relay
-
కులవాదులను తరిమికొడతాం
తాడికొండ: ఒక సామాజికవర్గానికి చెందిన వారికే రాష్ట్రాన్ని దోచిపెట్టి, పేదల హక్కులను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్న చంద్రబాబు అండ్‌కోను రాజకీయంగా తరిమికొడతామని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శనివారం నాటికి 1,168వ రోజుకు చేరుకున్నాయి. పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓ సామాజికవర్గమంతా కట్టగట్టుకుని కోల్పోయిన అధికారాన్ని తెచ్చుకునేందుకు చేస్తున్న ఆగడాలు బహుజనులను హక్కులకు దూరం చేస్తున్నాయని మండిపడ్డారు. పేదవారికి ఇళ్ల స్థలాలు, ఇల్లు అందకుండా తప్పుడు కేసులు వేసిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పేదలకు ఇంగ్లిష్ మీడియం విద్య, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా సమాన హక్కులు పొందకుండా బాబు అండ్ కో అడ్డుకుంటున్నారన్నారు. రాజధాని పేరుతో రూ.3.50 లక్షల కోట్లు దోపిడీ చేసిన చంద్రబాబు కోర్టుల ద్వారా బెయిల్ తెచ్చుకుని అధికారం కోసం రోడ్ల వెంబడి తిరుగుతూ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. పలు కుంభకోణాల్లో నిందితుడు, ఆర్థిక ఉగ్రవాది చంద్రబాబును వెంటనే అరెస్టు చేసి జైలులో పెట్టి తమకు రక్షణ కల్పించాలని కోరారు. ప్యాకేజీ ఇస్తేగానీ బయటకు రాని పవన్‌కళ్యాణ్ రాష్ట్రంలో పోటీ చేస్తే.. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. నాయకులు ఏటూరి ఆదాం, మాదిగాని గురునాధం, పులి దాసు, కారుమూరి పుష్పరాజు, నూతక్కి జోషి తదితరులు పాల్గొన్నారు. -
ఓటు దొంగలు.. బాబు అండ్‌కో
తాడికొండ: ఎన్నికలు సమీపిస్తుండడంతో బహుజనుల ఓట్లు దోచుకునేందుకు రాష్ట్రంలో బాబు అండ్ కో బ్యాచ్ అడ్డగోలుగా తిరుగుతుందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 1,049వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో శనివారం పలువురు మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో పక్క రాష్ట్రంలో దాక్కున్న పలు పార్టీల నాయకులు ఇప్పుడు ఓట్లు వేయించుకునేందుకు బహుజనులకు వల విసురుతున్నారన్నారు.14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేదలకు ఏం చేశాడో చెప్పి ప్రజల్లోకి రావాలని లేకుంటే తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బహుజనుల కలలు సాకారం చేస్తుంటే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ చూడలేక కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సుపుత్రుడు లోకేశ్, దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్, బీజేపీలోని బాబు బంధువు పురందేశ్వరి.. బాబును గద్దెనెక్కించేందుకే ఎల్లో మీడియాతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కులమతాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్న చంద్రబాబు.. అన్ని ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించేందుకు పావులు కదుపుతున్నాడని చెప్పారు. రిలే నిరాహార దీక్షలో సమితి నాయకులు కారుమూరి పుష్పరాజు, బేతపూడి సాంబయ్య, పులి దాసు, మాదిగాని గురునాథం, ఈపూరి ఆదాం, నూతక్కి జోషి తదితరులు పాల్గొన్నారు. రిలే దీక్షలో బహుజన నేతలు -
టోక్యో: భారత బృందం ఆసియా రికార్డు.. కానీ
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన అథ్లెటిక్స్ ఈవెంట్లో భారత పురుషుల రిలే జట్టు 4X400 మీటర్ల విభాగంలో కొత్త ఆసియా రికార్డు నెలకొల్పింది. అనస్ యాహియా, టామ్ నోవా నిర్మల్, రాజీవ్ అరోకియా, అమోజ్ జాకబ్‌లతో కూడిన భారత రిలే జట్టు రెండో హీట్‌లో 3ని:00.25 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 3ని:00.56 సెకన్లతో ఖతర్ జట్టు పేరిట ఉన్న ఆసియా రికార్డును భారత బృందం సవరించింది. అయితే భారత జట్టు నాలుగో స్థానంలో నిలవడంతో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. మరోవైపు మహిళల 20 కిలోమీటర్ల నడక రేసులో భారత వాకర్స్ ప్రియాంక గోస్వామి 17వ స్థానంలో... భావన జాట్ 32వ స్థానంలో నిలిచారు. #IND's 4x400m relay team set a new Asian record at the #Olympics! 😱 Watch Amoj Jacob's finishing blitz that helped India finish fourth in heat 2 and sprint straight into the history books. 🙌#StrongerTogether | #UnitedByEmotion | #Tokyo2020 | #BestOfTokyo pic.twitter.com/gdDYPX2RLD — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 6, 2021 -
కొనసాగుతున్న రిలే దీక్షలు
అడ్డాకుల : ఎస్సీ ధ్రువీకరణ పత్రాల కోసం దళితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం కొనసాగాయి. మండల కేంద్రంలో నివసించే దళితులకు ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని చేపట్టిన రిలే దీక్షలు 28వ రోజుకు చేరుకున్నాయి. 14 ఏళ్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని దళితులు వాపోయారు. విద్యా, ఉద్యోగాల్లో తమ పిల్లలు తీరని అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో రిజర్వేషన్ల పరంగా అందాల్సిన పదువులు అందకుండా పోతున్నాయని చెప్పారు. ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ధ్రువీకరణపత్రాలు జారీ చేసే వరకు రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తామని తెలిపారు. దీక్షల్లో చంద్రం, బుచ్చన్న, శేఖర్, రాజు, సాయిలు, శలవంద, టోనీ, చంద్రశేఖర్, దేవదానం, బాల్‌రాజు తదితరులు ఉన్నారు. -
హైకోర్టు విభజన కోరుతూ లాయర్ల రిలే దీక్షలు
హైదరాబాద్: హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. హైకోర్టు విభజనకు కమిటీ వేసి వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ చైర్మన్ ఎం.రాజేందర్‌రెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడ పురానీహవేలిలోని సిటీ సివిల్ కోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో కోర్టు గేటు బయట చేపట్టిన రిలే నిరాహారదీక్షలను వారు ప్రారంభించారు. అనంతరం జూలై ఒకటో తేదీన నిర్వహించే ‘చలో హైదరాబాద్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ సీమాంధ్ర జడ్జీలు ఇచ్చిన ఆప్షన్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాము చేపట్టిన నిరసనకు మద్దతుగా జ్యుడీషియల్ ఆఫీసర్లు గవర్నర్‌ను కలసి రాజీనామాపత్రాలు అందజేశారని చెప్పారు. జూలై 1వ తేదీ వరకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కో-కన్వీనర్లు ఎ.మాణిక్‌ప్రభు గౌడ్, ఎం.ఎస్.తిరుమల్‌రావు, సిటీ సివిల్‌కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కరాజు హరిరావు, మాజీ అధ్యక్షుడు విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పురానీహవేలి సిటీ సివిల్ కోర్టు న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహారదీక్షను పురస్కరించుకొని పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. -
ఏపీలో ప్రత్యేక హోదా కోసం 2వ రోజు రిలే దీక్షలు