బస్సుల్ని ఢీకొన్న ఇన్నోవా.. ముగ్గురి మృతి
♦ ఏడుగురికి తీవ్ర గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
♦ మృతులు, క్షతగాత్రులందరూ హైదరాబాద్ వాసులే
♦ మిత్రుడి పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం
అడ్డాకుల (దేవరకద్ర): జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సులను ఇన్నోవా వాహనం ఢీకొ ట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాల య్యారు. మిత్రుడి పెళ్లికి వెళ్తుండగా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ స్టేజీ సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని ఫలక్ నుమాకు చెందిన టైలర్ షేక్ అఫ్రోజ్‌కు ఏపీలోని చిత్తూరు జిల్లా ములకల్ చెరువు మండలం బి.కొత్తకోటకు చెందిన యువతితో బుధవారం ఉదయం వివాహం జరగాల్సి ఉం ది. పెళ్లికని అఫ్రోజ్ స్నేహితులు 10 మంది ఇన్నోవాలో బయలుదేరారు. శాఖాపూర్ టోల్ ప్లాజా దాటిన కొన్ని క్షణాల్లోనే గుడిబండ స్టేజీ సమీపంలో ముందు వెళ్తున్న లారీని దాటే ప్రయత్నంలో ఇన్నోవా అదుపు తప్పింది.
రోడ్డు కిందకు దూసుకెళ్లి హోటల్ ముందు ఆగి ఉన్న రెండు బస్సులను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇన్నోవా డ్రైవర్ షేక్ మహ్మద్ పాషా(27), ముందు సీట్లో కూర్చున్న షేక్ ముబారక్ (22) అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చున్న షేక్‌బాబా (25) బుధవారం ఉదయం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మృత్యువాత పడ్డాడు. మిగతావారికి తీవ్ర గాయా లయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలి పారు. కాగా, వాహనం సీటులో ఇరుక్కు పోయిన మహ్మద్ పాషా మృతదేహాన్ని పోలీసు లు రెండు గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. స్నేహితుల మృతదేహాలను చూసి రోదిస్తున్న పెళ్లికుమారుడు అఫ్రోజ్, ఆయన తల్లిదండ్రులకు సర్దిచెప్పి పెళ్లికి పంపించారు. మృతులంతా ఫలక్‌నుమా ప్రాంతవాసులే.