టెస్టుల్లో టీమిండియాకు మూడోస్థానం చాలా కీలకం. 1990ల చివరి నుంచి రిటైర్ అయ్యేవరకు ద్రవిడ్ మూడోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఎన్నోసార్లు టీమిండియా పాలిట ఆపద్భాందవుడయ్యాడు.చాలా మ్యాచ్‌ల్లో తన ఇన్నింగ్స్‌లతో ఓటమి కోరల్లో నుంచి భారత్‌ను కాపాడి ది వాల్ అనే పేరును సుస్థిరం చేసుకున్నాడు. ఇక ద్రవిడ్ రిటైర్ అయిన తర్వాత మూడో స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది.
ఈ దశలో వచ్చాడు చతేశ్వర్ పుజారా. 2010లో టెస్టు మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన పుజారా అతతి కాలంలోనే మంచి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. 2012లో తొలిసారి తన మార్క్ ఆటతీరును ప్రదర్శించిన పుజరా ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసేలా కెరీర్ ఆరంభంలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు.
అలా టీమిండియా నయావాల్‌గా పుజారా గుర్తింపు పొందాడు. ఒకప్పుడు ప్రత్యర్థుల పాలిట అడ్డుగోడలా నిలిచిన పుజారా ఇప్పుడు మాత్రం జట్టుకు గుదిబండలా తయారయ్యాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్నా పుజారా కెరీర్ దాదాపు ముగిసినట్లే. ఇక మరో కొత్త గోడ(The Wall) కోసం వెతకాడాకి సమయం ఆసన్నమైంది.
-సాక్షి, వెబ్‌డెస్క్
పుజారాను భారత జట్టు నుంచి తప్పించడం కొత్త కాదు. కొన్నాళ్ల క్రితమే స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. అయితే కౌంటీల్లో భారీ స్కోర్లు సాధించి మళ్లీ జట్టులోకి వచ్చిన అతను ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడటంతో పాటు కెరీర్‌లో 100 టెస్టుల మైలురాయిని కూడా అందుకున్నాడు. ఇటీవల ఆ్రస్టేలియాతో సొంతగడ్డపై విఫలమైనా, అతని అనుభవాన్ని నమ్మి డబ్ల్యూటీసీ ఫైనల్లో మరో అవకాశం ఇచ్చారు.
రెండు ఇన్నింగ్స్‌లలో అతను 14, 27 పరుగులే చేశాడు. గత మూడేళ్లుగా అతను పేలవ ఫామ్‌లో ఉన్నా సీనియర్‌గా, ఎన్నో మ్యాచ్‌లు గెలిపించిన గౌరవంతో పుజారాను కొనసాగించారు. బంగ్లాదేశ్‌పై ఆడిన రెండు కీలక ఇన్నింగ్స్ (90, 102)లను పక్కన పెడితే మూడేళ్లలో అతని సగటు 26 మాత్రమే.
ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న సెలక్టర్లు మళ్లీ వెనక్కి వెళ్లి పుజారాను ఎంపిక చేసే అవకాశాలు కనిపించడం లేదు. 103 టెస్టుల్లో 43.60 సగటు, 19 సెంచరీలతో పుజారా 7195 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సార్లు టెస్టు సిరీస్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించడం అతని కెరీర్‌లో అత్యుత్తమ క్షణాలు.
Thankyou for the memories @cheteshwar1 🫶,Being a part of two series Wins in Australia is always special,You gave your best in those two series and many more..Still not writing you off🙅♂️.#cheteshwarpujara #Pujara pic.twitter.com/CNJkDDTIjF
— Rishi (@risshitweetS) June 23, 2023
చదవండి: కౌంటీల్లో సెంచరీల మీద సెంచరీలు! అసలు పోరులో తుస్సు! అందుకే..
Comments
Please login to add a commentAdd a comment