ఈసారి విమానం ఎక్కేవారిదే ఆనందం! | Big Savings For Flyers As Diwali Airfares Dropped | Sakshi
Sakshi News home page

ఈసారి విమానం ఎక్కేవారిదే ఆనందం!

Published Mon, Oct 14 2024 3:11 PM | Last Updated on Mon, Oct 14 2024 3:32 PM

Big Savings For Flyers As Diwali Airfares Dropped

సాధారణంగా దీపావళి పండుగ సీజన్‌లో విమాన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఒక విశ్లేషణ ప్రకారం.. ఈ దీపావళి సీజన్‌ విమాన ప్రయాణికులకు మరింత ఆనందం కలిగిస్తోంది. కారణం.. అనేక దేశీయ రూట్లలో సగటు విమాన ఛార్జీలు గత సంవత్సరంతో పోలిస్తే 20-25 శాతం తగ్గాయి.

ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో విశ్లేషణ ప్రకారం.. దేశీయ మార్గాల్లో సగటు విమాన ఛార్జీలు 20-25 శాతం శ్రేణిలో క్షీణించాయి. ఇవి 30 రోజుల ఏపీడీ (ముందస్తు కొనుగోలు తేదీ) వన్-వే సగటు ఛార్జీల ధరలు. దీపావళి సీజన్‌ విమాన టికెట్‌ల కొనుగోలు సమయాన్ని గతేడాది నవంబర్ 10-16 తేదీల మధ్య పరిగణించగా ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 మధ్య జరిగిన కోనుగోళ్లను పరిగణనలోకి తీసుకున్నారు.

విశ్లేషణ ప్రకారం బెంగళూరు-కోల్‌కతా విమానానికి సగటు విమాన ఛార్జీలు గరిష్టంగా 38 శాతం క్షీణించాయి. గత ఏడాది రూ.10,195 నుండి ఈ ఏడాది రూ.6,319కి తగ్గాయి. చెన్నై-కోల్‌కతా మార్గంలో టిక్కెట్ ధర రూ.8,725 నుంచి రూ.5,604కి 36 శాతం తగ్గింది.

ఇదీ చదవండి: ఓలా.. అలా కుదరదు.. రిఫండ్‌ ఇవ్వాల్సిందే!

ముంబై-ఢిల్లీ విమానాల సగటు విమాన ఛార్జీలు రూ.8,788 నుంచి రూ.5,762కి 34 శాతం తగ్గాయి. అదేవిధంగా ఢిల్లీ-ఉదయ్‌పూర్ రూట్‌లో టికెట్ ధరలు రూ.11,296 నుంచి రూ.7,469కి 34 శాతం క్షీణించాయి. ఢిల్లీ-కోల్‌కతా, హైదరాబాద్-ఢిల్లీ, ఢిల్లీ-శ్రీనగర్ మార్గాల్లో 32 శాతం క్షీణత ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement