Cheteshwar Pujara
-
Ind Vs Eng: వాళ్లిద్దరి అధ్యాయం ఇక ముగిసినట్లే!
అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారా టెస్టు కెరీర్ అధ్యాయం ముగిసిపోయినట్లేనని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టుతో ఈ విషయం నిరూపితమైందని పేర్కొన్నాడు. ఇక ముందు ఈ వెటరన్ బ్యాటర్లు టీమిండియా తరఫున ఆడే అవకాశం లేదన్నాడు. కాగా ఒకప్పుడు టెస్టు స్పెషలిస్టులుగా టీమిండియాకు పలు చిరస్మరణీయ విజయాలు అందించారు రహానే, పుజారా. వైస్ కెప్టెన్‌గా రహానే.. నయావాల్‌గా పుజారా తమ వంతు పాత్రలను చక్కగా పోషించారు. కానీ గత కొన్ని రోజులుగా వీరిద్దరిని పక్కన పెట్టేశారు సెలక్టర్లు. అడపాదడపా వచ్చిన అవకాశాలను రహానే, పుజారా సద్వినియోగం చేసుకోకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు.. యంగ్ క్రికెటర్ల నుంచి ఎదురవుతున్న పోటీలోనూ వీరు వెనుకబడిపోయారు. దీంతో ఇటీవల సౌతాఫ్రికా పర్యటన రూపంలో బిగ్ సిరీస్ నేపథ్యంలో రహానే, పుజారాలను సెలక్టర్లు పట్టించుకోలేదు. తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన రెండు మ్యాచ్‌ల జట్టులోనూ చోటివ్వలేదు. వాళ్లిద్దరిది ముగిసిన అధ్యాయం ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. "ఊహించిన విధంగానే జట్టు ప్రకటన ఉంది. అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాలను ఎంపిక చేయలేదు. ఇక వాళ్లిద్దరిది ముగిసిన అధ్యాయం. ఎప్పుడైతే సౌతాఫ్రికాతో ఆడే జట్టులో వారికి స్థానం ఇవ్వలేదో అప్పుడే ఇక ముందు కూడా వాళ్లకు ఆడే అవకాశం రాదని ఊహించాను. అక్కడ ధోని కెప్టెన్ కాబట్టి టీమిండియా దారులు మూసుకుపోయినా రహానేకు మాత్రం ఐపీఎల్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కు అతడు గత సీజన్లో ఆడాడు. ఈసారి కూడా బాగా ఆడితే మరికొన్నాళ్లపాటు కొనసాగగలడు. నిజానికి చెన్నైకి ఆడటం ముఖ్యం కాదు.. అక్కడ ధోని కెప్టెన్ కాబట్టి ఆ జట్టుకు ఆడి నిరూపించుకుంటే మళ్లీ టీమిండియా తలుపు తట్టవచ్చు" అని అభిప్రాయపడ్డాడు. కాగా ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక విజయం తర్వాత రహానే వరుసగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023లో చెన్నైకి ఆడిన అతడు ఫుల్‌ఫామ్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో చాలాకాలం తర్వాత ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ సందర్భంగా టీమిండియాకు ఆడే చాన్స్ వచ్చింది. మిగతా వాళ్లంతా విఫలమైనా ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో మిగతా వాళ్లంతా విఫలమైనా రహానే మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే, పుజారా మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఈక్రమంలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే జట్టులో రహానేకు చోటు దక్కినా.. పుజారాకు మొండిచేయి ఎదురైంది. పుజారా డబుల్ సెంచరీ అయితే, కరేబియన్ గడ్డపై పాత కథను రిపీట్ చేసిన రహానే మళ్లీ టీమిండియాలో స్థానం సంపాదించలేకపోయాడు. ఇక పుజారా సంగతి సరేసరి. ఇంగ్లండ్ కౌంటీల్లో రాణిస్తున్నా సెలక్టర్లు కరుణించడం లేదు. తాజాగా రంజీ ట్రోఫీ-2024లో ఆరంభ మ్యాచ్‌లో పుజారా డబుల్ సెంచరీతో సౌరాష్ట్ర తరఫున సత్తా చాటగా.. ముంబై కెప్టెన్ రహానే మాత్రం డకౌట్ అయ్యాడు. -
డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా.. టీమిండియాలోకి రీ ఎంట్రీ!?
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత సెలక్టర్లకు వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా తన బ్యాట్‌తోనే స్ట్రాంగ్ మెసేజ్ పంపాడు. రంజీట్రోఫీ-2024 సీజన్లో భాగంగా జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా డబుల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 302 బంతుల్లో పుజారా తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడికి ఇది 17వ ఫస్ట్‌క్లాస్ సెంచరీ కావడం విశేషం. పుజారా ప్రస్తుతం 236 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ బౌలర్ల సహనానికి పరీక్షపెట్టాడు. అతడి వికెట్ పడగొట్టడానికి బౌలర్లు నానా తంటాలు పడుతున్నారు. ఇక డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా పుజారా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా లెజెండ్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ 37 డబుల్ సెంచరీలతో అగ్రస్దానంలో ఉన్నాడు. అదే విధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా పుజారా (19730) రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్(19729)ను పుజారా అధిగమించాడు. ఇక మూడో రోజు లంచ్ విరమానికి సౌరాష్ట్ర 119 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 566 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీమిండియాలోకి రీఎంట్రీ.. కాగా పుజారా చివరగా గతేడాది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (2021-23) ఫైనల్లో భారత జట్టు తరపున ఆడాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో పుజారా దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. వెస్టిండీస్‌తో టెస్టులకు, ఇటీవల సౌతాఫ్రికాతో ముగిసిన టెస్టులకూ ఎంపిక చేయలేదు. అయితే జనవరిలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ తలడనుంది. ఈ సిరీస్‌కు ముందు పుజారా అద్భుత ప్రదర్శన కనబరుస్తుండడంతో అతడి రీ ఎంట్రీ ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. -
Test Match: విఫలమైన సూర్యకుమార్ యాదవ్.. 8 పరుగులకే అవుట్..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్లో వెస్ట్ జోన్ బ్యాటర్ పృథ్వీ షా అర్ధ శతకంతో మెరిశాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 101 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 65 పరుగులతో రాణించాడు ఈ ఓపెనర్. అయితే, మిగతా బ్యాటర్ల నుంచి పృథ్వీ షాకు సహకారం లభించలేదు. 8 పరుగులకే అవుట్ మరో ఓపెనర్, కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ 11 పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ హర్విక్ దేశాయ్ 21 పరుగులు చేయగలిగాడు. ఇక నాలుగో స్థానంలో దిగిన టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా పోరాడుతుండగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన మరో భారత స్టార్ సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా నిరాశపరిచాడు. 6 బంతులు ఎదుర్కొన్న ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. సౌత్ జోన్ బౌలర్ విధ్వత్ కవెరప్ప బౌలింగ్‌లో కెప్టెన్ హనుమ విహారికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్‌ను కవెరప్ప వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. తిలక్, విహారి ఇన్నింగ్స్‌తో ఇలా కీలక బ్యాటర్లు విఫలం కావడంతో వెస్ట్ జోన్ 119 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్ రెండో రోజు ఆటను వెలుతురులేమి కారణంగా నిలిపివేసే సమయానికి పుజారా 7, అతిత్ సేత్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ(40), హనుమ విహారి(63) ఆదుకోవడంతో సౌత్ జోన్ 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. వెస్ట్ జోన్ ప్రస్తుతం 94 పరుగులు వెనుకబడి ఉంది. ఇలాగైతే.. కాగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో విఫలమైన కారణంగా పుజారా టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. ఇక వన్డే, టీ20 జట్లలో స్థానం సంపాదించిన సూర్యకుమార్ యాదవ్‌కు కూడా టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో పుజారా, సూర్య దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించడం గమనార్హం. ఇక దులిప్ ట్రోఫీ ముగిసిన తర్వాత సూర్య కరేబియన్ దీవికి పయనం కానున్నట్లు తెలుస్తోంది. చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే అతడికి టెస్టుల్లో అవకాశం ఇవ్వండి.. మార్క్‌వుడ్ మాదిరే: మాజీ క్రికెటర్ -
''పుజారా సార్' నాలా బ్యాటింగ్ చేయలేడు.. నేను అంతే!'
కెరీర్ ఆరంభంలో ఒక మెరుపులా వచ్చి భవిష్యత్తు స్టార్ క్రికెటర్‌గా తయారవుతాడనుకున్న పృథ్వీ షా పాతాళానికి పడిపోయాడు. అగ్రెసివ్ ఆటతీరుతో ఆకట్టుకున్న పృథ్వీ ప్రస్తుతం టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. ఇటవలే ముగిసిన ఐపీఎల్‌లోనూ పృథ్వీ షా పెద్దగా రాణించింది లేదు. దీనికి తోడు వివాదాలు అతన్ని చుట్టుముట్టాయి. ఇక 2021లో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ పుజారాకు ఆఖరిది. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి రాలేకపోయాడు. తాజాగా దులీప్ ట్రోపీలో వెస్ట్‌జోన్ తరపున పాల్గొంటున్న పృథ్వీ షా ఆ తర్వాత దేవదర్ ట్రోపీలోనూ ఆడాలనుకుంటున్నాడు. అటుపై ఇంగ్లండ్‌లో జరిగే కౌంటీ క్రికెట్లో తొలిసారి నార్తంప్టన్‌షైర్ తరపున బరిలోకి దిగనున్నాడు. కౌంటీల్లో రాణించి మళ్లీ టీమిండియాలోకి రావాలని పృథ్వీ షా నిశ్చయించుకున్నాడు. జూలై 12 నుంచి వెస్ట్‌జోన్, సౌత్‌జోన్ల మధ్య దులీప్ ట్రోపీ ఫైనల్ జరగనుంది. ఇక సెంట్రల్ జోన్‌తో సెమీఫైనల్ ముగిశాకా విజయంపై స్పందించిన పృథ్వీ షా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను నా ఆటను మార్చుకోవాలనుకోవడం లేదు. కాకపోతే నా గేమ్‌కు కాస్త స్మార్ట్‌నెస్‌ను యాడ్ చేసుకునే ప్రయత్నం చేస్తా. నేను పుజారా సార్లా బ్యాటింగ్ చేయలేను.. ఆయన నాలా బ్యాటింగ్ చేయలేడు. ఈ విషయంలో ఎవరి బ్యాటింగ్ స్టైల్ వారికి ఉంటుంది. ఇన్నేళ్లుగా నాకున్న అగ్రెసివ్నెస్ బ్యాటింగ్‌ను వదులుకోలేను.. కానీ స్మార్ట్‌గా ఆడడానికి ప్రయత్నిస్తా. ఇక వెస్ట్‌జోన్ దులీప్ ట్రోపీలో ఫైనల్ చేరడం సంతోషంగా ఉంది. నేను ముంబైకి ఆడొచ్చు.. లేదంటే వెస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండొచ్చు.. కానీ ఆట అనేది చాలా ముఖ్యం. ఒక రకంగా నా కెరీర్‌కు ఈ ఫైనల్ ఉపయోగపడుతుందంటే బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. ఇక గత ఏడాదిగా రెడ్‌బాల్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నా. ఒక మ్యాచ్‌లో త్రిబుల్ సెంచరీ(370 పరుగులు Vs అస్సాం) మరిచిపోలేని ఇన్నింగ్స్. కానీ వైట్‌బాల్‌లో అంత ప్రభావాన్ని చూపించలేకపోయా. కానీ రెడ్‌బాల్ క్రికెట్లో నా బ్యాటింగ్ మెరుగుపరుచుకోవడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నా.. త్వరలోనే మళ్లీ టీమిండియా నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: #DuleepTrophy: 5 ఓవర్లకు 53 నిమిషాలు.. గెలుపు అడ్డుకోవడం కోసం ఇన్ని కుట్రలా? -
అతడిని ఎందుకు సెలక్ట్ చేయలేదో నాకు తెలుసు: ఆసీస్ మాజీ బౌలర్
Sarfaraz Khan- Brad Hogg: వెస్టిండీస్‌తో టీమిండియా టెస్టు సిరీస్ నేపథ్యంలో ఎంపిక చేసిన భారత జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ వంటి ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోవపోవడంపై వసీం జాఫర్ వంటి మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. ఇక తాజాగా.. ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బ్రాడ్ హాగ్ ఈ విషయంపై స్పందించాడు. టీమిండియా సెలక్టర్లు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో తనకు తెలుసనంటూ ఈ మాజీ స్పిన్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. రంజీల్లో సంచలనమే.. కానీ ‘‘రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్ ఆడిన మాట వాస్తవమే. కానీ వెస్టిండీస్‌తో టెస్టు ఆడే జట్టులో అతడికి చోటెందుకు దక్కలేదో నాకు తెలుసు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి.. ఒకటి.. దేశవాళీ క్రికెట్లో అతడు తన జట్టు మిడిలార్డర్లో ఆడతాడు. ఐదు లేదంటే ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఇక రెండోది.. ఐపీఎల్లో పేసర్లను అతడు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాడు. క్వాలిటీ బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయాడు. పుజారా పని అయిపోయినట్లే! బహుశా అందుకే భారత సెలక్టర్లు సర్ఫరాజ్ ఖాన్ విషయంలో వెనుకడుగు వేసి ఉంటారు. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో మెరుగుపడితే అతడిని టెస్టు జట్టుకు ఎంపిక చేస్తారేమో!’’ అని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. ఇక నయా వాల్ ఛతేశ్వర్ పుజరాను జట్టు నుంచి తప్పించడంపై స్పందిస్తూ.. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారని పేర్కొన్నాడు. దశాబ్ద కాలంగ వన్‌డౌన్‌లో ఆడుతున్న పుజారా గత రెండేళ్లుగా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడని బ్రాడ్ హాగ్ పెదవి విరిచాడు. పుజారా స్థానంలో దూకుడైన ఆటగాడిని వారసుడిగా నిలిపేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుందన్నాడు. వెస్టిండీస్‌తో టెస్టులకు భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ. చదవండి: కెప్టెన్ ఊచకోత.. జింబాబ్వే సంచలన విజయం.. మేటి జట్లను వెనక్కి నెట్టి టీమిండియా తర్వాత.. -
'ఆటగదరా శివ!'.. పుజారా ఎమోషనల్ పోస్ట్
వెస్టిండీస్‌తో వచ్చే నెలలో జరగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాను ఎంపిక చేయలేదన్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఫామ్‌లో లేక సతమతమవుతున్న పుజారా ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 41 పరుగులు మాత్రమే చేసి విఫలమైన పుజారాపై వేటు పడింది. 35 ఏళ్ల వయసున్న పుజారా కెరీర్‌కు ముగింపు పడినట్లే అని సోషల్ మీడియాలో హోరెత్తింది. అయితే పుజారాను తప్పించడంపై భారత్ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తప్పుబట్టాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో రహానే మినహా మిగతా బ్యాటర్లు ఏం వెలగబెట్టారని.. వారిని కూడా తప్పించాల్సింది పోయి కేవలం పుజారాను బలిపశువును చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అభిమానులు కూడా పుజారాకు మద్దతుగా నిలుస్తూ.. ''అతని ఆట ముగిసిపోలేదు.. మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది.. మరో రెండేళ్లు అతనిలో క్రికెట్ ఆడే సత్తా ఉంది.'' అంటూ చెప్పుకొచ్చారు. అయితే విండీస్ టూర్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై పుజారా పెద్దగా స్పందించలేదు. కానీ శనివారం సాయంత్రం ట్విటర్ వేదికగా ఒక వీడియోనూ షేర్ చేస్తూ బ్యాట్, బంతితో పాటు లవ్ ఎమోజీ పెట్టాడు. తన ఆట అయిపోలేదని.. మళ్లీ కమ్‌బ్యాక్ ఇస్తానంటూ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా ఎమోషనల్ పోస్టు ద్వారా చెప్పకనే చెప్పాడు. పుజారా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 🏏 ❤️ pic.twitter.com/TubsOu3Fah — Cheteshwar Pujara (@cheteshwar1) June 24, 2023 Best of luck for comeback🤞 — Shubman Gang (@ShubmanGang) June 24, 2023 Not finished 👍 — Naveen (@_naveenish) June 24, 2023 Comeback stronger like Rahane and ignore all comments including mine — Mr Wrong / Cr7 & Abd ❤️ (@wrong_huihui) June 24, 2023 చదవండి: కెరీర్ ముగిసినట్లే! ..'కొత్త గోడ'కు సమయం ఆసన్నం -
టీమిండియాకు దూరం.. పుజారా కీలక నిర్ణయం, సూర్య కూడా
టీమిండియా నయావాల్‌గా పేరుగాంచిన చతేశ్వర్ పూజారాకు షాక్ తగిలిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఫామ్‌లో లేక సతమతమవుతున్న పుజారాను విండీస్‌తో టెస్టు సిరీస్‌కు పక్కనబెట్టారు. ఇది పుజారా కెరీర్‌కు ఎండ్లా కనిపిస్తుందని సోషల్ మీడియాలో హోరెత్తుతున్నప్పటికి తాను మాత్రం పట్టించుకోలేదు. మళ్లీ ఎలాగైనా జట్టులోకి తిరిగి రావాలని ప్రయత్నంలో పూజరా కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనపై వేటు వేయడంతో అసంతృప్తికి గురైన అతను దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఓకే చెప్పాడు. త్వరలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో సత్తా చాటాలని తహతహలాడుతున్నాడు. ఈ టోర్నీలో అతను వెస్ట్ జోన్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. పూజరాతో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా అదే జట్టులో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆరు జట్లు పాల్గొంటున్న దులీప్ ట్రోఫీ బెంగళూరు వేదికగా జూన్ 28న మొదలవ్వనుంది. విండీస్‌తో టెస్టులకు ఎంపిక్వని సూర్య.. వన్డే జట్టుతో మాత్రం కలవనున్నాడు. కౌంటీల్లో రాణించి… ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో పూజారా తీవ్రంగా నిరాశ పరిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో తక్కువ స్కోర్‌కే వెనుదిరిగాడు. అంతకు ముందు ఇంగ్లండ్ గడ్డపై కౌంటీల్లో అద్భుతంగా రాణించి సెంచరీల మీద సెంచరీలు సాధించాడు. ఏ ఇంగ్లండ్‌లో అయితే చెలరేగాడో అదే గడ్డపై డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రం చేతులెత్తేశాడు. ఇప్పటివరకు పుజారా 103 టెస్టుల్లో 43.60 సగటు, 19 సెంచరీలతో పుజారా 7195 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సార్లు టెస్టు సిరీస్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించడం అతని కెరీర్లో అత్యుత్తమ క్షణాలు. ఇక వెస్టిండీస్ టూర్‌కు టెస్టు, వన్డేలకు 16 మందితో కూడిన బృందాన్ని ఈరోజు కమిటీ ప్రకటించింది. భారత జట్టు విండీస్ గడ్డపై 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టి20 ఆడనుంది. చదవండి: #CheteshwarPujara: కెరీర్ ముగిసినట్లే! ..'కొత్త గోడ'కు సమయం ఆసన్నం -
కెరీర్ ముగిసినట్లే! ..'కొత్త గోడ'కు సమయం ఆసన్నం
టెస్టుల్లో టీమిండియాకు మూడోస్థానం చాలా కీలకం. 1990ల చివరి నుంచి రిటైర్ అయ్యేవరకు ద్రవిడ్ మూడోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఎన్నోసార్లు టీమిండియా పాలిట ఆపద్భాందవుడయ్యాడు.చాలా మ్యాచ్‌ల్లో తన ఇన్నింగ్స్‌లతో ఓటమి కోరల్లో నుంచి భారత్‌ను కాపాడి ది వాల్ అనే పేరును సుస్థిరం చేసుకున్నాడు. ఇక ద్రవిడ్ రిటైర్ అయిన తర్వాత మూడో స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ దశలో వచ్చాడు చతేశ్వర్ పుజారా. 2010లో టెస్టు మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన పుజారా అతతి కాలంలోనే మంచి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. 2012లో తొలిసారి తన మార్క్ ఆటతీరును ప్రదర్శించిన పుజరా ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసేలా కెరీర్ ఆరంభంలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అలా టీమిండియా నయావాల్‌గా పుజారా గుర్తింపు పొందాడు. ఒకప్పుడు ప్రత్యర్థుల పాలిట అడ్డుగోడలా నిలిచిన పుజారా ఇప్పుడు మాత్రం జట్టుకు గుదిబండలా తయారయ్యాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్నా పుజారా కెరీర్ దాదాపు ముగిసినట్లే. ఇక మరో కొత్త గోడ(The Wall) కోసం వెతకాడాకి సమయం ఆసన్నమైంది. -సాక్షి, వెబ్‌డెస్క్ పుజారాను భారత జట్టు నుంచి తప్పించడం కొత్త కాదు. కొన్నాళ్ల క్రితమే స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. అయితే కౌంటీల్లో భారీ స్కోర్లు సాధించి మళ్లీ జట్టులోకి వచ్చిన అతను ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడటంతో పాటు కెరీర్లో 100 టెస్టుల మైలురాయిని కూడా అందుకున్నాడు. ఇటీవల ఆ్రస్టేలియాతో సొంతగడ్డపై విఫలమైనా, అతని అనుభవాన్ని నమ్మి డబ్ల్యూటీసీ ఫైనల్లో మరో అవకాశం ఇచ్చారు. రెండు ఇన్నింగ్స్‌లలో అతను 14, 27 పరుగులే చేశాడు. గత మూడేళ్లుగా అతను పేలవ ఫామ్‌లో ఉన్నా సీనియర్‌గా, ఎన్నో మ్యాచ్‌లు గెలిపించిన గౌరవంతో పుజారాను కొనసాగించారు. బంగ్లాదేశ్‌పై ఆడిన రెండు కీలక ఇన్నింగ్స్ (90, 102)లను పక్కన పెడితే మూడేళ్లలో అతని సగటు 26 మాత్రమే. ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న సెలక్టర్లు మళ్లీ వెనక్కి వెళ్లి పుజారాను ఎంపిక చేసే అవకాశాలు కనిపించడం లేదు. 103 టెస్టుల్లో 43.60 సగటు, 19 సెంచరీలతో పుజారా 7195 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సార్లు టెస్టు సిరీస్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించడం అతని కెరీర్లో అత్యుత్తమ క్షణాలు. Thankyou for the memories @cheteshwar1 🫶,Being a part of two series Wins in Australia is always special,You gave your best in those two series and many more..Still not writing you off🙅♂️.#cheteshwarpujara #Pujara pic.twitter.com/CNJkDDTIjF — Rishi (@risshitweetS) June 23, 2023 చదవండి: కౌంటీల్లో సెంచరీల మీద సెంచరీలు! అసలు పోరులో తుస్సు! అందుకే.. -
సొంత కార్లో వచ్చిన పుజారా అవాక్కయిన జడేజా
-
ప్రత్యర్థి కెప్టెన్ నుంచి మరిచిపోలేని గిఫ్ట్
టెస్టు క్రికెట్లో వందో మ్యాచ్ అనేది ఏ ఆటగాడికైనా చాలా ప్రత్యేకం. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కూడా తాజాగా టెస్టుల్లో ఆ మైలురాయిని అందుకున్నాడు. అయితే వందో టెస్టులో సెంచరీ చేస్తాడని భావించినప్పటికి పుజారా దానిని అందుకోలేకపోయాడు. తన వందో టెస్టులో టీమిండియా విజయం సాధించడం మాత్రం పుజారాకు ఆనందాన్ని కలిగించే విషయం. 115 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను పుజారా గెలిపించాడు. విజయానికి ఒక్క పరుగు అవసరమైన దశలో బౌండరీ కొట్టి టీమిండియాకు విక్టరీ అందించాడు. ఈ సంగతి పక్కనబెడితే.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ నుంచి పుజారా ఎప్పటికి గుర్తుండిపోయే గిఫ్ట్‌ను అందుకున్నాడు.ఢిల్లీ టెస్టులో ఓటమి అనంతరం కమిన్స్ ఆసీస్ ఆటగాళ్లు సంతకం చేసిన జెర్సీని పూజారాకు బహూకరించాడు. కమిన్స్, పూజారాకు జెర్సీ అందజేస్తున్న ఫొటోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఆ ఫొటోకు 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్' అని క్యాప్షన్ రాసింది. అయితే వందో టెస్టు ఆడుతున్న ప్లేయర్‌కు జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చే ఆనవాయితీ ఎప్పటినుంచో ఉంది. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే కూడా ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లియోన్‌కు జెర్సీని కానుకగా అందించాడు. గబ్బాలో వందో టెస్టు ఆడుతున్న లియోన్‌కు భారత ఆటగాళ్ల బృందం సంతకం చేసిన జెర్సీని కానుకగా ఇచ్చాడు. Spirit of Cricket 👏🏻👏🏻 Pat Cummins 🤝 Cheteshwar Pujara What a special gesture that was! 🇮🇳🇦🇺#TeamIndia | #INDvAUS pic.twitter.com/3MNcxfhoIQ — BCCI (@BCCI) February 19, 2023 -
పుజారా వందో టెస్టు.. కుటుంబం మొత్తం స్టేడియంలో
ప్రస్తుతం ఒక ఆటగాడు సంప్రదాయ క్రికెట్(టెస్టు)లో వంద టెస్టుల మైలురాయిని అందుకున్నాడంటే సామాన్యమైన విషయం కాదు. టి20 క్రికెట్ లాంటి వేగవంతమైన ఆట వచ్చాకా ఎన్నో మార్పులు వచ్చాయి. ఫాస్ట్ క్రికెట్ ఆడేందుకు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటూ పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే కొనసాగుతున్నారు కొందరు క్రికెటర్లు. ఇలాంటి టైంలో కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమై స్పెషలిస్ట్‌గా ముద్రించుకున్న చతేశ్వర్ పుజారా టీమిండియా తరపున ఇవాళ వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. భారత్ క్రికెట్లో టెస్టుల్లో వంద మ్యాచ్‌ల రికార్డును ఇంతకముందు 12 మంది మాత్రమే అందుకున్నాడు. తాజాగా పుజారా వంద టెస్టులాడిన 13వ క్రికెటర్‌గా అరుదైన జాబితాలో నిలిచాడు. బీసీసీఐతో పాటు టీమిండియా కూడా అతనికి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి గౌరవించుకుంది. ఇక పుజారా వందో టెస్టు నేపథ్యంలో అతని ఆటను చూసేందుకు ఫ్యామిలీ మొత్తం ఢిల్లీలో వాలిపోయింది. దాదాపు 30 మంది కుటుంబసభ్యులు పుజారా వందో టెస్టు చూడడానికి వచ్చారు. కుటుంబం అంతా సౌత్ ఢిల్లీలోని ఒక హోటల్లో బస చేశారు. ఈ సందర్భంగా హోటల్ రిసెప్షన్లో పుజారా ఫ్యామిలీ గ్రూప్ ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక పుజారా వందో టెస్టు చూడడానికి 30 స్పెషల్ టీ-షర్ట్ తయారు చేసుకున్న ఫ్యామిలీ.. షర్ట్ వెనకాల చతేశ్వర్ పుజారా షార్ట్‌ఫామ్ (C, T) అక్షరాలు వచ్చేలా ప్రింట్ వేసుకున్నారు. మ్యాచ్ జరుగుతున్న ఫిరోజ్ షా కోట్లా మైదానానికి కుటుంబం మొత్తం టీ-షర్ట్స్ వేసుకొని సందడి చేశారు. మా చింటు(పుజారా) వందో టెస్టు ఆడడం కళ్లారా చూడడం ఆనందంగా ఉందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. వందో టెస్టులో పుజారా కచ్చితంగా సెంచరీ చేస్తాడని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. 'A journey full of hard-work, persistence & grit' 🙌 🙌 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦: Wishes & tributes pour in as #TeamIndia congratulate the ever-so-gutsy @cheteshwar1 ahead of his 💯th Test 👏 👏 Watch the SPECIAL FEATURE 🎥 🔽 #INDvAUS https://t.co/d0a2LjFyGh pic.twitter.com/lAFpNcI7SF — BCCI (@BCCI) February 16, 2023 -
'వాడి తల్లిని క్యాన్సర్ బలి తీసుకుంది'
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా అరుదైన మైలురాయిని అందుకోనున్నాడు. ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టెస్టు పుజారాకు వందోది కానుంది. భారత టెస్టు క్రికెట్లో అప్పటికే రెండు దశాబ్దాల పాటు ఎన్నో మ్యాచ్‌ల్లో అడ్డుగోడలా నిలబడి 'ది వాల్(The Wall)' అన్న పేరు లిఖించుకున్న రాహుల్ ద్రవిడ్ కెరీర్ చరమాంకంలో ఉంది. అతను రిటైరైతే టీమిండియాకు మరో వాల్ ఎవరవుతారనేది ఆసక్తికరంగా మారింది. అప్పుడు వచ్చాడు చతేశ్వర్ పుజారా. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడి ద్రవిడ్ తర్వాత 'ది వాల్' అన్న బిరుదును సార్థకం చేసుకున్నాడు. అయితే 13 ఏళ్ల కెరీర్లో పుజారా చాలా ఎత్తుపల్లాలు చూసినప్పటికి వంద టెస్టుల ఆడిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో చేరడం అభినందించాల్సిన విషయం. టెస్టుల్లో టీమిండియా తరపున వంద టెస్టులు పూర్తి చేసుకున్న 13వ ఆటగాడిగా పుజారా నిలవనున్నాడు. పుజారా వందో టెస్టు ఆడనున్న నేపథ్యంలో అతని తండ్రి అర్వింద్ పుజారా సంతోషం వ్యక్తం చేశాడు. టెస్టు క్రికెట్లో తనదైన ముద్ర వేసిన పుజారా ఇవాళ వందో టెస్టు ఆడనుండడం తనకెంతో గర్వంగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అర్వింద్ పుజారా మాట్లాడాడు. ''పుజారా వందో టెస్టు ఆడుతుండడం నా భార్య రీనా(పుజారా తల్లి) చూడలేకపోతుంది. ఎందుకంటే పుజారా 17 ఏళ్ల వయసులోనే రీనా క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసింది. ఒకవేళ తను బతికిఉంటే మాత్రం కొడుకు ఘనతను చూసి కచ్చితంగా గర్వపడేది. చిన్నప్పటి నుంచి పుజారాకు కష్టపడే తత్వం అలవాటైంది. స్కూల్ ముగిశాక తన సోదరులతో కలిసి పొలానికి వచ్చి నాకు సాయపడేవాడు. పుజారా ఎప్పుడు కష్టమైన మార్గాన్ని ఏంచుకున్నప్పటికి చివరకు తాను వెళ్లేది రైట్ చాయిస్లోనేనని చాలాసార్లు నిరూపించాడు. పార్టీలకు దూరంగా ఉంటూ ఇప్పటికి మద్యం ముట్టని పుజారా ఈ స్థాయికి రావడానికి ముగ్గురు ముఖ్య కారణమయ్యారు. మొదటి వ్యక్తి నా భార్య రీనా అయితే.. రెండో వ్యక్తి పుజారా మేనత్త(నా చెల్లెలు) పుజా.. ఇక మూడో వ్యక్తి పుజారా గురువు. మంచి క్రికెటర్‌గా పుజారా ఎదగడానికి ఈ ముగ్గురు చాలా కష్టపడ్డారు. ఇక వాడి(పుజారా) చిన్ననాటి కోచ్‌గా, తండ్రిగా నా పాత్ర కూడా ఉంది. చింటూ(పుజారా ముద్దుపేరు)తో ఎన్ని గంటలు గడిపానో లెక్కలేదు. ప్రైమరీ స్కూల్ సమయంలో రాత్రి డిన్నర్ అయిన తర్వాత నేను, భార్య రీనా, పుజారా కలిసి వాకింగ్‌కు వెళ్లేవాళ్లం. మేం ముందు నడుస్తుంటే వాడు సైకిల్‌పై మా వెనుక ఫాలో అయ్యేవాడు. అక్కడికి దగ్గర్లో ఒక పార్క్ ఉండేది. పార్క్‌లో ఉన్న ఊయలను చూడగానే పుజారా మొహం సంతోషంతో వెలిగిపోవడం నాకు ఇంకా గుర్తుంది. చిన్నప్పటి నుంచే టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడడం నేర్చుకున్న పుజారా బ్యాటింగ్‌తో ఆకట్టుకునేవాడు. వాడిలో మంచి టెక్నిక్ ఉందని గ్రహించిన నేను క్రికెట్ ఫౌండేషన్‌లో చేర్చాను. అలా అండర్-13లో సౌరాష్ట్ర తరపున ఒక మ్యాచ్‌లో 300 పరుగులు కొట్టి తొలిసారి టీమిండియా అండర్-15 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఎన్సీఏ క్యాంప్‌కు వెళ్లిపోయాడు. అక్కడి నుంచి పుజారా పరుగుల ప్రవాహం ఎక్కడా ఆగలేదు. అలా అండర్-15, అండర్-19 క్రికెట్లో తనదైన ముద్ర చూపించి ఇవాళ టీమిండియా సీనియర్ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక పేజీని రూపొందించుకున్నాడు. పుజారా నా కొడుకుగా పుట్టడం అదృష్టం'' అంటూ అర్వింద్ ఎమోషనల్ అయ్యాడు. ఇక పుజారా 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కెరీర్ ఆరంభంలో టెస్టులతో పాటు వన్డేలకు ఎంపికైనప్పటికి.. తర్వాత పూర్తిగా టెస్టులకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్ర వేయించుకున్న పుజారాతన విలువైన ఇన్నింగ్స్‌లతో టీమిండియాను ఎన్నోసార్లు గెలిపించాడు.. మరెన్నోసార్లు ఓటముల బారి నుంచి రక్షించాడు. మొత్తంగా 99 టెస్టులాడిన పుజారా 7021 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 34 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక ఐదు వన్డేలు మాత్రమే ఆడిన పుజారా 51 పరుగులు చేశాడు. మరి ఫిబ్రవరి 17 నుంచి ఆసీస్‌తో ప్రారంభం కానున్న తన వందో టెస్టులో పుజారా శతకంతో రాణిస్తాడా లేదా అనేది చూడాలి. చదవండి: 'నా కూతురికి డబ్బు విలువ తెలియదు' -
అందుకే సర్ఫరాజ్‌ను ఎంపిక చేయలేదు! మౌనం వీడిన బీసీసీఐ సెలక్టర్
Sarfaraz Khan- Team India: గత కొన్నాళ్లుగా భారత క్రికెట్ వర్గాల్లో తరచుగా వినిపిస్తున్న పేరు సర్ఫరాజ్ ఖాన్. ఈ ముంబై బ్యాటర్ దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్నా జాతీయ జట్టుకు మాత్రం సెలక్ట్కావడం లేదు. సెంచరీలు, డబుల్ సెంచరీలు బాదుతున్నా.. బీసీసీఐ సెలక్టర్లు అతడి ఎంట్రీకి తలుపులు తెరవడం లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఆస్ట్రేలియాతో టీమిండియా టెస్టు సిరీస్ నేపథ్యంలో సర్ఫరాజ్‌కు అవకాశం ఇస్తారని భావించినా అలా జరుగలేదు. రంజీ ట్రోఫీ 2022-23లో సత్తా చాటినా భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో తాను తీవ్ర నిరాశకు లోనయ్యానన్న సర్ఫరాజ్.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు తనను సిద్ధంగా ఉండమని చెప్పారంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. తాను కూడా మనిషేనని, తనకూ భావోద్వేగాలు ఉంటాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల సర్ఫరాజ్‌కు మద్దతుగా అభిమానులు, పలువురు మాజీలు.. సెలక్టర్ల తీరుపై విమర్శలు సంధించారు. ఈ క్రమంలో ఈ విషయంపై బీసీసీఐ సెలక్టర్ శ్రీధరన్ శరత్ తాజాగా స్పందించారు. బ్యాటింగ్ విభాగం పటిష్టం ‘‘కోహ్లి ఇంకా మ్యాచ్ విన్నరే. ఛతేశ్వర్ పుజారా ఉంటే బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. రోహిత్ శర్మ అద్భుతమైన నాయకుడు. శ్రేయస్ అయ్యర్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇక శుబ్‌మన్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేఎల్ రాహుల్ తనదైన రోజు ఎలా ఆడతాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం భారత బ్యాటింగ్ విభాగం బాగుంది. తనకూ ఓ రోజు ఛాన్స్ ఇక సర్ఫరాజ్ కూడా మా ప్రణాళికల్లో ఉన్నాడు. తనదైన రోజు తప్పకుండా అతడికి అవకాశం వస్తుంది. అయితే, జట్టును ఎంపిక చేసేటపుడు అన్ని విభాగాలను పరిశీలించి సమతుల్యంగా ఉండేట్లు చూసుకుంటాం’’ అంటూ కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌స్టార్‌తో మాట్లాడుతున్న క్రమంలో సర్ఫరాజ్ గురించి శ్రీధరన్ శరత్‌కు ప్రశ్న ఎదురు కాగా ఇలా బదులిచ్చాడు. కాగా ఇటీవల చేతన్ శర్మ నాయకత్వంలో ఏర్పాటైన నేషనల్ ప్యానెల్లో శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలాతో పాటు శ్రీధరన్ శరత్ కూడా ఉన్నారు. చదవండి: Team India: అలా అయితే ఆ రెండు జట్లను బ్యాన్ చేయాలి! క్రికెట్‌ను భ్రష్టు పట్టించేవాళ్లు అక్కడ లేరు Hyd Vs DEL: దంచికొట్టిన ఆయుశ్.. 7 వికెట్లతో చెలరేగిన హర్షిత్.. ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ హైదరాబాద్ ఓటమి -
కరువు తీరింది.. 52 ఇన్నింగ్స్‌ల తర్వాత సెంచరీ
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్న పుజారా ఈసారి మాత్రం ఆ అవకాశాన్ని వదల్లేదు. అంతేకాదు టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడిన పుజారా తన శైలికి భిన్నంగా ఆడుతూ ఫాస్టెస్ట్ సెంచరీ అందుకోవడం విశేషం. 130 బంతుల్లో వంద పరుగుల మార్క్‌ను అందుకున్న పుజారాకు ఇది టెస్టుల్లో 19వ సెంచరీ. పుజారా ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు ఉన్నాయి. ఇక పుజారా 52 ఇన్నింగ్స్‌ల తర్వాత సెంచరీ మార్క్ అందుకొని సెంచరీల కరువును తీర్చుకున్నాడు. మధ్యలో చాలాసార్లు మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన పుజారా శతకం మాత్రం అందుకోలేకపోయాడు. ఇక ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కూడా డెబ్యూ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు మాత్రమే చేసి ఔటైనప్పటికి.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 152 బంతుల్లో 110 పరుగులు చేసి ఔటయ్యాడు. పుజారా శతకం బాదగానే టీమిండియా 258 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ ముందు 512 పరుగుల లక్ష్యాన్ని టార్గెట్‌గా ఉంచింది. ఆటకు రెండురోజుల సమయం ఉండడంతో టీమిండియాకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. cheteshwar pujara Test fastest century#INDvBAN #pujara #TestCricket pic.twitter.com/U6PhVACKxO — sportsliveresults (@Ashishs92230255) December 16, 2022 చదవండి: టీమిండియాతో తొలి టెస్టు.. బంగ్లాదేశ్ టార్గెట్ 512 -
Virat Kohli: మూడేళ్లయినా తీరని 'ఆ' ముచ్చట..!
టెస్ట్ క్రికెట్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి పేలవ ఫామ్ కొనసాగుతోంది. చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 14) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో 5 బంతులు ఎదుర్కొన్న కింగ్.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. స్పిన్నర్ తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో కోహ్లి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. సుదీర్ఘ ఫార్మాట్లో గత 33 ఇన్నింగ్స్‌లుగా మూడంకెల ముచ్చట తీరని కోహ్లికి ఈ మ్యాచ్‌లోనూ నిరాశే ఎదురైంది. టీ20ల్లో, వన్డేల్లో ఫామ్‌ను అందుకున్న కోహ్లి.. టెస్ట్‌ల్లో సైతం చెలరేగుతాడని అంతా భావించారు. అయితే అతను పట్టుమని 10 బంతులు కూడా ఆడకుండా తస్సుమనిపించాడు. టెస్ట్‌ల్లో కోహ్లి సెంచరీ చేసి మూడేళ్లు పూర్తి అయిపోయింది. ఈ ఫార్మాట్లో అతను చివరిసారిగా 2019 నవంబర్‌లో సెంచరీ చేశాడు. కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన డే అండ్ నైట్ టెస్ట్‌లో కోహ్లి 136 పరుగులు సాధించాడు. నాటి నుంచి 33 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి.. 26.45 సగటున కేవలం 873 పరుగులు మాత్రమే సాధించాడు. ఇందులో అతని అత్యుత్తమ స్కోర్ 79. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. నయా వాల్ చతేశ్వర్ పుజారా (203 బంతుల్లో 90; 11 ఫోర్లు) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్ 82 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా పుజారా, శ్రేయస్ భారీ భాగస్వామ్యంతో ఆదుకున్నారు. కేఎల్ రాహుల్ (22), శుభ్‌మన్ గిల్ (20), విరాట్ కోహ్లి (1) నిరాశపర్చగా.. రిషబ్ పంత్ (46) పర్వాలేదనిపించాడు. తొలి రోజు ఆఖరి బంతికి అక్షర్ పటేల్ (14) ఔట్ కావడంతో ఆటకు తెరపడింది. శ్రేయస్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా.. మెహిది హసన్ 2, ఖలీద్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. -
సెంచరీల మీద సెంచరీలు.. గ్యాప్‌లో పాక్ బౌలర్‌కు చుక్కలు
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా సూపర్ ఫామ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడా తగ్గేదే లే అంటున్న పుజారా మరో సెంచరీతో చెలరేగాడు. ఈ గ్యాప్‌లోనే పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిదికి చుక్కలు చూపించాడు. ఇక ఫామ్ కోల్పోయి టీమిండియా జట్టులో చోటు కోల్పోయిన పుజారా.. కౌంటీ క్రికెట్లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. టీమిండియా జట్టులోకి తిరిగి రావాలనే కసితో ఆడుతున్న పుజారా కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ తరపున ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీతో మెరిశాడు. తాజాగా మిడిలెసెక్స్‌తో మ్యాచ్‌లో ఆదివారం పుజారా నాలుగో సెంచరీతో మెరిశాడు. రెండో ఇన్నింగ్స్‌లో టామ్ ఆల్సప్(66)తో కలిసి నాలుగో వికెట్‌కు 138 పరుగులు జోడించిన పుజారా.. ఆ తర్వాత టామ్ క్లార్క్‌తో(26*) కలిసి 92 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. ఓవరాల్‌గా మూడోరోజు ఆట ముగిసేసమయానికి పుజారా(149 బంతుల్లో 125 బ్యాటింగ్, 16 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ క్లార్క్(26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పుజారా మెరుపులతో ససెక్స్ 270 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు మిడిలెసెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ కాగా.. ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 392 పరుగులకు ఆలౌటైంది. కాగా పుజారాకు ఈ సీజన్లో ఇది నాలుగో సెంచరీ కాగా.. ఇంతకముందు 201*(డెర్బీషైర్ జట్టుపై), 109(వోర్సెస్టర్షైర్ జట్టుపై), 203(డర్హమ్ జట్టుపై) సెంచరీలు అందుకున్నాడు. Fourth match, fourth 100+ score. 💯 🤯 It's a privilege to watch, @cheteshwar1. 👏 pic.twitter.com/IF8nLUt9Yg — Sussex Cricket (@SussexCCC) May 7, 2022 గ్యాప్‌లో పాక్ బౌలర్‌కు చుక్కలు.. సెంచరీతో మెరిసిన పుజారా షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్సర్ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ససెక్స్ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఇది చోటుచేసుకుంది. ఓపెనర్ల వికెట్లు ఆరంభంలోనే కోల్పోవడంతో ససెక్స్ కష్టాల్లో పడింది. ఈ దశలో పుజారా, టామ్ ఆల్సప్లు జాగ్రత్తగా ఆడారు. అయితే పుజారా తన ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ఆరంభించాడు. షాహిన్ అఫ్రిది ఇన్నింగ్స్ మూడో ఓవర్ మూడో బంతిని బౌన్సర్ వేశాడు. అయితే పుజారా దానిని వదలకుండా బ్యాట్ ఎడ్జ్‌తో అప్పర్ కట్ చేశాడు. దీంతో బంతి బౌండరీ ఫెన్స్ దాటి అవతల పడింది. పుజారా కెరీర్లో అతి తక్కువగా ఆడిన షాట్లలో అప్పర్ కట్ ఒకటి. ఇక పుజారా, అఫ్రిదిలు ఎదురుపడడం ఇదే తొలిసారి. Shaheen Afridi 🆚 Cheteshwar Pujara A battle you don't want to miss. Watch it LIVE 👉 https://t.co/UVQbX7r83y#LVCountyChamp pic.twitter.com/GBHE5CdZzH — LV= Insurance County Championship (@CountyChamp) May 7, 2022 -
కౌంటీ క్రికెట్లో దుమ్మురేపుతున్న పుజారా.. వరుసగా మూడో శతకం
టీమిండియా సీనియర్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా కౌంటీలో వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. ఫామ్‌లేక సతమతమయిన పుజారా టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. తన సహచరులంతా ఐపీఎల్లో బిజీగా ఉంటే పుజారా మాత్రం కౌంటీల్లో ఆడుతున్నాడు. బ్యాటింగ్‌లో ఇరగదీస్తున్న పుజారా సెంచరీల మీద సెంచరీలు సాధిస్తున్నాడు. ససెక్స్ తరపున బరిలోకి దిగిన పుజారా డర్హమ్‌తో మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. శుక్రవారం రెండోరోజు ఆట ముగిసేసమయానికి పుజారా 128 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. కాగా ఈ సీజన్ కౌంటీలో పుజారాకు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం ససెక్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. దీంతో ససెక్స్ జట్టు డర్హమ్‌పై 139 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. పుజారకు తోడుగా మహ్మద్ రిజ్వాన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా పుజారా ఇంతకముందు వరుసగా డెర్బిషైర్‌పై 201 పరుగులు, వర్సిస్టర్ షైర్‌పై 109 పరుగులు సాధించాడు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్లో బిజీగా ఉన్నారు. ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌కు వెళ్లనున్న భారత్.. ఆ పర్యటనలో ఒక టెస్టు, ఐదు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. అంటే పుజరా టీమిండియా తరపున బరిలోకి దిగేది ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్టు ద్వారానే అని తెలస్తుంది. చదవండి: షాహిద్ అఫ్రిది ఒక క్యారెక్టర్ లెస్.. అబద్ధాల కోరు : పాక్ మాజీ స్పిన్నర్ ANOTHER 💯!@cheteshwar1 🤯 👏 pic.twitter.com/4nqhzhQjqW — Sussex Cricket (@SussexCCC) April 29, 2022 -
పుజారా మరో సెంచరీ.. పరుగుల వరద పారిస్తున్న నయా వాల్
Pujara Scores Century Followed By Double Ton: పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన చతేశ్వర్ పుజరా ఇంగ్లండ్ కౌంటీల్లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఈ సీజన్లో ససెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న నయా వాల్ వరుస శతకాలతో పరుగుల వరద పారిస్తున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ (రెండో ఇన్నింగ్స్) సాధించిన అతను.. వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ బాదాడు. వరుస ఇన్నింగ్స్‌ల్లో మూడంకెల స్కోర్‌ను రీచైన పుజారా ఎట్టకేలకు పూర్వపు ఫామ్‌ను దొరకబుచ్చుకున్నాడు. డెర్బిషైర్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే ఔటైన పుజారా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేశాడు. సూపర్ ఫామ్‌కు కొనసాగింపుగా వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో 206 బంతులను ఎదుర్కొన్న నయా వాల్.. 16 ఫోర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. పుజారా ఒక్కడే సొగసైన సెంచరీతో రాణించడంతో ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులకు ఆలౌటైంది. ఇదే జట్టు తరఫున ఆడుతున్న పాక్ వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ తొలి బంతికే డకౌట్ కాగా, టామ్ క్లార్క్ (44) కాస్త పర్వాలేదనిపించాడు. అంతకుముందు వార్సెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 491 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ జట్టు కెప్టెన్ బ్రెట్ డిఒలివియెరా అజేయమైన 169 పరుగులతో సత్తా చాటగా, ఎడ్ పొలాక్ (77), బెర్నార్డ్ (75) అర్ధ సెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయిన ససెక్స్ ఫాలో ఆన్ ఆడుతుంది. చదవండి: ధోనికో లెక్క.. పంత్‌కో లెక్కా..? నో బాల్ వివాదంపై ఆసక్తికర చర్చ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒకే ఫ్రేమ్‌లో దాయాది క్రికెటర్లు; అరుదైన దృశ్యం అంటున్న ఫ్యాన్స్
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ప్రస్తుతం కౌంటీల్లో ఆడేందుకు లండన్‌లో వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఫామ్ కోల్పోయి సతమతవుతున్న పుజారా మళ్లీ ఫామ్‌ను అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఈసారి కౌంటీల్లో ససెక్స్ తరపున పుజారా అరంగేట్రం చేయనున్నాడు. ఇదే సమయంలో పాకిస్తాన్ స్టార్ మహ్మద్ రిజ్వాన్ కూడా ససెక్స్ తరపునే కౌంటీల్లో అరంగేట్రం చేయనున్నాడు. తాజాగా ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్‌లో ఫోటోకు ఫోజిచ్చారు. ఒకరు టీమిండియాకు ఆడుతుంటే.. మరొకరు మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌కు ఆడుతున్నాడు. ఎంతైనా టీమిండియా-పాకిస్తాన్ అంటే చాలు ఎక్కడున్నా సరే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అందుకే వీరిద్దరు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంపై ట్విటర్లో అభిమానులు ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు. స్వాతంత్య్రం ఇచ్చే సందర్భంలో బ్రిటీష్ ప్రభుత్వం భారత్, పాకిస్తాన్లను విడగొట్టింది..ఇప్పుడదే బ్రిటీష్ మళ్లీ కలిపింది.. ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయి.. ఒకసారి టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే చూడాలనిపిస్తుంది అంటూ కామెంట్ చేశారు. ఇక చతేశ్వర్ పుజారా ఇప్పటికే తనేంటో నిరూపించుకున్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో పుజారా తన మార్క్ చూపించాడు. ద్రవిడ్ తర్వాత అడ్డుగోడ అనే పేరును సార్థకం చేసుకున్నాడు. ఇప్పుడు ఫాం కోల్పోయి సతమతవుతున్నప్పటికి తనదైన రోజున పుజారాను ఆపడం ఎవరి తరం కాదు. ఇక అటు మహ్మద్ రిజ్వాన్ కూడా పాకిస్తాన్ క్రికెట్లో కీలకంగా ఎదుగుతున్నాడు. ఇటీవలే ఐసీసీ టి20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. చదవండి: IND vs PAK: కన్నేసి ఉంచాలంటూ పాక్ ఆటగాళ్ల భార్యలను భారత్‌కు పంపించాం! Divided by British Untied by British 😂 — Tehseen Qasim (@Tehseenqasim) April 14, 2022 I really hope India Pakistan started bilateral series again. Will be a trilling series. Best of luck to both @cheteshwar1 and @iMRizwanPak — Mushahid Hussain (@mushahid345) April 14, 2022 -
పుజారా, రహానేలకు గంగూలీ పరోక్ష హెచ్చరిక
టీమిండియా సీనియర్ ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలు ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు సీనియర్లకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పరోక్షంగా హెచ్చరిక జారీ చేయడం ఆసక్తి కలిగించింది. ఐపీఎల్ వేదికల ఖరారుతో పాటు.. రంజీ ట్రోఫీ నిర్వహణపై.. బీసీసీఐ బోర్డు సభ్యులు,పలువురు అధికారులతో గంగూలీ గురువారం సమావేశం నిర్వహించాడు. చదవండి: కోహ్లి వందో టెస్ట్ కోసం భారీ ఏర్పాట్లు.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ బాస్ గంగూలీ మాట్లాడుతూ..'' పుజారా, రహానేలు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. రంజీ ట్రోఫీ వారిద్దరికి మంచి అవకాశం. పరుగులు రాబట్టేందుకు ఈ సీజన్ వారికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇలాగే ఉంటే జట్టు సమతుల్యం దెబ్బతింటుంది. ఇది కేవలం నా అడ్వైజ్ మాత్రమే.. ఎందుకంటే వారిద్దరు టీమిండియాకు ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడారు. గడ్డుకాలం ప్రతీ ఒక్కరికి వస్తుంది. రహానే, పుజారాలకు ఒకరకంగా బ్యాడ్‌టైం అనుకోవచ్చు. 2005లో నేను ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నా. అప్పుడు రంజీలో ఆడి పరుగులు సాధించడంతో పాటు సూపర్ ఫామ్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చా. అందుకే రంజీ ట్రోఫీకి వెళ్లి పరుగులు రాబట్టడంతో పాటు ఫామ్‌ను కూడా అందుకోవచ్చు'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రెండు సంవత్సరాల తర్వాత భారత్ క్రికెట్లో రంజీ ట్రోఫీ సీజన్ ఆరంభం కానుంది. అయితే ఈసారి సీజన్ రెండు దశల్లో జరగనుంది. ఈ నెల చివరి వారంలో రంజీ సీజన్ తొలి దశ ప్రారంభం కానుంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత నాకౌట్ దశను నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. కరోనా దృష్యా ఐపీఎల్, రంజీ ట్రోఫీ ఇలా రెండు పెద్ద టోర్నీలను నిర్వహించడం బీసీసీఐకి కఠిన పరీక్ష అని చెప్పొచ్చు. చదవండి: ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ అక్కడే.. లీగ్ మ్యాచ్‌లేమో: గంగూలీ -
Ind Vs Sa 3rd Test: అవకాశం ఇచ్చారు... భారీ మూల్యం చెల్లించారు.. తప్పదు మరి!
Ind Vs Sa 3rd Test: టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే మరోసారి విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో భాగంగా కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. 9 బంతులు ఎదుర్కొన్న అతడు రబడ బౌలింగ్‌లో ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో కూడా రహానే పూర్తిగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. కేవలం 9 పరుగులు చేసి అవుటయ్యాడు. అప్పుడు కూడా రబడకే దొరికిపోయి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా రహానే 10 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. దీంతో రహానే ఆట తీరుపై విమర్శలు వెల్లుతెత్తుతున్నాయి. ‘‘ఫామ్‌లేమితో సతమతమవుతున్నా ఇంకా రహానేకు అవకాశం ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా బైబై చెప్పండి. భారీ మూల్యం చెల్లించారు. ఇంకా అంటే కష్టం కదా’’ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కాగా గత 50 టెస్టులలో రహానే ఆట తీరును పరిశీలిస్తే... మొత్తం 89 ఇన్నింగ్స్‌లో 2659 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 16 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు పుజారా సైతం మరోసారి నిరాశపరిచాడు. దీంతో #PURANE హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ఇద్దరు సీనియర్ల పూర్ పర్ఫామెన్స్ కొనసాగుతూనే ఉంది అంటూ విరుచుకుపడుతున్నారు. చదవండి: IPL 2022 Auction: ఐపీఎల్లో ఇంగ్లండ్ కెప్టెన్ అరంగేట్రం!.. నా మొదటి ప్రాధాన్యం అదే! Keegan Petersen with a magnificent catch on the second ball of the day😍 #SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/zqcAtMahSi — Cricket South Africa (@OfficialCSA) January 13, 2022 -
IND vs SA 3rd Test: టార్గెట్ 212.. దక్షిణాఫ్రికా 101/2
IND vs SA 3rd Test- Day 3 Updates: 9:30 PM: టార్గెట్ 212.. దక్షిణాఫ్రికా 101/2 212 పరుగుల ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. మూడో రోజు ఆఖరి బంతికి ఎల్గర్(30) ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో పంత్ క్యాచ్‌కు ఇచ్చి ఎల్గర్ వెనుదిరిగాడు. క్రీజ్‌లో కీగన్ పీటర్సన్(48) ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలవాలంటే మరో 111 పరుగులు అవసరం కాగా, టీమిండియా 8 వికెట్లు పడగొడితే మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. కాగా, టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్ 198 పరుగుల వద్ద ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్ 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది. రిషబ్ పంత్ వీరోచిత సెంచరీ(100 నాటౌట్)తో జట్టును ఆదుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్(10), కోహ్లి(29), పంత్ మినహా ఎవ్వరూ రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. సఫారీ బౌలర్లలో జన్సెన్ 4, రబాడ, ఎంగిడి తలో 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన విషయం తెలిసిందే. 7:40 PM: టార్గెట్ 212.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. 16 పరుగులు చేసిన మార్క్రమ్.. షమీ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో డీన్ ఎల్గర్(3), పీటర్సన్ ఉన్నారు. ఈ మ్యాచ్ గెలవాలంటే దక్షిణాఫ్రికాకు మరో 189 పరుగులు, టీమిండియాకైతే 9 వికెట్లు కావాలి. ముగిసిన భారత ఇన్నింగ్స్.. దక్షిణాఫ్రికా టార్గెట్ 212 6: 50 PM: జన్సెన్ బౌలింగ్‌లో బవుమాకు క్యాచ్ ఇచ్చి బుమ్రా(2) ఔట్ కావడంతో టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్ 198 పరుగుల వద్ద ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్ 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది. రిషబ్ పంత్ వీరోచిత సెంచరీ(100 నాటౌట్)తో జట్టును ఆదుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్(10), కోహ్లి(29), పంత్ మినహా ఎవ్వరూ రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. సఫారీ బౌలర్లలో జన్సెన్ 4, రబాడ, ఎంగిడి తలో 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన విషయం తెలిసిందే. 6:32 PM: షమీ ఔట్.. టీమిండియా తొమ్మిదో వికెట్ డౌన్ మార్కో జన్సెన్ బౌలింగ్‌లో 189 పరుగుల వద్ద మహ్మద్ షమీ డకౌటయ్యాడు. ఫలితంగా టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 212 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. క్రీజ్‌లో పంత్(94), బుమ్రా ఉన్నారు. 6:05 PM: ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్.. ఉమేశ్ డకౌట్ టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 180 పరుగుల వద్ద రబాడ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ వెర్రిన్‌కు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి ఉమేశ్ యాదవ్(0) ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 193 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. క్రీజ్‌లో పంత్(87), షమీ ఉన్నారు. 5:50 PM: ఏడో వికెట్ కోల్పోయిన భారత్ 170 పరుగుల స్కోర్ వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో వికెట్ కీపర్ వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి శార్ధూల్ ఠాకూర్(5) ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 183 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. క్రీజ్‌లో పంత్(77), ఉమేశ్ యాదవ్ ఉన్నారు. 5:28 PM: అశ్విన్(7) ఔట్.. టీమిండియా ఆరో వికెట్ డౌన్ 162 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి అశ్విన్(7) వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 175 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. క్రీజ్‌లో పంత్(74), శార్ధూల్ ఠాకూర్ ఉన్నారు. 5:08 PM: ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా లంచ్ విరామం తర్వాత టీమిండియాకు మరో షాక్ తగిలింది. నిలకడగా ఆడుతున్న జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి(143 బంతుల్లో 29; 4 ఫోర్లు) లూజ్ షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ఎంగిడి బౌలింగ్‌లో మార్క్రమ్ సెకెండ్ స్లిప్‌లో సునాయాసమైన క్యాచ్ అందుకున్నాడు. ఫలితంగా టీమిండియా 152 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో పంత్(71), అశ్విన్ ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 165 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. 2: 20 PM: నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ రబడ బౌలింగ్‌లో డీన్ ఎల్గర్‌కు క్యాచ్ ఇచ్చి అజింక్య రహానే పెవిలియన్ చేరాడు. కోహ్లి, పంత్ క్రీజులో ఉన్నారు. 2: 07 PM: మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా దక్షిణాఫ్రికాతో మూడో రోజు ఆటలో భాగంగా భారత జట్టు ఆదిలోనే కీలక వికెట్ కోల్పోయింది. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో పుజారా మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. కీగన్ పీటర్సన్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. కోహ్లి, రహానే క్రీజులో ఉన్నారు. ప్రస్తుత స్కోరు: 58/3. 2: 00 PM: దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య ఆఖరి టెస్టులో భాగంగా మూడో రోజు ఆట ఆరంభమైంది. 57/2 ఓవర్ నైట్ స్కోరుతో భారత్ ఆట మొదలుపెట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లి 14, పుజారా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్: 223 ఆలౌట్ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 210 ఆలౌట్ తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు -
Ind Vs Sa 3rd Test: వారం రోజుల క్రితం చెత్త ప్రదర్శన.. ఇప్పుడేమో 5 వికెట్లతో చెలరేగి..
Ind Vs Sa 3rd Test: దాదాపు వారం రోజుల క్రితం... రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చి బుమ్రా చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై అతని బౌలింగ్ అస్త్రాలేవీ పని చేయకపోగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పుడు తేదీ మారింది, వేదిక మారింది. తాను అరంగేట్రం చేసిన న్యూలాండ్స్ మైదానంలో బుమ్రా మళ్లీ కదం తొక్కాడు. పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టి పడేస్తూ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. బుమ్రాకు తోడు షమీ, ఉమేశ్ కూడా ఆకట్టుకోవడంతో మూడో టెస్టులో భారత్‌కు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ప్రస్తుతం ఓవరాల్‌గా 70 పరుగుల ముందంజలో ఉన్న టీమిండియా చేతిలో 8 వికెట్లున్నాయి. మ్యాచ్ మూడో రోజు గురువారం ఎంత స్కోరు సాధిస్తుందనే దానిపైనే టెస్టు, సిరీస్ ఫలితం ఆధారపడి ఉంది. కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. రాహుల్ (10), మయాంక్ (7) వెనుదిరగ్గా... కెప్టెన్ కోహ్లి (14 బ్యాటింగ్), పుజారా (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్లు అవుటైన తర్వాత మరో 11.1 ఓవర్ల పాటు వీరిద్దరు జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా ముగించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 17/1తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. కీగన్ పీటర్సన్ (72; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, బుమ్రా 42 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. పీటర్సన్ అర్ధ సెంచరీ... తొలి ఓవర్లోనే వికెట్‌తో భారత్‌కు రెండో రోజు శుభారంభం లభించింది. బుమ్రా వేసిన రెండో బంతికే మార్క్రమ్ (8) క్లీన్‌బౌల్డ్ కాగా, కేశవ్ మహరాజ్ (25)ను ఉమేశ్ వెనక్కి పంపాడు. ఈ దశలో పీటర్సన్, వాన్ డర్ డసెన్ (21) కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. లంచ్ సమయానికి భారత్‌కు మరో వికెట్ దక్కలేదు. తర్వాతి సెషన్లో మాత్రం భారత బౌలర్లు ఒక్కసారిగా జోరు ప్రదర్శించారు. వాన్ డర్ డసెన్‌ను అవుట్ చేసి 67 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యాన్ని ఉమేశ్ విడదీశాడు. ఆ తర్వాత షమీ ఓవర్‌తో భారత్‌కు మరింత పట్టు చిక్కింది. A classy knock from Keegan Petersen during the #Proteas first innings👏 #SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/2dXHRtyMEB — Cricket South Africa (@OfficialCSA) January 12, 2022 క్రీజ్‌లో నిలదొక్కుకున్న తెంబా బవుమా (52 బంతుల్లో 28; 4 ఫోర్లు)ను, మరో రెండు బంతులకే కైల్ వెరీన్ (0) కూడా షమీ పెవిలియన్ చేర్చాడు. జాన్సెన్ (7)ను బుమ్రా బౌల్డ్ చేయడంతో రెండో సెషన్ ముగిసింది. విరామం తర్వాత దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. అప్పటి వరకు పోరాడిన పీటర్సన్‌ను బుమ్రా అవుట్ చేయగా, రబడ (15) చలువతో స్కోరు 200 దాటింది. చివరి వికెట్ కూడా తీసిన బుమ్రా ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనతను నమోదు చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 223; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) పుజారా (బి) బుమ్రా 3; మార్క్రమ్ (బి) బుమ్రా 8; కేశవ్ మహరాజ్ (బి) ఉమేశ్ 25; కీగన్ పీటర్సన్ (సి) పుజారా (బి) బుమ్రా 72; వాన్ డర్ డసెన్ (సి) కోహ్లి (బి) ఉమేశ్ 21; బవుమా (సి) కోహ్లి (బి) షమీ 28; వెరీన్ (సి) పంత్ (బి) షమీ 0; జాన్సెన్ (బి) బుమ్రా 7; రబడ (సి) బుమ్రా (బి) శార్దుల్ 15; ఒలీవియర్ (నాటౌట్) 10; ఎన్గిడి (సి) అశ్విన్ (బి) బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (76.3 ఓవర్లలో ఆలౌట్) 210. వికెట్ల పతనం: 1–10, 2–17, 3–45, 4–112, 5–159, 6–159, 7–176, 8– 179, 9–200, 10–210. బౌలింగ్: బుమ్రా 23.3– 8–42–5, ఉమేశ్ యాదవ్ 16–3–64–2, షమీ 16–4–39–2, శార్దుల్ 12–2–37–1, అశ్విన్ 9–3–15–0. ►బుమ్రా ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయడం ఇది ఏడోసారి. ఈ ప్రదర్శనలన్నీ విదేశాల్లోనే వచ్చాయి. ►కోహ్లి టెస్టుల్లో 100 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున ద్రవిడ్, లక్ష్మణ్, సచిన్, గావస్కర్, అజహర్ తర్వాత ఈ మైలురాయిని దాటిన ఆరో ఆటగాడిగా నిలిచాడు. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు -
Virat Kohli: పంత్ గుణపాఠాలు నేర్చుకుంటాడు.... ఇక రహానే, పుజారా..
‘‘రిషభ్ పంత్ తన తప్పులను సరిదిద్దుకుంటాడు. మేటి క్రికెటర్‌గా తనను తాను నిరూపించుకుంటాడు. తనతో మేము ఇప్పటికే మాట్లాడాం. తను పరిణతి కలిగిన ఆటగాడు. కచ్చితంగా పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు’’ అని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. మూడో టెస్టుకు పంత్ తుది జట్టులో ఉంటాడని సంకేతాలు ఇచ్చాడు. కాగా రెండో టెస్టులో నిర్లక్ష్యపు షాట్‌తో వికెట్ సమర్పించుకున్న పంత్‌ను తుది జట్టు నుంచి తప్పించాలనే వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆఖరి టెస్టు ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లి... ప్రతి ఆటగాడు తప్పులు చేయడం సహజమంటూ పంత్‌ను వెనకేసుకొచ్చాడు. తప్పులు సరిదిద్దుకుని మెరుగ్గా రాణించగలడని ధీమా వ్యక్తం చేశాడు. ఇక సీనియర్ బ్యాటర్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే గురించి చెబుతూ... ‘‘జట్టులో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అయితే అవి సహజంగా జరగాలే గానీ.. బలవంతంగా మార్పులు చేయకూడదు’’ అన్నాడు. మూడో టెస్టు నేపథ్యంలో వీరిద్దరు తుది జట్టులో ఉంటారని చెప్పకనే చెప్పాడు. కాగా కేప్‌టౌన్ వేదికగా జరిగే నిర్ణయాత్మక మూడో టెస్టు జనవరి 11న ఆరంభం కానుంది. చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లి! ఇప్పటికే... -
Purane: అప్పుడేమో పుజారా.. ఇప్పుడేమో రహానే గోల్డెన్ డక్.. ఎందుకురా సామీ ఇంకా!
Ind Vs Sa 2nd Test: Pujara 3 Runs Rahane Golden Duck Trolls Thanks Purane: న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌లో వైఫల్యాలు.. అయినా సరే విదేశీ గడ్డ మీద అనుభవం ఆధారంగా దక్షిణాఫ్రికా టూర్‌కు ఎంపిక... తొలి టెస్టులో తుది జట్టులో చోటు... కానీ అక్కడ కూడా అదే తీరు... టీమిండియా సీనియర్ టెస్టు ప్లేయర్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే గురించే ఈ ప్రస్తావన. సెంచూరియన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో పుజారా గోల్డెన్ డక్... రహానే 48 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో వరుసగా వారి స్కోర్లు... 16,20. అయినా సరే యాజమాన్యం ఈ ఇద్దరు సీనియర్లపై నమ్మకం ఉంచి రెండో టెస్టులోనూ అవకాశమిచ్చింది. అయినా రాత మారలేదు. ఈసారి పుజారా 3 పరుగులు సాధిస్తే... రహానే గోల్డెన్ డక్. వదిలేస్తే పోయే బంతిని అనవసరంగా గెలికి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ ఇద్దరు అనుభవజ్ఞులు ఇలా వచ్చి అలా వెళ్లడంతో 50 పరుగులకే టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది. మయాంక్ 26 పరుగులతో ఫర్వాలేదనిపించినా వీళ్లిద్దరు మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. దీంతో టీమిండియా అభిమానుల సోషల్ మీడియా వేదికగా పుజారా, రహానే ఆట తీరును విమర్శిస్తున్నారు. ఓవైపు వెన్ను నొప్పి కారణంగా కెప్టెన్ విరాట్ కోహ్లి జట్టుకు దూరమైన తరుణంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి.. ఇలా చేయడం ఏమిటని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘పురానే’కు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చేసిందంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఇప్పటికైనా పుజారా, రహానేను పక్కనపెట్టాల్సిందే. ఈ విషయాన్ని అంగీకరించకతప్పదు. ప్రతి ఒక్కరు ప్రతిసారీ బాగా ఆడతామని చెప్పలేము. కానీ వరుసగా వైఫల్యం చెందుతున్నా జట్టులో చోటివ్వడం అర్థం లేనిది. వారి స్థానంలో ప్రతిభ గల యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి’’ అని విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొంత మంది.. ‘‘మీ ఇద్దరు ఫ్రెండ్షిప్నకు విలువ ఇస్తారని మాకు తెలుసు. పుజారా అవుటయ్యాడో లేదో.. వెంటనే తాను కూడా పెవిలియన్ చేరి ఫ్రెండ్‌ను హగ్ చేసుకున్నాడు. ఇది కదా నిజమైన స్నేహం. ఎందుకురా సామీ ఇలా ఆడుతున్నారు. ఇప్పటికైనా కాస్త జాగ్రత్తగా ఆడండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చదవండి: Virat Kohli: అరెరె కోహ్లికి గాయమా? ముఖాలు మాడిపోయాయా.... గర్వం అణిగిందా...