devarkadra
-
Bandi Sanjay Praja Sangrama Yatra: బీజేపీ శ్రేణుల ఘర్షణ.. ఒకరికి గాయాలు
దేవరకద్ర (మహబూబ్‌నగర్): బీజేపీకి చెందిన రెండువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు గాయపడిన సంఘటన బుధవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు స్వాగతం పలుకుతూ బీజేపీ నాయకులు పట్టణంలోని పలు ప్రాంతాల్లో గోడలపై రాయించారు. ఇందులో భూత్పూర్ మండలానికి చెందిన ఓ నాయకుడి పేరును ప్రధానంగా ప్రస్తావిస్తు రాశారు. ఎవరి పేర్లు రాయవద్దని ముందుగానే సూచించినప్పటికీ ఎందుకు రాశారని దేవరకద్ర నాయకులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో దేవరకద్ర, భూత్పూర్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోని రాయచూర్ రోడ్డుపై రెండువర్గాల వారు పిడిగుద్దులకు దిగడంతో గొడవ మరింత పెద్దదైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అదుపు చేశారు. చదవండి👉 వారసులొస్తున్నారు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ అంటూ.. గాయపడ్డ బాల్‌రెడ్డి అనంతరం గొడవకు కారణమైన వారిని వాహనంలో ఎక్కించుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో భూత్పూర్కు చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి తలకు తీవ్ర గాయంకాగా.. దేవరకద్రకు చెందిన పార్టీ మండలాధ్యక్షుడు అంజన్‌కుమార్‌రెడ్డి, ఇతర కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు బాల్‌రెడ్డిని పీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. జరిగిన గొడవపై ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి👉🏻 63,425 పోస్టుల్ని ఎప్పుడు భర్తీ చేస్తారు? -
చేపలు పట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
-
చేపల వేటలో సరదాగా ఎమ్మెల్యే
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నీటి కాలువలో చేపలు పట్టి సరదా తీర్చుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొని తిరుగుపయమైన ఎమ్మెల్యే బండర్ వల్లి బ్రిడ్జి దగ్గర ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీరు ప్రవహిస్తుండటాన్ని చూసిన అక్కడ కాసేపు ఆగారు. నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఇంతలో అక్కడ కొంత మంది గాలాలతో చేపలు పడుతుండటాన్ని గమనించి అక్కడికి వెళ్లారు. వారి వద్దనున్న చేపల గాలలను తీసుకుని తాను కూడా కాసేపు చేపలకు గాలం వేశారు. తాను చిన్నతనంలో సరదాకు గాలాలతో చేపలు పట్టే వాడినని, మళ్లీ ఇన్నేళ్లకు చేపలు పట్టడం ఆనందంగా ఉందన్నారు. కాగా, తన గాలానికి చేప పడటంతో ఎమ్మెల్యే మరింత ఆనందపడ్డారు. ఎమ్మెల్యే స్వయంగా చేపలు పట్టి సరదా తీర్చుకోవడంతో స్థానికులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: సెల్ఫీ ప్రమాదం: కళ్లముందే కూతురు జలసమాధి) -
కశ్మీర్ టు కన్యాకుమారికి సైకిల్‌యాత్ర
సాక్షి, అడ్డాకుల (దేవరకద్ర): యువజన కాంగ్రెస్ జాతీ య కార్యదర్శి కోల్‌కుందా సంతోష్‌కుమార్ చేపట్టిన సైకిల్‌యాత్ర బుధవారం మండలానికి చేరుకుంది. వికారాబాద్ ప్రాంతానికి చెందిన సం తోష్కుమార్ ఆగస్టు 15న కశ్మీర్లో సైకిల్‌యాత్రను చేపట్టాడు. 28 రోజులుగా సాగుతున్న యాత్ర మండలంలోని హైవేపై కొనసాగింది. అడ్డాకుల వద్ద సంతోష్‌కుమార్‌కు స్థానిక కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొండా జగదీశ్వర్, నాయకులు గంగుల విజయమోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శేఖ ర్‌రెడ్డి, సయ్యద్‌షఫి, సాయిలు, రాములు తదితరులు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. మనది భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశమన్నారు. దీన్ని ప్రచారం చేయాలన్న సంకల్పం తోనే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌యాత్ర చేపట్టినట్లు తెలిపారు. విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై ప్రచారం కూడా చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా యువత ఆలోచన విధానం గురించి తెలుసుకుంటున్నట్లు తెలిపా రు. ప్రతి రోజు 100కిలోమీటర్ల దూరం సైకిల్‌యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. గాంధీ జయంతి నాటికి కన్యాకుమారి చేరుకుంటానని పేర్కొన్నారు. -
పదవులపై ‘నజర్’
సాక్షి, అడ్డాకుల: పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 3న ఎంపీపీల పదవీ కాలం ముగియనున్నందున ఆ లోపు ఎన్నికలు పూర్తయితే కొత్త పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టే విధంగా సర్కారు ఎన్నికలకు అంతా సిద్ధం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే నెల 27న ముగియనుంది. రాష్ట్రంలో ఈనెల 11న మొదట విడతలోనే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వాహణపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇందుకోసం జిల్లా, మండల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ స్థానిక ఎన్నికల వేడి రగులుకుంటోంది. ఆశావహుల ‘ప్రచారం’.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సమీపించడంతో పోటీలో నిలవాలనుకున్న ఆశావహులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తలమునకలవుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ముగియగానే తమ ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జోరందుకోవడంతో తాజాగా గ్రామాల్లో ప్రచారం ఊపందుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రిజర్వేషన్ అనుకూలించే నేతలు అందరినీ కలుపుకుపోవడానికి సమాయత్తం అవుతున్నారు. వలస ఓటర్లపై కూడా మెల్లగా దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే వలస ఓటర్లు రెండు సార్లు గ్రామాలకు వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. ఒకసారి ఎమ్మెల్యే మరోసారి సర్పంచ్ ఎన్నికలకు వచ్చి ఓట్లు వేశారు. తాజాగా మరో రెండు ఎన్నికలు రావడంతో వలస ఓటర్లను గ్రామాల నేతలు మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఎలాగైనా వచ్చే రెండు ఎన్నికలకు వచ్చి వలస ఓటర్లు ఓట్లు వేసి పోయే విధంగా ఆశావహులు ఫోన్లు చేస్తున్నారు. జెడ్పీటీసీపై నేతల గురి.. అడ్డాకుల ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను ఈసారి జనరల్‌కు రిజర్వు చేశారు. దీంతో చాలా మంది మండల ముఖ్య నేతలు జెడ్పీటీసీపై గురి పెట్టారు. జెడ్పీ చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయించడంతో ఇక్కడ జెడ్పీటీసీగా విజయం సాధిస్తే అదృష్టం వరించి జెడ్పీ చైర్మన్ కావొచ్చన్న ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి పార్టీ మండల అధ్యక్షుడు డి.నాగార్జున్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు పొన్నకల్ మహిమూద్, సింగిల్‌విండో అధ్యక్షుడు ఎం.జితేందర్‌రెడ్డి, పెద్దమునుగల్‌ఛేడ్ సర్పంచ్ భర్త రాజశేఖర్‌రెడ్డి, అడ్డాకుల తిరుపతిరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, బలీదుపల్లి వేణుయాదవ్‌తో పాటు మరి కొందరు తెలంగాణ ఉద్యమ నేతలు కూడా టీఆర్ఎస్ అభ్యర్థిత్వం దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు సిద్ధం.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీని ఎదుర్కొవడానికి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో రెండు పార్టీలు తలమునకలయ్యాయి. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరడంతో ఆ పార్టీ కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో ముగ్గురు నేతలు జెడ్పీటీసీ స్థానంపై గురి పెట్టినా పక్క మండలానికి చెందిన ఓ నియోజకవర్గ నేతను ఇక్కడి నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. -
ఓటింగ్ శాతం ‘పెరిగేనా’..!
