saving
-
ఈసారి విమానం ఎక్కేవారిదే ఆనందం!
సాధారణంగా దీపావళి పండుగ సీజన్లో విమాన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఒక విశ్లేషణ ప్రకారం.. ఈ దీపావళి సీజన్ విమాన ప్రయాణికులకు మరింత ఆనందం కలిగిస్తోంది. కారణం.. అనేక దేశీయ రూట్లలో సగటు విమాన ఛార్జీలు గత సంవత్సరంతో పోలిస్తే 20-25 శాతం తగ్గాయి.ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో విశ్లేషణ ప్రకారం.. దేశీయ మార్గాల్లో సగటు విమాన ఛార్జీలు 20-25 శాతం శ్రేణిలో క్షీణించాయి. ఇవి 30 రోజుల ఏపీడీ (ముందస్తు కొనుగోలు తేదీ) వన్-వే సగటు ఛార్జీల ధరలు. దీపావళి సీజన్ విమాన టికెట్ల కొనుగోలు సమయాన్ని గతేడాది నవంబర్ 10-16 తేదీల మధ్య పరిగణించగా ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 మధ్య జరిగిన కోనుగోళ్లను పరిగణనలోకి తీసుకున్నారు.విశ్లేషణ ప్రకారం బెంగళూరు-కోల్‌కతా విమానానికి సగటు విమాన ఛార్జీలు గరిష్టంగా 38 శాతం క్షీణించాయి. గత ఏడాది రూ.10,195 నుండి ఈ ఏడాది రూ.6,319కి తగ్గాయి. చెన్నై-కోల్‌కతా మార్గంలో టిక్కెట్ ధర రూ.8,725 నుంచి రూ.5,604కి 36 శాతం తగ్గింది.ఇదీ చదవండి: ఓలా.. అలా కుదరదు.. రిఫండ్ ఇవ్వాల్సిందే!ముంబై-ఢిల్లీ విమానాల సగటు విమాన ఛార్జీలు రూ.8,788 నుంచి రూ.5,762కి 34 శాతం తగ్గాయి. అదేవిధంగా ఢిల్లీ-ఉదయ్‌పూర్ రూట్లో టికెట్ ధరలు రూ.11,296 నుంచి రూ.7,469కి 34 శాతం క్షీణించాయి. ఢిల్లీ-కోల్‌కతా, హైదరాబాద్-ఢిల్లీ, ఢిల్లీ-శ్రీనగర్ మార్గాల్లో 32 శాతం క్షీణత ఉంది. -
బంగ్లాదేశ్ బాధితులకు భారతీయ వైద్యుల సేవలు
బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న పలువురు భారతీయ వైద్యులు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. అయితే దీనికన్నా తమ కర్తవ్యమే ముఖ్యమని భావిస్తూ, దేశంలో జరిగిన అల్లర్లలో గాయపడినవారికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆ దేశంలో ఉన్న భారతీయ వైద్యులు రాజధాని ఢాకాలోనే ఉంటూ వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు.మీడియాతో పలువురు వైద్యులు మాట్లాడుతూ ఢాకాలోని పలు ఆసుపత్రులు అల్లర్ల భాధితులతో నిండిపోయాయని, వారికి సేవలు అందించడమే తమ కర్తవ్యమన్నారు. బాధితుల సంఖ్య పెరగడంతో ఆస్పత్రులపై భారం మరింతగా పెరిగిందన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో తాము ఇక్కడే ఉంటామన్నారు. పాత ఢాకాలోని ఒక ఆస్పత్రికి చెందిన వైద్యుడు ఫోన్లో మాట్లాడుతూ నిరసనకారులు, పోలీసుల మధ్య తాజా ఘర్షణల తరువాత మృతుల సంఖ్య పెరిగిందన్నారు. బాధితులకు సేవలు అందించేందుకు తాము రోజుకు 17 నుండి 18 గంటలు పని చేస్తున్నామన్నారు.గుజరాత్‌కు చెందిన మరో వైద్యుడు మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని, అయితే తాము డిగ్రీ పూర్తి చేసే సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడుతామని ప్రమాణం చేశామని, దానికి కట్టుబడి ఉంటామని అన్నారు. ఈ కష్ట సమయంలో బాధితులకు సేవ చేయడమే తమ కర్తవ్యమన్నారు. -
ఆ మహిళ గ్యాస్ సేవింగ్ టెక్నిక్‌కి ఫిదా అవ్వాల్సిందే! ఒకేసారి..
ప్రస్తుతం గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. అందుకోసం అని మధ్యతరగతి మహిళలు ఎన్నో పాట్లు పడుతుంటారు. గ్యాస్ ఆదా చేసే ఒక్క చిన్న అవకాశాన్ని కూడా మిస్ చెయ్యరు. అయినా ఇంట్లో అందరికీ కావాల్సినవి అమర్చి పెట్టే క్రమంలో గ్యాస్ ఆదా చేయలేక సతమతమవుతుంటారు మహిళలు. పోనీ కట్టెల పొయ్యి వంటివి ఏమైనా ట్రై చేద్దామా అంటే..అంతా అపార్ట్మెంట్లో నివాసం ఉండే పరిస్థితి. అలాంటప్పుడూ ఇది అస్సలు కుదరదు. కానీ ఇక్కడొక మహిళ గ్యాస్‌ని ఆదా చేస్తూ ఒకేసారి రెండు వంటకాలు చేసి శభాష్ అనిపించుకుంది. ఆమె ఎలా చేసిందో చూస్తే మాత్రం తప్పక ఆశ్చర్యపోతారు. అబ్బా..! ఇలా కూడా గ్యాస్ ఆదా చేసుకోవచ్చా అనుకుంటారు. ఏం జరిగిందంటే..ఓ మహిళ గ్యాస్ ఆదా చేసేలా వండిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో ఆ మహిళ పూరీలు, అందులోకి బంగాళదుంప కూర చేయాలనుకుంది. అందుకని ముందుగా ఓ గిన్నేలో బంగాళ దుంపలను ఉడకబెట్టింది. ఆ ఆవిరిపైనే వేడితోనే పూరీలను కూడా చక్కగా ప్రీపేర్ చేసేంది. ఈ ఐడియాని చూసి నెటిజన్లు ఆమెది ఏం తెలివి అంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. అలా ఎలా అనుకుంటున్నారా..?. ఏం లేదండి ఓ స్టీల్ గిన్నేలో బంగాళ దుంపలు పెట్టింది. దానిపై ఓ మూకిడి పెట్టి నూనె పోసి చక్కగా పూరీలను వేయించింది. ఆ బంగాళ దుంపల ఆవిరిపైనే పూరీలను ప్రీపేర్ చేసేసింది అంతే. ఓహో ఇలా కూడా గ్యాస్ ఆదా చేయొచ్చా..!. ఇంతవరకు మాకు ఇలాంటి ఐడియా రాలేదబ్బా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి. View this post on Instagram A post shared by Rekha Sharma (@rekha_sharma.001) (చదవండి: అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా పైలట్!) -
ట్యాక్స్‌ను ఆదా చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి ఆప్షన్
అన్ని సాధనాల్లోకి ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. ఒకవైపు మెరుగైన రాబడి, మరోవైపు పన్ను ఆదాకు వీలు కల్పించేవి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాలు. సెక్షన్ 80సీ పరిధిలో ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందాలనుకునే వారు వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులను వీటి నుంచి ఆశించొచ్చు. ఇందులో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుందని మాత్రం గుర్తుంచుకోవాలి. పన్ను ఆదా కోరుకునే వారు, రిస్క్ తీసుకోగల సామర్థ్యం ఉన్న వారికి ఇవి అనుకూలం. ఈ విభాగంలో టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ పథకం మంచి పనితీరు చూపిస్తోంది. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో పెట్టుబడులపై 22 శాతానికి పైగా రాబడులు కనిపిస్తున్నాయి. మూడేళ్ల కాలంలో చూస్తే ఈ పథకంలో సగటు వార్షిక రాబడులు 20.52 శాతంగా ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడులు 16.59 శాతం, ఏడేళ్లలో ఏటా 16.47 శాతం, పదేళ్లలో 17.33 శాతం చొప్పున వార్షిక రాబడులను ఈ పథకం తెచ్చి పెట్టింది. దీర్ఘకాలంలో ఈ పథకం అందించిన రాబడులు ఈఎల్ఎస్ఎస్ విభాగం సగటు కంటే మెరుగ్గా ఉండడం గమనార్హం. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో ఈ పథకం డైవర్సిఫైడ్ విధానంలో వివిధ రంగాలకు చెందిన స్టాక్స్‌ను ఎంచుకుంటుంది. మార్కెట్ ర్యాలీల్లో లాభాలను స్వీకరిస్తుంటుంది. మార్కెట్లు అస్థిరంగా మారితే సురక్షిత విధానంలోకి మారిపోతుంది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.3,699 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 95.56 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన 4.44 శాతం మేర నగదు నిల్వలను కలిగి ఉంది. ఇక ఈక్విటీల్లోనూ బ్లూచిప్ కంపెనీలకే 67 శాతం కేటాయింపులు చేసింది. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 23.42 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 9.31 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 54 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు పెద్దపీట వేసింది. 30 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత టెక్నాలజీ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇచి్చంది. 8.63 శాతం ఈ రంగానికి చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 8.41 శాతం, ఆటోమొబైల్ కంపెనీలకు 7.62 శాతం, ఇంధన రంగ కంపెనీలకు 7.50 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 5.58 శాతం, నిర్మాణ రంగ కంపెనీలకు 5.44 శాతం, సేవల రంగ కంపెననీలకు 4.93 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
దేశానికే ఆదర్శంగా జగనన్న కాలనీల్లో ఇంధన పొదుపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదల కోసం నిర్మిస్తున్న గృహాల్లో ఇంధన సామర్థ్య చర్యలను దేశానికే రోల్ మోడల్‌గా అమలు చేయనున్నట్లు ఏపీ గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సీఈవో విశాల్ కపూర్ తరఫున సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు అనిమేష్ మిశ్రా, నితిన్భట్, సావిత్రిసింగ్, పవన్‌లు అజయ్ జైన్‌ను కలిసినట్లు ఈఈఎస్ఎల్ దక్షిణాది రాష్ట్రాల సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం... హౌసింగ్ ఎండీ లక్ష్మీశా, జేడీ శివప్రసాద్, హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్ గురించి ఈఈఎస్ఎల్ అధికారులకు వివరించారు. అజయ్ జైన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎస్ఎల్, కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అతిపెద్దదైన ఇంధన సామర్థ్య కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనుందని తెలి పారు. సీఎం జగన్ సూచన మేరకు వైఎస్సార్–జగ నన్న కాలనీల్లోని ఇళ్లకు అత్యంత నాణ్యమైన స్టార్ రేటెడ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పరికరాలను గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలోనే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అందించనుందని తెలిపారు. ప్రతి ఇంటికి 4 ఎల్ఈడీ బల్బులు, 2 ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ బీఎల్డీసీ ఫ్యాన్లను మార్కెట్ ధర కన్నా తక్కువకు ఈఈఎస్ఎల్ సహకారంతో సమకూర్చనున్నట్లు చెప్పారు. అయితే ఇది స్వచ్చందమేనని, లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ పరికరాలు తీసుకోవాలని లేదన్నారు. ఈ పరికరాలను వినియో గించడం వల్ల ప్రతి ఇంట్లో ఏటా 734 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుందని ఈఈఎస్ ఎల్ అంచనా వేసిందని తెలిపారు. దాని ప్రకారం ఫేజ్–1లోని 15.6 లక్షల ఇళ్లకు రూ.352 కోట్ల వార్షిక ఇంధనం ఆదా అవుతుందని అజయ్ జైన్ వివరించారు. -
Mahila Samman Scheme: గుడ్‌న్యూస్: మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు 2023–24 బడ్జెట్లో మహిళా సమ్మాన్ (Mahila Samman Scheme) పేరుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వార్షిక వడ్డీ 7.5 శాతం. రెండేళ్లకు గడువు ముగుస్తుంది. మహిళల కోసమే ఈ డిపాజిట్‌ను తీసుకొచ్చింది. అయితే ఇందులో పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తాజాగా స్పష్టం చేసింది. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! అదే సమయంలో రాబడిపై టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) అమలు చేయరని పేర్కొంది. సీబీడీటీ ఆదేశాల ప్రకారం మహిళా సమ్మాన్ సర్టిఫికెట్లో వచ్చే వడ్డీ ఆదాయం రూ.40వేలు మించకపోతే టీడీఎస్ వర్తించదని స్పష్టమవుతోందని నాంజియా అండర్సన్ ఇండియా పార్ట్నర్ నీరజ్ అగర్వాల్ తెలిపారు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడిపై ఒక ఏడాదిలో 7.5 శాతం మేరకు రాబడి రూ.15,000గానే ఉంటుందని, కనుక టీడీఎస్ వర్తించదన్నారు. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
చకచకా విద్యుత్ పొదుపు చర్యలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో) విజయవాడ, విశాఖపట్నం, కడప జోన్లలో విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం), స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఈఈడీసీ) సహకారంతో విజయవాడ జోన్లో 70 అదనపు హైటెన్షన్ (ఈహెచ్‌టీ) సబ్స్టేషన్లలో పనులు పూర్తయ్యాయి. ఈ సబ్స్టేషన్లలో మొత్తం 9 వాట్లవి 1,100 ఎల్ఈడీ బల్బులు, 20 వాట్లవి 3,026 ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లు, 35 వాట్లవి 884 బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ (బీఎల్డీసీ) సీలింగ్ ఫ్యాన్లు, 70 వాట్లవి 263 ఎల్ఈడీ స్ట్రీట్‌లైట్లు, 110 వాట్లవి 2,441 ఎల్ఈడీ యార్డ్ లైట్లు, 190 వాట్లవి 342 యార్డ్ ఫ్లడ్లైట్లను అమర్చారు. పాత, సంప్రదాయ లైట్ల స్థానంలో వీటి ఏర్పాటు ద్వారా ఏటా రూ.1.87 కోట్లు విలువైన 2.58 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా కానుంది. వీటికి అయిన ఖర్చు రూ.1.52 కోట్లు పదినెలల్లో తిరిగిరానుంది. విశాఖపట్నం జోన్లో 69, కడప జోన్లో 102 సబ్స్టేషన్లలో కూడా ఈ పనులు చేపట్టనున్నారు. దీంతోపాటు నష్టాలను తగ్గించడానికి కొత్త హైటెన్షన్ (హెచ్‌టీ) లైన్లను ఏర్పాటు చేయడం, పాతలైన్లను మార్చడం, ఈహెచ్‌టీ సబ్స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు పెంచడం, పాతవాటికి సామర్థ్యాన్ని జోడించడం, కెపాసిటర్ బ్యాంక్, రియాక్టర్లను ఇన్స్టాల్ చేయడం వంటి రియాక్టివ్ పవర్ మేనేజ్మెంట్ చర్యలను కూడా ట్రాన్స్‌కో చేపడుతోంది. ఖర్చులు తగ్గుతాయి నియంత్రణ లేకుండా సమానమైన లైటింగ్ పిక్చర్తో పోలిస్తే 80 శాతం కంటే ఎక్కువ విద్యుత్‌ను ఆదాచేసే లైటింగ్ అప్గ్రేడ్లు, స్మార్ట్ నియంత్రణలపై ట్రాన్స్‌కో దృష్టిసారించింది. అందులో భాగంగానే విద్యుత్ ఆదాచేసే ఎల్ఈడీ బల్బులు, ఫ్యాన్లు అమర్చుతున్నాం. – కె.విజయానంద్, సీఎండీ, ఏపీ ట్రాన్స్‌కో -
మార్చి 31 డెడ్‌లైన్: చేయాల్సిన కీలకమైన పనులు ఏంటో తెలుసా?
సాక్షి, ముంబై: అనేక కీలకమైన ఆర్థిక పనులకు మార్చి 31 తుది గడువు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజు మార్చి 31 చివరి రోజు లోపు ఈ పనులను పూర్తి చేయడంలో విఫలమైతే మన జేబుకు చిల్లు పడక తప్పదు. ఎలాంటి ఆర్థిక జరిమానాలు లేదా ఖాతాల డీయాక్టివేషన్ లాంటి ప్రమాదం లేకుండా, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు చేయాల్సిన పనుల్లో ముఖ్యంగా పాన్ ఆధార్ లింకింగ్, పన్ను ప్రణాళిక లాంటికొన్ని ముఖ్యమైన పనులను ఒకసారి చూద్దాం. 2023, మార్చి 31 లోపు పూర్తి చేయాల్సిన పైనాన్షియల్ టాస్క్స్ ► పాన్ -ఆధార్ కార్డ్ లింక్: మార్చి 31 లోపు పాన్ ఆధార్ కార్డ్‌లను లింకింగ్ పూర్తి చేయాలి. లేదంటే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ చెల్లదు. దీంతో ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను ఫైల్ చేయలేరు. ► అలాగే రూ. 1,000 ఫైన్. అంతేకాదు తప్పుడు లేదా చెల్లని పాన్‌ను కోట్ చేస్తే రూ. 10,000 జరిమానా . ► అప్డేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్: 2019-2020, AY 2020-21కి సంబంధించిన అప్డేట్ చేయబడిన ఆదాయ-పన్ను రిటర్న్‌ను 31 మార్చి 2023 లోపు సమర్పించడం అవసరం. గడువు ముగిసాక ఫైల్ చేయలేరు. ► ముందస్తు పన్ను చెల్లింపు: రూ. 10,000 కంటే పన్ను చెల్లించాల్సి ఉన్న చెల్లింపుదారుడు ముందస్తు పన్ను చెల్లించాలి. జూన్ 15లోగా 15 శాతం, సెప్టెంబర్ 25లోగా 45 శాతం, డిసెంబర్ 15లోగా 75 శాతం, మార్చి 15 నాటికి 100 శాతం చొప్పున నాలుగు వాయిదాల్లో చెల్లిస్తారు. అయితే, మూలధన లాభాలు వంటి అదనపు ఆదాయం ఉన్నా, ఉద్యోగాన్ని మార్చుకున్నా మీరు ముందస్తు పన్నును లెక్కించి చెల్లించాల్సి ఉంటుంది. ► 2022-2023కి సంబంధించిన మొత్తం ముందస్తు పన్నును మార్చి 15లోపు ఇంకా చెల్లించనట్లయితే, మార్చి 31, 2023లోపు చెల్లించే అవకాశం ఉంది. మార్చి తర్వాత, నెక్ట్స్ ఐటీఆర్ వరకు బకాయిపై నెలకు 1 శాతం వడ్డీని చెల్లించాలి. ► ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నట్లయితే, అత్యధిక పరిమితి రూ. 1.5 లక్షలతో పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ► పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెట్టండి: పీపీఎఫ్ సుకన్య సమృద్ధి యోజన, ఫిక్స్డ్ డిపాజిట్ ,ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ వంటి పన్ను ఆదా పథకాలలో పెట్టుబడుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచచ్చు ► ఫారమ్ 12బీ: ఉద్యోగం మారినట్టయితే వారు ఫారమ్ 12B పూరించడాన్ని మర్చిపోవద్దు. ► మ్యూచువల్ ఫండ్ నామినేషన్: సెబీ సర్క్యులర్ ప్రకారం, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వారు మార్చి 31 లోపు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయకపోతే ఖాతా బంద్ అవుతుంది. ► మార్కెట్ రెగ్యులేటరీ ప్రకారం మార్చి 31లోపు NSE NMF ప్లాట్‌ఫారమ్‌లో మొబైల్ నంబర్ , ఇమెయిల్ ఐడీని ధృవీకరించుకోవడం అవసరం. ► క్యాపిటల్ గెయిన్: ఇంతకుముందు ఈక్విటీలపై దీర్ఘకాలిక పన్ను రహితంగా ఉండేది. ఈక్విటీ ఫండ్‌పై దీర్ఘకాలిక మూలధన లాభం 1 లక్ష కంటే ఎక్కువ మొత్తంలో ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండా పన్ను రేటు 10 శాతం. సో..పెట్టుబడులను రీడీమ్ చేయాలనుకుంటే పన్ను రహిత పరిమితి రూ. 1 లక్ష ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మార్చి 31లోపు రిడీమ్ చేసుకోవచ్చు. స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్ను 15 శాతం ► ప్రధానమంత్రి వయ వందన యోజన: సీనియర్ సిటిజన్లు, రిటైర్ మెంట్ ఫండ్ కోసం ప్రధానమంత్రి వయ వందన యోజన (PMVVY) వంటి పలు ఆప్షన్స్ ఉన్నాయి ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకునే 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు మార్చి 31, 2023 లోపు దీన్ని ప్రారంభిస్తే మంచింది. ► ఈ పాలసీలో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 10 సంవత్సరాల పథకంలో, పెట్టుబడిదారులు 7.4 శాతం చొప్పున పెన్షన్ పొందుతారు. ఈ పథకం కింద 10 సంవత్సరాల నిర్ణీత కాలానికి. రూ.9,250 నెలవారీ పెన్షన్ , రూ. 1.62 లక్షల కనీస పెట్టుబడిపై, నెలవారీ పెన్షన్ రూ. 1,000 వరకు వస్తుంది. -
పెరుగుతున్న ఆర్థిక పొదుపులు
ముంబై: దేశంలో పొదుపు ఆర్థిక సాధనాల వైపు ప్రయాణిస్తోంది. ఈ ఆర్థిక పొదుపు 2026–27 నాటికి జీడీపీలో 74 శాతానికి చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. దీనిపై బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 2021–22 నాటికి రూ.135 లక్షల కోట్లుగా ఉంటే, 2026–27 నాటికి రూ.315 లక్షల కోట్లకు పెరుగుతాయని అంచనా వేసింది. విధాన నిర్ణేతలు దీర్ఘకాలంగా పొదుపు నిధులు ఆర్థిక సాధనాల్లోకి మళ్లాలని కోరుకుంటున్నట్టు గుర్తు చేసింది. అంటే నగదు, బంగారం, రియల్ ఎస్టేట్ తదితర సాధనాలకు బదులు ప్రజలు మ్యూచువల్ ఫండ్స్, ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఈక్విటీ, ఇతర పెట్టుబడి సాదనాల్లో తమ పొదుపు నిధులను ఇన్వెస్ట్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా డెట్, ఈక్విటీ మార్కెట్లలో అధిక లిక్విడిటీ మొత్తం ఆర్థికీకరణ అజెండాకు సాయపడుతున్నట్టు క్రిసిల్ పేర్కొంది. అయితే ఫైనాన్షియల్ మార్కెట్లలో ఎక్కువ కాలం పాటు అస్థిరతలు లేదా లిక్విడిటీ పరిస్థితులు ఇన్వెస్టర్ల అనుభవంపై ప్రభావం చూపించొచ్చని క్రిసిల్ హెచ్చరించింది. మద్దతు చర్యలు.. అందరికీ ఆర్థిక సేవలు చేరువ కావడం, డిజిటలైజేషన్, దీర్ఘకాలంగా మధ్య తరగతి ప్రజల ఖర్చు చేసే ఆదాయం పెరగడం, ఈ తరహా సాధనాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు అన్నీ కలసి.. పొదుపు నిధులు ఆర్థిక సాధనాల వైపు మళ్లేందుకు దోహదపడినట్టు క్రిసిల్ వివరించింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని వారికి ఆర్థిక సాధనాలను చేరువ చేసేందుకు పంపిణీపై దృష్టి సారించాలని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ జిజు విద్యాధరన్ సూచించారు. ఆయా ప్రాంతాల్లోని వారికి ఆర్థిక సాధనాలను చేరువ చేసేందుకు ప్రోత్సాహకాల అవసరాన్ని కూడా ప్రస్తావించారు. ఇన్వెస్టర్లు పెట్టుబడి సాధనాలను మరింత సరళంగా అర్థం చేసుకునేందుకు అన్నింటిపైనా ఒకే మాదిరి పన్ను విధానం ఉండాలన్నారు. -
రుణం కాకూడదు భారం!
‘మన పరిధిల్లోనే మనం జీవించాలి’ ఆర్థిక నిపుణులు ఇచ్చే సూచన ఇది. అంటే తమకు వస్తున్న ఆదాయాన్ని మించి ఖర్చులకు వెళ్లకపోవడం సురక్షితం. మెరుగైన జీవనం కోరుకునే వారు.. ముందు తమ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించాలి. అయితే, ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో అప్పు అవసరం ఏర్పడవచ్చు. తీసుకునే రుణం మీకు లాభం తెచ్చిపెట్టాలి కానీ, మీ విలువను హరించివేసి అప్పుల ఊబిలోకి నెట్టేయకూడదు. అదే విధంగా మీ జీవిత లక్ష్యాలకు విఘాతంగా మారకూడదు. అవకాశం ఉన్నంత మేర రుణం పుచ్చుకోవడం కాకుండా.. తమ చెల్లింపుల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. మన దేశంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు.. రుణం ఇచ్చే ముందు దరఖాస్తు దారుల నెలవారీ నికర ఆదాయంలో 50 శాతాన్ని చెల్లింపుల సామర్థ్యంగా పరిగణనలోకి తీసుకుంటాయి. అప్పటికే ఏవైనా రుణాలు తీసుకుని ఈఎంఐ చెల్లిస్తుంటే ఆ మొత్తాన్ని నికర ఆదాయం నుంచి మినహాయించి రుణ అర్హతలను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు రమణ ప్రతీ నెలా నికరంగా రూ.లక్ష చొప్పున వేతనం పొందుతున్నాడని అనుకుంటే.. అందులో 50 శాతం రూ.50,000 అవుతుంది. అయితే, అప్పటికే రమణ తన కారు కోసం రూ.10,000 ఈఎంఐ చెల్లిస్తున్నాడు. దీంతో రమణ వద్ద మిగిలి ఉన్న రుణ చెల్లింపుల సామర్థ్యం రూ.40,000 అవుతుంది. ఈ విధంగా చూస్తే.. 9 శాతం వడ్డీ రేటుపై 15 ఏళ్ల కాలానికి రూ.40 లక్షల గృహ రుణాన్ని రమణ సొంతం చేసుకోవచ్చు. నెలవారీ ఆదాయంలో 50 శాతానికి ఈఎంఐను ఖరారు చేస్తే.. మిగిలిన 50 శాతం నుంచి మీ ఖర్చులుపోను భవిష్యత్తు లక్ష్యాల కోసం పొదుపు చేసుకునేందుకు దాదాపు మిగిలేది ఏమీ ఉండదు. దీంతో కొన్నింటి విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. కొనుగోళ్లను వాయిదా వేసుకోవాల్సి రావచ్చు. ఎత్తు పల్లాలను ఎదుర్కొనే వెసులుబాటు కూడా తగ్గిపోతుంది. అందుకే మీకున్న గరిష్ట రుణ అర్హత పరిధిలో ఎంత వరకు రుణం తీసుకుంటే.. నెల నెలా చెల్లింపులు చేయడం సౌకర్యంగా ఉంటుందన్నది మీరే నిర్ణయించుకోవాలి. మీ జీవన వ్యయాలు, ప్రస్తుత ఈఎంఐల మొత్తంతోపాటు.. ఇతర లక్ష్యాల కోసం ఆదాయంలో 15–20 శాతం మేర పొదుపును మినహాయించిన తర్వాతే ఈఎంఐపై స్పష్టతకు రావాలి. విలువను పెంచుకునేందుకు.. పెట్టుబడి కోసం, ఆస్తి కొనుగోలు కోసమో రుణం తీసుకుంటుంటే అందులో ‘లాభం’ సూత్రం దాగుండాలి. తీసుకున్న రుణానికి చేస్తున్న ఖర్చులకు మించి ఆదాయం ఇచ్చేది అయితేనే ప్రయోజనం లభిస్తుంది. లేదా కనీసం మీ నికర విలువను పెంచే వాటిపై రుణాన్ని ఖర్చు చేసినా పయ్రోజనం సిద్ధిస్తుంది. మన దేశంలో రిటైల్ రుణాలపై (గృహ రుణం మినహా) వడ్డీ రేట్లు అధిక స్థాయిల్లోనే ఉంటున్నాయి. ఈ రేట్లకు మించి పెట్టుబడులపై రాబడినిచ్చే సాధానాలు అరుదే. అయితే, తీసుకుంటున్న రుణాన్ని మీ నికర విలువను (నెట్‌వర్త్) తగ్గించేది కాకుండా పెంచేదానిపై ఇన్వెస్ట్ చేయడం మంచి విధానం అవుతుంది. ఇది ఎలా అంటారా..? భూమి కొనుగోలు, ఉన్నత విద్యార్హతల కోసం రుణం తీసుకోవడం. కొనుగోలు చేసిన భూమి విలువ పెరిగినా.. అదనపు విద్యార్హత అధిక ఆదాయానికి దారితీసినా మీ రుణ లక్ష్యం నెరివేరినట్టే. ఇలా కాకుండా రుణం తీసుకుని ఆకర్షణీయమైన ఫీచర్లతో చూడముచ్చటగా ఉన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్, స్మార్ట్‌ఫోన్, హోమ్ థియేటర్ సిస్టమ్స్ వంటివి కొనుగోలు చేశారనుకోండి.. కాలం గడుస్తున్న కొద్దీ అవి విలువను కోల్పోతాయి. వీటి వల్ల రెండు విధాలా నష్టం ఎదురవుతుంది. వీటి కోసం రుణం తీసుకోవడం వల్ల వడ్డీ రూపంలో నష్టం ఒకటి అయితే.. కొనుగోలు చేసిన ఈ వస్తువుల విలువ కొంత కాలానికి జీరోకి చేరుకోవడం మరో నష్టం. వినియోగం కోసం లేక వినోద అనుభవం కోసం రుణం తీసుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని అర్థం చేసుకోవాలి. కనీసం జీవితంలో ముఖ్యమైన లక్ష్యాల కోసం తగినంత నిధిని సమకూర్చుకునే వరకు అయినా.. ఇటువంటి వినియోగ, వినోద, విలాసాల కోసం రుణానికి దూరంగా ఉండడం ఆరోగ్యకరం. సామర్థ్యాన్ని మించొద్దు.. వేతన జీవులకు ఏటా ఎంతో కొంత ఆదాయం పెరుగుతుండడం సహజం. అయి తే, కచ్చితంగా పెరుగుతుందని అన్ని సందర్భాల్లోనూ చెప్పలేము. సమీప కాలంలో ఆదాయం పెరుగుతుందన్న అంచనాతో అధిక ఈఎంఐను ఎంచుకునే వారు కూడా ఉంటారు. కానీ, ఇలా చేయడం వల్ల పెరిగే వేతనంతో తొందరగా రుణ భారాన్ని తొలగించుకునే అవకాశాన్ని కోల్పోయినట్టవుతారు. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ఉద్యోగ, వేతన కోతలను చవిచూస్తున్నారు. ఆర్థిక సంక్షోభాల్లోనూ లేదా విడిగా ఆయా కంపెనీలు సంక్షోభాల్లోకి వెళ్లిన సందర్భాల్లో ఉద్యోగులకు రిస్క్ ఏర్పడుతుంది. కనుక భవిష్యత్తులో ఆదాయం పెరుగుతుందన్న అంచనాలతో కాకుండా.. ప్రస్తుత చెల్లింపుల సామర్థ్యాన్ని మించి రుణాలకు వెళ్లకుండా ఉండడం మంచిది. మెరుగైన ఆఫర్ రుణం తీసుకునే ముందు వడ్డీ రేటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నేడు వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలకు దిగొస్తున్నాయి. బ్యాంకులు రెపో ఆధారిత రుణాలను 6–7 శా తానికే ఆఫర్ చేస్తున్నాయి. కనుక రుణం తీసుకునే ముందు పలు సంస్థలను సంప్రదించి తక్కువ రేటుకు రుణాన్ని పొందడం వల్ల చెల్లింపుల భారాన్ని కొంతైనా తగ్గించుకోవచ్చు. అధిక ఈఎంఐ రుణం తీసుకునే సమయంలో చాలా మంది ఈఎంఐపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. రుణమిచ్చే సంస్థలు చెల్లింపులు సౌకర్యంగా ఉండేందుకు.. దీర్ఘకాలానికి రుణాన్ని, తక్కువ ఈఎంఐపై ఆఫర్ చేస్తుంటాయి. కానీ, కాల వ్యవధిని (లోన్ టర్మ్) దీర్ఘకాలానికి నిర్ణయించడం వల్ల.. రుణ గ్రహీత కంటే రుణదాతకే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వడ్డీ చెల్లింపులు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. ఉదాహరణకు రూ.50 లక్షల రుణాన్ని 15 సంవత్సరాల కాలానికి 9 శాతం వడ్డీపై తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు నెలవారీ చెల్లించాల్సిన వాయిదా (ఈఎంఐ) రూ.50,713 అవుతుంది. దీంతో 15 ఏళ్ల కాలానికి చెల్లించే మొత్తం రూ.91.28 లక్షలు అవుతుంది. ఒకవేళ రుణ కాల వ్యవధి 20 ఏళ్లకు పెంచుకుంటే ఈఎంఐ రూ.44,986 అవుతుంది. కానీ, 20 ఏళ్లలో చెల్లించే మొత్తం రూ.1.07 కోట్లకు పెరుగుతుంది. 15 ఏళ్ల కాలంలో వడ్డీ రూపంలో చెల్లించేది రూ.41.2 లక్షలు అయితే, 20 ఏళ్ల కాలంలో రూ.57.9 లక్షలుగా ఉంటుంది. కనుక రుణం విషయంలో కాల వ్యవధిని పెంచుకోకుండా, ఈఎంఐ పెంచుకునే విషయమై బ్యాంకుతో సంప్రదింపులు చేసుకోవాలి. వడ్డీ రేట్లు పెరుగుతూ పోతుంటే వాస్తవ ఈఎంఐకి అదనంగా వెసులుబాటు ఉన్నంత మేరకు చెల్లించుకోవడం ఇంకా మంచిది. -
పొదుపునకు ‘అడ్డా’కుల!
సాక్షి, అడ్డాకుల: అడ్డాకుల పొదుపు సంఘాలు ఆదర్శవంతంగా ముందుకు సాగుతున్నాయి. సంఘాల్లో డబ్బు జమ చేయడంతో పాటు రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్న వారు ఎక్కువే ఉన్నారు. రుణాల వసూళ్లలోనూ ఆదర్శం ప్రదర్శిస్తున్నారు. అడ్డాకుల మండలంలో పొదుపు సంఘాలను పరిశీలించడానికి ఇతర రాష్ట్రాల నుంచి స్వయం సహాయక బృందాలు ఇక్కడికొస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాకు చెందిన 40మంది మహిళా సంఘం సభ్యులు అడ్డాకుల, పొన్నకల్ గ్రామాల్లో పర్యటించి వెళ్లారు. ఫిబ్రవరి 23నుంచి 26వరకు రెండు గ్రామాల్లోని పొదుపు సం ఘాలను పరిశీలించి సంఘాల్లో రుణాలు తీసుకున్న వారు చేపట్టిన వ్యాపారాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మూడు రోజులుగా రెండో బృందం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని షామిలీ జిల్లాకు చెందిన 20మంది సభ్యుల బృందం మూడు రోజులుగా అడ్డాకులలో పర్యటిస్తోంది. ఇక్కడి మహిళా సంఘాలను పరిశీలించి సభ్యులతో వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక్కడ మహిళా సంఘాలను ఎలా ముందుకు నడిపిస్తున్నారని పాఠాలు నేర్చుకుంటున్నారు. తమ వద్ద ఇప్పుడిప్పుడే మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటిని ఎలా ముందుకు నడిపిస్తే బాగుంటుందని క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు. పొదుపు సంఘాల ఏర్పాటు, గ్రామైఖ్య సంఘాల బాధ్యతలు, రుణాల మంజూరు, చెల్లింపులతో పాటు రుణాలు తీసుకుని ఉపాధి పొందుతున్న వివరాలను డీపీఎం కరుణాకర్, ఏపీఎం సుధీర్‌కుమార్ యూపీ బృందానికి వివరిస్తున్నారు. పొదుపు సంఘాలను బలోపేతం చేయడంతో మండల మహిళా సమాఖ్య, జిల్లా మహిళా సమాఖ్య పాత్రపై క్షుణ్ణంగా వివరిస్తున్నారు. పొదుపు సంఘాలకు సంబంధించిన రికార్డులను చూయించి అవగాహన కల్పిస్తున్నారు. మా దగ్గర ఇప్పుడే మొదలు.. మా దగ్గర పొ దుపు సంఘాలను ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నాం. ఇ క్కడ పొదుపు సంఘాలు చాలా చక్కగా పని చేస్తున్నందున పరిశీ లించడానికి వచ్చాం. డబ్బు పొదు పు చేయడమే కాకుండా వ్యాపారాలను అభివృద్ధి చేస్తున్నారు. – ప్రతిభ, షామిలీ జిల్లా, ఉత్తరప్రదేశ్ అవగాహన కోసం వస్తున్నారు మహిళా సంఘాలు మన దగ్గర అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో సంఘాలు ఇంత బలోపేతం కాలేదు. అందుకే మన సంఘాల పని తీరుపై అవగాహన కోసం ఇక్కడికి వస్తున్నారు. వారికి అన్ని విషయాలను క్షుణ్ణంగా వివరిస్తున్నాం. – కరుణాకర్, డీపీఎం -
నీటి ఆదాతోనే ఆదాయం
పరిగి: రైతుకు ప్రతి వేసవిలో ఎదురయ్యే నీటి సమస్య సర్వసాధారణమే అయినా.. గతేడాది ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఈసారి ఏడాది ప్రారంభంలో నీరు సమృద్ధిగానే ఉన్నప్పటికీ ప్రభుత్వం పంపు సెట్లకు 24 గంటల ఉచిత కరంటు సరఫరా చేస్తున్నప్పటి నుంచి నీటి వృథా బాగా పెరిగింది. దీంతో భూగర్భజలాలు అనుకున్న కంటే శరవేగంగా అడుగంటుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు నీటి సమస్య నుంచి బయట పడేందుకు సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది. భూమిలో నీరు అడుగంటడం, పారించిన నీరు పొలంలో వెంటనే ఆవిరవటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ నేపథ్యంలో రైతులు ప్రధానంగా వరిని పక్కన పెట్టి కూరగాయలు వంటి ఆరుతడి పంటలు సాగుచేసుకుంటే పరిస్థితులు అనుకూలిస్తాయని వ్వవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏటా అడుగంటుతూ వెళుతున్న భూగర్భ జలాలు రైతుకు మరింత సవాలుగా మారుతున్నాయి. బిందు సేద్యంతో సాగు చేసిన పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం వేసవి సమీపిస్తుందంటే చాలు కూరగాయలు, పండ్ల తోటలు సాగుచేస్తున్న రైతుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. దానికి కారణం నీటి ఎద్దడి. ఈ సీజన్లో భూగర్భ జలాలు అడుగంటుతాయి. భూమిలోని తేమ వెంటనే ఆవిరవుతుంది. భాస్పోత్సేకం(ఆకుల నుంచి నీరు ఆవిరికావటం) ఎక్కువగా జరుగుతుంది. ఇదే సమయంలో కాపుమీద ఉన్న చెట్లకు వేసవిలో నీటి అవసరం మరీ ఎక్కువగా ఉంటుంది. భూగర్భ జలాలు అడుగంటడం తదితర కారణాలతో పంటలకు నీరు సరిపడా అందదు. దీంతో కాయల బరువు, నాణ్యత, సైజు తగ్గటం ద్వారా దిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి కారణాలతో రైతు పూర్తిగా నష్టపోయే ప్రమాదముంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు తమ పంటల్ని కాపాడుకోవచ్చు. ఈ నేపథ్యంలో పొలాల్లో తేమను కాపాడుకోవటం, నీటి వృథాను అరికట్టడం ఎలా అనే అంశంపై రైతులకు నీటి యాజమాన్యంపై వ్యవసాయ శాఖ సహాయ సంచాలుకులు నగేష్‌కుమార్ సలహాలు సూచనలు అందిస్తున్నారు. మల్చింగ్ సేద్యంతో నీరు ఆవిరి కాకుండా పొలాలకు పారించే నీటిని ఆదా చేయాలి... పారించిన నీరు వెంటనే ఆవిరి కాకుండా నివారించాలి. ప్రస్తుత పరిస్థితిలో ఇదే నీటి యాజమాన్యంలో కీలక మంత్రం. ప్రధాణంగా బిందు సేద్యంతో 50 శాతం వరకు నీటిని ఆదా చేస్తే పొలంలోని నీరు ఆవిరి కాకుండా మల్చింగ్ (ప్లాస్టిక్ పేపర్లు భూమిపై కప్పటం) విధానం అవలంభించాలి. దీంతో రైతు అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటితో గట్టెక్కే అవకాశం ఉంది. వీటితో పాటు పొలాల్లో చెట్లకు పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకల ఎరువులతో పాటు వర్మి కంపోస్టు లాంటి ఎరువులు వేసుకోవాలి. అలాగే ఆముదం, వేప, కానుగ వంటి చెట్ల ఆకులు లేదా పిండి చెట్ల మొదళ్లలో వేసుకోవాలి. ఇలాంటి సేంద్రియ ఎరువులు భూమిలో తేమను పట్టి ఉంచటంతో పాటు చెట్లకు కావాల్సిన పోషకాలు కూడా అందిస్తాయి. చెట్ల మొదళ్లలో ఆకులు, వేరుశనగ పొట్టు, వరి పొట్టు, గింజలు తీసిన మొక్కజొన్న కంకులు వంటి పంట అవశేషాలు నాలుగు అంగులాల మందంతో వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల తేమ త్వరగా ఆరిపోకుండా ఉండటంతో పాటు కలుపుమొక్కల బెడద కూడా తగ్గుతుంది. కొన్నిరోజుల తరువాత ఆ వ్యర్థ పదార్థాలన్నీ సేంద్రియ ఎరువులా మారి పంటకు పోషకాలను అందిస్తాయి. కొన్నిరకాల పండ్ల చెట్లు ఆకుల్ని విపరీతంగా రాలుస్తాయి. ఉదాహరణకు 20 సంవత్సరాల బంగినపల్లి(బెనిషాన్) మామిడి చెట్లు సంవత్సరంలో 42 వేల ఆకుల్ని రాలుస్తుంది. రాలిన ఆకులు తీసివేయకుండా చెట్టు మొదలులోనే ఉంచాలి. అది కూడా కుళ్లి ఎరువుగా మారుతుంది. పైపులైన్లతో నీరు పెట్టాలి కాలువల ద్వారా నీరు పారిస్తే నీరు ఆవిరై ఎక్కువగా వృథా అవుతుంది. నీరంతా కాలువలు తడపటానికే సరిపోతుంది. కాబట్టి రైతులు పైపులతోనే నేరుగా చెట్ల వరకు నీరు పారేలా చూసుకోవాలి. ఇదే సమయంలో బిందు సేద్యం ద్వారా నీటిని మొక్కలకు పారిస్తే 40శాతం వరకు నీరు ఆదా అవుతుంది. అవే పైపుల ద్వారా ఎరువులను అందిస్తే(ఫర్టిగేషన్) 20–30 శాతం ఎరువులు ఆదా అవుతాయి. కలుపు మొక్కల బెడద కూడా తగ్గి చెట్ల పెరుగుదల వేగంగా ఉండి తద్వారా దిగుబడులు కూడా పెరుగుతాయి. ప్రధానంగా వేసవిలో బావులు, బోరుబావులలో లభ్యమయ్యే నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఇందుకోసం చెట్ల పాదుల సైజు కూడా తగ్గించుకోవాలి. దీని ద్వారా అవే నీటిని ఎక్కువ చెట్లకు అందించవచ్చు. వర్షాకాలం రాగానే మళ్లీ చెట్ల పాదుల సైజు పెంచుకోవాలి. -
ఆ ఖాతాదారుల వివరాలివ్వండి
► కరెంట్ ఖాతాల్లో రూ.12.5 లక్షలు, అంతకుమించి డిపాజిట్ చేసినవారిపై ఐటీ శాఖ నజర్ ► సేవింగ్ ఖాతాల్లో రూ. 2.5 లక్షలు, అంతకన్నా ఎక్కువ జమచేసిన వారిపైనా కన్ను ► ఈ నెల 31లోపు వివరాలు అందించాలని బ్యాంకర్లకు ఆదేశం ► సమాచారం పంపకుంటే విచారణ తప్పదని హెచ్చరిక ► ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌పై బ్యాంకర్లకు శిక్షణ సాక్షి, హైదరాబాద్: నల్లధనంపై ఆదాయపు పన్ను శాఖ పోరును వేగవంతం చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిసెంబర్ 31 వరకు లెక్కకు మించిన సొమ్ము పలు ఖాతాల్లో డిపాజిట్ అయినట్టు గుర్తించింది. ఈ మేరకు బ్యాంకర్ల నుంచి సంబంధిత ఖాతాదారుల వివరాలను అందించాలని ఆదేశించింది. ఆ ఖాతాదారుల వివరాలను ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు తమకు చేరవేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌పై బుధవారం హైదరాబాద్‌లో బ్యాంకర్లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా హాజరైన బ్యాంకర్లకు ఐటీ ఇంటెలిజెన్స్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ బీవీ గోపీనాథ్ శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చాలా బ్యాంకులు తాము అడిగిన వివరాలివ్వడంతో ఆలసత్వం ప్రదర్శిస్తున్నాయని, ఈ నెలాఖరుకల్లా ఖాతాదారుల పూర్తి వివరాలను ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేయాలని స్పష్టంచేశారు. అడిగిన వివరాలు ఇవ్వని ఏపీజీవీబీ, దక్కన్ గ్రామీణ బ్యాంక్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము అడిగిన సమాచారం ఇవ్వకపోతే విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నవంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోని కరెంట్ అకౌంట్లో రూ.12.5 లక్షలు, అంతకు మించి డిపాజిట్ అయిన ఖాతాదారుల వివరాలు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో ఈ నెలాఖరుల్లా అప్లోడ్ చేయాలని సూచించారు. అలాగే సేవింగ్ బ్యాంక్ ఖాతాదారులకు సంబంధించి రూ.2.5 లక్షలు, అంతకుమించి జమ చేసినట్టుగా ఉంటే వారి వివరాలను పంపాలని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు అంటే నవంబర్ 1 నుంచి నవంబర్ 8 వరకు ఖాతాదారులు డబ్బులు డిపాజిట్ చేస్తే ఆ వివరాలు కూడా పంపాలని ఆదేశించారు. ఈ డిపాజిట్‌దారుల ఆర్థిక మూలాలు, ఇతరత్రా వివరాలపై ఐటీ శాఖ విచారణ జరుపుతుందని తెలిపారు. విచారణ, జరిమానా కూడా.. తాము అడిగే వివరాలను బ్యాంకర్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 31లోపు పంపించాలని, లేకపోతే బ్యాంకులపై విచారణ జరపాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఐటీ శాఖ ఉన్నతాధికారులు హెచ్చరించారు. తమకు సహకరించని బ్యాంకులకు భారీ స్థాయిలో జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని స్పష్టంచేశారు. డేటాబేస్‌లో కోటి మంది జాబితా పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐటీ శాఖ చేస్తున్న కసరత్తులో భాగంగా కోటి మంది ఖాతాదారుల జాబితాను డేటాబేస్‌లో నిక్షి ప్తం చేసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కోటి మందిలో ఐటీ నిబంధనలు ఉల్లం ఘించిన వారి వివరాలను సేకరిస్తున్నా మని, త్వరలోనే సంబంధిత డిపాజిట్‌దా రులను విచారించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. -
ఆ పోలీసు ప్రయత్నం ఫలించింది
-
పొదుపులో ఓర్వకల్లు మహిళలు ఆదర్శం
– రూ.15వేల కోట్లతో రైతుమిత్ర గ్రూపుల ఏర్పాటు – ఓర్వకల్లు మహిళలకు బాధ్యతలు – మొక్కజొన్న పంటకు ఫసల్ బీమా వర్తింపు – వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఓర్వకల్లు: పొదుపు సంఘాల ద్వారా ఓర్వకల్లు మహిళలు సాధించిన ఆర్థిక స్వాలంబన ఆదర్శనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఓర్వకల్లులో పొదుపు ఉద్యమాన్ని స్థాపించి 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం వార్షికోత్సవాన్ని నిర్వహించారు. వేడుకలకు మంత్రితో పాటు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, జెడ్పీ చైర్మెన్ మల్లెల రాజశేఖర్, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయకుమార్, కమిషనర్ ధనుంజయరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర మహిళా సాధికార సమన్వయకర్త విజయభారతి నేతృత్వంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ..రైతులను నష్టాల బారినుంచి తప్పించేందుకు రూ.15 వేల కోట్లతో మిత్ర గ్రూపులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తొలి విడతగా రాష్ట్రంలో 131 క్లస్టర్లలో 2లక్షల మంది రైతులతో 20వేల సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నామన్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను ఓర్వకల్లు పొదుపు సమాఖ్య మహిళలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి, ప్రకతి వ్యవసాయంపై ఆసక్తి కనబరచాలని సూచించారు. ఈ ఏడాది రబీ సీజన్‌కు సంబంధించి 98వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను పంపిణీకి సిద్ధం చేశామన్నారు. ఉల్లి ధర పతనమైన తరుణంలోకిలో రూ.7 నుంచి రూ.8 చొప్పున కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత విజ్ఞప్తి మేరకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని మొక్కజొన్న పంటకు కూడా వర్తింపజేస్తామన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ఓర్వకల్లు రైతాంగానికి సాగునీరు అందించే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. శనగ ఉత్పత్తులను నిల్వ ఉంచుకునేందుకు ఓర్వకల్లు ప్రాంతంలో ప్రభుత్వ గోదామును ఏర్పాటు చేస్తామన్నారు. మండలంలో ఐదేళ్లకు పైబడి ఎలాంటి బకాయిలు లేని మహిళా సంఘాలకు పొదుపు ద్వారా వచ్చిన రూ.కోటి రివాల్వింగ్ ఫండ్‌ను(ఒక్కొక్క సంఘానికి రూ.50 వేల చొప్పున )చెక్కు రూపేణ అందజేశారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జేసీ హరికిరణ్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, కేడీసీసీ బ్యాంకు చైర్మెన్ మల్లికార్జున రెడ్డి, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, పాణ్యం, ఆళ్లగడ్డ, ఆలూరు నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జ్‌లు ఏరాసుప్రతాపరెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి, వీరభద్రగౌడ్, టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి నాగేశ్వరరావుయాదవ్, ఆర్డీఓ రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. -
పొదుపుగా వాడండి
♦ తాగునీటికి రూ. 9.63 కోట్లు ♦ 741 పనులు మంజూరు ♦ 70 కిలో మీటర్ల మేర పైపులైన్ ♦ జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా నిజామాబాద్‌నాగారం : ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశమున్నందున ప్రతి ఒక్కరూ మంచి నీటిని పొదుపుగా వాడుకోవాలని కలెక్టర్ యోగితారాణా సూచించారు. నీటి ఎద్దడి నివారణకు నిధుల కొరతలేదన్నారు. సీఆర్ఎఫ్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 9.63 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ నిధుల నుంచి రూ. 4.96 కోట్ల విలువైన 741 పనులను మం జూరు చేసినట్లు పేర్కొన్నారు. 535 బోరుబావులను ప్లషిం గ్‌తో పాటు, డీపెనింగ్ చేయిం చామన్నారు. 195 బోరుబావులను అద్దెకు తీసుకుని, రక్షిత నీటి పథకాలకు అనుసంధానం చేసేందుకు 70 కిలో మీటర్ల పైపులైన్లను తాత్కాలికంగా నిర్మించామన్నారు. ప్ర స్తుతం గ్రామాలకు ట్రా న్సుపోర్టేషన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్న ట్లు తెలిపారు. గత సంవత్సరం ఈ రోజుకు 16 గ్రామాలకు నీటిని ట్రాన్సుపోర్టేషన్ చేసినట్లు తెలిపారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, చేంజ్ ఏజెం ట్లతో ఏర్పాటు చేసిన అధికారుల బృందం రెగ్యులర్‌గా క్షేత్రస్థాయి పరిస్థితుల ను మాని టరింగ్ చేస్తూ యుద్ధప్రాతిపదికన నీటి ఎద్దడి నివారణ పనులను చేపడుతున్నా రు. నీటి ఎద్దడిని తెలుసుకునేందుకు ఎంపీపీ లు, జెడ్పీటీసీ సభ్యులతో వాట్సప్ గ్రూపు ల ను జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. మండల స్థాయి అధికారులతో ప్రతి సోమవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షిస్తున్నారు. అలా గే కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ 1800 425 6644 ఏర్పాటు చేసి, ఇద్దరు ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులను నియమించారు. ముందుముం దు ఎండల తీవ్రత పెరిగే అవకాశమున్నం దున ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాల న్నారు. ప్రజలకు అందుబాటు లో ఉం డాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, డీఈఈలను ఆదేశిం చారు. నీటి ఎద్దడి నివారణకు ప్రతిపాదించే పనులను 24 గంటలలోపు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజా ప్రతి నిధుల భాగస్వామ్యంతో ఈ వేసవిలో నీటి ఎద్దడిని అధిగమించనున్నట్లు తెలిపారు. -
‘ఆమె’ భద్రతే ధ్యేయంగా..
ఆమె.. మహిళా భద్రతే ధ్యేయంగా పోరాటం చేస్తోంది. 18 ఏళ్ల వయసులో ఓ పోకిరి లైంగిక దాడి నుంచి తప్పించుకొని బయటపడింది. తాను ఎదుర్కొన్న సమస్య మరే మహిళకూ ఎదురు కాకూడదని, లక్నోలో 15 మంది సభ్యులతో రెడ్ బ్రిగేడ్ పేరున ఉషా విశ్వకర్మ పోరాటం ప్రారంభించింది. 2011లో చిన్నగా ప్రారంభమైన ఆ సంస్థ ఇప్పుడు దేశవ్యాప్తంగా 8,500 మందితో కొనసాగుతోంది. లైంగిక హింసను దేశవ్యాప్తంగా నిర్మూలించేందుకు రెడ్ బ్రిగేడ్ స్థాపకురాలు ఉషా విశ్వకర్మ నడుం బిగించింది. మొదట్లో మహిళల్లో అవగాహన కోసం మేం నిర్వహించే వీధి నాటకాలు, ఉద్యమాల సమయంలో ఎర్రని దుస్తులు ధరించడం చూసినవారంతా సరదాకు మమ్మల్ని రెడ్ బ్రిగేడ్ అని పిలిచేవారని, ఆ పేరునే తమ గ్రూప్‌నకు పెట్టుకున్నామని ఉష చెప్పారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలకు సహాయం అందించడంతో ప్రారంభించిన ఉద్యమం.. నేడు పలు రకాల మహిళా సమస్యలపై పోరాటం వరకు వెళ్లింది. అపరాధుల ఇళ్లకు వెళ్లి వారికి ఫిర్యాదుచేసి, కుటుంబ సభ్యుల్లోనూ అవగాహన కల్పించి.. మార్పు తెచ్చేందుకు ప్రయత్రాలు ప్రారంభించిన రెడ్ బ్రిగేడ్.. ఒక్కోసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు స్వయంగా వారి బుద్ధి చెప్పే ప్రయత్నాలు కూడా చేసేవారు. రాను రాను మహిళలకు ఆత్మరక్షణ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం, పాఠశాలల్లో బాలికలకు శిక్షణ తరగతులను నిర్వహించడం ప్రారంభించింది. ఎదుటివారి బలహీనతలే లక్ష్యంగా పోరాడేందుకు ప్రత్యేక బోధనా తరగతులను నిర్వహించడం రెడ్ బ్రిగేడ్ కార్యక్రమాల్లో భాగమైంది. 6-11 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకు ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’ పేరున ప్రత్యేక బోధనతో పాటు.. ఆత్మరక్షణకు ప్రత్యేక సందర్భాల్లో ఎలా స్పందించాలో నేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలకు, చదువు, పెళ్లి లాంటి విషయాలపైనా, మహిళా హక్కులపైనా అవగాహన తరగతులను నిర్వహిస్తున్నారు. పై చదువులు చదవాలనుకున్న వారికి సాయం అందించడంతో పాటు... వివిధ సమస్యలపై అవగాహన ర్యాలీలు, ఉద్యమాలను చేపట్టిన రెడ్ బ్రిగేడ్ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈవ్ టీజింగ్, అత్యాచార బాధితుల్లో జీవితంపై అవగాహన కల్పించి, ఆసక్తిని పెంచి, తిరిగి వారి కాళ్లపై వారు నిలబడేందుకు రెడ్ బ్రిగేడ్ సహాయపడుతోంది. 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ తర్వాత ప్రతినెలా 29న అత్యాచార బాధితులకు మద్దతునిస్తూ ప్రత్యేక నిరసన ర్యాలీలు నిర్వహిస్తోంది. రెడ్ బ్రిగేడ్ ప్రారంభించినప్పుడు సమాజం నుంచి, కుటుంబం నుంచి ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని, కొందరు తనను కాల్ గర్ల్ అని కూడా పిలిచేవారని, సమాజానికి భయపడి తల్లిదండ్రులు కూడా తనకు వ్యతిరేకంగానే ఉండేవారని ఉషా చెప్పింది. అయితే రెడ్ బ్రిగేడ్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రపంచవ్యాప్త గుర్తింపుతో రాను రాను విమర్శలు తగ్గడంతో పాటు.. వ్యతిరేకించిన వారే సహాయానికి ముందుకు వచ్చారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓసారి బాలికను వేధిస్తున్నఓ పెద్దింటి కుర్రాడి విషయంలో అతడి కుటుంబ సభ్యులు ఉషాపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి జైల్లో పెట్టించారు. ఆ సమయంలో సుమారు 100 మంది మహిళలు పోలీసుస్టేషన్లో ఆమెకు మద్దతుగా నిలిచారు. ఉషాను విడిపించాలి, లేదంటే మమ్మల్ని కూడా జైల్లో పెట్టాలని డిమాండ్ చేయడం రెడ్ బ్రిగేడ్‌కు లభించిన మంచి గుర్తింపు అని ఉషా చెబుతారు. అయితే తమ సేవలను మరింత విస్తరించేందుకు ఆర్థిక స్థోమత సరిపోవడం లేదని, మహిళల రక్షణకు మరింతమంది చేయి కలపాలని ఆమె కోరుతున్నారు.