మహబూబ్నగర్: ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల వద్ద వాహనాల తనిఖీల్లో బంగారం, వెండి బయటపడింది. ఈ సందర్భంగా 834 గ్రాముల బంగారం, 8,378 గ్రాముల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.