సాక్షి, అడ్డాకుల: ఈసారి గ్రామాల్లో పెద్దగా ఎన్నికల సందడి కనిపించడం లేదు. గత శాసనసభ, సర్పంచ్ ఎన్నికల్లో పదిహేను రోజుల పాటు గ్రామాల్లో హడావుడి కనిపించింది. పార్లమెంట్ ఎన్నికల వేళ గ్రామాల్లో సందడి కరువైంది. వేసవికాలం ఎండల ప్రభావమో...వరుస ఎన్నికల ప్రభావమో కాని గ్రామాల్లో స్తబ్ధత కనిపిస్తోంది. పోలింగ్‌కు ఇంకా వారం రోజులే ఉంది. నియోజకవర్గంలో ఇంకా పార్టీల నేతలు ఇంటింటి ప్రచారం మొదలు పెట్టలేదు. ఒకటి రెండు గ్రామాల్లో మినహా ఎక్కడ డోర్ టూ డోర్ ప్రచారం మొదలైంది లేదు. పార్లమెంట్ ఎన్నికలపై గ్రామాల్లో నేతలు పెద్ద ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది. జిల్లాలో దేవరకద్రనే టాప్..! నియోజకవర్గంలో 2018 డిసెంబర్ 7న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. 2014 శాసనసభ ఎన్నికలతో పోలిస్తే 13శాతం ఎక్కువ ఓటింగ్ నమోదైంది. 2014లో 71.67శాతం పోలింగ్ నమోదైతే 2018లో 84.6శాతం పోలింగ్ నమోదైంది. ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ప్రధాన పార్టీలు ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. హైదరాబాద్‌లో ఒకటి, రెండు సార్లు అక్కడున్న ఓటర్లతో ‘ఆత్మీయ’ సమావేశాలు ఏర్పాటు చేశాయి. వలస ఓటర్లు ఊర్లకు వచ్చి ఓటు వేసి వెళ్లేలా నేతలు ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలోనే ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొనడంతో జిల్లాలోనే రికార్డు స్థాయిలో దేవరకద్ర నియోజకవర్గంలో పోలింగ్ నమోదైంది. శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత 2019 జనవరి 30న సర్పంచ్ ఎన్నికలను నిర్వహించారు. అప్పుడు కూడా పోలింగ్ శాతం పెరిగింది. అడ్డాకుల మండలంలో 88శాతం పోలింగ్ నమోదైంది. శాసనసభ ఎన్నికల కంటే కొంత ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. సర్పంచ్ అభ్యర్థులు శక్తి మేర ప్రయత్నం చేసి ఓటింగ్ శాతం పెంచారు. పార్లమెంట్ ఎన్నికలు ఈనెల 11న జరుగనున్నాయి. దీంతో 11న సెలవు రోజైతే 12వ తేదీ మినహా 13న రెండో శనివారం, 14న ఆదివారం కావడంతో వరుస సెలవులు వచ్చాయి. అందులోనూ పాఠశాలలకు వేసవి సెలవులు తోడు కావడంతో వలస ఓటర్లే కాకుండా గ్రామాల్లో ఉండే ఓటర్లు కూడా ఓటింగ్‌లో పాల్గొంటారా లేదా అన్నది పార్టీల నేతలను కలవర పెడుతోంది. ఎంపీ ఎన్నికల తర్వాత ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వలస ఓటర్లను అప్పుడు గ్రామాలకు రప్పించుకోవచ్చన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. -
పురాతన భవనంలో ‘గ్రంథాలయం’
సాక్షి, దేవరకద్ర రూరల్ : దేవరకద్రలోని శాఖ గ్రంథాలయం పురాతన భవనంలో కొనసాగుతుంది. దీంతో పాఠకులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నప్పటికీ గ్రంథాలయం విషయంలో గ్రామస్థుల తలరాత మారడంలేదు. కొన్నేళ్లుగా గ్రంథాలయం పురాతన భవనంలో కొనసాగుతున్న అడిగే నాథుడే కరువయ్యాడు. భవనం పై కప్పుకున్న సిమెంట్ రేకులకు రంధ్రాలు కావడంతో వర్షాకాలంలో పాఠకులు పడే అవస్థలు వర్ణణాతీతం. అన్నిటికీ అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా గ్రంథాలయం పరిస్థితి మారిపోయింది. పాఠకులకు కావల్సిన పుస్తకాలు అన్ని ఉన్నప్పటికీ భవనం శిథిలావస్థకు చేరడంతో వాటికి భద్రత లేకుండా పోయింది. కొన్నేళ్లుగా