ట్రక్ పార్కింగ్ జోన్ పరిశీలన
Published Thu, Aug 4 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
అడ్డాకుల : మండలంలోని కొమిరెడ్డిపల్లి సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు (ట్రక్ పార్కింగ్ జోన్) ను బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. ఈనెల 12 నుంచి కృష్ణా పుష్కరాలు మొదలు కానున్న నేపథ్యంలో వాహనాల్లో వెళ్లే భక్తులు ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేయించాలని ఆయన యోచిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లను తొలగించాలని పోలీసులకు సూచించారు. ఈ రోడ్డును అందుబాటులోకి తీసుకురావడంతోపాటు ఇక్కడ ఆగే భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. ఉచితంగా అల్పాహారం అందించాలని స్థానిక నాయకులకు సూచించారు. భక్తులకు సర్వీస్ రోడ్డుపై కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తే హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వాహనాలు నిలిపే అవకాశం ఉందని నాయకులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు మున్నూర్ శ్రీకాంత్, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, టీఆర్‌ఎస్ మండల నాయకులు పల్లె శ్రీనివాస్‌రెడ్డి, రమేష్‌గౌడ్, చల్మారెడ్డి, కృష్ణారెడ్డి, శివరాములు, శ్రీశైలం పాల్గొన్నారు.
Advertisement
Advertisement