Brad Hogg
-
టీమిండియా భవిష్య కెప్టెన్‌గా తిలక్ వర్మ!
ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి ఆటంటే తనకెంతో ఇష్టమని.. టీ20లలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు మంచి భవిష్యత్తు ఉందన్నాడు. పొట్టి ఫార్మాట్లో టీమిండియా భవిష్య కెప్టెన్‌గా తాను తిలక్‌నే ఎంచుకుంటానని బ్రాడ్ హాగ్ తెలిపాడు.ఐపీఎల్లో సత్తా చాటికాగా అండర్-19 వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ ముంబై ఇండియన్స్(Mumbai Indians) తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అదరగొట్టాడు. అరంగేట్రంలోనే అద్భుతాలు చేసిన అతడు టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో 2023 ఆగష్టులో వెస్టిండీస్(West Indies Tour)తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.సౌతాఫ్రికా గడ్డపై వరుస సెంచరీలుఅదే పర్యటనలో వన్డేల్లోనూ తిలక్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున మొత్తంగా 21 టీ20లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 635 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా రెండు శతకాలు ఉండటం విశేషం. అంతేకాదు.. ఈ రెండూ కూడా సౌతాఫ్రికా గడ్డపై.. అదీ వరుస మ్యాచ్‌లలో సాధించడం అతడి ప్రతిభకు నిదర్శనం.ఇక ఇప్పటికి నాలుగు వన్డేలు పూర్తి చేసుకున్న 22 ఏళ్ల తిలక్ వర్మ 68 పరుగులు చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల.. రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో బ్యాటర్‌గా, సారథిగా సత్తా చాటి ఫైనల్‌కు చేర్చాడు.ఇక తిలక్ వర్మ ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. ఇరుజట్ల మధ్య కోల్‌కతాలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 16 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో ఫోర్ బాది టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు.టీమిండియా కెప్టెన్ కావడం ఖాయంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ తిలక్ వర్మ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నాకు అత్యంత ఇష్టమైన యువ క్రికెటర్ తిలక్ వర్మ. టీ20 ఫార్మాట్లో అతడు టీమిండియాకు కెప్టెన్ కావడం ఖాయం. అతడు చాలా స్మార్ట్. అతడి క్రికెట్ బ్రెయిన్ సూపర్. అందుకే భవిష్య కెప్టెన్‌గా ఎదుగుతాడు’’ అని చెప్పుకొచ్చాడు.అభిషేక్ భేష్అదే విధంగా.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అదరగొట్టిన అభిషేక్ శర్మను కూడా బ్రాడ్ హాగ్ ఈ సందర్భంగా అభినందించాడు. ‘‘కొన్నిసార్లు అతడు విఫలమైన మాట వాస్తవం. అయితే, కోచ్‌తో పాటు కెప్టెన్ మద్దతు ఉండటం అతడికి సానుకూలాంశం. ఎందుకంటే.. టీ20 క్రికెట్లో టాపార్డర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాలని ఏ జట్టైనా కోరుకుంటుంది.ఓపెనింగ్ బ్యాటర్‌కు మేనేజ్మెంట్ కాస్త స్వేచ్ఛనిస్తుంది. పవర్ ప్లేలో పరుగులు రాబట్టి మంచి పునాది వేస్తే.. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతుంది. అభిషేక్ శర్మ విధ్వంసకర ఓపెనర్. అతడు ఈరోజు అద్భుతంగా ఆడాడు. ఇలాగే మున్ముందూ కొనసాగాలి’’ అని బ్రాడ్ హాగ్ ఆకాంక్షించాడు.కాగా తొలి టీ20లో ఇంగ్లండ్‌ను టీమిండియా ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 34 బంతుల్లోనే 79 పరుగులతో రాణించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్‌రేటు 232.35.చదవండి: అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
‘రోహిత్ శర్మ ఖేల్ ఖతం.. అందులో మాత్రం భవిష్యత్తు ఉంది’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కెరీర్ గురించి ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్(Brad Hogg) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో హిట్‌మ్యాన్ పనైపోయిందని.. ఇక అతడు రిటైర్మెంట్ ప్రకటించడమే తరువాయి అన్నాడు. గత ఆరేడు నెలలుగా అతడి విఫలమవుతున్న తీరు.. కెరీర్ ముగింపునకు వచ్చిందనడానికి సంకేతం అని పేర్కొన్నాడు.అయితే, వన్డే(ODI Cricket)ల్లో మాత్రం రోహిత్ శర్మకు ఇంకా భవిష్యత్తు ఉందని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. కాగా గత కొంతకాలంగా భారత సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ టెస్టుల్లో దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా అతడికి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.వరుస వైఫల్యాలుతొలుత స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో తేలిపోయిన ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ.. తర్వాత ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశపరిచాడు. గత పదకొండు ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ నమోదు చేసిన స్కోర్లు వరుసగా 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆసీస్‌తో తొలి టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ.. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు సందర్భంగా మళ్లీ జట్టుతో చేరాడు.అయితే, తొలి టెస్టులో ఓపెనింగ్ జోడీగా యశస్వి జైస్వాల్- కేఎల్ రాహుల్ హిట్ కావడంతో.. రోహిత్ తప్పనిసరి పరిస్థితుల్లో మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే, అనవసరపు షాట్లకు పోయి వికెట్ పారేసుకున్నాడు. అనంతరం మూడో టెస్టులోనూ అదే స్థానంలో బ్యాటింగ్ చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. తన రెగ్యులర్ స్థానమైన ఓపెనింగ్‌లోనూ రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యాడు.ఈ క్రమంలో పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. రోహిత్ శర్మ ఆఖరిదైన సిడ్నీ టెస్టుకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా విశ్రాంతి పేరిట తనంతట తానుగా జట్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో ఆరంభంలో అదరగొట్టిన టీమిండియా.. తర్వాత చతికిల పడి ఓటమిపాలైంది. తద్వారా ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ చేతిలో 3-1తో ఓడి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది.రోహిత్ ఖేల్ ఖతంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ మాట్లాడుతూ.. ‘‘టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ పనైపోయిందనే అనుకుంటున్నా. ఇక అతడు ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడమే మంచిది. గత ఆరు- ఏడు నెలలుగా అతడి ఫామ్ అంత గొప్పగా ఏమీ లేదు.వికెట్ పారేసుకున్న తీరు మరీ ఘోరంఅంతేకాదు అతడు బౌల్డ్ అయ్యాడు. లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ)గా వెనుదిరిగాడు. ఒక ఓపెనర్ అయి ఉండి ఇలా అవుట్ కావడం సరికాదు. ముఖ్యంగా అతడు ఎల్బీడబ్ల్యూ కావడం మరీ ఘోరం’’ అని విమర్శలు గుప్పించాడు. అయితే, ఐదో టెస్టు నుంచి రోహిత్ శర్మ స్వయంగా తప్పుకోవడాన్ని బ్రాడ్ హాగ్ ప్రశంసించాడు.‘‘రోహిత్ శర్మ ఫామ్‌లో లేకపోవడం నిరాశాజనకం. అయితే, సిడ్నీలో అతడు తీసుకున్న నిర్ణయం సరైంది. కానీ అంతకంటే ముందే.. అంటే మెల్బోర్న్ టెస్టు సందర్భంగానే అతడు తుదిజట్టు నుంచి తప్పుకొంటే ఇంకా బాగుండేది. తన స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు ఆడించి ఉంటే మేలు జరిగేది’’ అని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు.వన్డేల్లో రోహిత్ శర్మకు ఇంకా భవిష్యత్తు ఉందిఇక 37 ఏళ్ల రోహిత్ శర్మ వన్డే కెరీర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘టెస్టుల సంగతి ఎలా ఉన్నా.. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇంకా భవిష్యత్తు ఉంది. ఈ ఫార్మాట్లో కాస్త దూకుడుగా.. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, వయసు మీద పడుతున్న దృష్ట్యా అతడు కాస్త జాగ్రత్తగా ఆడితేనే ఇంకొన్నాళ్లు కొనసాగగలుగుతాడు.ఇప్పటి వరకు అతడి వన్డే కెరీర్ అత్యద్భుతం. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడని భావిస్తున్నా’’ అని బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వరకు రోహిత్ శర్మనే టీమిండియాకు ముందుకు నడిపిస్తాడని అభిప్రాయపడ్డాడు.చదవండి: సిక్సర్లు బాదడంలో యువీ తర్వాత అతడే! -
సంజూ శాంసన్ తండ్రి క్షమాపణ చెప్పాలి.. లేదంటే!
టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజూ తండ్రి భారత క్రికెట్ దిగ్గజాలపై ఇష్టారీతిన కామెంట్లు చేయడం తగదని.. ఆయన క్షమాపణ చెబితే బాగుంటుందని హితవు పలికాడు. లేదంటే.. ఆ ప్రభావం సంజూ ఆటపై కచ్చితంగా పడుతుందని పేర్కొన్నాడు.కాగా కేరళకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ 2015లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన అతడు.. ఆరేళ్ల తర్వాత వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక టెస్టుల్లో ఇంత వరకు సంజూ స్థానం దక్కించుకోలేకపోయాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అతడికి అరకొర అవకాశాలే వచ్చేవి. అయితే, ఆ సమయంలోనూ నిలకడలేమి ఆటతో చోటు కోల్పోయేవాడు.సఫారీ గడ్డపై శతకాలు బాదిఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. సంజూకు టీ20 జట్టులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో, సౌతాఫ్రికా గడ్డపై సంజూ బ్యాట్‌తో సత్తా చాటాడు. సఫారీలతో టీ20 సిరీస్‌లో రెండు శతకాలు బాది.. జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు.ఆ నలుగురి కారణంగానేఇలాంటి తరుణంలో సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ ఓ మలయాళ చానెల్‌తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. టీమిండియా దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ వల్లే తన కుమారుడి పదేళ్ల కెరీర్ నాశనమైనందని ఆయన ఆరోపించాడు. విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఆసీస్ లెజెండ్ బ్రాడ్ హాగ్ తాజాగా స్పందించాడు.ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదుఈ మేరకు.. ‘‘సంజూ శాంసన్ తండ్రి బహిరంగంగా ధోని, కోహ్లి, రోహిత్, ద్రవిడ్ పేర్లు చెబుతూ.. తన కొడుకు కెరీర్లో పదేళ్లు వెనకబడటానికి కారణం వాళ్లే అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. భారత క్రికెట్లో ముఖ్యమైన, కీలకమైన నాలుగు పేర్లను ఆయన ప్రస్తావించారు.వాళ్లంతా తమ హయాంలో టీమిండియాను అగ్రస్థానంలో నిలిపిన వ్యక్తులు. నిజానికి సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు. ఇప్పుడిప్పుడే కెరీర్లో నిలదొక్కుకుంటున్నాడు. రెండు సెంచరీలతో సత్తా చాటి.. తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో ఉన్నాడు.సంజూ తండ్రి క్షమాపణ చెప్పాలి.. లేదంటే అతడిపై ఒత్తిడి పెరుగుతుందిఇలాంటి సమయంలో సంజూ కుటుంబం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం.. అతడిపై ఒత్తిడిని పెంచుతుంది. నా అభిప్రాయం ప్రకారం.. సంజూ కెరీర్ సాఫీగా, ప్రశాంతంగా సాగాలంటే.. అతడి తండ్రి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే.. తండ్రి వ్యాఖ్యల వల్ల ఒత్తిడికి లోనైతే.. సంజూ ఆట తీరు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.నోళ్లను అదుపులో పెట్టుకునిఐపీఎల్లో ఇప్పటికే రాజస్తాన్ రాయల్స్ జట్టుకు అతడు కెప్టెన్‌గా ఉన్నాడు. సంజూతో పాటు భారత్‌లో ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు కొదవలేదు. కాబట్టి ఎవరైనా సరే.. నోళ్లను అదుపులో పెట్టుకుని.. బ్యాట్‌తోనే విమర్శకులకు సమాధానం ఇస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు’’ అంటూ బ్రాడ్ హాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్‌రౌండర్ అవసరం: టీమిండియా కోచ్ -
కోహ్లితో బాబర్‌కు పోలికా? అసలేం మాట్లాడుతున్నారు?
పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విఫలమైన బాబర్.. ఇప్పుడు ఇంగ్లండ్‌పై అదే తీరును కనబరుస్తున్నాడు. ముల్తాన్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో కేవలం 35 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.ఈ క్రమంలో పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీ బాబర్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. ఇంగ్లండ్ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు జట్టు నుంచి ఆజంను సెలక్టర్లు తప్పించారు. దీంతో పీసీబీ తీరుపై పలువరు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. అత్యుత్తమ ఆటగాడిని జట్టు నుంచి ఎలా తప్పిస్తారని సెలక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొంతమంది అయితే ఆజంను విరాట్ కోహ్లితో పోలుస్తున్నారు. కోహ్లి ఫామ్ కోల్పోయినప్పుడు బీసీసీఐ అండగా ఉందని, పీసీబీ మాత్రం అలా చేయలేదని పాక్ స్టార్ క్రికెటర్ ఫఖార్ జమాన్ సైతం విమర్శలు గుప్పించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఆజంను విరాట్ కోహ్లితో పోల్చవద్దని హాగ్ అన్నాడు."ఇంగ్లండ్‌తో ఆఖరి రెండు టెస్టులకు పాక్ జట్టులో స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం చోటు కోల్పోయాడు. గత కొన్ని రోజులగా అందరూ ఊహించిందే జరిగింది. అయితే చాలా మంది బాబర్ ఆజం ఫామ్‌ను విరాట్ కోహ్లితో పోలుస్తున్నారు. దయచేసి ఆజంను కోహ్లితో పోల్చవద్దు.కోహ్లి ఫామ్ కోల్పోయినప్పుడు భారత్ ప్రపంచంలోనే రెండవ అత్యుత్తమ జట్టుగా ఉంది. మరి బాబర్ ఫామ్ కోల్పోయినప్పుడు పాకిస్తాన్ ప్రపంచంలోనే రెండువ అత్యంత చెత్త జట్టుగా ఉంది. కొన్ని సార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు" అని హాగ్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా బాబర్ గత 18 టెస్టు ఇన్నింగ్స్‌లో కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోయాడు.చదవండి: ‘అతడినే తప్పిస్తారా?.. ఇంతకంటే పిచ్చి నిర్ణయం మరొకటి ఉండదు’ -
కోహ్లిలో ఊపు తగ్గింది.. సచిన్ రికార్డులు బద్దలు కొట్టలేడు: ఆసీస్ మాజీ
టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిలో మునుపటి ఊపు లేదని హాగ్ ఆరోపించాడు. పరుగులు సాధించడంలో విరాట్ లయ తప్పాడని హాగ్ అన్నాడు. గత కొంతకాలంగా విరాట్ టెస్ట్‌ల్లో అంత గొప్ప ప్రదర్శనలేమీ చేయడం లేదని తెలిపాడు. ఇలాగే ఆడితే విరాట్ సచిన్ రికార్డులు అధిగమించడం కష్టమని అభిప్రాయపడ్డాడు.మాస్టర్ బ్లాస్టర్ తన కెరీర్లో 200 టెస్ట్‌లు ఆడి 15,921 పరుగులు చేయగా.. 35 ఏళ్ల విరాట్ ఇప్పటివరకు 114 టెస్ట్‌లు ఆడి 8871 పరుగులు మాత్రమే సాధించాడని హాగ్ అన్నాడు. విరాట్ సచిన్ రికార్డును అధిగమించాలంటే మరో 7051 పరుగులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఫామ్‌తో కోహ్లి ఇన్ని పరుగులు సాధించడం దాదాపుగా అసాధ్యమే అని హాగ్ అభిప్రాయపడ్డాడు. టెస్ట్‌ల్లో గత కొన్ని సంవత్సరాలుగా కోహ్లి అస్థిరమైన ఫామ్ అతన్ని వెనక్కు నెట్టిందని హాగ్ పేర్కొన్నాడు. విరాట్ సచిన్ రికార్డులకు చేరవగా వెళ్లాలంటే తదుపరి 10 టెస్ట్‌ల్లో తిరిగి తన లయను అందుకోవాల్సి ఉంటుందని అన్నాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ హాగ్ ఈ విషయాలను ప్రస్తావించాడు.కాగా, ఫాబ్ ఫోర్‌గా చెప్పుకునే విరాట్, రూట్, విలియమ్సన్, స్టీవ్ స్మిత్‌లలో జో రూట్ సచిన్ రికార్డు దిశగా దూసుకెళ్తున్నాడు. ఇటీవలికాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న రూట్ ఇప్పటివరకు 146 టెస్ట్‌లు ఆడి 12402 పరుగులు చేశాడు. రూట్ టెస్ట్‌ల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డు బద్దలు కొట్టాలంటే మరో 3500 పైచిలుకు పరుగులు సాధిస్తే చాలు. రూట్ ప్రస్తుత ఫామ్ ప్రకారం ఇది అసాధ్యమేమి కాకపోవచ్చు. చదవండి: బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్.. జోరుగా ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా -
అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే టైటిల్ సౌతాఫ్రికాదే: ఆసీస్ దిగ్గజం
టీ20 ప్రపంచకప్‌లో ముచ్చటగా మూడోసారి సెమీ ఫైనల్ చేరిన దక్షి ణాఫ్రికా.. ఈసారి గతంలో మాదిరి పొరపాట్లకు తావివ్వకూడదని పట్టుదలగా ఉంది. 2009, 2014లలో సెమీస్‌లోనే వెనుదిరిగి అపఖ్యాతిని మూటగట్టుకున్న ప్రొటిస్ జట్టు.. ఎలాగైనా ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది. దర్జాగా సెమీస్లోకాగా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తమ జోరు ప్రదర్శించిన విషయం తెలిసిందే. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మూడు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. సూపర్–8 దశలో ఆడిన మూడూ గెలిచిన సఫారీ 6 పాయింట్ల తో గ్రూప్–2 టాపర్‌గా, 4 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో జట్టుగా సెమీఫైనల్స్‌కు చేరాయి.మరోవైపు రెండుసార్లు టీ20 చాంపియన్, ఆతిథ్య వెస్టిండీస్ కథ ‘సూపర్–8’లోనే ముగిసింది. ముందుగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులే చేసింది. కైల్ మేయర్స్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోస్టన్ చేజ్ (42 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.వర్షంతో 50 నిమిషాలు ఆటకు అంతరాయంరోవ్మన్ పావెల్ (1), రూథర్‌ఫోర్డ్ (0), రసెల్ (15) చేతులెత్తేయడంతో కరీబియన్ జట్టు ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తబ్రేజ్ షమ్సీ 3 వికెట్లు తీశాడు. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసిన దశలో వర్షంతో 50 నిమిషాలు ఆటకు అంతరాయం కలిగింది.దాంతో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 17 ఓవర్లలో 123 పరుగులుగా నిర్ణయించారు. ఆ జట్టు 16.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి నెగ్గింది. స్టబ్స్ (27 బంతుల్లో 29; 4 ఫోర్లు), క్లాసెన్ (10 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), జాన్సెన్ (14 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) లక్ష్యంవైపు తీసుకెళ్లారు. ఛేజ్ 3, రసెల్, జోసెఫ్ చెరో 2 వికెట్లు తీశారు.రషీద్ ఖాన్ బృందంతో అమీతుమీఇక ఈ విజయంతో టోర్నీలో ముందుకు సాగే అవకాశం దక్కించుకున్న సౌతాఫ్రికా.. గురువారం నాటి తొలి సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. ఊహించని రీతిలో బంగ్లాదేశ్‌ను ఓడించి తొలిసారి వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరిన రషీద్ ఖాన్ బృందంతో అమీతుమీ తేల్చుకోనుంది. ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా స్టేడియం ఇందుకు వేదిక.అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే ఈసారి టైటిల్ వాళ్లదేఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టోర్నీ ఆరంభం నుంచి సౌతాఫ్రికా అద్బుతంగా ఆడిందన్న ఈ కంగారూ క్రికెటర్.. రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్‌తో పాటు స్పిన్ దళం మ్యాజిక్ చేసిందని కొనియాడాడు.ముఖ్యంగా హెండ్రిక్స్ సూపర్‌గా ఆడుతున్నాడని.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు అదరగొట్టి ఫైనల్‌కు చేర్చుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీ నైపుణ్యాలు అమోఘమన్న బ్రాడ్ హాగ్.. ప్రొటిస్ జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉందన్నాడు.సౌతాఫ్రికా సెమీస్‌లో గనుక అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే ఈసారి టైటిల్ వాళ్లదేనంటూ బ్రాడ్ హాగ్ జోస్యం చెప్పాడు. కాగా తొలి సెమీస్‌లో సౌతాఫ్రికా- బంగ్లాదేశ్ తలపడనుండగా.. రెండో సెమీస్ ఫైనల్లో టీమిండియా- ఇంగ్లండ్ తాడోపేడో తేల్చుకోనున్నాయి.చదవండి: ట్రోఫీ గెలిచే అర్హత అతడికే ఉంది: షోయబ్ అక్తర్ -
IPL 2024: మెరుపులా వచ్చి మాయం!.. ఇకనైనా మారు!
టీమిండియాలోకి మెరుపులా వచ్చి మాయమైన క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ముంబై బ్యాటర్ పృథ్వీ షా కూడా ఆ కోవకు చెందినవాడేనని చెప్పవచ్చంటారు విశ్లేషకులు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించి దిగ్గజాలను మెప్పించిన పృథ్వీ.. ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్‌గా పేరొందాడు. ఈ క్రమంలో 2018లో వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ(134)తో అలరించాడు. ఆ తర్వాత రెండేళ్లకు పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అరంగేట్రం చేశాడు. కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేక శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌తో పోటీలో వెనుకబడి టీమిండియాకు దూరమయ్యాడు. ఆఖరిగా శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ఆడిన పృథ్వీ షా.. ఐపీఎల్-2023 సీజన్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం 106 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ 2023-24 టోర్నీలో మాత్రం ఫర్వాలేదనిపించాడు. మోకాలి గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన అతడు.. ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లో 159 పరుగులతో అదరగొట్టాడు. ఆ తర్వాత మళ్లీ మూడంకెల స్కోరును అందుకోలేకపోయినా.. ట్రోఫీ గెలిచిన జట్టులో మాత్రం సభ్యుడిగా ఉన్నాడు పృథ్వీ షా. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024కు రెట్టించిన ఉత్సాహంతో సిద్దమయ్యాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ పృథ్వీ షాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘పృథ్వీ షా ఫామ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదు. అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. తన ఆట తీరులో కచ్చితంగా మార్పులు చేసుకోవాలి. బ్యాట్ ఝులిపించగలిగితేనే మునుపటిలా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలుగుతాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో పరుగులు రాబట్టడం పృథ్వీ షాతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా ఎంతో కీలకం. వార్నర్‌తో కలిసి ఓపెనర్‌గా పృథ్వీ రాణిస్తేనే మిడిలార్డర్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతుంది’’ అని ఆస్ట్రేలియా తరఫున రెండుసార్లు వరల్డ్‌కప్ గెలిచిన బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024తో రిషభ్ పంత్ ఢిల్లీ కెప్టెన్‌గా పునరాగమనం చేయనున్నాడు. తాజా ఎడిషన్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
అతడికి తగిన శాస్తే జరిగింది.. కానీ ఇకపై అలా చేయొద్దు! బదులుగా..
Angelo Mathews Timed Out Row: ‘టైమ్డ్ అవుట్’ విషయంలో శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఘాటు విమర్శలు చేశాడు. చేసిన తప్పునకు అతడికి తగిన శాస్తే జరిగిందంటూ కుండబద్దలు కొట్టాడు. అయితే, ఇలాంటి నిబంధన మాత్రం తనకు నచ్చలేదని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ అవుట్ అయిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం.. క్రీజులోకి వచ్చిన తర్వాత నిర్ణీత సమయం(2 నిమిషాల్లో)లో తొలి బంతిని ఎదుర్కోని కారణంగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో తొలి ఆటగాడిగా హెల్మెట్ విషయంలో జరిగిన పొరపాటును సరిచేసుకునే క్రమంలో మాథ్యూస్ మైదానాన్ని వీడక తప్పలేదు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అప్పీలుతో ఏకీభవించిన అంపైర్లు అతడిని టైమ్డ్ అవుట్‌గా ప్రకటించారు. దీంతో ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇలా వెనుదిరిగిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ విషయంపై క్రికెట్ వర్గాలు రెండు చీలిపోయి చర్చలు సాగిస్తున్నాయి. మాథ్యూస్ పట్ల షకీబ్ క్రీడాస్ఫూర్తి కనబరిచాల్సిందని కొంతమంది అంటుండగా.. నిబంధనల ప్రకారం షకీబ్ చేసింది సరైందే అంటూ మరికొంత మంది మాథ్యూస్‌ను తప్పుబడుతున్నారు. అందుకు సంసిద్ధంగా లేరనే అర్థం ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ సైతం ఈ విషయంలో షకీబ్ వైపే నిలిచాడు. ‘‘బ్యాటర్లుకు సమయం చాలా ముఖ్యమైంది. ఒకవేళ టైమ్‌కి రాకపోతే ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. ఏంజెలో మాథ్యూస్ దేనికైతే అర్హుడో అదే జరిగింది. మీకు రెండు నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి వికెట్ పడిన వెంటనే క్రీజులోకి వెళ్లి రెండు నిమిషాల్లోపే బంతిని ఎదుర్కోవాలి. ఒకవేళ మీరలా చేయలేదంటే బ్యాటింగ్‌కు చేసేందుకు మీరు సంసిద్ధులు కాలేదనే అర్థం కదా!’’ అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. 12 పరుగులు పెనాల్టీ విధించాలి మాథ్యూస్ విషయంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌తో పాటు అంపైర్లు నిబంధనల ప్రకారమే వ్యవహరించాని బ్రాడ్ హాగ్ పరోక్షంగా వారిని సమర్థించాడు. అయితే, ఇలా బ్యాటర్‌ను టైమ్డ్ అవుట్ చేయడం తనకు నచ్చలేదన్న ఈ మాజీ బౌలర్ ఓ పరిష్కారాన్ని సూచించాడు. ‘‘నాకు ఇలాంటి డిస్మిసల్ నచ్చలేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. అయితే, మళ్లీ ఇలాంటివి జరగాలని నేను కోరుకోవడం లేదు. ఇలాంటి సందర్భాల్లో బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటించే బదులు.. బ్యాటింగ్ జట్టుకు 12 పరుగుల మేర కోత విధిస్తే బాగుంటుంది. అపుడైనా ఇలా ఆలస్యం చేసేవాళ్లు కాస్త తొందరగా రెడీ అవుతారు. వికెట్ పడగానే క్రీజులోకి పరిగెత్తుకుని వచ్చి బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు’’ అని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. చదవండి: ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్బో బేబీ! View this post on Instagram A post shared by Brad Hogg (@brad_hogg) -
'అతడొక అద్భుతం.. వారిద్దరూ చెలరేగితే విండీస్‌కు చుక్కలే'
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్న తిలక్ వర్మపై ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తిలక్ వర్మ తన బ్యాటింగ్ స్కిల్స్‌తో తనను ఎంతగానే అకట్టుకున్నాడని హాగ్ కొనియాడాడు. కాగా దేశీవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో దుమ్మురేపిన ఈ హైదరాబాదీకి విండీస్ టూర్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. గత రెండు సీజన్లగా ముంబై ఇండియన్స్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్ వర్మ.. తన అద్బుత ప్రదర్శరనతో అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. ఐపీఎల్ 2023లో 11 మ్యాచ్‌లు ఆడిన వర్మ 42.88 సగటుతో 343 పరుగులు చేశాడు. ఇక వర్మతో పాటు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం యశస్వీ జైశ్వాల్‌కు కూడా భారత టీ20 జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. తిలక్ వర్మ ఒక అద్బుతం. అతడు తన ప్రదర్శనతో ఎంతగానే అకట్టుకున్నాడు. ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టుతో కాస్త సమయం గడిపాను. అతడు ప్రత్యర్ది బౌలర్లను అర్ధం చేసుకునే విధానం నాకు చాలా నచ్చింది. వర్మకు ఏ స్ధానంలైనా బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. ఎటువంటి క్లిష్ట పరిస్ధితులనైనా తనకు అనుగుణంగా మార్చుకుంటాడు. అదే విధంగా యువ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, జైస్వాల్ ఇద్దరూ అధిక స్ట్రైక్ రేట్లు కలిగి ఉన్నారు. వారు ఫాస్ట్ బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొంటారు. కాబట్టి పవర్ ప్లేలో వీరిద్దరూ హిట్టింగ్ చేస్తే ప్రత్యర్ధి బౌలర్లకు కష్టాలు తప్పవు అని అతడు చెప్పుకొచ్చాడు. చదవండి: ODI WC 2023: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ కాదు.. ఆ జట్టుతో చాలా డేంజర్! లేదంటే? -
అతడిని ఎందుకు సెలక్ట్ చేయలేదో నాకు తెలుసు: ఆసీస్ మాజీ బౌలర్
Sarfaraz Khan- Brad Hogg: వెస్టిండీస్‌తో టీమిండియా టెస్టు సిరీస్ నేపథ్యంలో ఎంపిక చేసిన భారత జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ వంటి ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోవపోవడంపై వసీం జాఫర్ వంటి మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. ఇక తాజాగా.. ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బ్రాడ్ హాగ్ ఈ విషయంపై స్పందించాడు. టీమిండియా సెలక్టర్లు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో తనకు తెలుసనంటూ ఈ మాజీ స్పిన్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. రంజీల్లో సంచలనమే.. కానీ ‘‘రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్ ఆడిన మాట వాస్తవమే. కానీ వెస్టిండీస్‌తో టెస్టు ఆడే జట్టులో అతడికి చోటెందుకు దక్కలేదో నాకు తెలుసు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి.. ఒకటి.. దేశవాళీ క్రికెట్లో అతడు తన జట్టు మిడిలార్డర్లో ఆడతాడు. ఐదు లేదంటే ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఇక రెండోది.. ఐపీఎల్లో పేసర్లను అతడు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాడు. క్వాలిటీ బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయాడు. పుజారా పని అయిపోయినట్లే! బహుశా అందుకే భారత సెలక్టర్లు సర్ఫరాజ్ ఖాన్ విషయంలో వెనుకడుగు వేసి ఉంటారు. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో మెరుగుపడితే అతడిని టెస్టు జట్టుకు ఎంపిక చేస్తారేమో!’’ అని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. ఇక నయా వాల్ ఛతేశ్వర్ పుజరాను జట్టు నుంచి తప్పించడంపై స్పందిస్తూ.. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారని పేర్కొన్నాడు. దశాబ్ద కాలంగ వన్‌డౌన్‌లో ఆడుతున్న పుజారా గత రెండేళ్లుగా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడని బ్రాడ్ హాగ్ పెదవి విరిచాడు. పుజారా స్థానంలో దూకుడైన ఆటగాడిని వారసుడిగా నిలిపేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుందన్నాడు. వెస్టిండీస్‌తో టెస్టులకు భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ. చదవండి: కెప్టెన్ ఊచకోత.. జింబాబ్వే సంచలన విజయం.. మేటి జట్లను వెనక్కి నెట్టి టీమిండియా తర్వాత.. -
WTC Final: ఏం ప్రాక్టీస్ చేశారని గెలవడానికి .. గెలుపు ఆస్ట్రేలియాదే..!
Brad Hogg: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా ఇవాళ (జూన్ 7) ప్రారంభమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌పై ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో గెలుపు ఆస్ట్రేలియాదేనని గొప్పలు పోయాడు. సుదీర్ఘ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు చాలాకాలంగా కఠోరంగా శ్రమిస్తున్నారని, అందుకే వారు డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవగలరని ధీమా వ్యక్తం చేశాడు. ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ కోసం ఇరు జట్లు కఠోరంగా శ్రమించాయని చెబుతూనే.. టెస్ట్ ఫార్మాట్‌కు సరిపడా ప్రాక్టీస్ టీమిండియా ఆటగాళ్లు చేయలేదని అన్నాడు. భారత ఆటగాళ్లు దాదాపు రెండు నెలల పాటు పొట్టి ఫార్మాట్ (ఐపీఎల్ 2023) ఆడి నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ బరిలో దిగారని, వారు చేసిన స్వల్పపాటి సాధనతో టెస్ట్ క్రికెట్‌కు అలవాటు పడలేరని తెలిపాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆసీస్ ఆటగాళ్లు అసాధారణ రీతిలో సాధన చేశారని, ఇదే భారత్‌పై ఆసీస్‌కు అడ్వాంటేజ్ అవుతుందని అభిప్రాయపడ్డాడు. ఏ జట్టైనా గెలవాలంటే, సాధన చాలా కీలకమని, ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్‌కు ఛేంజ్ అయ్యే సమయంలో దీని డోస్ మరింత పెరగాలని, అధిక సమయం ఫార్మాట్‌కు తగ్గ ప్రాక్టీస్ చేసిన జట్టుదే అంతిమంగా విజయమని అన్నాడు. ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ 2021-23లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. లంచ్ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా డకౌట్ కాగా.. డేవిడ్ వార్నర్ 43 పరుగులు చేసి ఔటయ్యాడు. లబూషేన్ (26), స్టీవ్ స్మిత్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఖ్వాజా వికెట్ సిరాజ్ పడగొట్టగా.. వార్నర్ వికెట్ ఠాకూర్‌కు దక్కింది. చదవండి: WTC Final: అశ్విన్ లేకపోవడం టీమిండియాకు ప్లసా.. మైనసా..? -
‘కమిన్స్‌ను తప్పించి.. అతడిని కెప్టెన్ చేయండి! బ్యాటర్ సారథి అయితే’
India vs Australia, 4th Test: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను తిరిగి నియమిస్తే బాగుంటుందని ఆ దేశ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. ప్యాట్ కమిన్స్ స్థానంలో స్మిత్ పూర్తి స్థాయి సారథిగా బాధ్యతలు చేపడితే మంచి ఫలితాలు ఉంటాయన్నాడు. కెప్టెన్లుగా ఉన్న సమయంలో బ్యాటర్లతో పోలిస్తే బౌలర్లు ఎక్కువ ఒత్తిడికి గురవుతారన్న హాగ్.. ఆసీస్ కెప్టెన్సీ మార్పు ఆవశ్యకమని పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ టాంపరింగ్ వివాదం నేపథ్యంలో స్టీవ్ స్మిత్‌పై నిషేధం పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించిన బోర్డు.. సుదీర్ఘకాలం తర్వాత ఆడటానికి అనుమతినిచ్చింది. అదే విధంగా ప్యాట్ కమిన్స్ డిప్యూటీగా వైస్ కెప్టెన్సీ అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా మూడో టెస్టులో కమిన్స్ గైర్హాజరీలో స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. గెలుపు కోసం తపించిన ఆసీస్‌కు తన అద్భుత వ్యూహాలతో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఆసీస్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో బ్రాడ్ హాగ్ మాట్లాడుతూ.. ‘‘స్టీవ్ స్మిత్‌ను పూర్తిస్థాయి కెప్టెన్‌ను చేయాలి. ఫాస్ట్‌బౌలర్లకు తరచూ విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా మూడు ఫార్మాట్లలో కీలక సభ్యులై ఉంటే రెస్ట్ తప్పనిసరి. ప్యాట్ కమిన్స్‌కు పనిభారం ఎక్కువవుతోంది. నా అభిప్రాయం ప్రకారం బ్యాటర్లు కెప్టెన్లుగా ఉంటే బాగుంటుంది. బౌలర్లపై ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కమిన్స్ ఇప్పటి వరకు కెప్టెన్‌గా మంచి విజయాలు నమోదు చేశాడు. కానీ.. రాను రాను వర్క్‌లోడ్ ఎక్కువైతే తట్టుకోవడం కష్టమే! కాబట్టి స్మిత్‌ను కెప్టెన్ చేస్తే బాగుంటుంది’’ అని తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. టీమిండియాతో మూడో టెస్టులో స్మిత్ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచేలా అమలు చేసిన వ్యూహాలు అద్భుతమని కొనియాడాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి నిర్ణయాత్మక ఆఖరి టెస్టు ఆరంభం కానుంది. చదవండి: ఆసీస్‌తో నాలుగో టెస్ట్.. కేఎస్ భరత్‌ను పక్కకు పెట్టొద్దు, కోహ్లి, పుజారా ఏం చేశారని..? తండ్రైన టీమిండియా స్టార్ క్రికెటర్.. మహిళా దినోత్సవం రోజే గుడ్ న్యూస్ -
T20 WC 2022: అక్తర్, బ్రాడ్ హాగ్‌లు దొరికేశారు కదా..!
తెగ గొంతులు చించేసుకున్నారు. అది అనైతికం అంటూ ప్రకటనలు ఇచ్చేశారు.. అది విజయమే కాదనేశారు.. ఆ గెలుపును తక్కువ చేసే యత్నం చేశారు. వాళ్లే క్రికెట్ నిష్ణాతుల్లా బిల్డప్‌లు ఇచ్చేశారు. ఇదంతా ఓ ఇద్దరి మాజీ క్రికెటర్ల గురించి చెబుతున్న మాట. క్రికెట్లో ఒక వెలుగు వెలిగి ఇప్పుడు క్రికెట్ రూల్స్‌నే పక్క దారి పట్టించి అందర్నీ కన్ఫ్యూజ్ చేసిన బ్రాడ్ హాగ్, షోయబ్ అక్తర్‌లు గురించే ఇదంతా. ఇందులో ఒకరు ఆస్ట్రేలియా మాజీ అయితే, మరొకరు పాకిస్తాన్ మాజీ క్రికెటర్. ఏదిబడితే అది మాట్లాడితే ఇలానే ఉంటుంది.. ఎవరికైనా మనదాకా వస్తేగానీ అసలు విషయం బోధపడదని సామెత ఉంది. ఇది సరిపోతుంది ఈ ఇద్దరి మాజీ క్రికెటర్లకు. ఇది ఏ కాలం.. మనం ఎక్కడున్నాం..అనేది ముందు తెలుసుకోవాలి. సోషల్ మీడియా అంతగా లేని రోజుల్లో రుజువులు లేకపోతే అది గాల్లోకి కలిసిపోయేది. కానీ ఇప్పుడు అది కుదరదు. మనం మాట్లాడేముందు జాగ్రత్తగా ఉండాలంటారు. మనం సెలబ్రెటీ హోదాలో ఉండి ఏదో మాట్లాడేస్తే గతం బయటకొస్తుంది. ఇప్పుడు అలానే బయటకు తీశారు భారత్ క్రికెట్ అభిమానులు. ఇంకే ముందు బ్రాడ్ హాగ్, అక్తర్లను ఆడేసుకుంటున్నారు. ఎప్పుడో 2005లో జరిగిన ‘నో బాల్ బైస్ ఉదంతాన్ని’ మరొకసారి తెరపైకి తీసుకొచ్చి బ్రాడ్ హాగ్, అక్తర్‌లకు ప్రశ్నలు సంధిస్తున్నారు. గత ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో టీమిండియా తుది వరకూ పోరాడి పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్ఢుతమైన విజయానికి విరాట్ కోహ్లినే కారణం. కడవరకూ క్రీజ్‌లో టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. ఇక్కడ ఫ్రీ హిట్లో బంతి బెయిల్స్‌కు తాకినా కోహ్లి-దినేశ్ కార్తీక్‌లు మూడు పరుగులు చేయడాన్ని అక్తర్, హాగ్‌లు తప్పుబట్టారు. ఇది డెడ్ బాల్ కదా అంటూ గళం విప్పారు. ఇది అంపైర్లు ఒత్తిడిలో ఉండే అలా చేశారంటూ బిల్డప్ ఇచ్చే పని చేశారు. 17 ఏళ్ల క్రితం మ్యాచ్‌లోనే బెయిల్స్ పడినా.. కానీ ఎప్పుడో 17 ఏళ్ల క్రితం జరిగిన ఓ మ్యాచ్‌లో ఫ్రీ హిట్లో బెయిల్స్ పడినా బైస్ రూపంలో వచ్చిన పరుగులకు సమస్య రాలేదు. 2005, జనవరి 13 వ తేదీన ఆస్ట్రేలియా-ఎ, పాకిస్తాన్ జట్ల మధ్య అడిలైడ్‌లో మ్యాచ్ జరిగింది. అది ట్వంటీ 20 మ్యాచ్. ఆ మ్యాచ్‌లో ముందుగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసే సమయంలో జేమ్స్ హోప్స్-బ్రాడ్ హాడిన్‌లు ఓపెనర్లగా దిగారు. ఈ క్రమంలోనే అక్తర్ వేసిన ఓవర్లో ఒక బంతి నో బాల్ అయ్యింది. ఫలితంగా ఫ్రీ హిట్ వచ్చింది. ఆ బంతిని వికెట్ల వెనుకు వెళ్లి ఆడిన హాడిన్ మిడ్ వికెట్‌గా మీదుగా షాట్ ఆడాడు. దానికి రెండు పరుగులు వచ్చాయి. ఫ్రీహిట్‌గా వేసిన బంతి కూడా నో బాల్ కావడంతో బంతి కౌంట్ కాలేదు. మళ్లీ ఫ్రీ హిట్ వచ్చింది. ఆ బంతిని కూడా సేమ్ ఆలానే ఆడబోయాడు హాడిన్. కానీ అది బెయిల్స్‌ను గిరాటేసింది. అది ఫ్రీ హిట్ కావడంతో బతికిపోయిన హాడిన్ రెండు పరుగులు తీశాడు. మరి అప్పుడు అక్తర్ ఎటువంటి చప్పుడు చేయలేదు. నెక్స్ట్ బాల్ వేయడానికి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అది మ్యాచ్ ఆరంభం కాబట్టే అక్తర్ దాన్ని పట్టించుకోలేదా..మరొకవైపు అస్ట్రిలియా కాబట్టి ఆస్ట్రేలియన్లు ఎవరు నోరు విప్పే సాహసం చేయలేదా..అప్పుడు రూల్స్ లేవా బ్రాడ్ హాగ్, అక్తర్.. ఇదిగో ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది..మరి ఓ లుక్కేయండి Did you play that match @Brad_Hogg sir? pic.twitter.com/pC1eVoNjhM — Koushik Karfa (@koushikkarfa12) October 23, 2022 -
Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం
చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేకెత్తిచ్చిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ చివరి ఓవర్లో పాక్ బౌలర్ మహ్మద్ నవాజ్ వేసిన బంతిని అంపైర్లు 'నో బాల్'గా ప్రకటించడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆఖరి ఓవర్ నాలుగో బంతిని నవాజ్ ఫుల్ టాస్ వేయగా కోహ్లి దాన్ని సిక్సర్‌గా మలిచాడు. నడుము ఎత్తులో వచ్చిన ఈ బంతిని అంపైర్లు నో బాల్‌గా ప్రకటించారు. వెంటనే పాకిస్థాన్ టీం సభ్యులంతా అంపైర్లతో వాదించారు. అయినా వాళ్లు నిర్ణయాన్ని మార్చుకోలేదు. నో బాల్ తర్వాత ఫ్రీ హిట్‌గా వచ్చిన బంతికి కోహ్లి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వికెట్లను గిరాటేసిన బంతి బౌండరీ వైపు దూసుకెళ్లడంతో కోహ్లి- దినేశ్ కార్తీక్ మూడు పరుగులు తీశారు. ఫ్రీ హిట్ అయినందున బ్యాటర్ బౌల్డ్ అయినా ఔట్ ఉండదనే నిబంధనను కోహ్లి చక్కగా వినియోగించున్నాడు. ఈ బంతితోనే మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది. చివరి రెండు బంతులకు రెండు పరుగులే అవసరమయ్యాయి. అయితే ఈ నోబాల్ వ్యవహారంపై ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ట్విట్టర్లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. నడుము ఎత్తులో వచ్చిన బంతిని అంపైర్లు రివ్యూ తీసుకోకుండానే నో బాల్‌గా ఎలా ప్రకటించారని అడిగాడు. ఫ్రీ హిట్ బాల్‌కు కోహ్లి బౌల్డ్ అయినప్పుడు.. దాన్ని డెడ్ బాల్‌గా ఎందుకు ప్రకటించలేదు? అని ప్రశ్నించాడు. Why was no ball not reviewed, then how can it not be a dead ball when Kohli was bowled on a free hit. #INDvPAK #T20worldcup22 pic.twitter.com/ZCti75oEbd — Brad Hogg (@Brad_Hogg) October 23, 2022 ఈ నో బాల్ వ్యవహారంపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి. బంతి బ్యాటర్ నడుము ఎత్తుకు పైకి వస్తేనే నో బాల్ అని కొందరు అంటున్నారు. అంతిమ నిర్ణయం అంపైర్లదే అని, దానికి ఇరు జట్లు కట్టుబడి ఉండాలని మరికొందరు అంటున్నారు. మరికొందరేమో కోహ్లి దాదాపు క్రీజు బయట ఉన్నాడు.. అలాంటప్పుడు బంతి నడుము ఎత్తుపైకి వచ్చినా నో బాల్ కాదు అని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈ మ్యాచ్‌లో భారత్ చివరి బంతి వరకు అద్భుత పోరాటపటిమ ప్రదర్శించి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా కింగ్ కోహ్లి తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నాడు. ఈ మ్యాచ్ తనకు చిరకాలం గుర్తుండిపోతుందని చెప్పాడు. చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లి -
'బుమ్రా అద్భుతంగా రాణించాలంటే అతడికి విశ్రాంతి అవసరం'
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో ఆరు వికెట్లతో చెలరేగిన బుమ్రా.. రెండో వన్డేలో రెండు వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. కాగా ఈ సిరీస్‌లో భాగంగా మూడో వన్డే ఆదివారం జరగనుంది. ఇక ఈ సిరీస్ అనంతరం భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు కోహ్లితో పాటు బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అయితే రాబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు మరింత విశ్రాంతి ఇవ్వాలని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. "బుమ్రా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాగా ఏ జట్టుకైనా ప్రధాన బలం ఫాస్ట్ బౌలర్లే. కాబట్టి వారి పట్ల తగినంత జాగ్రత్త వహించాల్సిన బాధ్యత ఆయా జట్టుల మేనేజేమెంట్‌పై ఉంటుంది. బ్యాటర్లు, స్సిన్నర్లు కంటే పేసర్లపై పని భారం ఎక్కువగా ఉంటుంది. టెస్టు క్రికెట్, టీ20 ప్రపంచకప్ వంటి టోర్నమెంట్లలో బుమ్రా అత్యుత్తమంగా రాణించాలంటే అతడికి విశ్రాంతి అవసరం. అదే విధంగా జట్టు వైద్య సిబ్బంది కూడా అతడి ఫిటినెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి" అని బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. చదవండి: IND Vs WI T20 Series: విండీస్‌తో టి20 సిరీస్.. కోహ్లి, బుమ్రా ఔట్ -
'ఇప్పుడు కాదు రోహిత్.. ఆస్ట్రేలియాపై గెలిచి చూపించు'
టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడి సారథ్యంలో భారత్ ఇటీవల వెస్టిండీస్, శ్రీలంకతో టీ20,వన్డే సిరీస్‌లను సొంతగడ్డపై క్లీన్ స్వీప్ చేసింది. ఆ క్రమంలో రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రోహిత్ తన కెప్టెన్సీ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడని బ్రాడ్ హాగ్ కొనియాడాడు. అయితే ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లతో ఆడినప్పుడు రోహిత్ కెప్టెన్సీ స్కిల్స్ బయటపడతాయి అని అతడు తెలిపాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ రోహిత్‌కు అతి పెద్ద సవాల్ అని పేర్కొన్నాడు. "త్వరలో ఆస్ట్రేలియాతో భారత్ నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. అది రోహిత్ శర్మకు కఠిన సవాల్‌కు మారనుంది. నేను అతనిని ఒత్తిడిలో చూడాలనుకుంటున్నాను. ఆ సమయంలో ఇప్పటి లాగే ప్రశాంతమైన బాడీ లాంగ్వేజ్‌ని కలిగి ఉంటాడా లేదా మనం కోపాన్ని చూస్తామా. భారత్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్, ఇంగ్లాండ్ పర్యటన, ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనోంది. కాబట్టి రాబోయే అన్నీ టోర్నీలు రోహిత్ కఠినమైనవి" అని హాగ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: కేఎల్ రాహుల్ జట్టులోకి జింబాబ్వే స్టార్ బౌలర్! -
వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్‌కి మరీ ఇంత తక్కువా!
ఐపీఎల్-2022 మెగా వేలంకు సమయం దగ్గరపడుతుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్ మెగా వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. ఇప్పటికే పాత జట్లు రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేయగా.. కొత్తగా వచ్చిన రెండు జట్లు కూడా ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. ఇక ఈ మెగా వేలంలో 590 మంది క్రికెటర్లు పాల్గొనబోతున్నారు. వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఇక రానున్న మెగా వేలంలో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్‌కి అత్యధిక ధర దక్కనుందని మాజీ ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అభిప్రాడ్డాడు. ఆర్సీబీ, కేకేఆర్,పంజాబ్ కింగ్స్, సీఎస్కే అతడి కోసం పోటీ పడతాయి అని హాగ్ అంచనా వేశాడు. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ డు ప్లెసిస్‌ను రీటైన్ చేసుకోలేదు. కాగా ఐపీఎల్- 2021లో చెన్నై టైటిల్ గెలవడంలో డు ప్లెసిస్ కీలక పాత్ర పోషించాడు. "డు ప్లెసిస్ తన నాయకత్వ లక్షణాల కారణంగా వేలంలో అతడికి భారీ ధర దక్కనుంది. అతడిని దక్కించుకోవడానికి ఆర్సీబీ, కేకేఆర్, పంజాబ్ కింగ్స్, సీఎస్కే జట్లు పోటీ పడతాయి. అతడు ఓపెనర్‌గా అద్భుతంగా రాణించగలడు. కాగా అతడికి గతేడాది 7 కోట్లకు చెన్నై అంటి పెట్టుకుంది. కానీ ఈ సారి అతడికి ఏకంగా రూ. 11 కోట్లు దక్కే అవకాశం ఉంది. అదే విధంగా శ్రేయస్ అయ్యర్, కగిసో రబడ, మహ్మద్ షమీ వంటి స్టార్ ఆటగాళ్ల కోసం ఆర్సీబీ, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ పోటీ పడతాయి. అయ్యర్‌కి ఐపీఎల్లో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి అతడిని ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ దక్కించుకోనే అవకాశాలు ఉన్నాయి. అతడిని రూ. 4 కోట్లకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక షమీ, రబడాకి కూడా 4 నుంచి 5 కోట్ల మధ్య దక్కే అవకాశం ఉంది" అని హాగ్ యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: సెమీఫైనల్లో సెంచరీతో చెలరేగాడు.. భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు.. దటీజ్ యష్ ధుల్! -
నెం1 బౌలర్‌గా టీమిండియా స్టార్ స్పిన్నర్.. బుమ్రాకి నో ఛాన్స్!
2021 ఏడాదిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టాప్-3 బౌలర్లను ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ప్రకటించాడు. నెం1 బౌలర్‌గా టీమిండియా స్టార్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్‌ను అతడు ఎంచుకున్నాడు. గత ఏడాదిలో 54 వికెట్లు పడగొట్టిన అశ్విన్ .. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఇక టీ20 ప్రపంచ కప్-2021తో పరిమిత ఓవర్ల క్రికెట్లోకి పునరాగమనం చేసిన అశ్విన్ అదరగొట్టాడు. ఇక రెండు, మూడు స్ధానాల్లో షాహీన్ షా ఆఫ్రిది, హసన్ అలీని హాగ్ ఎంచుకున్నాడు. 2021 ఏడాదిలో షాహీన్ షా ఆఫ్రిది, హసన్ అలీ వరుసగా 47, 41 వికెట్లు పడగొట్టారు. అదే విధంగా 2021 ఏడాదికు గాను నెం1 బ్యాటర్‌గా ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్‌ని ఎంచుకున్నాడు. కాగా ఒకే క్యాలండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ నిలిచాడు. గత ఏడాదిలో రూట్ 1708 పరుగులు సాధించాడు. కాగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాని హాగ్ ఎంపిక చేయకపోవడం గమనర్హం. చదవండి: Devon Conway: టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన కాన్వే.. తొలి ఆటగాడిగా! -
Ind vs Nz: అతడు రంగన హెరాత్‌ను గుర్తు చేశాడు: బ్రాడ్ హాగ్
Ind vs Nz Test: Brad Hogg praises Axar Patel Reminds Him Rangana Herath: ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ టీమిండియా బౌలర్ అక్షర్ పటేల్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. తన ఆట తీరుతో శ్రీలంక క్రికెటర్ రంగన హెరాత్‌ను గుర్తు చేశాడన్నాడు. అద్భుతమైన బౌలింగ్ అటాక్‌తో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టడం చూస్తుంటే ముచ్చటేస్తుందని పేర్కొన్నాడు. కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో తొలి టెస్టులో భాగంగా అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి.. కెరీర్లో ఐదో సారి ఈ ఘనత సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ పడగొట్టి మ్యాచ్‌లో మొత్తంగా ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ... ‘‘అక్షర్ పటేల్ నాకు రంగన హెరాత్‌ను గుర్తుచేశాడు. హైట్ తనకు అదనపు బలం. రైట్ హ్యాండర్‌కు బౌల్ చేసేటపుడు రౌండ్ ది వికెట్ వేస్తాడు. బ్యాటర్లను అస్సలు రిలాక్స్ అవ్వనివ్వడు. తన బౌలింగ్‌లో బ్యాటర్ స్వీప్ షాట్ ఆడటం చాలా అరుదు. తన బౌలింగ్ శైలి సూపర్’’ అని ప్రశంసలు కురిపించాడు. ఇక కాన్పూర్ టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తున్న వేళ.. అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర అడ్డుగోడగా నిలబడి న్యూజిలాండ్‌ను ఓటమి నుంచి తప్పించారు. ఒక్క వికెట్ సాధిస్తే చాలు విజయం మనదే అనుకున్న తరుణంలో వెలుతురు లేమి కారణంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: IPL 2022 Auction: ఏయే జట్లు ఎవరిని రిటైన్ చేసుకుంటున్నాయి? ఎంత మొత్తం ఖర్చు చేయాలి? పూర్తి వివరాలు! -
Brad Hogg: పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా చేసిన పెద్ద తప్పు అదే..
Brad Hogg Comments On Team India Defeat Against Pakistan: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ స్పందించాడు. హార్దిక్ పాండ్యాను బ్యాటర్‌గా తుది జట్టులోకి తీసుకుని కెప్టెన్ విరాట్ కోహ్లి పెద్ద తప్పుచేశాడని అభిప్రాయపడ్డాడు. కాగా ప్రపంచకప్‌లో చరిత్రను తిరగరాస్తూ పాకిస్తాన్ టీమిండియాపై అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదిలోనే కీలక వికెట్లు తీసి షాహిన్ ఆఫ్రిది కోలుకోలేని దెబ్బ కొట్టినా... కోహ్లి కెప్టెన్ ఇన్నింగ్స్(49 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు(151) చేయగలిగింది. కానీ... లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఘోరంగా విఫలమైంది. పాకిస్తాన్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం చెలరేగి ఆడటంతో పది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టీమిండియా బౌలర్లు ఒక్కరు కూడా ప్రభావం చూపలేకపోయారు. ఈ నేపథ్యంలో బ్రాడ్ హాగ్ మాట్లాడుతూ... ‘‘హార్దిక్ పాండ్యాను ఆడించి పెద్ద తప్పు చేశారు. షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను.. పాండ్యా స్థానంలో అశ్విన్‌ను జట్టులోకి తీసుకుని ఉంటే బాగుండేది. అలా అయితే.. జడేజా ఆరో స్థానంలో.. ఠాకూర్ ఏడో స్థానంలో... అశ్విన్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉండేది. ఒకవేళ పాండ్యా తుది జట్టులో ఉండాలనుకుంటే.. కచ్చితంగా బౌలింగ్‌లోనూ రాణించాలి. అతడికి చాలా టాలెంట్ ఉంది. కానీ.. ఫ్రంట్‌లైన్ బ్యాటర్‌గా తనను జట్టులోకి తీసుకోవడం సరికాదు’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక రిషభ్ పంత్ అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగిందన్న బ్రాడ్ హాగ్.. ‘‘నిజానికి మిడిల్ ఓవర్లలో పంత్‌కు.. పాక్ స్పిన్నర్లకు అసలైన పోరు జరిగింది. పంత్‌కు బౌలింగ్ చేసే సమయంలో షాబాద్ ఖాన్ కాస్త తడబడ్డాడు. తొలుత లెగ్ సైడ్ బౌల్ చేశాడు. అంతలోనే ఎవరో వచ్చి అతడితో మాట్లాడారు. ఇంకేముంది వెంటనే పంత్ అవుట్ అయ్యాడు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: T20 World Cup Ind Vs Pak: అతడిని ఒక బ్యాట్స్‌మన్‌గా కూడా ఆడించగలం: విరాట్ కోహ్లి Ind Vs Pak: ‘చెత్త అంపైరింగ్.. అసలు రాహుల్ అవుట్ కాలేదు.. అది నో బాల్.. కావాలంటే చూడండి’ -
T20 World Cup: సెమీస్ చేరేది ఆ 4 జట్లే: ఆసీస్ మాజీ క్రికెటర్
Brad Hogg On T20 World Cup 2021 Semi- Finalists: టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అక్టోబరు 23 నుంచి సూపర్-12 రౌండ్ మొదలు కానుంది. క్వాలిఫైయర్స్‌లో అర్హత సాధించిన 4 జట్లు... ఈవెంట్‌కు నేరుగా అర్హత సాధించిన 8 జట్ల మధ్య అసలు పోటీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్.. సెమీస్ చేరే జట్లను అంచనా వేశాడు. ఆశ్చర్యకరంగా ఇందులో తమ జట్టుకు మాత్రం చోటు కల్పించలేదు. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్, మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, ఇండియా, పాకిస్తాన్ ఈసారి సెమీ ఫైనల్ చేరే అవకాశాలు ఉన్నాయన్నాడు. ఈ మేరకు టీమిండియా మాజీ బ్యాటర్ దీప్ దాస్‌గుప్తాతో చాట్ చేసిన బ్రాడ్ హాగ్... ‘‘గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్... గ్రూపు-2 నుంచి పాకిస్తాన్, ఇండియా సెమీస్‌కు చేరతాయి’’ అని వ్యాఖ్యానించాడు. అయితే, అక్టోబరు 24 నాటి తమ తొలి మ్యాచ్‌లో గనుక పాకిస్తాన్.. టీమిండియా చేతిలో ఓడితే గనుక సెమీ ఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతాయని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. ‘‘ఒకవేళ మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్.. భారత్‌ను ఓడించనట్లయితే... న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో వారి ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్ ప్రభావం వారిపై ఉంటుంది. సెమీ ఫైనల్ చేరే అవకాశాలు కూడా తగ్గుతాయి’’ అని బ్రాడ్ హాగ్ చెప్పుకొచ్చాడు. చదవండి: T20 World Cup: నువ్వసలు ఏం చేస్తున్నావు బాబర్.. టీమిండియాను చూసి నేర్చుకోండి -
మిడిలార్డర్ ఇలా ఉంటే కష్టం.. అది మాత్రం తెలియదు
Brad Hogg Reveals About CSK Winning IPL Title.. ఐపీఎల్ 2021లో సీఎస్కే ఫైనల్ చేరడం ఖాయమని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన సీఎస్కే క్వాలిఫయర్1 లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడగొట్టి ఫైనల్లో అడుగుపెడుతుందని తెలిపాడు. అయితే ఢిల్లీతోనే ఫైనల్ ఆడుతుందని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి సీఎస్కే జట్టులో ఓపెనింగ్ అద్భుతంగా ఉంది. రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్‌లు సూపర్‌ఫామ్‌ను కనబరుస్తూ జట్టుకు అదిరిపోయే ఆరంభాలు ఇస్తున్నారు. అయితే వీరిద్దరు విఫలమైనచోట అసలు సమస్య మొదలవుతుంది. మిడిలార్డర్లో వస్తున్న రాయుడు, మొయిన్ అలీ, రైనా, ధోనిలు పూర్తిగా నిరాశపరుస్తున్నారు. చదవండి: MS Dhoni: బంతులన్నీ వృథా చేశావు.. అవుటైనా బాగుండేది.. కనీసం.. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఇన్నింగ్స్‌లో ఇదే కనబడింది. గైక్వాడ్, డుప్లెసిస్‌లు త్వరగా ఔట్ కావడంతో సీఎస్కే తక్కువ స్కోరుకే పరిమితమైంది. రాయుడు అర్థసెంచరీతో మెరవడంతో 130 పరుగులు మార్క్‌ను అందుకోగలిగింది. ఇదే విషయమై బ్రాడ్ హగ్‌ను.. ''మిడిలార్డర్ ఇలా ఉంటే సీఎస్కే కప్ కొడుతుందా..'' అంటూ ఒక అభిమాని ప్రశ్నించాడు. దీనికి హగ్.. సీఎస్కే వర్సెస్ ఢిల్లీ ఫైనల్ మాత్రమే చూస్తా.. కప్ కొట్టే విషయం నాకు తెలియదు అంటూ కామెంట్ చేశాడు. ఇక మరో అభిమాని ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగో జట్టు ఎవరు అని అడగ్గా.. ''కేకేఆర్ చేరుతుంది.. కానీ రాజస్తాన్, ముంబైల నుంచి గట్టిపోటి ఉండే అవకాశం ఉంటుంది.'' అని కామెంట్ చేశాడు. చదవండి: MI Vs RR: ఒక్క మ్యాచ్.. నాలుగు రికార్డులు బద్దలయ్యే అవకాశం I'm backing a #DCvCSK final. https://t.co/ARLuR1YLST — Brad Hogg (@Brad_Hogg) October 5, 2021 @KKRiders are in the box seat, but with all competitions a twist is always around the corner!. I'm not confident yet.#IPL2021 https://t.co/xeB2ltNXiY — Brad Hogg (@Brad_Hogg) October 5, 2021 -
ఈ సీజన్ తర్వాత ధోనీ రిటైర్మెంట్.. హెడ్‌కోచ్‌గా.. లేదంటే!
Brad Hogg Comments On MS Dhoni: చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని.. ఈ సీజన్ ముగిసిన తర్వాత రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. గత కొంత కాలంగా బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నాడని, వయసు మీద పడుతున్న దృష్ట్యా ఇక ఆటకు వీడ్కోలు పలికితే బాగుంటుందని సూచించాడు. కాగా ఐపీఎల్-2020లో ఘోరంగా విఫలమైన చెన్నై... తాజా సీజన్లో మాత్రం అదరగొడుతోంది. ముఖ్యంగా రెండో అంచెలో ఆడిన మూడు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే, కెప్టెన్‌గా సీఎస్కేకు విజయాలు అందిస్తున్నా.. బ్యాటర్ మాత్రం ధోని పెద్దగా రాణించలేకపోతున్నాడు. తొలి దశలో బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం లేకపోగా.. ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించినా.. మిస్టర్ కూల్ పూర్తిగా నిరాశపరిచాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ధోని(1) బౌల్డ్ అయ్యాడు. గతంలో కూడా ఇదే తరహాలో వరుణ్ బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్న ధోని.. మరోసారి అదే తప్పిదాన్ని పునరావృతం చేశాడు. బ్రాడ్ హాగ్ వయసు మీద పడుతోంది కదా! ఈ నేపథ్యంలో బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడనుకుంటున్నా. చక్రవర్తి బౌలింగ్‌లో ధోని అవుట్ అయిన విధానం చూశాం. 40 ఏళ్ల ధోని అలసిపోతున్నాడేమో. ఏదేమైనా కెప్టెన్‌గా అతడు సాధించే విజయాలు ఇటు సీఎస్కేతో పాటు భారత క్రికెట్ మొత్తానికి కూడా ఉపయుక్తంగా ఉంటాయనడంలో సందేహం లేదు. జడేజా వంటి ఎంతో మంది ఆటగాళ్ల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చాడు. అయితే, వయసు మీద పడుతున్న కొద్దీ తను వ్యక్తిగతంగా రాణించలేకపోతున్నాడు అనిపిస్తోంది. రిటైర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించాడు. సీఎస్కే హెడ్ కోచ్ లేదంటే... ఒకవేళ ధోని సీఎస్కే(ఆట)కు వీడ్కోలు పలికితే.. మేనేజ్మెంట్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బ్రాడ్ హాగ్ అన్నాడు. ‘‘రాబోయే టీ20 వరల్డ్‌కప్‌నకు తను మెంటార్‌గా ఉండబోతున్నాడు. ఒకవేళ ఐపీఎల్లో ఆటకు గుడ్‌బై చెబితే సీఎస్కే హెడ్ కోచ్‌గా లేదంటే.. యాజమాన్యంలో కీలక సభ్యుడిగా మారే ఛాన్స్ ఉంది. స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో కలిసి వ్యూహాలు రచిస్తూ.. సరికొత్త సీఎస్కే ప్రయాణానికి బలమైన పునాదులు వేసేందుకు ఇది ఉపకరిస్తుంది’’ అని బ్రాడ్ హగ్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో.. ధోని గనుక రిటైర్ అయితే.. అతడి స్థానంలో ‘మ్యాచ్ ఫినిషర్’ రవీంద్ర జడేజా సీఎస్కే కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తవవుతున్నాయి. చదవండి: David Warner: మళ్లీ కనిపించకపోవచ్చు.. కానీ సపోర్టు చేయండి.. అన్నా అలా అనొద్దు! 🎥 A quick round up of the thriller finish against the Knights!#CSKvKKR #WhistlePodu #Yellove 🦁💛 @myntra pic.twitter.com/bjWWPnRMYi — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) September 27, 2021 -
IPL 2021: టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ అతడే..
Brad Hogg praises Shreyas Iyer: టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌పై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ప్రశంసలు కురిపించాడు. భవిష్యత్తులో అతడు భారత జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నాడు. శ్రేయస్ మానసికంగా ఎంత పరిణతి చెందినవాడో.. ఢిల్లీ క్యాపిటల్స్ విజయం తర్వాత తన ప్రెస్‌మీట్ చూసినపుడే అర్థమైందని చెప్పుకొచ్చాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన శ్రేయస్ అయ్యర్.. కోలుకుని.. ప్రస్తుతం ఐపీఎల్-2021 రెండో అంచెలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగులు(నాటౌట్) చేసి సత్తా చాటాడు. కాగా.. గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ తొలి దశకు దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో, టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్‌కు ఢిల్లీ ఫ్రాంఛైజీ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ప్రస్తుతం అయ్యర్ అందుబాటులోకి వచ్చినప్పటికీ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. పంత్ నేతృత్వంలో ఢిల్లీ మంచి విజయాలు సాధించడం ఇందుకు ఒక కారణంగా చెప్పవచ్చు. అక్కడ కూడా భంగపాటే.. అయినా ఇదిలా ఉండగా... టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపికైన ప్రధాన ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. స్టాండ్ బై ప్లేయర్‌గా అతడి పేరును చేర్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. బుధవారం నాటి మ్యాచ్‌లో మైదానంలో దిగిన అయ్యర్.. మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పంత్‌కు పగ్గాలు అప్పగించినా, ప్రపంచకప్ జట్టుకు సెలక్ట్ కాకపోయినా.. ఆ ప్రభావం బ్యాటింగ్‌పై పడకుండా జాగ్రత్త పడ్డాడు. పంత్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలన్న ఫ్రాంఛైజీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు పేర్కొంటూ హుందాతనం చాటుకున్నాడు. ఇక ఈ సీజన్లో తన తొలి ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. అనుకున్న విధంగా శుభారంభం చేయలేకపోయానని, ఆ ఇన్నింగ్స్(47 పరుగులు) పెద్దగా సంతృప్తినివ్వలేదని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సానుకూల దృక్పథంతో ముందుకు సాగడమే తన పని అని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో బ్రాడ్ హాగ్ ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘గాయం నుంచి కోలుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌నకు సెలెక్ట్ కాలేదు. నిజానికి తనపై చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ, ప్రభావం పెద్దగా కనిపించలేదు. పత్రికా సమావేశంలో తను మాట్లాడిన మాటలు చూస్తే టీమిండియా భవిష్యత్తు సారథి అతడే అనిపించాడు. మొన్నటి మ్యాచ్‌లో మెరుగ్గా ఆడాడు. నిజానికి అయ్యర్ లాంటి ఆటగాడు ఉన్నందుకే ఢిల్లీ టాప్ పొజిషన్‌కు వచ్చిందని చెప్పవచ్చు. పంత్‌కు కెప్టెన్సీ ఇచ్చినందుకు ఎంతోకొంత బాధ పడే ఉంటాడు. కానీ, తను దానిని బయటపడనివ్వలేదు. జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. అతడిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి’’ అని శ్రేయస్ అయ్యర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా 2018లో గౌతం గంభీర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత శ్రేయస్ ఆ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అతడి సారథ్యంలో ఢిల్లీ గత సీజన్లో ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. చదవండి: T20 World Cup: సెలక్టర్ల నిర్ణయం తప్పని నిరూపించు.. ఇదే మంచి ఛాన్స్! 🗣️ "My mindset was to be positive and back my instincts."@ShreyasIyer15 on what it feels to put a smile on DC fans' faces, his crucial knock and starting the 🇦🇪 leg of #IPL2021 with a win 🤩#YehHaiNayiDilli #CapitalsUnplugged #DCvSRH @OctaFX pic.twitter.com/6amVXjGb5q — Delhi Capitals (@DelhiCapitals) September 23, 2021 -
ఆర్సీబీ కెప్టెన్‌గా ఎవరూ సరిపోరు.. కొత్తవాళ్లను కొనాల్సిందే!
Brad Hogg Comments On Virat Kohli RCB Captaincy Decision: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేందుకు వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో మరొకరిని కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ఇటీవల ప్రకటించిన కోహ్లి.. ఐపీఎల్ తాజా సీజన్ ముగిసిన తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కూడా వైదొలగుతానని ఆదివారం ప్రకటించాడు. ఈ క్రమంలో తన యూట్యూబ్ ఛానెల్లో ఆర్సీబీ తదుపరి కెప్టెన్ గురించి చర్చించిన హాగ్.. ప్రస్తుత జట్టు నుంచి ఎవరూ కూడా కెప్టెన్సీ బాధ్యతలకు సరిపోరని తెలిపాడు. "వచ్చే ఏడాది సీజన్‌కు తమ జట్టుకు నాయకత్వం వహించడానికి ఆర్సీబీ యాజమాన్యం ఒకరిని కొనుగోలు చేయాలి. ప్రస్తుత జట్టులో ఎవరూ కూడా నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంటారని నేను అనుకోను. ఏబీ డివిలియర్స్ ఎంతకాలం ఐపీఎల్లో కొనసాగుతాడో మనకు తెలియదు. అతడు స్వల్ప కాలం మాత్రమే ఐపీఎల్లో కొనసాగితే.. కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం లేకపోవచ్చు’’ అని హాగ్ వెల్లడించాడు. జట్టులో ఎక్కవ కాలం కొనసాగే ఆటగాడికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని అతడు అభిప్రాయపడ్డాడు. "ఐపీఎల్లో విజయవంతమైన జట్లను చూస్తే, రోహిత్ శర్మ చాలా కాలం పాటు ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. కావున వారు చాలా విజయాలు సాధించారు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ధోనీ చాలా ఏళ్లుగా నుంచి సారథిగా ఉన్నాడు. కానీ ఆర్సీబీ టైటిల్ గెలవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్సీబీలో ఎవరూ కెప్టెన్ పాత్రను పోషించలేరు" అని చెప్పాడు. కాగా వచ్చే ఏడాది మెగా వేలానికి ముందు ఆర్సీబీ ఏయే ఆటగాళ్లను రీటైన్ చేసుకుంటే బాగుంటుందని ప్రశ్నించినపుడు.. కోహ్లీ, కైల్ జమీసన్, మహ్మద్ సిరాజ్ , దేవదత్ పడిక్కల్‌ను హాగ్ ఎంపిక చేసుకున్నాడు. చదవండి: CSK Vs MI: మహి భాయ్ ఉండగా చింత ఎందుకు.. ఇదే నా టాప్ ఇన్నింగ్స్ -
ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరడం కష్టమే.. ఎందుకంటే..: ఆసీస్ మాజీ క్రికెటర్
Brad Hogg On Rajasthan Royals Team: ఐపీఎల్- 2021లో రాజస్తాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. ప్రధాన ఆటగాళ్లంతా జట్టుకు దూరమయ్యారని, దీంతో కెప్టెన్ సంజూ శాంసన్‌పైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నాడు. కాబట్టి రాజస్తాన్‌కు కష్టాలు తప్పకపోవచ్చని ఈ స్పిన్ దిగ్గజం జోస్యం చెప్పాడు. కాగా ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయాలతో బాధపడుతుండగా, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, ఆండ్రూ టై వంటి కీలక ఆటగాళ్లు సైతం వివిధ కారణాలతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. వీరంతా ఐపీఎల్ రెండో దశకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బ్రాడ్ హాగ్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి రాజస్తాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆర్చర్, బట్లర్, స్టోక్స్, టై వంటి నలుగురు ప్రధాన ఆటగాళ్లు దూరమయ్యారు. ఇలాంటప్పుడు తుదిజట్టు ఎంపికలో మరింత ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి. నాకు తెలిసి బట్లర్ స్థానంలో టాపార్డర్‌లో లియాం లివింగ్‌స్టోన్ ఆడతాడు. ఇక బౌలింగ్ ఆర్డర్ విషయానికొస్తే గత మొదటి దశ మాదిరిగానే పాత కాంబినేషన్‌తోనే వారు ముందుకు సాగే అవకాశం ఉంది. అయితే, వారి పేస్ బౌలింగ్‌లో అంతగా పదును లేదన్నది తెలిసిన విషయమే’’ అని పేర్కొన్నాడు. చదవండి: Sanju Samson: ఈసారి కచ్చితంగా చాంపియన్‌గా నిలవాలి! కెప్టెన్ సంజూ శాంసన్, సంగక్కర.. ఫొటో: రాజస్తాన్ రాయల్స్ అదే విధంగా రాజస్తాన్ జట్టులో కొత్తగా చేరిన ఆటగాళ్ల గురించి చెబుతూ.. ‘‘భుజానికి గాయమైన కారణంగా ఎవిన్ లూయీస్ దూరమయ్యే పరిస్థితి. గ్లెన్ ఫిలిప్స్‌ను తీసుకుని మంచి పనిచేశారు. అంతేకాదు దక్షిణాఫ్రికా ఆటగాడు తబ్రేజ్ షమ్సీని జట్టులోకి తీసుకోవాలన్న నిర్ణయం నాకెంతగానో నచ్చింది. అయితే, ప్రధాన బ్యాట్స్‌మెన్ దూరం కావడంతో కెప్టెన్ శాంసన్‌పైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. ఏదేమైనా రాజస్తాన్ ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం కాస్త కష్టమే. ఎందుకంటే ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో ఓడారు. మిగిలిన ఏడు మ్యాచ్‌లలో కనీసం నాలుగింటిలో గెలిస్తేనే టాప్- 4కు చేరుకునే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి రాజస్తాన్ ఈసారి ప్లే ఆఫ్స్‌కు వెళ్లలేదు’’ అని హాగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్ రెండో అంచెలో భాగంగా సెప్టెంబరు 21న రాజస్తాన్, పంజాబ్ కింగ్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: IPL 2021 Phase 2: ఈసారి కూడా టైటిల్ వాళ్లదే: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ That time of the year again. @KumarSanga2 speaks. 💗#HallaBol | #RoyalsFamily | #IPL2021 pic.twitter.com/l2178jIbuE — Rajasthan Royals (@rajasthanroyals) September 15, 2021 -
టీ20 వరల్డ్‌కప్: ఆ రెండు జట్లే హాట్ ఫేవరేట్.. కోహ్లి సేన కూడా..
Brad Hogg Favorites to win the T20 World Cup: టీ20 ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది. ఈసారి ఏ జట్టు గెలుస్తుందో అని క్రికెట్ నిపుణులు, మాజీలు అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ తన ఫేవరేట్ జట్లును ప్రకటించాడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో అత్యుత్తమ జట్లు.. టైటిల్ గెలుచుకునే రేసులో ఈ రెండు జట్లే ముందుంటాయని హాగ్ జోస్యం చెప్పాడు. అయితే, ఆ రెండు జట్లకు గట్టి సవాల్ విసరగలిగేది టీమిండియా అని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్ 2010 లో టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. అదే విధంగా.. ఇటీవల శ్రీలంక ,పాకిస్తాన్లతో జరిగిన టీ20 సీరీస్‌లో విజయం సాధించి ఇంగ్గండ్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. మరో వైపు శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో ఇటీవల జరిగిన టీ 20 సిరీస్‌లో భారత్, న్యూజిలాండ్ ఓటమి చెందాయి. కానీ ఈ సిరీస్‌లో ఇరు జట్లు తమ సీనియర్ ఆటగాళ్లతో బరిలోకి దిగలేదు. టీ20 ప్రపంచకప్ గ్రూప్ 2 లో భారత్, న్యూజిలాండ్ ఉన్నాయి. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. భారత టీ20 ప్రపంచకప్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఉన్నారు. స్టాండ్ బై ప్లేయర్స్‌గా శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్. న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టాడ్ ఆస్లే, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మెన్, దేవాన్ కాన్వె, లూకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్తిల్, కైల్ జెమీషన్, డార్లీ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సైపర్ట్ (వికెట్ కీపర్), ఇస్ సోధి, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే ఇంగ్లండ్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోనాథన్ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, టైమల్ మిల్స్, అదిల్ రషీద్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. స్టాండ్ బై ప్లేయర్లు: టామ్ కరన్, లియామ్ డాసన్, జేమ్స్ విన్స్. చదవండి: T20 World Cup 2021: ‘ఇండియా, పాకిస్తాన్.. ఇంకా సెమీస్ చేరే జట్లు ఇవే’ -
కోహ్లీకి మరోసారి మొండిచెయ్యి.. మరో డబ్ల్యూటీసీ జట్టులోనూ దక్కని చోటు
న్యూఢిల్లీ: తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఓటమిపాలయ్యాక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్లు అయిష్టత ప్రదర్శిస్తున్నారు. తమ అత్యుత్తమ డబ్ల్యూటీసీ జట్టులో కనీసం చోటు కూడా కల్పించకుండా టీమిండియా రన్ మెషీన్‌ను అవమానిస్తున్నారు. తొలుత టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తన డ్రీమ్ జట్టులో కోహ్లీకి స్థానాన్ని నిరాకరించగా, తాజాగా ఆసీస్ మాజీ ఆటగాడు, దిగ్గజ చైనామెన్ బౌలర్ బ్రాడ్ హాగ్ తన అత్యుత్తమ జట్టులో కోహ్లీకి స్థానం కల్పించలేనని కరాఖండిగా చెప్పేశాడు. తన జట్టులో నలుగురు భారత ప్లేయర్లకు అవకాశం కల్పించిన ఆయన.. ఆశ్చర్యకరంగా కోహ్లీని పక్కనపెట్టేసాడు. అంతేకాకుండా డబ్ల్యూటీసీ టోర్నీలో ట్రిపుల్ సెంచరీ చేసిన తమ దేశ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను కాదని శ్రీలంక ఓపెనర్ దిముత్ కరుణరత్నేను తీసుకున్నాడు. అతని ఓపెనింగ్ పార్ట్నర్గా టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపిక చేశాడు. ఫస్ట్ డౌన్లో కేన్ విలియమ్సన్కు అవకాశం కల్పించిన హగ్.. అతన్నే తన జట్టు కెప్టెన్‌గా ఎన్నుకున్నాడు. టెస్ట్‌ల్లో కోహ్లీ స్థానమైన నాలుగో స్థానాన్నిఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌తో భర్తీ చేశాడు. ఇక ఐదో స్థానం కోసం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌ను ఎంపిక చేసిన ఆయన.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు ఆరో స్థానాన్ని కేటాయించాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ కోటాలో రిషబ్ పంత్‌ను ఎంచుకున్న హాగ్.. ఏడో స్థానం కోసం అతనే పర్ఫెక్ట్ ఆటగాడని కితాబునిచ్చాడు. ఆస్ట్రేలియా గడ్డపై కూడా పంత్ అదరగొట్టాడని, ఫైనల్లోనూ కీలక సమయంలో 40 పరుగులతో రాణించాడని హాగ్ గుర్తు చేశాడు. ఏకైక స్పిన్నర్‌గా భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకున్న ఆయన.. డబ్ల్యూటీసీ టోర్నీలో అతనే అత్యధిక వికెట్లు సాధించాడన్న విషయాన్ని ప్రస్తావించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన కైల్ జెమీసన్‌ను తన ప్రధాన పేసర్‌గా, ఇంగ్లండ్ వెటరన్ స్టువర్ట్ బ్రాడ్, టీమిండియా పేస్ సుల్తాన్ మహమ్మద్ షమీలను అతని సహచర పేసర్లుగా ఎంపిక చేశాడు. ఆశ్చర్యకరంగా కగిసో రబడా, టీమ్ సౌథీ, ప్యాట్ కమిన్స్‌లను పక్కనపెట్టేసాడు. హాగ్ డ్రీమ్ డబ్ల్యూటీసీ జట్టు: రోహిత్ శర్మ, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), స్టీవ్ స్మిత్, బాబర్ ఆజామ్, బెన్ స్టోక్స్, రిషబ్ పంత్, కైల్ జేమీసన్, రవిచంద్రన్ అశ్విన్, స్టువర్ట్ బ్రాడ్, మహమ్మద్ షమీ -
మ్యాచ్ గెలవడం కోసం క్రీడాస్ఫూర్తిని పక్కనబెట్టారు
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో శనివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. ముంబై ఆల్‌రౌండర్ పొలార్డ్ అద్భుత బ్యాటింగ్ కనబరిచి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ మాత్రం ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలవడం కోసం క్రీడాస్పూర్తిని పక్కన బెట్టిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విషయంలోకి వెళితే.. ముంబై విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు కావాలి. పొలార్డ్ స్ట్రైక్‌లో ఉండగా.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ధావల్ కులకర్ణి ఉన్నాడు. ఎన్గిడి బంతి విసరకముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న కులకర్ణి అడ్వాన్స్‌గా ఆలోచించి క్రీజు దాటి చాలా ముందుకు వచ్చాడు. పొలార్డ్ బంతిని హిట్ చేయడం.. చకచకా రెండు పరుగులు పూర్తి చేయడం.. మ్యాచ్ గెలవడం జరిగిపోయాయి. అయితే మ్యాచ గెలవడం కోసం కులకర్ణి అడ్వాంటేజ్ చేసుకొని ముందుకు పరిగెత్తుకురావడం సమంజసం కాదని హగ్ పేర్కొన్నాడు. అలా చేస్తే క్రీడాసూర్తిని మరిచినట్లేనని తెలిపాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తన ట్విటర్లో ఒక క్యాప్షన్ జత చేశాడు. '' నిన్నటి మ్యాచ్‌లో ఒక విషయం నన్ను బాధించింది. చివరి బంతికి నాన్ స్ట్రైకర్ అడ్వాంటేజ్ తీసుకొని బౌలర్ బంతి విడవకముందే క్రీజు దాటడం క్రీడాస్పూర్తికి విరుద్ధం. ఒక మ్యాచ్ గెలవడం కోసం ఇలా చేస్తారా'' అంటూ రాసుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంబటి రాయుడు(72 నాటౌట్, 27 బంతులు; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సీఎస్కే భారీ స్కోరు నమోదు చేసింది. జడేజా 22 పరుగులతో రాయుడుకు సహకరించాడు. అంతకముందు ఓపెనర్ డుస్లెసిస్ 50, మొయిన్ అలీ 58 పరుగులతో రాణించారు. ఇక చేజింగ్‌లో పొలార్డ్ (87 నాటౌట్, 34 బంతులు; 6 ఫోర్లు, 8 సిక్సర్లతో) విద్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. కొడితే ఫోర్.. లేదంటే సిక్స్ అన్నట్లుగా రెచ్చిపోయిన పొలార్డ్ ముంబైకి ఒంటిచేత్తో విజయాన్ని సాధించిపెట్టాడు. రోహిత్ 38, డికాక్ 35, కృనాల్ 32, హార్దిక్ 16 పరుగులు చేశారు. చదవండి: ఆ బంతిని కూడా ఫోర్ కొడితే ఇంకేం చేస్తాం! -
కోహ్లితో ఓపెనర్‌గా అతనైతే బాగుంటుంది, కానీ..
చెన్నై: ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఓపెనర్‌గా వచ్చి అదరగొట్టిన నేపథ్యంలో ఐపీఎల్లో సైతం అతను ఓపెనింగ్ చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ విషయమై కోహ్లి సైతం ఆసక్తి కనబరచడటంతో అతనికి జోడి ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ మొదలైంది. ఆర్సీబీ ఓపెనింగ్ స్థానాలపై ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ స్పందిస్తూ.. కోహ్లితో ఓపెనింగ్ స్థానానికి తన ఛాయిస్‌ను వెల్లడించాడు. అతను కోహ్లికి జోడీగా డివిలియర్స్, దేవ్‌దత్ పడిక్కల్ పేర్లను పరిశీలించి, చివరకు యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్‌వైపు మొగ్గు చూపాడు. అయితే ఇంతలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పడిక్కల్ కరోనా బారిన పడటంతో అతను లీగ్‌కు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ బలమైన టాపార్డర్ కలగి ఉందని హాగ్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో అన్ని జట్లతో పోలిస్తే ఆర్సీబీ టాప్-6 బ్యాట్స్మెన్లు చాలా ప్రమాదకరమని వివరించాడు. కోహ్లి, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్, డేనియల్ క్రిస్టియన్, మహమ్మద్ అజహారుద్దీన్, ఫిన్ అలెన్ లాంటి విధ్వంసకర వీరులు ఆర్సీబీ టాప్-6లో ఉన్నారన్నారు. కాగా, గతేడాది ఐపీఎల్లో పడిక్కల్ ఆర్సీబీ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-2020 సీజన్లో అతను 15 మ్యాచ్‌ల్లో 5 అర్ధసెంచరీల సాయంతో 473 పరుగులు సాధించి, కోహ్లి, డివిలియర్స్ లాంటి స్టార్‌లచే ప్రశంసలందుకున్నాడు. ఇటీవల ముగిసిన భారత దేశవాళీ టోర్నీలో సైతం అతను పరుగుల వరద పారించాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలో అతను 7 మ్యాచ్‌ల్లో 4 శతకాలు బాది 147.70 సగటుతో 737 పరుగులు సాధించాడు. ఈ టోర్నీలో ముంబై కెప్టెన్ పృథ్వీ షా(8 మ్యాచ్‌ల్లో 4 భారీ శతకాల సాయంతో 827 పరుగులు) తరువాత అత్యధిక పరుగులు సాధించింది పడిక్కలే కావడం విశేషం. చదవండి: ఆటగాళ్లకు కరోనా వ్యాక్సినేషన్: బీసీసీఐ ఉపాధ్యక్షుడు -
రహానే గొప్ప కెప్టెన్: ఆసీస్ మాజీ క్రికెటర్
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్‌పై ప్రశంసలు కురిపించాడు. విభిన్న రకాల షాట్లతో విరుచుకుపడే పంత్‌కు బౌలింగ్ చేయడం కష్టమని, ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మరోసారి సత్తా చాటాడని కొనియాడాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మెరుగ్గా రాణించగలడని, అతడిని జట్టులో తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సెలక్టర్లకు సూచించాడు. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ స్థానానికి అతడితో ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్ 97 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. ఒత్తిడి అధిగమించి జట్టు మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. (చదవండి: అతడితో నన్ను పోల్చడం అద్భుతం కానీ..: పంత్) ఇక నిర్ణయాత్మక బ్రిస్బేన్ టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి, చారిత్రక విజయంలో హీరోచిత ఇన్నింగ్స్‌తో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ నేపథ్యంలో పంత్ ప్రదర్శన గురించి మాట్లాడిన స్పిన్నర్ బ్రాడ్ హాగ్.. ‘‘ఇప్పుడు తను పూర్తి విశ్వాసంతో ముందుకు సాగుతాడు. టెస్టు సిరీస్‌లోని రెండు కీలక మ్యాచుల్లో తనను తాను నిరూపించుకున్నాడు. ఆసీస్ గడ్డపై మరే ఇతర భారత ఆటగాడు ఇంతకంటే మెరుగ్గా ఆడలేడు. తను అయ్యర్ లేదా సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేస్తాడు. ఇక కోహ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘కోహ్లి కెప్టెన్‌గా ఉంటేనే తన బ్యాటింగ్ మెరుగ్గా ఉంటుంది. లేదంటే జట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిజానికి అజింక్య రహానే ఆసీస్‌పై టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడు. కూల్‌గా తన పని తాను చేసుకుపోయాడు. గొప్ప సారథి తను. అయితే కోహ్లి జట్టును ముందుండి నడిపిస్తాడు కాబట్టి తను వైస్ కెప్టెన్‌గానే ఉంటాడు’’ అని ఈ ఆసీస్ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు.(చదవండి: వాళ్లిద్దరూ పట్టుదలగా నిలబడ్డారు: జడేజా) -
ముందు మీ టాప్ ఆర్డర్ చూసుకో : వసీం జాఫర్
సిడ్నీ : ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్కు టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ తనదైన శైలిలో చురకలంటించాడు. సిడ్నీ వేదికగా ఆసీస్-ఎతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్ విఫలంతో 194 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రాడ్ హాగ్ టీమిండియా టాప్ ఆర్డర్‌పై స్పందించాడు.' టీమిండియా టాప్ ఆర్డర్ ఆఫ్‌స్టంప్ ఎక్కడుందో తెలుసుకొని ఆడాలి. మంచి లెంగ్త్‌లో పడిన బంతిని ఆడకుండా వదిలేయడం నేర్చుకోవాలి.. అలాగే ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించకూడదు.. కానీ ఇలాంటి నియమాలేవి పాటించని టీమిండియా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నారంటూ' ట్రోల్ చేశాడు. హాగ్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న వసీం జాఫర్ తనదైన శైలిలో చురకలంటించాడు. (చదవండి : మిస్టరీ స్పిన్నర్ పెళ్లి.. వైరలవుతున్న వీడియో) 'హాగ్.. మా మీద పడి ఏడ్వడం కంటే ముందు మీ జట్టు టాప్ ఆర్డర్ చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. మరో నాలుగురోజులు గడిస్తే భారత్‌తో టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. తొలి టెస్టులో ఓపెనర్లుగా ఎవరు రానున్నారనే దానిపై మీ జట్టుకు ఇంకా స్పష్టత రాలేదు. ముందు ఆ విషయం గురించి ఆలోచించండి ' అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇప్పటికే గాయం కారణంగా ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూరం కాగా.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో త్యాగి బౌన్సర్ దెబ్బకు యువ ఓపెనర్ విన్ పుకోవిస్కి తలకు బలమైన గాయం కావడంతో మొదటి టెస్టుకు దూరమయ్యాడు కాగా విన్ పుకోవిస్కి స్థానంలో మార్కస్ హారిస్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. అంతేగాక ఆసీస్ కీలక బౌలర్ సీన్ అబాట్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో కండరాలు పట్టేయడంతో మళ్లీ బౌలింగ్‌కు రాలేదు. దీంతో అబాట్ మొదటి టెస్టు ఆడతాడా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. కాగా ఇరుజట్ల మధ్య డిసెంబర్ 17న అడిలైడ్ వేదికగా తొలి డే నైట్ టెస్టు జరగనుంది.(చదవండి : క్యాచ్ వదిలేశాడని బౌలర్ బూతు పురాణం) ఇక ఆసీస్-ఎతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆటలో భాగంగా క్రితం రోజున చేసిన 386 పరుగుల వద్దే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్ ఆసీస్ ఎ ముందు 472 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఎ తడబడుతుంది. ఇప్పటివరకు చూసుకుంటే టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. ఆసీస్ గెలవాలంటే ఇంకా 384 పరుగులు చేయాల్సి ఉంది. చివరి సెషన్ మాత్రమే మిగిలి ఉండడంతో మ్యాచ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఒకవేళ బౌలర్లు చెలరేగితే టీమిండియా విజయం సాధించే అవకాశం కూడా ఉంది. అంతకముందు రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, హనుమ విహారిలు సెంచరీలతో కథం తొక్కిన సంగతి తెలిసిందే. -
రాజస్థాన్ రాయల్స్‌కు అతడే కీలకం!
ఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు జాస్ బట్లర్ నమ్మకమైన ఆటగాడని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాగ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. గత మ్యాచుల్లో అనుకున్న స్థాయిలో రాణించకపోయినా ముంబైతో జరిగిన మ్యాచ్‌తో మంచి ఫామ్‌లోకి వచ్చాడని అన్నాడు. కానీ స్టీవ్ స్మిత్ పేవల ఫామ్ చూసి నిరాశ చెందానని... మొదటి రెండు మ్యాచుల్లో ఆఫ్ సెంచరీలు చేసినప్పటికీ గత మూడు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోర్ చేయడం ఆ జట్టును కలవరపెడుతుందని తెలిపాడు. అనవసరమైన షాట్లు ఆడి వికెట్ కోల్పోతున్నాడని, బహుషా అక్కడి వాతావరణం కారణమై ఉండొచ్చని హాగ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ఐపీఎల్ సీజన్లో మొదటి రెండు మ్యాచులు గెలిచి అందరి దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్, గత మూడు మ్యాచుల్లో ఓటమిని చవిచూసి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలించింది. ముంబైతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ ఓడినప్పటికీ జాస్ బట్లర్ తిరిగి ఫామ్‌లోని రావడం ఆ జట్టుకు మంచి పరిణామం. ఈ సీజన్లో బట్లర్ ఆడిన మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోకపోయినా, ముంబైతో జరిగిన మ్యాచ్‌లో విజృంభించాడు. 44 బంతుల్లో 70 పరుగులు చేయగా ఇందులో ఐదు సిక్సులు, నాలుగు ఫోర్లు బాదాడు. (ఇదీ చదవండి: వారిద్దరి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా..) -
ఇలాంటి ఆటగాడిని నేనెప్పుడూ చూడలేదు!
న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్. సన్‌రైజర్స్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే ఆఫ్ సెంచరీ చేశాడు. ఇప్పటకే ఆడిన మ్యాచుల్లో మూడు ఆఫ్ సెంచరీలు చేసి అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేశాడు. ఈ విషమై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. ఇటువంటి ఆటను తన కెరీర్లో ఎన్నడూ చూడలేదని అన్నాడు. ‘అతడికి ఇది మొదటి ఐపీఎల్ అయినా మూడు ఆఫ్ సెంచరీలు సాధించాడని తెలిపడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కాట్రెల్ వేసిన షాట్ బంతికి తడబడ్డా ఆ తర్వాత మ్యాచుల్లో క్వాలిటీ ఉన్న బౌలర్లు వేసిన షాట్ బంతులను సమర్ధంగా ఎదుర్కున్నాడని అన్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా వేసిన షాట్ బంతులను ముందే గుర్తించి చక్కగా ఆడాడని, దీనిని బట్టి అతడు త్వరగా నేర్చుకునేతత్వం ఉన్న ఆటగాడని కితాబిచ్చాడు. భారత జట్టుకు ఆడగల సత్తా అతడిలో ఉందని బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. (ఇదీ చూడండి: ‘నేనైతే వాట్సన్‌ను తీసే ప్రసక్తే ఉండదు’) -
సన్‌రైజర్స్ పరాజయాలకు కారణం ఇదే
అబుదాబి : ఐపీఎల్ సీజన్లలో బౌలర్ల సత్తాతో మ్యాచ్‌లు గెలిచిన జట్టు ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే. 2012లో సన్‌రైజర్స్ ఐపీఎల్లో అడుగుపెట్టినప్పటి నుంచి చూసకుంటే బ్యాట్సమెన్ల కంటే ఎక్కువ బౌలర్ల సత్తా మీద ఆదారపడే ఎక్కువ మ్యాచ్‌లను గెలిచేది. అయితే కరోనా నేపథ్యంలో యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్లో మాత్రం సన్‌రైజర్స్ బౌలర్లకు అక్కడి పిచ్‌లు అంతగా అనుకూలించడం లేదని ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్ చానెల్లో సన్‌రైజర్స్ ప్రదర్శనపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. (చదవండి : ఎవరిని నిందించొద్దు.. తప్పంతా నాదే : వార్నర్) 'నాకు తెలిసి సన్‌రైజర్స్ బౌలర్లు ఇంకా యూఏఈ పిచ్‌లకు అలవాటు పడలేదనిపిస్తుంది. ఇక్కడి పిచ్‌లు వారికి అనుకూలించడం లేదు. సాధారణంగా యూఏఈలో ఉన్న పిచ్‌లు స్వింగ్‌కు అనుకూలించడం తక్కువ.. పేస్ బౌలింగ్‌కు కూడా అంతంతమాత్రంగానే సహకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్వింగ్ బౌలర్ భూవీ యూఏఈ పిచ్‌లపై అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. మిగతా సన్‌రైజర్స్ బౌలర్లు కూడా గుడ్ లెంగ్త్‌లో తమ బంతులను విసరలేకపోతున్నారు. ఇదే ఇప్పుడు వారికి పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను పూడ్చాలంటే సన్‌రైజర్స్ బౌలర్లు తమ ప్రాక్టీస్‌ను మరింత పెంచాలి. అని వెల్లడించాడు. ఐపీఎల్ 2012 సీజన్లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్ హైదరబాద్ ఎన్నో మ్యాచ్‌ల్లో లోస్కోరింగ్ చేసినా బౌలర్ల చలువతో విజయాలు సాధించేది. భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ సహా ఇతర ఆటగాళ్లు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. 2016లో పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన సన్‌రైజర్స్ డేవిడ్ వార్నర్ సారధ్యంలో ఏకంగా టైటిల్‌నే కొల్లగొట్టింది. దీంతో అప్పటినుంచి వరుసగా ప్రతీ సీజన్లోనూ కనీసం ప్లేఆఫ్స్‌కు చేరుతున్న జట్టుగా సన్‌రైజర్స్ నిలుస్తూ వచ్చింది. అయితే యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్లో మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ చతికిలపడింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 164 పరుగుల లక్ష్యం చేధించలేక చతికిలపడగా.. కేకేఆర్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో మొదట తక్కువ స్కోరు నమోదు చేసింది. అయితే బౌలర్ల వైఫల్యంతో వార్నర్ సేన ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది.(చదవండి : వారెవ్వా కమిన్స్.. తిట్టినోళ్లే పొగుడుతున్నారు) -
ఐపీఎల్-2020 బెస్ట్ ఎలెవన్.. ధోనికి నో ప్లేస్!
మెల్బోర్న్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)చరిత్రలో బెస్ట్ కెప్టెన్లు ఎవరంటే మనకు ఠక్కున గుర్తుచ్చేది రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనిలు. అయితే తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్‌హాగ్ ప్రకటించిన అత్యుత్తమ ఐపీఎల్ ఎలెవన్‌లో రోహిత్ శర్మ స్థానం దక్కించుకున్నాడు కానీ ధోనికి మాత్రం చోటు దక్కలేదు. అదే సమయంలో టీ20 స్పెషలిస్టు ఆటగాళ్లైన ఏబీ డివిలియర్స్, క్రిస్గేల్లు కూడా బ్రాడ్‌హాగ్ స్థానం కల్పించలేదు. దీనిపై బ్రాడ్ హాగ్ మాట్లాడుతూ.. ‘ ధోని, డివిలియర్స్, క్రిస్ గేల్‌లను నా ఐపీఎల్ అత్యుత్తమ జట్టులో ఎంపిక చేయలేదు. వీరు ‘పాత’బడ్డారు. వీరికి మ్యాచ్‌ను టర్న్ చేసే సామర్థ్యం ఉంది. కానీ వీరు వెటరన్లు కావడంతో చోటు కల్పించలేదు. ఈ సీజన్ ఐపీఎల్ ముగిసేసరికి నా జట్టు ఇలా ఉంటుంది’ అని తన యూట్యూట్ చానల్లో ప్రకటించాడు.( చదవండి: ‘కోహ్లి.. ఇకనైనా జట్టు ఎలా ఉండాలో తెలుసుకో’) న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు బెస్ట్ ఐపీఎల్-20 టీమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చాడు హాగ్. గతంలో ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా చేసిన విలియమ్సన్కు సారథిగా ఎంచుకున్నాడు. ఇక అదే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్‌ను ఓపెనర్‌గా తీసుకున్నాడు. వార్నర్‌కు జతగా రోహిత్ శర్మను ఎంపిక చేశాడు. ఫస్ట్‌డౌన్ ఆటగాడిగా విరాట్ కోహ్లిని సెలెక్ట్ చేశాడు. కీపర్‌గా రిషభ్ పంత్‌ను ఎంపిక చేసిన హాగ్.. ఆల్‌రౌండర్ కోటాలో ఆండ్రీ రసెల్, రవీంద్ర జడేజా, సునీల్ నరైన్‌లను తీసుకున్నాడు. రసెల్ మీడియం ఫాస్ట్ బౌలర్ కాగా, జడేజా, నరైన్‌లు స్పిన్నర్లు కావడంతో వీరికి ప్రాధాన్యత ఇచ్చాడు. యజ్వేంద్ర చహల్‌కు కూడా హాగ్ జట్టులో చోటు దక్కింది. ఇక పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలను ఎంపిక చేశాడు. ఇక్కడ . ఏడుగురు భారత ఆటగాళ్లకు హాగ్ చోటు ఇచ్చిన హాగ్.. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు నుంచి వార్నర్‌కు మాత్రమే అవకాశం ఇవ్వడం గమనార్హం.(చదవండి: ‘ఆ ఫాస్ట్ బౌలర్‌పైనే ధోని ఆశలు’) హాగ్ బెస్ట్ ఐపీఎల్-2020 జట్టు ఇదే.. కేన్ విలియమ్సన్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, ఆండ్రీ రసెల్, రవీంద్ర జడేజా, సునీల్ నరైన్, యజ్వేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా. -
సురేశ్ రైనా ఆశలు వదులుకోవాల్సిందే..
సిడ్నీ: భారత క్రికెట్ జట్టులో రీఎంట్రీపై వెటరన్ సురేశ్ రైనా ఏమైనా ఆశలు పెట్టుకుంటే వాటిని వదులుకోవాల్సిందేనని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్. ఇక భారత జట్టులో రైనా పునరాగమనం చేసే అవకాశమే లేదంటూ జోస్యం చెప్పాడు. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. యువ క్రికెటర్ల వైపే ఎక్కువ మొగ్గుచూపుతుండటంతో రైనాకు చాన్స్ ఉండదన్నాడు. సాధారణంగా రైనా నాల్గో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడని, ఇప్పుడు ఆ స్థానాన్ని శ్రేయస్ అయ్యర్ సమర్థవంతంగా భర్తీ చేస్తున్నాడన్నాడు. మరి ఇటువంటి తరుణంలో రైనా తన స్థానంపై ఆశలు పెట్టుకోవడం అనవసరమన్నాడు. (ఐసీసీ వన్డే సూపర్ లీగ్ వచ్చేసింది..) ఒకవేళ టీ20 ఫార్మాట్లో రైనా చాన్స్ కోసం యత్నిస్తే అప్పుడు శిఖర్ ధావన్‌ను రిజర్వ్ బెంచ్‌లో ఉండాల్సి ఉంటుందన్నాడు. ఇక్కడ కూడా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు ఓపెనింగ్ చేసి, ధావన్ జట్టులో లేని పక్షంలోనే రైనాకు అవకాశం వచ్చే చాన్స్ ఉంటుందన్నాడు. అది జరగడం అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో లేదని హాగ్ అభిప్రాయపడ్డాడు. ఏ రకంగా చూసుకున్నా రైనా తిరిగి భారత జట్టులోకి వచ్చేందకు దారులు మూసుకుపోయాయని తన యూట్యూబ్ చానల్లో మాట్లాడిన హాగ్ స్పష్టం చేశాడు. ఇదిలా ఉంచితే, తన రీఎంట్రీపై రైనా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తన పునరాగమనం తప్పనిసరిగా ఉంటుందనే ఇటీవలే ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో సీఎస్కే తరఫున ఆడే రైనా.. ఆ లీగ్‌లో సత్తాచాటితే భారత జట్టులో చాన్స్‌ను పట్టేయవచ్చనే ఆశతో ఉన్నాడు. తాను టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలనే ఆశలు ఐపీఎల్‌పైనే ఆధారపడి ఉన్నాయన్న రైనా.. తనకు ఇంకా రెండు-మూడేళ్ల క్రికెట్ మిగిలే ఉందన్నాడు. రెండు టీ20 వరల్డ్‌కప్‌ల్లో తాను ఆడతానని చెప్పుకొచ్చిన రైనా.. తన టీ20 క్రికెట్ ఎంతో మెరుగ్గా ఉందన్నాడు. ఇప్పటివరకూ భారత్ తరఫున 226 వన్డేలు ఆడిన రైనా, 78 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2018 జూలై నుంచి రైనా తిరిగి అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్ ఆడలేదు.(బీసీసీఐ తీరు దారుణం: యువరాజ్) -
‘ఇప్పటి క్రికెటర్లకు అదే వరం’
మెల్బోర్న్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ప్రశంసలు వర్షం కురిపించాడు. ప్రస్తుతం కోహ్లి ఫిట్నెస్ లెవెల్స్ చూస్తుంటే సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన వంద సెంచరీల రికార్డును ఈజీగా సాధిస్తాడని కొనియాడాడు. కోహ్లికి ఉన్న ఫిట్నెస్ లెవల్స్‌తో ఎన్నో రికార్డును బ్రేక్ చేయడం ఖాయమన్నాడు. ఈతరం క్రికెటర్లకు ఎక్కువ క్రికెట్ ఆడే అవకాశం ఉంటుందన్నాడు. అలానే కోహ్లి కూడా సాధ్యమైనంత ఎక్కువ క్రికెట్‌నే ఆడతాడన్నాడు. ఈ క్రమంలోనే సెంచరీల రికార్డు మార్కును సులభంగానే అధిగమిస్తాడని హాగ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం క్రికెటర్లకు చాలా మంది ఫిజియోలు, డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. ఒక ఆటగాడికి ఏమైనా సమస్య వచ్చినా అది ఏమిటి అనేది వెంటనే పరిష్కరిస్తున్నారు. ఒకవేళ గాయపడితే స్వల్ప మ్యాచ్‌లే మిస్సవుతున్నారు. అందుచేత వారికి ఎక్కువ క్రికెట్ ఆడే అవకాశం దొరుకుతుంది. అది ఇప్పటి క్రికెటర్లకు వరం. (‘గంగూలీ అంటే అసహ్యం పుట్టేది’) కోహ్లి ఫిట్నెస్ పరంగా బాగున్నాడు కాబట్టి అతని ముందు చాలా క్రికెట్ ఉంది. దాంతో సచిన్ రికార్డు ఏమీ కష్టం కాదు. సచిన్ రికార్డును కోహ్లి తిరగరాస్తాడు’ అని హాగ్ తన యూట్యూబ్ చానల్ ద్వారా తెలిపాడు. ఈ మేరకు ఒక వీడియోను హాగ్ పోస్ట్ చేశాడు. ఇప్పటివరకూ కోహ్లి 70 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో 43 సెంచరీలు సాధించిన కోహ్లి.. టెస్టుల్లో 27 శతకాలు నమోదు చేశాడు. ఇక వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానంలో కొనసాగుతున్న కోహ్లి.. టెస్టుల్లో రెండో స్థానంలో ఉన్నాడు. 86 టెస్టుల్లో 7, 240 పరుగులు సాధించిన కోహ్లి.. 53.62 యావరేజ్‌ను కల్గి ఉన్నాడు. కోహ్లి టెస్టు అత్యధిక వ్యక్తిగత స్కోరు 254(నాటౌట్) కాగా వన్డేల్లో 248 మ్యాచ్‌లు ఆడి 11,867 పరుగులు నమోదు చేశాడు. వన్డేల్లో 59. 33 యావరేజ్ కల్గి ఉన్న కోహ్లి అత్యధిక వ్యక్తిగత స్కోరు 183. అంతర్జాతీయ టీ20ల్లో 82 మ్యాచ్‌లు ఆడి 2,794 పరుగులు చేశాడు. టీ20ల్లో 50కి పైగా యావరేజ్ కల్గిన కోహ్లి అత్యధిక స్కోరు 94(నాటౌట్).(నీ బుగ్గలు ఇష్టం.. వాటిని పట్టుకోనా?) -
‘రోహిత్ కాదు.. కోహ్లినే’
మెల్బోర్న్: ఇటీవల కాలంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఓపెనర్ రోహిత్ శర్మల బ్యాటింగ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లున్నారు మాజీ క్రికెటర్లు. కోహ్లి,రోహిత్‌ల బ్యాటింగ్‌ను పోలుస్తూ ఎవరు గొప్ప అనే చర్చ గత కొంతకాలంగా నడుస్తూ ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ కూడా చేరిపోయాడు. వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే దానిపై తనదైన కోణంలో విశ్లేషించాడు హాగ్. ప్రధానంగా భారీ టార్గెట్లను టీమిండియా చేజింగ్ చేసేటప్పుడు ఎవరు ఎక్కువ నిలకడగా ఆడతారు అనే దానిపై వివరణ ఇచ్చాడు. ఈ విషయంలో రోహిత్ కంటే కోహ్లినే ఎంతో నిలకడైన ఆటగాడని హాగ్ చెప్పుకొచ్చాడు. (‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ని మళ్లీ చూద్దామా!) క్వశ్చన్ అండ్ ఆన్సర్స్‌కు సమాధానమిచ్చిన హాగ్కు కోహ్లి-రోహిత్ల్లో ఎవరు ఉత్తమం అనే ప్రశ్న ఎదురైంది. ప్రత్యేకంగా వైట్‌బాల్ క్రికెట్(పరిమిత ఓవర్ల క్రికెట్)లో ఎవరు మంచి ఆటగాడని అనుకుంటున్నారు అని ఒక అభిమాని ప్రశ్నించాడు. దీనికి బదులిచ్చిన వీడియోను తన అధికారిక యూట్యూబ్ చానెల్లో హాగ్ పోస్ట్ చేశాడు. ఇక్కడ కోహ్లిని ఉత్తమం అని హాగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘ కోహ్లినే ఉత్తమం. కచ్చితంగా కోహ్లినే. ఎందుకంటే కోహ్లి నిలకడైన ఆటగాడు. ప్రధానంగా భారీ పరుగుల టార్గెట్‌ను చేజ్ చేసేటప్పుడు కోహ్లి చాలా నిలకడగా ఆడతాడు’ అని తెలిపాడు. కానీ ఈ ఇద్దర్నీ పోల్చడం అంత సరైనది కాదన్నాడు. వీరిద్దరూ తమ తమ పాత్రలకు న్యాయం చేస్తూ జట్టును ఉన్నత స్థానంలో నిలబెడతారన్నాడు. కొత్త బంతితో బౌలింగ్ చేసే బౌలర్లకు రోహిత్ ఒక ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ అని అన్నాడు. (బాల్కనీ నుంచి దూకేద్దామనుకున్నా: ఊతప్ప) -
నలుగురు టీమిండియా క్రికెటర్లు.. కానీ కోహ్లి లేడు
మెల్బోర్న్: అంతర్జాతీయ క్రికెట్లో గతం సచిన్ టెండూల్కర్‌ది అయితే, ప్రస్తుత శకం విరాట్ కోహ్లిది. ఇది కాదనలేని వాస్తవం. కోహ్లి ఇప్పటివరకూ సాధించిన గణాంకాలే అతను ఎంత విలువైన ఆటగాడో తెలియజేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో కూడా కోహ్లి లేని భారత జట్టును ఊహించడం చాలా కష్టం. ఏ దిగ్గజ క్రికెటర్లు తమ ఫేవరెట్ జట్లను ప్రకటించినా అందులో కోహ్లికి స్థానం ఖాయం. కానీ తన వరల్డ్ ఎలెవన్ జట్టులో కోహ్లి చాన్స్ లేదంటున్నాడు ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్. ఇక్కడ నలుగురు భారత క్రికెటర్లకు చోటిచ్చి అందులో కోహ్లిని ఎంపిక చేయలేదంటే ఇంకా చిత్రంగా ఉంది. తాజాగా హాగ్ ప్రకటించిన తన వరల్డ్ టెస్టు ఎలెవన్ జట్టులో కోహ్లికి చోటివ్వలేదు. రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌లను ఎంపిక చేసిన హాగ్.. అజింక్యా రహానే, మహ్మద్ షమీలకు అవకాశం కల్పించాడు. ఓపెనర్లగా మయాంక్ అగర్వాల్, రోహిత్‌లను తీసుకున్న హాగ్.. మిడిల్ ఆర్డర్లో రహానేకు చాన్స్ ఇచ్చాడు. ఇక బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి షమీకి చోటిచ్చాడు. ఆసీస్ నుంచి నలుగురి క్రికెటర్లను ఎంపిక చేసుకున్నాడు. అందులో లబూషేన్, స్టీవ్ స్మిత్, ప్యాట్ కమిన్స్, నాధన్ లయాన్‌లు తీసుకున్నాడు. పాకిస్తాన్ క్రికెట్ నుంచి బాబర్ అజామ్‌కు అవకాశం ఇవ్వగా, దక్షిణాఫ్రికా నుంచి డీకాక్‌ను ఎంపిక చేశాడు. న్యూజిలాండ్ నుంచి నీల్ వాగ్నర్‌ను తీసుకున్నాడు. (ఇది నిజమా.. ఇంతకంటే దారుణం ఉండదు) అందుకే నా జట్టులో కోహ్లి లేడు.. అసలు కోహ్లిని తన జట్టులోకి ఎందుకు తీసుకోలేదనే దానిపై హాగ్ వివరణ ఇచ్చాడు. ‘కోహ్లిని తన వరల్డ్ ఎలెవన్ టెస్టు జట్టులో తీసుకోలేకపోవడంపై ప్రతీ ఒక్కరూ ప్రశ్నించే అవకాశం ఉంది. కోహ్లి గత 15 టెస్టు ఇన్నింగ్స్ చూడండి. కేవలం నాలుగుసార్లు మాత్రమే 31 పరుగులు మించి చేశాడు. ప్రస్తుత కోహ్లి ఫామ్‌ను దృష్టిలో పెట్టుకునే నా జట్టులో చోటు కల్పించలేదు. మయాంక్ కవర్ డ్రైవ్స్ అంటే నాకు ఇష్టం. ఫ్రంట్ ఫుట్‌లో మయాంక్ ఆడే షాట్స్ కూడా బాగుంటాయి. చాలా నిలకడైన క్రికెటర్. రోహిత్ శర్మను ఎంపిక చేయడానికి చాలా ఆలోచించా. భారత్‌లో టెస్టు క్రికెట్లో రోహిత్ సుమారు 90పైగా సగటు కల్గి ఉన్నాడు. అందుచేత రోహిత్‌కు నా తుది జట్టులో చోటు దక్కింది. ఆఫ్ సైడ్, లెగ్ సైడ్లలో రోహిత్ కచ్చితమైన షాట్లు ఆడతాడు’అని హాగ్ తెలిపాడు. (మమ్మల్ని ఆడనివ్వండి.. నిజాయితీగా ఉండండి) -
‘భారత్‌తో డబ్యూటీసీ వద్దు.. యాషెస్ పెట్టండి’
సిడ్నీ: కరోనా వైరస్ సంక్షోభం ముగిసిన తర్వాత కొంతకాలం పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్యూటీసీ)ను నిలిపివేయాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ విన్నవించాడు. ఎటువంటి మజా లేని టెస్టు చాంపియన్‌షిప్‌ను కొన్ని రోజులు ఆపేస్తే మంచిదన్నాడు. ఆ స్థానంలో ఆసక్తికర సిరీస్‌లను రీషెడ్యూల్ చేయాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి విజ్ఞప్తి చేశాడు. ‘ ప్రేక్షకులు పోటీ క్రికెట్‌ను కోరుకుంటున్నారు. కరోనా సంక్షోభంతో ఇప్పటికే చాలా క్రికెట్ వృథా అయ్యింది. దాంతో టెస్టు చాంపియన్‌షిప్‌కు కూడా బ్రేక్ ఇవ్వండి. టెస్టు చాంపియన్‌షిప్ జరగాల్సిన మ్యాచ్‌ల స్థానంలో కాంపిటేటివ్ క్రికెట్‌ను నిర్వహించండి. ఈ సీజన్ చివరలో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ రావాల్సి ఉంది. ఇది టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమే. అయితే ఈ సిరీస్ వద్దు.. దాని స్థానంలో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ల యాషెస్‌కు సన్నాహాలు చేస్తే మంచిది. అదే సమయంలో భారత్-పాకిస్తాన్ల మధ్య టెస్టు సిరీస్‌ను కూడా ఏర్పాటు చేయండి. నాలుగు టెస్టుల సిరీస్‌ను ఏర్పాటు చేసి రెండు టెస్టులు భారత్‌లో ,మరో రెండు టెస్టులు పాకిస్తాన్లో జరిగేలా షెడ్యూల్‌ను రూపొందించండి. (‘ఆసీస్‌తో టీమిండియాను పోల్చలేం’) ఇంగ్లండ్-ఆసీస్‌ల యాషెస్ సిరీస్‌తో పాటు భారత్-పాకిస్తాన్ల సిరీస్‌లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. కోవిడ్-19 సంక్షోభం తర్వాత ప్రేక్షకుడి సరైన క్రికెట్‌ను అందించాలంటే ఇదొక్కటే మార్గం. అభిమానులకు మరింత వినోదం పంచాలంటే పోటీ క్రికెట్ చాలా అవసరం. ఇక్కడ టెస్టు చాంపియన్‌షిప్‌ను వాయిదా వేసి ప్రేక్షకుడి కోణంలో ఆలోచించండి’ అని హాగ్ పేర్కొన్నాడు. అంతకుముందు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా భారత్-పాకిస్తాన్ల ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించాలనే కోరిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా నిధుల సేకరణకు భారత్-పాక్‌ల సిరీస్ ఒక్కటే మార్గమన్నాడు. దీనిని భారత దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్ అప్పుడే ఖండించాడు. నిధుల సేకరణ కోసం భారత్-పాక్‌ల సిరీస్‌ల జరపాలన్న అక్తర్ ప్రతిపాదన ఎంతమాత్రం సరికాదన్నాడు. అసలు అవసరమే లేదని కపిల్ తేల్చిచెప్పాడు. కాగా, భారత్-పాకిస్తాన్ల మధ్య ఒక ద్వైపాక్షిక సిరీస్ జరిగి దాదాపు ఏడేళ్లు అవుతుంది. 2012-13 సీజన్లో ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లో చివరిసారి తలపడ్డాయి. ఆపై ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితులు కారణంగా క్రికెట్ సిరీస్‌లకు బ్రేక్ పడింది. (‘ధోనికి చాలా సిగ్గు.. ఆ తర్వాతే మారాడు’) -
టి20 ప్రపంచకప్‌ను రద్దు చేయకండి: హాగ్
మెల్బోర్న్: ఏదేమైనా సరే ఆస్ట్రేలియా ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో టి20 ప్రపంచకప్ నిర్వహించాల్సిందేనని ఆ దేశ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా లేదంటే రద్దు లాంటివి చేయవద్దని సూచించాడు. ‘ప్రపంచకప్‌పై చాలా చర్చ జరుగుతోంది. ఈవెంట్‌ను రద్దు చేయడమో లేదంటే రీషెడ్యూల్ చేస్తారంటున్నారు. ఇది సరికాదు. పకడ్బందీ చర్యలు తీసుకుంటే కప్ నిర్వహణ సాధ్యమే. పాల్గొనే అన్ని జట్లను ఓ నెలన్నర ముందుగానే చార్టెడ్ ఫ్లయిట్లలో ఇక్కడికి తీసుకురావాలి. క్వారంటైన్ సహా కరోనా పరీక్షలు చేసేందుకు వీలవుతుంది. అలాగే ఈ సమయంలో వారి సన్నాహాలు జరుగుతుంటాయి. షెడ్యూలు వరకల్లా మెగా ఈవెంట్‌ను అనుకున్నట్లే ప్రారంభించవచ్చు’ అని హాగ్ సూచించాడు. -
అశ్విన్ నుంచి లాగేసుకున్నాడు..!
మెల్బోర్న్: భారత క్రికెట్లో ఆఫ్ స్పిన్నర్‌గా తన మార్కును చూపెట్టిన రవిచంద్రన్ అశ్విన్ గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఒకవైపు జట్టులో చోటు సంపాదించడమే కష్టంగా మారిన తరుణంలో ఆడపా దడపా వచ్చిన అవకాశాల్ని కూడా అశ్విన్ పెద్దగా వినియోగించుకోలేకపోతున్నాడు. 71 టెస్టుల్లో 365 టెస్టు వికెట్లు సాధించిన అశ్విన్ పూర్వ వైభవం తగ్గిందనే చెప్పాలి. ఇది విషయాన్ని ఆసీస్ మాజీ చైనామన్ బౌలర్ బ్రాడ్ హాగ్ తాజాగా స్పష్టం చేశాడు. తన ప్రకారం చూస్తే గతేడాది వరకూ వరల్డ్ బెస్ట్ ఆఫ్ స్పిన్నర్‌గా ఉన్న అశ్విన్‌ను ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయాన్ అధిగమించాడన్నాడు. ట్వీటర్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్‌లో భాగంగా వరల్డ్ అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్ ఎవరని అడిగిన ప్రశ్నకు హాగ్ సమాధానమిచ్చాడు. ప్రధానంగా లయాన్-అశ్విన్‌లో ఎవరు ఉత్తమ అని ప్రశ్నకు తనదైన శైలిలో జవాబిచ్చాడు హాగ్. (నవ్వులు పూయిస్తున్న అశ్విన్ ‘కోచింగ్ అలెర్ట్’ వీడియో) ‘ ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ ఆఫ్ స్పిన్నర్ లయాన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. గడిచిన ఏడాది వరకూ బెస్ట్ ఆఫ్ స్పిన్నర్ రేసులో అశ్విన్ ముందు వరుసలో ఉండేవాడు.ఆ ప్లేస్‌ను అశ్విన్ నుంచి లయాన్ లాగేసుకున్నాడు. ఇద్దరు తమ తమ గేమ్‌లను మెరుగుపరుచుకుంటూ ముందుకుసాగుతున్నారు’ అని హాగ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకూ 96 టెస్టు మ్యాచ్‌లు ఆడిన లయాన్ 390 వికెట్లు సాధించాడు. -
‘ఆసక్తికర చర్చ మొదలెట్టి.. ముగించేశాడు’
అంతర్జాతీయ క్రికెట్లో వివాదాలు రేపాలన్నా, దేనిపైనైనా ఆసక్తికర చర్చ తెరపైకి తీసుకరావాలన్నా ఆస్ట్రేలియా క్రికెటర్లకే సాధ్యం. ఎందుకంటే వారు మాటలతో యుద్దం చేయగలరు.. అదేవిధంగా గారడీ చేయగలరు. తాజాగా కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెట్ టోర్నీలు రద్దు కావడంతో ఆటగాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఖాళీ సమయంలో ఏం చేయాలో పాలుపోని ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఓ ఆసక్తికర చర్చను సోషల్ మీడియాలో తీసుకొచ్చాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యాలలో బెస్ట్ ఆల్‌రౌండర్ ఎవరంటూ ప్రశ్నిస్తూ క్రికెట్ అభిమానులకు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు తమతమ అభిప్రాయాలను తెలిపారు. అనంతరం తన ఛాయిస్ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అంటూ చర్చను ముగించేశాడు. బెన్ స్టోక్స్‌ను ఎందుకు ఎంచుకున్నాననే విషయంపై కూడా స్పష్టత ఇచ్చాడు. స్టోక్స్‌తో సమానమైన సామర్థ్యం హార్దిక్ పాండ్యాకు ఉందని, కానీ అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం పాండ్యాకు ఎక్కువ లేకపోవడంతోనే తాను స్టోక్స్ వైపు మొగ్గు చూపానని తెలిపాడు. స్టోక్స్ ఇప్పటివరకు 63 టెస్టులు, 95 వన్డేలు, 26 టీ20ల్లో ఇంగ్లండ్ తరుపున ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ గెలుచుకోవడంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. కాగా, హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20లు భారత్ తరుపున ఆడాడు. వెన్ను గాయం కారణంగా గత కొంతకాలంగా పాండ్యా విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. చదవండి: హార్దిక్-అయ్యర్ల బ్రొమాన్స్ ‘24 ఏళ్ల తర్వాత ఆసీస్‌ను ఓడించారు’ -
మాహిష్మతి రాజ్యానికి ఊహించని అతిథి
సాక్షి : దర్శకధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్.. తెలుగు చలన చిత్ర స్థాయిని ఖండాంతరాలు దాటించింది. విదేశీ మీడియా కూడా మన చిత్రాన్ని ఓ అద్భుతమంటూ పొగడ్తలు గుప్పించింది. ఇక సినిమాకు కీలకమైన మాహిష్మతి రాజ్యం గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రావీణ్యం ప్రతీ ఫ్రేమ్‌లోనూ కనిపించింది కూడా. ఇక ఇప్పడు బాహుబలి ప్రస్తావన లేదు కదా.. అందుకే రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న ఆ లోకేషన్లను టూరిస్ట్ స్పాట్‌గా చేసేశారు. ఇక ప్రసుత్తం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. చివరి టీ20 మ్యాచ్ కోసం హైదరాబాద్‌లో బస చేశాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్గ్ కూడా టీంతోపాటే వచ్చాడు. తాజాగా ఆయన రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించాడు. అక్కడ బాహుబలి సినిమా సెట్టింగ్స్‌ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. భల్లాలదేవుడి భారీ విగ్రహాన్ని నిలిపిన వేదిక ముందు ఇదిగో ఇలా నిల్చుని ఫోటోలకు ఫోజిచ్చాడు. పక్కనే ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమా టైంలో షూటింగ్ నిమిత్తం వేసిన రైల్వే స్టేషన్ సెట్ లోకి వెళ్లి.. అక్కడ ఓ బోగీ వద్ద కొందరు డాన్సర్లతో కలిసి లుంగి డాన్స్ స్టెప్పులేసి సందడి చేశాడు కూడా. -
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: మాజీ క్రికెటర్
సిడ్నీ: గతంలో ఆస్ట్రేలియా క్రికెట్లో కీలకమైన ఆటగాడిగా గుర్తింపు పొందిన బ్రాడ్ హాగ్ ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడట. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నతరువాత ఆత్మహత్య చేసుకోవడానికి దాదాపు సిద్ధమైనట్లు హాగ్ పేర్కొన్నాడు. ఇందుకు కారణం తన వైవాహిక జీవితం చిందర వందర కావడమేనని బ్రాడ్ హాగ్ తన తాజా పుస్తకం 'ద రాంగ్ యూఎన్' లో ప్రస్తావించాడు. 'ఆత్మహత్య చేసుకోవడానికి ప్రణాళిలకు సిద్ధం చేసుకున్నా. దానిలో భాగంగా కారును ఫ్రెమెంటల్స్ పోర్ట్ బీచ్ వద్ద పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్లా. అలా సముద్రాన్ని, అందులోని నీటిని చూస్తూ కూర్చున్నా. అయితే నాకు ఈత రావడంతో నీటిలో పడి ఆత్మహత్య చేసుకోవడం సరైనది కాదనుకున్నా. అతి కష్టంమీద ఆ ఆలోచనను విరమించుకుని వచ్చేశా. మరోసారి చీకటి ప్రదేశంలోకి వెళ్లి ప్రశాంతంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. అయితే ఆ సమయంలో ఇంకా ఏదో సాధించాలనే తపన నాలో ఎక్కువైంది. ఆలోచించడం వేరు, చేయడం వేరు అనే విషయం అప్పుడే నాకు బోధ పడింది. ఇక ఆత్మహత్య అనే విషయాన్నిపక్కను పెట్టి నా అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యా' అని మాజీ స్పిన్నర్ హాగ్ తెలిపాడు. 2003, 07ల్లో ఆస్ట్రేలియా సాధించిన వన్డే వరల్డ్ కప్‌ల్లో హాగ్ కీలక పాత్ర పోషించాడు. అయితే 2007-08 సీజన్లో అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు తీసుకున్నతనకు వైవాహిక జీవితంలో కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురైనట్లు హాగ్ పేర్కొన్నాడు. దాంతోనే ఆత్మహత్య తలంపు వచ్చినట్లు హాగ్ స్పష్టం చేశాడు. మరొక ఆప్షన్ అనేది లేక ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు హాగ్ పుస్తకంలో వెల్లడించాడు. గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో కోల్ కతా నైట్ రైడర్స్ తరుపున ఆడిన హాగ్.. ఈ లీగ్ లో అత్యధిక వయసు కల్గిన వెటరన్ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం 45 ఒడిలో ఉన్న హాగ్.. బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్‌కు ఆడతున్నాడు. -
హాస్టింగ్స్ స్థానంలో టెయిట్
న్యూఢిల్లీ: చీలమండ గాయంతో బాధపడుతున్న పేసర్ జాన్ హాస్టింగ్స్ స్థానంలో ఆసీస్ బౌలర్ షాన్ టెయిట్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ తీసుకుంది. మిగతా ఐపీఎల్ సీజన్‌కు అతను అందుబాటులో ఉంటాడని ఫ్రాంచైజీ తెలిపింది. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో టెయిట్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. అయితే ఇప్పుడు కేకేఆర్ తరఫున అవకాశం రావడంతో సహచరులు క్రిస్ లిన్, బ్రాడ్ హాగ్‌తో కలిసి అతను బరిలోకి దిగనున్నాడు. ‘కేకేఆర్ కుటుంబంలోకి టెయిట్‌ను సాధారంగా ఆహ్వానిస్తున్నాం’ అని ఫ్రాంచైజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకీ మైసూర్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.