తిరుపతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులపై శనివారం ఆమె నగరి నుంచి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో హిట్లర్, గడాఫీల పాలన సాగుతోంది. వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్నప్పటికీ.. స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. అత్యాచారాలు, దాడులు జరుగుతుంటే ఆమె ఏం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు.
‘‘తప్పుడు కేసులు పెట్టి.. అక్రమ అరెస్టులు చేస్తున్నారు. పీఎస్‌లకు తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతున్నారు. సుధారాణి, వెంకట్‌రెడ్డి దంపతులను దారుణంగా కొట్టారు. కోర్టులో కూడా ఇదే విషయాన్ని జడ్జికి ఆ దంపతులు చెప్పారు. అరెస్ట్ చేసిన వాళ్లలో కొందరిని కోర్టులో హాజరుపర్చడం లేదు. వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీలపై దారుణమైన పోస్టులుపెడుతున్నారు. మరి టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై చర్యలెందుకు తీసుకోవడం లేదు?’’ అని రోజా నిలదీశారు.
ఇదీ చదవండి: చంద్రబాబు నియంత పాలన.. అక్రమ కేసులు సహించం: వైఎస్సార్‌సీపీ
Comments
Please login to add a commentAdd a comment