గ్రామస్థులు పలు సార్లు సమస్యను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన లాభం లేకుండా పోయింది. ఎన్నికలప్పుడు హామీలిస్తున్న పాలకులు ఎన్నికలైపోయాక వాటి ఊసే ఎత్తడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు వివిధ కార్యాలయాలకు వెళ్లే అధికారులు , ప్రజాప్రతినిధులు గ్రంథాలయం భవనం ముందు నుంచే వెళ్తారు. కానీ ఏ ఒక్కరోజు కూడా గ్రంథాలయం గురించి పట్టించుకొనే నాథుడే లేకుండా పోయారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు పలు గ్రామాలకు కూడలిగా ఉన్న గ్రంథాలయ భవనం ఈ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కావున ఇప్పటికైనా పాఠకుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు తగు చొరవ చూపి శి«థిలావస్థకు చేరిన గ్రంథాలయ భవనాన్ని నూతన భవనంగా మార్చేలా కృషి చేయాలని పాఠకులు కోరుతున్నారు. నెరవేరని చైర్మన్ హామీ.. దేవరకద్ర శాఖ గ్రంథాలయ భవనానికి కొత్త భవనం మంజూరుజేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ హామీ ఇచ్చారు.ఇటీవల గ్రంథాలయ భవనాన్ని చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ సందర్శించి పరిశీలించారు. అప్పుడు పాఠకులు సమస్యను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.త్వరలో కొత్త భవనం మంజూరుచేస్తామని హామీ ఇచ్చారు. కాని ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదు. నిర్లక్ష్యం తగదు గ్రంథాలయ భవనం విషయంలో నిర్లక్ష్యం తగదు. భవనం పక్షులకు నిలయంగా మారింది. వర్షాకాలంలో పరిస్థితి దారుణంగా ఉంటుంది. అయినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం బాధకరం. ఈ విషయంలో నాయకులు తగు చొరవ చూపితే బాగుంటుంది. –నిరంజన్‌రెడ్డి, దేవరకద్ర -
స్కూల్ బస్సు, ట్యాంకర్ ఢీ
భూత్పూర్ (దేవరకద్ర): బడి ముగించుకుని ఆడుతూ పాడుతూ సాయంత్రం ఇంటికి వెళ్తున్న విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.. ఏం జరి గిందో తెలియదు.. పెద్ద శబ్ధం.. అద్దాలు పగిలిపోయి గాజుపెంకులు కళ్లకు తగులుకుంటూ వెళ్లాయి. భయాందోళనలతో ఒకటే అరుపులు కేకలు.. కానీ ఎవరికీ ఏం కాలేదు.. సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.. ఇంతకు ఏం జరిగిందంటే భూత్పూర్ మండలం అమి స్తాపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం స్కూల్ బస్సును ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. రెండు వాహనాల వేగం బాగానే ఉండటంతో స్కూల్ బస్సు డ్రైవర్ సుల్తాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. పిల్లలంతా వెనకసీటుల్లో కూర్చోవడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదానికి కారణాలు.. మిషన్ భగీరథ పైప్‌లైన్ పనుల్లో భాగంగా రోడ్డును సగం తొలగించి పైప్‌లైన్ పనులు చేపట్టారు. పనులు ఇంకా పూర్తికాక నిర్వాహకులు రోడ్డును డైవర్షన్ చేశారు. దీంతో వాహనాలు ఒకే దారిలో వెళ్లాల్సి వస్తోంది. అయితే మంగళవారం సాయంత్రం మహబూబ్‌నగర్ నుంచి భూత్పూర్ వైపుకు వస్తున్న హిరా మోడల్ స్కూల్ బస్సును ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ సుల్తాన్ సీటు లో ఇరుక్కుపోయాడు. దారిగుండా వెళ్తు న్న వాహనదారులు, గ్రామస్తులు వెంట నే డ్రైవర్‌ను బయటకు లాగి అంబు లెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ పంకజ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు సంఘటన జరిగిన వెంటనే డ్రైవర్‌కు రక్తగాయాలు కావడంతో అంకుల్.. అంటూ కేకలు పెట్టారు. గమనించిన అమిస్తాపూర్ వాసులు విద్యార్థులను బస్సులోంచి దించి సముదాయించారు. ప్రమాదం వార్త తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు సైతం వెంటనే అక్కడికి వచ్చి పిల్లలను అక్కున చేర్చుకున్నారు. ఎవరికీ ఎలాంటా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆందోళనకు గురైన విద్యార్థులు నోటీసులు జారీ చేశాం పనులు త్వరితగతిన పూర్తికాకపోవడంతో గతంలో పలుమార్లు ‘సాక్షి’లో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తుచేస్తూ అధికారులు, కాంట్రాక్టర్ పనితీరును తప్పుపట్టారు. ఇదిలాఉండగా ఈ విషయంపై ఎస్ఐ శ్రీనివాస్ స్పందించారు. గతంలో రోడ్డు డ్రైవర్షన్ను త్వరగా తొలగించాలని ఆర్అండ్బీ, మిషన్ భగీరథ అధికారులకు చెప్పామని, వారు పట్టించుకోకపోవడంతో పలుమార్లు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. ఇకనైనా పనులు వేగంగా చేసి డైవర్షన్ తొలగించాలని కోరారు. -
బస్సుల్ని ఢీకొన్న ఇన్నోవా.. ముగ్గురి మృతి
♦ ఏడుగురికి తీవ్ర గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం ♦ మృతులు, క్షతగాత్రులందరూ హైదరాబాద్ వాసులే ♦ మిత్రుడి పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం అడ్డాకుల (దేవరకద్ర): జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సులను ఇన్నోవా వాహనం ఢీకొ ట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాల య్యారు. మిత్రుడి పెళ్లికి వెళ్తుండగా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ స్టేజీ సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని ఫలక్ నుమాకు చెందిన టైలర్ షేక్ అఫ్రోజ్‌కు ఏపీలోని చిత్తూరు జిల్లా ములకల్ చెరువు మండలం బి.కొత్తకోటకు చెందిన యువతితో బుధవారం ఉదయం వివాహం జరగాల్సి ఉం ది. పెళ్లికని అఫ్రోజ్ స్నేహితులు 10 మంది ఇన్నోవాలో బయలుదేరారు. శాఖాపూర్ టోల్ ప్లాజా దాటిన కొన్ని క్షణాల్లోనే గుడిబండ స్టేజీ సమీపంలో ముందు వెళ్తున్న లారీని దాటే ప్రయత్నంలో ఇన్నోవా అదుపు తప్పింది. రోడ్డు కిందకు దూసుకెళ్లి హోటల్ ముందు ఆగి ఉన్న రెండు బస్సులను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇన్నోవా డ్రైవర్ షేక్ మహ్మద్ పాషా(27), ముందు సీట్లో కూర్చున్న షేక్ ముబారక్ (22) అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చున్న షేక్‌బాబా (25) బుధవారం ఉదయం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మృత్యువాత పడ్డాడు. మిగతావారికి తీవ్ర గాయా లయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలి పారు. కాగా, వాహనం సీటులో ఇరుక్కు పోయిన మహ్మద్ పాషా మృతదేహాన్ని పోలీసు లు రెండు గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. స్నేహితుల మృతదేహాలను చూసి రోదిస్తున్న పెళ్లికుమారుడు అఫ్రోజ్, ఆయన తల్లిదండ్రులకు సర్దిచెప్పి పెళ్లికి పంపించారు. మృతులంతా ఫలక్‌నుమా ప్రాంతవాసులే. -
సంత.. నోట్ల చింత
• దేవరకద్ర మార్కెట్లో తగ్గిన వ్యాపారాలు • చిల్లర ఉంటేనే సరుకులంటున్న వ్యాపారులు దేవరకద్ర : దేవరకద్రలో బుధవారం జరిగిన సంతలో నోట్ల చింతతో వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగారుు. వారాంతపు సంత కావడం వల్ల చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు తరలి వచ్చి నిత్యావసర సరుకులు, కూరగాయలు వారానికి సరిపడా కొనుగోలు చేస్తుంటారు. అరుుతే రూ.వేరుు, రూ. 500 నోట్లు చెల్లవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పాత నోట్లను వ్యాపారుల తీసుకోక పోవడంతో ఇబ్బందుల పాలయ్యారు. బ్యాంకుల వద్ద గంటల తరబడి నిలబడి కొత్త నోట్లను తీసుకున్న ఫలితం లేకుండాపోరుుంది. ఎక్కడికి వెళ్లిన రూ. 2వేల నోటుకు చిల్లర లేదని చెప్పడంతో ఏమి కొనలేని పరిస్థితిని ప్రజలు ఎదుర్కొన్నారు. సగానికి తగ్గిన వ్యాపారాలు నిత్యావసర సరుకుల దుకాణాలలో సగానికి సగం వ్యాపారాలు తగ్గిపోయారుు. కూరగాయల వ్యాపారం మందకొడిగా సాగింది. గతంలో సంతరోజు ఒక్కో దుకాణం రూ.5వేల వ్యా పారం నడవగా.. ప్రస్తుతం రూ.2వేలకు కూడా మించడం లేదు. ఇక కిరాణా షాపుల్లో సరుకులు కొనే వారు తక్కువగా వచ్చారు. చాలామంది బ్యాంకుల వద్దనే పడిగాపులు పడడం వల్ల సంత అంతా ఖాళీగా కనిపిం చింది. ఎక్కడ చూసిన పాత నోట్లు చెల్లవని చెప్పడంతో డబ్బులు ఉన్నా ఏమి తినలేము, ఏమి కొనలేమని పలువురు నిరాశకు గురయ్యారు. చాలాచోట్ల ఏమైనా సరుకులు అడిగితే ముందుగా చిల్లర ఉందా అని అడుగుతున్నారు. లేదని వినియోగదారులు చెప్పడంతో సరుకులుకూడా లేవని చెబుతున్నారు. -
మహిళ అనుమానాస్పద మృతి
దేవరకద్ర: ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన సోమవారం దేవరకద్రలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న అమీనాబీకి కొడుకు అబ్దుల్‌ఖాదర్ ఉన్నాడు. అతడికి రిజ్వానాబేగం(35) వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం పిల్లలతో కలిసి వనపర్తికి వెళ్లిన రిజ్వానాబేగం, అబ్దుల్‌ఖాదర్ తిరిగి రాత్రి కౌకుంట్లకు చేరుకుని అక్కడే ఉన్నారు. సోమవారం ఉదయం పిల్లలు స్కూలుకు వెళ్లిన తరువాత రిజ్వానాబేగం ఇంట్లోనే నిద్రకు ఉపక్రమించింది. భర్త మంచంపై పడుకున్నాడు. ఒంటిబడులు కావడంతో మధ్యాహ్నం పిల్లలు ఇంటికి వచ్చేసరికి తల్లి విగతజీవిగా పడిఉంది. ఈ విషయాన్ని ఆ చిన్నారులు పక్కింటివారి ఫోన్‌తో మేనమామ బాబ్జాన్కు చెప్పారు. తరుచూ భార్యను వేధించే అబ్దుల్‌ఖాదర్ హత్యచేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదుచేశారు. విచారించిన పోలీసులు ఆత్మకూర్ సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్ఐ వినయ్‌కుమార్‌రెడ్డి వివరాలు తెలుసుకున్నారు. రిజ్వానాబేగం గొంతుచుట్టు బిగించినట్లు ఎర్రని చారలు కనిపించాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు అనుమానాస్పదస్థితి కేసుగా నమోదుచేశారు. భర్త అబ్దుల్‌ఖాదర్, అత్త అమీనాబీని పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఆరుగంటల్లోనే.. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం
మధ్యాహ్నం 12.30కు పనులు ప్రారంభం.. సాయంత్రం 6.30కు పూర్తి దేవరకద్ర: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంతో పాటు భారీ యంత్ర సామగ్రితో రూ. రెండు కోట్ల విలువైన రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు కేవలం ఆరు గంటల్లోనే పూర్తి చేశారు. అది కూడా ఆరు గంటల పాటు ఆ మార్గంలో రైళ్లను నిలిపివేసి పనులు పూర్తి చేశారు. ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర వద్ద జరిగింది. దేవరకద్ర సమీపంలోని డోకూర్ వెళ్లే రహదారిపై ఉన్న 75వ నంబర్ కాపలాలేని రైల్వే గేటు వద్ద మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు పనులు ప్రారంభించి సాయంత్రం 6.30 గంటలకు రైళ్ల రాకపోకలు సాగించారు. -
కుర్చీ తెచ్చిన వివాదం
దేవరకద్ర : దేవరకద్ర జెడ్పీటీసీ సభ్యుడికి మండల పరిషత్ కార్యాలయంలో కుర్చీ కేటాయించాలని జెడ్పీసీఈఓ నుం చి ఎంపీడీఓలకు వచ్చిన ఆదేశాలు దేవరకద్రలో వివాదానికిదారితీశాయి. కుర్చీ ఏర్పాటు చేయాలంటే ఎంపీపీ అనుమతి కావాలని ఎంపీడీఓ చెప్పడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అతనిపై దాడికి దిగడంతో పాటు కార్యాలయంలోని అద్దాలు పగులగొట్టారు.దేవరకద్ర జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీకాంత్‌రెడ్డికి మండల పరిషత్‌లో ప్ర త్యేకంగా కూర్చోడానికి ఏర్పాట్లు చేయాలని గత నెల 11న జెడ్పీ సీఈఓ నుంచి మండల పరిషత్‌కు ఆదేశాలు వచ్చాయి. అప్పటికే ఎంపీపీ కోసం ప్రత్యేక చాంబ ర్ను కేటాయించడంతో గదుల కొరత ఏర్పడింది. దీంతో జెడ్పీటీసీ సభ్యుడికి సకాలంలో గదిని కేటాయించలేకపో యారు. ఈ నేపథ్యంలో బుధవారం జెడ్పీటీసీ సభ్యుడితో పాటు కాంగ్రెస్ నా యకులు రాందాసు, రాఘవేందర్‌రెడ్డి, అంజన్‌కుమార్‌రెడ్డి, అంజిల్‌రెడ్డి, లక్ష్మారెడ్డిలతో పాటు పలువురు కార్యకర్తలు మండల పరిషత్ కార్యాలయాని వచ్చి జెడ్పీటీసీ సభ్యుడికి గది ఎందుకు కేటాయించలేదని ఎంపీడీఓ రాకేశ్రావును నిలదీశారు. గది ఏర్పాటు చేయాలంటే ఎంపీపీ అనుమతి కావాలని ఎంపీడీఓ వారికి వివరించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు కేకలు వేస్తే ఎంపీడీఓపై విరచుకుపడ్డారు. ఒక దశలో వాతవరణం ఉద్రిక్తంగా మారింది. ఇదే సమయంలో ఓ కార్యకర్త ఎంపీడీఓ ముందు ఉన్న అద్దాన్ని పగులగొట్టాడు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన ఎంపీడీఓ బయటకు వెళ్లడానికి ప్రయత్నిం చారు. దీంతో కొందరు కార్యకర్తలు అతడిని అడ్డుకోడానికి ప్రయత్నించారు. దీంతో ఆవేదనకు గురయిన ఎంపీడీఓ రాకేశ్‌రావు నిరసనతో మండల పరిషత్ కార్యాలయం ముందు మెట్లపై కూర్చుని ధర్నాకు దిగారు.కాంగ్రెస్ నాయకులు మళ్లీ బయటకు వచ్చి గందరగోళం చేశారు. బలవంతంగా ఎంపీడీఓను తిరిగి చాంబర్లోకి తీసుకెళ్లారు. చివరకు ఎస్ ఐ రాజు తన సిబ్బందితో కలిసి అక్కడి చేరుకున్నారు. అందరినీ బయటకు పం పించి కాంగ్రెస్ నాయకులతో మాట్లాడారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ నా యకులు అక్కడికి వచ్చి కాంగ్రెస్ వారి తో వాగ్వాదం చేశారు. పోలీసులు జొ క్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. చివరకు కాంగ్రెస్ నాయకులు కా ర్యకర్తలు అక్కడి నుంచి వెళ్లి పోయారు. సామూహిక సెలవులు పెడుతున్నాం... జరిగిన సంఘటనకు నిరసనగా మం డల పరిషత్ సిబ్బందితో పాటు, పంచాయతీ సెక్రటరీలు అందరం గురువారం నుంచి సామూహిక సెలవు పెడుతున్నామని ఎంపీడీఓ రాకేశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా వ్యవహరించడంతో పాటు దాడి చేసే ప్రయత్నం చేశారని ఆయనఆరోపించారు. ఒక అధికారి అని కూడా చూడకుండా, కనీస మర్యాద పాటించకుండ వ్యవహరించారని తెలిపారు. ఈ విషయం పోలీసు స్టే షన్లో పిర్యాదు చేస్తున్నామని, అలాగే జిల్లా కలెక్టర్, జెడ్పీ సీఈఓలకు పిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. -
వైకల్యం కన్నా... స్నేహం మిన్న
దేవరకద్ర రూరల్ : ఈ ఫొటోలో కనిపిస్తున్న వారు... ఇద్దరూ ప్రాణ స్నేహితులు... ఇందులో ఒకరికి కళ్లులేవు. మరొకరికి బుద్ధిమాంధ్యం ఉంది. ఎప్పుడూ కలిసిమెలసి ఉండే వీరు స్నేహితుల దినోత్సవమైన ఆదివారం దేవరకద్ర నుంచి గద్దెగూడేనికి వె ళుతూ ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు. వారిని పలకరించగా స్నేహబంధాన్ని వివరించారు. ఆస్తి, అంతస్తులు చూస్తున్న ఈ రోజుల్లో పుట్టుకతోనే శారీరకలోపంతో సతమతమయ్యే తాము 30ఏళ్ల క్రితమే స్నేహితులుగా మారామన్నారు. మహబూబ్‌నగర్‌లోని టీడీగుట్టకు చెందిన మహబూబ్‌పాషా పుట్టుకతోనే అంధుడు, అదే ప్రాంతానికి చెందిన కృష్ణకు బుద్ధిమాంధ్యం ఉంది. అప్పటి నుంచి ఒకరిని విడిచి మరొకరు ఉండరు. తన కళ్లతో కృష్ణ స్నేహితుడు మహబూబ్‌పాషాకు లోకాన్ని చూపిస్తున్నాడు. ఎక్కడికెళ్లినా కృష్ణ భుజంపై చేయి వేసి నడుస్తాడు. యాచించిన డబ్బులను ఇద్దరూ సమానంగా పంచుకుంటారు. వారు కలిసే తింటారు, ఉంటారు. వైకల్యం ముందు స్నేహం మిన్న అన్న చందంగా వీరు ముందుకు సాగుతున్నారు. కులమతాలు వేరైనా స్నేహానికి అవేమీ సాటిరావన్న నానుడిని నిజం చేస్తున్నారు. మనసుండాలే కాని స్నేహానికి కొదవలేదని చాటి చెబుతున్నారు. -
గోలి‘గుడ్డు’
దేవరకద్ర రూరల్: దేవరకద్ర లో బుధవారం శాంతిగౌడ్కు చెందిన కో డిపెట్ట అరుదైన గుడ్డు పెట్టింది. ఈ గుడ్డు సాధారణ గుడ్డు మాదిరి కంటే చాలా చిన్నదిగా ఉంది. శాంతిగౌడ్కు చెందిన కోడిపెట్ట వారం రోజులుగా గుడ్లు పెడుతోంది. అయితే ఈ కోడి పెట్టిన గుడ్లలోప్రతి రోజు పెట్టే గుడ్లు మాదిరిగి కాకుండా చాలా చిన్నదిగా ఉం ది. ఈ గుడ్డును చూడడానికి ఆ వాడ ప్రజలు ఆసక్తి కనబరిచారు. -
చాపకింద నీరులా ‘గున్యా’
దేవరకద్ర, న్యూస్‌లైన్ : మండలంలోని పె ద్ద గోప్లాపూర్, పెద్ద రాజమూర్ గ్రామాల్లో చాపకింద నీరులా చికెన్‌గున్యా వ్యాధి వ్యాపిస్తోంది. ఈ నెల మొదటి వారం గోప్లాపూర్‌లో వ్యాధి బారిన పడి పలువురు మంచం పట్టిన సంగతి తెలిసిందే. వైద్య బృందం వారం రోజుల పాటు గ్రామంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి వ్యాధిని అదుపులోకి తెచ్చారు. రెండు వారాల్లోపే మళ్లీ పలువురు వ్యాధితో మంచం పట్టారు. బుధవారం గోపాల్, ఆయన భార్య శాంతమ్మలు కాళ్లు, కీళ్లనొప్పులతో బాధపడుతూ స్థానిక పీహెచ్‌సీకి వచ్చారు. మిగతావారు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకుంటున్నారు. అలాగే పెద్ద రాజమూర్ గ్రామంలోనూ రెండు వారాల క్రితం ప్రజలు వ్యాధిబారిన పడ్డారు. వారంతా ప్రైవేట్‌లో వైద్య సేవలు పొంది వ్యాధి నుంచి ఉపశమనం పొందారు. మళ్లీ బుధవారం పలువురు కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధ పడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు. వైద్యశాఖ ఇలాంటి సందర్భాల్లో శిబిరాలను ఏర్పాటు చేస్తుందేగానీ వ్యాధి సోకడానికి గల కారణాలను ప్రజలకు తెలియజేయలేకపోతోంది. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారులు వెంటనే స్పందించి రెండు గ్రామాల్లో వ్యాధి అదుపులోకి వచ్చేవరకు శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవలందించాల్సిన అవసరముంది.