Deksha
-
రైతులను ఆదుకునే దాకా ఉద్యమిస్తాం
సాక్షి, హైదరాబాద్/ సిరిసిల్ల/ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/జహీరాబాద్: కరువు పరిస్థితులతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు దీక్షలు’ చేపట్టింది. పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ దీక్షలు నిర్వహించారు. రైతుల ధాన్యంకు ప్రతీ క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని.. అకాల వర్షాలు, వడగండ్లు, ఎండలతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.25వేలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేంత వరకు బీఆర్ఎస్ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సిరిసిల్లలో, మాజీ మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డిలో, జగదీశ్‌రెడ్డి సూర్యాపేటలో, గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా కేద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి వేల్పూరు క్రాస్‌రోడ్డు, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన దీక్షల్లో పాల్గొన్నారు. ఇక చెన్నూరులో మాజీ విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో రైతు దీక్షకు ఏర్పాట్లు చేయగా.. అనుమతిలేదటూ పోలీసులు టెంట్‌ను తొలగించారు. రాష్ట్రవ్యాప్తంగా మిగతా జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన దీక్షల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయారు: కేటీఆర్ వరికి రూ.500 బోనస్, నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. పరిహారం చెల్లించడానికి అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని, తాము మద్దతు ఇస్తామని చెప్పారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ రైతుదీక్షలో కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని, ఇప్పుడు గోస పడుతున్నారని వ్యాఖ్యానించారు. రైతుబంధు అందక, రుణమాఫీ కాక, పంటలు ఎండి రైతులు.. ప్రభుత్వ వ్రస్తోత్పత్తి ఆర్డర్లు రాక నేతన్నలు, దళితబంధు అందక దళితులు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఇలా రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆందోళనలో ఉన్నాయని పేర్కొన్నారు. సరిగా వర్షాలు పడక కరువు పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి శ్రీధర్‌బాబు అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ నివేదిక స్పష్టం చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 300 పిల్లర్లు ఉంటే.. రెండు, మూడు పిల్లర్లలో సమస్య వస్తే మొత్తం ప్రాజెక్టునే విఫలమంటూ కాంగ్రెస్ యాగీ చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కేసీఆర్‌ను బద్నాం చేసి, రాజకీయ లబ్ధి పొందేందుకే లక్షల ఎకరాల పంట పొలాలను ఎండబెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు రైతుభరోసా రూ.15వేలు, రూ.4వేల పెన్షన్, రూ.2లక్షల రుణమాఫీ పొందిన వాళ్లు కాంగ్రెస్‌కు ఓటేయాలని.. లేకుంటే బీఆర్ఎస్కు ఓటేయాలని పిలుపునిచ్చారు. సర్కారుకు మిషన్ భగీరథ నిర్వహించడం చేతగాక.. తాగునీటి కొరత వచ్చిందని ఆరోపించారు. తమ హయాంలో పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలను కాంగ్రెస్ సర్కారు ఇచ్చినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక బీజేపీ నేతలు రుణమాఫీ గురించి మాట్లాడటమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని విమర్శించారు. రైతులకు కన్నీళ్లే మిగిలాయి: హరీశ్‌రావు వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రెండు వందల మందికిపైగా రైతులు చనిపోయారని.. మంత్రులు కనీస పరామర్శకు రావడం లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతలకు కళ్లు నెత్తికెక్కాయని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో, జహీరాబాద్‌లో జరిగిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేక రైతులకు కన్నీళ్లే మిగిలాయన్నారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ కూడా మాట తప్పిందని, కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ పా ర్టీకి.. తుక్కుగూడ సభలో మేనిఫెస్టోను ప్రకటించే నైతికత ఎక్కడిదని ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు బోనస్, కౌలురైతులకు రూ.15 వేల ఆర్థిక సాయం వంటి హామీల అమలు ఏదని నిలదీశారు. రైతుబంధు డబ్బు జమ కాలేదనే వారిని చెప్పుతో కొట్టాలని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారని.. చెప్పులతో కొట్టించుకునేందుకే ప్రజ లు కాంగ్రెస్‌ను గెలిపించుకున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో కరెంట్, కాలువల్లో నీళ్లున్నాయని.. కాంగ్రెస్ రాగానే ఏమైపోయాయని హరీశ్‌రావు నిలదీశారు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 నగదు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ నేత లు ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తే చీపురు మడతపెట్టి తరమాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నారని చెప్పుకునేందుకు మంత్రి ఉత్తమ్‌కు సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు కేసీఆర్ జిల్లాల పర్యటన చేపడితేనే.. రాష్ట్ర బీజేపీ నేతలు కళ్లు తెరిచి, దీక్షలు చేపట్టారని విమర్శించారు. రాష్ట్ర బీజేపీ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. -
ఢిల్లీలో చంద్రబాబు దుబారా ఖర్చులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందంటూనే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అనేక దుబారా ఖర్చులకు పాల్పడుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు, వ్యక్తిగత పర్యటనలకు సైతం రాష్ట్ర ప్రభుత్వ నిధులనే విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. తాజాగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబు దీక్షకు సిద్ధమయ్యారు. ఈ దీక్షకు భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. ఢిల్లీ దీక్షకు జనాలను తరలించేందుకు రూ.10 కోట్లు ఖర్చు చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు, ఉద్యోగులను ఢిల్లీ తీసుకెళ్లెందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ దీక్ష కోసం రూ.1.12 కోట్లతో శ్రీకాకుళం, అనంతపురం నుంచి రెండు ప్రత్యేక రైళ్లును సిద్ధం చేశారు. అంతేకాక విమానాలు, ఇతర రవాణకు రూ.2 కోట్లు, భోజనాలు వసతులు పబ్లిసిటీకి రూ.8 కోట్లు కేటాయించినట్లు తెలిసింది. దీక్షకు ఉద్యోగులను భారీగా తరలించేందుకు ఉద్యోగ సంఘాలకు సీఎంవో టార్గెట్ కూడా ఇచ్చింది. ఇవేకాక గడిచిన నాలుగున్నరేళ్లలో ధర్మపోరాటదీక్షల పేరిట చంద్రబాబు ప్రభుత్వం భారీగా ప్రజధనాన్ని వృథా చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ఓట్లు దండుకోవడానికి చంద్రబాబు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేయడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ఆత్మకూరు టీడీపీలో హైడ్రామా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వారం రోజులుగా సాగుతున్న ఆత్మకూరు పంచాయితీకి సోమవారం తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరుపక్షాలు కొంత సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం, జిల్లా పరిణామాలపై సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో ఈ వ్యవహారాన్ని తాత్కాలికంగా సద్దుమణిగించారు. పార్టీ నేత కన్నబాబు దీక్ష విరమించడం, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి ఆత్మకూరులో పార్టీ సమావేశం నిర్వహించడం రెండూ జరిగిపోయాయి. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా సాగిన ఆత్మకూరు హైడ్రామా ఎపిసోడ్ చివరకు జిల్లా మంత్రుల మెడకు చుట్టుకుంది. జిల్లాలో ఇంత జరుగుతున్నా కనీసం మంత్రులు ఎందుకు జోక్యం చేసుకోలేదని పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు కన్నబాబుకు మొదటి నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మద్దతు ఇస్తుండగా, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డికి మరో మంత్రి పి.