Addakula
-
అడ్డాకులకు అదిరే ధర
సాక్షి,పాడేరు : ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా ఉన్న అడ్డాకుల సేకరణతో గిరిజన రైతులు పూర్వం నుంచి జీవనోపాధి పొందుతున్నారు. గత రెండేళ్ల నుంచి అడ్డాకులకు డిమాండ్ నెలకొనడంతో వ్యాపారులు గిరిజనుల నుంచి పోటీపోటీగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం సీజన్ కావడంతో వారపు సంతలో కనీసం రూ.3 లక్షల మేర వ్యాపారం జరుగుతోంది. రెండు దిండ్లు అడ్డాకులు రూ.1800 నుంచి రూ.2 వేలకు కొనుగోలు చేస్తున్నారు. పాడేరు డివిజన్ పరిధిలో సుంకరమెట్ట, అరకు, కించుమండ, హుకుంపేట, జి.మాడుగుల, వంట్లమామిడి, మద్దిగరువు, తాజంగి, అన్నవరం, చింతపల్లి, లోతుగెడ్డ వారపుసంతల్లో రెండు వారాల నుంచి అడ్డాకుల వ్యాపారం భారీగా జరుగుతోంది. మైదాన ప్రాంత వ్యాపారులు.. ఏజెన్సీలో వారపు సంతల్లో నర్సీపట్నం, వడ్డాది, రావికమతం, కొత్తకోట, రోలుగుంట, ఎస్.కోట, విజయనగరం ప్రాంతాలకు చెందిన వ్యాపారులంతా పోటా పోటీగానే అడ్డాకులను కొనుగోలు చేస్తుండటంతో గిరిజనులకు మంచి ధర లభిస్తోంది. ఈ ఆదివారం పాడేరు మండలం వంట్లమామిడి, అరకులోయ మండలం సుంకరమెట్ట వారపుసంతల్లో అడ్డాకుల వ్యాపారం భారీగానే జరిగింది. ఈ రెండు సంతల్లోను కనీసం రూ.8లక్షల మేర విక్రయాలు జరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. వందలాది కుటుంబాలకు ఉపాధి ఏజెన్సీలోని గిరిజన రైతుల వద్ద సీజన్లో రూ.20 నుంచి రూ.30 వేలకు పైగా ఆదాయం సీజన్ ముగిసే లోపు ఒక్కో కుటుంబం కనీసం రూ.20వేల నుంచి 30వేల వరకు అడ్డాకుల అమ్మకాల ద్వారా ఆదాయాన్ని అర్జిస్తున్నాయి. గతంలో గిరిజన సహకార సంస్థ అడ్డాకులను కిలోల రూపంలో కొనుగోలు చేసేది. అడ్డాకుల వినియోగం అప్పట్లో తగ్గడం, ప్రైవేటు వ్యాపారుల నుంచి ఆదరణ కరువవడంతో పదేళ్ల నుంచి అడ్డాకులను జీసీసీ కొనుగోలు చేయడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తుండడంతో అడ్డాకులకు మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశాలున్నాయి. గిరి రైతులకు అడ్డాకులు సిరులు కురిపిస్తున్నాయి. మార్కెటఖ పరిస్థితులు కలిసి రావ డంతో రెండేళ్ల నుంచి మెరుగైన ఆదాయం పొందుతున్నారు. ఈ ఏడాది వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేయడంతో గిరిజనులకు ఊహించని ధర లభించింది. దీనికి తోడు ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుండటంతో ఆదాయం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. -
కశ్మీర్ టు కన్యాకుమారికి సైకిల్‌యాత్ర
సాక్షి, అడ్డాకుల (దేవరకద్ర): యువజన కాంగ్రెస్ జాతీ య కార్యదర్శి కోల్‌కుందా సంతోష్‌కుమార్ చేపట్టిన సైకిల్‌యాత్ర బుధవారం మండలానికి చేరుకుంది. వికారాబాద్ ప్రాంతానికి చెందిన సం తోష్కుమార్ ఆగస్టు 15న కశ్మీర్లో సైకిల్‌యాత్రను చేపట్టాడు. 28 రోజులుగా సాగుతున్న యాత్ర మండలంలోని హైవేపై కొనసాగింది. అడ్డాకుల వద్ద సంతోష్‌కుమార్‌కు స్థానిక కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొండా జగదీశ్వర్, నాయకులు గంగుల విజయమోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శేఖ ర్‌రెడ్డి, సయ్యద్‌షఫి, సాయిలు, రాములు తదితరులు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. మనది భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశమన్నారు. దీన్ని ప్రచారం చేయాలన్న సంకల్పం తోనే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌యాత్ర చేపట్టినట్లు తెలిపారు. విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై ప్రచారం కూడా చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా యువత ఆలోచన విధానం గురించి తెలుసుకుంటున్నట్లు తెలిపా రు. ప్రతి రోజు 100కిలోమీటర్ల దూరం సైకిల్‌యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. గాంధీ జయంతి నాటికి కన్యాకుమారి చేరుకుంటానని పేర్కొన్నారు. -
పొదుపునకు ‘అడ్డా’కుల!
సాక్షి, అడ్డాకుల: అడ్డాకుల పొదుపు సంఘాలు ఆదర్శవంతంగా ముందుకు సాగుతున్నాయి. సంఘాల్లో డబ్బు జమ చేయడంతో పాటు రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్న వారు ఎక్కువే ఉన్నారు. రుణాల వసూళ్లలోనూ ఆదర్శం ప్రదర్శిస్తున్నారు. అడ్డాకుల మండలంలో పొదుపు సంఘాలను పరిశీలించడానికి ఇతర రాష్ట్రాల నుంచి స్వయం సహాయక బృందాలు ఇక్కడికొస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాకు చెందిన 40మంది మహిళా సంఘం సభ్యులు అడ్డాకుల, పొన్నకల్ గ్రామాల్లో పర్యటించి వెళ్లారు. ఫిబ్రవరి 23నుంచి 26వరకు రెండు గ్రామాల్లోని పొదుపు సం ఘాలను పరిశీలించి సంఘాల్లో రుణాలు తీసుకున్న వారు చేపట్టిన వ్యాపారాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మూడు రోజులుగా రెండో బృందం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని షామిలీ జిల్లాకు చెందిన 20మంది సభ్యుల బృందం మూడు రోజులుగా అడ్డాకులలో పర్యటిస్తోంది. ఇక్కడి మహిళా సంఘాలను పరిశీలించి సభ్యులతో వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక్కడ మహిళా సంఘాలను ఎలా ముందుకు నడిపిస్తున్నారని పాఠాలు నేర్చుకుంటున్నారు. తమ వద్ద ఇప్పుడిప్పుడే మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటిని ఎలా ముందుకు నడిపిస్తే బాగుంటుందని క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు. పొదుపు సంఘాల ఏర్పాటు, గ్రామైఖ్య సంఘాల బాధ్యతలు, రుణాల మంజూరు, చెల్లింపులతో పాటు రుణాలు తీసుకుని ఉపాధి పొందుతున్న వివరాలను డీపీఎం కరుణాకర్, ఏపీఎం సుధీర్‌కుమార్ యూపీ బృందానికి వివరిస్తున్నారు. పొదుపు సంఘాలను బలోపేతం చేయడంతో మండల మహిళా సమాఖ్య, జిల్లా మహిళా సమాఖ్య పాత్రపై క్షుణ్ణంగా వివరిస్తున్నారు. పొదుపు సంఘాలకు సంబంధించిన రికార్డులను చూయించి అవగాహన కల్పిస్తున్నారు. మా దగ్గర ఇప్పుడే మొదలు.. మా దగ్గర పొ దుపు సంఘాలను ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నాం. ఇ క్కడ పొదుపు సంఘాలు చాలా చక్కగా పని చేస్తున్నందున పరిశీ లించడానికి వచ్చాం. డబ్బు పొదు పు చేయడమే కాకుండా వ్యాపారాలను అభివృద్ధి చేస్తున్నారు. – ప్రతిభ, షామిలీ జిల్లా, ఉత్తరప్రదేశ్ అవగాహన కోసం వస్తున్నారు మహిళా సంఘాలు మన దగ్గర అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో సంఘాలు ఇంత బలోపేతం కాలేదు. అందుకే మన సంఘాల పని తీరుపై అవగాహన కోసం ఇక్కడికి వస్తున్నారు. వారికి అన్ని విషయాలను క్షుణ్ణంగా వివరిస్తున్నాం. – కరుణాకర్, డీపీఎం -
కారుపై మహిళ మృతదేహంతో..
-
కారుపై మహిళ మృతదేహంతో..
అడ్డాకుల(మహబూబ్‌నగర్ జిల్లా): అడ్డాకుల శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు..మహబూబ్‌నగర్ రూరల్ మండలం గాజులపేట గ్రామానికి చెందిన తూర్పు మహేశ్వరమ్మ(46), సిద్ధిలింగం దంపతులు వనపర్తిలో ఉన్న కూతురు ఇంటికి టీవీస్ మోపెడ్ వాహనంపై వెళ్తున్నారు. అడ్డాకుల దాటగానే వెనక నుంచి వస్తున్న ఓ కారు వీరిని ఢీకొట్టింది. మహేశ్వరమ్మ కారు ముందుభాగంలో చిక్కుకుపోయింది. సుమారు 2 కి.మీలు అలానే కారు ఆమెను లాక్కొని పోయింది. స్థానికులు గమనించి కారును వెంబడించడంతో నిందితులు కారును వదిలి పరారయ్యారు. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతిచెందగా..ఆమె భర్తకు తీవ్రగాయాలయ్యాయి. భర్తను మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రక్ పార్కింగ్ జోన్ పరిశీలన
అడ్డాకుల : మండలంలోని కొమిరెడ్డిపల్లి సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు (ట్రక్ పార్కింగ్ జోన్) ను బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. ఈనెల 12 నుంచి కృష్ణా పుష్కరాలు మొదలు కానున్న నేపథ్యంలో వాహనాల్లో వెళ్లే భక్తులు ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేయించాలని ఆయన యోచిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లను తొలగించాలని పోలీసులకు సూచించారు. ఈ రోడ్డును అందుబాటులోకి తీసుకురావడంతోపాటు ఇక్కడ ఆగే భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. ఉచితంగా అల్పాహారం అందించాలని స్థానిక నాయకులకు సూచించారు. భక్తులకు సర్వీస్ రోడ్డుపై కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తే హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వాహనాలు నిలిపే అవకాశం ఉందని నాయకులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు మున్నూర్ శ్రీకాంత్, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, టీఆర్ఎస్ మండల నాయకులు పల్లె శ్రీనివాస్‌రెడ్డి, రమేష్‌గౌడ్, చల్మారెడ్డి, కృష్ణారెడ్డి, శివరాములు, శ్రీశైలం పాల్గొన్నారు. -
కొనసాగుతున్న రిలే దీక్షలు
అడ్డాకుల : ఎస్సీ ధ్రువీకరణ పత్రాల కోసం దళితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం కొనసాగాయి. మండల కేంద్రంలో నివసించే దళితులకు ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని చేపట్టిన రిలే దీక్షలు 28వ రోజుకు చేరుకున్నాయి. 14 ఏళ్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని దళితులు వాపోయారు. విద్యా, ఉద్యోగాల్లో తమ పిల్లలు తీరని అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో రిజర్వేషన్ల పరంగా అందాల్సిన పదువులు అందకుండా పోతున్నాయని చెప్పారు. ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ధ్రువీకరణపత్రాలు జారీ చేసే వరకు రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తామని తెలిపారు. దీక్షల్లో చంద్రం, బుచ్చన్న, శేఖర్, రాజు, సాయిలు, శలవంద, టోనీ, చంద్రశేఖర్, దేవదానం, బాల్‌రాజు తదితరులు ఉన్నారు. -
నిత్యం నెత్తుటి మరకలేనా?
హైవేపై నిత్యం నెత్తుటి మరకలు అంటుతూనే ఉన్నాయి.. దీనికి సమీపంలోని స్టేజీలు, మలుపుల వద్ద ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి.. దీనిపై ప్రయాణం చేయడానికి భయపడే రోజులు దాపురిస్తున్నాయి.. ఈ నెల 27వ తేదీ తెల్లవారుజామున అడ్డాకుల మండలం కొమిరెడ్డిపల్లి వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం ఏడుగురిని కబలించిన విషయం విదితమే.. ఈఘటన జాతీయ రహదారి నిర్వహణకు సంబంధించి కొత్త అనుమానాలకు తావిస్తోంది.. - అడ్డాకుల అడ్డాకుల: ఇంతకుముందు రెండు రోడ్లకు మధ్యన ఉన్న కల్వర్టు కాస్తా ఎత్తుతో ఉండటంతో వేగంగా వెళ్లే వాహనాలు అదుపుతప్పినా అదే రోడ్డులో బోల్తాపడేవి. దీనివల్ల అదుపుతప్పిన వాహనం మాత్రమే ప్రమాదానికి కారణమయ్యేది. అయితే ఇటీవల హైవేపై మళ్లీ కొత్తగా తారురోడ్డు వేశారు. సుమారు 10సెంటీమీటర్ల మందం వరకు కొత్తగా వే శారు. తద్వారా కొత్త రోడ్డు కొంత ఎత్తు పెరిగినట్లయింది. దీంతో ఇంతకుముందు ఉన్న డివైడర్ ఎత్తు తగ్గిపోయింది. దీంతో వాహనాలు అదుపుతప్పితే డివైడర్‌ను ఎక్కడం సులభవుతోందని వివిధ వాహన డ్రైవర్లు చెబుతున్నారు. కొమిరెడ్డిపల్లి వద్ద టవేరా అదుపుతప్పినప్పుడు రోడ్డు పక్కన ఉన్న డివైడర్ తక్కువ ఎత్తులో ఉండటం వల్లే సులభంగా పెకైక్కి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో మరోసారి రోడ్డు నిర్వహణపై చర్చ మొదలైంది. గతంలో పాలెం వద్ద వోల్వో బస్సు కల్వర్టును ఢీకొన్నప్పుడు కల్వర్టు నిర్మాణంపై పెద్దఎత్తున దూమారం చెలరేగింది. ఆ తర్వాత సదరు రోడ్డు నిర్వహణ సంస్థ తమ పరిధిలోని కల్వర్టుల వద్ద మరమ్మతు చేపట్టారు. మళ్లీ ఇప్పుడు కొమిరెడ్డిపల్లి వద్ద టవేరా డివైడర్‌ను సులువుగా దాటి పక్కరోడ్డు పైకి దూసుకెళ్లడంతో వాహనచోదకులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకుముందు డబుల్‌లైన్ రోడ్డు ఉన్నప్పుడు మాత్రమే ఎదురెదురుగా వాహనాలు ప్రమాదాలకు గురయ్యేవి. కాని నాలుగు లైన్ల రోడ్డు వేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు వాహనాలు ఎదురెదురుగా ప్రమాదాలకు గురవడం అందరినీ కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కొమిరెడ్డిపల్లి సమీపంలో ఉన్న కోళ్లఫారాల వద్ద రాత్రివేళ ఇసుక డీసీఎంలు డివైడర్‌పై దాటి రోడ్డును క్రాస్ చేస్తుండటం దీనికి బలం చేకూరుస్తోంది. పాతరోడ్డుపై కొత్తగా తారు వేసేటప్పుడు డివైడర్ ఎత్తును కొంత పెంచి ఉంటే ఒక రోడ్డుపై అదుపుతప్పే వాహనాలు మరోదానిపైకి దూసుకెళ్లే అవకాశాలు ఉండవని వారు అభిప్రాయపడుతున్నారు. ఫలితమివ్వని నివారణ చర్యలు హైవే సమీపంలోని స్టేజీలు, మలుపుల వద్ద ప్రమాదాల నివారణకు సదరు రోడ్డు నిర్వాహణ సంస్థ చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం కనిపించడంలేదు. జాతీయ రహదారి 44 నంబర్‌పై వేముల, మూసాపేట, అడ్డాకుల, అచ్చాయపల్లి, చక్రాపూర్ స్టేజీల వద్ద వాహనాలు రోడ్డు క్రాస్ చేసే సమయంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ స్టేజీల వద్ద ముఖ్యంగా ద్విచక్రవాహనాలే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు పక్కరోడ్డుపై వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితుల బంధువులు రాస్తారోకోలు, ధర్నాలు చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అయితే సదరు స్టేజీల వద్ద ప్రమాదాల నివారణకు రోడ్డు నిర్వహణ సంస్థ కూడా చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. అడ్డాకుల వద్ద డివైడర్‌పై ఎక్కడపడితే అక్కడ మనుషులు రోడ్డు దాటకుండా రక్షణ కంచె సైతం ఏర్పాటు చేయించారు. -
అడ్డాకుల వద్ద బంగారం, వెండి పట్టివేత
మహబూబ్‌నగర్: ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల వద్ద వాహనాల తనిఖీల్లో బంగారం, వెండి బయటపడింది. ఈ సందర్భంగా 834 గ్రాముల బంగారం, 8,378 గ్రాముల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం
అడ్డాకుల, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణలోని కాం ట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే విధంగా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్వీఎం ద్వారా జిల్లాలో పని చేస్తున్న సీఆర్పీలు, ఐఈఆర్టీ, సీఆర్టీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, డీఎల్ఎంటీలు, మెసేంజర్లు, తాత్కాలిక శిక్షకుల సర్వసభ్య సమావేశం మండల పరిధిలోని మూసాపేట వద్ద వీహాన్ స్కూల్లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జితేందర్‌రెడ్డితో పాటు టీ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయిస్తామని కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. సీమాంధ్రలో పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు రారని, తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉందన్నారు. పరిశ్రమలు ఎక్కువగా పాల మూరు జిల్లాకు రానున్నాయని, వాటితో ఇక్కడ నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పారు. ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. కేసీఆర్‌తోనే తెలంగాణ ప్రాం తం పూర్తి అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో నిర్వహిస్తున్న టెట్‌ను రద్దు చేయాలని టీ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షడు హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్, డిగ్రీ మార్కుల ఆధారంగా టీటీసీ, బీఈడీ సీట్లు కేటాయిస్తారని, ఇక్కడ మాత్రం అన్ని ప్రవేశాలకు పరీక్షలను నిర్వహిం చడం సోచనీయమన్నారు. టెట్‌ను రద్దు చేస్తామనే ప్రకటన టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు కృష్ణారెడ్డి, మొగులయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు -
వోల్వో బస్సులో చెలరేగిన మంటలు
మహబూబ్‌నగర్ : మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సు దుర్ఘటన మరవక ముందే మరో వోల్వో బస్సులో మంటల చెలరేగాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సులో మంటలు వచ్చాయి. అడ్డాకుల మండలం టోల్గేట్ వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సులో మంటలు రావటంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. బస్సు డ్రైవర్ బస్సును నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇసుక స్థావరాలపై దాడులు
లారీ, డీసీఎం, జేసీబీ పట్టివేత అడ్డాకుల, న్యూస్‌లైన్ : అక్రమంగా నిల్వ ఉంచుతున్న, రవాణా చేస్తున్న ఇసుక స్థావరాలపై పోలీసులు కొరడా ఝులిపించారు. మండలంలోని పెద్దవాగు నుంచి గుట్టుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను కొత్తకోట సీఐ రమేష్‌బాబు అడ్డుకున్నారు. పక్కా సమాచారంతో ఆదివారం రాత్రి వాగు వద్ద ఇసుకాసురులపై మెరుపు దాడి చేశారు. దుబ్బపల్లి సమీపంలోని పెద్దవాగు వద్ద కొన్నాళ్ల నుంచి రాత్రి వేళ అక్రమంగా ఇసుక రవాణా సాగుతోంది. రాత్రి వేళ యంత్రాలను వినియోగించి లారీలు, చిన్న డీసీఎంలతో వాగులోంచి నేరుగా అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో సీఐ తన సిబ్బందితో కలిసి దాడులకు దిగారు. ఆ సమయంలో ఇసుకను తవ్వుతున్న, రవాణా అవుతున్న లారీ, మినీ డీసీఎం, జేసీబీని పట్టుకుని అడ్డాకుల పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చే యాలని ఎస్ఐ ముత్తినేని వెంకటేశ్వర్లుకు ఆదేశించారు. మూడు ట్రాక్టర్ల పట్టివేత పెద్దకొత్తపల్లి : మండలంలోని యాపట్ల వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్టు ఎస్ఐ సైదులు తెలిపారు. భాస్కర్‌రెడ్డికి చెంది న ట్రాక్టర్ ఏపీ 22 ఏఎన్1529, యాదగిరికి చెందిన ట్రాక్టర్ ఏపీ 22 1047, హన్మంతురెడ్డి ఏపీ 28 2189 ట్రాక్టర్ల ద్వారా ఆదివారం రాత్రి యాపట్ల వాగు నుంచి ఇసుక తరలిస్తుండగా పెద్దకారుపాముల వద్ద పట్టుకున్నట్టు చెప్పారు. అనంతరం ఇసుక ట్రాక్టర్లను పోలీసుస్టేషన్‌కు తరలించి యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.