సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన ఉచితంలో ఉచితం లేదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు పాలనలో పవన్ కల్యాణ్ నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడా?. ప్రశ్నిస్తాను అంటూ బిల్డప్ ఇచ్చిన పవన్ ఇప్పుడు ఏమైపోయాడని ప్రశ్నించారు. తొక్కి నారతీస్తామని చెప్పిన పవన్‌కు ప్రజలే నొక్కి తాట తీస్తారని వార్నింగ్ ఇచ్చారు.
చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు ఈ జిల్లా వ్యక్తి అని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నాం. సూపర్ సిక్స్ కాదు, సూపర్ చీటింగ్ చేస్తున్నాడు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మనం అండగా నిలవాలి. కూటమి ప్రభుత్వం మెడలు వంచాలి. తప్పుడు ప్రచారం వల్ల మనం ఓడిపోయాం. సూపర్ సిక్స్ అమలు కావడం లేదు. సంక్షేమ పథకాలు లేవు
చంద్రబాబు చెప్పిన ఉచితంలో ఉచితం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఏవీఎం బ్యానర్‌లో ఎన్నో పెద్ద పెద్ద హిట్ సినిమాలు తీశారు. రాష్ట్రంలో ఈవీఎం ప్రొడక్షన్ వారి సీబీఎన్ ప్రభుత్వం కొనసాగుతోంది. సూటిగా ప్రశ్నిస్తున్న.. రెడ్ బుక్ అంటూ మీ కొడుకు ఏవిధంగా వేధిస్తున్నాడో చూస్తున్నాం. చంద్రబాబు పాలనలో నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడు డిప్యూటీ సీఎం పవన్. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయి. విజయవాడ నగరం నీట ముంచేశారు. పులిహోర పొట్లాలకు 360 కోట్లు ఖర్చు చేశారు. దాని పేరుతో డబ్బులు దోచుకున్నారు.
ప్రశ్నించే పార్టీ అని చెప్పిన పవన్ ఇప్పుడేం చేస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడు?. దారుణాలపై ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాడు. తొక్కి నారతీస్తామన్న పవన్‌ను ప్రజలే నొక్కి తాట తీస్తారు. ఈ రాక్షస పాలన అంతం చేయాలి. ఈరోజు నుంచి రెట్టించిన ఉత్సాహంతో దూసుకువెళ్దాం. మన జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి కృషి చేయాలి. కుల మతాలకు అతీతంగా వైఎస్ జగన్ కృషి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment