పొదుపునకు ‘అడ్డా’కుల! | Addakula Savings Union More Developed In Mahabubnagar District | Sakshi
Sakshi News home page

పొదుపునకు ‘అడ్డా’కుల!

Published Wed, Mar 6 2019 7:33 AM | Last Updated on Wed, Mar 6 2019 10:21 AM

Addakula Savings Union More Developed In Mahabubnagar District - Sakshi

గ్రామైఖ్య సంఘం వివరాలు తెలియజేస్తున్న డీపీఎం కరుణాకర్‌

 సాక్షి, అడ్డాకుల: అడ్డాకుల పొదుపు సంఘాలు ఆదర్శవంతంగా ముందుకు సాగుతున్నాయి. సంఘాల్లో డబ్బు జమ చేయడంతో పాటు రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్న వారు ఎక్కువే ఉన్నారు. రుణాల వసూళ్లలోనూ ఆదర్శం ప్రదర్శిస్తున్నారు. అడ్డాకుల మండలంలో పొదుపు సంఘాలను పరిశీలించడానికి ఇతర రాష్ట్రాల నుంచి స్వయం సహాయక బృందాలు ఇక్కడికొస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాకు చెందిన 40మంది మహిళా సంఘం సభ్యులు అడ్డాకుల, పొన్నకల్‌ గ్రామాల్లో పర్యటించి వెళ్లారు. ఫిబ్రవరి 23నుంచి 26వరకు రెండు గ్రామాల్లోని పొదుపు సం ఘాలను పరిశీలించి సంఘాల్లో రుణాలు తీసుకున్న వారు చేపట్టిన వ్యాపారాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మూడు రోజులుగా రెండో బృందం

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని షామిలీ జిల్లాకు చెందిన 20మంది సభ్యుల బృందం మూడు రోజులుగా అడ్డాకులలో పర్యటిస్తోంది. ఇక్కడి మహిళా సంఘాలను పరిశీలించి సభ్యులతో వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక్కడ మహిళా సంఘాలను ఎలా ముందుకు నడిపిస్తున్నారని పాఠాలు నేర్చుకుంటున్నారు. తమ వద్ద ఇప్పుడిప్పుడే మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటిని ఎలా ముందుకు నడిపిస్తే బాగుంటుందని క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు. పొదుపు సంఘాల ఏర్పాటు, గ్రామైఖ్య సంఘాల బాధ్యతలు, రుణాల మంజూరు, చెల్లింపులతో పాటు రుణాలు తీసుకుని ఉపాధి పొందుతున్న వివరాలను  డీపీఎం కరుణాకర్, ఏపీఎం సుధీర్‌కుమార్‌ యూపీ బృందానికి వివరిస్తున్నారు. పొదుపు సంఘాలను బలోపేతం చేయడంతో మండల మహిళా సమాఖ్య, జిల్లా మహిళా సమాఖ్య పాత్రపై క్షుణ్ణంగా వివరిస్తున్నారు. పొదుపు సంఘాలకు సంబంధించిన రికార్డులను చూయించి అవగాహన కల్పిస్తున్నారు.

మా దగ్గర ఇప్పుడే మొదలు..

మా దగ్గర పొ దుపు సంఘాలను ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నాం. ఇ క్కడ పొదుపు సంఘాలు చాలా చక్కగా పని చేస్తున్నందున పరిశీ లించడానికి వచ్చాం. డబ్బు పొదు పు చేయడమే కాకుండా వ్యాపారాలను అభివృద్ధి చేస్తున్నారు. 
– ప్రతిభ, 
షామిలీ జిల్లా, ఉత్తరప్రదేశ్‌

అవగాహన కోసం వస్తున్నారు

మహిళా సంఘాలు మన దగ్గర అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో సంఘాలు ఇంత బలోపేతం కాలేదు. అందుకే మన సంఘాల పని తీరుపై అవగాహన కోసం ఇక్కడికి వస్తున్నారు. వారికి అన్ని విషయాలను క్షుణ్ణంగా వివరిస్తున్నాం.
– కరుణాకర్, డీపీఎం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement