dropped
-
‘వినియోగం’ గణనీయంగా తగ్గింది!
దాదర్: ముంబైలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. గత వారం దాకా ఉక్కపోతతో సతమతమైన ముంబైకర్లకు ఇప్పుడు చలి కారణంగా కొంతమేర ఊరట లభించినట్లైంది. పగలు కొంత ఉక్కపోత భరించలేకపోయినప్పటికి రాత్రుల్లో వాతావరణంలో ఆకస్మాత్తుగా మార్పులు జరుగుతున్నాయి. ఫలితంగా ఇళ్లలోని ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం చాలా శాతం వరకు తగ్గింది. దీంతో ముంబైలో గత వారం కిందట మూడు వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగ్గా ఇప్పుడది 2,500 మెగావాట్లకు పడిపోయింది. చలికాలం ప్రారంభంలోనే సుమారు 500 మెగావాట్ల వరకు విద్యుత్ వినియోగం తగ్గిపోయింది. మరికొద్ది రోజుల్లో ఇది 1,500 మెగావాట్లకు చేరడం ఖాయమని అధికారులు భావిస్తున్నారు. వేసవికాలంలో 4,550 మెగావాట్లపైనే.... వేసవి కాలంలో ఎండలు మండిపోవడంతో ఉదయం 10 గంటల తరువాత ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనాలు జంకుతారు. ఇళ్లల్లో, కార్యాలయాల్లో, వ్యాపార, వాణిజ్య సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులు ఉక్కపోత భరించలేక సతమతమవుతారు. నిరంతరంగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు పనిచేసినప్పటికీ వాతావరణం చల్లబడదు. దీంతో వేసవి కాలంలో ముంబైలో విద్యుత్ వినియోగం ఏకంగా 4,500 మెగావాట్లకు పైనే చేరుకుంటుంది. ఏటా విద్యుత్ వినియోగం రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉంటుంది. వేసవి కాలం మినహా మిగిలిన సీజన్లలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇళ్లు, షాపులు, కార్యాలయాల్లో విశ్రాంతిలేకుండా ఫ్యాన్లు, ఏసీలు పనిచేయడంతో రెండు రోజుల కిందట విద్యుత్ వినియోగం 2,500 మెగావాట్లకు చేరుకుంది. టాటా పవర్ నుంచి 382 మెగావాట్లు, అదాణీ డహాణు విద్యుత్ కేంద్రం నుంచి 288 మెగావాట్లు, ముంబై ఎక్చేంజ్ నుంచి 1,971 మెగావాట్లు విద్యుత్ సరఫరా జరిగింది. ముంబైలో భిన్నంగా... ఇదిలాఉండగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైనప్పటికీ అనేక జిల్లాల్లో వాతావరణం ఇంకా వేసవి ఎండలు తలపిస్తున్నాయి. రోజు ఏకంగా 31,001 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగం పెరిగిపోవడంతో మహానిరి్మతి కంపెనీ నుంచి 6,252 మెగావాట్లు, ప్రైవేటు కంపెనీల నుంచి 8,728 మెగావాట్లు, ఎక్చేంజి నుంచి సుమారు 8 వేల మెగావాట్లు విద్యుత్ సేకరించి ఈ డిమాండ్‌ను పూరిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ ప్రధాన నగరాలతో పోలిస్తే ముంబైలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్ధలు అధికంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. వీటితోపాటు జంక్షన్ల వద్ద, ప్రధాన రహదారులపై, పర్యాటక ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార ప్రకటనల బోర్డులు, హోర్డింగులు అడుగడుగున ఉంటాయి. వీటిలో కొన్ని ఎల్రక్టానిక్, డిజిటల్ బోర్డులుంటాయి. రాత్రుల్లో వాటికి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సాధారణ బోర్డులకు ప్లడ్ లైట్లు వెలుగుతాయి. దీంతో రాత్రి వాతావరణం చల్లిబడినప్పటికి విద్యుత్ వినియోగం పగలు మాదిరిగానే జరుగుతుంది. అయితే కొద్ది నెలల కిందట ఘాట్కోపర్లోని చడ్డానగర్ జంక్షన్ వద్ద భారీ హోర్డింగ్ కూలడంతో సుమారు 17 మంది చనిపోగా 30 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనతో అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగులు, బోర్డుల అంశం తెరమీదకు వచి్చంది. వివిధ రంగాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో కళ్లు తెరచిన ప్రభుత్వం, బీఎంసీ పరిపాలన విభాగం తనిఖీలు ప్రారంభించింది. అక్రమంగా ఏర్పాటుచేసిన హోర్డింగులు, సైన్ బోర్డులతోపాటు వాటికి విద్యుత్ సరఫరా చేస్తున్న కనెక్షన్లను కూడా తొలగిస్తున్నారు. ఆ ప్రకారం ముంబైలో కొంత శాతం విద్యుత్ వినియోగం తగ్గాలి. కానీ ఇవేమీ విద్యుత్ వినియోగంపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. -
ఈసారి విమానం ఎక్కేవారిదే ఆనందం!
సాధారణంగా దీపావళి పండుగ సీజన్లో విమాన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఒక విశ్లేషణ ప్రకారం.. ఈ దీపావళి సీజన్ విమాన ప్రయాణికులకు మరింత ఆనందం కలిగిస్తోంది. కారణం.. అనేక దేశీయ రూట్లలో సగటు విమాన ఛార్జీలు గత సంవత్సరంతో పోలిస్తే 20-25 శాతం తగ్గాయి.ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో విశ్లేషణ ప్రకారం.. దేశీయ మార్గాల్లో సగటు విమాన ఛార్జీలు 20-25 శాతం శ్రేణిలో క్షీణించాయి. ఇవి 30 రోజుల ఏపీడీ (ముందస్తు కొనుగోలు తేదీ) వన్-వే సగటు ఛార్జీల ధరలు. దీపావళి సీజన్ విమాన టికెట్ల కొనుగోలు సమయాన్ని గతేడాది నవంబర్ 10-16 తేదీల మధ్య పరిగణించగా ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 మధ్య జరిగిన కోనుగోళ్లను పరిగణనలోకి తీసుకున్నారు.విశ్లేషణ ప్రకారం బెంగళూరు-కోల్‌కతా విమానానికి సగటు విమాన ఛార్జీలు గరిష్టంగా 38 శాతం క్షీణించాయి. గత ఏడాది రూ.10,195 నుండి ఈ ఏడాది రూ.6,319కి తగ్గాయి. చెన్నై-కోల్‌కతా మార్గంలో టిక్కెట్ ధర రూ.8,725 నుంచి రూ.5,604కి 36 శాతం తగ్గింది.ఇదీ చదవండి: ఓలా.. అలా కుదరదు.. రిఫండ్ ఇవ్వాల్సిందే!ముంబై-ఢిల్లీ విమానాల సగటు విమాన ఛార్జీలు రూ.8,788 నుంచి రూ.5,762కి 34 శాతం తగ్గాయి. అదేవిధంగా ఢిల్లీ-ఉదయ్‌పూర్ రూట్లో టికెట్ ధరలు రూ.11,296 నుంచి రూ.7,469కి 34 శాతం క్షీణించాయి. ఢిల్లీ-కోల్‌కతా, హైదరాబాద్-ఢిల్లీ, ఢిల్లీ-శ్రీనగర్ మార్గాల్లో 32 శాతం క్షీణత ఉంది. -
ఒకేరోజు 12 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
ఛత్తీస్‌గఢ్‌లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోయాయి. గత 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలు తగ్గింది. తేమ 87 శాతానికి పెరిగింది. ఫలితంగా రాష్ట్రంలోని ఇళ్లు, కార్యాలయాల్లోని ఏసీలు, కూలర్లకు విశ్రాంతి దొరికింది. రాజధాని రాయ్‌పూర్‌లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తోంది. గడచిన 24 గంటల్లో రాయ్‌పూర్‌లో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది, రాయ్‌పూర్‌లో 24.7, మనాలో 24, బిలాస్పూర్లో 28.4, పెండ్రారోడ్లో 29.6, అంబికాపూర్‌లో 31.5, జగదల్పూర్లో 26.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయ్‌పూర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గింది. -
ఊహించని పరిస్థితుల్లో నాగసాకిపై అణుబాంబు? అమెరికా అసలు ప్లాన్ ఏమిటి?
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా.. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసింది. ఈ ఘటన జరిగి 78 ఏళ్లు దాటింది. అయినప్పటికీ విధ్వంసానికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి. అమెరికా తొలిసారిగా 1945, ఆగస్టు 6న జపాన్‌లోని హిరోషిమా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని అణుబాంబు వేసింది. ఈ బాంబు పేలుడు నగరంలోని 13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ విధ్వంసం సృష్టించింది. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత అంటే ఆగష్టు 9న జపాన్‌లోని నాగసాకి నగరంపై మరో అణుబాంబు వేసి జపాన్‌కు అమెరికా తన సత్తా ఏమిటో చూపించింది. దీంతో జపాన్ అగ్రరాజ్యానికి లొంగిపోవాల్సి వచ్చింది. నిజానికి నాగసాకిపై అమెరికా దాడి చేయాలని నిర్ణయించుకోలేదు. నాగసాకిపై అణుబాంబు వేయడం అత్యంత విచిత్ర పరిస్థితిలో జరిగింది. బాంబుకు ‘ఫ్యాట్ మ్యాన్’ పేరు 1945, ఆగష్టు 8 రాత్రి గడిచిపోయింది. అమెరికన్ బీ-29 సూపర్‌ఫోర్రెస్(విమానం)లోని బాంబర్ బాక్స్‌లో బాంబు లోడ్ చేశారు. ఈ బాంబు పెద్ద పుచ్చకాయ మాదిరిగా ఉంది. దీని బరువు 4050 కిలోలు. విన్స్టన్ చర్చిల్‌ను ఉద్దేశించి ఈ బాంబుకు ‘ఫ్యాట్ మ్యాన్’ అని పేరు పెట్టారు. ఈ బాంబు లక్ష్యం పారిశ్రామిక నగరం కోకురా. ఈ జపాన్‌లోని ఈ నగరంలోనే పలు మందుగుండు సామగ్రి తయారీ కర్మాగారాలు ఉన్నాయి. 1945, ఆగస్టు 9, ఉదయం 9.50.. ఈ సమయంలో కోకురా నగరంపైన 31,000 అడుగుల ఎత్తులో బీ-29 విమానం ఎగురుతోంది. ‘ఫ్యాట్ మ్యాన్’ ను ఈ ఎత్తు నుంచి కిందకు వదలాలని నిర్ణయించారు. అయితే ఇంతలో కోకురా మీద మబ్బులు కమ్ముకున్నాయి. దీనికితోడు కింద యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్లతో కాల్పులు జరుగుతున్నాయి. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో.. ఇంతలో బీ-29లోని ఇంధనం క్షీణిస్తోంది. వెనక్కి వెళ్లేందుకు సరిపడా ఇంధనం మాత్రమే విమానంలో మిగిలివుంది. ఈ ఆపరేషన్‌ను నిర్వహించే బాధ్యత గ్రూప్ కెప్టెన్ లియోనార్డ్ చెషైర్ చేపట్టారు. ఈ సంఘటన తరువాత అతను మాట్లాడుతూ ‘మేము ఉదయం తొమ్మిది గంటలకు విమానం టేక్ ఆఫ్ చేశాం. మేము ప్రధాన లక్ష్యమైన కోకురా చేరుకున్న సమయంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఇంతలో ఆ బాంబును విడిచిపెట్టాలంటూ మాకు సమాచారం వచ్చింది. అయితే కోకురాపై మేఘాలు ఉండటంతో నాగసాకి నగరం మీది గగనతలానికి చేరుకున్నాం. ఆ తర్వాత సిబ్బంది ఆటోమేటిక్ బాంబు డ్రాపింగ్ ఎక్విప్మెంట్ని యాక్టివేట్ చేయడంతో కొద్ది క్షణాల్లోనే ఆ భారీ బాంబు భూమిపైకి వేగంగా దూసుకువెళ్లింది. ఆలోచనకు అవకాశం లేకుండా.. కేవలం 52 సెకన్లలో ఈ బాంబు భూమి ఉపరితలం నుంచి 500 అడుగుల ఎత్తులో పేలింది. 11:02 కాగానే బాంబు పేలింది. బాంబు పేలిన వెంటనే భగభగ మండుతున్న ఒక భారీ నిప్పు బంతి పైకి ఉబికిలేచింది. ఆ బంతి పరిమాణం పెరుగుతూ నగరం మొత్తాన్ని ఆక్రమించింది. నగరంలోని ప్రజలకు ఏం జరుగుతున్నదనే ఆలోచనకు అవకాశం లేకుండానే వారంతా మృత్యువాత పడ్డారు. నాగసాకి చుట్టూ పర్వతాలు ఉన్నాయి. దీని కారణంగా కేవలం 6.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విధ్వంసం జరిగింది. నాగసాకిలో జరిగిన ఈ దాడిలో 74 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హిరోషిమాలో జరిగిన దాడిలో లక్షా 40 వేల మందికి పైగా ప్రజలు మరణించారు. ఇది కూడా చదవండి: తాలిబాన్‌తో చెలిమి వెనుక చైనా ఎత్తుగడ ఏమిటి? -
కెరీర్ ముగిసినట్లే! ..'కొత్త గోడ'కు సమయం ఆసన్నం
టెస్టుల్లో టీమిండియాకు మూడోస్థానం చాలా కీలకం. 1990ల చివరి నుంచి రిటైర్ అయ్యేవరకు ద్రవిడ్ మూడోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఎన్నోసార్లు టీమిండియా పాలిట ఆపద్భాందవుడయ్యాడు.చాలా మ్యాచ్‌ల్లో తన ఇన్నింగ్స్‌లతో ఓటమి కోరల్లో నుంచి భారత్‌ను కాపాడి ది వాల్ అనే పేరును సుస్థిరం చేసుకున్నాడు. ఇక ద్రవిడ్ రిటైర్ అయిన తర్వాత మూడో స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ దశలో వచ్చాడు చతేశ్వర్ పుజారా. 2010లో టెస్టు మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన పుజారా అతతి కాలంలోనే మంచి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. 2012లో తొలిసారి తన మార్క్ ఆటతీరును ప్రదర్శించిన పుజరా ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసేలా కెరీర్ ఆరంభంలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అలా టీమిండియా నయావాల్‌గా పుజారా గుర్తింపు పొందాడు. ఒకప్పుడు ప్రత్యర్థుల పాలిట అడ్డుగోడలా నిలిచిన పుజారా ఇప్పుడు మాత్రం జట్టుకు గుదిబండలా తయారయ్యాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్నా పుజారా కెరీర్ దాదాపు ముగిసినట్లే. ఇక మరో కొత్త గోడ(The Wall) కోసం వెతకాడాకి సమయం ఆసన్నమైంది. -సాక్షి, వెబ్‌డెస్క్ పుజారాను భారత జట్టు నుంచి తప్పించడం కొత్త కాదు. కొన్నాళ్ల క్రితమే స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. అయితే కౌంటీల్లో భారీ స్కోర్లు సాధించి మళ్లీ జట్టులోకి వచ్చిన అతను ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడటంతో పాటు కెరీర్లో 100 టెస్టుల మైలురాయిని కూడా అందుకున్నాడు. ఇటీవల ఆ్రస్టేలియాతో సొంతగడ్డపై విఫలమైనా, అతని అనుభవాన్ని నమ్మి డబ్ల్యూటీసీ ఫైనల్లో మరో అవకాశం ఇచ్చారు. రెండు ఇన్నింగ్స్‌లలో అతను 14, 27 పరుగులే చేశాడు. గత మూడేళ్లుగా అతను పేలవ ఫామ్‌లో ఉన్నా సీనియర్‌గా, ఎన్నో మ్యాచ్‌లు గెలిపించిన గౌరవంతో పుజారాను కొనసాగించారు. బంగ్లాదేశ్‌పై ఆడిన రెండు కీలక ఇన్నింగ్స్ (90, 102)లను పక్కన పెడితే మూడేళ్లలో అతని సగటు 26 మాత్రమే. ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న సెలక్టర్లు మళ్లీ వెనక్కి వెళ్లి పుజారాను ఎంపిక చేసే అవకాశాలు కనిపించడం లేదు. 103 టెస్టుల్లో 43.60 సగటు, 19 సెంచరీలతో పుజారా 7195 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సార్లు టెస్టు సిరీస్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించడం అతని కెరీర్లో అత్యుత్తమ క్షణాలు. Thankyou for the memories @cheteshwar1 🫶,Being a part of two series Wins in Australia is always special,You gave your best in those two series and many more..Still not writing you off🙅♂️.#cheteshwarpujara #Pujara pic.twitter.com/CNJkDDTIjF — Rishi (@risshitweetS) June 23, 2023 చదవండి: కౌంటీల్లో సెంచరీల మీద సెంచరీలు! అసలు పోరులో తుస్సు! అందుకే.. -
ఈక్విటీ ఫండ్స్‌లో తగ్గిన పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక క్రమంగా తగ్గుతోంది. ఆగస్ట్‌లో కేవలం రూ.6,120 కోట్ల వరకే వచ్చాయి. అంతకు ముందు నెలలో (జూలై) వచ్చిన రూ.8,898 కోట్లతో పోలిస్తే 30 శాతం తగ్గాయి. అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.15,890 కోట్లు, మే నెలలో రూ.18,529 కోట్లు, జూన్‌లో రూ.15,495 కోట్ల చొప్పున వచ్చిన పెట్టుబడులు.. తర్వాతి రెండు నెలల్లో గణనీయంగా తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే.. ఆగస్ట్‌లో వచ్చిన పెట్టుబడులు 2021 అక్టోబర్ (రూ.5,215 కోట్లు) తర్వాత అత్యంత కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అయితే, ఈక్విటీల్లోకి నికర పెట్టబుడుల రాక 18వ నెలలోనూ నమోదైంది. సిప్ ద్వారా రూ.12,693 కోట్లు..: ఫ్లెక్సీక్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్, మిడ్‌కాయ్ప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. కొత్త పథకాల ఆవిష్కరణపై సెబీ నియంత్రణ ఎత్తివేయడంతో ఏఎంసీలు పలు కొత్త పథకాల ద్వారా నిధులు సమీకరించాయి. హైబ్రిడ్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.6,601 కోట్లను వెనక్కి తీసుకున్నారు. బంగారం ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ నుంచి రూ.38 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఆగస్ట్‌లో రూ.12,693 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిప్ ఖాతాల సంఖ్య అత్యంత గరిష్ట స్థాయి 5.71 కోట్లకు చేరింది. డెట్‌లోకి భారీగా.. ఇక డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఆగస్ట్‌లో రూ.49,164 కోట్లు వచ్చాయి. జూలైలో వచ్చిన రూ.4,930 కోట్లతో పోలిస్తే పది రెట్లు పెరిగాయి. -
కశ్మీర్ సరిహద్దుల్లో ఆయుధాలు జారవిడిచిన డ్రోన్
జమ్మూ: కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో డ్రోన్ జారవిడిచిన ఆయుధాలను సకాలంలో భద్రతా బలగాలు గుర్తించడంతో లష్కరే తోయిబా కుట్ర భగ్నమైంది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, ది రెసిస్టాన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్)అనే ఉగ్రసంస్థలు పంపిన ఆయుధాలతో సరిహద్దులకు సమీపంలో డ్రోన్ సంచరిస్తోందన్న సమాచారం మేరకు బలగాలు గాలింపు చేపట్టాయి. జమ్మూ జిల్లా ఆర్‌ఎస్‌పురా–ఆర్నియా ప్రాంతంలోని ట్రెవా గ్రామం సమీపంలో భద్రతా బలగాలకు ఒక పిస్టల్, రెండు మ్యాగజీన్లు, మూడు ఐఈడీలు, మూడు బాటిళ్ల పేలుడు పదార్థాలు తదితరాలు లభ్యమయ్యాయి. సరిహద్దు అవతల నుంచి వచ్చిన డ్రోన్ వీటిని అక్కడ జారవిడిచి వెళ్లినట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. చదవండి: ('ఇది వినాశనానికే.. రష్యాకు ఏ మాత్రమూ మేలు చేయదు') -
నా కళ్లు తెరిపించింది
2018 బాలీవుడ్ బాగా కలిసొచ్చింది తాప్సీకి. మూడు హిట్స్ అందుకోవడమే కాకుండా నటిగా అద్భుతమైన మార్కులు సంపాదించారామె. లేటెస్ట్గా యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో కలసి ‘పతీ పత్నీ అవుర్ వో’ అనే చిత్రం రీమేక్‌లో నటించడానికి అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కావాలి. అయితే చివరి నిమిషంలో ఈ సినిమాలో హీరోయిన్ తాప్సీ కాదని చిత్రబృందం అనౌన్స్ చేయడంతో ఆమె షాక్ అయ్యారు. ఈ విషయం గురించి తాప్సీ మాట్లాడుతూ –‘‘ఈ సినిమా కోసం నా షెడ్యూల్ అంతా సెట్ చేసుకొని వాళ్లకు డేట్స్ ఇచ్చాను. నేను హీరోయిన్ కాదని తెలియడంతో షాక్ అయ్యాను. దర్శక–నిర్మాతలను అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఈ విషయంపై ఎంత క్లారిటీ తెచ్చుకుందామనుకున్నా జవాబు చెప్పకుండా మాట దాటేస్తున్నారు. ఈ విషయం కొంచెం ముందే తెలిసినా ఈ సినిమా కోసం సర్దుబాటు చేసిన డేట్స్ వేరే సినిమాలకైనా ఇచ్చేదాన్ని. ఈ సంఘటన వల్ల ఇకనుంచైనా జాగ్రత్తగా ఉండాలనే విషయం అర్థం అయింది. ఒక విధంగా చెప్పాలంటే జరిగిన సంఘటన నా కళ్లు తెరిపించింది’’ అని తాప్సీ పేర్కొన్నారు. -
బురఖా నిబంధన : తప్పుకున్న భారత క్రీడాకారిణి
హైదరాబాద్ : ఇరాన్లో నిర్వహించబోయే ‘ఏషియన్ టీమ్ చెస్ చాంపియన్‌షిప్’లో పాల్గొనడంలేదని మాజీ వరల్డ్ జూనియర్ గర్ల్స్ చాంపియన్, ఉమెన్ గ్రాండ్ మాస్టర్ సౌమ్య స్వామినాథన్ ప్రకటించారు. జులై 26 నుంచి ఆగస్టు 6 వరకూ ఇరాన్‌లోని హమదాన్‌లో నిర్వహించబోయే ఈ టోర్నీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఇరాన్ దేశంలో ఉన్న ‘తలకు తప్పనిసరిగా స్కార్ఫ్ ధరించాల’నే నిబంధన వల్ల తాను ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఫేస్బుక్లో పోస్టు చేశారు. ‘ఇరానీ చట్టాలలో మహిళలు తప్పనిసరిగా తలపై స్కార్ఫ్ లేదా బురఖా ధరించాలనే నియమం ఉంది. కానీ ఇలా బలవంతంగా స్కార్ఫ్ లేదా బురఖా ధరించడం అంటే నా స్వేచ్ఛకు ఆటంకం కల్గించడమే అవుతుంది. ఇలా చేస్తే నా హక్కులకు, నా మతానికి గౌరవం ఇవ్వనట్లే అవుతుంది. అందుకే నేను ఇరాన్ వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. టోర్నీలో భాగంగా మమ్మల్ని నేషనల్ టీం డ్రస్ కానీ, ఫార్మల్స్ కానీ, లేదా మరేదైనా స్పోర్ట్ డ్రెస్ వేసుకోమని కోరితే మేము సంతోషంగా ఒప్పుకునేవాళ్లము. అంతేకాని ఇలా మతపరమైన నియమాలను ఆటగాళ్ల మీద బలవంతంగా రుద్దడం సరైంది కాదు. ఇలాంటి అధికారిక చాంపియన్‌షిప్స్‌ను నిర్వహించేటప్పుడు క్రీడాకారుల మనోభావాలను, హక్కులను పట్టించుకోకపోవడం విచారకరం. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు ఎప్పటికి గర్వ కారణమే. క్రీడాకారులు వారి ఆట కోసం చాలా విషయాల్లో సర్దుకుపోతుంటారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం అలా చేయలేమని’ సౌమ్య తన పోస్టులో పేర్కొన్నారు. అథ్లెట్లు ఇలా టోర్నీ నుంచి తప్పుకోవడం ఇదే ప్రథమం కాదు. గతంలో ఇండియా ‘టాప్ షూటర్’ హీనా సింధూ కూడా ఇలానే 2016లో ఇరాన్లో నిర్వహించిన ‘ఏషియన్ ఎయిర్‌గన్ మీట్’ నుంచి తప్పుకున్నారు. అయితే అప్పుడు కూడా తలపై స్కార్ఫ్ ధరించాలనే నియమమే ఇందుకు కారణం. -
టెకీలకు షాక్ : ఆ కంపెనీలో తగ్గిన ఉద్యోగుల సంఖ్య
సాక్షి, చెన్నై : దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌లో 2017లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గింది. అమెరికా, యూరప్‌లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య పెరగ్గా భారత్‌లో తగ్గుముఖం పట్టడం గమనార్హం. 2016 సంవత్సరాంతంలో భారత్‌లో కాగ్నిజెంట్ ఉద్యోగుల సంఖ్య 1,88,000లు కాగా 2017 సంవత్సరాంతానికి ఉద్యోగుల సంఖ్య 1,80,000కు పడిపోయింది. ఒక్క ఏడాదిలో 8000 మంది ఉద్యోగులు సంస్థను వీడారు. కృత్రిమ మేథ, ఆటోమేషన్ ఫలితంగా భారత్‌లో కాగ్నిజెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గిందని భావిస్తున్నారు.మరోవైపు ఇదే కాలంలో కాగ్నిజెంట్ అమెరికా ఉద్యోగుల సంఖ్య 2900 పెరిగి 50,400కు పెరగ్గా, యూరప్ ఉద్యోగుల సంఖ్య 2300 పెరిగింది. భారత్‌లో హైరింగ్ ఊపందుకుంటున్నా ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, యూరప్ మార్కెట్లలో నియామకాలు పెద్ద ఎత్తున సాగుతుంటే భారత్‌లో కంపెనీలు హైరింగ్‌పై ఆచితూచి వ్యవహరిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి వృద్ధికి కేవలం టెక్నాలజీనే కాకుండా మిగతా రంగాలపై దృష్టిసారించాలని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
దుంప తెంపింది..!
- తగ్గిన ధర.. దిగుబడి పతనం - నష్టాల పాలవుతున్న పెండలం రైతులు - ఎకరానికి రూ.60 వేల నష్టం - ఇక పంటలు సాగుచేయలేమంటున్న రైతులు - చేదెక్కిస్తున్న చేమ పిఠాపురం: పెండలం సాగు రైతును నిండాముంచేసింది. ఒక్కసారిగా ధర పతనం కావడంతోపాటు దిగుబడి తగ్గిపోవడంతో రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎకరానికి రూ.60 వేలకు పైగా నష్టాలు రావడంతో ఇక పంటలు సాగు చేయడం సాధ్యం కాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం మండలంలోని రేవడి నేలల్లో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే పొలాల్లో సాగుచేసిన ఈ పంటను గత వారం రోజుల నుంచి తవ్వుతున్నారు. ఈ ఏడాది ఈ పంటసాగులో దిగుబడి నిరాశాజనకంగానే ఉండగా ధర రెండు వంతులకు పడిపోవడంతో కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు. గత ఏడాది పది టన్నుల పెండ్ల ధర రూ. 1.60 లక్షలుండగా ఈ ఏడాది రూ.లక్షకు పడిపోవడంతో కోలుకోలేని నష్టాలను చవిచూడాల్సి వస్తోందంటున్నారు. పిఠాపురం మండలం విరవాడ, విరవ, మంగితుర్తి, కోలంక, కుమారపురం, జల్లూరు, ఎఫ్‌కేపాలెం తదితర గ్రామాలతోపాటు జిల్లాలో కోనసీమ ఏరియాలోని రావులపాలెం పరిసర గ్రామాల్లోనూ, మెట్ట ప్రాంతాలైన ధర్మవరం, ఉత్తరకంచి, లంపకలోవ, లింగంపర్తి, ఏలేశ్వరం, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురం మండల గ్రామాల్లోనూ సుమారు 3,500 ఎకరాల్లో çసాగు చేశారు. ప్రస్తుతం పెండలం పంట తుది దశకు చేరుకోవడంతో దాన్ని తవ్వి తీస్తున్నారు. ఈ పంటకి వరి, చెరుకు పంటలకన్నా ఎక్కువ పెట్టుబడి ఎకరానికి రూ.