Ruturaj Gaikwad, Harmanpreet Kaur Leads Team, BCCI Announce Squad Asian Games - Sakshi
Sakshi News home page

Asia Games: జట్లను ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌, రింకూ సింగ్‌కు చోటు

Published Sat, Jul 15 2023 9:10 AM | Last Updated on Sat, Jul 15 2023 10:23 AM

Ruturaj Gaikwad-Harmanpreet-Leads-Team-BCCI Announce-Squads-Asian Games - Sakshi

ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల, పురుషుల టి20 క్రికెట్‌ జట్టును శుక్రవారం రాత్రి ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారధ్యం వహించనుండగా.. పురుషుల జట్టుకు రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

హైదరాబాద్‌ క్రికెటర్‌ తిలక్‌ వర్మ టీమిండియాకు ఎంపిక కాగా.. ఐపీఎల్‌లో రాణించిన రింకూ సింగ్‌, జితేశ్‌ శర్మ, ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌లకు తొలిసారి జాతీయ జట్టుకు ఆడనున్నారు. కాగా ఆసియా క్రీడలు చైనాలో సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 8 వరకు జరుగుతాయి. ఇక మహిళల జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంజలి శర్వాణి, బారెడ్డి అనూషలకు టీమిండియాలో చోటు దక్కింది.

టీమిండియా పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్‌, అర్ష్‌దీప్ సింగ్ , ముఖేష్ కుమార్, శివం మావి, శివం దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 

స్టాండ్‌బై  ప్లేయర్స్‌: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్

టీమిండియా మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), అమంజోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి సర్వాణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గయాక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రీ (వికెట్‌ కీపర్‌), అనూషా బారెడ్డి

చదవండి: #RAshwin: అశ్విన్‌ మాయాజాలం; బ్యాటర్లే కాదు రికార్డులైనా దాసోహం అనాల్సిందే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement