Sarfaraz Khan- Brad Hogg: వెస్టిండీస్‌తో టీమిండియా టెస్టు సిరీస్ నేపథ్యంలో ఎంపిక చేసిన భారత జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ వంటి ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోవపోవడంపై వసీం జాఫర్ వంటి మాజీ క్రికెటర్లు మండిపడ్డారు.
ఇక తాజాగా.. ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బ్రాడ్ హాగ్ ఈ విషయంపై స్పందించాడు. టీమిండియా సెలక్టర్లు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో తనకు తెలుసనంటూ ఈ మాజీ స్పిన్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ..
రంజీల్లో సంచలనమే.. కానీ
‘‘రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్ ఆడిన మాట వాస్తవమే. కానీ వెస్టిండీస్‌తో టెస్టు ఆడే జట్టులో అతడికి చోటెందుకు దక్కలేదో నాకు తెలుసు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి..
ఒకటి.. దేశవాళీ క్రికెట్‌లో అతడు తన జట్టు మిడిలార్డర్‌లో ఆడతాడు. ఐదు లేదంటే ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఇక రెండోది.. ఐపీఎల్‌లో పేసర్లను అతడు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాడు. క్వాలిటీ బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయాడు.
పుజారా పని అయిపోయినట్లే!
బహుశా అందుకే భారత సెలక్టర్లు సర్ఫరాజ్ ఖాన్ విషయంలో వెనుకడుగు వేసి ఉంటారు. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో మెరుగుపడితే అతడిని టెస్టు జట్టుకు ఎంపిక చేస్తారేమో!’’ అని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు.
ఇక నయా వాల్ ఛతేశ్వర్ పుజరాను జట్టు నుంచి తప్పించడంపై స్పందిస్తూ.. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారని పేర్కొన్నాడు. దశాబ్ద కాలంగ వన్‌డౌన్‌లో ఆడుతున్న పుజారా గత రెండేళ్లుగా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడని బ్రాడ్ హాగ్ పెదవి విరిచాడు. పుజారా స్థానంలో దూకుడైన ఆటగాడిని వారసుడిగా నిలిపేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుందన్నాడు.
వెస్టిండీస్‌తో టెస్టులకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ.
చదవండి: కెప్టెన్ ఊచకోత.. జింబాబ్వే సంచలన విజయం.. మేటి జట్లను వెనక్కి నెట్టి టీమిండియా తర్వాత..
Comments
Please login to add a commentAdd a comment