లక్షకు పైగా అవ్వగా ధర పతనం కావడంతోపాటు దిగుబడి భారీగా తగ్గిపోవడంతో ఎకరానికి రూ.40 మాత్రమే ఆదాయం వస్తుండడంతో అప్పుల పాలవుతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దిగుబడి పతనం ఎకరానికి 14 టన్నులు దిగుబడి రావల్సిన పెండ్లం దిగుబడి ఈ ఏడాది ఐదు నుంచి ఆరు టన్నులకు పడిపోవడంతో తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ధర పతనం కాగా దిగుబడి సైతం పడిపోవడంతో ఎకరానికి రూ.60 వేలకు పైగా నష్టం వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు వ్యవసాయశాఖ పట్టించుకోకపోవడం వంటి కారణాలతో నష్టాలు చూడాల్సి వస్తోందంటున్నారు. ఆగిన ఎగుమతులు ఇదిఇలా ఉంటే ఒడిశాలో స్థానిక ప్రజలకున్న ఆనవాయితీ ప్రకారం వివాహాల సమయంలో ఒక్కో కుటుంబం 100 కేజీల వరకూ పెండలం వినియోగిస్తుంటారు. అందువల్ల మన జిల్లాలో ఉత్పత్తయిన పెండలంలో 80 శాతం ఒడిశా రాష్ట్రానికి ఎగుమతవుతోంది. ప్రసుతం ఒడిశాలో సీజన్ కాకపోవడంతో పెండలం కొనుగోలుకు వ్యాపారులెవరూ రాకపోవడంతో ఇక్కడ అమ్మకాలు నిలిచిపోయాయి. తద్వారా ధర పాతాళానికి పడిపోయింది. ఒడిశాలో తప్ప ఈ కూర పెండలం దుంపలను ఎక్కడా ఎక్కువగా వినియోగించకపోవడంతో గతంలో ఎప్పుడు లేనంతగా ఏకంగా టన్నుకు రూ.6 వేలకు పైగా ధర పడిపోవడం ఇదే మొదటిసారని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. అంతరపంటగా చేమ దిగుబడి నిరాశాజనకమే... పెండలంలో అంతరపంటగా సాగు చేసిన చేమ పంట సైతం ఆశాజనకంగా లేకపోవడంతో కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. అంతరపంటగా సాగు చేసిన చేమ ఎకరానికి టన్ను నుంచి రెండు టన్నుల వరకు దిగుబడి వస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దుంప సక్రమంగా ఊరకపోవడంతోపాటు ధరకూడా కిలో రూ.2 వరకు మాత్రమే పలుకుతుండడంతో ఏమాత్రం ఆదాయం వచ్చే మార్గం కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ఆదుకునే వారు లేరు మేము రైతులమేనన్న విషయం ఎవరూ గుర్తించరు. మాకు రుణమాఫీ వర్తించదు. ఏవిధంగానూ సాయం అందదు. ప్రస్తుతం ఎకరానికి రూ.60 వేలకు పైగా నష్టాలు పాలై అప్పుల ఊబిలో కూరుకుపోయి దిక్కు తోచనిస్థితిలో ఉన్నాం. దిగుబడి దెబ్బతీసి ధర లేక కొనేవారు రాక ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. అడబాల పాపారావు, పెండలం రైతు, విరవాడ, పిఠాపురం మండలం వ్యాపారం లేదు గత 30 ఏళ్లలో ఎప్పుడూ ఇంత దారుణంగా ధర పడిపోవడం చూడలేదు. దిగుబడి తగ్గిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ కొనేవారు రావడం లేదు. దీంతో మేము కొనుగోలు చేయడం లేదు. అలాఅని ఇక్కడి వ్యాపారులు కొనడం లేదు. ఇక పెండలం వ్యాపారం చేయడం మనేయాలని నిర్ణయించుకున్నాం. బాలిరెడ్డి వెంకటేశ్వరరావు, పెండలం వ్యాపారి, ధర్మవరం , ప్రత్తిపాడు మండలం. -
ఘాటు తగ్గిన పచ్చి మిర్చి
► కిలో రూ.3 కూడా పలకని వైనం ► మార్కెట్లో వదిలి వెళ్లిపోతున్న రైతులు వరంగల్‌సిటీ: వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో ఆదివారం పచ్చి మిర్చి ధర దారుణంగా పడిపోయింది. కిలోకు రూ.3 చొప్పున కూడా ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో రైతులు మార్కెట్లోనే పడేసి వెళ్లిపోయారు. ఒక్కో మిర్చి బస్తా మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు రవాణ ఖర్చు రూ. 25, మిరపకాయలు ఏరడానికి రోజుకు రూ.150 చొప్పున ఖర్చవుతోందని, తీరా మార్కెట్‌కు తీసుకొస్తే కనీస ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కిలోకు రూ.3 కూడా చెల్లించని వ్యాపారులు రిటైల్ వర్తకులకు కిలో రూ.8 చొప్పున అమ్ముతున్నారని చెప్పారు. మిర్చి బస్తాలను ఇంటికి తీసుకెళ్తే మళ్లీ రవాణా ఖర్చులు అవుతాయని, అందుకే మార్కెట్లోనే పడేసి వెళ్తున్నామని తెలిపారు. అయితే, పచ్చి మిర్చికి డిమాండ్ లేకపోవడం వల్లే తాము కొనుగోలు చేయడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. -
ట్రంప్, హిల్లరీలు హోరాహోరీ..
అమెరికా అధ్యక్షపదవి ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ల పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ల మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్లుగా సాగుతోంది. గురువారం ఫాక్స్ న్యూస్ విడుదల చేసిన వివరాల ప్రకారం రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ఒక శాతం ఓట్ల మెజారిటీతో ముందంజలోఉన్నట్లు పేర్కొంది. నెల క్రితం వరకు దాదాపు ఎనిమిది శాతం ఓట్ల మెజారిటీతో ముందున్న హిల్లరీ, ట్రంప్ ల మధ్య తేడా ఒక్కసారిగా 1.5 శాతానికి పడిపోయింది. 9/11వార్షిక సమావేశంలో క్లింటన్ అస్వస్ధతకు గురైన తర్వాత అమెరికాలో జరిగిన మొదటి ఎన్నిక ఇదే. ఈ సమావేశానికి ముందు వరకు ట్రంప్ కంటే ఎనిమిది శాతం మెజారిటీ ఓట్లతో హిల్లరీ ముందంజలో ఉండటం గమనార్హం. దీంతో అధ్యక్షపదవి ఎవరికి దక్కుతుందో రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. హిల్లరీ ఆరోగ్య పరిస్ధితిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఫలించినట్లు ఈ ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయి. ట్రంప్, ఆయన తరఫున కార్యకర్తలు పదేపదే హిల్లరీ ఆరోగ్యంపై అనుమానాలను రేకితిస్తూ చేసిన ప్రసంగాలు ఫలించాయి. హిల్లరీ ఆరోగ్యంపై ఆమె డాక్టర్ మరిన్ని వివరాలను వెల్లడించడం కూడా కొంతమేరకు ప్రతికూలతను చూపినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం హిల్లరీ 45శాతం ఓట్లతో ఉండగా.. ట్రంప్ 46 శాతం ఓట్లతో లీడ్ లో ఉన్నారు. కాగా ఈ నెల 26న మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరగనుంది. -
జేఎన్‌యూ సెగకు బస్సీ కీలక పదవి ఆవిరి!
న్యూఢిల్లీ: బీఎస్ బస్సీని వరించనున్న కీలకపదవికి జేఎన్‌యూ వివాదం తిలోదకాలిచ్చింది. తన ఉద్యోగ బాధ్యతలు ముగిసిన అనంతరం మరో ఉన్నత స్థానంలో కొనసాగాల్సిన ఆయనకు ఆ అవకాశం దక్కేలా కనిపించడం లేదు. జేఎన్‌యూ సమస్యను పరిష్కరించలేకపోవడం ఆయనను ఈ బాధ్యతలకు అందకుండా చేసినట్లు కీలక వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు బాస్‌గా విధులు నిర్వర్తిస్తున్న బస్సీ ఈ నెలాఖరున పదవీ బాధ్యతల నుంచి విరమణ పొందనున్నారు. అయితే, భారత సమాచార కేంద్ర కమిషన్ (సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్-సీఐసీ)లో ఉన్న మూడు కమిషనర్ ఖాళీల భర్తీ కోసం కమిటీ సిద్ధం చేసిన జాబితాలో బస్సీ పేరు కూడా చేర్చినట్లు తెలిసింది. అయితే, గతంలో కేజ్రీవాల్ తో గొడవలు పెట్టుకొని బీజేపీ ఏజెంట్ అనిపించుకోవడం, తాజాగా జేఎన్‌యూ వివాదంలో అతి చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగేలా వ్యవహరించినందుకు ప్రస్తుతం ఆ కమిటీ నుంచి బస్సీ పేరును పక్కకు పెట్టినట్లు తెలిసింది. సీఐసీ కమిషనర్ల నియామకం కోసం ఏర్పాటుచేసిన కమిటీకి అధ్యక్షుడిగా ప్రధాని నరేంద్రమోదీ ఉండగా సభ్యుడిగా ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే కూడా ఉన్నారు. -
సీసీఎస్‌లో ఐదుగురిపై వేటు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)లో అక్రమాలను వెలుగులోకి తెస్తూ ‘సాక్షి’లో వచ్చిన కథనాలపై నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. అవినీతికి పాల్పడిన సీసీఎస్‌లోని ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సస్పెండైన వారిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్, హెడ్‌కానిస్టేబుల్ ఉన్నారు. సీసీఎస్‌కు చెందిన ఆటో మొబైల్ టీం(ఏటీఎం) ఇన్స్పెక్టర్ తుమ్మపూడి శ్రీనివాస ఆంజనేయప్రసాద్, సబ్ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ ఆర్.ఎం.గురునాథుడు, హెడ్‌కానిస్టేబుల్ ఎ.మోహన్లతో పాటు సీసీఎస్ వైట్ కాలర్ అఫెన్స్ టీం ఇన్స్పెక్టర్ మధుమోహన్ అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది. విచారణాధికారులు బుధవారం సాయంత్రం కమిషనర్ మహేందర్‌రెడ్డికి నివేదిక సమర్పించారు. దీంతో వారిపై ఆయన సస్పెన్షన్ వేటు వేశారు. నెల రోజుల క్రితమే ఇన్‌కమ్‌ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌ను బెదిరించి అతని ఆస్తులను బలవంతంగా మరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించిన వ్యవహారంలో ఇదే సీసీఎస్‌లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ను కూడా కమిషనర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు రికవరీ చేసిన వాహనాల మాయంపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలపై ఆయన స్పం దించారు. 60 ఠాణాల పరిధిలో రికవరీ వాహనాలపై ఆరా తీయడంతో పలువురు పోలీసులు అక్రమంగా వాడుతున్న 140 వాహనాలు తిరిగి ఠాణాలకు చేరుకున్నాయి.