అక్రమ కేసులు.. కుట్ర రాజకీయాలు.. కూటమి నేతలపై రోజా ఫైర్‌ | RK Roja Fires On Chandrababu Govt Conspiracy Politics | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులు.. కుట్ర రాజకీయాలు.. కూటమి నేతలపై రోజా ఫైర్‌

Published Tue, Mar 4 2025 3:57 PM | Last Updated on Tue, Mar 4 2025 4:30 PM

RK Roja Fires On Chandrababu Govt Conspiracy Politics

సాక్షి, చిత్తూరు జిల్లా: చిత్తూరు సబ్‌ జైలులో ఉన్న నగరి మండలం దేసురు అగరం టీడీపీ నాయకుల అక్రమ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలను మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోందన్నారు. 

‘‘వైఎస్సార్‌సీపీ నాయకులకు బెయిల్‌ వచ్చే లోపే.. మరో కేసు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పక్కన పెట్టి పీటీ వారెంట్, కేసులు అన్ని ఒకే చోట విచారించాలని చెప్తున్నా పట్టించుకోవడం లేదు. అధికారులు.. కూటమి నేతలు చెప్పినట్లు ప్రవర్తిస్తే కచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదు. రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలో వస్తుంది. 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంగా మారిపోయింది’’ అని రోజా దుయ్యబట్టారు.

‘‘ఉత్తరాంధ్రలో ఉద్యోగ ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వం అభ్యర్ధిని ఓడించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం, వీధి వీధిలో బెల్ట్ షాపులు ఎక్కువై పోయాయి. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి సాగు చేస్తుంటే నిద్ర పోతున్నారా అని అడుగుతున్నా. హోం మంత్రి ఇంటికి సమీపంలో గంజాయి సాగు చేస్తున్నారు. రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిపోయింది’’ అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement