బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న పలువురు భారతీయ వైద్యులు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. అయితే దీనికన్నా తమ కర్తవ్యమే ముఖ్యమని భావిస్తూ, దేశంలో జరిగిన అల్లర్లలో గాయపడినవారికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆ దేశంలో ఉన్న భారతీయ వైద్యులు రాజధాని ఢాకాలోనే ఉంటూ వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు.
మీడియాతో పలువురు వైద్యులు మాట్లాడుతూ ఢాకాలోని పలు ఆసుపత్రులు అల్లర్ల భాధితులతో నిండిపోయాయని, వారికి సేవలు అందించడమే తమ కర్తవ్యమన్నారు. బాధితుల సంఖ్య పెరగడంతో ఆస్పత్రులపై భారం మరింతగా పెరిగిందన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో తాము ఇక్కడే ఉంటామన్నారు. పాత ఢాకాలోని ఒక ఆస్పత్రికి చెందిన వైద్యుడు ఫోన్‌లో మాట్లాడుతూ నిరసనకారులు, పోలీసుల మధ్య తాజా ఘర్షణల తరువాత మృతుల సంఖ్య పెరిగిందన్నారు. బాధితులకు సేవలు అందించేందుకు తాము రోజుకు 17 నుండి 18 గంటలు పని చేస్తున్నామన్నారు.
గుజరాత్‌కు చెందిన మరో వైద్యుడు మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని, అయితే తాము డిగ్రీ పూర్తి చేసే సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడుతామని ప్రమాణం చేశామని, దానికి కట్టుబడి ఉంటామని అన్నారు. ఈ కష్ట సమయంలో బాధితులకు సేవ చేయడమే తమ కర్తవ్యమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment