
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నీటి కాలువలో చేపలు పట్టి సరదా తీర్చుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొని తిరుగుపయమైన ఎమ్మెల్యే బండర్ వల్లి బ్రిడ్జి దగ్గర ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీరు ప్రవహిస్తుండటాన్ని చూసిన అక్కడ కాసేపు ఆగారు. నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఇంతలో అక్కడ కొంత మంది గాలాలతో చేపలు పడుతుండటాన్ని గమనించి అక్కడికి వెళ్లారు. వారి వద్దనున్న చేపల గాలలను తీసుకుని తాను కూడా కాసేపు చేపలకు గాలం వేశారు. తాను చిన్నతనంలో సరదాకు గాలాలతో చేపలు పట్టే వాడినని, మళ్లీ ఇన్నేళ్లకు చేపలు పట్టడం ఆనందంగా ఉందన్నారు. కాగా, తన గాలానికి చేప పడటంతో ఎమ్మెల్యే మరింత ఆనందపడ్డారు. ఎమ్మెల్యే స్వయంగా చేపలు పట్టి సరదా తీర్చుకోవడంతో స్థానికులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.
(చదవండి: సెల్ఫీ ప్రమాదం: కళ్లముందే కూతురు జలసమాధి)
Comments
Please login to add a commentAdd a comment