పొదుపుగా వాడండి
♦ తాగునీటికి రూ. 9.63 కోట్లు
♦ 741 పనులు మంజూరు
♦ 70 కిలో మీటర్ల మేర పైపులైన్
♦ జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా
నిజామాబాద్‌నాగారం : ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశమున్నందున ప్రతి ఒక్కరూ మంచి నీటిని పొదుపుగా వాడుకోవాలని కలెక్టర్ యోగితారాణా సూచించారు. నీటి ఎద్దడి నివారణకు నిధుల కొరతలేదన్నారు. సీఆర్‌ఎఫ్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 9.63 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ నిధుల నుంచి రూ. 4.96 కోట్ల విలువైన 741 పనులను మం జూరు చేసినట్లు పేర్కొన్నారు. 535 బోరుబావులను ప్లషిం గ్‌తో పాటు, డీపెనింగ్ చేయిం చామన్నారు.
195 బోరుబావులను అద్దెకు తీసుకుని, రక్షిత నీటి పథకాలకు అనుసంధానం చేసేందుకు 70 కిలో మీటర్ల పైపులైన్లను తాత్కాలికంగా నిర్మించామన్నారు. ప్ర స్తుతం గ్రామాలకు ట్రా న్సుపోర్టేషన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్న ట్లు తెలిపారు. గత సంవత్సరం ఈ రోజుకు 16 గ్రామాలకు నీటిని ట్రాన్సుపోర్టేషన్ చేసినట్లు తెలిపారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు, చేంజ్ ఏజెం ట్లతో ఏర్పాటు చేసిన అధికారుల బృందం రెగ్యులర్‌గా క్షేత్రస్థాయి పరిస్థితుల ను మాని టరింగ్ చేస్తూ యుద్ధప్రాతిపదికన నీటి ఎద్దడి నివారణ పనులను చేపడుతున్నా రు. నీటి ఎద్దడిని తెలుసుకునేందుకు ఎంపీపీ లు, జెడ్పీటీసీ సభ్యులతో వాట్సప్ గ్రూపు ల ను జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు.
మండల స్థాయి అధికారులతో ప్రతి సోమవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షిస్తున్నారు. అలా గే కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నంబర్ 1800 425 6644 ఏర్పాటు చేసి, ఇద్దరు ఆర్‌డబ్ల్యూఎస్ ఉద్యోగులను నియమించారు. ముందుముం దు ఎండల తీవ్రత పెరిగే అవకాశమున్నం దున ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాల న్నారు. ప్రజలకు అందుబాటు లో ఉం డాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు, డీఈఈలను ఆదేశిం చారు. నీటి ఎద్దడి నివారణకు ప్రతిపాదించే పనులను 24 గంటలలోపు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజా ప్రతి నిధుల భాగస్వామ్యంతో ఈ వేసవిలో నీటి ఎద్దడిని అధిగమించనున్నట్లు తెలిపారు.