నారాయణ సహకరిస్తుండడంతో ఇద్దరు మంత్రుల తీరు పార్టీలో తీవ్ర చర్చనీయాశంగా మారింది. ఆదివారం రాత్రి కన్నబాబుతో మొదలైన మంతనాలు సోమవారం ఉదయం వరకు కొనసాగాయి. సామాజిక సమీకరణల నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతోపాటు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఇరువర్గాల మధ్య రాజీ చర్చలు సాగించారు. ఉదయం మంత్రి నారాయణ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి నివాసంలో భేటీ అయి మంతనాలు జరిపారు. ఈక్రమంలో పార్టీ ముఖ్యులు కన్నబాబును కూడా కలుపుకొని ముందుకెళదామని ప్రతిపాదించడం, దానికి ఆదాల అంగీకరించడంతో ఆ తర్వాత బీద రవిచంద్ర, రామకృష్ణ కన్నబాబుతో మాట్లాడి అంగీకరింపజేశారు. చివరకు మంత్రి నారాయణ వచ్చి కన్నబాబుతో ఆపిల్ తినిపించి దీక్ష విరమింపజేశారు. అక్కడి నుంచి మంత్రి నారాయణ, ఆదాల ప్రభాకరరెడ్డి, బీద రవిచంద్ర, కన్నబాబు అందరూ కలిసి వెళ్లి ఆత్మకూరులో సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ కూడా కన్నబాబు సభాధ్యక్షత వహించి నేతలందరినీ ఆదాల ప్రభాకరరెడ్డికి పరి చయం చేశారు. దీంతో వివాదాన్ని తాత్కాలికంగా ముగించారు. అయితే తెర వెనుక భారీ మంతనాలు మాత్రం కొనసాగడంతో వర్గపోరులో ఆధిపత్యం కోసం మంత్రి సోమిరెడ్డి వర్గం, మాజీ మంత్రి ఆదాల వర్గం తీవ్రంగా కసరత్తు చేశాయి. ఆదాల డౌన్ డౌన్ అంటూనే.. కన్నబాబు ఆమరణ దీక్ష పూర్తి సారాంశం పార్టీలో తనకి ప్రాధాన్యం ఇవ్వాలని, అందరినీ కలుపుకొని పోవాలనే అజెండాతో దీక్ష చేశారు. అయితే దీక్ష ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా ఆదాల నాయకత్వాన్ని వ్యతిరేకించడమే అజెండాగా కనిపించింది. సేవ్ టీడీపీ, ఆదాల డౌన్‌డౌన్ అంటూ నినాదాలు ఇచ్చారు. కానీ చివరికి ఆదాలతో కలిసి ఆత్మకూరు వెళ్లటం గమనార్హం. పార్టీ ముఖ్యలపై అధిష్టానం సీరియస్ పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్ష నిర్వహించడాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుని కన్నబాబు తీరుపై మండిపడినట్లు సమాచారం. జిల్లాలో ఇదంతా జరుగుతున్నా సమన్వయం చేయాల్సిన మంత్రులు ఇలా చెరో గ్రూప్‌లో ఉంటూ రాజకీయం చేస్తున్నారా అని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు ఈ వ్యవçహారం జరగుతున్న క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈక్రమంలో ఆదాల ప్రభాకరరెడ్డి జిల్లాలో పార్టీ ముఖ్యనేత ఇదంతా చేస్తున్నాడని మళ్లీ పరోక్షంగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు మంత్రి నారాయణ ఆదివారం నుంచి నెల్లూరు నగరంలోనే ఉన్నప్పటికీ జరుగుతున్న పరిణామాలపై నష్టనివారణ చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తమయినట్లు సమాచారం. -
సుబాబుల్, జామాయిల్ రైతులను ఆదుకోవాలి
ఒంగోలు టౌన్: సుబాబుల్, జామాయిల్ రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద రైతు పోరాట దీక్ష చేపట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరై దీక్షలో పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని ఆచార్య ఎన్జీ రంగా కిసాన్ సంస్థ కార్యదర్శి చుంచు శేషయ్య ప్రారంభించి ప్రసంగించారు. జీఓ నం. 31 ప్రకారం సుబాబుల్ రూ.4200, జామాయిల్ రూ.4400లకు కొనుగోలు చేయాల్సి ఉండగా, ఎక్కడా ఈ ధర అమలు కావడం లేదన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారానే కర్ర కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ దళారులు ప్రవేశించి రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే జాయింట్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. జీఓ నం. 31ప్రకారం కర్ర మార్కె ట్ కమిటీల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాభావం వల్ల ఎండిపోయిన తోటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెంట్యాల హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో 2లక్షల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్, సరుగుడు రైతులు సాగు చేస్తున్నారన్నారు. కర్ర కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రాక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఐటీసీ కంపెనీ ప్రోత్సాహంతో రైతులు పెద్దఎత్తున సాగు చేపట్టారని, అయితే కొనుగోళ్ల రంగంలోకి పూర్తి స్థాయిలో దిగకుండా రైతులను దగా చేసిందన్నారు. సుబాబుర్కు రూ.4200ల ధర రావల్సి ఉండగా రూ.2600కు మించి రావడం లేదన్నారు. జామాయిల్‌కు రూ.4400ల ధర రావల్సి ఉండగా, రూ.2000లకు మించి రావడం లేదన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దళారీల దోపిడీ పెరిగి పోయిందన్నారు. సుబాబుల్, జామాయిల్ రైతుల కోసం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. కమిటీలో సభ్యుడైన జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. శనివారం ఒంగోలుకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యలను తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి.హనుమారెడ్డి, జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు టి. గోపాల్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అబఞ్బరి వెంకటేశ్వర్లు, జే జయంత్‌బాబు, కే వెంకటేశ్వర్లు, కే పెద్దబ్బాయి, ఏ శంకరరావు, బి.లక్ష్మీనారాయణ, ఎన్ సుబ్బారావు, వి.సుబ్బారావు పాల్గొన్నారు. -
హోదాపై టీడీపీ దొంగ దీక్షలు
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు చేస్తున్న దొంగ దీక్షల తీరు తేటతెల్లమైందని, ఇక వారిని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ నగర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐదు కిలోల బరువు తగ్గడానికి దీక్షలు చేస్తానని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అంటే, హోదానా గీదానంటూ అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించి వారి దొంగ దీక్షల గుట్టును విప్పారన్నారు. సీఎం చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా సాధించేందుకు తాము చిత్తశుద్ధితో దీక్షలు చేస్తున్నామంటూ ప్రగడ్భాలు పలుకుతున్న తీరును ప్రజ లు నిశితంగా గమనిస్తున్నారన్నారు. నాలుగేళ్ల పా టు కేంద్రంతో మిత్రపక్షంగా మెలిగి, ఇద్దరు టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రులుగా ఉన్నంత కాలం నోరెత్తకుండా పబ్బం గడిపారని ఆరోపించారు. కొత్త డ్రామాలకు సీఎం తెర.. రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచి ఇప్పుడు కొత్త డ్రామాలకు చంద్రబాబు తెరలేపారని అమర్నాథ్ ధ్వజమెత్తారు. రైల్వే జోన్ కోసం దీక్షల పేరిట భారీ సెట్టింగ్‌లతో వేదికలు వేసి ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారన్నారు. టీడీపీ ఎంపీలకు ఢిల్లీ వీధుల్లో తిరిగే ధైర్యం లేక విశాఖ గల్లీలో తూతూ మంత్రపు దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వారికి ఢిల్లీలో దీక్షలు చేసే సత్తా లేకే విశాఖ రైల్వే స్టేషన్ ముఖద్వారం ముందు సినీ సెట్టింగ్‌లను తలదన్నే రీతిలో సెట్ వేసి బూటకపు దీక్షలు చేసి ప్రయాణికులకు, ప్రజలకు అసౌకర్యం తలపెడుతున్నారని ఆరోపించారు. పవన్‌కల్యాణ్‌వి అవగాహన రహిత వ్యాఖ్యలు.. జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ చోడవరం సుగర్ ఫ్యాక్టరీ గురించి అవగాహన లేకుండా వైఎస్సార్సీపీపై అవాకులు చెవాకులు విసురుతున్నారని అమర్నాథ్ ధ్వజమెత్తారు. టీడీపీ గెలుపునకు బాటలు వేసి, కేంద్రానికి మద్దతిచ్చి నాలుగేళ్లగా వారి సహవాసం చేసినప్పుడు చోడవరం సుగర్ ఫ్యాక్టరీ గురించి పవన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చోడవరం సుగర్ ఫ్యాక్టరీ మూతపడే స్థితిలో ఉంటే రూ.7 కోట్లు ఇచ్చి ఆదుకున్నారని గుర్తుచేశారు. అధికార పార్టీ అడుగులు మడుగులొత్తి పవన్ ఎన్నికల్లో తన హవాను మళ్లీ చాటుకునేందుకు టీడీపీతో రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆ మేరకే వైఎస్సార్సీపీపై వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రజలకు అర్థమవుతోందన్నారు. వైఎస్సార్సీపీకి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్న విషయం ఇప్పటికే పవన్‌కల్యాణ్‌కు స్పష్టమైందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని ఆయన ఇష్టానుసారంగా వ్యాఖ్యానించి అభాసుపాలవుతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికలో టీడీపీని దానికి మద్దతిస్తున్న పార్టీలను రాష్ట్రం నుంచి జనం తరమి కొడతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి సమన్వయకర్త వరుధు కల్యాణి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి, జాన్‌వెస్లీ, పక్కి దివాకర్, షరీఫ్, బర్కత్ ఆలీ, రామన్నపాత్రుడు, శ్రీనివాస్ గౌడ్, కాంతారావు, తడ్డబారికి సురేష్, బాబీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మొక్కుబడి దీక్ష..!
