారు. నూతన భవనం మంజూరుచేసేందుకు కృషిచేస్తానన్నారు. వీరసముద్రం నుంచి చేగిరెడ్డిఘనాపూర్ రోడ్డు వేయించాలని పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి వివరించగా సానుకూలంగా స్పందించారు. తండాల్లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎంపీపీ మంగులాల్‌నాయక్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సమస్యలపై వెంటనే సర్వేలు రిపోర్టులు పంపాలని ఎంపీడీఓ శ్రీనివాసాచార్యా, తహశీల్దార్ సంగీతకు సూచించారు. మండలంలోని లాల్‌పహడ్ కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ శ్రీదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు విద్యార్థులతో హిందీపాఠం చదివించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులను మందలించారు. మరోసారి ఇలాంటి సమస్యలు ఎదురైతే సహించేది లేదని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఎంపీపీ ఆవుల గాయత్రి, డ్వామా పీడీ సునంద, తహశీల్దార్ సంగీత, ఎంపీడీఓ శ్రీనివాసాచార్యా, ఈఓఆర్డీ మహేష్‌బాబు, ఏపీఓ అరుణారాణి ఉన్నారు. -
‘బంగారుతల్లి’పై నిర్లక్ష్యం వీడాలి
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : బంగారు తల్లి పథకం అమలులో ఐకేపీ సిబ్బంది నిర్లక్ష్యం వీడాలని, లేనిపక్షంలో బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. మంచిర్యాల, చెన్నూరు క్లస్టర్ పరిధిలోని మండలాలకు చెందిన ఐకేపీ ఏపీఎంలు, సీసీలతో శనివారం మంచిర్యాల ఏరియా కో ఆర్డినేటర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ బంగారుతల్లి పథకం అమలై ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పుట్టిన ఆడపిల్లల వివరాలు సగం కూడా నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లల వివరాలు, లబ్ధిదారుల బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డులు సేకరించడం లేదన్నారు. వీరి వైఖరితో లబ్ధిదారులు నష్టపోయే ప్రమాదముందని చెప్పారు. ఇకపై నిర్లక్ష్యం వీడి ఆడపిల్లల వివరాల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయూలని ఆదేశించారు. బ్యాంకు ఖాతా తెరవడంలో ఇబ్బందులుంటే అన్ని వివరాలు ఆదిలాబాద్‌కు పంపిస్తే ఒక్కరోజులో ఖాతా తీరుుస్తామని చెప్పారు. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, అభయహస్తం పథకాల అమలుపై పర్యవేక్షణ కొరవడిందన్నారు. చెన్నూరులో స్త్రీనిధి పథకం కింద మహిళా సమాఖ్య సభ్యురాలి పేరుతో వేరొకరు రూ.4 లక్షలు రుణం తీసుకుని కేవలం రూ.లక్ష మాత్రమే చెల్లించారని, ఈ నెలాఖరులోగా మిగిలిన డబ్బు బ్యాంకులో జమ చేయూలని ఆదేశించారు. లేనిపక్షంలో ఏపీఎం, సీసీలపై చర్యలు తీసుకుంటామన్నారు. పథకాలు మహిళా సమాఖ్యలకు చేరువయ్యేలా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని పేర్కొన్నారు. డీఆర్డీఏ డీపీఎం ఎస్. వేణుగోపాల్, ఏపీఎం జాబ్స్ భూపతి బ్రహ్మయ్య, ఏరియా కో ఆర్డినేటర్లు చంద్రకళ, రాజుబాయ్, ఏపీఎం రాంచందర్ పాల్గొన్నారు.