అడ్డాకులలో దీక్షలు చేస్తున్న దళితులు
కొనసాగుతున్న రిలే దీక్షలు
Published Sun, Jul 24 2016 6:24 PM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM
అడ్డాకుల : ఎస్సీ ధ్రువీకరణ పత్రాల కోసం దళితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం కొనసాగాయి. మండల కేంద్రంలో నివసించే దళితులకు ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని చేపట్టిన రిలే దీక్షలు 28వ రోజుకు చేరుకున్నాయి. 14 ఏళ్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని దళితులు వాపోయారు. విద్యా, ఉద్యోగాల్లో తమ పిల్లలు తీరని అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో రిజర్వేషన్ల పరంగా అందాల్సిన పదువులు అందకుండా పోతున్నాయని చెప్పారు. ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ధ్రువీకరణపత్రాలు జారీ చేసే వరకు రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తామని తెలిపారు. దీక్షల్లో చంద్రం, బుచ్చన్న, శేఖర్, రాజు, సాయిలు, శలవంద, టోనీ, చంద్రశేఖర్, దేవదానం, బాల్‌రాజు తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement