ఢిల్లీలో చంద్రబాబు దుబారా ఖర్చులు | Chandrababu Naidu MIsUse Money For Party Programs | Sakshi
Sakshi News home page

దీక్షల పేరుతో చంద్రబాబు దుబారా ఖర్చులు

Published Fri, Feb 8 2019 11:26 AM | Last Updated on Fri, Feb 8 2019 2:15 PM

Chandrababu Naidu MIsUse Money For Party Programs - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోటు బడ్జెట్‌ ఉందంటూనే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అనేక దుబారా ఖర్చులకు పాల్పడుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు, వ్యక్తిగత పర్యటనలకు సైతం రాష్ట్ర ప్రభుత్వ నిధులనే విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. తాజాగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబు దీక్షకు  సిద్ధమయ్యారు. ఈ దీక్షకు భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. ఢిల్లీ దీక్షకు జనాలను తరలించేందుకు రూ.10 కోట్లు ఖర్చు చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు, ఉద్యోగులను ఢిల్లీ తీసుకెళ్లెందుకు భారీగా ఏర్పాట్లు చేశారు.

ఢిల్లీ దీక్ష కోసం రూ.1.12 కోట్లతో శ్రీకాకుళం, అనంతపురం నుంచి రెండు ప్రత్యేక రైళ్లును సిద్ధం చేశారు. అంతేకాక విమానాలు, ఇతర రవాణకు రూ.2 కోట్లు, భోజనాలు వసతులు పబ్లిసిటీకి రూ.8 కోట్లు కేటాయించినట్లు తెలిసింది. దీక్షకు ఉద్యోగులను భారీగా తరలించేందుకు ఉద్యోగ సంఘాలకు సీఎంవో టార్గెట్‌ కూడా ఇచ్చింది. ఇవేకాక గడిచిన నాలుగున్నరేళ్లలో ధర్మపోరాటదీక్షల పేరిట  చంద్రబాబు ప్రభుత్వం భారీగా ప్రజధనాన్ని వృథా చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ఓట్లు దండుకోవడానికి చంద్రబాబు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేయడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement