good water
-
ప్రతీ ఇంటికి రక్షిత మంచినీరు అందించడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ఆవాస గ్రామాలకు సురక్షిత మంచి నీరు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరే షన్తో అన్ని ఆవాసాలను అనుసంధానించాలని సూచించారు. కుళాయి ద్వారా రక్షిత మంచి నీరు అందని గ్రామాలను గుర్తించి తక్షణమే పనులు ప్రారంభించాలన్నారు. శనివారం సచివాలయంలో మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు సమావేశంలో అధికారులు మిషన్ భగీరథ పథకంపై అధికారులు ఆడిట్ నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ...ఏజెన్సీ ప్రాంతాల్లో, అడవుల్లో నివసించే ప్రజలకు సైతం కుళాయి నీళ్లు అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటవీ ఆవాస గ్రామాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి బోర్ల ద్వారా తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. పీఆర్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్‌రెడ్డి, తెలంగాణ రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. -
రూపాయికే లీటర్ మంచి నీరు
-బోయినపల్లిలో పోలీసు స్టేషన్ వద్ద వాటర్ ఏటీఎం ప్రారంభం కంటోన్మెంట్(హైదరాబాద్‌సిటీ) రూపాయికే లీటరు మంచినీటిని అందించే ఏటీఎంలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ముఖ్యంగా బస్టాండ్లలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పి. మహేందర్‌రెడ్డి అన్నారు. పరిమళ్ సర్వజల్ పేరిట కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో బోయిన్పల్లి పోలీసు స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన రూపాయికే లీటరు మంచినీటిని అందించే ఏటీఎంను ఎంపీ మల్లారెడ్డితో కలిసి ఆదివారం మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. కంటోన్మెంట్ పరిధిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును నగరంలోనూ విస్తరించేలా తన వంతు ప్రయత్నం చేస్తామన్నారు. బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని ప్రత్యక్షంగా చూసి బోర్డు ఆధ్వర్యంలో ‘పరిమళ్ సర్వజల్’ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపామన్నారు. ఒక్క రూపాయికే లీటరు శుద్ది చేసిన చల్లని తాగునీటిని అందించే ఈ మిషన్ సోలార్ పవర్ ద్వారా పనిచేస్తుందన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే కంటోన్మెంట్ వ్యాప్తంగా త్వరలో మరిన్ని ఏటీఎంలను ప్రారంభిస్తామన్నారు. -
పొదుపుగా వాడండి
♦ తాగునీటికి రూ. 9.63 కోట్లు ♦ 741 పనులు మంజూరు ♦ 70 కిలో మీటర్ల మేర పైపులైన్ ♦ జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా నిజామాబాద్‌నాగారం : ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశమున్నందున ప్రతి ఒక్కరూ మంచి నీటిని పొదుపుగా వాడుకోవాలని కలెక్టర్ యోగితారాణా సూచించారు. నీటి ఎద్దడి నివారణకు నిధుల కొరతలేదన్నారు. సీఆర్ఎఫ్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 9.63 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ నిధుల నుంచి రూ. 4.96 కోట్ల విలువైన 741 పనులను మం జూరు చేసినట్లు పేర్కొన్నారు. 535 బోరుబావులను ప్లషిం గ్‌తో పాటు, డీపెనింగ్ చేయిం చామన్నారు. 195 బోరుబావులను అద్దెకు తీసుకుని, రక్షిత నీటి పథకాలకు అనుసంధానం చేసేందుకు 70 కిలో మీటర్ల పైపులైన్లను తాత్కాలికంగా నిర్మించామన్నారు. ప్ర స్తుతం గ్రామాలకు ట్రా న్సుపోర్టేషన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్న ట్లు తెలిపారు. గత సంవత్సరం ఈ రోజుకు 16 గ్రామాలకు నీటిని ట్రాన్సుపోర్టేషన్ చేసినట్లు తెలిపారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, చేంజ్ ఏజెం ట్లతో ఏర్పాటు చేసిన అధికారుల బృందం రెగ్యులర్‌గా క్షేత్రస్థాయి పరిస్థితుల ను మాని టరింగ్ చేస్తూ యుద్ధప్రాతిపదికన నీటి ఎద్దడి నివారణ పనులను చేపడుతున్నా రు. నీటి ఎద్దడిని తెలుసుకునేందుకు ఎంపీపీ లు, జెడ్పీటీసీ సభ్యులతో వాట్సప్ గ్రూపు ల ను జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. మండల స్థాయి అధికారులతో ప్రతి సోమవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షిస్తున్నారు. అలా గే కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ 1800 425 6644 ఏర్పాటు చేసి, ఇద్దరు ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులను నియమించారు. ముందుముం దు ఎండల తీవ్రత పెరిగే అవకాశమున్నం దున ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాల న్నారు. ప్రజలకు అందుబాటు లో ఉం డాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, డీఈఈలను ఆదేశిం చారు. నీటి ఎద్దడి నివారణకు ప్రతిపాదించే పనులను 24 గంటలలోపు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజా ప్రతి నిధుల భాగస్వామ్యంతో ఈ వేసవిలో నీటి ఎద్దడిని అధిగమించనున్నట్లు తెలిపారు. -
విషజలాన్నేతాగుతున్నారు
2 వేల గ్రామాల్లో మంచినీళ్లు విషపూరితం గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని దాదాపు రెండు వేల గ్రామాల్లో ప్రజలు పూర్తిగా ఫ్లోరైడ్‌తో పాటు విషపూరిత జలాలనే మంచినీరుగా తాగుతున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏపీలో 745 గ్రామాల్లో ఫ్లోరైడ్, మరో నాలుగు గ్రామాల్లో మాంగనీసు మూలకంతో భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయి. తెలంగాణలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు 1,174 ఉండగా, మాంగనీస్ మూలకంతో నీరు కలుషితమైన గ్రామాలు మరో మూడు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో రానున్న మూడేళ్లలో ప్రతి వ్యక్తికి 8 నుంచి 10 లీటర్ల రక్షిత నీటిని అందించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రభావిత గ్రామాల్లో నీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, లేదంటే ఆ గ్రామానికి దగ్గర నదులు, కాల్వల నుంచి నీటిని మళ్లించి ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందజేస్తారు. దీనిపై రాష్ట్రాలకు సలహాలిచ్చేందుకు కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా గ్రామాల్లో నీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, భవన వసతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం నిధులు అందజేస్తాయి. అయితే ఆయా రక్షిత మంచినీటి ప్లాంట్ల నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిధులు అందజేయవు. ఆ బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. ఆ కాంట్రాక్టర్లు గ్రామస్తుల నుంచి నామమాత్రపు రుసుం వసూలు చేస్తూ పదేళ్ల పాటు రక్షిత నీటి ప్లాంట్లు నిర్వహిస్తారు. ఈ రక్షిత నీటి పథకాలను ఏపీలో ఈ ఆర్థిక ఏడాది 166, వచ్చే ఏడాది 333, ఆపై ఏడాది మిగిలిన 250 గ్రామాల్లో ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో ఈ ఏడాది 262, రెండో సంవత్సరం 523, మూడో సంవత్సరం 392 గ్రామాల్లో ఏర్పాటు చేయనున్నారు. -
నీరు-పోరు
బళ్లారిలో మంచినీటి కోసం రోడ్డెక్కుతున్న కాలనీవాసులు ధర్నాలు, రాస్తారోకోలు నిత్యకృత్యం రిజర్వాయర్ నిండేవరకూ సహకరించాలంటున్న కమిషనర్ సమస్య ఉన్న కాలనీలకు రోజుకు ఒక్క డ్రమ్ నీటి సరఫరా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగరవాసులు సాక్షి, బళ్లారి : నగర సమీపంలోనే హెచ్ఎల్సీ కాలువలు వెళ్తున్నా బళ్లారి వాసుల దాహార్తి తీరడం లేదు. దీంతో గుక్కెడు నీటి కోసం అలమటించాల్సిన దుస్థితి నెలకొంది. దాదాపు 4 లక్షలకుపైగా జనాభా ఉన్న బళ్లారికి మంచినీటిని అందించేందుకు తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీకి వారం రోజుల క్రితమే రోజుకు 400 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. అయినప్పటికి కాలువ నుంచి రిజర్వాయర్‌కు నీటిని పంప్‌చేసి అక్కడినుంచి నగరానికి సరఫరా చేయడంలో కార్పొరేషన్ పాలకులు, అధికారులు దృష్టి పెట్టలేదు.ఫలితంగా రోజురోజుకు సమస్య జఠిలమవుతోంది. 35 వార్డుల్లోనూ ఏదో ఒక వార్డులో రోజు మంచినీటి కోసం ధర్నాలు, నిరసనలు, రాస్తారోకో, అధికారుల నిలదీత జరుగుతూనే ఉన్నాయి. కార్పొరేటర్లు వార్డుల్లోని నీటి సమస్య తీర్చడంలో శ్రద్ధ చూపడం లేదని, ట్యాంకర్లు కొన్ని కాలనీలకే పంపుతున్నారని, మిగిలిన కాలనీలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. నగర శివార్లలో సమస్య మరింత తీవ్రం నగర శివార్లలోని అల్లీపురం, వినాయక్‌నగర్ తదితర కాలనీల్లో నీటి సమస్య మరింత తీవ్రమైంది.అల్లీపురం పక్కనే రిజర్వాయర్ ఉన్నప్పటికి మంచినీటి కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికి ఒక డ్రమ్ నీరు మాత్రమే సరఫరా చేస్తుండటంతో ఆనీరు తమ అవసరాలకు సరిపోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. మరో వైపు ట్యాంకర్లు వచ్చినప్పుడు తోపులాట జరుగుతోంది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి హెచ్ఎల్సీ నీటితో రిజర్వాయర్లు నింపి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నీటి కోసం కార్యాలయం ముట్టడి పక్షం రోజులుగా నీటిని సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ బళ్లారిలోని సిద్ధార్థనగర్, శ్రీహరి కాలనీ, శ్రీకనకదుర్గమ్మ లేఅవుట్, బదిరీ నారాయణ దేవస్థానం సమీపంలోని ప్రాంతాలవాసులు బుధవారం ఆందోళనకు దిగారు. మూకుమ్మడిగా గాంధీనగర్ వాటర్ బూస్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం కార్యాలయ తలుపులు మూసివేసి అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. స్థానిక కార్పొరేటర్ మల్లనగౌడ స్పందించి కమిషనర్ చిక్కణ్ణను అక్కడకే పిలిచించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ ప్రతి నెల పన్నులు చెల్లిస్తున్నా మంచినీరు సరఫరా చేయకపోవడంలో ఆంతర్యమేమిటని గంగాధర్ పత్తార్, హిరేమఠ్, మల్లేష్, తాయారు, పురుషోత్తంరెడ్డి, బాలరాజు తదితరులు కమిషనర్‌ను నిలదీశారు. 15 రోజులైనా నీరు సరఫరా చేయకపోవడంతో ఇళ్లు ఖాళీ చేసి బంధువులు ఇళ్లకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిని విడుదల చేసేవరకు ఇక్కడినుంచి కదిలేది లేదని బీష్మించుకుకూర్చున్నారు. కమిషనర్ మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం నుంచి అల్లీపురం, మోకా రిజర్వాయర్‌లోకి నీటిని పంప్ చేసేవరకు సమస్య ఉంటుందని, అంతవరకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
మోడల్ పట్టణంగా అనకాపల్లి
రూ.65 కోట్లతో శాశ్వత మంచినీటి ప్రణాళిక ఏలేరు కాలువ నుంచి నీటి మళ్లింపు ఆధునిక బస్షెల్టర్లు, సెంట్రల్ లైటింగ్ జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ అనకాపల్లిరూరల్: అనకాపల్లిని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ వెల్లడించారు. అనకాపల్లి జోనల్ కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణ వాసుల మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.65 కోట్లతో ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అలాగే రూ.70 లక్షలతో పాతపైపులైన్ల స్థానంలో కొత్తవి వేస్తామని చెప్పారు. పూడిమడక రోడ్డులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, రూ.18.5 లక్షలతో నూకాంబిక గుడి, వేల్పులవీధి, చిరంజీవి బస్టాప్, కూరగాయల మార్కెట్ వద్ద మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. అలాగే రూ.3.5 లక్షలతో ఆధునిక బస్షెల్టర్లు నిర్మిస్తామని చెప్పారు. మున్సిపల్ మైదానం వద్ద ఇద్దరు నైట్వాచ్మన్లను, లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నీటి వృథా అరికట్టేందుకు రూ.2.65 లక్షలతో కుళాయిలకు హెడ్స్ బిగిస్తామని చెప్పారు. కొత్తగా 20 చోట్ల బోరుబావులు తవ్విస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 400 బీపీఎల్ కుళాయి కనెక్షన్లు తక్షణం మంజూరు చేయనున్నట్లు చెప్పారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం పట్టణాన్ని వేధిస్తున్న డంపింగ్ యార్డు సమస్యకు కూడా త్వరలోనే పరిష్కారం కనుక్కుంటామని చెప్పారు. శారదనగర్‌లో ప్రస్తుతం ఉన్న చెత్తను పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. పారిశుద్ధ్యం మెరుగుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ శ్రీనివాసరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ సత్యనారాయణరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ పి.వి.జగన్నాథరావు పాల్గొన్నారు. -
ఆ ‘ఊరి’ కూరగాయలు...
ప్రత్యేకం ప్రతి ఇంటికీ నాలుగు కాయగూర మొక్కలుంటే వంటకు తడుముకోవక్కర్లేదు. రోజురోజుకీ పెరిగిపోతున్న కాయగూరధరల కారణంగా పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టాలనుకున్నారు కేరళలోని పడమటి కనుమల్లో మారుమూల ప్రాంతానికి చెందిన లిక్కనానమ్ గ్రామస్తులు. అధిక పెట్టుబడుల కారణంగా ఆ ఊళ్లో రైతులు కాయగూరలు పండించడానికి ముందుకు రాకపోవడంతో దూరంగా ఉన్న మార్కెట్‌కి వెళితేగాని నాలుగు రకాల కాయగూరలు కళ్లచూడని దుస్థితి. ఎలాగైనా ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడాలనుకున్నారు ఆ గ్రామంలోని స్వయం ఉపాధి సంఘాలకు చెందిన మహిళలు. వారు ఓ స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం పెట్టుకుని రకరకాల కాయగూరల మొక్కల్ని ఇంటింటికీ పంచాలనుకున్నారు. మంచి నీళ్లు తాగే ప్లాస్టిక్ గ్లాసుల్లో మొలకలు పెట్టి మహిళలందరికీ పంచారు. ఇంటికి ఐదు రకాల మొక్కల చొప్పున అందరిళ్లలో మొక్కలు నాటేవరకూ వాళ్లు నిద్రపోలేదు. అంతేకాదు... అప్పుడప్పుడు వాటిని పర్యవేక్షించే పనికూడా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఓ రోజుతో వదిలేయకుండా విడతలవారీగా కాయగూర మొక్కల్ని పంచే అక్కడి మహిళల పథకాన్ని చుట్టుపక్కల గ్రామాల వరకూ విస్తరించడానికి ప్రయత్నించడం విశేషం. ఇలా పెంచే మొక్కలకు రసాయనిక ఎరువులు వాడకూడదనేది అక్కడి మహిళలు పెట్టిన నిబంధన. కేవలం సేంద్రియ ఎరువులతోనే ఆ మొక్కల్ని పెంచాలి. ఎంచక్కా పెరట్లో నాలుగు రకాల కాయగూరలు అందుబాటులో ఉంటే ఆదాతో పాటు ఆరోగ్యం కూడా వుంటుందంటున్నారు లిక్కనానమ్ గ్రామ మహిళలు. -
దర్శనానికి దారేది?
రెండో రోజూ 6 గంటలకు పైగానే.. క్యూ లైన్లలో భక్తుల బారులు మా వాళ్లకే ముందంటూ పోలీసులు సామాన్యులకు తప్పని తిప్పలు గంటల తరబడి ఆలస్యం ముఖ ద్వారం వద్దే మొక్కులు మేడారం, న్యూస్‌లైన్ బృందం : సమ్మక్క కో... సారక్క కో... అంటూ భక్తిభావంతో ఉప్పొంగాల్సిన గద్దెల ప్రాంగణం పోలీసుల దౌర్జన్యం నశించాలి... పోలీసులు డౌ న్... డౌన్ నినాదాలతో శుక్రవారం దద్దరిల్లింది. పోలీసుల వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. భక్తులకు ఇబ్బందులు రానీయమంటూ రెండు నెలలుగా వంద కోట్లు ఖర్చు పెట్టి హడావుడి చేసిన అధికార యంత్రాంగం... తీరా సమయంలో పూర్తిగా చేతులెత్తేసింది. ఫలితంగా ఇద్దరు తల్లులు కొలువై ఉన్న రెండో రోజూ దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. చంటి పిల్లలు, వృద్ధులు క్యూ లైన్లలో నరకయాతన పడ్డారు. తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. లైన్లలో ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది మహిళలు పిల్లలను తీసుకుని బయటకు వచ్చేశారు. ఆలయ ముఖం ద్వారం ఎదుటే కొబ్బరికాయలు, పసుపు కుంకుమలు చల్లి, బంగారం కూడా అక్కడే సమర్పించి తల్లులను చూడకుండానే అసంతృప్తితో వెనుదిరిగారు. కొంతమంది క్యూ లైన్ల వద్ద ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కూడా వారి బంధువర్గం, ఉన్నతాధికారుల బంధువులు, కుటుం బాలకు సపర్యలు చేయడంలో నిమగ్నమై భక్తులను గాలికొదిలేశారు. అదే తీరు... దక్కని దర్శనం గురువారం ఉదయమే క్యూ లైన్లలో సంజయ్ అనే బాలుడు ఊపిరాడక చనిపోగా... 500 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. అయినప్పటికీ.. క్యూ లైన్లలో ఉన్న ఇబ్బందులను గుర్తించేందుకు అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం గంటల తరబడి నిలబడి ఉన్న వారికి మంచినీళ్లు కూడా అందించే వారు కరువయ్యారు. పోలీసులు లేకపోవడం, క్యూ లైన్లలో భక్తులు ఇబ్బందులు పడుతుండడంతో.. ఎమ్మెల్యే సీతక్క సాయంత్రం 5.30 గంటలకు స్వయంగా వచ్చి గద్దెల వద్ద మైక్‌లో పోలీసులు రావాలని పదేపదే కోరారు. ఎట్టకేలకు ఐజీ రవిగుప్తా వచ్చి భక్తులను ముందుగా చెదరగొట్టారు. రూరల్ ఎస్పీ కాళిదాసుతో సహా సీఆర్పీఎఫ్ బలగాలు భక్తులను విసురుగా వెనక్కి నెట్టారు. దీంతో కలసివచ్చిన భక్తులు చెల్లాచెదురయ్యారు. ఒకరి కోసం ఒకరు ఆతృతగా వెతుకుతూ కనిపించారు. సర్వ దర్శనం లైన్‌లోని భక్తులు ఓపిక నశించి వీఐపీ దర్శనం బారికేడ్లు కింద పడేసి అటు వైపు వెళ్లారు. ముందుగా మా సేవ.. సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించేం దుకు పోలీసుల కుటుంబ సభ్యులు సైతం బారులుదీరారు. దీంతో పోలీసులు కూడా వారి బంధువులు, ఉన్నతాధికారుల బంధువర్గాన్ని ప్రత్యేక దర్శనం లైన్లో తీసుకెళ్లారు. ఉదయం నుంచి భక్తుల ఇబ్బందులను పట్టించుకోని పోలీసులు... వారి బంధువర్గం సేవలో మా త్రం నిమగ్నమయ్యారు. బారికేడ్ల నుంచి తప్పించుకుంటూ తీసుకెళ్లి దర్శనం చేయించారు. బంగారం కోసం పరుగులు మొక్కులు చెల్లించిన తర్వాత గద్దెల వద్దే బంగారం (బెల్లం) తీసుకోవడం ఆనవాయితీ. అయితే బంగారం తీసుకోవడానికి భక్తులు ఎక్కువగా అక్కడే ఉంటున్నారనే కారణంతో... గద్దెల వద్ద కాకుండా బయట ప్రత్యేకంగా విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ... దీనిపై ఎలాంటి ప్రచారం చేయడం లేదు. రెండు గంటలకోసారి మైక్‌ల్లో చెప్పి వదిలేస్తున్నారు. దీంతో ప్రసాదం కోసం భక్తులు గద్దెల వద్దే కొంత సమయం ఉంటున్నారు. ఫలితంగా క్యూ లైన్ల వేగం మందగిస్తోంది. పోలీసులు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం భక్తుల ఇబ్బందులను తొలగించలేకపోయింది. భక్తులకు సేవలు అందిస్తున్నాం జాతరకు వచ్చిన భక్తులకు అధికారులు సేవలందిస్తున్నారు. అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. భక్తుల ఇబ్బందులు తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. - సంజీవయ్య, ఏజేసీ, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పొద్దుగాల పోతే గిప్పుడచ్చినం అమ్మలకు మొక్కులు చెల్లించుకోవడానికి పొద్దుగాల లైన్లకు పోతే గిప్పుడు బయటకు వచ్చినం. తాగుదామంటే నీళ్లు కూడా దొరకకపాయె. క్యూ ముందుకు కదలకపోవడంతో అవస్థలు పడుతూనే అందులో ఉండాల్సి వచ్చింది. అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. - బంగారు మహేశ్వరి, ఖమ్మం రోడ్లపైనే పడిగాపులు మొక్కులు చెల్లించుకోవడానికి క్యూలైన్ వద్దకు వస్తే రోడ్డుకు ఇరువైపులా భక్తులు ఉండడంతో షాపులకు వేసిన షెడ్ల వద్ద సేదదీరుతున్నాం. రద్దీ తగ్గితే వెళ్దామని అనుకుంటున్నాం. వీవీఐపీ, వీఐపీ, సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్లు కిక్కిరిసిపోవడంతో రోడ్లపైనే ఎండలో అవస్థలు పడుతున్నాం. - కీర్తి మధుకర్, చెన్నూరు, ఆదిలాబాద్