కశ్మీర్‌ టు కన్యాకుమారికి సైకిల్‌యాత్ర  | Cycling From Kashmir To Kanyakumari For Social Awareness | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌ టు కన్యాకుమారికి సైకిల్‌యాత్ర 

Sep 12 2019 7:04 AM | Updated on Sep 12 2019 7:46 AM

Cycling From Kashmir To Kanyakumari For Social Awareness - Sakshi

సంతోష్‌కుమార్‌కు స్వాగతం పలుకుతున్న నాయకులు

సాక్షి, అడ్డాకుల (దేవరకద్ర): యువజన కాంగ్రెస్‌ జాతీ య కార్యదర్శి కోల్‌కుందా సంతోష్‌కుమార్‌ చేపట్టిన సైకిల్‌యాత్ర బుధవారం మండలానికి చేరుకుంది.  వికారాబాద్‌ ప్రాంతానికి చెందిన సం తోష్‌కుమార్‌ ఆగస్టు 15న కశ్మీర్‌లో సైకిల్‌యాత్రను చేపట్టాడు. 28 రోజులుగా సాగుతున్న యాత్ర మండలంలోని హైవేపై కొనసాగింది. అడ్డాకుల వద్ద సంతోష్‌కుమార్‌కు స్థానిక కాంగ్రెస్‌ నేతలు ఘనస్వాగతం పలికారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొండా జగదీశ్వర్, నాయకులు గంగుల విజయమోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శేఖ ర్‌రెడ్డి, సయ్యద్‌షఫి, సాయిలు, రాములు తదితరులు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.

మనది భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశమన్నారు. దీన్ని ప్రచారం చేయాలన్న సంకల్పం తోనే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌యాత్ర చేపట్టినట్లు తెలిపారు. విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై ప్రచారం కూడా చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా యువత ఆలోచన విధానం గురించి తెలుసుకుంటున్నట్లు తెలిపా రు. ప్రతి రోజు 100కిలోమీటర్ల దూరం సైకిల్‌యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. గాంధీ జయంతి నాటికి కన్యాకుమారి చేరుకుంటానని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement