ఆరుగంటల్లోనే.. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం
మధ్యాహ్నం 12.30కు పనులు ప్రారంభం..
సాయంత్రం 6.30కు పూర్తి
దేవరకద్ర: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంతో పాటు భారీ యంత్ర సామగ్రితో రూ. రెండు కోట్ల విలువైన రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు కేవలం ఆరు గంటల్లోనే పూర్తి చేశారు. అది కూడా ఆరు గంటల పాటు ఆ మార్గంలో రైళ్లను నిలిపివేసి పనులు పూర్తి చేశారు. ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర వద్ద జరిగింది.
దేవరకద్ర సమీపంలోని డోకూర్ వెళ్లే రహదారిపై ఉన్న 75వ నంబర్ కాపలాలేని రైల్వే గేటు వద్ద మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు పనులు ప్రారంభించి సాయంత్రం 6.30 గంటలకు రైళ్ల రాకపోకలు సాగించారు.