పురుషుల రిలే జట్టు(ఫొటో: ఐఓఏ)
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన అథ్లెటిక్స్ ఈవెంట్‌లో భారత పురుషుల రిలే జట్టు 4X400 మీటర్ల విభాగంలో కొత్త ఆసియా రికార్డు నెలకొల్పింది. అనస్ యాహియా, టామ్ నోవా నిర్మల్, రాజీవ్ అరోకియా, అమోజ్ జాకబ్‌లతో కూడిన భారత రిలే జట్టు రెండో హీట్‌లో 3ని:00.25 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది.
ఈ క్రమంలో 3ని:00.56 సెకన్లతో ఖతర్ జట్టు పేరిట ఉన్న ఆసియా రికార్డును భారత బృందం సవరించింది. అయితే భారత జట్టు నాలుగో స్థానంలో నిలవడంతో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. మరోవైపు మహిళల 20 కిలోమీటర్ల నడక రేసులో భారత వాకర్స్ ప్రియాంక గోస్వామి 17వ స్థానంలో... భావన జాట్ 32వ స్థానంలో నిలిచారు.
#IND's 4x400m relay team set a new Asian record at the #Olympics! 😱
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 6, 2021
Watch Amoj Jacob's finishing blitz that helped India finish fourth in heat 2 and sprint straight into the history books. 🙌#StrongerTogether | #UnitedByEmotion | #Tokyo2020 | #BestOfTokyo pic.twitter.com/gdDYPX2RLD
Comments
Please login to add a commentAdd a comment