సాక్షి,విశాఖపట్నం/తాటిచెట్లపాలెం/డాబాగార్డెన్స్: అంతన్నారు.. ఇంతన్నారు.. రైల్వే జోన్ కోసం చేపట్టే నిరసన దీక్షకు తమ పార్టీ ఎంపీలంతా వచ్చి వాలిపోతారన్నారు. నగరం, జిల్లా వ్యాప్తంగా ఏకంగా 35 వేల మంది జనం తరలి వచ్చేస్తారని ఊదరగొట్టారు. జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, ముందస్తు ఏర్పాట్లు చేయమని పోలీసులకు హుకుం జారీ చేశారు. తీరా ఏమయింది? అనుకున్న సంఖ్యలో కనీసం పదో వంతు జనం కూడా హాజరు కాలేదు. దాదాపు అరడజను మంది ఎంపీలూ డుమ్మా కొట్టారు. రైల్వే జోన్ రాదంటూ వెటకారపు వ్యాఖ్యల నేపథ్యంలో హడావుడిగా, అట్టహాసంగా చేపట్టిన నిరసన దీక్ష అరకొర జనంతో తుస్సుమంది. ఆ పార్టీ శ్రేణుల్లోనూ నైరాశ్యం నింపింది. ఉదయం తొమ్మిది గంటలకు దీక్ష ప్రారంభమయ్యే సమయం నుంచి దీక్ష ముగిసే దాకా (సాయంత్రం 5 గంటల వరకు) వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన, తెచ్చిన జనం పలచగానే కనిపించారు. దీంతో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు మాట్లాడే సమయానికి కుర్చీల్లో చాలావరకు ఖాళీ అయ్యాయి. అయినప్పటికీ వాళ్లంతా వాటినుద్దేశించే ప్రసంగాలు కొనసాగించారు. ప్రధాన టెంట్‌తో పాటు దానికి ముందు మరో రెండు టెంట్లు వేశారు. వాటిల్లో కూర్చునే వారు కరవవ్వడంతో అక్కడ వేసిన కుర్చీలను ఒకదానిపై ఒకటి పేర్పించారు. కుర్చీల్లో కూర్చోవాలంటూ వేదికపై ఉన్న వారు పదే పదే మైకుల్లో అభ్యర్థించినా ఫలితం కనిపించలేదు. జనాన్ని భారీగా తరలించాలని పార్టీ శ్రేణులకు నేతలు ఆదేశాలిచ్చారు. దీంతో వారిని రప్పించడానికి వాహనాలూ సమకూర్చారు. అయినా దీక్షకు రావడానికి జనం ఆసక్తి చూపలేదని ఒక సీనియర్ నాయకుడు ‘సాక్షి’కి చెప్పారు. మరోవైపు విశాఖకు రైల్వే జోన్ ఆవశ్యకతపై విశాఖ పశ్చిమ, దక్షిణ ఎమ్మెల్యేలు గణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్‌లు మాత్రమే మాట్లాడారు. పలువురు ఎంపీలు, ఒకరిద్దరు మంత్రులు ప్రత్యేక హోదా, రాష్ట్రానికి నిధులు విడుదలలో కేంద్రం చూపుతున్న వివక్షను ప్రస్తావించారు. ప్రధాన అంశమైన రైల్వే జోన్ గురించి నామమాత్రంగానే ప్రసంగించారు. విసిగించిన జేసీ ప్రసంగం వివాదాస్పద నాయకునిగా పేరున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రసంగం సభికులను బాగా విసిగించింది. దాదాపు గంట (58 నిమిషాలు) సేపు సా...గిన ఆయన ప్రసంగమంతా ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని దూషించడానికి, సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడానికే సరిపోయింది. తన ప్రసంగంలో అభ్యంతరకర వ్యాఖ్యలుండడంతో పలువురు విస్తుపోయారు. ఇక మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు చాలా క్లుప్తంగా, పొడిపొడిగా మాట్లాడి మూడు నిమిషాల్లో ముగించేశారు. ఇక ఒకరంటే ఒకరు పొసగని జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు దీక్ష ప్రారంభ సమయానికి వచ్చి ముఖం చూపించి వెళ్లిపోయారు. విప్లవవీరుడు అల్లూరి జయంతి వేడుకల్లో వేర్వేరు చోట్ల పాల్గొనడానికి హడావుడిగా నిష్క్రమించారు. సాయంత్రం 5 గంటలకు దీక్షలో పాల్గొన్న వారికి ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. దీక్షా శిబిరంలో ఎంపీలతోపాటు ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేష్‌బా బు, బండారు సత్యనారాయణమూర్తి, పీలా గో విందు, పల్లా శ్రీనివాస్, గణబాబు, కేఎస్ఎన్ రా జు, జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ పాల్గొన్నారు. ఎండలోనే కార్యకర్తలు దీక్షలో నేతలకీ అన్ని సౌకర్యాలు కల్పించారు. పెద్ద ఎత్తున వేదిక ఏర్పాటు చేశారు. అయితే కార్యకర్తలను మాత్రం విస్మరించారు. కుర్చీలైతే వేశారు..కానీ టెంట్లు వేయకపోవడంతో కార్యకర్తలు ఎండలో ఇమడలేక..నేతల ప్రసంగాలు వినలేక నెమ్మదిగా జారుకున్నారు. ఉద్యోగులు.. విద్యార్థులకు కష్టాలు అధికారం మాది.. పోలీసులు మావోళ్లు అన్నట్టుగా టీడీపీ నాయకులు వ్యవహరించారు. నడిరోడ్డుపై దీక్ష చేయడానికి ఎవరికీ అనుమతి ఇవ్వరు.కానీ టీడీపీ దీక్షకు పోలీసులు ఎలా అనుమతులిచ్చారో వారికే తెలియాలి. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే మార్గంలో నడిరోడ్డుపై దీక్ష చేపడుతుంటే పోలీసులు రాచమర్యాదలు చేసినట్టు కనిపించింది. కాన్వెంట్ జంక్షన్ మీదుగా వెళ్లే వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయి అవస్థలు పడ్డారు. అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. -
కొనసాగుతున్న రిలే దీక్షలు
అడ్డాకుల : ఎస్సీ ధ్రువీకరణ పత్రాల కోసం దళితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం కొనసాగాయి. మండల కేంద్రంలో నివసించే దళితులకు ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని చేపట్టిన రిలే దీక్షలు 28వ రోజుకు చేరుకున్నాయి. 14 ఏళ్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని దళితులు వాపోయారు. విద్యా, ఉద్యోగాల్లో తమ పిల్లలు తీరని అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో రిజర్వేషన్ల పరంగా అందాల్సిన పదువులు అందకుండా పోతున్నాయని చెప్పారు. ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ధ్రువీకరణపత్రాలు జారీ చేసే వరకు రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తామని తెలిపారు. దీక్షల్లో చంద్రం, బుచ్చన్న, శేఖర్, రాజు, సాయిలు, శలవంద, టోనీ, చంద్రశేఖర్, దేవదానం, బాల్‌రాజు తదితరులు ఉన్నారు.